4, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2482 (జనహననముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

47 కామెంట్‌లు:

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

మననము జేయుచు ధర్మము,
ఘనమగు నడవడి గడపుచు కాలమ్ము, సదా
జననము సార్థకముగ దు
ర్జనహననము జేయువాడె జనవంద్యు డగున్.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

జనులకు రక్షణ కూర్పగ
వనిలో దుర్మార్గులంత వడిగా పెరుగన్
కనుగొని కలియుగ రాక్షస
జన హననముఁ జేయువాఁడె జనవంద్యుఁడగున్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

వనముల సంచారమునన్
ఘనమగు "బల" మంత్రవాక్య కథనము తోడన్
మనమున ప్రియతమమగు భో
జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

Zilebi చెప్పారు...



వనమాలిని భజియించుచు
తన పనులను కర్మ మార్గ తత్త్వమున జిలే
బి, నడుపు కొనుచున్నుద్వే
జన హననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్ !

జిలేబి

gurram.jana@gmail.com చెప్పారు...

వన సంరక్షణ కొరకై
వనమున విష వృక్షములను వదలు కొను గతి
న్ననివార్య మగు నపుడు దు
ర్జన హననము జేయువాడె జనవంద్యుడగున్.

కంది శంకరయ్య చెప్పారు...

బాపూజీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
ఉద్వేజన...?

కంది శంకరయ్య చెప్పారు...

జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Zilebi చెప్పారు...

కంది వారికి

మీ చార్ ధామ్ యాత్ర బాగా జరుగుతున్న దనుకుంటాను.

ఉద్వేజన - వెఱపు; కలత ->
ఆంధ్రభారతి ఉవాచ సరియేనాండి ?

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

ఇప్పుడే గ్వాలియర్ దాటింది మా రైలు. మరో రెండు గంటల తర్వాత ఆగ్రాలో దిగుతాము. ధన్యవాదాలు.
ఈ మొబైల్ ఫోన్ లో ఆంధ్ర భారతి చూడటం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఆ విధంగా వ్యాఖ్యానించాను.
ఇప్పుడు మీ పూరణలోని భావం అవగత మయింది.
చక్కని పూరణ. అభినందనలు.

BVVHBPrasadarao చెప్పారు...

Sound pollution
గుంజన=శబ్దం వావిళ్ళ సం-తె నిఘంటువు.

విన ఘోరము,చెవి రోగము,
పనులకు చేటొనరఁగూర్చు పట పట రావం.
బునుఁజేయు పెద్దదౌ గుం
జన హననముఁజేయువాఁడె జనవంద్యుఁడగున్

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాదరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదాలు

BVVHBPrasadarao చెప్పారు...

ఆగ్రాలోఆగుతున్నారా?దయాల్బాగ్ స్వామీబాగ్ దర్శించండి

విరించి చెప్పారు...

వనితల నవమానించుచు
ధనమొక్కటె లక్ష్య మనుచు దయలే కుండన్
మనుజుల వంచించెడు దు
ర్జన హననము జేయువాడె జనవంద్యుడగున్ .

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Zilebi చెప్పారు...


తాజు మహలు దర్శనం ఉందాండి ?

గ్వాలియరు దాటె చుకుచుకు
రైలూ ! ఆగ్రా జిలేబి రయ్యన వచ్చున్ !
వాలెదము తాజు మహలున
చాలా చూడవలసినవి చకచక ముందూ !

జిలేబి

Kr rajeshwar rao చెప్పారు...

జనులకు నేహ్య ము కలుగ దె
జన హననము జేయువాడే ;;జన వన్ద్యు డ గు న్
జన హిత ము ను గోరు కోనుచు
జన సేవ యె నూ పి ।ర ను చు సంత సమందు న్

మంజూషిక చెప్పారు...

మనమున సద్భావనలే
జనియించగ ముదము మీర జనుల మనసులన్
కనిపించెడు,కులమత విభ
జన హననము జేయువాడె జనవంద్యుడగున్

మంజూషిక చెప్పారు...

మనమున సద్భావనలే
జనియించగ ముదము మీర జనుల మనసులన్
కనిపించెడు,కులమత విభ
జన హననము జేయువాడె జనవంద్యుడగున్

A.Satyanarayana Reddy చెప్పారు...

అనిలో జయము లభించగ
మననముజేయుచునజితుని మహితాత్ముండై
ఘనముగ దేవతలనురం
జన హననము జేయువాడె జనవంద్యుడగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కురుక్షేత్రములో శ్రీకృష్ణుడు అర్జునుని తో...

మన ద్రౌపది కవమానము
వనవాసాజ్ఞాత వెతల, బాలుని వధలన్
గని వరుసలె? ధర్మమె? దు
ర్జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁడగున్!

pks kumar చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
pks kumar చెప్పారు...

వనియ కలుగక వగచుగద
జనహననముఁ జేయువాఁడె, జనవంద్యుఁ డగున్
ఘనముగ మేలును జేయుచు
జనులకు నండగ నిలచెడి జనపదు డెపుడున్

pks kumar చెప్పారు...

ఆగ్రా లో రైలాగిన
మోగ్రా వర్ణపు మహలును మోదము తోడన్
మీ గ్రీవమునెత్తి కనుమ,
అగ్రేయుడ, సర్వ రసుడ, యానందముగన్

Sreedhara Rao Machavolu చెప్పారు...

అనయము ధర్మము నెఱపుచు
జనహితముగ పాలనమ్ము సాగించంగా
ఘనమగు చట్టము గొని దు
ర్జన హననము జేయువాడె జన వంద్యుడగున్!

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

వినశన మెంచుచు దనుజులు
తనరించెడి చేష్ఠలు గని తన మహిమలతో
జనుల నరయుచున్ దానవ
జనహననము జేయువాడె జనవంద్యుడగున్



Sreedhara Rao Machavolu చెప్పారు...

గురువు గారికి వందనములు. ఆగ్రాలో " పేటా " అనబడే బూడిదగుమ్మడి కాయతో చేసిన స్వీటు చాల బాగుంటుంది, అక్కడ అది చాలా ప్రఖ్యాతి వహించింది. రుచి చూడండి.
ధన్య వాదములు.

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


మనదేశపు హద్దులలో

ననువుగ నక్కుచు - తెగి౦చి - సాయుధుడై తా

ననయమ్ము , శత్రుసైనిక

జనహననము చేయు వాడె జనవ౦ద్యు డగున్ !

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వనజభవుండు వలికె ద
క్షునితో ముదమారఁ గనుమ సుతులను ధరణిం
గన సృష్టి నిలువఁగ వలెన్
జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

[హననము = హెచ్చవేఁత (గుణకారము)]

subbarao చెప్పారు...

వినుమాయీయదిమరిదు
ర్జనహననముజేయువాడెజనవంద్యుడగు
న్ననయముజెడునాలోచన
గనుచునుబాధించుగతనగాపురుషుండై

seethadevi gurram చెప్పారు...

అనునయముగ మాటాడుచు
వనితల, పిల్లల హరించి వ్యాపారమునన్
వినియోగించెడు వంచక
జనహననము జేయువాడె జనవంద్యుడిలన్!

Unknown చెప్పారు...

ధనమాశకు బెట్టెడి భో
జనహననము జేయువాడె|”జన వంద్యుడగున్
తినగల తిండిని బెట్టక
అనవరతము కల్తి తిండినందించుటచే|

కంది శంకరయ్య చెప్పారు...

కవిమిత్రులకు నమస్కృతులు.
ఆగ్రా కోట, తాజ్ మహల్ చూసి మథురకు బయల్దేరాము.

కంది శంకరయ్య చెప్పారు...

ధన్యవాదాలు. కానీ మా బస్సు డ్రైవర్ "ఈరోజు దయాల్ బాగ్ మూసి ఉంటుంది" అన్నాడు. నిజమో కాదో తెలియదు. ప్రస్తుతం మథురకు! వెళ్ళే దారిలో ఉన్నాం.

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

వినశన మెంచుచు దనుజులు
తనరించెడి చేష్ఠలు గని తన మహిమలతో
జనుల నరయుచున్ దానవ
జనహననము జేయువాడె జనవంద్యుడగున్



Dr Murthy Prayaga చెప్పారు...

తనపై నమ్మక ముంచిన
జనులను కాపాడువాడు, సంకటమైనన్
అనయము ధైర్యము గొని
జనహననము జేయువాడె జనవంద్యుడగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
జనమొక్కటె మనకూటమి
జనులితరులు చావు కొరకె జననం బవగా
మన జన మై యైస్స్స్యై (gun)గన్
జన హననము జేయు వాడె జనమాన్యుడగున్...I.S.I ఉవాచ

gurram.jana@gmail.com చెప్పారు...

శుభం !

కంది శంకరయ్య చెప్పారు...

మథుర, బృందావనం దర్శించుకుని రిషీకేశ్ బయలుదేరాము.

gurram.jana@gmail.com చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurram.jana@gmail.com చెప్పారు...

టికెట్ ధర అంత ఎక్కువనే సరికి ఫ్లైట్ జర్నీ అనుకున్నాను.మాకు కేవలం Rs.11,000 (per person) చార్జ చేసి బెంగ్లూరు టు బాంబే; బాంబే టు బెంగ్లూరు, ఫ్లైట్ జర్నీ, బాంబే నుండి షిర్డీ ,నాసిక్, త్ర్యంబకేశ్వర్, పంచవటి , శని సింగనాపూర్ A.C.Luxury బస్ లో చూపించారు. మూడు నక్షత్రాల హోటల్ వసతి, భోజనాలు, టిఫిన్లు అన్నీషిర్డీలో VIP దర్శన టికెట్లు, వారివే. మాకు ఖర్చయింది దేవళాల్లో దక్షిణలు, సొంత షాపింగు ఖర్చులు మాత్రమే.

gurram.jana@gmail.com చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, హరి గారికి,ప్రసాద్ రావు గారికి,సీతాదేవి గారికి, కృష్ణ సూర్య కుమార్ గారికి కామేశ్వరరావు గారికీ, రాజేశ్వరి అక్కగారికి ధన్యవాదాలు. 63వ యేట అడుగు బెట్టాను. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



అనయము విడువక పాపపు

పనులను చేయుచు సుజనుల బలముల నెల్లన్

చులకనగా చూచెడి కు

జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్