ఈ రోజు సరస్వతీ పూజ . ముగ్గురు అమ్మల ప్రార్ధన హార బంధ తేట గీతిలో వ్రాశాను. అది గురువు గారిచే అవీ ఇవీ అను వర్గములో పెట్టబడినది. కవిమిత్రులు పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుప ప్రార్ధన పూసపాటి కృష్ణ సూర్య కుమార్
గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు. ఈ మధ్య కాలంలో మదు మేహము తో బాధపడుతు న్నా ను ఆo దువలన పూరణ లు పం పలేదు.సాహితీ మిత్రులందరికి సరస్వతి దేవి కరుణా కటాక్షాలు ప్రసాదిం చా ల నీ ప్రార్థిస్తున్నాను. ధర్మ నిరతిని పాటించు దార్మికు డగు రావణా నుజుండు , రాముడు గద సీత నుచెరపత గదన్న శీల గుణుడు నాతడు విభీషణుo డు యే న సుర శ్రేష్ఠ. వందనములు
నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” నేక త్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
ఏ రూపమ్మును జెప్పె రాఘవుఁడు నే నీ యింతి దర్శించితి న్నే రంగున్నుడివెన్ రఘూత్తముఁడు నే నీ కాంత వీక్షించితి న్నే రీతిం దను లక్షణమ్ములనె నే నీ తన్వి నీక్షించితి న్నే రామా మణిఁ జూడ వచ్చితినొ తా నీ భామ గా నోపునే
పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్సులు.మీరు వ్రాసిన సుందర కాండ దివ్యము గా గలదు. చాలా రోజుల వరకు గుర్తుండే విధంగా రచించారు.పద్య రూ పము లో ఆ భి నo ది o చా ల నీ వున్నా ఆ రో గ్యము సహకరించ లేదు
ఈ రోజు సరస్వతీ పూజ . ముగ్గురు అమ్మల ప్రార్ధన హార బంధ తేట గీతిలో వ్రాశాను. అది గురువు గారిచే అవీ ఇవీ అను వర్గములో పెట్టబడినది. కవిమిత్రులు పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుప ప్రార్ధన పూసపాటి కృష్ణ సూర్య కుమార్
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికడవ చెవుల వాడు గట్టి నిదురతీయు
రావణానుజుండు; రాముఁడు కద
యగ్ర జుండు లక్కుమనునికి,భళిభళి
కంట నిదుర బోని కర్మ యోగి !
జిలేబి
తొలగించండికడవ చెవుల వాడు గట్టి నిదురతీయు
రావణానుజుండు; రాముఁడు కద
యగ్ర జుడు జిలేబి యాలక్కుమనునికి,
కంట నిదుర బోని కర్మ యతికి !
జిలేబి గారు:
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తముగ నున్నవి.
తొలగించండిధన్యవాదాలండీ జీపీ యెస్ వారు
మీ పూరణము ప్రశస్తము
గా పదములతో జిలేబి గావించిరహో !
జీపీ యెస్వారి కితా
బౌ!పద పేర్పేశ్వరియగు భామకు సుమ్మీ !
జిలేబి
👏👏👏
తొలగించండిజానకీశు పదము శరణు వేడె నెవడు?
రిప్లయితొలగించండిహృదయమందు గరుణ ముదయమంద
బుజ్జియుడుత నెవడు బుజ్జగించె?
రావణానుజుండు; రాముడు కద.
అన్న చేసిన పని కలుక వహించిన
రిప్లయితొలగించండితమ్ము డాశ్ర యించె దాశరథిని
చేయి కలిపి వారు స్నేహితు లయ్యిరి
"రావణానుజుండు , రాముఁడు కద"
కుక్షి నింపు వాడుకుండ వీనుల జోదు
రిప్లయితొలగించండి"రావణానుజుండు, రాముఁడు కద"
తమ్ముడు,సతి ,వెంట తరలి రాగా వన
వాసమునకు వెడలి వన్నె కెక్కె
కుంభ కర్ణు డనగ కోరినిదుర బోయె
రిప్లయితొలగించండిరావణా నుజుండు . రాముఁడు కద
సీత నడవి కంపి ఖ్యాతిగాం చెనంట
నేక పత్ని వ్రతుడు నీతి పరుడు
రిప్లయితొలగించండిఇవ్వాల్టి జిలేబి ఇంతే !
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే?
ఏవణికన్గొనన్ మదిని యేలిక చేసిన యీ సమస్యకున్
వావిరి యౌ సమాంశములు వచ్చుట లేదు సుమా సురంటియై!
దేవర! శంకరాభరణ దీపక! యెట్లు జిలేబి చేయనౌ!
జిలేబి
గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు. ఈ మధ్య కాలంలో మదు మేహము తో బాధపడుతు న్నా ను ఆo దువలన పూరణ లు పం పలేదు.సాహితీ మిత్రులందరికి సరస్వతి దేవి కరుణా కటాక్షాలు ప్రసాదిం చా ల నీ ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిధర్మ నిరతిని పాటించు దార్మికు డగు
రావణా నుజుండు , రాముడు గద
సీత నుచెరపత గదన్న శీల గుణుడు
నాతడు విభీషణుo డు యే న సుర శ్రేష్ఠ.
వందనములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ.వె
రిప్లయితొలగించండిధర్మముండు చోట తానుండెదననుచు
నాడు జేరె రావణానుజుండు
రాముఁడు కద బ్రోచు;రక్షణ నిడమని
వచ్చి జేరు వాడు వైరి యైన
డా.పిట్టా
రిప్లయితొలగించండిబావ,బావమరిది బారుషాపుం జేరి
పెగ్గు వెనుక పెగ్గు బ్రేవు దీయ
వారి భాషలోన వరలు రామాయణ
రావణానుజుండు రాముడు కద !!!
డా.పిట్టా
రిప్లయితొలగించండివావియు వర్సలుం జెలగు వైన ముదాహరణమ్ము నడ్గగా
భావ యుతుండు శిష్యుడొక బాణిని పద్యమునందు దీసె బల్
చేవ గలంగ ఛంద గతి జెప్పిన పాదము విస్మయార్థమే
రావణ కుంభకర్ణులకు రాముడు తమ్ముడు మామ వాలియే!?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెద్దనిద్రవాడు పెనునాకటికి దోడు
రిప్లయితొలగించండిరావణానుజుండు, రాముడుగద
నరునిరూపు దాల్చి నశియింప నభిశాప
మన్నదమ్ములిర్వు రనినిగూల్చె!
ప్రేవుల నింపగన్ పగటి వేషపు వృత్తిని సాగువారికిన్
రిప్లయితొలగించండిజీవనమెల్ల దుర్భరము చిక్కదు విత్తము చాలునంతగన్
రావము రూపముల్ చెలఁగ ప్రాభవమందిన వారిఁ జూడగన్
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే!
పొట్టనింపుకొనఁగ పూసిరి రంగులన్
రిప్లయితొలగించండిపగటి వేషమందు పరవశించి
పాత్రధారులెల్ల బంధువులే చూడ
రావణానుజుండు రాముఁడు కద
రాము శరణుఁజొచ్చి రాఘవునర్చించి
రిప్లయితొలగించండిసూరివరునయ్యె సుగుణమూర్తి
భీషణుండునై విభీషణ దనుజుడు
రావణానుజుండు రాముడు కద
రమయతి ఇతి రామః
చేవనుగల్గి బంధువులె చేయుప్రదర్శన లెన్నొ యేండ్లుగా
రిప్లయితొలగించండినీవిధి వీధినాటకములిచ్చటనచ్చట వేయుచుంద్రుగా
బావయ చెప్పుచుంటివిను వారలమధ్యన వావివర్సలన్
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే.
కుంభ కర్ణుడనెడుడింభుడౌక్రూరుండు
రిప్లయితొలగించండిరావణానుజుండు.రాముడుగద
రావణాదిగాగరాక్షసగణమును
సంహరించినట్టిచక్రధరుడు
బ్రహ్మ కులము నందుఁ బ్రభవించె దశకంఠ
రిప్లయితొలగించండిరావణుండు వింత రాఘవుఁడు మ
రీచి కశ్య పేన రీతినిఁ బుట్టఁగ
రావణానుజుండు రాముఁడు కద
[అనుజుఁడు = తర్వాత పుట్టిన వాడు]
పావన భార తావని నపత్యము గల్గఁగ సంతసమ్మునన్
వావిరి ప్రేమ నుంచి తమ వారివి కాని మనోహరమ్ములౌ
దేవ మునీంద్ర రాక్షసుల దీటగు నామము లుంచ నేర్వఁగన్
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే
నమస్కారము కామేశ్వర రావు గారు ఈ మధ్య నా మీద సీత కన్ను వేశారు. మీ సలహాలు ఏమి ఇవ్వటము లేదు
తొలగించండికృష్ణ సూర్య కుమార్ గారూ యలాంటిదేమీ లేదు. నా యభినందనలు తెలుపుతునే యున్నానుగా! మీ బంధ పద్యములన్నీ నేను భద్రపఱచుచునే యున్నాను.
తొలగించండిdhanyvadamulu
తొలగించండిఆ.వె.రాజ ధర్మ మెరుగు రాజగు"రాముడు"
రిప్లయితొలగించండివిభుధ వరుడుమన విభీషణుండు
రాజ్య లక్ష్మి నొంది రయమున బాలింప
రవాణానుజుండు రాముడుకద
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మైలవరపు వారి పూరణలు:
రిప్లయితొలగించండిధర్మబద్ధుడైన దానవుడన్నను ,
ధర్మపత్నినొక్క ధర్మమూర్తి ,
విడిచినట్టి వారు వీరిద్దరే ఘనుల్
రావణానుజుండు , రాముడు గద !!
నే వివరించి తమ్మునకు నేర్పుగ మామకు నాదికావ్యమున్
చేవను జెప్పగా " విగతజీవులఁజేసియు ముక్తినిచ్చెడిన్
రావణకుంభకర్ణులకు రాముడు ., తమ్ముడు! మామ ! వాలియే
చావును బొందె నంచు .," నిక చాలని" వారును నిద్రఁ గ్రుంకరే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
భావన జేయనగ్రజుడు వైశ్రవణుండగు వైరి వీరికిన్,
రిప్లయితొలగించండిభావన జేయ సీతకగు భర్త యితండగు- వానికిన్- సుమి
త్రావడు వేమగున్ మిథిల రాజు?మ రెవ్వడు వానిచే చనెన్
రావణ కుంభకర్ణులకు, రాముఁడు తమ్ముఁడు మామ వాలియే
వడువు=కుమారుడు; వైశ్రవణుడు=కుబేరుడు. ( కుబేరాయ వైశ్రవణాయ .. మంత్రపుష్పం)
(అగ్రజుడు మరియు వైరి అవుతాడు కుబేరుడు వీరికి- రావణ కుంభకర్ణులు, సీతకు అగు భర్త ఇతడు-రాముడు,
వానికిన్ (ఆ రామునికి) అగు సుమిత్రా వడువు-తమ్ముడు, వానికిన్ (ఆ రామునికి) ఏమగున్ మిథిలరాజు-మామ,
మరి ఎవడు వానిచే చనెన్ (చచ్చెను) –వాలియే.)
పొట్టనింపుకొనఁగ పూసిరి రంగులన్
రిప్లయితొలగించండిపగటి వేషమందు పరవశించి
పాత్రధారులెల్ల బంధువులే చూడ
రావణానుజుండు రాముఁడు కద
శరణు జొచ్చి రాము సామ్రాజ్య మేలెను
రిప్లయితొలగించండిరావణానుజుండు.రాముడు,కద
నమున గూల్చె రావణాది రక్కసులను,
వేల్పులెల్ల కుసుమ వృష్టి కురియ
వలదుయుద్ధమందు వారించె నన్నను
రిప్లయితొలగించండిరావణానుజుండు, రాముఁడు కద
రావణుని వధించి రణమునందున తాను
సీతచెరను బాపె శీఘ్రముగను
నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” నేక త్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
రిప్లయితొలగించండిఏ రూపమ్మును జెప్పె రాఘవుఁడు నే నీ యింతి దర్శించితి
న్నే రంగున్నుడివెన్ రఘూత్తముఁడు నే నీ కాంత వీక్షించితి
న్నే రీతిం దను లక్షణమ్ములనె నే నీ తన్వి నీక్షించితి
న్నే రామా మణిఁ జూడ వచ్చితినొ తా నీ భామ గా నోపునే
మూలము:
యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీవతీం చ నిశ్చితామ్ ...........................................৷৷5.31.15৷৷
అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితా మయా.
అత్యద్భుతం!!!
తొలగించండిసారూ:
తొలగించండిరోజుకొక పద్యం మీ సుందర కాండనుంచీ ఇచ్చట ప్రచురించి మమ్మానంద పరచెదరు గాక! నమస్సులు!
శాస్త్రి గారు నమస్సులు. ధన్యవాదములు. ప్రయత్నిస్తాను.
తొలగించండికామేశ్వర రావు గారు సుందరా కాండ పూర్తీ అయినందులకు సంతోషము. ప్రతి రోజు వీనులకు విందు చేయవలెను. అభినందనలతో
తొలగించండిమధురాతి మధురమైన మీ సుందరకాండతో మమ్మానందింప చేయ ప్రార్థన. 🙏🙏🙏
తొలగించండిపెద్దలు కామేశ్వరరావు గారికి నమస్సులు.మీరు వ్రాసిన సుందర కాండ దివ్యము గా గలదు. చాలా రోజుల
రిప్లయితొలగించండివరకు గుర్తుండే విధంగా రచించారు.పద్య రూ పము లో
ఆ భి నo ది o చా ల నీ వున్నా ఆ రో గ్యము సహకరించ లేదు
నారాయణ రావు గారు ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆ.వె:రాము నాశ్రయించి రాజ్యమందెను నాడు
రావణానుజుండు రాముఁడు కద
వానరముల దండు వారిధి కట్టంగ
వార్ధి దాటి చేసె బవర మపుడు.
ఆ.వె:కుంభకర్ణుడనగ కువలయమందున
రావణానుజుండు ,రాముఁడు కద
శివుని విల్లు విరచి సీతను పెండ్లాడి
ముదము కూర్చె సురలు మునుల కెల్ల.
ఆ.వె:హితము చెప్ప తాబహిష్కృతు డయ్యెనా
రావణానుజుండు రాముఁడు కద
రిపుని సైతమాదరించి రాజ్యమొసగి
మరలె పురికి తాను మహిజ గూడి.
ఆ.వె:బ్రహ్మ వరము నంది పగలు రేయి నిదుర
పోయి నట్టి వాడు పుడమి యందు
మర్కటముల గూడి మహిజనరసినది
రావణానుజుండు రాముఁడు కద.
ఆ.వె:అన్నతోడ పలికె నతివను విడుమంచు
రావణానుజుండు రాముఁడు కద
బవర మాచరించి పడతి సీతను కూడి
మరలి పురిని చేరి మహిని యేలె.
ఆ.వె:ధరణిజను విడుమని దశకంఠు తోపల్కె
రావణానుజుండు రాముఁడు కద
రాయియైనహల్య రమణిగ మార్చెను
త్రేత యందు తాను తేజ మలర.
ఆ విధుడిచ్చె నెవ్వరికి యక్కర త్రేతయుగ ప్రవేశమున్,
రిప్లయితొలగించండిదావము లోన శంబరము తారస మొందగ వెళ్ళెనెవ్వరో,
యా విజయుండు భీమునకు నగ్రజుడా యనుజుండ,దెల్పుమా,
పావకి కేమగున్ సిరికి భర్త యనీసుడు యెల్ల వేళలన్,
ఏవిభు దేందృనందనుడు ఈల్గెను రాముని తూపు తాకగన్.
రావణ కుంభకర్ణులకు, రాముఁడు, తమ్ముఁడు, మామ, వాలియే”
అన్నకిట్లు పలికె ననుచిత మిదియంచు
రిప్లయితొలగించండిరావణానుజుండు, రాముఁడు కద
రక్ష సేయు నిన్ను రమణి సీతమ్మను
విడిచి నిలుతువేని వినయమునను.
మందబుద్ధి యొకడు మాటల కున్నట్టి
రిప్లయితొలగించండియక్షరాల సమత లరసి పలికె
ర,రలు మొదట నుంట నురుతరోత్సాహాన
రావణానుజుండు రాముఁడు కద.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిదేవగణమ్ములన్ దునిమి దిక్కుల నెల్ల జయించియుండినన్
కావగలేరు బాంధవులు కాలము మూడిన వారి కెన్నడున్
భావన జేసి చూడగను భద్ధ విరోధుల వోలె దోచిరా
రావణ కుంభకర్ణులకు రాముఁడు, తమ్ముఁడు, మామ, వాలియే
వినుమాయీయదిమరిదు
రిప్లయితొలగించండిర్జనహననముజేయువాడెజనవంద్యుడగు
న్ననయముజెడునాలోచన
గనుచునుబాధించుగతనగాపురుషుండై
చేవగ శత్రులైరి గద చెన్నుగ లంకను యుద్ధమందునన్
రిప్లయితొలగించండిరావణ కుంభకర్ణులకు రాముఁడు, తమ్ముఁడు,;...మామ వాలియే
దీవెన లిచ్చె పావనికి దీటుగ నొల్లుచు నాకమందునన్
పావని మ్రొక్కగా మదిని ప్రాభవ మిమ్మని "అంకులంచుచున్"
అంకులు = uncle