10, సెప్టెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2460 (చక్కెర చేదనుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా"
(బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

89 కామెంట్‌లు:

  1. ఎక్కువగా మధుమేహపు
    చక్కెర రక్తమ్మునందు జాడ్యమ్మవగా
    మిక్కిలి తీపగు నకిలీ
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి
  2. అక్కర మించిన ప్రేమను
    నక్కజముగ జూపిన మరి యల్లుండైనన్
    లెక్కన్ జేయడు;నమితపు
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి
  3. అక్కర లేనిదె మిక్కిలి
    మక్కువ జూపించి నంత మాయగ దోచున్
    ఎక్కువ తీపిని తినగను
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  4. జక్కవ కుచములు, పిడికిట
    చిక్కెడు నడుమునుఁ గలిగిన చెలి యధరసుధల్
    సొక్కుచు గ్రోలెడు వానికి
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ది క్కెల్లరకు నతండని
      నిక్కముగానమ్మి నోట నిఖిలేశుని పే
      రొక్కటెపుడుఁ గలవారికి
      చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

      తొలగించండి
    2. రామకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. చిక్కని పదగుంఫనముల
    చక్కని రసధారలమరి శయ్యను గూర్పన్
    నిక్కంబా కవనములో
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా
    (చేదు= ఆకర్షించు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. చక్కని సద్గుణుడైనను
    టక్కరులన్ మైత్రిఁగోరి డాసి చెడునుగా
    నిక్కముగ విషముఁ గలిపిన
    చక్కెర చేదనుట విబుధసమ్మతమె గదా

    రిప్లయితొలగించండి


  7. చక్కని చుక్కా యెక్కువ
    మెక్కుడ దేదైన సూవె మేల్గాదు సుమా,
    మిక్కుట మైన జిలేబీ
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మెక్కుట యేదైన..." అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  8. మెక్కగ మెక్కగ నింబము
    నిక్కముగ మధురము నిడునని విభులు తెల్పెన్,
    అక్కజము గాదు నిచటన్
    "చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అక్కజమే కాదిచటన్" అనండి.

      తొలగించండి
  9. గురువు గారు నమస్కారము నిన్నటి పూరణము ఒక్కసారి పరిశీలించ గలరు

    జమునకు సరయువునకును,శతముఖునకు
    అమడ సురవఠరులకును యభిషవమును
    మొదలిడుతరి యమసుతుడు ముదముగలుగ
    తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

    రాజసుయయాగము మొదలు పెట్టునపుడు ధర్మరాజు అతని తండ్రులకు మొక్కెనని భావన


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సర్వలఘు పూరణ బాగున్నది. అభినందనలు.
      శతమఖుడు ఇంద్రుడు.. శతముఖుడు కాదు (పర్యాయ పద నిఘంటువులో అర్జునుని 'శతముఖసుతుడు' అని ఉన్నది కాని అది ముద్రణాదోషం. అక్కడ 'శతమఖసుతుడు' అని ఉండాలి).
      'సురవరరులకును'...? సురవరులకు.. కదా!

      తొలగించండి
  10. మిక్కిలిగా రుగ్మతలకు
    చిక్కిన మధుమేహ రోగి చేరుచు వైద్యున్
    మ్రొక్కెద కావు మనంగా
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

    మిక్కిలి రసభరితములగు
    చక్కని కావ్యాలలోని స్వారస్యంబున్
    నిక్కముగ గ్రోలు నాతడు
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. చక్కని చుక్కను గోరఁ గ
    దక్కే ను కానీ క్రమము గ దానే వెగటౌ
    మక్కువ దీరిన పిదప న్
    చక్కెర చేదను ట విభుద సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి



  12. ……………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    చక్కెర గుప్పి౦చిన టీ

    లెక్కువ సేవి౦చు టెల్ల హితమౌనె " బ్రదర్ ! "

    చక్కెర రోగము త్వరలో

    చక్కెర చే దనుట విబుధ సమ్మతము గదా !

    ( చేదు = రప్పి౦చు )


    రిప్లయితొలగించండి
  13. టక్కరి బాబాలందరు
    చక్కటి మొసాలయందు చక్కరతీపై|
    చిక్కగ నీతికి జైలగు
    చక్కర చేదనుట విబుధసమ్మతమెకదా?
    2.మక్కువ తీపిని బెంచిన?
    అక్కరకది డబ్బులడుగ?నన్యోన్యతయే
    టక్కునమారగ| మమతల
    చక్కర చేదనుట విబుధసమ్మతమె కదా?

    రిప్లయితొలగించండి
  14. దక్కెడిది పడుపు కూడని
    మ్రొక్కెడుఁ గావ్యమ్ము నమ్మ పూన ననియెడు
    న్నక్కవి పోతన కన్యుల
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    ముక్కున్ మూసుకు తపముల
    నక్కిన నరునకు సుభద్ర నగవుల పిలువన్
    జిక్కిన తేనెల కన్నన్
    జక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి
  15. జమునకు సరయువునకును,శతమఖునకు
    అమడ సురవఠరులకును యభిషవమును
    మొదలిడుతరి యమసుతుడు ముదముగలుగ
    తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

    గురువు గారికి నమస్కారములు శతమఖుడు టైపాటు. సురవఠరులు దేవ వైద్యులు అన్న అర్ధములో వాడాను. అశ్వనీ దేవతలు ద్వార మాద్రి సంతానము కన్నది గదా సర్వ లఘు ప్రయోగములో సురవఠరులు అన్న పదము వాడ వలసి వచ్చినది సలహా ఈయగలరు.

    రిప్లయితొలగించండి
  16. మక్కువతో ప్రవరాఖ్యు
    న్నక్కున జేర్చఁగ వరూధినార్తిగ నఖముల్
    నొక్కిన క్షతముల కంటెన్
    జక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    చిక్కుచు పతి కౌగిట కై
    పెక్కిన నరమోడ్పు కనుల విరహము వీడన్
    జిక్కు నధర సుధ కన్నన్
    జక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి
  17. మెక్కగ మెక్కగ నింబము
    నిక్కముగ మధురము నిడునని విభులు తెల్పెన్,
    అక్కజమే గాదు నిచటన్
    "చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    గురువు గారు చిన్న అనుమానము అక్కజమే గాదిచటన్ అని వాడాలా లేక యక్కజమే అని వాడాలా సూచించగలరు ధన్యవాదములతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తెల్పె। న్నక్కజమే..." అనండి.

      తొలగించండి
  18. మక్కువ సీతను గోరుట
    చిక్కులు దెచ్చుననగ సతి చీకాకుపడన్
    మిక్కుటమగు మోహంబున
    చక్కెర చేదగుట విబుధ సమ్మతమేగా!

    అక్కసుగొని సింహాసన
    మెక్కెడు రాముని వరముల మిషవని కంపన్
    వెక్కసము దోచె నిజసతి
    చక్కెర చేదగుట విబుధ సమ్మతమేగా!

    రిప్లయితొలగించండి
  19. చాలా అద్భుతమైన ఉత్తరములు ఇచ్చిన కవిపండితులకు పాదాభివందనములు. సమస్యా పూరణము క్రమం తప్పకుండా ఇచ్చి మేధస్సును పెంపొందిస్తున గురువు గారికి శతకోటి వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జాలము లోనన్ పద్యపు
      హాలికులగుచు కవులెల్ల హారము లిడిరౌ
      చాలా యద్భుత మైనటి
      మేలౌ పూరణల గొనుచు మేధా జీవుల్ !

      జిలేబి

      తొలగించండి
  20. చక్కని వేళల నిడుముల
    జిక్కియు మధురాశయములు చితికినవగుచో
    వెక్కసమూనుట నైజము.
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమేగా

    రిప్లయితొలగించండి
  21. ఎక్కువగా యేదయిను
    మెక్కినచో చేటుదెచ్చు ;మేనికి కీడౌ
    నక్కర పరిమితి మించిన
    చక్కెర చేదనుట విబుధ జన సమ్మతమె గదా !

    రిప్లయితొలగించండి
  22. చక్కని కావ్యములందున
    మక్కువ గలవాఁడు బుద్ధిమంతుఁడు మదిలో
    మిక్కిలి తన్మయ మొందియు
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రొక్కము లెక్కువ లేకను
    మక్కువ విడనాడి బుద్ధిమంతుఁడు మదిలో
    మిక్కిలి యక్కసు చేతను
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  23. నిక్కముగ కాకర రసము
    మిక్కిలి చేదైనదిలను మితముగనైనన్
    చక్కెరలోఁ గలిసిననా
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  24. రెండు జడల సీతలు,
    సీగానపెసూనాంబలు:

    తొక్కుడు బిళ్ళల్లాటలు
    చిక్కక కుందుళ్ళగుమ్మ చెమ్మలుచెక్కల్
    ముక్కులు గిల్లుట మధ్యన
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  25. ఎక్కువ జ్వరమున్నప్పుడు
    మిక్కుటముగ తీపినోట మెక్కినయపుడున్
    చక్కెర రోగిని తినుమన
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

    రిప్లయితొలగించండి
  26. 3. రెక్కాడక డొక్కాడని
    బక్కలకునుబీదలకును పరికింపంగా
    నక్కట! ద్రాక్షలు పుల్లన
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

    4. పెక్కండ్రకు విశ్వపు నలు
    దిక్కుల ప్రత్యుదయము తొలి దిక్కగు - పొగలున్
    గ్రక్కెడు కాఫీ- కలపక
    చక్కెర, చేదనుట విబుధ సమ్మతమె కదా
    (అన్వయ క్లేశమును మన్నింతురు గాక)

    రిప్లయితొలగించండి
  27. మక్కువ మిక్కుట మైనను
    నెక్కటఁ జిక్కి పొగ రెక్కినిక్కిన నిక్కం
    బెక్కువ మెక్కిన ముక్కరె
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    [ఎక్కట = ఏకతము; ముక్కు = చెడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      వృత్త్యనుప్రాసాలంకారంతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు ధన్యవాదములు.

      తొలగించండి
  28. లెక్కించక యెడ్డెమనన్
    తక్కువయా తెడ్డెమనుచు దంపతులున్నన్
    నిక్కుచు వేప మధురమన
    జక్కెర చేదనుట విబుధ! సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి

  29. అక్కజమొదవెనునీ యది
    చక్కెర చేద నుట విబుధ సమ్మతమె కదా
    యెక్కడి విబుధులు వీరలు
    పక్కాగా చేదె యనుట భావ్యమె సితమున్

    రిప్లయితొలగించండి
  30. నిక్కముగ కాకర రసము
    మిక్కిలి చేదైనదిలను మితముగనైనన్
    చక్కెరలోఁ గలిసిననా
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  31. చిక్కని పాలు సమస్యను
    మక్కువ కందాన యతులుగణముల మరుగన్
    టక్కున ప్రాసల టీయే
    చక్కర|చేదనుట|విబుధ సమ్మతమె కదా?

    రిప్లయితొలగించండి
  32. అక్కరకురానిమాటయిది
    చక్కెరచేదనుట,విబుధసమ్మతమెకదా
    చక్కెరతీపిగనుండను
    నక్కరమున్బలుకనిపుడుహర్షముగలుగన్

    రిప్లయితొలగించండి
  33. చిక్కగ మధుమేహము నకు
    చక్కని వంటకములందు షడ్రుచు లున్న
    నొక్కటి రుచ్యము తగనిది
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఉత్తరను పెండ్లి యాడగ చిత్త మలర
    గాంచి యభిమన్యు డాపెను కాంతు లీన
    తాళి కట్టెను ; వెనువెంట తనదు తల్లి
    దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "షడ్రుచు లున్న। న్నొక్కటి..." అని కదా ఉండవలసింది.

      తొలగించండి


  34. మక్కువ కలిగినదనుచును

    నెక్కుడుగా దీని వాడ నిలలౌ నెపుడున్

    మిక్కుటమగురుజలు కలుగు

    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.



    అక్కర తోడను దీనిని

    చక్కగ వండుచు తినినను సతతము రుజలున్

    నిక్కముగా కల్గు భువిని

    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.



    మక్కువ తోభాగవతము

    చక్కగ వినుచును సతతము  సమయము గడుప

    న్నక్కర లేదేది భువిని

    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. చక్కని రామ రసమ్మును
      మక్కువ పానమ్ము సేయ మధురామృతమై
      చిక్కని మీగడపాలును,
      చక్కెర, చేదనుట విబుధసమ్మతమె కదా

      తొలగించండి
  35. నిక్కము భాగవతామృత
    మెక్కారణమందునైన నెలమిని యైననన్
    చుక్కైన ద్రాగువారికి
    చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...నెలమిని నైనన్" అనండి.

      తొలగించండి
  36. చక్కని రామ రసమ్మును
    మక్కువ పానమ్ము సేయ మధురామృతమై
    చిక్కని మీగడపాలును,
    చక్కెర, చేదనుట విబుధసమ్మతమె కదా

    రిప్లయితొలగించండి
  37. లెక్కించక యెడ్డెమనన్
    తక్కువయా తెడ్డెమనుచు దంపతులున్నన్
    నిక్కుచు వేప మధురమన
    జక్కెర చేదనుట విబుధ! సమ్మతమె కదా!

    రిప్లయితొలగించండి
  38. సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత విద్వాన్ శ్రీమతి జి సందిత (Sanditha)అనంతపురము


    భంగున్ మద్యము ద్రాగుట
    చొంగల్ గారంగనోట సోయిచెడంగన్
    గంగులుతూలుచుదఱిచే
    రంగని ఛీ! యనిరి పాండురంగని భక్తుల్.

    రిప్లయితొలగించండి