8, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2486 (పుణ్య మార్జింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. చదువు సంధ్యలు లేనట్టి చక్కనమ్మ
    భక్తి భావము చెలరేగ ముక్తి గోరి
    సాయి భజనల పాటల హాయి గాంచి
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  2. అత్తకోడండ్రు యోచించి యనఘ వ్రతము
    జేయబూనిరి సౌభాగ్య సిరుల గోరి
    పరమ పావనమైనట్టి వ్రతమదయని
    పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడె

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. పావన వినాయక చతుర్ధి పర్వమందు
      ఖైరతాబాదు విఘ్నేశు కాంచనెంచి
      పూలు పండ్లను గూర్చిదా పోవనెంచ
      పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడె!

      తొలగించండి
  4. ఆశ్వియుజ మాసమున నొక్క యాడ పడుచు
    నోము దీక్షగ భక్తితో నోచ దలిచె
    నెటుల నోచగ దగునన్న దెఱుక లేక
    "పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె"

    రిప్లయితొలగించండి
  5. భక్తులందఱు భజనల పాడియాడె
    పుణ్య మార్జింప;పొరుగింటి పొలతిఁగూడె.
    నియ్యదే తరుణమని యెంచి యీశ్వరయ్య
    తగిన శాస్తిని చేయంగ తాతగారు

    రిప్లయితొలగించండి

  6. రుక్మిణీ కళ్యాణ కథను విన రారండి !

    విను చెలియ! మన కన్నడి వివిధ కథల
    విన్న రుక్మిణి మనువాడె విస్మయముగ
    రాక్షస వివాహ పద్ధతి ! రమణి పలుక,
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    పోరు మానరసూయలు పొడము నెపుడు
    పచ్చి గడ్డి నాతుల మధ్య భగ్గుమనదె?
    వాయనము గోరు "వరలక్ష్మీ వ్రతము", సరళ(అనునొక యువతి)/సులభమైన
    పుణ్యమార్జింప పొరుగింటి పొలతి గూడె!
    (సంప్రదాయములు సరళ జీవనమును ప్రోత్సహించునవి.సహజీవన సంధాయ ప్రద మైనవి)

    రిప్లయితొలగించండి
  8. అట్ల తద్దె నోము ను నోచ ఆడ తోడు
    కావలెను, వంటసాయము కలసి మెలసి
    చేసుకొనుచు రమణి దోయి చేసె పూజ ,
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  9. గుడికి బోవంగ పతితోన కోరి కోరి
    పూలు పండ్లను చేకొనె పూజ కొఱకు
    భక్తి లేనట్టి పెనిమిటి పరిహ సింప
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  10. ఆలయమ్మున లలితా సహస్రనామ
    విమల పారాయణమ్మని వినఁగఁ జెప్ప
    మగఁడు రానంచు భీష్మించ మగువ వెడలి
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  11. నాస్తికుండైన విభునకాసక్తిలేక
    దేవునిగుడికి రానని తెలియజేయ
    మంచి పనిఁజేసి సతి గుడి పంచలోన
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  12. భక్తి భావా న బాబాను శక్తి కొలదీ
    నిత్య పూజలు చేసేడు నిర్మలాన్గి
    సాయిమన్దిర మేగేదు సమయమన్దు
    పుణ్య మార్జిoప బొరుగింటే పోలతి గూడె

    రిప్లయితొలగించండి
  13. పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
    అష్టలక్ష్మీ వ్రతముజేయ నతివ యొకతె
    పండు ముత్తైదువ పక్కింటి పంక జాక్షి
    పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడె

    రిప్లయితొలగించండి
  14. పసుపు కుంకుమ సౌభాగ్య ప్రాపు గోరి
    అష్టలక్ష్మీ వ్రతముజేయ నతివ యొకతె
    పండు ముత్తైదువ పక్కింటి పంక జాక్షి
    పుణ్యమార్జింప బొరుగింటి పొలతి గూడె

    రిప్లయితొలగించండి
  15. భక్తి భావంబు మదిలోన ప్రజ్జ్వలింప
    సాగె నొక పడతి జగతిన్ స్వామిని గని
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
    భజనలనట నేర్చు కొనుచు వాసిగాను

    ముక్తి దాయకమిదనుచు శక్తి మేర
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె
    వసుధలో శ్రేష్టమైనదీ భక్తి మార్గ
    మనుచు మదినెంచి ముదమున మహిళ సాగె.

    రిప్లయితొలగించండి
  16. మీదు సేవ సామాజిక మేరువనుచు
    వింటి మన్నయ్య ! వీనులవిందుఁ గాగ
    నేత్రదాన ప్రచారమ్ము నేడనంగ
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  17. సకల సౌభాగ్య దాత భాస్వత్ప్రకీర్త
    విష్ణుపదసేవనారూఢ వినుత కీర్త
    యైన వరలక్ష్మి నోము చేయంగ బిలువ
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  18. అమ్మనాన్నలు తామేగ నన్నవరము
    పుణ్యమార్జింప, బొరుగింటి పొలతిగూడె
    ప్రాయమందున్న జతగాడు ప్రాణమంచు
    మరుని బాణము తప్పింప మనుజు కగునె!

    రిప్లయితొలగించండి
  19. దేశ భాషలలో గొప్ప తెలుగటంచు
    మధుర మంజులమైన దీ మాతృభాష
    మాట లాడును చదవదీ మగువకు నయి
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  20. భక్తిఁ జేయుచు వ్రతమును బడతి యొకతె
    పిలువ నతి గౌరవమ్మున నెలత యరయ
    సువ్రతయ సత్యనారాయణవ్రతమ్ము
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  21. మగని తిప్పలు పెట్టిన మగువ మనసు
    మారగా పతి భక్తిని గోరి తాను
    సీత ద్రౌపది సావిత్రి చెంత నిలువ
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  22. పుణ్యమార్జింప,పొరుగింటి పొలతి గూడె
    భక్త తతినిటు,యాత్రకు పయనమైన
    వారికెటువంటి బాధలు జేరనీక
    తనదు దర్శనంబొనరించె దైవమపుడు

    రిప్లయితొలగించండి
  23. ప్రతి దినమ్మును నర్చింతు భక్తి తోడ
    పుణ్య మార్జింప ,పొరుగింటి పొలతి గూడె
    నుచ్చనీచము ల్లేకుండ యోరుగంటి
    రామ భద్రుడు వింటిరే ? రామలార !

    రిప్లయితొలగించండి
  24. సుగుణ గుణశీల శుభగాత్రి శోభనాంగి
    కమల వాసినిం గొల్వగ విమల చరిత
    లలిత గాత్రంబు జేయగ లలితముగను
    పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె

    రిప్లయితొలగించండి
  25. పుణ్య మార్జింప పొరుగింటి పొలతి గూడె
    నిరుగు పొరుగుల సరసన, వరుస తోడ
    వారలందరు గుమిగూడి వైభవముగ
    రామ కళ్యాణముం జేసె గ్రామ మందు!

    రిప్లయితొలగించండి
  26. నిగమశర్మను బోలెడు నీచుడొకడు
    వనిత నంపె బుట్టింటికి వ్రతము సలిపి
    పుణ్య మార్జింప;బొరుగింటి పొలతి గూడె
    కనుల గప్పిన కామంపు గావరాన.

    రిప్లయితొలగించండి
  27. దేశ సేవయె ముఖ్యంబు,దిగులుమాన్ప
    సైన్య మందున జేరినసాహసాన
    లక్ష్మి లక్ష్యమే సాధించ లౌక్య మందు
    పుణ్య మార్జింప పొరిగింటి పొలతిగూడె|

    రిప్లయితొలగించండి