9, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2487 (పసుల సేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పసుల సేవ పరమపద మొసంగు"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

gurram.jana@gmail.com చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurram.jana@gmail.com చెప్పారు...

నాక మనుచు నెంచి లోక కల్యాణమ్మె
పెద్ద మనసు మఱియు పేర్మి బలిమి
కలిగి నట్టి మేటి కపటము లేని;తా
"పసుల సేవ పరమపథ మొసంగు"

Zilebi చెప్పారు...



వ్యర్థ మౌ జిలేబి, వదులుట మేలు తా
పసుల సేవ ! పరమపద మొసంగు
దేవ దేవు డౌత ! దేహీ యన‌ వలదు
మనుజుల మునుపు, వనమాలి యండ !

జిలేబి

A.Satyanarayana Reddy చెప్పారు...

శక్తిహీనులకును సహకారమందించి
యహమునాదిలోనె యణఁగఁద్రొక్కి
నియతితోడమరియు నిశ్చలమతిని తా
పసుల సేవ పరమపథ మొసంగు

విరించి చెప్పారు...

క్షణిక సుఖము లెల్ల తృణప్రాయముగ నెంచి
యాత్మ శుద్ధి గలిగి హరిని గొలిచి
ముక్తి పథము తెలుపు మోక్షగాములగు తా
పసుల సేవ పరమ పదమొసంగు

విరించి చెప్పారు...

క్షణిక సుఖము లెల్ల తృణప్రాయముగ నెంచి
యాత్మ శుద్ధి గలిగి హరిని గొలిచి
ముక్తి పథము తెలుపు మోక్షగాములగు తా
పసుల సేవ పరమ పదమొసంగు

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
దేవగోవు సకల దీప్తిప్రదాయిని
గణప వక్రతుండ గజము చూడ
ప్రాణకోటియందు పరమాత్మ యొక్కడే
పసుల సేవ పరమపద మొసంగు!

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
పచ్చి మాంసము దిను ప్రాచీన కాలాన
పాము పూజ(నాగదేవతారాధన)సేయు ప్రథయు లేదె?
వంటకాలు పెక్కు వరలగ మానవా!
పసుల సేవ పరమ పదమొసంగు!

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
మన్కి కోసమంచు మానవు నమ్మేవె?!
రాతి పూజ వల్ల రాదు బదులు
మూగ ప్రాణులెట్టి మోసము నెరుగవు
పసుల సేవ పరమపదమొసంగు!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ధశరధమహారాజుతో వశిష్టమహాముని:

ప్రాణసముల సుతుల పసివారలనుచు నీ
కౌశికుండుఁ గోర కాదనకుడు
యాగ రక్షణార్థ మేగఁ దగునయ తా
పసుల సేవ పరమపద మొసంగు.

pks kumar చెప్పారు...

మంచి ఎడ్ల దోయి బెoచును సేద్యము ,
బర్రె లిచ్చు నెపుడు పాలు మనకు,
మానవా వినగదె ,మహిలోన వర కైల
పసుల సేవ పరమపద మొసంగు"

కైలపసులు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
వి. , బహు. • కపిలగోవులు.

seethadevi gurram చెప్పారు...

సకల దేవరూప సాధుస్వభావ యా
నల్లనయ్య గాచు నందినదియె
సౌరశక్తి గ్రహణ సౌభాగ్య దాయియౌ
పసులసేవ యొసగు పరమపదము

వీటూరి భాస్కరమ్మ చెప్పారు...

అరయలోకమందు నధికారదాహమ్ము
పరుల ధనము గొనెడి పనులు మాని
జపము చేయునట్టి జడధారులైన తా
పసులసేవ యొసగు పరమపదము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అక్షరమ్ము రాదు నాకలింపుయు లేదు
నెటుల బ్రతుక గలవు నిటులనున్న
కొలువటన్న నీకు గోపాలకా!తగుఁ
బసుల సేవ పరమపద మొసంగు

ఫణి కుమార్ తాతా చెప్పారు...

వాంఛలన్ని విడచి వాసదేవుని గూర్చి
తత్వమెల్లనెఱిగి ధ్యానమంది
మురళి గానమందు ముఱియుచు నుండు తా
పసుల సేవ పరమపద మొసంగు

subbarao చెప్పారు...

పసుల సేవ పరమ పదమొసంగు ననుట
యక్షరాల నిజము ,హర్ష మదియ
గోవు వలన మనకు కొండంత లాభమ్ము
పసుల జంప గలుగు పాపమార్య !

BVVHBPrasadarao చెప్పారు...

కామధేను,వమరగజ,కచ్ఛపాదులు,
సింహ,వ్యాఘ్ర,నంది,క్షీరదములు,- జంతుమయము దైవ సంపూజ్యమేగదా
పసులసేవ వరమపదమొసంగు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తాపస పద సేవ ధర్మ రక్షణ దీన
జన సముద్ధరణ సుజన సురక్ష
రాజ వంశ వీర రాజికి మంది కా
పసుల సేవ పరమ పద మొసంగు

[కాపు + అసుల = కాపసుల; మంది = కాల్బలము; కాపు =రక్షణ; అసి = ఖడ్గము]

gurram.jana@gmail.com చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurram.jana@gmail.com చెప్పారు...



ఆటవెలదిని తేటగీతిలో పూరణ (WHATSAPP)

వేదసారమ్మునెరిగినవిజ్ఞవరుల
దైవనామమ్ము తలచెడుదివ్యగుణుల
లోకశుభములుగోరువిలోకమతుల
తా *"పసుల సేవ పరమపదమ్మొసంగు"*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అని ధర్మరాజు గంగుల(కవిరాజు)గారు పూరించారు.(WHATSAPP)
*†*****†*
నిజానికి నేనా సమస్య పంపినది కందములో.
"పసులను సేవింప పరమ పథమబ్బునుగా!"
బ్లాగు వారు ఆటవెలదిగా మార్చినారు.తేటగీతిలో పూరణ బహుచక్కగ నున్నది. అభినందనలు !

seethadevi gurram చెప్పారు...

రెండవ పాదములో చివర "నందిని యదె" యని చదువ ప్రార్ధన!

Zilebi చెప్పారు...



కందమ్మున కై పదము
న్నందరి కిన్నిచ్చినాడ! యాటవెలదిగన్
చందము దీర్చగ మా కవు
లందంబుగ తేటగీతి లబ్జుగ గనిరౌ :)

జిలేబి

Kr rajeshwar rao చెప్పారు...

రైతు బాంధవు ల యిర హి మీర శ్రమియిన్చి
స్వార్థ మింత లేని పావన పు
జీవులౌచు జగతి జీవ నా డి గ నుండు
పసుల సే వ పరమ పమొ ।సం గు

Kr rajeshwar rao చెప్పారు...

మూ డ వ పాద ము లో పావన oపుఅని చద వాలి

Kr rajeshwar rao చెప్పారు...

క్షమించి రెండో పాదము లో అని చదవండి

Unknown చెప్పారు...

ఆవుపూజ దలచ నారాధ్యమనియెంచ?
పసులసేవ పరమ పదమొసంగు|
ఆవు యర్ద కేగి నందించు బంగారు
కామదేను పూజ?కలిమి బలిమి.

gurram.jana@gmail.com చెప్పారు...

భేష్ !

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నెమ్మనంబునందు నిరతమ్ము విష్ణునా
మంబు జపము చేయు మాన్యవరులు
భక్తి పథమునందు వైరాగ్య ఖచిత తా
పసుల సేవ పరమపద మొసంగు

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

మునులు జ్ఞానధనులు మూఢ నమ్మకముల
బార ద్రోలి ధర్మ పథము జూపి
జ్ఞాన ధనము పంచు సన్మానులైన తా
పసుల సేవ పరమపద మొసంగు

seethadevi gurram చెప్పారు...

పసులసేవ పరమపద మొసంగు!

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

ధేనుసేవ జేసే ధీరదిలీపుండు ;
మాద్రిబిడ్డ డాలమంద గాచె ;
గోగణమున దిరిగె గోపాలకృష్ణుండు ;
పసుల సేవ పరమపద మొసంగు.

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

మొదటిపాదం-జేసె

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” పఞ్చత్రింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

తామర సాంబకుండు వసుధా జన సత్త్వ మనోహరుండు నీ
రాముఁడు రూప నైపుణ విరాజిత కాయ సముద్భవుండు తే
జోమయ దేహ ధామముల సూర్య నిభుండు క్షమా గుణంబునన్
భూమి సముండు గీష్పతియ బుద్ధుల నింద్రుఁడు కీర్తి నెంచగన్

మూలము:
రామః కమలపత్త్రాక్ష స్సర్వసత్త్వమనోహరః.
రూపదాక్షిణ్యసమ్పన్నః ప్రసూతో జనకాత్మజే৷৷5.35.8৷৷

తేజసాదిత్య సఙ్కాశః క్షమయా పృథివీసమః.
బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః৷৷5.35.9৷৷

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...



ద్వాపరమ్మునందు వాసుదేవుడు చేసె

పసుల సేవ :పరమపదమొసంగు

నట్టి సేవ చేయ నఘములెల్లనుబాయు

ననవరతమ టండ్రు నవని బుధులు .

సర్వసంగములను జగతిలో విడనాడి

పరుల మేలు కోరు పథము నందు

సాగు చున్నయట్టి సజ్జనులైన తా

పసుల సేవ పరమ పదమొసంగు

పాడి పంటలొసగి ప్రజకు మేలును గూర్చు

పసుల సేవ పరమ పదమొసంగు

ననుచు ముదముతోడ నవనియందు

కొలుచు చుందు రెపుడు కూర్మి తోడ.

pks kumar చెప్పారు...

raama karunaa prapti rastu

seethadevi gurram చెప్పారు...

🙏🙏🙏🙏🙏🙏🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
సూర్య కుమార్ గారు ధన్యవాదములు.