6, సెప్టెంబర్ 2017, బుధవారం

సమస్య - 2456 (దొంగలతో దొరలు గలిసి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా"
(లేదా...)
"దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు. 

58 కామెంట్‌లు:

  1. సార్! కంద పద్య సమస్యా పాదము ఈ రీతిగ నుండవలెనేమో గదా?

    "దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      నిద్రాదేవి పిలుస్తుండగా షెడ్యూల్ చేసే తొందరలో జరిగిన పొరపాటు అది. ధన్యవాదాలు. సవరించాను.

      తొలగించండి


    2. బిలువన్నిద్రా దేవి మ
      రలుకొన చట్టను సమయము రల్ పడె రలుకున్
      విలుకాడివలెన్ గమనిం
      చి లఘువు గన్మార్చిరి సురుచిరముగ శాస్త్రీ :)

      జిలేబి

      తొలగించండి
    3. సరసులు శంకర గురువులు
      మరువగ లేనిది జిలేబి మనభాగ్యమిదే
      పరవశ మాయెను మదియే
      కరవరు కొట్టరు కసరరు కందివరులిలన్!

      తొలగించండి
  2. G.P.శాస్త్రి గారూ ! నమస్తే ! నేను వెలిబుచ్చాలనుకున్న సందేహం మీరే ముందుగా వెలిబుచ్చారు.
    -- గుఱ్ఱం జనార్దన రావు.

    రిప్లయితొలగించండి
  3. పొంగులువారగన్ మమత, పొందిక నిండగ,దేశభక్తితో
    చెంగట నిల్చి, భారతికి శీర్షము వంచి నమస్కరించు వ
    జ్రాంగు లనేకులుండగ స్వరాజ్యసమంచితభావశూన్యులౌ
    దొంగలతో దొరల్ గలిసి దొపిడిసేయుట నీతి యిద్దరన్.

    రిప్లయితొలగించండి
  4. రంగులలో మందు వలెనె
    సంగరమున వేగు వలెనె శాంతియశాంతుల్
    బంగరులో రాగి వలెనె
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    మందు = spirit

    రిప్లయితొలగించండి
  5. రంగులు మార్చగ నేతలు
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా
    హంగులు జూపుచు జనులకు
    భంగము వాటిల్ల కుండ బహునేరుపుతో

    రిప్లయితొలగించండి
  6. దొంగలతో దొరల్ గలిసి దోచెదరు గదా
    అంగలార్చుచు సిరి సంపదలకు
    భంగము జేయుచు ధర్మము, విధుల
    రంగని తలుపక, అయ్యో! సారంగికులై


    సారంగికుడు : బోయవాడు
    (ఆటవికుడు, క్రూరుడు అన్న
    అర్ధం లో వాడబడింది)

    (గురువు గారు నమస్తే.సమస్యాపూరణంలోని
    వాక్యం చూసిన తర్వాత ఊరకుండలేక,
    అత్యుత్సాహంతో వ్రాసిన స్వేచ్చా రచనమిది..
    ఏ విధమైన వ్యాకరణా సంబంధమైన
    పరిమితులెరుగనిది.
    తప్పొప్పులు క్షమించగలరు. __/\__ ...)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. భంగము జేయుచు ధర్మము
      రంగడిని మరిచి విధులను రంకాడుచు సా
      రంగికులై సంపదలన్
      దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !

      జిలేబి

      తొలగించండి

    2. బండి రావు గారికి,

      వెల్కం బెక బెక ! మీరు కూడా ప్రొసీడ్ అయిపోవాలి !


      పదముల నటునిటు మార్చుచు
      కుదురుగ బేర్చుచు జిలేబి గూర్చన్ మీరున్
      సదనపు మెప్పుల బడయగ
      కదన తురంగమగు పద్య కవనము బండీ !

      జిలేబి

      తొలగించండి
  7. ఇంగితమంతవీడి గుణహీనులు నేతలు రాజకీయమున్
    సంగరరంగముల్ విడిచి సాహసకృత్యము లేవి చేయకన్
    చెంగున దుష్టులన్ఁ బిలిచి చేతులు కల్పిరి భారతావనిన్
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి

  8. ఇంగనమిదియె జిలేబీ !
    కొంగజపముజేయువారు, కోట్లకొలదిగ
    న్నంగందప్పి నడచుకొను
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. రంగి!జిలేబి! కాలమిది రంగుల దుస్తుల తో జనావళిన్
    బెంగల దీర్చెదమ్మనుచు పీఠములాశ్రమముల్ సమూహము
    ల్లాంగన రంజితమ్ముల విలాసములన్ మజ గాంచుచున్, భళా,
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. బంగారు గ్రుడ్ల బాతుగ
    హంగు లొసఁగు రాజకీయ మాశలు జూపన్
    చెంగున దూకి పదవిఁగొను
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా!

    రిప్లయితొలగించండి
  11. రంగుల కలగను నేతలు
    హంగులు సమకూర్ప నెంచి యధికార ము తో
    నింగికి నిచ్చెన వేయగ
    దొంగల తో దొరలు గలిసి దోచేద రు గదా

    రిప్లయితొలగించండి
  12. ఒంగోలు సమీపములో
    బంగారు గొలుసులు కొంత భద్రము సుమ్మీ!
    కంగారెందుకు రైలున
    దొంగలతో దొరలుగలసి దోచెదరు గదా!

    రైల్వే పోలీసులు, స్టూవర్ట్ పురం దొంగలు కలసి మెలసి పనిచేస్తారనేది విదితము!

    రిప్లయితొలగించండి
  13. రంగని పేరిట హంగుగ
    రంగులు మార్చుచు, ధరణిని లక్షల జనులన్
    వెంగలివిత్తుల జేయుచు
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా!!!

    రిప్లయితొలగించండి
  14. కంం.
    రంగులు మార్చుచు నేతలు
    మ్రింగెదరు ప్రజాధనమ్ము మేదిని యందున్
    భంగమొనర్చుచు ధర్మము
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    ఉ.మా.: బంగరు బాతుగ్రుడ్డదియె భాగ్యము నిచ్చెడు కల్పవృక్షమే
    ముంగిట యుండ కాదనెడు మూర్ఖు డెవండనుచున్ గదా భువిన్
    భంగమొనర్చి ధర్మమును వాసిగ దోచు ప్రజా ధనమ్మునే
    దొంగలతో దొరల్ గలిసి, దోపిడి సేయుటె నీతియిద్ధరిన్

    రిప్లయితొలగించండి
  15. అంగనల యొక్క మానము
    భంగ పరచి హత్యచేయు బాబా లకునా
    సంగము నొసంగి నిలలో
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    రిప్లయితొలగించండి
  16. డేరా బాబాలకు పంజాబులో రాజకీయ యండ ఇచ్చిన సందర్భములో

    రిప్లయితొలగించండి
  17. అంగబలముతో చెచ్చెర
    రంగములోనికి నడుగిడి రౌడీ మూకల్
    భంగమొనర్చగ శాంతిని
    దొంగలతో దొరల్ గలసి దోచెదరు గదా

    రిప్లయితొలగించండి
  18. రంగని యాభరణమ్ములు
    దొంగలతో గుడికి పెద్ద ,దోచెను గలిసీ
    రంగా ! చెప్పుమ యిప్పుడు
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    రిప్లయితొలగించండి
  19. దొంగలు దొరలున్ కలిలో.
    పొంగులువారంగ,పెక్కుభోగంబులకున్ వంగిన దాసులు కాగా
    దొంగలతో దొరలుఁగలసి దోచెదరుఁగదా!

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అంగుళమైనను కదలక
    నంగుగ కుదిరిన పదవుల నడ్డుబఱచుచున్
    యింగము నెడలుచు జనతను
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా!?

    రిప్లయితొలగించండి
  21. దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యి ధ్ధరన్
    రంగడు చెప్పగా దెలిసె రాహువు కేతువు లిద్దరు న్సదా
    దొంగతనంబున న్గలిసి దొడ్డతనంబున మంత్రిగారితోన్
    భంగముగాక నెప్పుడును భారిగ జేతురు నిర్భయంబుగన్

    రిప్లయితొలగించండి
  22. ముంగట నున్న నియమములు
    భంగము సేసి జననాధ వర గణము మదిన్
    సంగతి యొనర్చి యింపుగ
    దొంగలతో దొరలు గలిసి దోఁచెదరు గదా


    దుష్టచతుష్టయము దొంగై ధృతరాష్ట్రాది కౌరవ వృద్ధులు దొర లవగా పాండవుల రాజ్యసంపదను దోచుకున్న సందర్భము:


    అంగ జనాధి వల్లభ సహాంగజ సౌబల సంఘ భీమ దో
    ర్భంగ భయార్ది తాంగక చలత్ప్రథి తాత్మ నితాంత కైత వో
    త్తుంగ తరంగ సంగత విధూత వివేక ఘనాంతరంగు లీ
    దొంగలతో దొరల్ గలిసి దోఁపిడి సేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారు నమస్కారము మీకు మీరే సాటి చాల బాగుంది

      తొలగించండి
    2. దీపావళి రాకముందే పద్య గంబీర శబ్దములు నింగినంటు చున్నవి గురు తుల్యా నమో నమ:

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ పూరణ అత్యద్భుతం.

      ఒక చిన్న సందేహము. ర కి ల కి యతి చేయడాన్ని ఏ యతిగా పిలుస్తారు? ర కి ళ కి యతి చేసినా అదే నామమా? దయచేసి వివరించగలరు.

      తొలగించండి
    4. కృష్ణ ఫణి కుమార ద్వయములకు నమస్సులు. ధన్యవాదములు.

      అభేదయతి :- i) వ-బ; ii) ల-డ; iii) ల-ళ; iv) ళ-డ. పై నాలుగు వర్గాలలో ఆయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. v) ర-ల; vi) ఱ-ల; vii) ద-డ లకు కూడా యతి చెల్లుతుందని కూచిమంచి వెంకటరాయడు చెప్పినాడు.
      ఉదా-
      *వసుమతీకళత్ర *బకజైత్ర గానక
      *లాలసత్కలాప *డంభగోప
      *లలితదేహ పింగ*ళపుర దక్షిణగేహ... [అప్పక. ౩.౮౮]
      *డే కదలక జలధిఁ బవ్వ*ళించె ననఁగ. [అనం.ఛంద. ౧.౯౫]
      *లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రే [కాశీ. ౬.౨౧౦.]
      *దంతునే కాలదం*డమున నభవ. [కాశీ. ౭.౮౦]

      తొలగించండి
    5. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    6. నమస్కారము కామేశ్వర రావు మహాశయా క్రొత్త విషయము తెలుసుకున్నాము ధన్యవాదములు

      తొలగించండి

    7. పోచిరాజు వారికి

      ఈ అమరిక ప్రాసలకెందుకు చెల్లదండి ?

      జిలేబి

      తొలగించండి
  23. అంగబలమ్ముతోడ మరి యల్లరిమూకల తోడుపాటుతో
    జంగిలిమానసాధములు సాగుచు నిత్యము రాజకీయమున్
    భంగముఁ జేయుచున్ సతము పల్లెల శాంతిని, పంటనేలలన్
    దొంగలతో దొరల్ గలసి దోపిడిసేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి

  24. పిన్నక నాగేశ్వరరావు.

    బంగారము,భూమి,ధనము

    కంగారొందకయె గుట్టుగా కబళించన్

    భంగపరచుచు ప్రమాణము

    దొంగలతో దొరలు గలసి దోచెదరు గదా!

    రిప్లయితొలగించండి
  25. అంగన నీదు బాలు గను మల్లదె గుంపును గూడి యిండ్లలో
    మ్రింగెడి పాలువెన్నలను మెల్లగ చీకటి మాటునన్ మహా
    దొంగయి వెర్రినాగడని దోచెడి వానిని ముద్దు సేతు వౌ
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. వా వా మిస్సన్న గారు బాగుంది బహుకాల దర్శనము కులాసాగా ఉన్నారా

      తొలగించండి
    3. ధన్యవాదాలు సూర్య కుమార్ గారూ. పరమేశ్వరానుగ్రహం వలన బాగానే ఉన్నాను.

      తొలగించండి
  26. అంగనలను గూడి మనము
    నింగము తా దొంగిలించె నీశా రారా
    యంగారము జేయనఘము
    దొంగలతో దొరలు గలసి దోచెదరు గదా

    రిప్లయితొలగించండి
  27. సంగతులేన్నియోగలవు సంఘమునందున|కట్నకానుకల్
    రంగమునందు పాత్రలకు రంగుల హంగులుదిద్ది మోసపున్
    భంగము లెక్కజేయకను పాల్పడుదోషుల నేర్పులన్ సినీ
    రంగము జూచి నేర్చిరట రానియు విద్య వినాశనంబుకే
    దొంగలతో దొరల్ గలసి దోపిడి సేయుట నీతి యిద్దరన్
    2.దొంగలు గానక జేతురు
    ముంగిట వైద్యాలయాన మూర్ఖుల వలె యా
    రంగమ్మున దోపిడి గన?
    దొంగలతో దొరలుగలసి దోచెదరుగదా| {స్వార్థపరులు}
    3.అంగన మనసును దోచుచు
    కొంగును ముడివేయు నపుడు గోర్కెలునిడుచున్
    కొంగ జపమట్లు వరుడిల
    దొంగలతో దొరలుగలసి దోచెదరు గదా| {వరునితలిదండ్రి}
    4.నింగికి,నేలకు కల్తీ
    సింగారము నింపి మోస చేష్టలచేతన్
    యింగిత మెరుగని స్వార్థపు
    దొంగలతో దొరలు గలసి దోచెదరు గదా|
    5.ఇంగిత మెరిగియు సేద్యపు
    రంగమ్మున రైతు రాజు|రాణించకనే
    అంగడి విత్తులు,మందుల
    దొంగలతోదొరలు గలసిదోచెదరు గదా|




    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అంగుగ చేరినట్టిదగు నాళుతనమ్ముల నాస్వదించగ
    న్నింగము వీడుచున్ జనుల నిష్కపటమ్ము నుపాశ్రయించుచున్
    సంగడిలేని పద్థతిని సాగుచు మోసము తోడ వారి నా
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  29. రంగుల లోకమందు గరళంబును జిమ్ముచు దుష్ట కృత్య పా
    రంగులు రాజకీయమున లాఘవమున్ గలవారి జేరి వీ
    రంగము జేయుచున్ జనుల రక్తము బీల్చుట నిత్యమేగదా
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  30. రంగులు మార్చుచు నేతలు
    నింగికి యెగురంగ పదవి నిత్యము పొందన్
    చెంగులు వేయగ గనమే
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    నిన్నటి న్యస్తాక్షరి కి నా పూరణ

    గురువులు నిరక్ష రాశ్యతన్ కూల ద్రోసి
    రుగ్మతను బాపి యజ్ఞాన ఋజను గూల్చి
    పూర్ణిమను నిండు జాబిలి వోలె వెలుగ
    జడులు జ్ఞాలులై కొలువురె జతగ నిలిచి

    రిప్లయితొలగించండి
  31. కం. హంగులు ,ఆర్భాటము బహు
    భంగుల విన్యాసముల పటు దర్పమునన్
    వెంగలులను జేసి జనుల
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా !

    రిప్లయితొలగించండి
  32. అంగన పెళ్లితో వరుని నాశల దేల్చఁగ శోభనంబునన్
    పొంగులు వార యౌవనము ముచ్చట జేసెడు సౌష్టవంబుతోన్
    జెంగట జేరుచున్ సిరులుఁ జెంగున దోచఁగ లోన నుండెడున్
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్!

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమస్సులు
    సం గ త మ యి న ది ప్రజకున్
    గo గా న ది యo త యు న ట కలుషిత మయ్యెన్
    రo గులు మార్చ్ డు రాజులు
    దొంగలు , దొరలును గలసి దోచేదరు గ దా
    వందనములు

    రిప్లయితొలగించండి
  34. దుర్యోధనుడు కర్ణుని యంగరాజ్యాభిషేకానికి తన యొక్క నిర్ణయాన్ని తెలుపుతున్నపుడు పురప్రజల భావన......

    సంగరమందు నుద్భట విశారద శస్త్ర కళా ధురంధరో
    త్తుంగుడవైన నిన్నిదె హితుండుగ జేకొని యంగధాత్రి కి
    బ్భంగిని రాజు చేతునని పల్కఁగ భూజనులిట్లు దల్చిరీ
    "దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్"

    రంగుల వాగ్దానంబులు
    భంగములై కానబడును భరతావనిలోఁ
    సంగతి యేమని జెప్పుదు
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా

    రిప్లయితొలగించండి
  35. మా రె డు రాజులు గ చదువ ప్రార్థన
    దోచెదరు ఆ ని మార్పు
    న దు ల ను పరిశుభ్రత చేయుటలో ఆ వి నీ తీ గలదు.

    రిప్లయితొలగించండి
  36. మా రె డు రాజులు గ చదువ ప్రార్థన
    దోచెదరు ఆ ని మార్పు
    న దు ల ను పరిశుభ్రత చేయుటలో ఆ వి నీ తీ గలదు.

    రిప్లయితొలగించండి
  37. భంగము చేయుచు నీతిని
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు కదా
    లొంగుచు నాశకు కొందరు
    భంగిమలనుమార్చు చుండ వసుధలొ గనుమా.

    బంగరు పండెడి భూములు
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు కదా
    సంగతి తెలియని రైతులు
    క్రుంగుచు పోగొట్టు కొంద్రు కువలయ మందున్


    ఇంగిత మన్నది లేకయె
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు కదా
    వెంగలులను చేసి జనుల
    మ్రింగుచు పరధనములెల్ల మేదిని యందున్

    రిప్లయితొలగించండి
  38. అంగలు వేయుచు, గంధపు
    దుంగల నరకుచు, గజముల దునిమెడి దైత్యున్ ,
    టింగరి వీరప్పను బోల్
    దొంగలతో దొరలు గలిసి దోచెదరు గదా.

    రిప్లయితొలగించండి
  39. బంగరు భూమియౌ వెలయు భారత దేశపు రాజనీతిలో
    రంగుల మార్చుచున్ వడిగ రాజులు కూజలు మైత్రిజేయగా
    కొంగలు కాకులున్ కలిసి కోరిక తీరగ విందుజేయగా
    దొంగలతో దొరల్ గలిసి దోపిడి సేయుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి