తెలంగాణాలో దేవీనవరాత్రులలో చక్కగా తట్టలలో పూవులను పేర్చి వాటిచుట్టూ తిరుగుతూ అమ్మవారి పాటలు పాడుతూ స్త్రీలందరూ సంబరంగా జరుపుకునే పండుగ! ఆంధ్ర్రలో సంక్రాంతికి గొబ్బెమ్మల పండుగ వలె! తెలంగాణ వారు యింకా వివరంగా తెలుపగలరు!
డా.పిట్టా గద్దర్ గారి ఆత్మ కథను ఆంగ్లంలోని కనువదించి ప్రచురించాను.వీరి యింటిలో దేవుళ్ళ పటాలు లేకుంటే తన తల్లి మానసిక పూజ చేసినట్లు వ్రాసుకున్న పాటల రాజు యాదగిరిని సందర్శించినట్లు వార్తలలో చదివినాను.
డా.పిట్టా ఆర్యా} బే.గమ్ అంటే దుఃఖమెరుగనిది. రాణి అనే గౌరవ వాచకము.ఈ యెంపిక T.S పాలనను గుర్తు చేస్తున్నది.స్త్రీలకు , సర్వ జాతులకు మేలు చేకూర్చే పతకాల స్రష్టకు (కేసియార్ కు) అభినందనలు.మీ పేరు యెంపిక సరస్వతీ కటాక్షమే.
గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.కవి మిత్రులందరికి దేవీ నవరాత్రుల పండుగ రోజున శుభాభినందనలు. ముద్దులొలికే డి దంపత లిద్దరు దరహసమున ప లి కి రట!నదిగో నొద్ది క , పరమత సహనము చద్దుల బ్రతుకమ్మ నా డే షం షా ద్ బేగం. వందనము.
బహు బాగున్నది మీ ద్విపద మాలిక. కొన్నాళ్ళ క్రితం మీ ద్విపద కావ్యం: "పద్మావతీ శ్రీనివాసం" పది ప్రింట్లు తీసి మా బంధుమిత్రులకు పంపియుంటిని. సీతా దేవికి కూడా.
సాహితీ సభలు, కవితా గోష్ఠులు, పుస్తకావిష్కరణలు,దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా వాటికి వెళ్ళటం (తెలిపినా తెలుపకున్నా,పిలిచినా పిలువకున్నా తెలిస్తేచాలు)నా కలవాటు.31-10-2013 న రిటైర్ అయ్యాక ఇవి కొంచెం ఎక్కువయ్యాయి. (సుమారు నలభై) చాలా చోట్ల శ్రోతలకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.అది గమనించి నేను వ్రాసుకున్న పద్యంఇది. కం. నా డన్నము కొరకు కవులు వాడిగ వ్రాసిరి కవితలు వాసిగ నేర్పున్ నేడన్నము పెట్టించుట వాడుక కవులకు కవితలు వాకొన నకటా !
పద్దెము పాటలు పాడుచు
రిప్లయితొలగించండిహద్దులు లేనట్టి వాణి హైదరబాదున్
ప్రొద్దుట దినమున రాత్రియు
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
షంషాద్ బేగం (హిందీ సినిమా గాయని)
ముద్దకు సంస్కృతి గలిగిన
రిప్లయితొలగించండినొద్దిక తెలగాణ భువిని నొయ్యారంబౌ
విద్దెల గని పరవశయై
చద్దుల బ్రతుకమ్మ నాడే షంషాద్బేగమ్.
హద్దులు లేకయె పండుగ
రిప్లయితొలగించండినొద్దికగా కలిసి మెలిసి యూరి జనమ్ముల్
ముద్దుగ నాడుట సహజము
"చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్"
ముద్దగు -అని మొదటిపాదంలో, నాదె -అని నాలుగవపాదంలో చదువ మనవి.
రిప్లయితొలగించండిరద్దయె బానిస బతుకులు
రిప్లయితొలగించండిమొద్దులవలె నిదురలేల?పూజకురండీ!
పెద్దలు దీవింపంగన్.
చద్దుల బ్రతుకమ్మనాడె షంషాద్ బేగమ్
హద్దులు మీరిన హర్షం
రిప్లయితొలగించండిబద్దిన ముఖ సీమతోడ నతివలు ఘనులై
ముద్దుగ నాడెడు వేళగు
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్!
వద్దనక సంతసంబున
రిప్లయితొలగించండిపద్దెనిమిదిమంది పొరుగు వారలతోడన్
ముద్దగు మతసహనముతో
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.
రిప్లయితొలగించండిముద్దుల లరారు మోరము
తద్దయు మించారు నగవు, తరుణంబననౌ,
నొద్దిక గా పుట్టెనుగద
చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్ !
జిలేబి
వైవిధ్యమైన పూరణ! 👏👏👏👏
తొలగించండివెరైటీగా బాగున్నది.అభినందనలు !
తొలగించండి
తొలగించండిఇరువురుకీ నెనర్లు !
Ignorance is bliss !
చద్దుల బతుకమ్మ అంటే ఏమిటో తెలియక పదాల పేర్పంతే !
చద్దుల బతుకమ్మ అంటే ఏమిటి ?
జిలేబి
తెలంగాణాలో దేవీనవరాత్రులలో చక్కగా తట్టలలో పూవులను పేర్చి వాటిచుట్టూ తిరుగుతూ అమ్మవారి పాటలు పాడుతూ స్త్రీలందరూ సంబరంగా జరుపుకునే పండుగ! ఆంధ్ర్రలో సంక్రాంతికి గొబ్బెమ్మల పండుగ వలె!
తొలగించండితెలంగాణ వారు యింకా వివరంగా తెలుపగలరు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజిలేబీ గారికి అంకితం:
తొలగించండికద్దుగ 'పూవుల' 'బియ్యము'
ముద్దుగ 'అటుకుల' 'అలిగిన'
'ముద్దల' 'అట్టుల్'
కొద్దిగ 'వేపల' 'వెన్నల'
'చద్దుల' బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
నవరాత్రుల బతుకమ్మ:
1. ఎంగిలి పూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. ముద్దపప్పు బతుకమ్మ
4. నానే బియ్యం బతుకమ్మ
5. అట్ల బతుకమ్మ
6. అలిగిన బతుకమ్మ
7. వేపకాయల బతుకమ్మ
8. వెన్నముద్దల బతుకమ్మ
9. చద్దుల బతుకమ్మ
తొలగించండిజీపీయెస్ వారు
నమో నమః
జిలేబి
బతుకమ్మలన్నింటిని కందంలో యిమిడ్చిన సొగసు బహు బాగున్నది!👏👏👏👏
తొలగించండి____/\__
తొలగించండిసిద్ధయ్య పెండ్లి యాడెను
రిప్లయితొలగించండిసద్దాము తనయను మెచ్చి, సంతోషముతో
పెద్దలు ప్రోత్సాహ పరచ
చద్దుల బ్రపుకమ్మ నాడె షంషాద్ బేగమ్
సిద్ధయ్య పెండ్లి యాడెను
రిప్లయితొలగించండిసద్దాము తనయను మెచ్చి, సంతోషముతో
పెద్దలు ప్రోత్సాహ పరచ
చద్దుల బ్రపుకమ్మ నాడె షంషాద్ బేగమ్
శ్రద్ధగ పూజలు జేయుచు
రిప్లయితొలగించండిహద్దులు మీరక మనుగడ హాయి యటంచున్
బుద్ధిగ పదుగురి చెలిమిని
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగం
ముద్దని పరమత సహనము
రిప్లయితొలగించండిహద్దులనుచెరిపి కరమగు నానందముతో
నొద్దికగ హిందువులతో
చద్దుల బ్రతుకమ్మ నాడే షంషాద్ బేగమ్
డా.పిట్టా
రిప్లయితొలగించండి"గద్దరె""యాద్గిరి కేగెన్
వద్దని బురఖాల బ్రతుకు బాసిరి వనితల్
ఖుద్దుగ "సిద్దీపేట"న
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్!
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా, "షిర్డీపేట"యె "సిద్దిపేట"గా మారిందేమో.మీ సమస్యకు సిద్ధి లభించిన స్థానమది.చాలా అద్భుత సమస్య యిది.ధన్యవాదములు!
డా.పిట్టా
రిప్లయితొలగించండిగద్దర్ గారి ఆత్మ కథను ఆంగ్లంలోని కనువదించి ప్రచురించాను.వీరి యింటిలో దేవుళ్ళ పటాలు లేకుంటే తన తల్లి మానసిక పూజ చేసినట్లు వ్రాసుకున్న పాటల రాజు యాదగిరిని సందర్శించినట్లు వార్తలలో చదివినాను.
డా.పిట్టా
రిప్లయితొలగించండి"ఖుద్దు"ఖద్ అనే ఉర్దూ పదం T.S.లో "స్వయంగా"అనే stress ను తెలిపే పదము.Thanks.
మైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండిఇద్దరికిని మతపరిమితి
కద్దని మన కల్వకుంట్ల కవితయె దెల్పన్
ముద్దుగ ముసుగుల తోడనె
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా}
బే.గమ్ అంటే దుఃఖమెరుగనిది. రాణి అనే గౌరవ వాచకము.ఈ యెంపిక T.S పాలనను గుర్తు చేస్తున్నది.స్త్రీలకు , సర్వ జాతులకు మేలు చేకూర్చే పతకాల స్రష్టకు (కేసియార్ కు) అభినందనలు.మీ పేరు యెంపిక సరస్వతీ కటాక్షమే.
దద్దరిలుగొంతుతోడన
రిప్లయితొలగించండిచద్దులబ్రతుకమ్మనాడెషంషాద్ బేగమ్
ముద్దులగుమ్మలుబాడగ
దద్దయువినసొంపుగలుగదానునుబాడెన్
అందరికీ సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఒద్దికగా రాగమ్ముల
నద్దుచు నేపథ్యగాన మందించమన
న్నద్దైవమె కరుణించఁగ
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
(గాయనియైన షంషాద్ బేగమ్)
ఒద్దిక హిందూ ముస్లిం
రిప్లయితొలగించండిముద్దియలు చెలిమిని గూడి మోదముమీరన్
మద్దతు తెలుపుతు మెలగగ
చద్దుల బతకమ్మ నాడె షంషాద్ బేగమ్!
*ఒద్దికగా మతసమరస*
రిప్లయితొలగించండి*బుద్దిని జూపించి నాడు బోనము నెత్తెన్*
*ముద్దుగ బూవుల బేర్చుచు*
*చద్దుల బతుకమ్మ నాడె షంషాద్ బేగం*
మిద్దెనుగట్టించుక తా
రిప్లయితొలగించండిముద్దుగ జొచ్చుటకు మంచి మూర్తంబడగన్
పెద్దలుజెప్పగ జేరెను
చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్.
డా.బల్లూరి ఉమాదేవి. 28/9/17
రిప్లయితొలగించండి28, సెప్టెంబర్ 2017, గురువారం
*"చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్"*
నిద్దుర మానుచు సుదతియు
చద్దుల బ్రతుకమ్మ నాడె, షంషాద్ బేగమ్
యద్దమ రేయిన సడివిని
సద్దును చేయక గబగబ సాగెను చూడన్.
హద్దుల నెంచక చెలితో
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
నొద్దికగానచ్చోటనె
ముద్దుగ నెల్లర కనుచును మురిపెము తోడన్.
ఇద్ధరలో జనులందరు
నొద్దికతో కలసి మెలసి యుండగ వలెస
ద్బుద్ది నటంచును ముదమున
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.
గురువు గారికి నమస్సులు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.కవి మిత్రులందరికి దేవీ నవరాత్రుల పండుగ రోజున శుభాభినందనలు.
రిప్లయితొలగించండిముద్దులొలికే డి దంపత
లిద్దరు దరహసమున ప లి కి రట!నదిగో
నొద్ది క , పరమత సహనము
చద్దుల బ్రతుకమ్మ నా డే షం షా ద్ బేగం.
వందనము.
ఇద్దినపుశుభాకాంక్షలు
రిప్లయితొలగించండినద్దిరబ్రతుకమ్మపర్వమగుటనువలన
న్నిద్దినముపూజజేసియు
చద్దన్నమునాహరింపసంతసమొందున్
అందరికీ సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఒద్దికగా రాగమ్ముల
నద్దుచు నేపథ్యగాన మందించమన
న్నద్దైవమె కరుణించఁగ
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
(గాయనియైన షంషాద్ బేగమ్)
అద్దుకొన మదిని బల్లను
రిప్లయితొలగించండిగ్రుద్ది నటుల నా నెలఁతుక కుల మత తతులన్
ముద్దుగ భేదము వలదని
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్
22 Oct. 2015 నాటి నా సంపూర్ణ బతుకమ్మ పాట:
తొలగించండిద్విపద మాలిక :
శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ
ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపార సక్కఁగ జూడఁగ రావె
వెతలన్ని బాపఁగ వేగంబ రావె
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి
మాయమ్మ దుర్గమ్మ మము గన్న తల్లి
యాయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ
తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు
కమనీయ గరికలు కనువిందు కట్ల
రమణీయ దోసలు లావణ్య బీర
చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందరు జేరి వాలుగ పేర్చి
పసుపు గౌరినిఁ జేసి వాటిపై నుంచి
వసుధను తంబల ప్రభల నీయంగ
నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడ
కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు
కుదురుఁగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.
శ్రీయుతులు కామేశ్వర రావు గారూ:
తొలగించండిబహు బాగున్నది మీ ద్విపద మాలిక. కొన్నాళ్ళ క్రితం మీ ద్విపద కావ్యం: "పద్మావతీ శ్రీనివాసం" పది ప్రింట్లు తీసి మా బంధుమిత్రులకు పంపియుంటిని. సీతా దేవికి కూడా.
నమస్సులు!
శాస్త్రి గారు నమస్సులు. ధన్యవాదములు. అవునం డీ విషయమున నాకు మహదానందము.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివ్యాకరణ వివరణ:
తొలగించండికమనీయ గరికలు, రమణీయ దోసలు, లావణ్య బీర సమాసములందు గరిక, దోస , బీర లు లతల నామములు గనుక యథా పదము గ్రహించి సిద్ధ సమాసముగా చేసితిని.
బ్రతుకమ్మపాటజదువగ
రిప్లయితొలగించండిబ్రతుకమ్మే వచ్చినటుల భావంబయ్యె
న్నతులితమగు నీకవితకు
సతతముకామేశ!యిచ్చుశంభుడు సిరులన్
అన్నయ్య నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమిత్రులకు నమస్కారములు పై సమస్య నాకు అర్ధం కాలేదు ఇది తెలంగాణ రాష్ట్ర సంబందితమని కొంత గోచరము అగుచున్నది. కొద్దిగా వివరించ గలరు.
రిప్లయితొలగించండిబతుకమ్మ పండగ యని గూగుల్ లో వికిమీడియా లో చూడండి
రిప్లయితొలగించండిదేవ్యవతారములవలెను
రిప్లయితొలగించండినవ్యముగాదెలిసికొంటినవబతుకమ్మ
ల్భవ్యులుమీమూలంబున
సవ్యముగాబూజజేయశాస్త్రీ! సిరులే.
-----
ఏకవచన సంబోధనకు క్షంతవ్యుడను
____/\__
తొలగించండిఒద్దిక నెల్లరు కులమత
రిప్లయితొలగించండిహద్దుల విడనాడి మనెడు హైద్రాబాదున్
కద్దగు నీ గతి సందడి
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్.
బ్రతుకమ్మ దశపద సీసమాలిక
రిప్లయితొలగించండినవబతుకమ్మలతో
ఉల్లాన మ్రొక్కెద చల్లంగ చూడు “యెం
గిలిపూల బతుకమ్మ” గింజ పండ
ఆటుపోటులనున్న ఆదాయ మార్గమ్ము
“అటుకుల బతుకమ్మ” అందజేయ
పిల్లపా పలతోడ నిల్లుండ “ముద్దప
ప్పుబతుకమ్మ” యిడుము పుణ్య మాత
చదవగ నుచదువు సందెలు “నానబి
య్యంబతుకమ్మ” ఇయ్యమ్మ యెపుడు
గొడ్లెల్ల పాలిచ్చి గోదాము నిండంగ
మా “అట్ల బతుకమ్మ” మాకునిమ్ము
అల్లన లుకదీర్చ బెల్లపు బస్తాలు
“అలిగిన బతుకమ్మ” కందజేతు
ఆనంద జీవిత మందజే యుచు”వేప
కాయల బతుకమ్మ” కాచుమమ్మ
స్వాగతిం తుమునిన్ను వాకిళ్ళ నో “వెన్న
ముద్దల బతుకమ్మ” ముగ్గు లేసి
ఊరూర నూరేగ ఉత్సవ ముల తోడ
“ సద్దుల బతుకమ్మ” సద్దుజేసి
గౌరమ్మ కాపాడు కలకాల ముండంగ
చల్లంగ దీవించు జనుల నెపుడు
తే.గీ. ఆయు రారోగ్య భాగ్యాల నంద జేసి
శాంతి సౌఖ్యాల వర్థిల్ల సంతతమ్ము
పాడి పంటల తోనెప్డు పరగుచుండ
కరుణ జూపుచు బ్రతుకమ్మ కావుమమ్మ
ముద్దులనొలుకెడుపూవుల
రిప్లయితొలగించండినొద్దికతోకూర్చిపేర్చినుత్సాహములో
హద్దులుముదితలకేలని
చద్దులబ్రతుకమ్మనాడెషంషాద్ బేగమ్!
"నొద్దికతోకూర్చిపేర్చినుత్సాహముతో" అంటే చివరి రెండు పాదాలకి కూడా అన్వయించి బాగుంటుందేమో.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా “శ్రీమదాంధ్ర సుందర కాండ” ద్వాత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
తొలగించండిగాలిపట్టిఁ దెలివరుల మేలిమి నెఱి
మేటి నోటి వానిని మేని మెఱపు వాని
కోతి గమికాని మాటల చేతకాని
సామవాయికునిని చూచె లేమ సీత
మూలము:
సా వీక్షమాణా పృథుభుగ్నవక్త్రం
శాఖామృగేన్ద్రస్య యథోక్తకారమ్.
దదర్శ పిఙ్గాధిపతే రమాత్యం
వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠమ్৷৷5.32.7৷৷
చక్కని సరళమైన యనివాదము! 🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిఅనువాదము!
తొలగించండిడా. సీతా దేవి గారు ధన్యవాదములు. వీలైనపుఁ డచ్చ తెనుగు సమాసములను వాడుచున్నాను.
తొలగించండిసాహితీ సభలు, కవితా గోష్ఠులు, పుస్తకావిష్కరణలు,దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా వాటికి వెళ్ళటం (తెలిపినా తెలుపకున్నా,పిలిచినా పిలువకున్నా తెలిస్తేచాలు)నా కలవాటు.31-10-2013 న రిటైర్ అయ్యాక ఇవి కొంచెం ఎక్కువయ్యాయి. (సుమారు నలభై) చాలా చోట్ల శ్రోతలకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.అది గమనించి నేను వ్రాసుకున్న పద్యంఇది.
రిప్లయితొలగించండికం. నా డన్నము కొరకు కవులు
వాడిగ వ్రాసిరి కవితలు వాసిగ నేర్పున్
నేడన్నము పెట్టించుట
వాడుక కవులకు కవితలు వాకొన నకటా !
చాల చక్కని నిజం చెప్పారు! నాడు పద్యాలు , కావ్యాలు వ్రాయించుకుని స్వీకరించి దక్షిణలు యిచ్చేవారు. నేడు దక్షణలిచ్చి పద్యాలు, కవితలు వినిపిస్తున్నారు!
రిప్లయితొలగించండిచాల చక్కని నిజం చెప్పారు! నాడు పద్యాలు , కావ్యాలు వ్రాయించుకుని స్వీకరించి దక్షిణలు యిచ్చేవారు. నేడు దక్షణలిచ్చి పద్యాలు, కవితలు వినిపిస్తున్నారు!
రిప్లయితొలగించండి