25, సెప్టెంబర్ 2017, సోమవారం

సమస్య - 2474 (సవతి లేని యింట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సవతి లేని యింట సౌరు లేదు"
(లేదా...)
"సవతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

41 కామెంట్‌లు:

 1. ధనము లేని నాడు దారిద్ర్యమే గల్గు
  మనుగడెట్లు సాగు మానవునకు
  హరికి మొదటి భార్య యగు జేష్ట దేవికి
  "సవతి లేని యింట సౌరు లేదు"

  రిప్లయితొలగించండి
 2. త్రాసులోన తూచి
  తన్మయత్వమ్మును
  పారిజాతమడిగి పరవశమ్ము
  సత్యభామ తెచ్చె స్వర్గసుఖమ్మును
  సవతి లేని యింట సౌరు లేదు

  రిప్లయితొలగించండి
 3. శాంతి సౌఖ్యమలరు సౌభాగ్యమే జేరు
  సవతి లేని యింట, సౌరు లేదు
  తిరుగు బోతు భర్త , తరుణికి యనుమాన
  మున్నయింట నిజమె యుర్వియందు.

  రిప్లయితొలగించండి
 4. శాంతి సౌఖ్యమలరు సౌభాగ్యమే జేరు
  సవతి లేని యింట, సౌరు లేదు
  తిరుగు బోతు భర్త , తరుణికి యనుమాన
  మున్నయింట నిజమె యుర్వియందు.

  రిప్లయితొలగించండి


 5. మానవతియు లేని మగనికి లేదు సు
  ఖము! వనిత, జిలేబి కమ్మ గాను
  వంట జేయ నేర్వ వలెనోయి, వినవె ర
  సవతి లేని యింట సౌరు లేదు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. రాళ్ళురప్పలున్న రాయలరాజ్యము
  వానచుక్కలేక వట్టిపోవ
  మొక్కజొన్నపండ ముక్కంటి నాలికి
  సవతిలేని యింట సౌరులేదు!

  రిప్లయితొలగించండి
 7. భువనములన్ని బ్రోచు మహిమోన్నతుడైన మహేశ్వరుండు తా
  భవితము పండగా నిటుల పార్వతియున్నటు గంగ భార్యలై
  తవిలి సుఖంబునందె,పెడదారులుఁద్రొక్కిరె వారలించుకన్!
  సవతియె లేని గేహమున సౌరుఁగనంబడదెన్నియుండినన్

  రిప్లయితొలగించండి
 8. ఆలి లేని యింట యారిపోయిన వంట
  మందు కొట్టి నంత మగువ లేక
  యేది లేక మనుగ డేరీతి కొనసాగు
  సవతి లేని యింట సౌరు లేదు
  -------------------------
  వినర వినర నరుడ వెలది చరిత

  రిప్లయితొలగించండి
 9. వన్నెచిన్నెలున్న వాల్గంటి మీనాక్షి
  సరసవాక్కుతోడ జక్కగాను
  నవ్వుచెదరనీక నాధుగెల్చెడి సర
  సవతి లేనియింట సౌరులేదు!

  రిప్లయితొలగించండి


 10. వివరముగానుమోయి ఘనవీరులు శూరులు యెంత జన్యముల్
  పవరము లెల్ల జేయగను పాగెము గాంచుచు కొంత యైన నౌ
  సవనము జేయ మేలగును సౌమ్యము చేవయుగాన, జ్యేష్టకున్,
  సవతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్

  జిలేబి

  రిప్లయితొలగించండి

 11. కోట్లు ఖర్చు చేసి కువలయమందున
  గొప్ప యిల్లు గట్టి కూర్మి తోడ
  వండి పెట్టుటకిట బాగైన మంచి,ర
  సవతి లేని యింట సౌరు లేదు.
  రసవతి=వంటయిల్లు


  రిప్లయితొలగించండి
 12. సత్యవాక్కు వలన సర్వత్ర వ్యాపించె
  పారిజాతకావ్యపరిమళమ్ము;
  సరసవీరకాంత సాత్రాజితిని బోలు
  సవతి లేని యింట సౌరు లేదు.

  రిప్లయితొలగించండి
 13. అరుగులన్ని కవుల నాసనములు కాగ
  కవనగోష్టి గృహము కాంతి నింప
  పలుకు ముద్దరాలు పంచెడి సాహిత్య
  సవతి లేని యింట సౌరు లేదు

  రిప్లయితొలగించండి
 14. అరుగులన్ని కవుల నాసనములు కాగ
  కవనగోష్టి గృహము కాంతి నింప
  పలుకు ముద్దరాలు పంచెడి సాహిత్య
  సవతి లేని యింట సౌరు లేదు

  రిప్లయితొలగించండి
 15. ధరణిని తనువునను బరగఁగ ముప్పాల్లు
  శుచియు శుభ్రతలును రుచులు వండ 
  పృథ్విఁ దప్పనట్టి యివపుగుబ్బలిబిడ్డ
  సవతి లేని యింట సౌరు లేదు.

  (ఇవపుగుబ్బలిబిడ్డసవతి =గంగ=నీరు)

  రిప్లయితొలగించండి
 16. జీవనమ్ముసాగు జేజీయమానమై
  సవతిలేనియింట,సౌరులేదు
  చెట్లుచేమతోడచీకాకుగానుండు
  కారణంబు వలనకాంత గృహము

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పేర్మి ప్రవలు చుండు బిరుసైన రీతిని
  సవతి లేని యింట; సౌరు లేదు
  ప్రేమ పంచనట్టి ప్రేయసి నుండని
  నిలయ మందు పతికి నిజము గాను

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులకు నమస్కృతులు. మూడు రోజుల పాటు నేను సమూహానికి అందుబాటులో ఉండక పోవచ్చు. మా మిత్రుని గ్రామానికి వెళ్తున్నాను. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవన్నాడు. అంటే ఇంటర్ నెట్ సౌకర్యం ఉండదు. కనుక మీ పద్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించలేను. నాలుగు రోజుల సమస్యలను బ్లాగులో షెడ్యూల్ చెసి వెళ్తున్నాను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి


 19. అంతర్జాలంబచటన్
  కొంతయు లేదు కవులార కోరితి మిమ్మున్
  చెంతన జేర్చిన పద్యపు
  పొంతన పొసగులను జూచి పొంకము గనుడీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంతులు ప్రౌఢలు ముదుసలి
   పంతుళ్ళీ పంచ జేరి పండుగ జేతుర్
   పంతము లేల జిలేబీ
   వంతలు కడుదెల్ప గలరు వంకల తోడన్

   తొలగించండి
 20. ఆ.వె గంగ ఝరుల సౌరు గాంధర్వ మదియన్న
  పార్వతమ్మ సవతి పారు గంగ
  సత్య భామ సౌరు సాగేను యాయింట
  సవతి లేని యింట సౌరు లేదు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 21. పామ రుండొ కండు పలికె నీ తీరుగ
  గుణము గలుగు నామె గుణవతియగు
  సరస మెరుగు యువతి సరస వతియె ;సర
  "సవతి లేని యింట సౌరు లేదు"

  రిప్లయితొలగించండి
 22. ………………………………….....
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  సవతి లేని యి౦ట సౌరు లేదని వాస్తు

  పుస్తకమ్ము న౦దు ముద్రిత మయె |

  ' వసతి ' యను పదము ' సవతి ' యని పడె

  " అప్పు తచ్చు " మహిమ యద్భుతమ్ము

  రిప్లయితొలగించండి
 23. రూపవతి గుణవతి కోప తాప విహీన
  చారుదతి విమల విచార సుమతి
  పుత్రవతియు ధైర్య పూరిత పటుసాహ
  సవతి లేని యింట సౌరు లేదు

  అవసరమున్న కాలమున నాపద లావృత మైన వేళలన్
  వివరము లెంచ కుండ సవివేక మనమ్మున ధైర్య మూనెడిన్
  సవినయ రాగ భక్తిమయ సౌమ్య సుభాషణ యుక్త సద్విలా
  సవతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్

  [వివరము = దూషణము]

  రిప్లయితొలగించండి
 24. సకల శాస్త్ర ములను చక్కగా చదివియు
  జ్ఞాన మంత పొంది జగతి నందు
  వరలు చున్న ను, గుణ వతి సతి యగు వికా
  సవతి లేని యింట సౌరు లేదు

  రిప్లయితొలగించండి
 25. సుమతి యెపుడు యెచట సుఖమును బడయును,
  నాడు కంస పురమున తిరుగాడు
  వామనయన కుబ్జ కేమి లోపించెను
  సవతి లేని యింట, సౌరు లేదు"

  రిప్లయితొలగించండి
 26. మూడు ముళ్ళచేతముప్పుతిప్పలు| “పతి
  యారుముళ్ళు వేయ?నల్పుడగును”|
  సవతిలేనియింట సౌరులేదనలేరు
  హరి,హరులకథల మరువతరమ?
  2.భవనములుండవచ్చు బహుభార్యలు గల్గిన భానిసత్వమే|
  అవసర మైనయాలి మరియాదలుబెంచును “భార్యకెప్పుడున్
  సవతియు లేని గేహమున సౌరు గనంబడ”|దెన్నియుండినన్
  దివియని యెంచ రెవ్వరును దెప్పరముల్ గొలువౌను కొంపలో|

  రిప్లయితొలగించండి
 27. భర్తసేవనముల పారవశ్యతఁగొంచు
  ముద్దముద్ద కొక్క ముద్దునిడుచు
  స్వర్గసుఖము లిచ్చు చక్కనిదౌవిలా
  సవతిలేని యింట సౌరులేదు

  రిప్లయితొలగించండి
 28. అవనిని భర్త దైవసముడంచుతలంచుచుసేవనమ్ముల
  న్నవిరళభక్తిభావమున నర్మిలిచేయుచు సంతసమ్ముతో
  డవిరహమున్ శమించుచును డంబముఁ జూపని ముగ్ధయౌ విలా
  సవతియె లేని గేహమున సౌరు గనంబడదెన్ని యుండినన్

  రిప్లయితొలగించండి 29. కలహమన్నదేది కనపడదిలలోన

  సవతి లేని యింట;సౌరు లేదు

  నన్నదమ్ముల నడుమ నాప్యాయతలు మృగ్య

  మైన,ననుచు నుందు రార్యు లెపుడు.

  రిప్లయితొలగించండి
 30. "దివి దిగె పారిజాతమది తీర్చెను కృష్ణుడు రుక్మిణీ జడన్"
  వివరమిదంచు నారదుడు వేడుక జూడఁగ జెప్పి సత్యకున్
  చివరకు త్రాసునన్ హరిని చేర్చఁగ నిట్లనె ప్రక్కఁజూచుచున్
  "సవతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్ "

  రిప్లయితొలగించండి
 31. సవతుల పోరు దీర్చగను జాలరు ఈశుడు,వెంకటేశులున్
  అవసరమౌను యోర్మియని యా పరమేశుడు మౌన మూనగన్
  పవరము దీర్చలేక హరి బండగ మారెను పల్క జెల్లునే
  సవతియె లేని గేహమున సౌరు గనంబడదెన్ని యుండినన్

  రిప్లయితొలగించండి

 32. పిన్నక నాగేశ్వరరావు.

  పెద్దవారి గౌరవించుచు సతతము

  పిల్లల యెడనెపుడు ప్రీతి గలిగి

  భర్తకు ననుకూలవతిగ వర్తిలు సర

  స వతి లేని యింట సౌరు లేదు.

  రిప్లయితొలగించండి
 33. సవతి లేని యింట సౌరు లేదనుచును
  సవతి తెచ్చినాడు చవట యొకడు
  కటకటాల వెనుక కాలము గడపెను
  చిప్పకూడుతినగ తప్పదయ్యె

  రిప్లయితొలగించండి
 34. మనసు నిండ ప్రేమ మాధురి బంచగ
  మమతలు నెలకొనగ క్రమత తోడ
  విమల భావ మమరి వెలుగొందగాన్ సర
  సవతి లేని యింట సౌరు లేదు!

  రిప్లయితొలగించండి
 35. డా.పిట్టా
  పుంసవనముజేసి పుట్టింటి కంపగ
  పోదు కోడ లత్త పొంచుల1గని
  వాడు మగాడవ వచ్చు నింతియ యూహ
  సవతి లేని యింట సౌరు లేదు!
  1చాటు మాటలు.
  అత్తల ఎత్తి పొడుపు మాటలలో"మా వాడు మగవాడు,ఎందరినైనా కూడ వచ్చు"అనడం వల్ల కోడలి యూహలలో సవతి మెదలుతుంది.అలా అత్తలనని యింటిలో సౌరు లేదు.అంటే యీవిధంగా అందరూ కోడండ్రను భయపెట్టేవారే అని ధ్వని.

  రిప్లయితొలగించండి 36. సమయమునకు నన్ని సరిగా నమర్చుచు

            నలసతయును చూప కనవరతము

            ముదమును కలిగించి ముచ్చటించెడి సర

               సవతి లేని యింట సౌరు లేదు.

  రిప్లయితొలగించండి
 37. డా.పిట్టా
  సవరణ జేయ నత్త యొక చక్కని యూహను జెప్పవచ్చు నే
  వివరణనైన పుత్రునకు వీగగ జేసెడి యుక్తు1లేలకో
  "జవమున నిద్దరిన్ గొనగ జాలును వాడన" గోడలమ్మకున్
  సవతియె లేని గేహమున2 సౌరు గనంబడ దెన్ని యుండినన్
  1ఉక్తులు,ఉపాయములు,ఏడిపించడాలు
  2. "మావాడు మగాడు, ఎందరినైనా కూడవచ్చు" అని సాటి స్త్రీ యైన కోడలిని...బెదిరించని యిల్లది కూడా ఒక అందమైన యిల్లేనా?" అనే సాధారణీకరణ.

  రిప్లయితొలగించండి