ముగ్గురు అమ్మల ప్రార్థన
రచన - పూసపాటి కృష్ణ
సూర్య కుమార్
గౌరి, మారి,
గిరిజ, బాల,
కాల లలన,
మాత, అంతకాంతక సతి, శాంతి, జ్యోతి,
దాత, జయ, జలజ సదన, ధన కనక స
మస్త మహిమ దాత, రతి, రమ, రసన, సని
సత్య, సత్తి, లంభ, ప్రభ, శాంభవి, ఉమ
భీమ, రామ, నగజ, భంజ, బీజ, సత్రి,
చండి, చండ, చండిక, చర్చ, చల, చపల, స
తతము కాచంగ వలయును తల్లులార!
ముగురమ్మలన్ కొలచితివి
రిప్లయితొలగించండిసుగీత సుస్వర తేజము సుస్థిర మ దిలో
జ గతీ నిర్జరు దాశయ
ముగా కవనభా రతి ని శ్రీ మురిపెం చదవెన్.
పంచ రత్నం మిత్రమా ధన్యవాదములు. అరవ గణము (రెండవ పాదములో మూడవ గణము నాల్గవ పాదములో మూడవ గణము) నలము గాని జ గణము గాని ఉండాలి సరి చేయండి
తొలగించండివందనములు. దోషములు తొలగి o పుడు.మీకు సదా వినమ్రతతో నీ పద్యము ను సమర్పిస్తూ న్నాను.
రిప్లయితొలగించండిదినముదినమునునొకక్రొత్తదియగువిధపు
రిప్లయితొలగించండిచిత్రబంధాలరచనలుజేయుచుండు
కవివరేణ్యునకిచ్చుత!కామితార్ధ
ములనుశంకరుడెల్లవేళలపుడమిని
ధన్యవాదములు సుబ్బా రాబు గారు
తొలగించండిసవరించిన పూరణ ఈ క్రింద తెలుపబడిన ది.
రిప్లయితొలగించండిముగురమ్మలన్ కొలచితిరి
సుగీత సుస్వర సురుచిర సుస్థిర మదిలో
జగతీ నిర్జరు దాశయ
ముగా క వనభా రతిహితమును తె ల్ప ధరన్
అనారోగ్యం కారణంగా పూరణ లో లోపాలు ఉన్నాయి.
మన్నింప ప్రార్థన.
కృష్ణ సూర్య కుమార్ గారూ మీ బంధ తేటగీతి యద్భుతము! రతి, రసన పదముల ప్రయోగ మర్థము కాలేదు.
రిప్లయితొలగించండినమస్కారము కామేస్వర రావు గారు రతి దేవి అమ్మ వారి రూపమేనని నా గురువు గారు చెప్పారు అందువల్ల ఆ పదము వాడవలసి వచ్చినది. రసన పొరబాటు రమణి అని చదువ వలసినది గా పార్ధన ర మీద రతి బదులు ఇంకేమన్నా పదము ఉంటే సూచించగలరు ధన్యవాదములతో సదా మీ యొక్క అమూల్యమైన ఆశీస్సులు అభిప్రాయములు కోరుతూ పూసపాటి
తొలగించండిఅద్భుతమైన తేటగీతి పద్యము,శ్రీ సూర్య కుమార్ గారూ అభినందనలు
రిప్లయితొలగించండిధన్యవాదములు మిత్రమా
తొలగించండిఅద్భుతం సూర్యకుమార్ గారూ. అభినందన చందనం.
రిప్లయితొలగించండిధన్యవాదములు స్వామి
తొలగించండి