14, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2492 (తనయుఁడు పతి యయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె"
(లేదా...)
"తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో"

39 కామెంట్‌లు:

  1. ధనువు ధరించి వచ్చె నొక ధార్మిక యోధుడు, వేటలాడగా
    వనమున దారితప్పె! ముని వాటిక చేరెను చిత్రమై యహో!
    వనితను చూచె నప్పుడు, ప్రభావము ప్రేమది! రాజుగారికిన్
    తనయుడు, భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్యమెట్టిదో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకొక పూరణ:

      తనువును వీడె తండ్రి! తన తల్లికి కష్టము కల్గకూడదం
      చనువుగ యన్ని కూర్చె విధి యాడిన యాటకు వెన్నుచూపకన్
      అనుదినమన్ సమర్థముగ యన్నిటి మోయుచు, తాను కన్న యా
      తనయుడు భర్త యయ్యె, వనితామణి చేసిన పుణ్యమెట్టిదో!

      తొలగించండి
    2. ఇంకొక పూరణ: ఇచ్చిన ఆటవెలది పాదంతో

      కన్న కొడుకు ఎదిగె! కళ్యాణ ఘడియొచ్చె!
      అన్నుమిన్నగు వనితంది వచ్చె!
      పందిరింటనున్న వనజాక్షకు తరుణి
      తనయుడు పతి యయ్యె! తరుణి మురిసె!

      తొలగించండి
    3. మీ రెండవ పూరణ ఉత్తమముగా యున్నది! అభినందనలు!

      తొలగించండి
  2. కోరు కున్న వాడె చేరి వరింపగా
    నాకసమ్ము నంటు నతివ ముదము
    ఆమె కిష్ట మైన యామె మేనత్తకు
    "తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె"

    రిప్లయితొలగించండి
  3. వజ్రభావభరిత వాసిష్టిరమణికి
    చండశాసనుండు శౌర్యధనుడు
    శాతకర్ణి యాంధ్రసమ్రాట్టు గౌతమీ
    తనయుడు పతియయ్యె ;తరుణి మురిసె.

    రిప్లయితొలగించండి
  4. వనముల తాపసోత్తముల బాధలుఁదీర్చెను ధీరమూర్తిగా.
    ఘనులగు దైత్యులన్ దునిమి కాచెను ధర్మము-నట్టి వీరుని.
    న్నినకుల రాజు పొందె నవనీసుత-కోసలమాత పంటయౌ
    తనయుడు భర్తయయ్యె వనితామణిఁజేసిన పుణ్య మెట్టిదో

    రిప్లయితొలగించండి


  5. హ! మగ రాయులకు సహచరి‌ దొరుకుటయు
    గడ్డగు వయిళంబు గద యనుకొను
    తరుణమున నువిదయు తనకు తానైరాగ
    తనయుఁడు పతి యయ్యె, తరుణి మురిసె!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఆర్తి బాపు వాడు, యర్జున పింఛము;
    దాల్చి నట్టి వాడు, ధర్మ నిష్ఠ
    గల్గినట్టి వాడు, ఘన వసుదేవుని
    తనయుఁడు, పతి యయ్యె తరుణి మురిసె"
    (రుక్మిణికి శ్రీకృష్ణుడు లభిమ్చెనను భావన)

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    "ముగ్గురమ్మ సుతులు, ముదమున గనె నందు
    నిద్ద రాడబట్ల నిసువులైరి
    గ్రుడ్డిలోన మెల్ల గురిని యా కడగొట్టు
    తనయుడు పతి యయ్యె తరుణి మురిసె"(అమ్మలక్కల సంభాషణ లోని క్లిప్పింగ్)

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    పనిగొని యుత్తరాది సుత పట్టిన పట్టుగ తెల్గు నేర్చి తా
    నని నటనన్ బ్రతిష్ట గొనె,నాయికగా నిట చిత్ర రంగపున్
    మని,నొక సుప్రసిద్ధ సినిమా ఖలనాయకుడైన వానికౌ
    తనయుడు భర్తయయ్యె వనితామణి జేసిన పుణ్యమెట్టిదో!

    రిప్లయితొలగించండి
  9. బొమ్మఁ జేసి మ్రొక్కి బొమ్మని జేయూత
    నమ్మ గౌరి శరణు నార్తి వేడ
    చాటుఁ జూచి చేర్చి సందిట దేవకీ
    తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
  10. ఇనకుల తిలకుండు ఘన భుజ దర్పు oడు
    నీల మేఘ వర్ణ నిభ ల వెల్గు
    రామ చంద్ర విభుడు కోమలి కౌసల్య
    తనయుడు పతి యయ్యే తరుణిమురిసె

    రిప్లయితొలగించండి
  11. నవయువకుడు దాను సవనసంరక్షకు
    డీశచాప భంగి యీశ్వరుండు
    ధర్మరూపు గాను దనరెడు దశరథ
    తనయుడు పతియయ్యె తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదములో " ధర్మరూపుడుగను దనరెడు దశరథ" యని చదువ ప్రార్ధన!

      తొలగించండి
  12. వినయ విధేయతల్గలిగి వెల్గెడు రుక్మిణి జాణయే కదా !
    అనయము నందనందనునకు నర్పణ జేసెను మానసమ్మునే
    జనకుడె యడ్డు జెప్ప తన చాతురితో ఘనమైన దేవకీ
    "తనయుడు భర్తయయ్యె వనితామణి జేసిన పుణ్యమెట్టిదో ?"

    రిప్లయితొలగించండి


  13. అనితర సాధ్యమైనటి సదాశివునిన్ ధనువున్నటన్ గొనన్,
    మనుజుల లో మనీషి పరమాత్ముడయోధ్య పురాధినాధుని‌న్
    తనయుఁడు ,భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
    తనరెడి సీత సుందర వితానపు మోమున గాంచినామయా

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. రుక్మిణీ మనో హరుండు ముకుందుఁడు
    వారిజాక్షుఁడు మురవైరి కంస
    హారి యదుకుల శశి యానకదుంధుభి
    తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె


    ఘన రఘు వంశ నీరనిధి గౌరుఁడు నీల సువర్ణ కాయుఁడున్
    జనక సుతాంతరంగ విలసన్మహనీయ గుణాంత రంగుఁడున్
    ముని గణ సేవితుండు సుర పూజిత తృప్త చతుర్వ రాగ మాం
    త నయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో

    [ఆగమాంత నయుడు = వేదాంతములలో చెప్పబడిన నీతి వర్తనము కలవాఁడు]

    రిప్లయితొలగించండి
  15. అర్జునుండు మత్స్యయంత్రము భేదించ
    తనస్వయంవరమున ఘనముగాను
    హరియనుంగు మిత్రుడనిమిషాధిపు ప్రియ
    తనయుడు పతియయ్యె, తరుణి మురిసె

    రిప్లయితొలగించండి
  16. ఘనమగు మత్స్యయంత్రమును గ్రక్కున భేదనఁ జేసికొల్వులో
    వినయముగానిలంబడిన విప్రునిగాంచి ప్రజాళి మెచ్చగా
    మనమున సిగ్గుదొంతరలు మానిని ద్రౌపది పొంద గోపతీ
    తనయుడు భర్తయయ్యె వనితామణి జేసిన పుణ్యమెట్టిదో

    రిప్లయితొలగించండి
  17. కోరుకొనినవిధముకూరిమిగలమామ
    తనయుడుపతియయ్యెతరుణిమురిసె
    దనదువాంఛదీరెననుచునుదనలోన
    దానుసంతసంబుదనరమిగుల

    రిప్లయితొలగించండి
  18. జన నుతు డైన మాధవు డు శౌర్య పరాక్రమ శాలి కృష్ణుడు న్
    మనము ను దోచుకున్న సుమ మంజుల సూక్ష్మ మనోహరా స్యుని న్
    అనయము భక్తి యుక్త ము గ నర్మి లి రుక్మిణి కోర దేవకీ
    తనయుడు భర్త యయ్యే వనితా మణి చేసిన పుణ్య మెట్టిదో

    రిప్లయితొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    అనయము పాలస౦ద్రమున హాయిగ శ్రీసతి

    పాదపద్మసే

    వన మొనరి౦పగా - భువనభా౦డము లేలెడు

    శా ర్ఙ్గి ~ కృష్ణుడై


    జననము నొ౦దె | భీష్మసుత స్వా౦తమునన్

    వలపాడ దేవకీ

    తనయుడు భర్త యయ్యె | వనితామణి

    చేసిన పుణ్యమెట్టిదో ! !

    రిప్లయితొలగించండి
  20. తగిన వరుని కొఱకు తల్లి దండ్రులు కూడి
    ఊరు వాడ వెదుక ఓర్పు సడలె!
    తుదకు మేనరికమె దొరుకంగ మేనత్త
    తనయుడు పతి యయ్యె, తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
  21. అనితర సాధ్యమైన వరమందియు నీశ్వరు చేత నంతటన్
    తనదగు కోటయందు జడధారిని కావలి వానిఁ జేసినన్
    వనజజు వంశ సంభవుడు బాణుని పుత్రికి కృష్ణనందునున్
    దనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో

    రిప్లయితొలగించండి
  22. దారగాగ భువిని ధరణిజ యేతెంచ
    రావణుని వధింప రామునిగను
    జతగ గూడ దలచి జన్మించి దశరధ
    తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    వచన కావ్య రచన వాడుక భాషను
    సలుపు వారలె కద చాల కవులు
    భావములను దెలుప, పాలించ బాల వ్యా
    కరణ మేల కావ్య కరణమునకు

    రిప్లయితొలగించండి
  23. కౌసల్య పరంగా....

    కినిసిన కైక కై సుతుడు గిర్రున కానలవాసమేగినన్
    దనుజుడు మోహ పాశమున ధారుణి పుత్రిని లంకజేర్చినన్
    ఘనతర రాము శౌర్యమున కష్టము వీడ నయోధ్య నేలగన్
    తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో!

    రిప్లయితొలగించండి
  24. మనమున నున్నవాడమల మాన్యుల సన్నుతి గొన్నవాడు భూ
    జన ముని సాధు సజ్జనుల సౌఖ్యము నెప్పుడు గోరు శూరుడున్
    జనకుని యాశయోన్నతిని సాధ్యమొనర్చిన కోసలేశు ధీ
    తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో

    రిప్లయితొలగించండి
  25. వినుముర రాజశేఖర! వివేకముతోడననీదుపుత్రికా
    తనయుడుభర్తయయ్యెవనితామణిజేసినపుణ్యమెట్టిదో
    కనగనువారిబంధములుగామితలోకముగర్వమొందగా
    ననయమువారలిర్వురునహర్నిశముల్నెడబాటులేరెటన్

    రిప్లయితొలగించండి
  26. గురువు గారి కి నమస్సులు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.పెద్దలు కా మేశ్వర రా వు గా రు పూరణ సవరింప మన వి.
    ప లు దినములు గడిపె ప డ తియు తగు వరు
    నికొరకు వ ర కట్న నియమము నను
    సరణ సేయ కుం డె, శా రద సు రు చిర
    తన యుడు పతి య య్యె త రుణీ మురిసే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. వరకట్నము బాగా వాడుకలో నున్న దుష్ట సమాసము. “వరు కట్నము” (వరుని కట్నము) అనండి సరిపోతుంది. వర సంస్కృత శబ్దము, కట్నము దేశ్యము. కేవల సంస్కృత శబ్దము వికృత పదముతో సమసింపదు.
      తెనుగు శబ్దము సంస్కృత సమముతో సమసించ వచ్చు.ఉదాహరణ: కట్నపిశాచము.
      నిన్నటి మీ సవరించిన పూరణకు సవరణ సూచించితిని. చూడండి.

      తొలగించండి
  27. ధన్యవాదాలు. మీ సూచనలు ను గుర్తు పెట్టుకొని పద్య పూరణ చేయుదును.నిన్నటి మరొక మారు తె లిపిన
    సవరన కు మరో మారు నమో వాక ములు. కీ బోర్డ్
    కొన్ని సందర్భాల్లో రెండు న లు ఒ కే విధo గా ప్ర చురిస్తుంది.

    రిప్లయితొలగించండి
  28. ఘనముగ నిందిరమ్మకొక కమ్మని చూపుల నందగాడునౌ
    తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో
    దినదిన వర్ధమానుడగు తియ్యని డింపుల బుగ్గలయ్యయౌ
    తనయుడు కల్గి కాంగ్రెసును తక్కెడ రీతిని యెత్తి దించునాహ్!!!

    రిప్లయితొలగించండి