24, సెప్టెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2473 (తమ్మునిఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్"
(లేదా...)
“తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై”
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

93 కామెంట్‌లు:

 1. వమ్మీ వయసులు కులములు!
  గమ్మున గాలమును వేసి గనులును
  ఘనమౌ
  సొమ్మున్న యాప్త మిత్రుని
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 2. నమ్మకు మగువల నేడిల
  కమ్మని ప్రేమలు మమతలు కల్లలు సుమ్మీ
  నెమ్మిని సొమ్ముల బావకు
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదము నన్

  రిప్లయితొలగించండి
 3. తమ్ముని యందు పాటవము తా పసిగట్టి క్రికెట్టు నంతటన్
  ఇమ్ముగ జేర్చగా నతడు హీరకమవ్వగ భారతావనిన్
  సమ్మతి నొంద కోరికను చాటగ పెద్దలు నొప్పగా నజిత్
  తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి
 4. సమ్మతమయ్యెను నాకున్
  సొమ్ములు నేనొల్ల మామ!చూడుము నిన్నే
  నమ్మితినని తన తల్లికి
  తమ్మునిఁబెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 5. CpBrown ప్రచురణ సాహితీస్రవంతి వారిచ్చిన సమస్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. BVVHBPrasadarao గారికి నమస్సులు. నే పంపిన సమస్య నాదిగా నే పంపలేదని మనవి. నేపంపినది ఇలా
   “జగన్నాధరావు అన్నాపంతుల వారి పంచమ స్వరం సౌజన్యంతో”
   వారు పూరించిన సమస్య” అని. అయితే అవి సాహితీ స్రవంతి లో ప్రచురింపబడ్డాయని మాత్రమే పేర్కొనిరి. ఎవరు ఇచ్చినది పేర్కొనలేదు. అదే నేను గురువుగారికి పంపితిని. వివరణ కొఱకు మాత్ర్రమే తెలియజేయుచున్నాను.
   జగన్నాధరావు అన్నాపంతుల వారి పూరణలు వారు పేర్కొన్నట్టు

   “ఉత్పలమాలలో ఉన్నపై సమస్యకు రామాయణపరముగా నా పూరణ:

   దమ్మున పోరుచున్న ఘన దర్ప సహోదరులందు అగ్రజున్
   రొమ్మున బాణ మేసి రఘురాముడు చాటుగ వాలి గూల్చినన్
   రమ్ము మదీయ బాహు పరిరంభము చేకొనుమంచు భర్తకున్
   తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై

   ఇదే సమస్యకు సామాన్య అర్ధములో నా పూరణ:

   అమ్మయు నాన్న లేని తన యాఖరి తమ్ముని యందు కూర్మిచే
   ఇమ్ముగ పిల్ల నిచ్చి తన యింటికి అల్లుని చేయు కోర్కెతో
   అమ్మతనంబునన్ పలుక యాతని రూపుకు మెచ్చి మాతకున్
   తమ్ముని పెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై.”

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
   మరో మూడు రోజులు మీరు పంపిన సమస్యలనే షెడ్యూల్ చేశానండీ. ధన్యవాదాలు.

   తొలగించండి
 6. అమ్మకు దమ్ముఁడు వరుసకు,
  అమ్మాయికి మేనమామ యయ్యకు మరిదిన్,
  సమ్మతి దెలుపుచు,యమ్మకు
  దమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...యయ్య మరదియున్... దెలుపుచు నమ్మకు..." అనండి.

   తొలగించండి
  2. అమ్మకు దమ్ముఁడు వరుసకు,
   అమ్మాయికి మేనమామ, యయ్య మరిదియున్
   సమ్మతి దెలుపుచునమ్మకు
   దమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్
   కొరుప్రోలు రాధాకృష్ణారావు

   తొలగించండి

 7. A golden friend :)

  అమ్మణ్ణీయని బిల్చుచు
  కమ్మని మాటల సయాటగన్ మనసున్ తా
  కమ్మిన మిత్రుని, కలధౌ
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   "కలధౌతమ్మని" అని కదా ఉండాలి. 'కలధౌతమ్ముని' అంటే అర్థం లేదు.
   అన్నట్టు మా ఆవిడ అసలు పేరు 'అమ్మణి'యే. పెళ్ళి సమయంలో జాతకాలు కలవాలని 'శాంతి' అని పెట్టడం జరిగింది. వాళ్ళ తరపు బంధువులంతా 'అమ్మణీ' అనే పిలుస్తారు.

   తొలగించండి


 8. తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి, ముదంబున తానె పెద్దయై
  యమ్మణి సోదరుండనుచు యాతము దెల్పి, జిలేబి, గానవే,
  కమ్మని పల్కులెల్లెడను కాదను లేదను మాట బల్కడౌ
  నెమ్మిని బంచునౌనితడు, నేర్పరి యౌ యని చెప్ప గన్ భళీ!

  జిలేబు

  రిప్లయితొలగించండి
 9. ఇమ్ముగ సఖుతో సల్లా
  పమ్ముల నాడుచు నడుగిడు పార్థుని గని మో
  దమ్మున ద్వారక ధర్మజు
  తమ్ముని పెండ్లాడె నొక్కతన్వి ముదమునన్


  ధర్మజు
  దమ్ముని బెండ్లాదె నొక్క తన్వి ముదమునన్.

  రిప్లయితొలగించండి
 10. కమ్మగ వేణువు నూదగ
  తమ్ముల దామే మరిచిరి తరుణులు నపుడున్
  రమ్మని యాబలరాముని
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 11. క్రమ్మిన మైక మందునను గానక ప్రేమను ధిక్క రించుచున్
  నమ్మిన బావనే మరచి నేరుగ సొమ్ములు సోయగమ్ముల
  న్నిమ్ముగ మోజు నందునను నిండుగ మేనుక లంకరించ గా
  తమ్ముని బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగుంది. కాని సమస్య పరిషారం అయినట్టు తోచడం లేదు.
   మీ భావాన్ని వివరించండి.

   తొలగించండి
  2. కిట్టించాను గానీ నకుమాత్రం భావం స్పష్ట మైతె కదా ? వివరించడానికి ? dhanya vaadamulu

   తొలగించండి
 12. కొమ్మ యొకతెను వలచి చే
  కొమ్మని యడిగె నొక వరుడు కోరిక మీరన్
  సమ్మతి తెలిపి తన జనని
  తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.

  రిప్లయితొలగించండి
 13. "కొమ్మ నొకతెను వలచి"అని యుండాలను కుంటాను.

  రిప్లయితొలగించండి


 14. అమ్మణ్ణీయని బిల్చుచు
  కమ్మని మాటల సయాటగన్ మనసున్ తా
  కమ్మిన మిత్రుని,నంబకు
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఒమ్మికతో శోభించుచు
  సమ్మర్షపు గరిమ గల్గు సరవి నడరుచున్
  త్రిమ్మరు తనయక్క పతికి
  తమ్ముని పెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 16. కమ్మని ప్రేమనే మధుర గానము జేసెడు మానవాంశలో
  ఇమ్ముగ నీదు మానసము నిష్టము జూపిన చాలు నాకదే
  సొమ్ములు సోకులన్ మదిన చోటుయె లేదని పల్కు నమ్మకున్
  తమ్ముని బెండ్లి యాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చోటు+ఎ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
 17. సమ్మోహనుడగు వలచిన
  సమ్మతునే వీడి తుఛ్ఛ సంపద కొఱకై
  క్రమ్మర హరి హరి ! యాతని
  తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్ .

  రిప్లయితొలగించండి

 18. నమ్మిన పెనిమిటి మడియగ
  వమ్మవకుండగ వయసును భద్రపురీతిన్
  సమ్మతి నెల్లరగొని పతి
  తమ్ముని బెండ్లాడె నొక్కతన్వి ముదమునన్!

  ఉత్తర భారతదేశములో దేవర న్యాయము పేరిట యిది ధర్మము

  రిప్లయితొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఒమ్మికతో నిగారముగ నొప్పుచు తేకువగల్గి నిచ్చలున్
  నెమ్మిని జూపుచున్ సతము నెత్తగు నూర్జిత భావజాలమున్
  త్రిమ్మరు ప్రాప్తరూపునిగ త్రెక్కొను సోదరి ప్రాణనాధుకున్
  తమ్ముని బెండ్లియాడె నొక తన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి

 20. మైలవరపు వారి పూరణలు:


  నమ్మితి నా మనమున గౌ..
  రమ్మా ! యని రుక్మిణమ్మ యాదవ కుల ర...
  త్నమ్మును కృష్ణుని ముసలికి
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  ******

  నెమ్మది కృష్ణునిన్ వలచి , నేర్పుగ విప్రుని బంపి , ప్రేమవృ ....
  త్తమ్మును వానికిన్ దెలిపి , ధైర్యముగా నెదిరించి రుక్మినిన్
  నమ్మి నగాత్మజాతను మనమ్మున , దా హలహస్తధారికిన్
  తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రుక్మిణీ కళ్యాణ ప్రస్తావనతో మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. వారికి అభినందనలు.
   ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు.

   తొలగించండి
 21. కొమ్మ నొకత్తెనే మదిని కోరి వరింపగ నన్నదమ్ములున్
  సొమ్ములు తక్కువున్నవని శోభిలు యన్నను లెక్క జేయకే
  అమ్మక చెల్ల !యేమి కొని యాడుదు!భామిని లౌక్య సంపదన్?
  “తమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై”

  రిప్లయితొలగించండి
 22. యతి వేషధారి అర్జున సుభద్రల పెళ్లి సందర్భం

  కొమ్మన మనసిడి కల్యా
  ణమ్మును కావింప గోరె నరుడే, యన్న
  న్నమ్మిన సుభద్ర వలచే
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్
  (వలచేత + అమ్ముని = తమ్ముని; ఆ+ముని=అమ్ముని)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. 'కొమ్మకు మనసిడి...' అనండి. 'వలచేత నమ్ముని..' అనడం సాధువు.


   తొలగించండి
 23. పిన్నక నాగేశ్వరరావు.

  సొమ్ములు లేకున్నను హృద

  యమ్మది మంచిదని తలచి యనురాగ
  మునన్
  నమ్మికతో తన బావకు

  తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి
  ముదమునన్.

  రిప్లయితొలగించండి
 24. ప్రమ్మఁగ మదిఁ బ్రేమాతిశ
  యమ్ములు మాతాపిత లిడ నామోదమ్మే
  సమ్మత ధన్వి మహా రౌ
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  [రౌతు + అమ్ముని = రౌతమ్ముని]


  ఇమ్మహి ధీర కాంతలకు నెవ్విధి విఘ్నము లంతరాయముల్
  తమ్ముడు నన్న యక్కయును దల్లియు దండ్రియు నెల్ల బాంధవుల్
  సమ్మత మీయ కున్నను విచారము నొందక మేనమామకుం
  దమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి
 25. నెల్లూరు వచ్చియుంటిమి
  యల్లదెమాబావమరది యనుకోకుండా
  యిల్లును బంధుగణంబుల
  నెల్లరదావిడిచినిచటె నేగెనుదివికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావుగారూ నమస్సులు! విచారకరమైన వార్త! మాదీ నెల్లూరే! ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు! మీకు , మీకుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి!🙏🙏🙏🙏

   తొలగించండి
  2. సుబ్బారావు గారూ,
   మీ బావమరది ఆత్మకు శాంతి చేకూరు గాక!

   తొలగించండి
  3. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ

   తొలగించండి
 26. ఉమ్మిరి గోరిక కలుగగ,
  నెమ్మిక పొoగగ మనమున, నెలతుక రయమున్
  తమ్మినయన సుతుని, నలువ
  దమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రతీ దేవి మన్మధుని పెండ్లి యాడెను అను భావన

  రిప్లయితొలగించండి
 27. అమ్మకుయన్నకొడుకతడు
  సమ్మతిగా ప్రేమబంచి సహజీవనమున్
  నమ్మిన వదినకు వరుసన
  తమ్ముని బెండ్లాడె|నొక్కతన్వి ముదమునన్.
  2.సొమ్ములు బెట్టకున్న?తనసోయగ మంతయుమెచ్చువాడుగా
  నమ్మిన విద్య నేర్చి నవనాగరికంబున మంచివాడుగా
  అమ్మనునాత్మ బంధువుగ యాదరణంబుగజూచు|యమ్మకున్
  తమ్ముని బెండ్లియాడె నొకతన్వి ముదంబునతానె పెద్దయై|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'అమ్మకు నన్నకొడు కతడు... బంధువుగ నాదరణంబుగ జూచు నమ్మకున్.." అనండి.

   తొలగించండి
 28. గ్రమ్మన తీర్థయాత్రలకు కవ్వడి బోవగ వాఁని జూచి మో
  హమ్మున వెంటదెచ్చి విరహాతుర యంతట నాగలోకకూ
  టమ్మున నిల్పి దండ్రిని హఠంబున గెల్చి యులూచి ధర్మజుం
  దమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధర్మజుని యొక్క తమ్ముని యనెడి యర్థమున “ధర్మజు తమ్ముని” యనడము సాధువని నా భావన ఫణి కుమార్ గారు. ఒక సారి పరిశీలించండి.
   “ధర్మజు” డుమంతము. షష్ఠీవిభక్తి “యొక్క” వచ్చిన నిగామము విభాష నగును కనుక రానిచో ధర్మజు యొక్క, తమ్ముని తో సమాసము చేసిన విభక్తి లోపించి “ధర్మజు తమ్ముని” యగునని నా యభిప్రాయము.

   తొలగించండి
 29. ఇమ్ముకొన చంద్రహాసుడు
  కమ్మను గొని దిద్ది 'విషయ'గ 'విషము' నట నం
  దమ్మున పూవిలుకానికిఁ
  దమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్!

  రిప్లయితొలగించండి
 30. కమ్మని గాత్రము ఘనకై
  దమ్మిన చాప మసమాన దైత్యాంతకుడున్
  నిమ్మహి దైవము రాముని
  తమ్ముని బెండ్లాడె నొక్కతన్వి ముదమునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కైదమ్మిని ... దైత్యాంతకుడు। న్నిమ్మహి..." అనండి.

   తొలగించండి
 31. గురువు గారికి నమస్సులు. నాకుఅనారోగ్యం వలన పూరణ లో లోపాలు అధికంగా గల వు. తీ వ్ర మై న పని వత్తిడి వుoడటం వలన ఆరోగ్య సమస్యలు క లిగినవి.
  క్రమ్మిన నపోహ తొలగన్
  సమ్మిళత ము గా మ న o బు సాహితి వశమై
  నమ్మిన వాణీ వల్లభు
  త మ్ముని పెండ్లి యాడె నొక్క త న్సి ము ద ము న్.
  వందనములు.

  రిప్లయితొలగించండి
 32. ఇమ్మగు చంద్రహాసుఁ గని యింద్రులు చంద్రులు జాలరంచు చి
  త్తమ్మున మెచ్చి కూరు కడ తండ్రి లిఖించిన నుత్తరమ్మునన్
  గమ్మున దిద్ది తా 'విషయ' గన్ 'విషము'న్, విరికొంత వేల్పుకున్
  దమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై!

  రిప్లయితొలగించండి
 33. అమ్మయెజెప్పెను సరియని
  అమ్మాయీ నీకుజోడననెతండ్రియు, తా
  సమ్మతితో తల్లికి పిన
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.

  రిప్లయితొలగించండి
 34. అమ్మో యేమీవింతలు
  తమ్మునిపెండ్లాడెనొక్కతన్వి ముదమునన్
  తమ్మునితోపరిణయమ!జ
  గమ్ముననింకలేరె?తనకుకాపురమునకున్

  రిప్లయితొలగించండి
 35. ఇమ్మగుమాటలతో సర
  సమ్ములనాడుచు వసించు చక్కనివానిన్
  కమ్మని మనసు గల వదిన
  తమ్ముని పెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 36. నమ్మితి నిన్నె యటంచు
  న్నెమ్మది పార్వతిని గొల్చి నిత్యుని కొఱకై
  పిమ్మట నా బలరాముని
  తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  ఊగుచు వనమున సంధ్యను
  వాగులు వంకలను దిరిగి పాడుచు పాటన్
  సాగుచు పూదోటను పు
  న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

  రిప్లయితొలగించండి
 37. మొదటిది క్షీరసాగరమంథానమందు, రెండవది సుకన్యకథయందు పెట్టి పూరించాను.

  దమ్మున దేవుల్ పాల సము
  ద్రమ్మును చిలకంగ పుట్టె దండను స్వకరా
  గ్రమ్మున పట్టి సురేంద్రుని
  తమ్ముని పెండ్లాడెనొక్కతన్వి ముదమునన్

  ఇమ్ముగ పుట్టఁ వెలుగు నయ
  నమ్ములఁ గ్రుచ్చిన కలంగి నళినేక్షణ చి
  తమ్మున, పిత్రునాజ్ఞన్ చెం
  తమ్మునిఁ పెండ్లాడెనొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 38. అమ్మరొ యెంతమాటిదియయందరుమెత్తుర ?నీదుపల్కులన్
  తమ్మునిబెండ్లియాడెనొకతన్విముదంబునతానపెద్దయై
  గమ్ముగనుండుమాసరళ! కాముకుడైనను నట్లుమారునే?
  నిమ్మహినెచ్చటైననిలనీరకపుంజనులుందురేమొలే

  రిప్లయితొలగించండి
 39. కమ్మని మాటల వరునకు
  నెమ్మిని తన సొబగులన్ని నేర్పున బలుకన్
  రమ్మని సైగల బిలుచుచు
  తమ్మునిఁ, బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టా
  ఇమ్ముగ భార్యచే నొదవు నింపగు చారితటన్న సూక్తి లో
  కమ్మున షేక్స్పియర్ గనడె ఖ్యాతి బ్రపంచము మెచ్చ నాతి యే
  కమ్ముగ జ్యేష్ట యాతనికి గాదె; వరున్నటులుంచి,వానికౌ
  తమ్ముని బెండ్లియాడెనొక తన్వి ముదంబుగ తానె పెద్దయై!

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా
  రమ్మన బోవుట తంటా
  బొమ్మను యగ్రజునకెంచ :బొద్దుగ నుండన్
  దిమ్మ దిరుంగగ వరుకౌ
  తమ్ముని బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 42. ఇమ్ముగ ననిమిక్షపు యం
  త్రమ్మును భేదించ క్రీడి, ద్రౌపది పేర్మిన్
  సమ్మతి తెలుపుచు ధర్మజు
  తమ్మునిఁ, బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్

  రిప్లయితొలగించండి
 43. డా.పిట్టా
  లోగడ జన్మపు తప్పౌ
  నాగుని పగ మాన్పు"శాంతి" నలరింపన్ ప
  న్నాగముతో సినిమా హరు
  నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్

  రిప్లయితొలగించండి
 44. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.

  కమ్మని రూపము మెచ్చుచు
  నిమ్ముగ మదిలోన వలచె నింపగు రీతిన్
  నెమ్మిని జూపుచు ధర్మజు
  తమ్ముని పెండ్లాడె నొక్క తన్వి ముదమునన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ, మీరు మీ మొబైల్ నెంబరును బహిరంగంగా ప్రకటించుకోవా లనుకుంటే అందులో తప్పుపట్టవలసినది ఏమీ లేదు. అది మీ యిష్టం. కాని సమకాలీనప్రపంచంలో కాదేదీ దుర్వినియోగాని కనర్హం అన్నట్లుందని మీరు మరచిపోకండి. అంతర్జాలంలో మొబైల్ వివరాలు బట్టబయలు చేయటంలో ఉన్న రిస్క్ ఫాక్టర్ అందరూ గమనించాలన్న ఉద్దేశంతో మీకు ఒకసారి ఈ విషయం గుర్తుచేసానంతే.

   తొలగించండి
 45. ధన్యవాదాలండీ శ్యామలరారు గారూ.నాకు తెలియదండి.కొన్ని గ్రూపుల్లో నంబరు,పేరు అందరూ వ్రాస్తుంటే వ్రాయాలేమో అనుకొని వ్రాస్తున్నానంతే నండి.ఇకపై ఎక్కడా వేయనండి.మరోసారి ధన్యవాదాలండీ.

  రిప్లయితొలగించండి