సీ.
శంభుడు,యచలుడు,చంద్రశేఖరుడు,పంచాస్వుడు,ఈశుడు, చదిర ధరుడు,
కాంతిమంతుడు,కురంగాంకుడు,సాంబుడు, ఫాలుడు,జలజుడు,భర్గుడు,శశి,
శ్రీవర్దనుడు, శూలి,సింధు జన్ముడు, అంబుజన్ముడు,బుద్నుడు, చండుడు,పుర
హరుడు,అఘోరుడు,యక్షికౌక్షేయుడు, నభవుడు, భానువు, నటన ప్రియుడు,
ముక్కంటి,పురభిత్తు,మృడుడు,కంకటీకుడు,అంధకరిపువు,కోడె రౌతు,
అంగమోముల వేల్పు,అంబర కేశుడు,,బుడిబుడి తాల్పుడు, బూచులదొర,
మదనారి,సుబలుడు,మరుగొంగ,వామార్ధజాని,గజరిపువు,జంగమయ్య,
జడముడి జంగము,శంకువు,,శర్వుడు,సగమాట దేవర,జ్వాలి,ఖరువు,
గోపాలుడు,విలాసి,కోకనదుడు, విష ధరుడు, జోటింగుడు త్ర్యంగటముడు,
అంబరీషుడు, స్వామి, అజితుడు నకులుడు , చండీశుడు ,పురారి, చంద్ర ధరుడు
హరకుడు అభవుడు హంసుడు సాంఖ్యుడు, అనిరుద్ద్డుడు,కపర్ది, అజుడు. విధుడు,
రాజధరుడు మందరమణి, భూతేశుడు, ధూర్జటి,తుంగుడు ధూర్తుడు పశు
తే.గీ.
పతి,అసమనేత్రుడు, కపాలి భార్గవుండు,
పంచ వక్త్రుడు ,కామారి, పంచ ముఖుడు,
శమన రిపుడు మలహరుడు , శశివకాళి,
గరళ కంఠుడు సతతము కాచు చుండు
కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్