7, సెప్టెంబర్ 2017, గురువారం

సమస్య - 2457 (పండితులు వసింపని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పండితులు వసింపని ధర పావనము గదా"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

  1. చండతరంబగు ప్రతిభా
    మండితులై వర్ధిలగల మతిమంతులనే
    ఖండించెడి దుర్మార్గపు
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  2. మెండుగ గరుడ పురాణము
    కొండొక కొక్కోక మందు కోవిదులవగా
    మొండిగ జగడము లాడెడి
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  3. దండియు భారవి వలెనే
    పాండిత్య మపారమైన ప్రాజ్ఞత కరువై
    మెండుగ సంకుచితము గల
    పండితులు వసింపని ధర పావనమౌగా

    రిప్లయితొలగించండి
  4. వేష భూషల నొప్పుచు భాషయందు
    లేశమంతైన జ్ఞానము లేని వారు
    నెంచ శుష్క" పండితులు వసింపని ధర
    పావనము గదా!" యందురు ప్రాజ్ఞు లెపుడు.

    రిప్లయితొలగించండి


  5. దండగ పదముల గుచ్చుచు
    చెండుల విసిరి పనిమాలి చెకచెక యనుచున్
    దండగ తిరిగెడు కుహనా
    పండితులు వసింపని ధర పావనము గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 16) అభేద ప్రాస -
      ‘లళయో రభేదః, లడయో రభేదః’ అనే సూత్రాల వలన లళడలు అభేదాలు కనుక వానికి పరస్పరం ప్రాసమైత్రి చెల్లుతుంది.
      ఉదా.
      (అ). కేళీ ...., ప్రాలేయాచల .... నిద్రవో, వే లావణ్య ..., జోల (రాజశేఖర చరిత్ర. 2-4)
      (ఆ). పాలును ... వా, హ్యాళి ...., బాల ... ప్రో, యాలు ... (రామాభ్యుదయము. 1-8)
      (ఇ).
      ప్రల్లద మేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రితుల్యుఁడై
      త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము ... (భార. సభా. 2-69)
      (ఈ).
      కొడుకులుఁ దానును గుఱ్ఱపు
      దళములఁ గరిఘటల భటరథవ్రాతములం ... (భార. ఉద్యో. 1-220)
      (ఉ). జలనిధి ..., వెడలి ...., కడు ....తన, రెడు ... (ప్రభావతీప్రద్యుమ్నము. 1-57)

      ల ర లకు యతి మైత్రి కలదు కాని ప్రాస మైత్రి లేదెందుకనో.

      తొలగించండి

    2. పోచిరాజు వారు

      నెనర్లు !

      లేదెందుకనో అన్నారు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉందనుకొని ప్రొసీడ్ అయిపోతా :)

      ఈ ఛందంలో దిగేకొద్దీ మరీ మరీ దీని లోతులు మేథమేటిక్స్ లా డీప్ గా వెళ్ళిపోతోంది!

      హేట్స్ ఆఫ్ (దుపట్టా ఆఫ్ :) ) - ఆ కాలపు కవులకు వ్యాకరణ పండితులకు ఛందాన్ని ద్రష్ట గా చూసిన ఋషులకున్నూ !



      జిలేబి

      తొలగించండి
  6. జ్ఞానమునకు జగమునందు సాటిలే ద
    పండితులు వసింపని ధర పావనము గ
    దా యటంచు రప్పించి బుధనివహమ్ము
    జనులనెల్లరి కావించె చదువరులుగ

    రిప్లయితొలగించండి
  7. నిండగు భక్తియె లేకను
    దండిగ చదువంగ రాని దండగ విప్రుల్
    మెండుగ ధనమును కోరెడి
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  8. షండుని విధి రసహీనము
    పండితులు వసింపని ధర, పావనము గదా
    మెండుగ సాహితి చర్చల
    బండించిన కృష్ణరాయ పాలన మిలలో

    రిప్లయితొలగించండి
  9. దండిగ జదివితి నేనని
    మొండిగ వాదించి సతము మూర్ఖత్వముతో
    మెండుగ వాదాడు కపట
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  10. దండిగ జదివితి నేనని
    మొండిగ వాదించి సతము మూర్ఖత్వముతో
    మెండుగ వాదాడు కపట
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  11. పండని నేల యనబడు ను
    పండితులు వసింపని ధర , పావనము గదా
    నిండుగ వేదముల జదువు
    బండితులు వసించు భూమి భాగ్యము నిడగన్

    రిప్లయితొలగించండి
  12. దండిగ మద్యము గ్రోలుచు
    రండలతోడను రమించు ప్రవణుండగుచున్
    మెండుగవదరెడు కుహనా
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి


  13. మెండుగ కావ్యంబులనిల
    నిండుగ రచియించుచుండ నెమ్మది గలుగున్
    డండగ రచనలు ననియెడు
    పండితులు వసింపని ధర పావనము గదా.

    రెండుతెరంగుల పల్కుచు
    మొండిగ వాదనలు చేసి మూర్ఖతతోడన్
    కొండెములు చెప్పి బ్రతికెడు
    పండితులు వసింపని ధర పావనము గదా .

    దండగ పనులను చేయుచు
    తెండిక సొమ్ములననుచును తిప్పలనిడుచున్
    బెండగు మాటల నాడు కు
    పండితులు వసింపని ధర పావనము గదా .

    రిప్లయితొలగించండి
  14. దండిగ మంచీ చెడులను
    ఖండితముగ తెలిసి జెప్ప గలిగెడి విజ్ఞుల్
    ఉండిన మంచిది, కుహనా
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  15. మొండిగ వాదన సేయుచు
    కొండెము లాడు చునిరతము కుటిల పుబుద్ది న్
    దుండగులై చరియించె డు
    పండితులు వ సింపని ధర పావన ము గదా

    రిప్లయితొలగించండి
  16. గురువు గారి ఆరోగ్యము ఎలా ఉన్నదో నిన్న పద్య వీక్షణము చేయలేదు

    రిప్లయితొలగించండి
  17. ఖండిత వాదికి విద్యా
    మండనహీనునకు బహుళ మదయుతున కిలన్
    మెండుగ సుద్దులు చెప్పెడి
    పండితులు వసింపని ధర పావనము గదా.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  18. మెండగు భావన లేక వి
    తండము జొప్పించి ధర్మ తాత్సారంబై
    యుండిన కవిత్వ కుహనా
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  19. మెండుగ రుద్రాక్షలు మెడ
    నిండుగ, నుదుటను విబూది నేర్పుగ మాటల్
    సందడి జేసెడు కుహనా
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారు ప్రతిరోజూ దీపావళి జరుపుతున్నారు శబ్దప్రయోగములతో అభినందనలు

      తొలగించండి
    2. చండ పరిపాల నాధిప
      దండా ర్హాదండిత జన తతి బహుమానా
      మండిత భృశావమానిత
      పండితులు వసింపని ధర పావనము గదా

      తొలగించండి
  21. గురువు గారికి నమస్సులు. పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
    చండీ దేవత నం డ యు
    మెండు గ జ్ఞానపు విద్దెల మొసగును ప్రభుకున్
    పండుగ దండగ నుకుహ న
    పండితుల వసింపని ధర పావన ము గ దా.
    వందనములు.

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. ఖండిత మస్తక ధేనువు
      పండితులు వసింపని ధర; పావనము గదా
      నిండైన మదిని వాజ్ఞ్మయ
      మండితులను గారవించు మార్గము నడువన్!

      తొలగించండి
    2. చక్కటి యుపమానముతో పూరణ చేశారు. డా. సీతాదేవి గారు. భూదేవి గోరూప ధారిణి గదా!

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందన శతములు! నా భావమదియే!
      వాస్తవముగా ఈ రోజు భయపడుతూ ఉన్నాను. వాజ్ఞ్మయ మండితులు సరియైనదేనా యని?! నా స్వంత కవిత్వము!
      విమర్శలకు బదులు ప్రశంసలందు కున్నందుకు మహదానందముగా యున్నది!
      ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  23. దండిగ సంస్కృతి యుండియు
    మెండగు గర్వంబుతోడమేదినిబ్రజలన్
    బండగ దూషించునట్టి
    పండుతులువసింపనిధరపావనముగదా

    రిప్లయితొలగించండి
  24. మెండుగ జూదము,మద్యము
    దండిగ పోకిరి పనులను ధనమనుకొనుచున్
    నిండిన దుర్వ్యసనమ్ముల
    పండితులు, వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  25. మెండుగ జూదము,మద్యము
    దండిగ పోకిరి పనులను ధనమనుకొనుచున్
    నిండిన దుర్వ్యసనమ్ముల
    పండితులు, వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి

  26. పిన్నక నాగేశ్వరరావు.

    మెండుగ ప్రావీణ్యము లే

    కుండిన గాని నలుగురికి గొప్పలుచెప్పన్

    దండిగ, వెఱపే లేని కు

    పండితులు వసించని ధర పావనము
    గదా !

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అండగ నుండని పాడిని
    దండిగ కలతలు నిలుపుచు తనరారెడినౌ
    పండయె రిత్తగు టక్కరి
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  28. మెండగు వనుముల గొట్టుచు
    ఎండిన చెరువులను కబ్జ లెంచెడి వారై
    మొండిగ వాదన జేసెడి
    పండితులు వసింపనిధర పావనముగదా|
    2.మధ్యాక్కర
    కొండకోనలు చెట్లు గొట్ట?కోర్కె దీరిన లాభమ?మన
    గుండె కండగ వంట గూర్చ?గుప్తనిధులగు వనములు
    అండమనకు| యెంచ బోక ఆశ చేతను గొట్ట గలుగు
    పండితులు వసింపని ధర పావనము గదా?గురువ.


    రిప్లయితొలగించండి
  29. కవిమిత్రులారా,
    నా ఆరోగ్యం బాగున్నది.
    నిన్నటి నుండి విశ్రాంతి లేని ప్రయాణం కారణంగా మీ పూరణలను సమీక్షించలేకున్నాను.
    ప్రస్తుతం మహబూబాబాద్ లో శ్రీహర్ష గారి ఇంట ఉన్నాను. రేపు ఉదయం నా నెలవు చేరుకుంటాను.
    అప్పటి దాకా మన్నించండి.

    రిప్లయితొలగించండి
  30. అండగ లొసగుల చట్టము!
    బండారము నింప నెంచి ప్రజల ధనమ్మున్
    మెండుగ దోచెడు నార్థిక
    పండితులు వసింపని ధర పావనము గదా!

    రిప్లయితొలగించండి
  31. పండితులువసింపనిధరపావనముగ,
    దారిజూపనిగురువులధార్మికులుగ,
    స్వేచ్ఛనీయనిదొరలనుశ్రేయకులుగ
    దలచువారువివేకులేధరణియందు?

    రిప్లయితొలగించండి
  32. నిండు మనంబున నజ్ఞుల
    గుండెలలోతులను గాంచి కూరిమితోడన్
    మెండగు జ్ఞానము పంచని
    పండితులు వసింపని ధర పావనము గదా.

    రిప్లయితొలగించండి
  33. నిండుగనుండునె సుకవులు,
    పండితులు వసింపని ధర?పావనముఁగదా
    పండిన తలపులనుండెడు.
    కొండంతాశ్రయము నిచ్చు గుణనిధులున్నన్

    రిప్లయితొలగించండి
  34. చెండుచు కడు నిర్భాగ్యుల
    భండన మొనరించు దుష్ట పరిపాలనలో
    దండన నొందుచు చెఱలో
    పండితులు వసింపని ధర పావనము గదా

    రిప్లయితొలగించండి
  35. గుండెల నిండుగ పదములు
    పండగ ,మండితు లగుదురు పండితు లనఁగన్
    మండన పొందని కవులగు
    పండితులు వసింపని ధర పావనముగదా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  36. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    రిప్లయితొలగించండి