30, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2507 (దుర్యోధనుఁ బెండ్లియాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

65 కామెంట్‌లు:

  1. ఆర్యా! భానుమతి వగచె
    దుర్యోధనుఁ బెండ్లియాడి;
    ద్రోవది మురిసెన్
    దుర్యోధనుడోడి యలిగి
    వర్యుండర్జనుడు గెల్చి వరుడై
    నంతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మర్యాదగ తెలిపె కులుకుచు
    కార్యా చరణము నందు కలవర పడగన్
    శౌర్యుడ వనిమనుసు పడితి
    దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్
    --------------------------------
    ఇక్కడ " దుర్యోదనుడను పేరుగల యువకుడు , ద్రౌపది అనిపేరుగల స్త్రీ .

    రిప్లయితొలగించండి
  3. భార్యయ్యె భానుమతియే
    దుర్యోధను బెండ్లియాడి ; ద్రోవది మురిసెన్
    కార్యార్థులు పతులరులను
    శౌర్యముతో నని వధించి చతురత జూపన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భార్య+అయ్యె' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. భార్యయయె భానుమతియే
      దుర్యోధను బెండ్లియాడి ; ద్రోవది మురిసెన్
      కార్యార్థులు పతులరులను
      శౌర్యముతో నని వధించి చతురత జూపన్.
      ******
      ఆర్యా!ధన్యవాదాలు!

      తొలగించండి
  4. భార్యగ భానుమతి మురిసె
    దుర్యోధనుఁ బెండ్లియాడి; ద్రోవది మురిసెన్
    మర్యాదోత్తమ పురుషులు
    ధైర్యాన్విత పాండవులను తగ పెండ్లాడన్

    రిప్లయితొలగించండి


  5. భార్యయ్యె భానుమతి తా
    దుర్యోధను బెండ్లియాడి,ద్రోవది మురిసెన్
    వీర్యము తోగెల్చి తనను
    నార్యులు మెచ్చగ వివాహ మాడిన వానిన్.

    2.శౌర్యము గని భానుమతియు
    దుర్యోధను బెండ్లియాడి,ద్రోవది మురిసెన్
    వీర్యులు శూరులు పృథజుల
    ధైర్యమును గనిమనమున తానును విడకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'భార్య+అయ్యె' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

      తొలగించండి


  6. ఫిర్యాదు వచ్చె వివరము
    "దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
    పర్యయ మేమో యమరిక,
    చర్యగొనవలె సరిజేయ చక్కగ నిపుడే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      'భార్య+అయ్యె' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
      మీవల్ల 'పర్యయము' కొత్త పదం తెలిసింది.

      తొలగించండి
  7. భార్యగ భానుమతి వగచె
    దుర్యోధనుఁ బెండ్లియాడి, ద్రోవది మురిసెన్
    శౌర్యుఁడు భీముడు వానిని
    ధైర్యంబుగ బోరు సలిపి ధాత్రిని జంపన్

    దుర్యోధనుడు బలవంతముగా ఎత్తుకొని వచ్చి భానుమతిని వివాహం చేసుకున్నాడు.

    రిప్లయితొలగించండి


  8. భార్యగ భానుమతి మురిసె
    దుర్యోధనుఁ బెండ్లియాడి; ద్రోవది మురిసెన్
    వర్యులగు పంచ పాండవు
    లార్యుల భర్తృత్వము భగ లబ్ధిగ గానన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కార్యాకార్య విచక్షణుఁ
    డార్యజన విధేయుఁ డనఘుఁ డర్జునుఁడు ధగ
    చ్ఛూర్యనిభతేజుఁ డసహ
    ద్దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్!

      విరుపు లేని మీ పూరణ అద్భుతం!

      తొలగించండి
    2. (మైలవరపు మురళీకృష్ణ గారి సూచన ననుసరించి సవరణతో.....)

      కార్యాకార్య విచక్షణుఁ
      నార్యజన విధేయు ననఘు నర్జునుని ధగ
      చ్ఛూర్యనిభతేజు నసహ
      ద్దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాదొక చిన్న సందేహము. నివృత్తి జేయ గోర్తాను.

      ధగత్+ సూర్య : “ధగత్సూర్య” అవుతుందేమో యని నా సందేహము తత్సమము వలె. సూర్య లో “శ” కారము లేదు గదా.

      తొలగించండి
    4. డా.పిట్టా
      ఆర్యా,లోగడ నేనొక పూరణలో తత్+శాంతి=తత్శాంతి అనివాడితిని.కాని తచ్చాంతి యేమోనని సందేహం.

      తొలగించండి
  10. డా.పిట్టా
    *రామాయణ విషవృక్షము*ను బోలు మహాభారత కథా యితివృత్తమునందు కురుక్షేత్ర యుద్ధ నివారణను ప్రతిపాదించి, ప్రఖ్యాతినాశించిన ఒకానొక కవి తన కావ్యమునందు కథలో త్రిప్పిన విచిత్రమైన మలుపు:
    ఆర్యోచిత కథ, వెత యది
    భార్యన్ ఫ(భ)ణమందు వెట్ట భారత(భారీ)పోరౌ
    కార్యోచిత సిత శాంతికి
    ధుర్యోధను బెండ్లియాడి ద్రోపది మురిసెన్!
    .....అని వ్రాస్తూ *ఆధునిక ప్రశాంత మహా భారతము* వచన గ్రంథమును వెలువరించెను.(ఇది ఊహ).కాని శ్రీ కంది శంకరయ్య గారు ప్ర‌స్తుత నివాసమునకు మారక ముందు, ఉదాహరణగా ఓరుగల్లు మిత్రుడొకరు ఇలాంటి ఒక గ్రంథావిష్కరణ గావించినాడు.ఆ గ్రంథము పేరు,*ఇట్ల సుత*.సమస్యా పూరణకై యా ప్రవృత్తిని ఉటంకించాను. ఆ కథను నేను చదు లేదండీ.ఇలాంటి కథ రాక అసంభవము కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అటువంటి గ్రంథాలను ఇంకెన్ని చూస్తామో?

      తొలగించండి
  11. భార్యగ భానుమతి చెలగె
    దుర్యోధనుఁబెండ్లియాడి, ద్రోవది మురిసెన్
    శౌర్యుడు భీముడు రణమున్
    దుర్యోధను తమ్ముజంపి తొళ్ళెము ముడువన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తొళ్ళెము' నాకు క్రొత్త పదం. ధన్యవాదాలు!

      తొలగించండి
  12. ఆర్య శకారుని వంశ్యుడ
    మర్యాదను పెద్దవాడ మాన్యుడ ఘనుడన్
    ధైర్యంబున నని యొకడనె
    దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      శకారునితో కాకుండా అతని వంశ్యునితో అనిపించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  13. డా.పిట్టా
    ధుర్యుండే1 ధనమబ్బగ
    ధుర్యత్సమ2 స్వప్న3 మదియ దుష్టంబగు4 నీ
    దుర్యోధను కల గడచెను
    *దుర్యోధను పెండ్లియాడి ద్రోపది మురిసెన్*
    (1భారము వహించే వాడే,2బరువు మోసే యెద్దుతో సమానమైనమైనవాడు,3కల,4చెడ్డదగును,లైంగిక సంబంధంలో యెద్దుకు వావి వరుసలుండవు.5.దుర్యోధనుని కల ఇలా నడిచింది,గడిచింది:తనను పెళ్ళాడి ద్రోపదియే మురిసిపోయినట్లు.వరుస నెరుగని యీ వాంఛితము యెద్దు యొక్క ప్రవర్తనను గుర్తు చేస్తుంది.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా గారూ,
      బాగుంది మీ స్వాప్నిక పూరణ. అభినందనలు.
      'సమ స్వప్న' అన్నపుడు 'మ' గురువై గణదోషం.

      తొలగించండి
  14. కార్యోన్ముఖుఁడౌవిజయుం
    రార్యులుగనుచుండ మచ్ఛయంత్రముఁ ద్రెంచన్
    శౌర్యముతోడవెలుగు నా
    దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రౌవది మురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      దుర్యోధన శబ్దానికి ఉన్న వ్యుత్పత్త్యర్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విజయుం డార్యులు..' టైపాటు. 'మచ్చ యంత్రము' వినసొంపుగా లేదు. 'మత్స్యయంత్రము' అనవచ్చు కదా! లేకుంటే 'మచ్చె జంత్రము' అనాలి.

      తొలగించండి
    2. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
    3. కః కార్యోన్ముఖుఁడౌవిజయుం
      డార్యులుగనుచుండ మత్స్య యంత్రముఁ ద్రెంచన్
      శౌర్యముతోడవెలుగు రణ
      దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రౌవది మురిసెన్

      తొలగించండి
  15. శౌర్యోద్ధత రిపు హారిని,
    వీర్యోగ్రుని, మత్స్య యంత్ర భేదకుని, ధనుష్
    చర్యాగ్రేసరుని, సమర
    దుర్యోధను బెండ్లి యాడి ద్రోవది మురిసెన్

    రిప్లయితొలగించండి
  16. శౌర్యపు పాత్రలలో నౌ
    దార్యముజూప గలిగెడి విధానము నచ్చన్
    ఆర్యులు మెచ్చగ పందిట
    దుర్యోధను బెండ్లి యాడి ద్రోపది మురిసెన్| {నాటకరంగమునందు నడచిన ప్రేమకథ}

    రిప్లయితొలగించండి
  17. భార్యగభానుమతి తని సె
    దుర్యోధనుపెండ్లి యాడి;ద్రోవ ది మురిసె న్
    శౌర్య వి జయు డైసభలో
    వీర్యు డు గా గెలిచి తాను విక్రము డ య్యే న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఉత్తరార్ధంలో కొంత అన్వయలోపం. "శౌర్యుడు విజయుడు సభలో... విక్రము డైనన్" అంటే సరిపోతుందేమో?

      తొలగించండి
  18. భార్యగ భానుమతి కొలిచె
    దుర్యోధను; బెండ్లియాది ద్రోవది మురిసెన్
    శౌర్యోదాత్తుడు నర్జును;
    నార్యావర్తంబు నందు నగణితధీరున్.

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భార్యగ భానుమతి నిలిచె
    దుర్యోధను బెండ్లియాడి; ద్రోవది మురిసెన్
    శౌర్యముగల నైదుగురగు
    నార్యుల నెంచుచు ఘనముగ ననయమ్మచటన్
    (ఆర్యులు= భర్తలు)

    రిప్లయితొలగించండి
  20. ఆర్యా సతీ మహా కృప
    వీర్యవ రార్జునుని మత్స్య భేదన సుమహా
    కార్య విలాస తృణీకృత
    దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      నాల్గవ పాదం వరకు విస్తరించిన సుదీర్ఘసమానంతో అద్భుతమైన పూరణ చెప్పారు. 'తృణీకృత దుర్యోధను' డన్న ప్రయోగం చక్కగా ఉంది. నాకెందుకో తట్టలేదు!
      మీకు నా అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      ఈ సమాసము నింతకు పూర్వము కూడ నేను వాడినట్లు గుర్తు.

      ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరమ్
      తృణీకృత దశగ్రీవం మాంజనేయం నమామ్యహమ్

      తొలగించండి
  21. శౌర్యమున మత్స్య యంత్రము
    నార్యుడు ఫల్గుణుడు కూల్చ నాహవయముడై
    యుర్విని గల్గిన రిపులకు
    దుర్యోధను పెండ్లి యాడి ద్రోవది మురిసెన్

    రిప్లయితొలగించండి
  22. ఆర్యను వలచెను శ్రీహరి,
    దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్,
    సూర్యుని భార్య సరస్వతి ,
    ఆర్యా , యని మొకరి బలికె నర్ధము లేకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యొకడు బలికె నర్థచ్యుతుడై" అనండి. 'లేక' అన్నది కళ. లేకన్ అని ద్రుతం రాదు.

      తొలగించండి
    2. గురువు గారు యొకడు కాదు మొకరి == వదరు బోతు అన్న భావములో వాడాను

      తొలగించండి
  23. భార్యయ్యెను భానుమతి యె
    దుర్యోధనుఁ బెండ్లియాడి, ద్రోవది మురిసెన్
    శౌర్య కులీనుడు విజయుడు
    భార్యగ చేబట్ట తనను పదుగురి లోనన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    మదనుడేలగ విరహాన మండి పడుచు
    తిట్లు చీవాట్లు పెట్టుచు తిమిరమందు
    తగవు లాడుచు ముద్దిడి , తనదు సుతుని
    తండ్రితో రతికేళినిఁ దనయ కోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'భార్య+అయ్యెను' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      పూరణ బాగున్నది. కాని రెండవపాదం చివర తప్పక గురువుండాలి కదా! సవరించండి.

      తొలగించండి
  25. భార్యగ భానుమతిబరగె
    దుర్యోధనుబెండ్లియాడి,ద్రోవదిమురిసెన్
    వీర్యముగలభీముడుతన
    కార్యుడుగానగుటవలననమితపువేడ్కన్

    రిప్లయితొలగించండి
  26. మర్యాదా పురుషోత్తము
    డార్యుండర్జునుని వెంట నండగ నుండన్
    శౌర్యమున నధిగ మించఁగ
    దుర్యోధనుఁ, బెండ్లియాడి ద్రోవది మురిసెన్

    రిప్లయితొలగించండి