29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2478 (అన్నదమ్ములు రాముఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అన్న దమ్ములు రాముఁడు నంగదుండు"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

59 కామెంట్‌లు:

 1. కుశుదు లవుడును నెవ్వరో కొడుక!చెపుమ!
  వారలకు తండ్రి యెవ్వరో పలుకగలవె?
  రావణు మకుటమ్ము నెవ్వడు రమణ దెచ్చె?
  అన్నదమ్ములు;రాముడు;నంగదుండు.

  రిప్లయితొలగించండి
 2. చూపరుల నలరించిరి రూపకమున
  ఒకరి నటనను బాగుగ నొకరు మించి
  నలుగురు కొనియాడ దగిన నాటకమున
  నన్న దమ్ములు రాముడు నంగదుండు.
  ****)()(****
  ( నాటకమున రామ, అంగద పాత్రధారులు అన్నదమ్ములు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   నాటక పాత్రధారులైన అన్నదమ్ముల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. వాలి సుగ్రీవు లెవ్వరు? వరుస దెలియ
  వాలి నెవ్వాడు వధియించె? పాడి యగుచు
  వాలి సుతుడన నెవ్వడు? వరుస నివియె
  అన్న దమ్ములు, రాముఁడు, నంగదుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. రామ లక్ష్మణు లిర్వురు రవ్వలేని
  యన్నదమ్ములు, రాముడు నంగదుండు
  తండ్రి కొడుకుల నదగును తత్వమరయ
  వావివరుసలు మార్చుట వాంఛితంబె?

  అంగదుడు= లక్ష్మణుని పెద్దకొడుకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   ఊర్మిళా లక్ష్మణుల కుమారుడు అంగదుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 5. వింటి నమ్మక థయొకటి వినగ వినగ
  వచ్చె నవ్వుల పువ్వులు! వనిత సీత
  రామునికి చెల్లెలు! జిలేబి, రవణమనగ
  నన్న దమ్ములు రాముఁడు నంగదుండు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   'రామునికి సీత ఏమవుతుంది?' అన్న పుస్తకమే వచ్చింది. ఇలాంటి కథలకు కొదువ లేదు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. డా.పిట్టా
  ఉన్న దొక పంచ, కొమరులున్నతులు గాగ
  జన్మయే మారిపోవు సజావుగాను
  ఒకడు దేవుడు మరియొక డుర్వి దైత్యు
  డన్న దమ్ములు :రాముడు నంగదుండు
  (పంచ ..ఇల్లు.under one roof.ఉన్నదొక పంచ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అంగదుడు వానరుడు కదా! మీరు దైత్యు డన్నారు?

   తొలగించండి
  2. డా.పిట్టా
   ....మరియొక డుర్వి గోతి...గా సరిజేసికొన్నాను.కతజ్ఞతల

   తొలగించండి
 7. రవిసుతుం, డాంజనేయుఁడు, ద్వివిద మైందు
  లన్నదమ్ములు, రాముఁడు, నంగదుండు,
  జాంబవంతుఁడు జూడఁగ సంభ్రమమున
  నింద్రజిత్తును లక్ష్మణుం డెదిరి పోరె.

  రిప్లయితొలగించండి
 8. గోపతిఁ గొలుచు రావణ కుంభ కర్ణు
  లెవరు? తాటకను తునిమెనెవరు? రాము
  నాజ్ఞతో లంకకు పయనమైనదెవరు?
  లన్నదమ్ములు, రాముడు, నంగదుండు

  రిప్లయితొలగించండి
 9. వరుస దప్పక తల్లికి తరగతి గల
  స్నేహితుల పేర్లు బాలుండు చెప్పుచుండె
  వినుము వీరంత నామిత్రు లనిల భాను
  అన్న దమ్ములు, రాముఁడు నంగదుండు.

  రిప్లయితొలగించండి
 10. రావణుడు, కుంభకర్ణులు,రాక్షసులగు
  నన్నఁదమ్ములు;రాముఁడు,నంగదుండు
  యుద్ధమాపగ శాంతి సన్నద్ధులగుచు
  ప్రవిమలంబుగ రాయబారమునుఁజేసె

  రిప్లయితొలగించండి
 11. వానరులగు సుగ్రీవుడు వాలి దోయి
  యన్న దమ్ములు, రాముడు, నంగదుండు,
  లక్షణ,హనుమ, సుగ్రీవు లందరు కుజ
  నుగని నంతనే మోదము నుబడసెగద
  రావణ వధ అనంతరము సీతను గాంచిన సందర్భము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారు వచ్చినట్లున్నారు నమస్కారములు గురువు గారు ఆరోగ్యము ఎలా ఉన్నది.

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నిన్న రాత్రి నెలవు చేరుకున్నాను. ఆరోగ్యం బాగున్నది. ధన్యవాదాలు.

   తొలగించండి
 12. రామ లక్ష్మణ శత్రఘ్న రమ్య భరతు
  లన్నదమ్ములు,రాముడు నంగదుండు
  తండ్రి కొడుకులౌదురధిప! తనయు డైన
  కారణముననంగదుడు లక్ష్మణుని కచట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శత్రుఘ్నుడు' అనండి.

   తొలగించండి
 13. గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.

  ముద్దుగ హిందువు ముస్లిము
  లిద్దఱు పండుగకు రొట్టె లిడెడి తెఱగునన్
  హద్దులు చెఱపుచు చెలిమికి
  చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగం!
  (మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. మరో రెండు రోజుల్లో నెల్లూరులో ఈ రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈ రొట్టెల పండుగ గురించి చదివాను.
   కాని విక్రమసింహపురంలో బతుకమ్మ ఆడరు కదా!

   తొలగించండి
  2. అవునండి, అక్కడ బతుకమ్మ ఆడరు. అయితే అక్కడ అందరు కలసి రొట్టెల పండుగ జరుపుకున్నట్లుగనే ఇక్కడి బతుకమ్మ వేడుకల్లో షంషాద్ బేగం కూడా పాల్గొనిందని నా భావన. ధన్యవాదములు.

   తొలగించండి 14. భరత శత్రుఘ్ను లిలను నే వరుసగుదురు

  వారలకు నిష్టు డైనట్టి వాడెవరన

  రాయబారియై చనిరెవ్వరాయసురుకడ

  అన్న దమ్ములు రాముఁడు నంగదుండు.

  రిప్లయితొలగించండి
 15. భరతశత్రుఘ్నులక్ష్మణుండరయగాదె!
  యన్నదమ్ములు.రాముడునంగదుండు
  లగుదురటయొకరికొకరుగానయ్యసుతులు
  వారిబంధపుకారణమూర్మిళయ్యె

  రిప్లయితొలగించండి
 16. వాలి సుగ్రీవు లెవ్వరు బాల జెపుమ?
  రావణువధించి యెవ్వరు రహిని గాంచె?
  వాలి తనయుని పేరేమి? వరుసగాను
  అన్నదమ్ములు, రాముడు, నంగదుండు!!!

  రిప్లయితొలగించండి
 17. ……………………………………… గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అన్నదమ్ములు > రాముడు , న౦గదు౦డు

  కారు గద ! రాము డేమొ సుక్షత్రియు డగు |

  న౦గదు౦ డేమొ కపివీరు డైన యట్టి

  వాలి సుతు డగు | నా వాలి , వాలిపోవు

  నపుడు , " పరమాత్ముని - దశరథాత్మజు నిక

  విడక సద్భక్తి తోడ సేవి౦పు " మనియె

  ి
  { వాలిపోవు నపుడు = రామబాణము తగిలి

  పడిపోవు నపుడు }

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.

  భరత,శత్రుఘ్ను లెవ్వరు వరుస జూడ?

  జన్నమున్ గావ తాటకి జంపెనెవరు?

  రాయబారిగా నేగెను లంకకెవరు?

  అన్నదమ్ములు; రాముడు; నంగదుండు.

  రిప్లయితొలగించండి
 19. ఒక సతికిఁ బుట్టి యొక యింట నుండు వారు
  రవి కులము నందుఁ బుట్టిన రవి నిభుండు
  వాన రానీక యువరాజు వాలి సుతుఁడు
  అన్నదమ్ములు రాముఁడు నంగదుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాల్మీకి మహర్షి ప్రణీత క్రమాలంకారము:

   వహన్తి వర్షన్తి నదన్తి భాన్తి
   ధ్యాయన్తి నృత్యన్తి సమాశ్వసన్తి.
   నద్యో ఘనా మత్తగజా వనాన్తాః
   ప్రియావిహీనాశ్శిఖినః ప్లవఙ్గమాః ........4.28.27৷৷

   వహన్తి నద్యో
   వర్షన్తి ఘనా
   నదన్తి మత్తగజా
   భాన్తి వనాన్తాః
   ధ్యాయన్తి ప్రియావిహీనా
   నృత్యన్తి శ్శిఖినః
   సమాశ్వసన్తి ప్లవఙ్గమాః

   తొలగించండి
  2. కామేశర రావు గారూ,
   అద్భుతమైన పూరణ. దాని ననుసరిస్తూ ఇచ్చిన వాల్మికి శ్లోకం మనోహరం. అభినందనలు, ధన్యవాదాలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   శంకరాభరణ వినిర్మలాకాశము రవి విహీన మైన దీ నాలుగు రోజులు!

   తొలగించండి
 20. వాతఁ బెట్టగన్ లంకనే వహ్ని గాల్చె
  రావణుండదిరి పడఁగ రగిలి గాలి
  చూలి! పిదప నెదురునిల్చి జూపిరెవర
  టన్న 'దమ్ము' లు రాముఁడు, నంగదుండు!

  (రాయబార సమయంలో అంగదుడు, రణరంగములో రాముడు)

  రిప్లయితొలగించండి
 21. వచ్చిరదిగొ మారీచ సుబాహు లనెడి
  యన్న దమ్ములు, రాముఁడు నంగ దుండు
  నని దలచి యాగమును కాచె నసురు లణగ,
  కౌశికుని మనమువడయ ఖ్యాతి నొందె ౹౹
  (అంగద = ఆపద)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాముడు నంగదుండు నని తలచి'... అర్థం కాలేదు.

   తొలగించండి
 22. భరత,లక్ష్మణ,శత్రుజ్ఞవరుసలందు
  అన్నదమ్ములు రాముడు|”నంగదుండు
  రావణాసుర చెంతకు రాయబారి
  గాను వెళ్ళె|రామాజ్ఞనే మానలేక.”

  రిప్లయితొలగించండి
 23. సోదరులకు సరి పదము చూడ నెద్ది?
  వాలి నేల కూలె నెవరి బాణ మంద?
  రాయబారిగ నెవరేగె లంక కపుడు?
  అన్నదమ్ములు, రాముడు, నంగదుండు!

  రిప్లయితొలగించండి
 24. భానుజుఁడు నేలబడియున్న వాలిఁబట్టె;
  ప్రేమ భరితులై యొండొరు వీడ రైరి
  యన్నదమ్ములు; రాముఁడు నంగదుండు
  జాంబవంతాదు లాశ్చర్య చకితులైరి

  రామబాణమున నేలబడిన అన్నను చూడగానే సుగ్రీవుడు పెల్లుబికిన ప్రేమతో వానిని కౌగిలించుకొనెను. మరణమాసన్నమైన వాలి కూడా వానిని వీడడాయెను. చూచువారు ఆశ్చర్యచకితులైరి.
  భానుజుడు= సుగ్రీవుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదమున
   ఒండొరు అని ల లోపముగా వ్రాయుట దోషమని సందేహము కలిగింది.
   సవరణ:
   ప్రేమతో నొకరినొకరు వీడ రైరి

   తొలగించండి
  2. నరసరాజు గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
 25. డా.బల్లూరి ఉమాదేవి.  29/9/17


  వాలి సుగ్రీవురెవ్వరు వరుసయందు

  వాలి నెవ్వడు హతమార్చె బవరమందు

  వాలిసుతుండెవ్వడీ వసుధయందు

  అన్న దమ్ములు రాముఁడు నంగదుండు.


  కుశలవులదేవరుస జూడ కువలయాన

  కూర్మి జూపు తండ్రెవ్వరు కుశలవులకు

  వాలికిని తారకు సుతుడెవరన వినుము

  అన్న దమ్ములు రాముఁడు నంగదుండు.

  రిప్లయితొలగించండి