(అగస్టన్ తన భార్య మేరీతో కొడుకు జార్జి వాషింగ్టన్ సత్యసంధత మెచ్చుకుంటూ) అరుణారుణదేహుండు;కొ మరుడగు జార్జి నిజమాడి మనసున్ గదిపెన్; మరియా!సుతుపై నిండగు కరుణను గురిపించదలచి కఠీనుడనైతిన్.
పిల్లలను పెంచే విధానంలో Tough Love చూపించే ఒక తండ్రి తనలో తాను అనుకొంటున్నాడు: తిరముగ పిల్లల పెంచుచు మరిమరి క్రమశిక్షణ నిడు మార్గము నందా తరుణము వచ్చిన నటుపై కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
31 కామెంట్లు:
వరమై వచ్చిన జీవిత
ము రణంబుగ మార కష్ట ముగను నరునిపై,
మరణంబు శరణ్యమనన్,
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్!
జిలేబి
చెరసాల లోన త్రోసితి
కొరడా దెబ్బలుతికించి కోపము గంటిన్
తరియించర గోపన్నా!
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
పరుగిడితి విషయము వినన్
కరుణను గురిపించఁ దలఁచి, కఠినుఁడ నైతిన్
అరచితిఁ వివసుండ నగుచు
జరిగినది స్వయంకృతమని జనులట చెప్పన్.
ధరణీ పతి యొక డనెగా
"దురాత్ముల మదమ్ము నడచి ద్రోహుల ద్రుంచన్
పుర జనులు సజ్జనులపై
"కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్"
(అగస్టన్ తన భార్య మేరీతో కొడుకు జార్జి వాషింగ్టన్ సత్యసంధత మెచ్చుకుంటూ)
అరుణారుణదేహుండు;కొ
మరుడగు జార్జి నిజమాడి మనసున్ గదిపెన్;
మరియా!సుతుపై నిండగు
కరుణను గురిపించదలచి కఠీనుడనైతిన్.
డా.పిట్టా
శ్రీ భగవానువాచ:
మరువకు నను గను భక్తుని
సరకునుగొని లేములెల్ల సంగ్రహ పరతున్
నెర తగులమె విడనాడగ
కరుణను గురపించ దలచి కఠినుడ నైతిన్!
(భవ బంధనములువిడిపోవులాగా,నా భక్తుని సర్వసంపదలను హరిస్తాను.తగులములే ముక్తికి ఆటంకములు.ఈ రూపముగా నేను కఠినుడ నైతినిగదా!..ఇట్లు మీ భగవానుడు)
నరసింహ స్వామి పలుకులుగా:
నిరతము మా సేవకుడై
దురితమ్మున వైరభక్తిఁ తూలు హిరణ్యున్
పరిమార్చి మమ్ము జేర్చెడు
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
వరమడిగిన దనుజుల గని
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
పరుసముగ హింస జేసెడి
నరులే రాబందు లనగ నగుబాట నగన్
What is needed is not the brutal knife of a butcher but the healing touch of a surgeon
ఒక వైద్యుని ఊహ
నరకముతో వ్రణ బాధను
నిరతము భరియించువాని నిర్దయ నేని
త్తరి కోసి తీసివేసెద.
కరుణనుఁగరిపించ దలచి కఠినుడనైతిన్
నిరతము వ్యసనంబులతో
నురుతర రుగ్మతల నంది యున్న సఖునకున్
సురుచిర సద్బోధనలం
గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్.
మైలవరపు వారి పూరణ:
గోవర్ధనోద్ధరణ తరుణంలో ఇంద్రుడు...
కురిపించితి సాంవర్తక
వర ఘనముల భయద వృష్టి వ్రజ జనులారా !
పరమ దయాళుని కృష్ణుని
కరుణను కురిపింప దలచి కఠినుడనైతిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శరణాగతు లాపన్నుల
నిరుపేద ల నాదు కొ న గ నిశ్చల మతితో
దురితము ల రి కట్టు ట కై
కరుణ ను గురి పింపదలచికఠిను డ నైతిన్
అదురహో
జిలేబి
పిల్లలను పెంచే విధానంలో Tough Love చూపించే ఒక తండ్రి తనలో తాను అనుకొంటున్నాడు:
తిరముగ పిల్లల పెంచుచు
మరిమరి క్రమశిక్షణ నిడు మార్గము నందా
తరుణము వచ్చిన నటుపై
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
అద్భుతమైన పూరణ!👌👌👌👌🙏🙏🙏
దాశరథి కరుణాపయోనిధి కదా! చక్కని పూరణ!👏👏👏👏
భారవి పట్ల తండ్రి భావన!
వరపుత్రుని జనులందరు
పరిపరి విధముల పొగడగ పరితోషమునన్
కరమాయుక్షీణమనుచు
కరుణను కురిపించ దలచి కఠినుడనైతిన్!
పరువముగలయొకయాడుది
యురముననాఛ్ఛాదనంబునోపమివలనన్
సరగున కినుక వహించుట
కరుణనుజూపించదలచికఠినుడనైతిన్
గురు శిష్య బంధము మఱచి
తరుణాదిత్య నిభు భీష్ముఁ దలపడి భృశమున్
శరణాగతాంబ పయి తమిఁ
గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
ధరణిని సత్యము నిలిపెడి
చరితార్థుడవీవు నీకు సత్వరమున శ్రీ
కరమగును హరిశ్చంద్రా!
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
భరతావనిలో జనులకు
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
చిరు సమయము దప్పదు వెత,
సరుకుల ధరలు దిగుచుండ సంతస మొచ్చున్
నవంబరు నెల లో నోట్ల రద్దు చేసిన తర్వాత మోడీ మనోగతము
చురచుర మంటల మధ్యన
పరుగెత్తగ లేనిపాము”పరిరక్షించే
తరుణాన కాటువేయుట
కరుణను గురుపించ దలచి కఠినుడనైతిన్|
2.విరివిగ విద్యను నేర్పియు
నిరుపేదకు బిడ్డ నొసగ?నిందలచేతన్
తిరుగుచు ధూషించల్లుని
కరుణను గురిపించ దలచి కఠినుడ నైతిన్|
పూసపాటి వారూ పద్యం బావుంది!
"ధరలు దిగివచ్చుచుండ ధన్యుడనైతిన్"
అంటే యెలా ఉంటుంది?
సీతా దేవి గారు ధన్యవాదములు నాల్గవ పాదములో మీరు సూచించిన వాక్యము గణ భంగము జరిగినది గదా పరిశీలించండి
అవునండీ, సారీ! ధరలవి యని గాని, ధరలే యనిగాని యనవచ్చు ననుకుంటా!😊😊
పరకాంతలననునిత్యము
పరాభవించుచు వసించు పాషండుండౌ
దురితాత్మునిపై కడుని
ష్కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
దురితము లొనర్చు ఛాత్రుని
సరిదిద్దగ నెంచి సతము సన్మార్గములన్
మరలించిహితము దెల్పుచు
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్
పరువముగలయొకయాడుది
యురమునుదాబాదుచుండనోపకయపుడున్
సరగునదండనజేయుట
కరుణనుజూపించదలచికఠినుడనైతిన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి