3, సెప్టెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2455 (రాతిరి సూర్యుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్"
(లేదా...)
"రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్"

80 కామెంట్‌లు:

  1. రీతిగ నమవస చీకటి
    రాతిరి; రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
    ప్రీతిగ వీడగ గ్రహణము;
    ఖాతరు చేయక మనుజుల కష్టసుఖములన్


    (సూర్య గ్రహణమెప్పుడును అమావాస్య నాడే వచ్చును)

    రిప్లయితొలగించండి
  2. కం. నా తరమా వర్ణింపగ
    చేతము రంజిల నగపడె స్వీడను లోన
    న్నాతురతన్ గమనించితి
    "రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్"
    ***)()()(***
    (ఉత్తర ధృవానికి సమీప దేశాల్లో రాత్రి
    సూర్యుడు కనబడుట సహజమేకదా !)
    ****++++****

    రిప్లయితొలగించండి
  3. నాతిగల బ్రమ్మ చర్యము
    నేతీరుగ సాద్యపడెనొ నెవ్విధి గనుమా ?
    జాతర జేయగ యలసిన
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భ్రహ్మచర్యము... పడెనొ యెవ్విధి ... జేయగ నలసిన..." అనండి.

      తొలగించండి
    2. నాతిగల భ్రహ్మ చర్యము
      నేతీరుగ సాధ్య పడెనొ యెవ్విధి గనుమా ?
      జాతర జేయగ నలసిన
      రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

      తొలగించండి
  4. భూతల మందునొక్కొక ప్రభూతపు భూతము లొప్పు చుండుగా
    శీతల మొక్కచోట సమశీతల మింకొక చోట నుండుగా
    చూతురు పశ్చిమోత్తరపు చోటుల, భారత మందునన్ సదా
    రాతిరి, సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్

    రిప్లయితొలగించండి
  5. భూతలమందు సారమును పోషణ చేసియు ధర్మమార్గమున్
    ఖ్యాతిగ పాలుపిండె వినయంబున నా పృథు చక్రవర్తి ఖ
    ద్యోతకు సాటియై దిరుగ యోగులు వల్కిరి నిశ్చయంబుగన్
    రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    సంవత్సరానికి 5% వృద్ధి రేటు గణించినా ఇప్పుడున్న జనాభా
    మరొక 20 సంవత్సరములలో రెట్టింపు అవడం ఖాయం.
    పశు పక్ష్యాదులు దీనికి అదనం.అప్పుడు కొన్ని ప్రాంతములలో
    కృత్రిమ సూర్యులను ఏర్పాటు చేస్తారట.ఇప్పుడు పగటి పూట
    మాత్రమే జరుగుతున్న వ్యవసాయం వంటి పనులు రాత్రి కూడా
    జరుగుతాయట.నిద్ర కోసం ప్రజలు చీకటి తెరలు కప్పుకుంటారట.
    అని వీరేంద్రనాథ్ గారు ఆనందోబ్రహ్మ అనే నవలలో వ్రాసారు.

    అదే గనుక నిజమైతే(ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నట్టుంది) :

    01)
    ________________________

    జాతులు వృద్ధి నొందుటను - జాగృతి నుండుట తప్పదందుచే
    రాతిరి వేళలన్ దిరుగు - శ్రామిక కార్మిక జీవకోటికై
    భాతిని గూర్పనెంచి, నిశ, - భానుని బోలెడు గోళముంచుటన్
    రాతిరి సూర్యబింబము తి - రంబుగ వెల్గె విహాయసమ్మునన్
    ________________________
    జాగృతి = మెలకువ
    భాతి = కాంతి

    రిప్లయితొలగించండి


  7. జోతలు చంద్రుని ధృతికిన్
    రాతిరి! రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్
    చేతము వందనము జిలే
    బీ తను వొప్పంగ సూవె బిరబిర దినమున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. నాతమ్ముడు తమయూరికి
    చూతము రమ్మనుచు బిలిచె చుక్కల శాలన్
    చేతం బలరిన దచ్చట
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  9. ఖ్యాతి గ ల దర్శకేంధ్రుడు
    భ్రాతి ని గల్పిoచచిత్ర రాజ ము నందు న్
    ప్రీ తి గ జూచి తిమొ క చో
    రాతిరి రవి నభము న న్ ది ర ము గ వె లి గెన్

    రిప్లయితొలగించండి
  10. చేతము సంతసిల్లు విధి చెప్పు డసత్యములైన సంగతుల్
    చూత మటంచు నొక్కయెడ చోద్యముగా నొక స్పర్ధజేయగా
    నూతన నామకుం డచట నొక్కి వచించెను మీరు గంటిరే
    రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  11. ప్రీతిగ దినమున్నేలుచు
    జ్యోతిగ జాబిల్లి వెలుఁగ సొంపును పంచన్
    దాతగ కలువల దొరకున్
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
  12. వాతి వెలుగులు జల్లెను
    రాతిరి, రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్"
    భూతల జనమ్ము పై హిమ
    రాతిరి గిరణములు భీకరంబుగ నిడుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "వెలుంగులు" అనండి. 'హిమ రాతిరి' దుష్టసమాసం. 'హిమ రాతిరి'ని 'చలి రాతిరి' అందామా?

      తొలగించండి
  13. మాతా !కా నబడడు గద
    రాతిరి రవి నభమునన్, దిరంబుగ వెలిగెన్
    జోతులు వాయువు లేమిని
    రాతిరి నన్ వెలుగు నిచ్చు రాగుడు మనకున్

    రిప్లయితొలగించండి
  14. కవిసమ్మేళనమయ్యది
    కవులందరుగూడిరచట కవనపుఝరులు
    న్నవరసపుగుభాళింపుల
    శ్రవణానందంబుగలుగ జరిపిరె,సామీ!

    రిప్లయితొలగించండి
  15. జాతులవైరము తోడను
    భూతలమున గృత్రిమమగు ప్రొద్దు సృజించన్
    భీతిలఁ జేయ నహితులను
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. యాతన లుడిగి సుఖమ్ములు
      వే తలకొను రీతి నొప్ప భీతి కరంబౌ
      నా తిమిరము వీడి కడవ
      రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్


      ఆతత భూషణావళి మహాద్యుతు లీయఁ జెలంగ నంగనా
      వ్రాతము పెండ్లి పందిరి విరాజిత మయ్యె నభో నిభంబుగన్
      నాతి చరామి ఘోషమున నవ్యవధూమణి వెల్గె నింపుగన్
      రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  17. రాతిరి సూర్య బింబము తిరంబుగ వెల్గె విహాయసంబునన్
    భూతల మందుగానమది పోడిమి కాంతులు చిమ్మెనే
    రాతిరి చంద్ర బింబము తిరంబుగ వెల్గుల నిచ్చు నెప్పుడు
    న్నంతియె కానివే ఱొకటి యౌటకు నచ్చట వీలుగా దుగా


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. "చిమ్మెనేమొ నే..." అందామా?

      తొలగించండి
  18. జ్యోతిర్లింగంబు మురా
    రాతియు వాణీపతియును రయమున గనగా
    నాతురులై జన నాశివ
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్.

    రిప్లయితొలగించండి
  19. నూతన శాస్త్రరీతుల కనుంగొను మానవుడద్భుతంబుగన్
    చేతన నింపె లోకమున సృష్ఠికి తాప్రతిసృష్టి జేయుచున్
    జ్యోతికి ధీటుగా మరొక సూర్యుని జేయగ రాత్రికోసమై
    రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గెవిహాయసమ్మునన్

    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి నమస్సులు.పూ జ్యు లు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు. నా పూరణ లోని దోషము లు తెల్పు డు.
    చూతము రారండి!న హో
    భూతల వింతలు జితేంద్ర బుద్దిన్ న ది యున్
    నూతన జగమున్ కలలో
    రాతిరి రవి న భ ము న న్ ది రo బుగ వెలిగెన్.
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రారండి యహో..." అనండి.

      తొలగించండి
  21. గురువులు శ్రీ కందిశంకరార్యులకు మరియు నితర కవిమిత్రులకు ప్రణామశతములు.

    మనశాస్త్రవేత్తలు పంపే ఉపగ్రహముల గూర్చి........

    చూతము రండు వేడ్క యిదె చుంబిత రోదసి కాంతులీనుచున్
    భూతల మజ్జగించుచు నభోస్థలి జేరి ప్రకాశమానమై
    ఖ్యాతి గలుంగ జేసినది గాదె గనంగ నిశాతఱిన్ భళీ !
    రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్

    సూర్యగ్రహణము చూచిన ఒక పిల్లవాని ఆశ్చర్యము.

    చూతమె సూర్యగ్రహణం
    బాతిమిరము వీడి వచ్చెనంబరమణి య
    త్యాతురతన్ బల్కె నిటుల
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్తి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. చేతన బొందుచున్ కవులు చెంతన జేరగ రాజు కొల్వునన్
    నాతిముఖంబు కుంకుమను నచ్చిన తీరుగ వ్రాసి యిమ్మనన్
    రాతిరి, సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్
    రీతిగ పోలికన్ ముదము రేడట మెచ్చగ రాసిరందరున్

    రిప్లయితొలగించండి
  23. రాతిరి తిరుపతి నభమున
    జాతర|నవరాత్రులందు జనుల పసందై
    భూతలమున రవిప్రభ గన?
    రాతిరిరవి నభమున్ దిరంబుగ వెలిగెన్|
    2.కౌతుక మందు సూర్యప్రభ కౌగిలియందున వేంకటేశుడే
    రాతిరి గానిరాత్రి నవరాత్రియు ధాత్రికిపాత్ర పోషణా
    రౌతుగ|వెళ్లు చుండ?నవరత్నపు కాంతులు దారిజూపగా
    రాతిరి సూర్య బింభము తిరంబుగ వెల్గె|విహాయసమ్మునన్|

    రిప్లయితొలగించండి
  24. నా తనయుడు మాటాడెను
    రాతిరి, రవినభమునన్ దిరంబుగ వెలిగె
    న్నాతరుణమందు నచ్చట
    సౌతాఫ్రిక దేశమందు సాయము వేళన్


    వేతన మందిన రోజున
    నాతికి గోక గొనిపోవ నారియె మురిసె
    న్నేతీరుగ వర్ణింపను
    రాతిరి రవి నభము నన్ దిరముగ వెలిగెన్

    మహా రాజు శ్రీరామ చంద్రునకు ప్రభాత వేళ మేలుకొలుపు తెలిపెడు వందిమాగదుల మాటలుగా.....


    పాతకులన్ వధించి భువి భారము దీర్చగ నెంచు దానవా
    రాతికి సుప్రభాతమిది, రాక్షస జాతిని సంహరింపగన్
    భూతల మందు బుట్టిన ప్రభూ! తొలగెన్ గద ధ్వాంతమే విడెన్
    రాతిరి సూర్య బింబము తిరంబుగ వెల్గె విహాసమ్మునన్

    రిప్లయితొలగించండి
  25. భూతలమున భారతమున
    చూతుము భాస్కరుని పగలు ; చోద్యం బపుడే
    రాతిరి యవ నమెరిక లో ,
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    చూతుము దివసమున రవిని
    రాతిరి యగు నమెరికాన రక్తిని గొలుపన్
    భూతల మొకటే కాగా
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    విష్ణువుశివుడు న్నొకడవ
    విష్ణువె శివరూప మొంది విషము గ్రహించన్
    వైష్ణవు లందరు బలికిరి
    విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్

    రిప్లయితొలగించండి



  26. కాతర పడుచును జారెను

    రాతిరి,రవినభమునన్ దిరంబుగ వెలిగెన్

    ఆతురముగ నదమందున

    కౌతుకమలరంగ విరిసె కమలము లెల్లన్.

    కాతరపడుచు=తత్తర పాటుతో


    ఆతారాధిపుడు వెలిగె

    రాతిరి,రవినభమునన్ దిరంబుగ వెలిగెన్

    చతురత తోడన్

    భాతము నందున జనములు పరవశ మందన్.

    :ఉషఃకాలము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం.

      తొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కౌతుకమొప్పగ దండ్రిని
    నాతడు చూడగ దలచుచు నానందమునన్
    జాతి విమానమ్మెక్కిన
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారికి నమస్కారములు. నిన్నటి పూరణ:

    కృష్ణ పసను మెఱయునదా
    విష్ణువె; హాలాహలమను విషమును గ్రోలెన్
    జిష్ణువు భాముండగు నా
    యుష్ణీసియె దేవతలకు యూతిని గూర్చన్
    (భాముడు=బావ; ఉష్ణీసి=శివుడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కృష్ణ పసను'...?

      తొలగించండి
  29. గురుదేవులు దయతో నిన్నటి సమస్యకు నాపూరణ ను చిత్తగించండి
    జలమున మునుగగ శైలము
    కలయుచు ధరియించి రూపు కమఠమ్ముగ తా
    వెలసెను విష్నువె. హాలా
    హలమను విషమును,గ్రోలె నా శంకరుడే

    నేటి సమస్యకు నాపూరణ
    భూతాత్ముడు సభ దీరెను
    జ్యోతిర్మయ పథమునందు చుక్కలు మెరసెన్
    శీతలుడై చంద్రుని వలె
    రాతిరి రవి నభ్మునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      ఈనాటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్నటి సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసే మీ ప్రయత్నం ప్రశంసింప దగినది. కాని ఆ ప్రయత్నంలో నాల్గవ పాదంలో గణం తప్పింది.

      తొలగించండి
  30. నేటి సమస్యకు నాపూరణ
    భూతాత్ముడు సభ దీరెను
    జ్యోతిర్మయ పథమునందు చుక్కలు మెరసెన్
    శీతలుడై చంద్రుని వలె
    రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
  31. సీతాపతి వేవేగమె
    యాతుర మతియై యమెరిక యాత్రకు జనగా
    చేతలుడిగె కనగా నడి
    రాతిరి రవి నభంబునన్ దిరంబుగ వెలిగెన్

    భారత దేశము నుండి అమెరికా వెళ్ళేటప్పుడు దారిలో నన్నివేళల సూర్యుడు కనిపిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు!

    రిప్లయితొలగించండి
  32. గురువు గారు
    సవరించిన పద్యము


    వాతి వెలుoగులు జల్లెను
    రాతిరి, రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్"
    భూతల జనమ్ము పై హిమ
    రాతి నెగడులగుచు భీకరంబుగ నొప్పన్

    (వెలుగు టై పాటు) హిమరాతి =అగ్ని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'హిమరాతి' ప్రయోగం సందేహాస్పదం. పర్యాయపద నిఘంటువులో ఉన్నా అది 'హిమారాతి'కి అచ్చు తప్పు అయి ఉంటుంది.

      తొలగించండి
  33. విష్ణువు శివుడే ,శివుడే
    విష్ణువని వేదములు దెలుప వేల్పుల కొరకున్
    జిష్ణుని సోదరి నాధుడు
    విష్ణువె హాలా హలమను విషమును గ్రోలెన్
    (శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే అనెడు వేద ప్రమాణముగా)
    GURUVU GARU NINNATI PADYAMU

    రిప్లయితొలగించండి
  34. కం. నా తమ్ముని మనుమనితో
    బ్రీతిగ సలుపంగ దృశ్య ప్రియ భాషణయే
    ఆతని ప్రవాస పటమున
    "రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్ "
    )()()(*****)()()(
    (దృశ్య ప్రియభాషణ= వీడియో సంభాషణ)
    సాదు రేఫ సంయుక్తాక్షర పూర్వాక్షరములు లఘువులుగా గైకొన బడినవి)

    రిప్లయితొలగించండి
  35. యాతన లెన్ని బెట్టినను నమ్మగ ముచ్చట తీరలేదురా
    నా తరమా వియోగమని నల్గు యశోదకు వేంకటేశుగన్
    ప్రీతిగ చేరెదన్ వకుళ వీవుగ ముచ్చట తీరునన్న నా
    రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్

    రిప్లయితొలగించండి
  36. ధన్యవాదాలన్నయ్యగారూ.
    సవరించిన పద్యం.
    ఆతారాధిపుడు వెలిగె
    రాతిరి,రవినభమునన్ దిరంబుగ వెలిగెన్
    చతురత తోడన్ దివిలో
    భాతము నందున జనములు పరవశ మందన్.
    భాతము:ఉషఃకాలము

    రిప్లయితొలగించండి
  37. భీతిల్లకు గ్రహణంబీ
    రీతిగ పూర్ణంబు బట్ట రేయిగ మారెన్
    చూతువె, యదిగో తొలగెను
    రాతిరి - రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్

    రిప్లయితొలగించండి
  38. ఆ తిథి పున్నమందునను హాయిగ గ్రుంకగ మాయమాయెనే
    రాతిరి సూర్యబింబము;...తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్...
    నీ తల నెత్తి చూడుముర!... నిక్కముగానటు పూర్ణచంద్రుడే.
    నా తల వ్రాత తప్పదుగ! నందము నొందుచు నిన్ను మొత్తుటన్ :)

    రిప్లయితొలగించండి