5, సెప్టెంబర్ 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 47 (గు-రు-పూ-జ)

అంశము- ఉపాధ్యాయ దినోత్సవము
ఛందస్సు- తేటగీతి
స్యస్తాక్షరములు... 
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "గు - రు - పూ - జ" ఉండవలెను.

69 కామెంట్‌లు:

  1. గున్నమామిడిరూపమ్ము;వెన్నమనసు;
    రుజలు పోగొట్టు చల్లని రుచిరదృక్కు;
    పూజ్యతను పెంచు చక్కని పూతనడత;
    జన్మజన్మకు మరువము చదువులయ్య!

    రిప్లయితొలగించండి
  2. గుణనిధులనగ, విజ్ఞాన కోవిదులన
    రుచిర భాషణాలంకృత రోచమాన
    పూషులగు వారు గురువులె బోధ జేసి
    జడుని గూడ మార్తురు గద సజ్జనునిగ.

    రిప్లయితొలగించండి


  3. గుణములను తెలిపెనతడు గోము గాను
    రుక్కులను వల్లె వేయించె, రూఢి గాన
    పూను కొనికళలను నేర్పె పూర్తి గాను
    జయము గురువులకు జిలేబి జయతి జయతి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు


    1. తే.గీ. గురువు నేర్పు జీవన కళ గొప్ప గాను
      రుద్రునికి గురువు సమము ముద్ర గలదె?
      పూల పానుపు పరిచెను భువిని గురువు?
      జనని తదుపరి గురువె పూజార్హుడౌను.

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గుణముల ను బెంచు విద్యల న్ గోవిదుoడు
    రుజుపథం బు ల బోధించు న జుని వో లె
    పూజ నీయు డు గురువుకు మొక్కు లి డు చు
    జరుపవలె గురుపూ జ ప్రశస్తము గ ను

    రిప్లయితొలగించండి
  6. గురువు యన యొజ్జ, జనకుడు,మరియు సోద
    రుడు,గులమున బెద్దయును గురువు వసుధన,
    పూర్తి విద్యలు నొసగెడి బోధకులకు
    జనులు పండుగ ఘనముగ జరుపు నేడు

    రిప్లయితొలగించండి
  7. కవి మిత్రులకు నమస్కారములు నేను వ్రాసిన చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన అవీ ఇవీ వర్గములో
    గురువు గారు పెట్టినారు. ఒక్కసారి పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు ఇవ్వ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చతురంగబంధసీసము
      చతురతతోవ్రాసినట్టిసత్కవివర్యా!
      సతియగుశాంభవి మిమ్ముల
      సతతముగాపాడుగాక! సకలము నొసగీ

      తొలగించండి
  8. గురుతరమగు బాధ్యత తోడ నరుల కిలను
    రుచిర పథము బోధించెడు రుసులు, పరమ
    పూజ్యులై నిలిచిన బోధకులుగ
    జగతి వేల్పులౌ గురువుల సన్నుతింతు

    రిప్లయితొలగించండి
  9. న్వస్తాక్షరి గు,రు.పూ.జతేటగీతి పాదము మొదటిఅక్షరాలు
    గురువులౌదురు తలిదండ్రి గుప్తనిధులు|
    రుజువులుంచును గురువు యేరోజునైన|
    పూజ్యనీయులు మరచిన పుట్టిఫలమ?
    జన్మ సార్థకమౌ పూజ సలిపి నపుడె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *గు*రుతుగా జ్ఞానబోధల కొల్వుఁదీరి
      *రు*ద్ధ మంగళములఁగూర్చి రూకలమరు
      *పూ*జనీయపు విలువలు,పుణ్య విధులు,
      *జ*గతి మాకిడు సద్గురు సన్నుతింతు

      తొలగించండి
    2. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. గురువు చక్కగా విద్యను గరపునపుడు
    రుధిరముప్పొంగు సరియగు త్రోవఁ గనుచు
    పూజనీయులలో నొజ్జ ముఖ్యుడెపుడు
    జరుపు డీదినమున భక్తి గురువుపూజ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రెడ్డి గారు అలసతా కేవల సంస్కృత పదము. ఆ కారంత స్త్రీ లింగము. తత్సమము చేసినపుడు “అలసత” అవుతుంది.
      వావిళ్ళ వారి నిఘంటువు సంస్కృత నిఘంటువు.
      “అలసతా భావము” అని మరియొక సంస్కృత పదముతో గాని తత్సమము తో గాని సమాసము చేసిన సాధువు. లేనియెడల అలసత సాధువు.

      తొలగించండి

  11. గుహ్య విద్యల నేర్పుచు గూర్మితోడ
    రుజుపథంబున నడపుచు రూఢిగాను
    పూజ్యుడయ్యేను దైవంబు బోల్చగాను
    జగతి జక్కగ జరియించు జాడతెలుప!

    గుహ్య విద్యలు= విశ్వ నిర్మాణ రహస్యములు,Mysteries of the universe

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు! నమస్సులు!💐💐💐💐🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి

  13. గురువున కిత్తును నతులను
    గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం
    గురువునె మఱి పూజించిన
    గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

    శంకరుడు మొద లుకొనుచు శంక రార్యు
    లనడుమగలుగు గురువు ల లహరి నుండి
    నాదు గురుపరం పరలకు నతుల నిడుదు
    శతము కొలదిని భక్తిని సవిన యముగ

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

    గురువు గోవిందు చిరునామ నెరుక పరచి
    రుగ్మత నెఱిగి జ్ఞానమ్ము ప్రోగుపడఁగ
    పూని బోధించు శిష్యుడు మోదమంద
    జన్మఁ దరియింపఁ జేసెడు స్వామియౌచు

    రిప్లయితొలగించండి
  15. గురువు కలిగించు నుత్తమ గుణము లనిల
    రుచిర వాక్కుల నిరతము రోత లేక
    పూజ జేయుడు నుత్సవ ముపగిదినిక
    జపతపంబులనొప్పెడు చైత్య మతడు

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు లెంచెడి సూక్తులు గురుతెఱుగుచు
    రుచ్యమౌ వాటి ఘనత పలుకుచు నుండి
    పూజ్యుడవగుచు మెఱయుము పుడమి యందు
    జన్మ చరితార్థ మవ్వంగ సంతతమ్ము

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.

    గురువన నెటులుండ వలెనొ కువల
    యాన
    రుజువు చేసె రాధాకృష్ణ నిజము ; నట్టి

    పూజ్య గురువుల సేవించి పూజ సలిపి

    జగతి సంతసంబిడరె యొజ్జలకు నేడు.

    రిప్లయితొలగించండి
  18. గురుతరజ్ఞాన పూజనీయ రమణీయ
    రుగ్వదన దయా పూరి తోరు జల నయన
    పూజ తర్పితహ్లాదప్రపూర్ణ హృదయ
    జగదఖిల జన యుక్తము సు గురుపూజ



    (గు)(రు)తరజ్ఞాన (పూజ)నీయ రమణీయ
    (రు)గ్వదన దయా (పూ)రి తోరు (జ)ల నయన
    (పూ)(జ) తర్పితహ్లాదప్రపూర్ణ హృదయ
    (జ)గదఖిల జన యుక్తము సు (గురుపూజ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      శబ్దాలతో ఆడుకొంటున్నారు. మీ బహుముఖ ప్రజ్ఞకు జోహారులు. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యపూర్వ ప్రశంసల కర్హుఁడ నైనందులకు ధన్యుఁడ నయ్యాను. ధన్యవాదములు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారికి నమస్కారములు అద్భుతం అసామాన్యo జోహారులు

      తొలగించండి
  19. గురు వరులను బూజించుము గురవె తగు తె
    రువు, గురిని, జూపుచు ధర నరులకు బరి
    పూర్ణ చదువు సంపద నిడు, పూజ్యుడతడు
    జగమున గురువే దైవము ఛాత్రలకును.

    రిప్లయితొలగించండి
  20. గుసగుసలు క్లాసునందున గోలలవగ
    రుసరుస బుసబుసలు లేక రోజు రోజు
    పూసగ్రుచ్చుచు పాఠము బోధ జేసి
    జరుగుబాటుకు బ్రతికెడి గురువు గొలుతు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా!

      నన్ను హనుమచ్ఛాస్త్రి అని సంబోధించి కృతార్థునిగ చేసితిరి. గోలి వారిని గుంటూరులో కలిసిన ప్రభావమనుకుంటాను.

      ...ప్రభాకర శాస్త్రి

      👏👏👏👏

      తొలగించండి
  21. (గు)రుని సర్వోన్నతత్వంబు నిరుపమముగ
    (రు)చిర గతినెంచి సన్మాన రచన చేసి
    (పూ)జ లందించు కాలమ్ము పుడమి లోన
    (జ)యము ఛాత్రుల కందెడు సమయ మిదియె.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

    గురువు గోవిందు చిరునామ నెరుక పరచి
    రుగ్మత నెఱిగి జ్ఞానమ్ము ప్రోగుపడఁగ
    పూని బోధించు శిష్యుడు మోదమంద
    జన్మఁ దరియింపఁ జేసెడు స్వామియౌచు

    రిప్లయితొలగించండి
  23. గురువు లక్షర చినుకులు గురియజేయ?
    రుక్కునీయందు భావాలు రూపు గూర్చ|
    పూల పులకింతలా విద్యబుద్దికొసగు
    జగతి గురువర్యులేలేక ప్రగతి లేదు|
    3.గురువు సద్గురు వైనచో?మరువకెపుడు
    రుణముదీరును దండాలె రొక్కమనును|
    పూతు డైనచొ?పూజించు పుణ్య మబ్బు|
    జగతి జనులకు జాగృతి జరుపు గురువె|


    రిప్లయితొలగించండి
  24. గుహ్య తరమైన విద్యలు గోచరింప
    రుచిర వ్యాఖ్యల వివరించి రూపొసంగు
    పూర్ణ విద్వాంసుడిహపర ములకు రక్ష
    జన్మరాహిత్య పథమున సవిత యతడు

    రిప్లయితొలగించండి
  25. గురువు నాశ్రయించి పరము గూర్చి దలతు
    రు మనమున యార్తి గల్గియు లోకు లెల్ల
    పూర్ణ భక్తిని జూపియు పూజలిడగ
    జన్మ రాహిత్యమును వొంద శక్యమగును

    రిప్లయితొలగించండి
  26. (గు-రు-పూ-జ)
    అంశము- ఉపాధ్యాయ దినోత్సవము

    గుర్తెఱుంగుచు - మహనీయు గుణవరిష్ఠు
    రుచిర భాషాప్రయుక్తు సద్వచన కీర్తు
    పూజితాంఘ్రిద్వయుండు వాక్భూషణుండు
    జయమునందించు - గురువుల స్తవము జేతు.

    రిప్లయితొలగించండి
  27. .......పూజ్య గురుదేవుల పాదపద్మములకు ప్రణమిల్లుతు..

    గురుతరంబగు విద్యను కూర్మితోడ
    రుచ్యమగు బాషణమున నెఱుకపరచెడు
    పూజ్యగురుదేవులందరిన్ భూరిగొలిచి
    జగతి గురుపూజ పర్వమున్ జరుపవలయు!!!

    రిప్లయితొలగించండి
  28. మిత్రులందఱకు గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు!

    గురుతరోన్నత గుణములు గుఱుతెఱుఁగఁగ,
    రుచిరమైనట్టి బోధ నెఱుఁగుచునుండ,
    పూతచరితమ్ము నాదర్శముగ గ్రహింప,
    యములందింత్రు గురువులు స్వయముగాను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🌷మిత్రులందఱకు గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు!🌷

      గురుతరోన్నత గుణముల గుఱుతెఱుఁగఁగ,
      రుచిరమైనట్టి బోధ నెఱుఁగుచునుండ,
      పూతచరితమ్ము నాదర్శముగ గ్రహింప,
      యములందింత్రు గురువులు స్వయముగాను!

      స్వస్తి

      తొలగించండి
    2. మధురకవి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి



  29. గుణము లనిటు దెలుపు గురువు తానెప్పుడు

    రుచిర మైన సూక్తి రోజు గరుపు

    పూజ్యనీయుడగుచు పుడమిలో జనులకు

    జయము కూర్చు చుండు సతతమితడు.


    గురువు నేర్పు నెపుడు గుహ్యమౌ పాఠముల్

    రుగ్మతలను బాపు రోజు విన్న

    పూని నేర్చు కొన్న పుడమిలో శుభమగు

    జడత తగ్గి పోవు జయము కల్గు.

    గురువటన్న మన కెపుడు గురిని చూపు

    రుజలు బాపెడి విద్యగరుపుసతమ్ము

    పూటపూటకు  పాఠాలు బోధ చేసి

    జనని వోలెచూపుచునుండు సహనమును.


    గురువు  పంచు విద్యలనెల్ల కూర్మితోడ

    రుతము తోడ నేర్పు చదువుసతము తాను

    పూవులు ఫలముల నొసగి పూజించగారండు

    జయము కలుగుట సత్యమ్ము జగతి యందు.


    గురువన త్రిమూర్తి రూపము గుర్తించుడయ

    రుషివలె బోధించు సతతము రుతము తోడ

    పూజ్యనీయుడౌ ముల్లోకములరయంగ

    జగతి లోని జనులితని సన్నుతింత్రు.

    రిప్లయితొలగించండి