29, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2506 (తండ్రితో రతికేళిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రితో రతికేళినిఁ దనయ కోరె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

107 కామెంట్‌లు:

  1. సరకులం గొనఁ దానేగి మరలి వచ్చి
    యొక గదిని పనిమానిసి యుండఁ జూచెఁ
    దండ్రితో రతికేళినిఁ; దనయ కోరె
    పతిని నామెను దొలగించవలయు ననుచు.

    రిప్లయితొలగించండి
  2. తగదెవరితోడ కలహాలు తఱచు గాను?
    నేమి యాశించె యూర్వశియే విజయుని?
    కోక నదుని చేపట్టగ కొండఱేని;
    తండ్రితో;రతికేళిని;తనయ కోరె.
    ****)()(****
    కోక నదుడు = శివుడు.

    రిప్లయితొలగించండి
  3. తల్లి కొక ముద్దుల తనయ తపతి యుండె;
    తపతి మగడు శ్రావణమున తడిసి రాగ
    తపతి విరహము తీరగ తన తనయుని
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె

    రిప్లయితొలగించండి
  4. నేను కవిని కాదు, అయినా చెప్పాలనిపించింది.
    పద్యాలు కట్టేవారు రకరకాల విరుపులు విరవచ్చు గానీ ఇచ్చిన ఈ సమస్యాపూరణం మాత్రం బాగులేదండి. చదవడానికే జుగుప్సగా ఉంది నా మటుకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కంది శంకరయ్యడిసెంబర్ 10, 2011 1:01 PM

      రాజారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కవిమిత్రులకు మనవి ....

      ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి.
      పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.

      మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.

      నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...

      ‘రాముని వంచించి సీత రావణు వలచెన్’

      "సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు.
      సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!"

      తొలగించండి


    2. నరసన్నా ! కైపదముల్
      పరిపరి విధముల్ సమస్య ఫట్టు మనుచు వీ
      డు రకరకములుగ కవుల చ
      తురత కది పరీక్ష సూవె తుచ్ఛము కాదోయ్ :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. కైపదము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

      కవిపరిజ్ఞానపరీక్షార్థము పూరింపనిచ్చెడి పద్యాంశము, సమస్య.

      "ఉ. కైపదమిచ్చువారలును గ్రక్కునఁ బద్యముఁ జెప్పువారలున్‌." భో. ౨, ఆ.
      (కయిపదముయొక్క రూపాంతరము.)

      భో = భోజరాజీయము

      తొలగించండి
    4. జిలేబీ గారికి, ప్రభాకర శాస్త్రి గారికి....
      ధన్యవాదాలు.

      తొలగించండి
    5. ఈ అభ్యంతరకరమైన పదము సంస్కృత సమాసములో నున్నది కాబట్టి లోతు తెలియుట లేదు. ఇదే మాట యచ్చతెనుగులో వాడితే మీరు మ్రింగ గలరా!!! సమర్థిస్తారా?
      ఏ భాష యైనా యసభ్య మసభ్యమే .

      ఇటువంటివి వాడక పోతే ఇక్కడి కవవరులకు వచ్చిన నష్టమేమీ లే నప్పుడు వాడుటమెందుకు? వాడితే వచ్చిన యా ధన లాభ మేమిటి?
      ఈ ధన లాభము నాకాంక్షించే వారికి వేరే మార్గాలు చాలా యున్నవి కదా!!!
      ఎవరో అవధానముల లో చేశారని మనము కూడా చేస్తామా!!
      మంచిని యాచరించ వలె కాని చెడును కాదు.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      ఈనాటి సమస్యను మమ్మల్ని, మరి కొందరినీ నొప్పించినందుకు క్షమించండి. ఇకనుండు సమస్యల ఎన్నికలో జాగ్రత్త వహిస్తాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి

    8. సమస్య నిచ్చిన వారి పత్తా కాన రాలే :)

      ఏమండీ పూసపాటి వారు ఎక్కడున్నారు :)

      జిలేబి

      తొలగించండి
    9. ఒకసారి నేనొక జయదేవుని అష్టపది పాటను ఇష్టపడుతుంటే సంస్కృతం తెలిసిన మా లెక్కల మాస్టారు శ్రీ జొన్నలగడ్డ గోపాలకృష్ణ గారు ఇలా తిట్టారు:

      "సంస్కృతం నీకు రాదు కనుక బ్రతికి పోయావు!"

      తొలగించండి
    10. ఔరా! ఎంత చక్కని ప్లేటు ఫిరాయింపు!😲😲😲😲😳😳😳😳😳

      తొలగించండి
    11. ప్లేటు ఫిరాయింపు కాదు!

      సంస్కృతము తెలియని వాళ్ళే జయదేవుని కీర్తనలు పాడాలి, వినాలి, ఆనందించాలి అని. వ్యంగ్యం సోదరీమణీ!

      విజ్ఞులు అష్టపదులను కూడా నిషేధించ గలరు అని!!!

      "ఏ భాష యైనా యసభ్య మసభ్యమే"

      తొలగించండి


    12. వేదాల్నించి సేంపిల్ ఇవ్వమంటారా జీపీయెస్ వారు ? :)

      జిలేబి

      తొలగించండి
    13. అయితే మీరు అసభ్య పూరణలకు వకాల్తా పుచ్చుకున్నారాయేం? బ్లాగు కర్తగారు జవాబిచ్చారు చూడలేదా? యెప్పుడో ఆయన యిచ్చిన సమాధానాన్ని ఆయనకంటే ముందుగా మీరే అత్యుత్సాహంతో ప్రకటించవలసిన పనియేమి?
      యెవరో యేదో చేశారని మనము సభ్యత మరచి పోరాదు! I am very soory! స్వస్తి!

      తొలగించండి
    14. అసభ్య పూరణలు కాదు... మీ అభ్యంతరం "అసభ్య సమస్యలకు". ఈ అసభ్య సమస్యను మైలవరపువారు ఎంత సభ్య సుందరముగా పూరించారో చదవండి.

      తొలగించండి


    15. అసభ్యత సమస్య లో కూడా లేదు.
      చూసే వారి చూపులలో వుంది.
      ఆ పరిధిని దాటిన వారీ శంకరాభరణ కవులు
      సమస్య ని సమస్య గా స్వీకరించడం లో కవుల చాతుర్యం వుంది. అది వివిధ‌ములు.

      జిలేబి

      తొలగించండి
  5. పురుషులెల్లరు చచ్చిరి పురమునందు
    కొర్కె తీర్చగ పురుషుడు కూడడనుచు
    లోతు తనయలు మిగుల లోలోన తలచి
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మన్నించాలి! మీ పూరణ భావం అవగతం కాలేదు.

      తొలగించండి
    2. విజయకుమార్ కూడా ఈ 'లోతు' విషయాన్ని ప్రస్తావించారు. ఈ కథ నాకు తెలియదు. బైబుల్‍కు సంబంధించిన కథయా?

      తొలగించండి
  6. తనయ సంతతి వాసిగ ధరణినేల
    నెంచి రాజును వరముల దండ్రి కోరె
    కువలయేశుని బెండ్లాడి దేవ వ్రతుని
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ నమస్సులు. సవరించాను. ధన్యవాదములు.

      తనయ సంతతి వాసిగ ధరణినేలు
      తలపు తోడను రాజును దండ్రి కోరె
      భూవరేణ్యుని బెండ్లాడి దేవ వ్రతుని
      తండ్రితో రతికేళినిఁ దనయ కోరె

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఫణి కుమార్ గారికి నమస్సులు:

    పద్యం భావం అద్భుతముగా నున్నది. రెండవ, మూడవ పాదాలలో యతి, ప్రాస యతి, సరియేనా?

    రిప్లయితొలగించండి
  8. మున్ను వహ్నికి సొదొమ గొమొఱ్ఱ లోని
    లోకు లెల్లరు మరణింప లోతు యనెడు
    తండ్రితో రతి కేళిని దనయ గోరె
    తండ్రి నిదురించునపుడు సంతతిని గోరి

    కామ తాపము వర్ధించు కథలు చదివి
    ముగ్ధ యొక్కతె దుర్ణయ దగ్ధ యయ్యె
    దైవమా! జాల మహిమతో వావి మఱచి
    తండ్రితో రతి కేళిని దనయ గోరె

    తనయ నామమ్ము కలిగిన తన్వి యోర్తు
    ప్రణయరాగాలతో దన పతిని జేరె
    పాపడప్పుడు నిదురింప వాని ముద్దు
    తండ్రితో రతి కేళిని దనయ గోరె

    తండ్రితో రతి కేళిని దనయ గోరె
    యను సమస్య నొసగి శంకరయ్య గారు
    నిదుర పోయిరో లేదొ నా నిదుర చెడియె
    మురియుచున్నది శంకరాభరణమొకటె
    (సరదాగా)

    దేవ దేవుని భార్య భూదేవియయ్యె
    సీత బంగారు తల్లి భూజాతయయ్యె
    హరియె శ్రీరాముడయ్యె నోయయ్య పలుక
    “దండ్రితో రతి కేళిని దనయ గోరె”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
      ఈ 'లోతు' కథ నాకు తెలియదు.

      తొలగించండి


  9. పెండ్లి యాయె హసీనకు పిరియము పిన
    తండ్రితో, రతికేళినిఁ దనయ కోరె
    మగడితో సరసమ్ముల మధురిమలన
    తేలగాను కలిగెనయ్య దేహజుండు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Just to clarify-

      In Islamic custom a girl can marry fathe's (cousin) brother.

      తొలగించండి

    2. Fatimah (daughter of prophet muhammad) married to Ali. This is the classic example quoted.

      Ali is the son of Abu Talib. Abu Talib is the Paternal uncle of Prophet Muhammad. Thus Ali is cousin brother of Prophet Muhammad.

      Looks like I am becoming "హరిబాబి" :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. హరిబాబి గారూ:

      "జిలేబి" హిందీ పదమని ఆంధ్రభారతి ఉవాచ. సంస్కృతంలో దాని పేరు:

      "సుధా కుణ్డలిక"

      https://en.m.wikipedia.org/wiki/Jalebi

      తొలగించండి


    5. జీపీయెస్ వారు నమో నమః ఈ లింకు లో సుధాకుండలిక కందము గలదు :)


      http://varudhini.blogspot.com/2016/07/blog-post_30.html


      Cheers
      Zilebi

      తొలగించండి
  10. నిండు పున్నమి వెన్నెల నిదుర రాక
    వలపు మత్తున పొరబడి తలచె , తల్లి
    తండ్రితో రతికేళినిఁ , దనయ కోరె
    తాను తనపతి చెంతకు తనరు మదిని

    రిప్లయితొలగించండి
  11. ‘ప్రకృతి’ పురుషుని కలియుట సకలమునకు
    మూల మనుమాట చెప్పెడి వేళ నొకడు
    “తనియ” ననబోయి యిట్లనియెను జగముల
    తండ్రితో రతికేళినిఁ “దనయ” కోరె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. డా.పిట్టా
    తండ్రి వేషము వేసిన తనదు పతిని
    కూతు వేషము గూర్చిన గొప్ప*కళ*ను
    ప్రేక్షకులు చాల మెచ్చగా బ్రేమ హెచ్చి
    తండ్రితో రతి కేళిని తనయ కోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      నటులను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. అలక బూనిన యల్లుని యలక దీర్చి
    స్వాగతింపమనుచు నామె వాదు లాడె
    తండ్రితో, రతికేళిని దనయ కోరె
    ననుచు గుర్తించిన జనకుండట్లె జేసె.

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    వృద్ధుడేగాని జూదపు బుద్ధి పో(బో)దు
    తనదు నెచ్చెలి *రతి*తోడ తగిలె స్పర్ధ
    చూడ జూడగ ముగియదే చోద్య మవగ
    తండ్రి తో, *రతి*కేళిని1 తనయ కోరె
    (1.ఆట,జూదపుటెత్తు)

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    జంటలో కాంత మరణింప జాలి గొలుపు
    వంటజేయ నెవరులేని వైనమబ్బ
    పిచ్చి యభిమాని కన్నియ పిలిచి వలచె;
    (వ్వ్!)తండ్రితో రతి కేళిని తనయ కోరె!

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా
    Necessity is the mother of invention ను ఆధారంగా జేసికొని..........
    న్యూటనౌ తండ్రి, సూత్రాలు నౌను కన్య
    దెట్లు వరియించె గుట్టు కదేమి?వింత!!
    అవసరంబున నీడ్జోడు లౌ హుళక్కి;
    తండ్రి(పెద్దాయన)తో రతికేళి(association)ని తనయ కోరె.
    (ఆ సూత్రాల కర్త, భర్త ఆయనే.ఆమెనెవరు పెళ్ళాడిన దాఖలాలు లేవు గనుక)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ మూడు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,కుల,వర్గ.వర్ణ.భాష,వైదిక,హేతువాదన,ఆధునిక ప్రపంచీకరణల తో ప్రపంచము విడివడి యున్నది.ఏమి అనినా ఎవరికో ఒకరికి రుచించదు.అందరినీ తృప్తి పరచలేము.మీరు మీ సాధనను నిస్సంకోచంగా కొనసాగించి కవులకు అభ్యాసాలు యిస్తూనే ఉండాలి.ఇది మా కోసం!

      తొలగించండి
  17. మైలవరపు వారి పూరణ:

    రుక్మిణి తల్లి... భీష్మకునితో...

    బుజ్జగించిన వినకుండె ! ముజ్జగాల
    తండ్రితో రతికేళిని తనయ కోరె !
    నీచ శిశుపాలునకు పిల్లనీయ దగునె ?
    కృష్ణుడే సరిజోడు రుక్మిణికి ! నాథ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  18. పొలమునొక్కతి నిత్యము సలుపుచుండ
    తండ్రితో రతికేళిని, తనయ కోరె
    వెడలి పొమ్మని యామెను కడువడిగను
    కాలుగాలినటుల పిత కాంచుచుండ

    రిప్లయితొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,

    త౦డ్రి యర్జున పాత్రను తాల్చ , తనయ

    యూర్వశిగ మటి౦చెను నాటకోత్సవమున |

    త౦డ్రితో రతికేళిని దనయ కోరె |

    రక్తి కట్టె నా య౦క మౌరా యన౦గ ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      నటులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని వరుస మారినట్టుంది. వారిది తల్లీ కొడుకుల బంధం కదా!

      తొలగించండి
  20. పరిణయం బ య్యే కోరిన వాని తోడ
    మొదటి రాత్రి కి యేర్పాట్లు మొదలు కాగ
    ముద ము ప్రకటించె నప్పుడు పుత్రితన దు
    తండ్రి తో ;రతి కే ళినితనయ కోరె
    దరికి జేరిన పతి జూచి తన్మయముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'రాత్రికి నేర్పాట్లు' అనండి.

      తొలగించండి
  21. (తల్లిలేని ఆడపిల్లలు తండ్రితో పలుకుతున్న సందర్భం)
    రంగరావుకు బిడ్డలు రతియు నతియు;
    వేగ క్రొత్తదౌ సినిమాకు నేగుదమనె
    తండ్రితో రతి;కేళిని దనయ కోరె.
    నతియె చెస్సుబోర్డు నమర్చి నమ్రరీతి.

    రిప్లయితొలగించండి
  22. వార కాంతతో వలదనె వనిత తనదు ;
    జనకునికి జూడ నేమగు జానకిలను;
    నరుని పొందును యూర్వశి నాకమందు;
    "తండ్రితో రతికేళిని; తనయ; కోరె."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. బడిని చదువు నేర్పు గురుని వలచె బాల
    తండ్రి సాటి గాదె గురువు ధర్మ మఱయఁ
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె
    కలి యుగమ్మున నీ రీతి కథలు పెక్కు!

    రిప్లయితొలగించండి
  24. యెవ్వరికి నెల్లపుడునెగ్గు నెంచరాదు?
    ధర్మపత్నితో నెదికోర ధర్మమగును?
    యోగ్యుడగు వరునెదుకగ యోగ్యమనుచు
    తండ్రితో; రతికేళిని; తనయకోరె!

    ఇటువంటి సమస్య పూరణ చేయుటకు సిగ్గుపడుతూ........😔😔😔😔😲😲😲

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంత మంది యెన్ని విధాలుగా సమర్ధ్ంచి నప్పటికీ సభ్యత యనినది ఒకటి ఉండవలె గదా! నరసింహారావుగారితో పూర్తిగా యేకీభవిస్తున్నాను!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  25. హా! మారీచుడ! హరిణిగ
    రాముని వంచించి, సీత! రావణు వలచె
    న్నేమగువా! మోసముతో
    యీ మెడ దన యిట్టలముగ యిడుగడ జేతున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  26. పెండ్లి యాయె ఫతీమకు పిరియము పిన
    తండ్రితో, రతికేళినిఁ దనయ కోరె
    మగడితో సరసమ్ముల మధురిమలన
    తేలగాను కలిగెనయ్యదే హసనుడు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఖురాను కథతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. కందివారు

      ఈ సమస్య నిచ్చి మొత్తం మీద ప్రవక్త మొహమ్మదు మీద రిఫ్రెషర్ కోర్సు అందించేసారు :)

      చాలా కాలం ముందట చదివినది ! జంకుతూనే పెట్టా :) నెనర్లు నచ్చినందులకు

      If beauty lies in the eyes of the beholder, well ugliness too :)

      జిలేబి

      తొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సతము కృష్ణుని భజనలు చలుపు చుండి
    నతని తోడనే లోకము ననుచు చెప్పు
    భగవతి సుతి మాట నెదిర్చి జగము లేలు
    తండ్రితో రతికేళిని దనయ కోరె

    రిప్లయితొలగించండి
  28. సాహసమ్ముల కెల్లను నోహటిల్లు
    ప్రాణమున్న యెడలఁ దీపి బ్రతుకు కలదు
    యౌవనమ్ము వోయెను నీకు నయ్య విడుము
    తండ్రి! తోరతికేళినిఁ, దనయ కోరె

    [తోర+అతి కేళి= తోరతికేళి: ఆపదలతో అమితమైన చెలగాటము;
    తోర =ఆపద; అతి (దేశ్యము) = అడి = అమితమైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామెశ్వర రావు గారూ,
      వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  29. విన్నపము: ఈ రీతి సాహసాలతో విన్యాసాలు శంకరాభరణమునకు శోభ నీయవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఈనాటి సమస్య మమ్మల్ని, మరి కొందరినీ నొప్పించినందుకు క్షమించండి. ఇకనుండి సమస్యల ఎన్నికలో జాగ్రత్త వహిస్తాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  30. తండ్రితోరతికేళినిదనయకోరె
    నాహ కలికాలమహిమలెయవ్వ! యేమి
    చోద్యములికనువినగను,జూడగాను
    బ్రతికి యుండగ వలయునోభవ్యచరిత!

    రిప్లయితొలగించండి
  31. ఎవరితో పోరి పార్వతి నివురయె నిల?
    కోమలి వరూధిని ప్రవరున్ గోరెనేమి?
    తనను గొనిపోవుమని గోరె ధరణి నెవరు?
    తండ్రితో, రతికేళిని, తనయకోరె!!!

    రిప్లయితొలగించండి
  32. నాటివెలయాలి పుత్రిక “చాటుచున్న
    అందచందాల వేశ్యను బొందునందు
    తండ్రితో రతికేళిని దనయ కోరె”|
    కాశు లాశయు, కామంబుకథలు గుట్టు|


    రిప్లయితొలగించండి
  33. తమ్మి చూలి నిమేషము తనదు మోము
    జూడ సృష్టి నాపి, హసపు చుబ్ర భరిత
    శుక్ల పై రతి పతి తన సృకము నిడగ
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె

    బ్రహ్మ సరస్వతి తండ్రి . ఎప్పుడు సృష్టి కార్యము లో
    ముణిగి పోయిన బ్రహ్మ ఒక్క నిముషము సరస్వతిని చూడగా
    ఆమె తన కోర్కె వెల్లడిమ్చినదను భావన

    రిప్లయితొలగించండి
  34. ు:

    దీనిని చిత్తగించండి:

    "కంది శంకరయ్యడిసెంబర్ 10, 2011 1:01 PM

    రాజారావు గారికి, చంద్రశేఖర్ గారికి, కవిమిత్రులకు మనవి ....

    ఇచ్చేదే సమస్య. సమస్య ‘సమస్య’గానే ఉండాలి.
    పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి.

    మన దేవుళ్ళపైన అసంగతమైన సమస్యలు ఇప్పటికి ఎన్నో అవధానాలలో పృచ్ఛకులు అడిగారు. కవులు తమ నైపుణ్యంతో వాటిని పూరించి మెప్పించారు.

    నేను చూచిన ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ...

    ‘రాముని వంచించి సీత రావణు వలచెన్’

    "సీతవంటి లోకోత్తర పతివ్రతను గురించి ఇలా చెప్పడం భావ్యమా? సంస్కారమా?" అని ఆ సభలో ఎవరూ ప్రశ్నించలేదు. కవికూడా యుక్తియుక్తంగా సమస్యను పూరించి అందరి మెప్పు పొందాడు. కొన్ని కొన్ని సమస్యాపాదాలను చూడగానే మనస్సు నొచ్చుకొనవచ్చు. మరికొన్ని సమస్యలను వినగానే అసభ్యంగా ఉండి రోత కలిగించవచ్చు.
    సమస్యలోని అసంగతాన్ని తొలగించడమే కదా కవుల పని. స్వస్తి!"
    G P Sastry (

    గురువు గారికి కవి మిత్రులకు కవి ఉద్డండులకు నా నమస్కారములు శంకరాభరణము లొ వచ్చు ఇచ్చు సమస్యలు ఏ వర్గానికో లేక ఈ పురాణానికో చెందినవి కావు.ఇచ్చిన్ సమస్యలు అశ్లీలముగా ఉన్న అసమంజసముగా ఉన్న కవి తన యొక్క నైపుణ్యముతో దానిని పరిష్కరించి చెప్పుట ముఖ్యము. ఈ విషయము 2011 లొ గురువు గారు బ్లాగులో తెల్పి ఉన్నారు. మరల అది ఇక్కడ పెడుతున్నాను. అంటే కాని మన పురాణములను కిమ్చ పరుచుట గాడు. బ్రహ్మకు సరస్వతి కూతురు గాదా ఆ అమ్మ వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సమష్య పంపటము జరిగినది. దాని వలన శంకరాభరణమునకు ఇబ్బంది కలుగుతున్నది అన్నది ఏమీ ఉండదు. ఘన కవుల ఉద్దండ కవుల పూరణములతో శంకరాభరణము దినదిన ప్రవర్ద మానముగా ఎదుగుతుంది తప్ప డాని వెలుగులు తగ్గవు అను నది నా భావన. పెద్దల మనసు నొప్పించిన క్షమించండి.

    రిప్లయితొలగించండి

  35. విన్నకోట వారు spoilsport అయిపోయారివ్వాళ ::)

    వారా కామెంట్ పెట్టక పోయుంటే సమస్య ని సమస్య గా స్వీకరించి ఇచ్చటి వారందరు తమ తమ రీతిలో పూరణ చేసేసి ఉండేవారనుకుంటా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి తల్లి కార్తీక మాస సందర్భముగా తెల్లవారు ఝామున 3 గంటలకు గుడికి వెళ్లి అర్చకత్వము చేసుకుని 2 గంటలకు ఇంటికి వచ్చి నేను ఇచిన సమస్య వచ్చిందని చూశాను. నేను ఇచ్చిన సమస్యపై నా పూరణము వెంటనే బ్లాగులో పెట్టాను చూచి మీఅభిప్రాయము తెలపండి.

      తొలగించండి

    2. పూసపాటి వారు

      మీ పూరణ అదురహో !


      జిలేబి

      తొలగించండి
  36. లేదు లేదు!

    విన్నకోట వారు మంచి పనే చేసారు. moral policing కు తావిచ్చారు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "spoilsport" 🙁 ?? ఫరవాలేదు జిలేబి గారూ. మీరనచ్చు, మేం పడచ్చు, ఇబ్బందేం లేదు 🙂.

      ధన్యవాదాలు GPS గారూ. పోలీసింగేమీ కాదు గానీ ఆ సమస్య చదవగానే ఒక పామరుడుగా నా మటుకు చెవికింపుగా లేదనిపించి నా మొదటి వ్యాఖ్య వ్రాశాను 🙏.

      తొలగించండి
  37. పూజ్య కవి వరులకు ఈ దిగువ సమస్యలు పరిశీలించండి అ రోజు అశ్లీలత అసహజము గోచరిమ్చాలేదా మనము అనరము చక్కగా పురిమ్చాము గదా

    , మార్చి 2017, బుధవారం
    సమస్య - 2296 (వదినా నీ కందఁ జేతు...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
    "వదినా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్"
    లేదా...
    "వదినా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్"
    (ఒకానొక అవధానంలో గరికపాటి పూరించిన సమస్య)
    10, మే 2017, బుధవారం
    సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
    "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
    10, మే 2017, బుధవారం
    సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
    "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
    10, మే 2017, బుధవారం
    సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
    "ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్
    17, జూన్ 2017, శనివారం
    సమస్య – 2387 (వంక లేనిదమ్మ రంకులాడి)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "వంక లేనిదమ్మ రంకులాడి
    17, జూన్ 2017, శనివారం
    సమస్య – 2387 (వంక లేనిదమ్మ రంకులాడి)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "వంక లేనిదమ్మ రంకులాడి
    24, జూన్ 2017, శనివారం
    సమస్య – 2393 (ముని నుదుటను సీత...)
    కవిమిత్రులారా!
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "ముని నుదుటను సీత ముద్దు లిడెను
    29, జూన్ 2017, గురువారం
    సమస్య - 2397 (మాంసాహారమ్మె...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్
    0, ఆగస్టు 2017, బుధవారం
    సమస్య - 2451 (సరసీరుహనేత్ర కొక్క...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా"
    ('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథం నుండి)
    14, అక్టోబర్ 2017, శనివారం
    సమస్య - 2492 (తనయుఁడు పతి యయ్యె...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె"
    (లేదా...)
    "తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో"
    23, ఆగస్టు 2017, బుధవారం
    సమస్య - 2444 (పాలిచ్చిన తన జనకుని...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
    "పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్

    రిప్లయితొలగించండి
  38. మనము అనరము టై పాటు మనము అందరము అని ఉండాలి

    రిప్లయితొలగించండి

  39. పలికె నెవరితో హరిగూర్చి బాలు డపుడు?
    గౌతము సతినేది యడిగె గట్లసూడు?
    మేటి పదవి నంద విదేశ మేగ పితను
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె.

    రిప్లయితొలగించండి
  40. నాటివెలయాలి పుత్రిక “చాటుచున్న
    అందచందాల వేశ్యను బొందునందు
    తండ్రితో రతికేళిని దనయ కోరె”|
    కాసు లాశయు, కామంబుకథలు గుట్టు|


    రిప్లయితొలగించండి
  41. ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురునిందకు లేదు అని శాస్త్రము. గురువుగా ఒకరిని భావించిన తరువాత వారి తప్పొప్పులను ఎంచు అధికారము శిష్యులకు లేదు. ఈనాటి కవి మిత్రులందరికీ గురునిందాదోష పరిహారము కావలెనని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  42. సుత'రతి' సుతతో నాన్నను చూడ వచ్చి
    పౌత్రికి చదరంగమునందు పటిమ నడిగె
    తండ్రితో రతి, కేళినిఁ దనయ కోరె
    మొదటి స్థానమ్ము నందగన్ బూనె ననుచు.

    రిప్లయితొలగించండి