4, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2482 (జనహననముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

47 కామెంట్‌లు:

  1. మననము జేయుచు ధర్మము,
    ఘనమగు నడవడి గడపుచు కాలమ్ము, సదా
    జననము సార్థకముగ దు
    ర్జనహననము జేయువాడె జనవంద్యు డగున్.

    రిప్లయితొలగించండి
  2. జనులకు రక్షణ కూర్పగ
    వనిలో దుర్మార్గులంత వడిగా పెరుగన్
    కనుగొని కలియుగ రాక్షస
    జన హననముఁ జేయువాఁడె జనవంద్యుఁడగున్

    రిప్లయితొలగించండి
  3. వనముల సంచారమునన్
    ఘనమగు "బల" మంత్రవాక్య కథనము తోడన్
    మనమున ప్రియతమమగు భో
    జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

    రిప్లయితొలగించండి


  4. వనమాలిని భజియించుచు
    తన పనులను కర్మ మార్గ తత్త్వమున జిలే
    బి, నడుపు కొనుచున్నుద్వే
    జన హననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది వారికి

      మీ చార్ ధామ్ యాత్ర బాగా జరుగుతున్న దనుకుంటాను.

      ఉద్వేజన - వెఱపు; కలత ->
      ఆంధ్రభారతి ఉవాచ సరియేనాండి ?

      జిలేబి

      తొలగించండి
    2. ఇప్పుడే గ్వాలియర్ దాటింది మా రైలు. మరో రెండు గంటల తర్వాత ఆగ్రాలో దిగుతాము. ధన్యవాదాలు.
      ఈ మొబైల్ ఫోన్ లో ఆంధ్ర భారతి చూడటం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఆ విధంగా వ్యాఖ్యానించాను.
      ఇప్పుడు మీ పూరణలోని భావం అవగత మయింది.
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి

    3. తాజు మహలు దర్శనం ఉందాండి ?

      గ్వాలియరు దాటె చుకుచుకు
      రైలూ ! ఆగ్రా జిలేబి రయ్యన వచ్చున్ !
      వాలెదము తాజు మహలున
      చాలా చూడవలసినవి చకచక ముందూ !

      జిలేబి

      తొలగించండి
  5. వన సంరక్షణ కొరకై
    వనమున విష వృక్షములను వదలు కొను గతి
    న్ననివార్య మగు నపుడు దు
    ర్జన హననము జేయువాడె జనవంద్యుడగున్.

    రిప్లయితొలగించండి
  6. Sound pollution
    గుంజన=శబ్దం వావిళ్ళ సం-తె నిఘంటువు.

    విన ఘోరము,చెవి రోగము,
    పనులకు చేటొనరఁగూర్చు పట పట రావం.
    బునుఁజేయు పెద్దదౌ గుం
    జన హననముఁజేయువాఁడె జనవంద్యుఁడగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాదరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆగ్రాలోఆగుతున్నారా?దయాల్బాగ్ స్వామీబాగ్ దర్శించండి

      తొలగించండి
    3. ధన్యవాదాలు. కానీ మా బస్సు డ్రైవర్ "ఈరోజు దయాల్ బాగ్ మూసి ఉంటుంది" అన్నాడు. నిజమో కాదో తెలియదు. ప్రస్తుతం మథురకు! వెళ్ళే దారిలో ఉన్నాం.

      తొలగించండి
  7. వనితల నవమానించుచు
    ధనమొక్కటె లక్ష్య మనుచు దయలే కుండన్
    మనుజుల వంచించెడు దు
    ర్జన హననము జేయువాడె జనవంద్యుడగున్ .

    రిప్లయితొలగించండి
  8. జనులకు నేహ్య ము కలుగ దె
    జన హననము జేయువాడే ;;జన వన్ద్యు డ గు న్
    జన హిత ము ను గోరు కోనుచు
    జన సేవ యె నూ పి ।ర ను చు సంత సమందు న్

    రిప్లయితొలగించండి
  9. మనమున సద్భావనలే
    జనియించగ ముదము మీర జనుల మనసులన్
    కనిపించెడు,కులమత విభ
    జన హననము జేయువాడె జనవంద్యుడగున్

    రిప్లయితొలగించండి
  10. మనమున సద్భావనలే
    జనియించగ ముదము మీర జనుల మనసులన్
    కనిపించెడు,కులమత విభ
    జన హననము జేయువాడె జనవంద్యుడగున్

    రిప్లయితొలగించండి
  11. అనిలో జయము లభించగ
    మననముజేయుచునజితుని మహితాత్ముండై
    ఘనముగ దేవతలనురం
    జన హననము జేయువాడె జనవంద్యుడగున్

    రిప్లయితొలగించండి
  12. కురుక్షేత్రములో శ్రీకృష్ణుడు అర్జునుని తో...

    మన ద్రౌపది కవమానము
    వనవాసాజ్ఞాత వెతల, బాలుని వధలన్
    గని వరుసలె? ధర్మమె? దు
    ర్జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁడగున్!

    రిప్లయితొలగించండి
  13. వనియ కలుగక వగచుగద
    జనహననముఁ జేయువాఁడె, జనవంద్యుఁ డగున్
    ఘనముగ మేలును జేయుచు
    జనులకు నండగ నిలచెడి జనపదు డెపుడున్

    రిప్లయితొలగించండి
  14. ఆగ్రా లో రైలాగిన
    మోగ్రా వర్ణపు మహలును మోదము తోడన్
    మీ గ్రీవమునెత్తి కనుమ,
    అగ్రేయుడ, సర్వ రసుడ, యానందముగన్

    రిప్లయితొలగించండి
  15. అనయము ధర్మము నెఱపుచు
    జనహితముగ పాలనమ్ము సాగించంగా
    ఘనమగు చట్టము గొని దు
    ర్జన హననము జేయువాడె జన వంద్యుడగున్!

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వినశన మెంచుచు దనుజులు
    తనరించెడి చేష్ఠలు గని తన మహిమలతో
    జనుల నరయుచున్ దానవ
    జనహననము జేయువాడె జనవంద్యుడగున్



    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి వందనములు. ఆగ్రాలో " పేటా " అనబడే బూడిదగుమ్మడి కాయతో చేసిన స్వీటు చాల బాగుంటుంది, అక్కడ అది చాలా ప్రఖ్యాతి వహించింది. రుచి చూడండి.
    ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


    మనదేశపు హద్దులలో

    ననువుగ నక్కుచు - తెగి౦చి - సాయుధుడై తా

    ననయమ్ము , శత్రుసైనిక

    జనహననము చేయు వాడె జనవ౦ద్యు డగున్ !

    రిప్లయితొలగించండి
  19. వనజభవుండు వలికె ద
    క్షునితో ముదమారఁ గనుమ సుతులను ధరణిం
    గన సృష్టి నిలువఁగ వలెన్
    జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

    [హననము = హెచ్చవేఁత (గుణకారము)]

    రిప్లయితొలగించండి
  20. వినుమాయీయదిమరిదు
    ర్జనహననముజేయువాడెజనవంద్యుడగు
    న్ననయముజెడునాలోచన
    గనుచునుబాధించుగతనగాపురుషుండై

    రిప్లయితొలగించండి
  21. అనునయముగ మాటాడుచు
    వనితల, పిల్లల హరించి వ్యాపారమునన్
    వినియోగించెడు వంచక
    జనహననము జేయువాడె జనవంద్యుడిలన్!

    రిప్లయితొలగించండి
  22. ధనమాశకు బెట్టెడి భో
    జనహననము జేయువాడె|”జన వంద్యుడగున్
    తినగల తిండిని బెట్టక
    అనవరతము కల్తి తిండినందించుటచే|

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఆగ్రా కోట, తాజ్ మహల్ చూసి మథురకు బయల్దేరాము.

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వినశన మెంచుచు దనుజులు
    తనరించెడి చేష్ఠలు గని తన మహిమలతో
    జనుల నరయుచున్ దానవ
    జనహననము జేయువాడె జనవంద్యుడగున్



    రిప్లయితొలగించండి
  25. తనపై నమ్మక ముంచిన
    జనులను కాపాడువాడు, సంకటమైనన్
    అనయము ధైర్యము గొని
    జనహననము జేయువాడె జనవంద్యుడగున్

    రిప్లయితొలగించండి
  26. డా.పిట్టా
    జనమొక్కటె మనకూటమి
    జనులితరులు చావు కొరకె జననం బవగా
    మన జన మై యైస్స్స్యై (gun)గన్
    జన హననము జేయు వాడె జనమాన్యుడగున్...I.S.I ఉవాచ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టికెట్ ధర అంత ఎక్కువనే సరికి ఫ్లైట్ జర్నీ అనుకున్నాను.మాకు కేవలం Rs.11,000 (per person) చార్జ చేసి బెంగ్లూరు టు బాంబే; బాంబే టు బెంగ్లూరు, ఫ్లైట్ జర్నీ, బాంబే నుండి షిర్డీ ,నాసిక్, త్ర్యంబకేశ్వర్, పంచవటి , శని సింగనాపూర్ A.C.Luxury బస్ లో చూపించారు. మూడు నక్షత్రాల హోటల్ వసతి, భోజనాలు, టిఫిన్లు అన్నీషిర్డీలో VIP దర్శన టికెట్లు, వారివే. మాకు ఖర్చయింది దేవళాల్లో దక్షిణలు, సొంత షాపింగు ఖర్చులు మాత్రమే.

      తొలగించండి
    2. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, హరి గారికి,ప్రసాద్ రావు గారికి,సీతాదేవి గారికి, కృష్ణ సూర్య కుమార్ గారికి కామేశ్వరరావు గారికీ, రాజేశ్వరి అక్కగారికి ధన్యవాదాలు. 63వ యేట అడుగు బెట్టాను. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.

      తొలగించండి
  27. మథుర, బృందావనం దర్శించుకుని రిషీకేశ్ బయలుదేరాము.

    రిప్లయితొలగించండి


  28. అనయము విడువక పాపపు

    పనులను చేయుచు సుజనుల బలముల నెల్లన్

    చులకనగా చూచెడి కు

    జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

    రిప్లయితొలగించండి