పరమ శాంతమె భూషణంబై తనర్చుమునికి,గోపమె భూషణంబనగనొప్పురాజకులభూషణుండు ధరాధిపునకు రాజ్యమేలగ ధర్మము రాజిలంగ
వనికిన్ వన్నెల పుష్పబాలికలె సంపాదించు సౌందర్యమున్;ధనికిన్ దానమె సర్వరీతులను సంధానించు మోక్షంబికన్;గనికిన్ బంగరువంటి లోహములె సంఘాటించు నందంబు; భీమునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
బాపూజీ గారు చాలా బాగుంది
ధన్యవాదాలండీ!
దుష్ట దుర్యోధనుని నాజి దునిమెదననిమదియె ధర్మాగ్రహము తోడ మండుచుండబ్రతిన బూనిన భీముని బవరమున య"మునికి గోపమే భూషణం బనగ నొప్పు "
మునికిన్ సౌమ్యము భూషణం బుగద; సమ్మోహంబు గూర్పంగ, కామునికిన్ పూవులు భూషణంబుగద; యింపుం జేరగా, శౌరి తమ్మునికిన్ వేణువు భూషణంబుగద; ప్రోపున్ రావణుం జంప, రామునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
తరచి చూడగ జనులకు, తాపసులకు,మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పుననుట సరికాదు; శాంతము, నచ్చికములులేని జీవితము, వలయు లెస్స గాను !జిలేబి
జిలేబి జిలేబియే
శ్రీపూసపాటి వారికియీపద్యంబును జిలేబి యిమ్ముగ నిచ్చెన్ జాపిరములేక కందపువాపురము పరుగిడనౌత వరమై నేడౌ :)జిలేబి
దేశరక్షణ కోరుచు తిరపుమతినిసాహసమ్మును చూపించు సైనికునకుబవరమందున శత్రువుపాలిటన్ యమునికి గోపమే భూషణం బనగ నొప్పు
మనసున్ సున్నిత భావజా లమను నీమంబేదియున్ లేక, నాశన కాలంబటు దాపురించి సతి పాంచాలిన్ సభామధ్యమున్ చినబోవంగ నమానవీయ గతి వంచించన్ వికారంబు, భీమునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
తపము చేయుచు నుండంగ తనను జేరిధ్యాన భంగంబు చేయుట మాననట్టిదుష్టజనముల శిక్షించు త్రోవలోనమునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు.
తననుం జేరుచు దుర్మధాంధులగుచున్ దౌష్ట్యంబుతో ధ్యానమందనయం బుండగనీక భంగమునకై యత్యంతమౌ యత్నమున్ఘనమౌ నంచును చేయువారి పనులన్ ఖండించి శిక్షింపగామునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
ధర్మపాలన గూర్చగ ధరణి యందుదుష్టశిక్షణ జేయుచు శిష్టుగావశత్రు భీతిని మలయింప శాస్తసత్తమునికి గోపమె భూషణంబనగ నొప్పు!శాస్త = రాజు
మైలవరపు వారి పూరణ: తన కోపమ్మున మౌని గుండెలపయిన్ దన్నెన్ రమావల్లభున్మనమందాగ్రహమంది లక్ష్మి యలమేల్మంగయ్యె , చింతించి దా.. గిన లక్ష్మీపతి పుట్టలో మనకు దక్కెన్ శ్రీనివాసుండుగామునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్ !!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చక్కని పూరణ!.👏👏👏🙏🙏🙏
కలహ నైజము భాసిల్లు గద అనిముష మునికి, గోపమే భూషణం బనగ నొప్పు సతతము వదనంబునకును, సత్య మిదియె ,వినుము యలుక మానుమిపుడు, ఘనత నొందుబారి జాత దరువును నే బట్టి దెత్తుననుచు కృష్ణుడు లాలించె నాతి నపుడు
ధనమున్ నిత్యము నిచ్చుచుందుగద మోదంబున్ యుపాసించగన్,ఘనమౌ నీమది నాకు వాసనము శ్రీ కాంతా, యరిష్టమ్మిడున్మునికిన్ గోపమె, భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్ ఘనతన్ గేహిని గాచగన్, యిచట నాకయ్యెన్ పరాభూతి నేజనుచుంటిన్ మన లోకమున్ విడిచి విష్వక్సేనుడా యంచు గోమిని వైకుంఠపు వాసమున్ విడచె స్వామిన్ బాధలో ద్రోయుచున్
వనితన్ దెచ్చి పరాభవించి సభలో వస్త్రంబులన్ లాగు నీచుని సంయోధము నందు గూల్చి యుఱమున్ చూర్ణంబు గావించి పావనమున్ జేసెద రక్త ధార కురులన్ పాశంబనిన్ బల్కు భీమునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
పితరునకు మక్కువది యున్న సుతుల యందుభార్య కిఁకఁ బ్రేమ యున్నను భర్త యందుగురువులకు శిష్యు లందున ఘోర దోషమునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు[దోషము + ఉనికి = దోషమునికి: దోషముండుట]దనుజేంద్రుండు కృతాపరాధుఁడట సీతన్ దాఁచ పౌలస్త్యసంహన నార్థంబు మహార్ణవమ్ము నట సాహాయ్యార్థమై యాశ్రయించిన మౌనంబున నుండ రాఘవుఁడు రోచిష్ణుండు నిక్ష్వాకు రామునికిన్ గోపమె భూషణంబగుఁ బ్రజామోదంబు సంధిల్లగన్
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు! తేటగీతి పూరణలో అన్వయక్రమాన్ని వివరించ ప్రార్ధన!🙏🙏🙏
డా. సీతా దేవి గారు ఘోర దోషమున్నట్లయితే సుతుల యందు తండ్రికి, భర్తయందు భార్యకు, శిష్యులందు గురువులకు కోపముండవలెను అది భూషణమే. ఇది నా భావము.
ఒకింత సమయము పట్టినది అర్ధమగుటకు! ధన్యవాదములు!🙏🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వనిలోనన్ వసియించురామునిసతిన్ వంచించి కొంపోవగన్ఘనమౌవానర సంఘముల్ వెనుక రాగా రావణున్ మూకతోననిలోద్రుంపెడి కాలమందునమనమ్మందున్ సమాఘాత భీమునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
చననౌ రాముడు కాననమ్మునకు తేజమ్మెల్ల వీడెన్ పురమ్మునటన్ సీతయు లక్ష్మణుండు వెడలన్ మూడమ్ము చేరెన్ వరమ్మనిభా వించిన కైక, పుత్రునిగనన్ మాగండ మవ్వంగ తమ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్జిలేబి
పులియు వేటాడు సమయాన నలుగనట్లుఎలుక బట్టగ పిల్లికియెరుక వోలెతపము మాన్పగజేసెడి తరుణ మందుమునికి గోపమే భూషణం బనగ నొప్పు|2.తనకున్ గల్గినయందచందములు సంధానించ?సంప్రీతియేమనసున్ దొల్చగ మానినీ ప్రతిభ సన్మానించ?వాల్జూపులేగనుచున్ వెళ్ళుచు నుండగా? వనిత నాకర్షించి రాకున్న?సోమునికిన్ గోపమె భూషణంబగు| “ప్రజామోదంబుసందిల్లగన్గనుమావెన్నెల కాంతులీనుటన?సంకల్పంబు విశ్లేషనల్”|
రాదుమిత్రమ!యెప్పుడురమ్మనిననుమునికిగోపమే.భూషణంబనగనొప్పుమానవత్వముతోడనమసలుకొనుచుదానధర్మములొనరించుధర్మగుణమె
డా.పిట్టాకనగన్ పేదకు గ్రోధమే పెదవికిన్ గాయంబు జేకూర్చు యేమనకన్నొప్పుకొనన్ దురాగతములే మాన్యంబులౌ ,లోకమున్గని నొప్పించని వ్రాతగాని బిరుదుల్ గావన్న యైలాఖ్యు ధామునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్1(ప్రజామోదము పొందితే..యింకా ఏమియు తేల లేదు కదా!)
డా.పిట్టా"అన్న!"యన "నోరు మూసికొమ్మ"న్న నాడుకోరి యొదుగంగ ఘోరాలు గూరె,"బాగుకాదు కాద"నె నా తెలంగాణ యనుజ-మునికి గోపమె భూషణం బనగ నొప్పు!
డా.పిట్టా నుండిఆర్యా,మన బ్లాగులో స్థానం యిస్తూ గ్రంథాన్ని మన మిత్ర మండలి వీక్షణకు అవకాశం కలిగించినందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
కోపమాభరణము కాదు కువలయానమునికి,కోపమె భూషణంబనగ నొప్పుప్రభువులకు దుష్టులైనట్టి వారి పట్లధైర్య సాహసములు చూప దగిన వారు.కోపమెన్నడు కూడదు కువలయానచిన్న మాటకే వచ్చును శీఘ్రముగనుపడతుల కెపుడు పుస్తెలు వాసి యైనమునికి,కోపము,భూషణంబనగ నొప్పు
శాంతచిత్తమ్ము మౌనము సత్వగుణమువత్సరములఁ బడయు తపో బలములెల్లశాపమొసఁగు కోపమ్మున సడలు చుండమునికిఁ గోప మే భూషణమనఁగ నొప్పు?
ధర్మములఁ దెల్సి క్రీడి పై దాడిఁ జేయచెలఁగ గుప్పించి యెగయఁగ శ్రీధరుండుతగ్గి భీష్ముండు మ్రొక్కినంత! పురుషోత్తమునికిఁ గోపమే భూషణమనఁగ నొప్పు!
చక్కని పూరణ! అభినందనలు!
సుంకముల్,పన్నుల వసూళ్లు పొంకముగనుచేయు ప్రభుత పౌరులకు సహాయ మిడగగ్రాంటు లందించ జాప్యమ్ము గనిన యుత్తమునికి గోపమె భూషణం బనగ నొప్పుపేద కోపమ్మనర్ధమ్ము పెదవికిగద
వినయావేశము జూపుచున్ బలుకు ప్రావీణ్యమ్ము మీ సొంతమే !వినుమా! సంధి పొసంగు మార్గమిదె? గోవిందా! రణమ్మెంచుటేయనివార్యమ్మని కౌరవేయులు నమర్యాదాడి జుట్టన్ త్రిధామునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్!
వనిలో నుండగ, నాగుపాము తొడపై ప్రాకంగ, వచ్చెన్ గదామునికిన్ గోపమె; భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్ఘనమౌ నద్దియె నాగుపాము మెడలో కన్పించగా శంభునన్;...కనుమా పృచ్ఛక! మూడు పాదములలో కన్గొంటినే పూరణన్ :)
పరమ శాంతమె భూషణంబై తనర్చు
రిప్లయితొలగించండిమునికి,గోపమె భూషణంబనగనొప్పు
రాజకులభూషణుండు ధరాధిపునకు
రాజ్యమేలగ ధర్మము రాజిలంగ
వనికిన్ వన్నెల పుష్పబాలికలె సంపాదించు సౌందర్యమున్;
రిప్లయితొలగించండిధనికిన్ దానమె సర్వరీతులను సంధానించు మోక్షంబికన్;
గనికిన్ బంగరువంటి లోహములె సంఘాటించు నందంబు; భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
బాపూజీ గారు చాలా బాగుంది
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిదుష్ట దుర్యోధనుని నాజి దునిమెదనని
రిప్లయితొలగించండిమదియె ధర్మాగ్రహము తోడ మండుచుండ
బ్రతిన బూనిన భీముని బవరమున య
"మునికి గోపమే భూషణం బనగ నొప్పు "
మునికిన్ సౌమ్యము భూషణం బుగద; సమ్మోహంబు గూర్పంగ, కా
రిప్లయితొలగించండిమునికిన్ పూవులు భూషణంబుగద; యింపుం జేరగా, శౌరి త
మ్మునికిన్ వేణువు భూషణంబుగద; ప్రోపున్ రావణుం జంప, రా
మునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
రిప్లయితొలగించండితరచి చూడగ జనులకు, తాపసులకు,
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు
ననుట సరికాదు; శాంతము, నచ్చికములు
లేని జీవితము, వలయు లెస్స గాను !
జిలేబి
జిలేబి జిలేబియే
తొలగించండి
తొలగించండిశ్రీపూసపాటి వారికి
యీపద్యంబును జిలేబి యిమ్ముగ నిచ్చెన్
జాపిరములేక కందపు
వాపురము పరుగిడనౌత వరమై నేడౌ :)
జిలేబి
దేశరక్షణ కోరుచు తిరపుమతిని
రిప్లయితొలగించండిసాహసమ్మును చూపించు సైనికునకు
బవరమందున శత్రువుపాలిటన్ య
మునికి గోపమే భూషణం బనగ నొప్పు
మనసున్ సున్నిత భావజా లమను నీమంబేదియున్ లేక, నా
రిప్లయితొలగించండిశన కాలంబటు దాపురించి సతి పాంచాలిన్ సభామధ్యమున్
చినబోవంగ నమానవీయ గతి వంచించన్ వికారంబు, భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
మనసున్ సున్నిత భావజా లమను నీమంబేదియున్ లేక, నా
రిప్లయితొలగించండిశన కాలంబటు దాపురించి సతి పాంచాలిన్ సభామధ్యమున్
చినబోవంగ నమానవీయ గతి వంచించన్ వికారంబు, భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
తపము చేయుచు నుండంగ తనను జేరి
రిప్లయితొలగించండిధ్యాన భంగంబు చేయుట మాననట్టి
దుష్టజనముల శిక్షించు త్రోవలోన
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు.
తననుం జేరుచు దుర్మధాంధులగుచున్ దౌష్ట్యంబుతో ధ్యానమం
రిప్లయితొలగించండిదనయం బుండగనీక భంగమునకై యత్యంతమౌ యత్నమున్
ఘనమౌ నంచును చేయువారి పనులన్ ఖండించి శిక్షింపగా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్.
ధర్మపాలన గూర్చగ ధరణి యందు
రిప్లయితొలగించండిదుష్టశిక్షణ జేయుచు శిష్టుగావ
శత్రు భీతిని మలయింప శాస్తసత్త
మునికి గోపమె భూషణంబనగ నొప్పు!
శాస్త = రాజు
మైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండితన కోపమ్మున మౌని గుండెలపయిన్ దన్నెన్ రమావల్లభున్
మనమందాగ్రహమంది లక్ష్మి యలమేల్మంగయ్యె , చింతించి దా..
గిన లక్ష్మీపతి పుట్టలో మనకు దక్కెన్ శ్రీనివాసుండుగా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చక్కని పూరణ!.👏👏👏🙏🙏🙏
తొలగించండికలహ నైజము భాసిల్లు గద అనిముష
రిప్లయితొలగించండిమునికి, గోపమే భూషణం బనగ నొప్పు
సతతము వదనంబునకును, సత్య మిదియె ,
వినుము యలుక మానుమిపుడు, ఘనత నొందు
బారి జాత దరువును నే బట్టి దెత్తు
ననుచు కృష్ణుడు లాలించె నాతి నపుడు
ధనమున్ నిత్యము నిచ్చుచుందుగద మోదంబున్ యుపాసించగన్,
రిప్లయితొలగించండిఘనమౌ నీమది నాకు వాసనము శ్రీ కాంతా, యరిష్టమ్మిడున్
మునికిన్ గోపమె, భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
ఘనతన్ గేహిని గాచగన్, యిచట నాకయ్యెన్ పరాభూతి నే
జనుచుంటిన్ మన లోకమున్ విడిచి విష్వక్సేనుడా యంచు గో
మిని వైకుంఠపు వాసమున్ విడచె స్వామిన్ బాధలో ద్రోయుచున్
వనితన్ దెచ్చి పరాభవించి సభలో వస్త్రంబులన్ లాగు నీ
రిప్లయితొలగించండిచుని సంయోధము నందు గూల్చి యుఱమున్ చూర్ణంబు గావించి పా
వనమున్ జేసెద రక్త ధార కురులన్ పాశంబనిన్ బల్కు భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
పితరునకు మక్కువది యున్న సుతుల యందు
రిప్లయితొలగించండిభార్య కిఁకఁ బ్రేమ యున్నను భర్త యందు
గురువులకు శిష్యు లందున ఘోర దోష
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు
[దోషము + ఉనికి = దోషమునికి: దోషముండుట]
దనుజేంద్రుండు కృతాపరాధుఁడట సీతన్ దాఁచ పౌలస్త్యసం
హన నార్థంబు మహార్ణవమ్ము నట సాహాయ్యార్థమై యాశ్రయిం
చిన మౌనంబున నుండ రాఘవుఁడు రోచిష్ణుండు నిక్ష్వాకు రా
మునికిన్ గోపమె భూషణంబగుఁ బ్రజామోదంబు సంధిల్లగన్
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు!
తొలగించండితేటగీతి పూరణలో అన్వయక్రమాన్ని వివరించ ప్రార్ధన!🙏🙏🙏
డా. సీతా దేవి గారు ఘోర దోషమున్నట్లయితే సుతుల యందు తండ్రికి, భర్తయందు భార్యకు, శిష్యులందు గురువులకు కోపముండవలెను అది భూషణమే. ఇది నా భావము.
తొలగించండిఒకింత సమయము పట్టినది అర్ధమగుటకు! ధన్యవాదములు!🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివనిలోనన్ వసియించురామునిసతిన్ వంచించి కొంపోవగన్
రిప్లయితొలగించండిఘనమౌవానర సంఘముల్ వెనుక రాగా రావణున్ మూకతో
ననిలోద్రుంపెడి కాలమందునమనమ్మందున్ సమాఘాత భీ
మునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
రిప్లయితొలగించండిచననౌ రాముడు కాననమ్మునకు తేజమ్మెల్ల వీడెన్ పుర
మ్మునటన్ సీతయు లక్ష్మణుండు వెడలన్ మూడమ్ము చేరెన్ వర
మ్మనిభా వించిన కైక, పుత్రునిగనన్ మాగండ మవ్వంగ త
మ్మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
జిలేబి
పులియు వేటాడు సమయాన నలుగనట్లు
రిప్లయితొలగించండిఎలుక బట్టగ పిల్లికియెరుక వోలె
తపము మాన్పగజేసెడి తరుణ మందు
మునికి గోపమే భూషణం బనగ నొప్పు|
2.తనకున్ గల్గినయందచందములు సంధానించ?సంప్రీతియే
మనసున్ దొల్చగ మానినీ ప్రతిభ సన్మానించ?వాల్జూపులే
గనుచున్ వెళ్ళుచు నుండగా? వనిత నాకర్షించి రాకున్న?సో
మునికిన్ గోపమె భూషణంబగు| “ప్రజామోదంబుసందిల్లగన్
గనుమావెన్నెల కాంతులీనుటన?సంకల్పంబు విశ్లేషనల్”|
రాదుమిత్రమ!యెప్పుడురమ్మనినను
రిప్లయితొలగించండిమునికిగోపమే.భూషణంబనగనొప్పు
మానవత్వముతోడనమసలుకొనుచు
దానధర్మములొనరించుధర్మగుణమె
డా.పిట్టా
రిప్లయితొలగించండికనగన్ పేదకు గ్రోధమే పెదవికిన్ గాయంబు జేకూర్చు యే
మనకన్నొప్పుకొనన్ దురాగతములే మాన్యంబులౌ ,లోకమున్
గని నొప్పించని వ్రాతగాని బిరుదుల్ గావన్న యైలాఖ్యు ధా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్1
(ప్రజామోదము పొందితే..యింకా ఏమియు తేల లేదు కదా!)
డా.పిట్టా
రిప్లయితొలగించండి"అన్న!"యన "నోరు మూసికొమ్మ"న్న నాడు
కోరి యొదుగంగ ఘోరాలు గూరె,"బాగు
కాదు కాద"నె నా తెలంగాణ యనుజ-
మునికి గోపమె భూషణం బనగ నొప్పు!
డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆర్యా,మన బ్లాగులో స్థానం యిస్తూ గ్రంథాన్ని మన మిత్ర మండలి వీక్షణకు అవకాశం కలిగించినందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
రిప్లయితొలగించండికోపమాభరణము కాదు కువలయాన
మునికి,కోపమె భూషణంబనగ నొప్పు
ప్రభువులకు దుష్టులైనట్టి వారి పట్ల
ధైర్య సాహసములు చూప దగిన వారు.
కోపమెన్నడు కూడదు కువలయాన
చిన్న మాటకే వచ్చును శీఘ్రముగను
పడతుల కెపుడు పుస్తెలు వాసి యైన
మునికి,కోపము,భూషణంబనగ నొప్పు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశాంతచిత్తమ్ము మౌనము సత్వగుణము
తొలగించండివత్సరములఁ బడయు తపో బలములెల్ల
శాపమొసఁగు కోపమ్మున సడలు చుండ
మునికిఁ గోప మే భూషణమనఁగ నొప్పు?
ధర్మములఁ దెల్సి క్రీడి పై దాడిఁ జేయ
రిప్లయితొలగించండిచెలఁగ గుప్పించి యెగయఁగ శ్రీధరుండు
తగ్గి భీష్ముండు మ్రొక్కినంత! పురుషోత్త
మునికిఁ గోపమే భూషణమనఁగ నొప్పు!
చక్కని పూరణ! అభినందనలు!
తొలగించండిసుంకముల్,పన్నుల వసూళ్లు పొంకముగను
రిప్లయితొలగించండిచేయు ప్రభుత పౌరులకు సహాయ మిడగ
గ్రాంటు లందించ జాప్యమ్ము గనిన యుత్త
మునికి గోపమె భూషణం బనగ నొప్పు
పేద కోపమ్మనర్ధమ్ము పెదవికిగద
వినయావేశము జూపుచున్ బలుకు ప్రావీణ్యమ్ము మీ సొంతమే !
రిప్లయితొలగించండివినుమా! సంధి పొసంగు మార్గమిదె? గోవిందా! రణమ్మెంచుటే
యనివార్యమ్మని కౌరవేయులు నమర్యాదాడి జుట్టన్ త్రిధా
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్!
వనిలో నుండగ, నాగుపాము తొడపై ప్రాకంగ, వచ్చెన్ గదా
రిప్లయితొలగించండిమునికిన్ గోపమె; భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్
ఘనమౌ నద్దియె నాగుపాము మెడలో కన్పించగా శంభునన్;...
కనుమా పృచ్ఛక! మూడు పాదములలో కన్గొంటినే పూరణన్ :)