11, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2489 (వడ్డించెడివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"
(లేదా...)
"వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినం దగు శంక వీడియున్"

31 కామెంట్‌లు:

  1. గడ్డియు కాదుర మిత్రమ!
    లడ్డులు పూరీ జిలేబి లావణ్యముగా
    గ్రుడ్డులు మాంసము తినుమా!
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

    రిప్లయితొలగించండి


  2. లడ్డుల పైనన్ శుల్కము
    బడ్డకరమ్మది, జిలేబి భరతమ్మునకున్
    బిడ్డడు,మోడీ, మిత్రుడు,
    వడ్డించెడివాఁడు, శత్రువా? తిననొప్పున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడ్డెడి వారే లేరని
      గడ్డి గరచుటకు వెరవని కఠినాత్ములకున్
      చెడ్డ గుణము గల వారికి
      "వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"

      తొలగించండి

    2. జిలేబీ గారి పరిచయం:


      Zilebiఅక్టోబర్ 18, 2016 4:44 PM


      గుఱ్ఱం ప్రభాకర శాస్త్రిగారు


      ఉపయోగ మేమో చూడండి :) టిల్డే కీ (నిదురబోయేటట్లు కనబడు S లాంటి కీ :)


      నిదురన గల టిల్డే కీ
      కుదురుగ నొక్కి ర అ నొక్క కులుకుచు తా కం
      డ్లెదురుగ వచ్చు ఱ యక్షర
      మది కష్టపడితి నుపాయ మదియని తెలియన్ :)


      Tlde+r+a


      జిలేబి

      తొలగించండి


    3. జీపీయెస్సు వారు

      కాంటెక్స్ట్ ఏమిటి ? బండి ఱ కున్ను ఈ నాటి‌సమస్య కున్నూ :) వివరించ వలె

      జిలేబి

      తొలగించండి
    4. కాంటెక్స్టు ఏమీ లేదు. సంవత్సరం అవుతోంది శంకరాభరణంలో పద్యాలు వ్రాయడం మొదలిడి. మీరు నాకొఱకై వ్రాసిన మొదటి కంద పద్యం గుర్తు వచ్చింది. బండి ఱ వ్రాయడం నేర్పించినందుకు కృతజ్ఞతలు ____/\___

      తొలగించండి

    5. జీపీయెస్ వారు

      నమో నమః !

      నెనరులు గుర్తుంచు కున్నందులకు !

      జిలేబి

      తొలగించండి
  3. అడ్డము లేదు నాకు,శరణాగతిఁజేసి వభీషణుండు బల్
    దొడ్డతనంబుఁజూపి ప్రణతుల్ కడుఁజేసెను భక్తితోడ,నా
    గడ్డకు వచ్చువారలను కాచెద నంచనె రాఘవుండొగిన్
    వడ్డనఁజేయువాఁడు పగవాఁడె తినందగు శంకవీడియున్.

    రిప్లయితొలగించండి
  4. అడ్డెడి వారు లేరనుచు నందఱి ముంచెడి మోస గాళ్ళకున్
    చెడ్డ గుణమ్ములన్నియును చిత్తము లోగల దుష్ట మూకకున్
    గడ్డిని మేయ బోవ వెను కాడని లుబ్ధుల, దుర్జనాళికిన్
    "వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినం దగు శంక వీడియున్"

    రిప్లయితొలగించండి
  5. (చాపకూడు పెడుతూ బ్రహ్మనాయడు ఒక ఛాందసునితో)
    గడ్డంబును నిమురుకొనుచు
    నడ్డంబుగ మీశిరమును నటునిటు నేలన్
    విడ్డూరంబుగ ద్రిప్పగ?
    వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్.

    రిప్లయితొలగించండి
  6. అడ్డు శశిరేఖకెవరన్
    సొడ్డున వధువౌ ఘటోత్కచుని ముందరనా
    లడ్డూ భక్ష్యాలమరఁగ
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

    రిప్లయితొలగించండి
  7. జిడ్డగు మోమున మెలగుచు
    నిడ్డెను లను పంచి నంత నీటుగ నెటులౌ
    తెడ్డును వాడని వాడట
    వడ్డించెడి వాఁడు శత్రువా ? తిన నొప్పున్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    గొడ్డుకు దిండియె తృప్తియ
    దొడ్డ గుణుండైన నరు కు దోరపు వృత్తుల్
    ఎడ్డెయె నమ్మునె నియమము:
    "వడ్డించెడువాడు శత్రువా?తిన నొప్పున్"

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    గడ్డము బట్టినన్ దనదు గౌరవ భావ ఫణంబు నడ్డు వే
    జడ్డుదనంబు నోపకను చాలగ నీరము గుడ్చియున్ మనున్
    పడ్డది బాముకొంట గడు పాపము, గిట్టదు వక్ర నీతియౌ
    "వడ్డన జేయువాడు పగవాడె తినందగు శంక వీడియున్"

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    గడ్డము బట్టినన్ నరుడు...గా స్వీకరించండి,ఆర్యా!

    రిప్లయితొలగించండి
  11. దొడ్డ తనముతో శ్రీహరి
    అడ్డుయదుపు లేక సుధను యమరులకీయన్,
    వడ్డనకు మిగలదు గదా
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
    (రాహు కేతువుల ఆలోచన )

    రిప్లయితొలగించండి
  12. గొడ్డుల గాచిన వాడగు
    దొడ్డమనస్కుడు తిరుమల దొర తీపైనన్
    లడ్డూప్రసాద మివ్వగ
    వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుడ్డిగ నమ్మెడి పౌరుల
      నడ్డముగా దోచుకొనుట కడ్డాయగునౌ
      బిడ్డా రమ్మన పదవుల
      వడ్డించెడివాడు శత్రువా? తిననొప్పున్!

      తొలగించండి
  13. గడ్డ గు కాలము నందున
    అడ్డ పు పనుల కు నోస oగూనాహా ర ము ల న్
    వద్ద న చేయు ట గ
    వడ్డిoచేడు వా డు శత్రు వా? తి న నొప్పున్

    రిప్లయితొలగించండి
  14. దొడ్డగుణమ్ము లేక పరదూషణ మెంచుచు జీవనమ్మునన్
    చెడ్డగుణంపు వారలను జేరఁగ వీడుచు భక్తి భావము
    న్నడ్డుకొనంగ లేనివగు నాహుతులన్న స్వయంకృతమ్మెగా
    వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె? తినం దగు శంక వీడియున్

    రిప్లయితొలగించండి
  15. అడ్డము పడ నేలనొ నీ
    విడ్డంకతనమ్ము సూపి యివ్విధి బలిమిన్
    విడ్డూరమ్ముగఁ జెప్పెదు
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్


    ఎడ్డఁ గనంగ వెన్నయ మహీపతి ధర్మము నెంచి పంచ నీ
    గుడ్డలు కూడు భూ జనుల కున్ననుమానము వీడు మింక యే
    గడ్డన నున్నఁ జెడ్డవగు కార్యము లేమియు సేయ నొల్లఁ డీ
    వడ్డనఁ జేయువాఁడు, పగవాఁడె తినం దగు శంక వీడియున్

    రిప్లయితొలగించండి
  16. వడ్డాది కమల ! చెప్పుమ
    వడ్డించెడివాడు శత్రువా ?తిననొప్పున్
    వడ్డనవాడెవడైనను
    వడ్డన సరియుండు నటుల బరికింప దగున్

    రిప్లయితొలగించండి
  17. గ్రుడ్డిగ కట్నంబిచ్చియు
    అడ్డంకియు దొలగె ననుచు నానందింపన్?
    దుడ్డుకు భర్తగ|”తిట్లను
    వడ్డించెడి వాడుశత్రువా?తిననొప్పున్”{బాధ్యతలేనిభర్తకుకూతురి నమ్ముటవలన తిట్లు వడ్డించునుఆన్నభావన}
    2.గడ్డుసమస్యగా కరువు కాటక మన్నది యింట జేరగా?
    గడ్డియు లేకనే పశువు గాటికి గట్టక|నమ్మివేయగా
    “గ్రుడ్డిగ జంపు వాడె పశు కోర్కెలుదీర్చెడిరీతి దాణయే
    వడ్డన జేయు వాడు పగవాడె|తినందగు శంకవీడియున్” {పశువు}

    రిప్లయితొలగించండి
  18. గ్రుడ్డివె?చూడుమాయతడుక్రొత్తగగన్పడుచుండువాడటన్
    వడ్డనజేయువాడుపగవాడె.తినందగుశంకవీడియున్
    లడ్డులుమంచివేయవియలక్ష్మియెతానుగజేసెనిప్పుడున్
    గుడ్డలుమార్చుకోయికనుగోరినలడ్డులుతీయతీయగాన్

    రిప్లయితొలగించండి
  19. అడ్డడగించి వైరి నివహంబుల గూల్చి తొలంగజేసే నా
    గడ్డన ధైర్య సమ్మిళిత కౌతుకమొప్పుచు సంగరంబునన్
    విడ్డురమయ్యె చూడ నొక భీరుఁడు యాజిని, కత్తిబట్టి చా
    వడ్డనఁ,జేయువాఁడు పగవాఁడె తినం దగు శంక వీడియున్

    భీరుడైయుండి తనవారి రక్షణకై కత్తి పట్టి తన
    చావు + అడ్డు +అనన్ = చావడ్డనఁ
    తినందగు = కబళించివేయుట

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా
    కవి మిత్రులకు నమస్సులు,
    నాకు యీనాటి పూరణలు నచ్చినవి.పైన యిచ్చేవాడు శత్రువు కాదని ప్రతిపాదించడం జరిగింది.నాకు యీ సమస్యలో "ఎహె! ఇచ్చినవాడు(తిండిని)ఎవరైతేనేం?వడ్డన సరిగ్గా జరిగిందా లేదా,తినడమే లాభం"అనే పశు ప్రవృత్తి దాగి ఉన్నదనిపించింది.ఇది ఒక విక్షణమైన సమస్యకదా!

    రిప్లయితొలగించండి
  21. చెడ్డదగు దారి నడుచుచు
    నడ్డెరుగక రెచ్చి నన్ స్వయంకృతమున నీ
    నడ్డివిరుగ దెబ్బలువడ
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్!

    రిప్లయితొలగించండి

  22. విడ్డూరంబీ పలుకులు
    వడ్డించెడి వాడు శత్రువా ?తిననొప్పున్
    బిడ్డా నీయాకలణగు
    నిడ్డెనలను కుక్షి నిండ నిపుడే తినుమా.

    రిప్లయితొలగించండి
  23. అడ్డముగపంచెఁ దాలిచి
    వడ్డించెడి వాఁడు శత్రువా? తిన నొప్పున్
    దొడ్డమనసుగలమనిషి
    గడ్డపెరుగుతోడఁ బెట్ట కమ్మని కుడుపున్

    రిప్లయితొలగించండి
  24. ఇడ్డెను చట్ని లేదచట నెక్కడ దోసెలు నావకాయయున్?
    గ్రుడ్డులు మాంసముండినవి కుండల నిండుగ రాజభోగులున్
    చెడ్డది వంగదేశముర చేపలు పీతలు తిందురేయటన్
    వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినం దగు శంక వీడియున్
    ఎడ్డెము తెడ్డెమైననిక నేడ్చుచు మ్రింగుట తప్పలేదురా 😢

    రిప్లయితొలగించండి