18, సెప్టెంబర్ 2017, సోమవారం

సమస్య - 2467 (మల్లెలు గడు నల్లనయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్"
(లేదా...)
"మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే"
(డా. దేవరపల్లి ప్రభుదాస్ గారికి ధన్యవాదాలతో...)

61 కామెంట్‌లు:

 1. గొల్లడు గోకులము విడిచి
  చల్లగ ద్వారకను జేర ఝల్లన గుండెల్
  పిల్లన గ్రోవియు మ్రోగక
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్

  రిప్లయితొలగించు


 2. పిల్లా ! నిట్టూర్పుల వే
  డల్లా యెగదోయకమ్మ! రావం బగుచున్
  తల్లజ వడగాడ్పులగుచు
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్!

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేడి+అల్లా' అన్నపుడు సంధి లేదు. 'అల్లా' అనడం సాధువు కాదు.

   తొలగించు
 3. కల్లాకపటము లెరుగని
  చెల్లెలు గొట్టము చకచక చేకొని యూదన్
  పెల్లుగ చేతికి పొగయై
  మల్లెలు గడునల్లనయ్యె మాలలుగట్టన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కల్లాకపటములు' అనడం వ్యావహారికం. "కల్లయు కపటము లెరుగని' అందామా?

   తొలగించు
 4. అల్లిన మల్లెల మాలలు
  చెల్లునె విఫణిని కొనంగ? ,చేమంతులతో
  నల్లుమనుచునే నిచ్చితి
  మల్లెలుగడు, నల్లనయ్యె మాలలు గట్టన్.

  రిప్లయితొలగించు
 5. చల్లని వెన్నెల రాతిరి
  పిల్లన గ్రోవిని వినక విరహము నొంద
  న్నుల్లము క్రోధము చెందగ
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్

  రిప్లయితొలగించు
 6. చల్లని నీటి బిందువుల జల్లుచు నుండిన మాటిమాటికిన్
  తెల్లగనుండు మల్లియలు దివ్యసుగంధము నిండి పోవుగా
  నిల్లునుఁ నెండలో వదలి యెక్కువ కాలము చూడకుండినన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే?

  రిప్లయితొలగించు
 7. శ్రీగురుభ్యోనమః

  అల్లన పూలసజ్జ గొని యాతురతో విరి దోట జేరి యా
  చల్లని సంధ్యవేళ పలు జాతుల పూవుల సేకరించగా
  భళ్ళున ప్రొద్దు గ్రుంకినది పశ్చిమమందున చిమ్మ జీకటిన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే

  రిప్లయితొలగించు


 8. ఘల్లన గుండెజారెననఘా! మది తూగగ రేయి చంద్రునిన్
  తల్లజ మైనకాంతిగని తామరకంటి నిడూర్పు లన్నటన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే
  కల్లయు కాదు చిత్తరువు గాదు సుమా మధురాపతిన్ గనన్!

  జిలేబి

  రిప్లయితొలగించు
 9. నల్లని రాముని ఛాయయె
  తెల్లని కుసుమాలలోన దీప్తిని బొందన్
  చల్లని జానకి కరముల
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్

  రిప్లయితొలగించు
 10. కల్లాకపటం బెరుగక
  నుల్లాసంబుగ బడిజన నూహించకనే
  ప్రల్లదుడే యొజ్జయవగ
  మల్లెలు కడు నల్లనయ్యె మాలలు గట్టన్!

  రిప్లయితొలగించు
 11. మెల్లగ కాళీయునిపై
  నల్లనివాడెక్కిత్రొక్క నా బుసల సెగన్
  అల్లన తటిపై తీగెకు
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్.

  రిప్లయితొలగించు
 12. అల్లదె వింతగ నుండెను
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలుగట్ట
  న్నల్లటి దారము వాడిన
  దెల్లగనే మల్లెలుండు దేవర పల్లీ !

  రిప్లయితొలగించు
 13. రిప్లయిలు
  1. టైపాటు సవరణతో

   మల్లెల కంటదు కులమని
   యెల్లరికి నెరుక పరచఁగ నిచ్చితి గట్టన్
   కల్లయె? చూడుమదెక్కడ
   మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్?

   తొలగించు
 14. పిల్లల క్రీడా స్థలమున
  మిల్లున కీశాన్యమందు మిద్దెల నడుమన్
  దల్లీ! యుండుటచే నీ
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించు
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అల్లన జమ్మును బట్టుచు
  నల్లుకు పెరిగిన కుటజపు యలరుల గుత్తుల్
  అల్లోనేరెడుల తడవి
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్
  (జమ్ము= నేరేడుచెట్టు)


  రిప్లయితొలగించు
 16. అల్లదె యెండ వేడిమికి యావిరి యుండగ తాళలేక యా
  మల్లెలు నల్లబారినవి ,మాలల నల్లెడి వేళచిత్రమే
  యుల్లము సంతసిల్లగ నట యోమ్మనునా దము శోత్రపేయమై
  మెల్లగ మేనుకు న్దగుల మేదురమై యది హాయిగొల్పెడిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వేడిమికి నావిరి... సంతసిల్ల నట నోమ్మను .." అనండి.

   తొలగించు
 17. మెల్లనఁ జేరి చిరు నగవు
  లల్లన ముఖ మందు నుంచి యా సరసములౌ
  సల్లాపమ్ములఁ గృష్ణుఁడు
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్


  “నల్లఁబాఱు” సాధువని తలచి చేసిన పూరణ:

  పల్లవ కోమ లాంగులు సబాంధవ మిత్ర నికాయ యుక్తలై
  యుల్లము సంతసించగ యధోచిత కార్య నిమగ్నలై చనన్
  ఝల్లు మనంగ వీచగను జంచల మంతట భీకరమ్ముగన్
  మల్లెలు నల్లఁ బాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే?

  [మల్లెలున్ + అల్ల = మల్లెలు నల్ల]

  రిప్లయితొలగించు
 18. ఉల్లము నన్ పతిని తలచి
  అల్లన తానె దు రు జూచి ఆరాట పడే న్
  తెల్లని విరుల వి వాడగ
  మల్లెలు కడు నల్లనయ్యే మాలలు కట్ట న్

  రిప్లయితొలగించు
 19. కొల్లలుగ దెచ్చి పూలను
  చల్లదనపు పెట్టెలోన జతనము పరచన్
  జెల్లెను కరెంటు, యకటా
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్"

  పూలు అమ్ము వాడు దండిగా కొని శేతలీకరణము కొరకు ప్రిజ్లొ బెట్ట కరెంటు గంటల దరబడి పోయిన కారణమున మల్లెలు నల్ల బడెను అను భావన

  రిప్లయితొలగించు
 20. ఇల్లాలిచె మాంత్రికుడనె
  మల్లెలు గడు నల్లనయ్యె|మాలలు గట్టన్
  కల్లాకపటము నీలో
  నల్లిన?నవి రంగుమారు నదియొక గుర్తే|
  2.”కుళ్ళు కుతంత్రముల్ నడుమకూరుకు బోయినమానవత్వమై
  మల్లెలు నల్లబారినవి”|మాలలు నల్లెడి వేళ చిత్రమే
  చెల్లుచు నుండె నేడు మనచెంతన కల్తివిశేష లాభముల్
  నల్లెడి కల్లలే మనిషి హాయికి మూలమటంచునెంచుమా.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'ఇల్లాలిచె' అని 'చే' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'లాభముల్+అల్లెడి' అన్నపుడు నుగాగమం రాదు.

   తొలగించు

 21. చల్ల యనుకొని భ్రమపడియు
  కల్లును ముంతల కొలదిగ గడు ద్రావితివా?
  కల్ల !యిది నమ్మ నెక్కడి
  "మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్?"

  రిప్లయితొలగించు
 22. చల్లగ జేయును వేసవి
  యెల్లరు గోపికల మదుల నెవ్వడు దోచె
  న్నుల్లము రంజిలె వనితలు
  మల్లెలు గడు; నల్లనయ్యె; మాలలు గట్టన్.
  అన్వయము :
  మల్లెలు వేసవిని గడు జల్లగ జేయును
  అందరు గోపికల మనసులను నల్లనయ్యె (కృష్ణుడె) దోచెను
  మగువలు మాలలు గట్టగ మనసు రంజిల్లెను.

  రిప్లయితొలగించు
 23. చల్లనివేళతలంచగ
  నుల్లమునందునను రాధ యుత్సాహముతో
  నల్లనివాని కనుకలిన్
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్

  రిప్లయితొలగించు
 24. పిల్లనగ్రోవి న్నూదుచు
  నల్లన తమ చూపులందు నమరుచు కృష్ణుం
  డొల్లమి, గోపిక లూనెడి
  మల్లెలు గడునల్లనయ్యె మాలలు గట్టన్!

  రిప్లయితొలగించు
 25. చల్లని దండ్రి రాముడట సత్య పరాక్రమశాలి నవ్వు రా
  జిల్లెడు మోమువాడు ఘనశీలుడు బట్టము గట్టువేళలో
  విల్లును చేతబూని రఘువీరుడు కానల కేగె నింతితోన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే

  రిప్లయితొలగించు


 26. పిల్లా ! నిడూర్పులు వలదు!
  చల్లని గాలి తమకమున చవచవ యగుచున్
  తల్లజ వడగాడ్పులగుచు
  మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్!

  జిలేబి

  రిప్లయితొలగించు
 27. నల్లనివానిని కొలువగ
  తెల్లని హృదయమ్ము భక్తి,తేకువ చాలున్
  నల్ల్లగ మారెద మనుచును]
  మల్లెలు గడు నల్ల నయ్యె మాలలు గట్టన్

  రిప్లయితొలగించు
 28. మొదటి కవి : " ఇంతకూ రాముడికి సీతే మౌతుంది?"
  రెండవ కవి : " ఏమౌతుంది? కూతురౌతుంది."
  మొదటి కవి : "అదెలా?"
  రెండవ కవి : " కృత యుగంలో వరాహావతారమెత్తి భూదేవిని చేపట్టి క్షితిపతి అయ్యాడు కదా శ్రీహరి ! మళ్ళీ త్రేతా యుగంలో రామావతారమెత్తి శ్రీదేవిని చేపట్టి లక్ష్మీపతి అయ్యాడు కదా! భూదేవి కూతురే కదా శ్రీదేవి! తన భార్య కూతురు తన కూతురు కాక మరేమౌతుంది?"
  ఈ అంశాన్ని ఒక అవధాన సభలో శతావధాని సీ.వీ. సుబ్బన్న గారికి సమస్యగా యిచ్చి పూరణ చేయ మన్నారు.
  ఆ సమస్య ఇది:
  "తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్."
  తల్లికీ కూతురికీ మగడయితే అపకీర్తి వస్తుంది కానీ సత్కీర్తి ఎలా వస్తుంది? అన్న దానికి :
  అపుడాయన :
  కం. అల్లన కిటియై ధరణిన్
  విల్లు విఱిచి సీత నేలి ప్రేమకళాసం
  పల్లీల విష్ణు దేవుడు
  "తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్."
  అని పూరించాడు. యుగాంతరమున, జన్మాంతరమున ,దేహాంతరమున జరిగిన సంబంధ, బాంధవ్యములివి, కావున దోషము లేదు అని వివరించాడు.  రిప్లయితొలగించు
 29. అల్లన బొట్టుఁ బెట్టుకొన నానక కుంకుమ జారెనేలనో!
  భల్లున నారిపోయె భగవానుని సన్నిధి వెల్గు దివ్వెలున్!
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే!
  తల్లట పెట్టె మానసము ధాటిగ మీరలు యుద్ధమన్నచో !

  రిప్లయితొలగించు
 30. కల్లును బిర్యనిన్ నగదు కాంగ్రెసు నేతటు పంచి నవ్వగా
  జిల్లున వచ్చెనే కబురు చిత్తుగ నోడెను తానటంచుచున్
  చెల్లెలు కోడలున్ వదిన చేతులు మాడగ తల్లడింపునన్
  మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే!

  రిప్లయితొలగించు