జిలేబి గారు నాలాగే మీరు కూడ నాంధ్రభారతి శోధకు లైనందులకు సంతోషము. అన్నీ మన మెదడులోనే యుంచుకొనుట సమయానికి గుర్తుకు వచ్చుట కష్టము కాబట్టి నిఘంటువులను సంప్రదించుట తప్పని సరి. పదప్రయోగౌచిత్యము మన మేధస్సు గొప్పదనము.
మీ పూరణ చాలా బాగుంది.
ఘర్మ్యుఁడు కౌరవ శతకము లో లేఁడు. అతఁడు గాంధారీ సూనుఁడు కాదు. గాంధారుని కొడుకు. గాంధారుఁడు యయాతి కొడుకైన దుహ్యుని పౌత్రుడు. గాంధార నగరమును నిర్మించిన వాఁడు. గాంధారి శకునుల తండ్రి సుబలునకు చాలా తరములు ముందటి వాఁడు.
జిలేబి గారు మీపూరణకు వచ్చిన కొఱతేమీ లేదు. ఘర్మ్యుడు వ్యుత్పత్త్యర్థము గ్రహించి మిక్కిలి వేడితో కూడుకున్న వానిగా ( కోపిష్ఠి) భావించ వచ్చును. విషయ వివరణ నిమిత్తమే తెలియ జేసితిని. మీకు నా హృదయ పూర్వకాభినందనలు.
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు! ఊర్మ్యాళి కి అర్ధం ఆంధ్రభారతిలో దొరకలేదు. దయచేసి వివరింపగలరు! మొన్నటి నాపూరణ పై మీ వ్యాఖ్యను చాల ఆలస్యంగా చూశాను. ఆ ధర్మసూక్ష్మమును వివరించ ప్రార్ధన!🙏🙏🙏🙏
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శ్రీపతి శాస్త్రి గారి పేర్మ్యాదులు, కూర్మ్యాదుల ప్రయోగము నొకసారి పరిశీలించ గోర్తాను.
సీతా దేవి గారు ఊర్మ్యాళి ఏక పదము కాదు. అందుకే నిఘంటువులలో దొరకదు. ఊర్మి + ఆళి = ఊర్మ్యాళి : అలల సమూహము. యణాదేశ సంధి.
వ్యాస మహర్షి వేద విభజనము నష్టాదశ పురాణములు బ్రహ్మ సూత్రముల రచన కావించిన విష్ణు స్వరూపుఁడు. ద్వాపర యుగము నుండి యున్న వాఁడు. భారవి యాధునిక కలియుగము నందు 5-6 శతాబ్ద కాలములో నున్న వానిగా తెలియు చున్నది. భారతము నందలి పాశుపతాస్త్ర సంపాదన నాధారముగ కిరాతార్జునీయమను మహా ప్రబంధమును వ్రాసిన మహా కవి. భారవిని ప్రతి వ్యాసుఁ డన నౌచిత్య మున్నది కాని వ్యాసుని ప్రతి భారవి యనడము తర్కనీయము. అందుకే నేను నా పూరణలో వ్యాసుని సూర్య భగవానుని తో పోల్చితిని.
ఆర్యా నేనంత దూరము ఆలోచించలేదు! నేను కూడ వ్యాసుని సూర్యునితోనే పోల్చితిని! ప్రతిభా రవి యని! బహుశ టైపింగ్ లో భా కు రవికి మధ్యను ఖాళీ యివ్వడం మర్చిపోయి యుంటాను! మిగిలిన వారు కూడ నా భావనను గ్రహించి బాగున్నదనినారని న భావన!ధన్యవాదములు!🙏🙏🙏🙏
శంకరాభరణము కవివరులకు దసరా శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి(మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన)
శంకరీ,శంభుసతి,శివ, శాక్రి, శాంతి,
కర్వరీ, కప్పుటైదువ, కాళి. కన్య
రామ. రాజరాజేశ్వరి. రాజ్యలక్ష్మి,
భవ్య, భగవతి ,భైరవి, భంజ, బాణ,
రమణ ,రతి రూప, రక్తాక్షి, రమ్య, నిర్గు
ణ,గుణనిధి ,దక్షిణారాధ్య, నగజ, షష్టి,
ముక్తి నిలయా,సుముఖి, పంచముఖి,ముకుంద.
కలిమి గుబ్బెత, కాళిక, గట్టు పట్టి ,
విజయ, విమల, వైష్ణవి, వేద జనని,
వరద, వారుణి, వాక్కాంత, వాణి, వంద్య,
రుద్ర రూప,రుద్రాణి,కరుణ, మృడాని,
లక్ష్మి, లాస్యప్రియా,లంబ, లలిత, లజ్జ
కుశల ,కుసుమ ప్రియా ,కురుకుళ్ళ, క్షేమ,
దశభుజ,దశముద్రా,,దక్ష తనయ, ధర్మి
సర్వ మంగళ, సావిత్రి, శక్తి, సత్య,
రాణి ,రాజరాజార్చిత, రక్త వర్ణ,
శుక్ల ,శ్రుతదేవి, సుప్రియ, శోభనాంగి,
భార్గవి,భవాని, భ్రామరి, బాస ,బ్రాహ్మి,
కాంతి వదన, కాత్యాయని, కాల హంత్రి,
క్షమ, రక్షమాం, మీ సువీక్షణ లెపుడు క
లుగ వలయును కవులపై వెలుగుల నిడుచు.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
( 21/09/2017 హేవలంబి ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి)
తొలగించండిపూసపాటి వారికి ఇక్కడి కవులందరికి దసరా శుభాకాంక్షలతో
అద్భుతమైన శుభాకాంక్షల నందించిన పూసపాటి వారికి నమోనమః !
జిలేబి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిఉదయాన్నే దేవీ నామావళితో శుభాకాంక్షల పద్యం. చాలా బాగుంది. ధన్యవాదాలు.
పూసపాటివారి పొందికైన శుభాకాంక్షలకు ధన్యవాదములు!🙏🙏🙏🙏
తొలగించండిహర్మ్యమ్మున నేమి గలదు
రిప్లయితొలగించండిహర్మ్యమ్మది యంత జూడ నాడంబరమే
హర్మ్యమ్మది వీడ దగును
హర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యములు దండి నేడు అ
రిప్లయితొలగించండిధర్మ్యములునుజరుగుచుండు నదుపుయెలేకన్,
హర్మ్యనివాసము హేయము,
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యము లనేక విధములు
రిప్లయితొలగించండిహర్మ్యము బంగరు శిఖరపు హర్మందిరమున్
హర్మ్యము బలెబలె! పేకల
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్?
హర్మందిర హర్మ్యము = Sikh's Golden Temple in Amritsar
బలెబలె = Happily peaceful
...సారు శ్రమ తగ్గి కొంత విశ్రాంతిని గోరి దుష్కర ప్రాస నిడిరి. కానీ మేమొప్పముగా!!!
తొలగించండిపేకల హర్మ్యము...ప్రయోగం బాగుందండీ ప్రభాకరశాస్త్రి గారూ... నమోనమః ��
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పేక మేడల పూరణ బాగున్నది. అభినందనలు.
(శకుంతల దుష్యంతునితో భరతుని గురించి చెబుతున్నది.)
రిప్లయితొలగించండినర్మ్యపు పలుకులు పలుకుట
ధర్మ్యమ్మగునే నరవర! దర్శింపుమయా!
భర్మ్యపు నందను వదనము;
హర్మ్యమ్మున వెదుకదగునె యానందమ్మున్?
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యమ్మున జీవనము కడు
రిప్లయితొలగించండిరమ్మ్యమ్ముగ నుండె నంత రస భరితమ్మౌ
సౌమ్మ్యమ్ముగ జంట లుండిన
హర్మ్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
రాజేశ్వరి గారు! నమస్సులు! దసరా శుభాకాంక్షలు!
తొలగించండి"హర్మ్యము, రమ్యము, సౌమ్యము" చాలా చక్కగ నున్నవి. కొన్ని గణ దోషములను ఈ క్రింది విధముగ బహుశ సవరించ గలరేమో...
"హర్మ్యమ్మున జీవనమతి
రమ్మ్యమ్ముగ నుండి నంత రస
భరితమ్మౌ,
సౌమ్మ్యముగ జంట లుండక
హర్మ్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్"
GPS gaarU !
తొలగించండి!హర్మ్యమ్మున జీవనమతి
రమ్మ్యమ్ముగ నుండి నంత రస భరితమ్మౌ
సౌమ్మ్యముగ జంట లుండక
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
అక్కయ్యా,
తొలగించండిప్రాస తప్పింది. సవరించి మరో పూరణ చెప్పండి.
ఓహో సారీ! ప్రాస గమనించ లేదు..
తొలగించండిధర్మ్యపు కార్యంబుల వలె
రిప్లయితొలగించండిహర్మ్యంబిడునే వసింప నయినన్ మరి సా
ధర్మ్యము గలదా జూడగ
"హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్"
( ధర్మ్యపు=ధర్మమునుండి తొలగబడని; సాధర్మ్యము పోలిక)
ధర్మకార్యనిర్వహణలోనే ఆనందం ఉండునని నా భావన,మేడలు మిద్దెలు గాదు)
తోపెల్ల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యమ్ములశాశ్వతములు
రిప్లయితొలగించండిహర్మ్యమ్ములచేతనములయా నీవరయన్
హర్మ్యమ్ములగు నసచ్చిత్
హర్మ్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
అశాశ్వతము-అసత్
నిత్య సత్య చైతన్య పదార్థముననే ఆనందముండును
కావలిపాటి నరసరాజు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిఐర్మ్యములను పూసుకొనుచు
ఘర్మ్యుడ,పాండుత నయులను గర్హించుచునౌ
ధర్మ్యము గాంచుచు మనుజుడ,
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్?
జిలేబి
దుర్యోధనునకు మీరు ఏమి ointment పూశారో తెలుపగలరు.
తొలగించండిజిలేబీ గారికి అనేకానేక శుభాకాంక్షలు.
జిలేబీ గారూ,
తొలగించండిఎక్కడ దొరికాడండీ దుర్యోధనుని తమ్ముడు 'ఘర్మ్యుడు'? 'ఐర్మ్యము' చక్కని పద ప్రయోగం. నిస్సందేహంగా ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండికంది వారు
నమో నమః !
అందరికీ శ్రీహరే అంతరాత్మ :) జిలేబులకు ఆంధ్రభారతియే :)
ఒక చెంప నాంధ్ర భారతి
చకచక తిప్పుచు జిలేబి చవులూరు పద
మ్మొకవైపు జూడగన్ మరి
యొక వైపు సమస్యలు సమయోచితము గనున్ :)
నెనరులు
జిలేబి
తొలగించండిజీపీయెస్ వారికి
గాంధారీపుత్రునకు ఐర్మ్యము అమృతాంజనమే :)
చీర్స్
జిలేబి
తొలగించండిజీపీయెస్ వారు మీకో కంద సమస్య
రాచ్చిప్పన్నైతినోయి రచనల్ జేయన్
జిలేబి
జిలేబిగారూ జిందాబాద్! నూతనపద ప్రయోగాలలో మీ ప్రతిభ అసామాన్యము!👏👏👏👍👍👍
తొలగించండిజిలేబీ గారూ !
తొలగించండిచక్కటి పూరణ!
ఇతరులకు మార్గదర్శకము!
హార్థికాభినందనలు !
ముచ్చటగా ప్రాస యతులు
తొలగించండికచ్చితమౌ గణములన్ని కందల నూరన్
పచ్చడి, జిలేబి, మీకౌ
రాచ్చిప్పన్నైతినోయి రచనల్ జేయన్
అన్నయ్యా అద్భుతం! కంద పచ్చడి బహుబాగా కుదిరింది!👌👌👌👌
తొలగించండి
తొలగించండిజీపీయెస్ వారు
నమో నమః
జిలేబి
తొలగించండిజనార్ధన రావు గారికి, సీతాదేవి గారికి
నెనరస్య నెనరః జిలేబీ నామ్యా
దురగొంటాకుహు :)
జిలేబి
🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజిలేబి గారు నాలాగే మీరు కూడ నాంధ్రభారతి శోధకు లైనందులకు సంతోషము. అన్నీ మన మెదడులోనే యుంచుకొనుట సమయానికి గుర్తుకు వచ్చుట కష్టము కాబట్టి నిఘంటువులను సంప్రదించుట తప్పని సరి. పదప్రయోగౌచిత్యము మన మేధస్సు గొప్పదనము.
తొలగించండిమీ పూరణ చాలా బాగుంది.
ఘర్మ్యుఁడు కౌరవ శతకము లో లేఁడు. అతఁడు గాంధారీ సూనుఁడు కాదు.
గాంధారుని కొడుకు. గాంధారుఁడు యయాతి కొడుకైన దుహ్యుని పౌత్రుడు. గాంధార నగరమును నిర్మించిన వాఁడు. గాంధారి శకునుల తండ్రి సుబలునకు చాలా తరములు ముందటి వాఁడు.
తొలగించండిపోచిరాజు వారికి
అయ్యబాబోయ్ ! గాంధారి కొడుకు కాదన్నమాట !
మొత్తం పద్య భావం ఢమాలే ఢమాల్ :)
నెనరులు ఆ వంశావళి చెప్పి సరిదిద్దినందుకు
జిలేబి
జిలేబి గారూ చింతించకండి. ఎవడైతేనేమి ఘర్మ్యుడికి మంచి ఐర్మ్యమే పూసారు. మహా సరదా. సమస్యా పూరణం సరదా ప్రక్రియ అని కంది వారు చాలా సార్లు చెప్పియున్నారుగా!
తొలగించండిచీర్స్
తొలగించండిజీపీయెస్ వారు
నెనర్లు - మరో జిలేబి పోస్టడ్ :)
జిలేబి
జిలేబి గారు మీపూరణకు వచ్చిన కొఱతేమీ లేదు. ఘర్మ్యుడు వ్యుత్పత్త్యర్థము గ్రహించి మిక్కిలి వేడితో కూడుకున్న వానిగా ( కోపిష్ఠి) భావించ వచ్చును.
తొలగించండివిషయ వివరణ నిమిత్తమే తెలియ జేసితిని.
మీకు నా హృదయ పూర్వకాభినందనలు.
జిలేబీ గారూ:
తొలగించండిహా! ఇప్పుడు తెలిసినది మీ కిటుకు:
ఆంధ్రభారతి నిఘంటుశోధనలో "ర్మ్య" అని టైపు చేస్తే చాలు...20 పదములు దొరికాయి. ముందూ వెనకా కలిపి.
సీతా దేవీ! గమనించి గోప్యముగా ఉంచుము. ఇకమీదట దుష్కర ప్రాసలు మనకు లేవు :)
చీర్స్
భళీ! అంతర్జాల శోధకులు, ఆంధ్రభారతి శోధకుల గుట్టు పట్టేశారన్నమాట!👏👏👏👏👏
తొలగించండి
తొలగించండిపోచిరాజు వారు
మరో ప్రయత్నం పోస్ట్ చేసా
సరియేనా చెప్పగలరు
జిలేబి
ధర్మ్యం బెంచక నిరత మ
రిప్లయితొలగించండిధర్మ్యమె యోచించు నరుడు తన్మయు డయి యా
యూర్మ్యుపమ భంగురంబగు
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యము నివాస యోగ్యము
రిప్లయితొలగించండిహర్మ్య ము పలు ధర్మ కార్య మాధా ర ము నై
హర్మ్య ము వెలసె ను భువి లో
హర్మ్య మ్మున వెదుక దగు నె ? యా న oదమ్మున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మ్యాధర్మ్యములకు సా
రిప్లయితొలగించండిధర్మ్యము వెదుకంగ రాదు- ధర్మ యుత నై
ష్కర్మ్య గతిని వీడి నభో
హర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధర్మయుత నై..' అన్నచోట గణభంగం. "ధర్మ సహిత నై..." అంటే ఎలా ఉంటుంది?
ధన్యవాదాలు. పొరపాటు నాదే. మీ సూచన చక్కగా ఉంది.
తొలగించండిహర్మ్యము నిర్మింప దగును
రిప్లయితొలగించండిహర్మ్యమ్మది ధరణిపైన హాయిగనుండన్
హర్మ్యంబులంచును కలల
హర్మ్యమ్ముల వెదకదగునె యానందమునన్!
కలలు సాకారమైనప్పుడేగా నిజమైన ఆనందము!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేహో దేవాలయ ప్రోక్తో.............
రిప్లయితొలగించండిహర్మ్యంబు లిటుక పోగులు
హర్మ్యంబులు చాటుచుండు నాడంబరముల్
హర్మ్యంబు దేహ మరయుము
హర్మ్యంబున వెదుకఁదగునె యానందమ్మున్
ప్రసాదరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిగురుదేవులకు కవిమిత్రులందరికీ శరన్నవరాత్రుల హార్దిక శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిధర్మ్యము గల చిత్త మనెడి
రిప్లయితొలగించండిఐర్మ్యముతో పారద్రోలు మడ్డంకుల;నై
ష్కర్మ్యమె ముక్తికి మార్గము
హర్మ్యంబున వెదుక నగునె యానందమ్మున్?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మ్యంపు నడత తోడ న
ధర్మ్యంబెన్నడు స్మరించ దల్చని వేళన్
భర్మ్యపు శొభలిల వెలయ
హర్మ్యమ్మున వెదక దగునె యానందమ్మున్?
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మ్యంపు నడత తోడ న
ధర్మ్యంబెన్నడు స్మరించ దల్చని వేళన్
భర్మ్యపు శోభలిల వెలయ
హర్మ్యమ్మున వెదక దగునె యానందమ్మున్?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువర్యులకు, కవిమిత్రులకు శ్రీ దేవీ నవరాత్రి దసరా పర్వదిన శుభాకాంక్షలు.
పేర్మ్యాదుల విడనాడుచు
కూర్మ్యాదుల సేకరించు కోరిక కలుగన్
నిర్మ్యాది నాయకులకున్
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
"నిర్మి" సంపాదనే ధేయముగా గల కల్పిత రాజకీయ నాయకుడు
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యమె వసింప యోగ్యము
రిప్లయితొలగించండిహర్మ్యమె మనయునికి దెలుపు నాధారంబౌ
హర్మ్యమును వదలి, యాశల
హర్మ్యమ్మున వెదకదగునె యానందమ్మున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యమ్ము లుండునెడలను
రిప్లయితొలగించండిహర్మ్యమ్మున వెదుక దగునె యానందమ్మున్
హర్మ్యమ్ముల నానందము
ధర్మ్యమ్ముగదలతు నెపుడు ధార్మిక బుధ్ధిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊర్మ్యాళి సదృశములగు న
రిప్లయితొలగించండిధర్మ్యాలోచన లిల దురితదములు సుమి నై
ష్కర్మ్య పరాయణుఁ డైనన్
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు!
తొలగించండిఊర్మ్యాళి కి అర్ధం ఆంధ్రభారతిలో దొరకలేదు. దయచేసి వివరింపగలరు!
మొన్నటి నాపూరణ పై మీ వ్యాఖ్యను చాల ఆలస్యంగా చూశాను. ఆ ధర్మసూక్ష్మమును వివరించ ప్రార్ధన!🙏🙏🙏🙏
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శ్రీపతి శాస్త్రి గారి పేర్మ్యాదులు, కూర్మ్యాదుల ప్రయోగము నొకసారి పరిశీలించ గోర్తాను.
తొలగించండిసీతా దేవి గారు ఊర్మ్యాళి ఏక పదము కాదు. అందుకే నిఘంటువులలో దొరకదు.
ఊర్మి + ఆళి = ఊర్మ్యాళి : అలల సమూహము. యణాదేశ సంధి.
వ్యాస మహర్షి వేద విభజనము నష్టాదశ పురాణములు బ్రహ్మ సూత్రముల రచన కావించిన విష్ణు స్వరూపుఁడు. ద్వాపర యుగము నుండి యున్న వాఁడు.
భారవి యాధునిక కలియుగము నందు 5-6 శతాబ్ద కాలములో నున్న వానిగా తెలియు చున్నది. భారతము నందలి పాశుపతాస్త్ర సంపాదన నాధారముగ కిరాతార్జునీయమను మహా ప్రబంధమును వ్రాసిన మహా కవి.
భారవిని ప్రతి వ్యాసుఁ డన నౌచిత్య మున్నది కాని వ్యాసుని ప్రతి భారవి యనడము తర్కనీయము.
అందుకే నేను నా పూరణలో వ్యాసుని సూర్య భగవానుని తో పోల్చితిని.
ఆర్యా నేనంత దూరము ఆలోచించలేదు!
తొలగించండినేను కూడ వ్యాసుని సూర్యునితోనే పోల్చితిని!
ప్రతిభా రవి యని! బహుశ టైపింగ్ లో భా కు రవికి మధ్యను ఖాళీ యివ్వడం మర్చిపోయి యుంటాను! మిగిలిన వారు కూడ నా భావనను గ్రహించి బాగున్నదనినారని న భావన!ధన్యవాదములు!🙏🙏🙏🙏
డా. సీతా దేవి గారు ప్రతిభా రవి ప్రయోగమును నేనే తప్పుగా ప్రతి భారవి యని యర్థము చేసుకొంటిని. క్షమించండి. చక్కటి యుపమానము.
తొలగించండిపూజ్యులు మీరు క్షమించమని యనరాదు! మీ ధీశక్తి ముందు మే మేపాటి! ధన్యవాదములు, నమస్సులు!🙏🙏🙏🙏🙏
తొలగించండిదసరా శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసాటి కవివరేణ్యుల కిల సంతసములు
తొలగించండిశుభము లుగలుగు గావుత యాభవాని
సాద్వి కరుణన యీశుభ సమయ మందు
కల్ల కాదిది నిజమునే పల్కు చుంటి
హర్మ్యపు విద్యుత్తాగిన?
రిప్లయితొలగించండిహర్మ్యమ్మున వెదుకదగునె యానందమ్మున్?
హర్మ్యములపశ్రుతి రాగమె|
హర్మ్యమ్మొక జైలు శిక్ష నధిరోహించన్|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణపుమనసత్కవులకు
రిప్లయితొలగించండిదేవి నామాల తోడన దెల్పినట్టి
నీదు రచనకు జోహార్లు నిండుకుండ!
శుభములిచ్చునునీకును శుక్లమాత!
రిప్లయితొలగించండిమరో ప్రయత్నం !
ధర్మ్యము గనుచున్ జత నై
ష్కర్మ్యముల పథము విడువక షహసానువు సా
ధర్మ్యముగ జిలేబి, మనో
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
హర్మ్యమ్ము మించగన్ సా
రిప్లయితొలగించండిధర్మ్యమ్మున నీవుగట్ట ధర్మము విడువన్
కర్మ్యంపు పాప భరమున
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి