*ఆధునిక సామాజిక పద్య ప్రబంధ రచనా స్పర్థ*
నమస్కారం. స్వాగతం.
పాల్గొను మిత్రులు 28/02/2018 ( ఈ నెల చివరి లోగా) లోగా తమ సంసిద్ధతను ఈ పోస్టు కింది కామెంటు బాక్సులో తెలియజేయాలి. ఆ తరువాత వచ్చిన ఎంట్రీలు అంగీకరించబడవు.
పోటీ 01-03-2018 ఉదయం 6 గం. IST నుండి ప్రారంభం అవుతుంది.
ప్రబంధానికి ఇతివృత్తము మీరు స్వయముగా కల్పించినదైనా కానీ, లేదా కింద ఇవ్వబడిన మూడు ఇతివృత్తాల్లో
ఒకటిగా కానీ ఉండొచ్చు.( కేవలం కథ టూకీగా మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక మీ సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ఒకవేళ మేమిచ్చిన ఇతివృత్తాన్ని స్వీకరిస్తే మొత్తం మీద కథ చట్రాన్ని దాటకుండా దానిలో ఎన్ని మార్పులనైనా చొప్పించే స్వేచ్ఛ ఉంటుంది)
1. మీ తుది రచన చేరడానికి చివరి తేదీ : 15/06/2018, సాయంత్రం 6గంటలు IST. ఒకరు ఒక ఎంట్రీ మాత్రమే పంపాలి.
2. పద్యాలు కనీసం 150కి తగ్గకుండా 250కి మించకుండా ఉండాలి. ఆశ్వాస విభజనతో ఉండాలి. అయిదు
ఆశ్వాసాలు తప్పనిసరి. కనీసం ఒక్కో ఆశ్వాసంలో 30 పద్యాలకు తగ్గకుండా ఉండాలి.
3. మొత్తం పద్యాల్లో 1/4 వంతుకు తగ్గకుండా వృత్త పద్యాలుండాలి. వృత్త లక్షణాలకు అప్పకవీయమే ప్రమాణం.
4. మొత్తం మీరు రాసిన, పూర్తైన ప్రబంధం పద్యాల్లో 1/8 వంతులను మించి వచనం ఉండరాదు. ఒక్క పదమైనా సరే అది వచనంగానే లెక్కించబడుతుంది.
5. ప్రబంధాల్లో ఎలాంటి వర్ణనలు ఉండాలి, ఏమేమి అలంకారాలు ప్రయోగించాలి అన్నది కవులూ/కవయిత్రులూ
నిర్ణయించుకోవచ్చు. అయితే అవి ఆధునిక సమాజంను దృష్టిలో పెట్టుకొని ఉండాలి.
6. ఒక పదానికి అనేకమైన అర్థాలున్నప్పుడు లోక వ్యవహారంలో ఉన్న అర్థంలోనే ప్రయోగించడం మంచి సంప్రదాయం. అలాగే సామాన్య వ్యాకరణ సూత్రాలు పాటించాలి.
7. మీరు రాసిన పద్యాలను మార్చి నెల నుండి ప్రతి 15 రోజులకొకసారి prajapadyam@gmail.com కు పంపాలి. (ఎన్ని రాస్తే అన్ని)
8. గడువులోగా మొత్తం ప్రబంధాన్ని "ఆధునిక సామాజిక పద్య ప్రబంధ స్పర్థ కోసం నేను పంపుతున్న ఈ రచన నా
స్వంతం. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు. గతంలో పత్రికల్లోకానీ, దృశ్య శ్రవణ మాధ్యమాల్లో కానీ,
అంతర్జాలంలో కానీ (బ్లాగులు, పేజీలు, గ్రూపులతో సహా) ఏ విధంగానూ ప్రచురణ, ప్రసారం, పోస్టింగ్ అయ్యి ఉండలేదు. దీని మీద వచ్చే అన్ని వాద వివాదాలకు నాదే స్వయముగా బాధ్యత" అన్న స్పష్టమైన హామీతో పాటు మీ లేటెస్టు పాస్ పోర్టు సైజు ఫోటో, చిరునామా రాసి prajapadyam@gmail.comకు పంపాలి.
దీనితో పాటు మీకు మెసేజ్ బాక్సులో తెలియజేయబడే చిరునామాకు టైపు చేయించిన మీ రచనను తప్పకుండా
పంపాలి. ఈ రెండు రకాలుగా పంపబడిన ఎంట్రీ మాత్రమే పరిశీలింపబడుతుంది. (అంటే అటు gmail చేయడంతో
పాటూ HARD COPY కూడా పంపాలన్న మాట!)
9. బహుమతుల వివరాలు:
ప్రథమ బహుమతి: రూ. 5000/
ద్వితీయ బహుమతి: రూ. 4000/
తృతీయ బహుమతి: రూ. 3000/
మూడు ప్రోత్సాహక బహుమతులు: రూ.1000/
10. బహుమతుల విషయంలో ప్రజ-పద్యం ఎంపిక చేసిన న్యాయనిర్ణేతల సంయుక్త నిర్ణయమే అంతిమం. దీనిమీద
ఎలాంటి వాద వివాదాలకు, సంప్రదింపులకు ఆస్కారం లేదు. గడువు తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబడదు.
బహుమతి మొత్తాలను పెంచడానికి, తగ్గించడానికి, ఒక బహుమతికి అర్హమైన రచనలు రాలేదని భావించిన పక్షంలో దాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ప్రజ-పద్యం (లోకాస్సమస్తాస్సుఖినోభవంతు) ADMINSకు సర్వ హక్కులూ
ఉంటాయి.
ప్రజ-పద్యం వారు సూచిస్తున్న ఇతివృత్తాలు:
ప్రబంధానికి కవులూ, కవయిత్రులూ తమకు తోచిన పేరు పెట్టుకోవచ్చు. (ఇతివృత్తాన్ని కూడా వీటిలోనుండే
ఎన్నుకోవాలని తప్పని సరి కాదు)
*ఇతివృత్తం ఒకటి*
1. ఒక నలభయ్యేళ్ళ క్రిందట.
2. పచ్చని చిన్న పల్లెటూరు.
3. దొరికిన పనినల్లా చేసుకుని బ్రతుకుతున్న ఒక పేద కుటుంబం.
4. ఒకడే కొడుకు. పది, పన్నెండేళ్ళ వయస్సు. చదువుకొంటున్నాడు. తల్లి చనిపోతుంది.
5. ఏదో ఒక తప్పనిసరి పరిస్థితిలో వాడు ఎవరికీ చెప్పకుండా కన్నతండ్రిని, ఇంటిని వదిలి పారిపోతాడు.
6. ఎట్లాగో దూరంగా వున్న మరో రాష్ట్రంలోని మహా నగరానికి చేరుకుంటాడు.
7. అనేక ప్రయత్నాలు, అవమానాలు, అగచాట్లు, పస్తుల తరువాత ఒక చిన్న పనిని సంపాదించుకుంటాడు.
8. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది, డబ్బు, పలుకుబడి సంపాదించుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు
కలుగుతారు. పిల్లలు అతడి వ్యాపారాలలో తోడ్పడుతూ వుంటారు. భార్య చనిపోతుంది.
9. నలభయ్యేళ్ళ తరువాత తన ఊరి పైకి ధ్యాస మళ్ళుతుంది. తనొక్కడే వెళ్తాడు.
10. ఊరు పెద్దగా మారలేదు. ఇతడి విషయం తెలిసి జనం స్వాగతిస్తారు. ఊరి మేలు కోసం కొన్ని వాగ్దానాలు చేసి
తిరిగి వస్తాడు.
11. సంవత్సరం తరువాత తన వ్యాపారాలను పిల్లలకు అప్పజెప్పి తను ఊరికెళ్ళి పోయి, అనేక సంక్షేమ
కార్యక్రమాలను చేపట్టుతాడు. అక్కడే ఉండిపోతాడు.
*ఇతివృత్తం రెండు*
1. ఒక చిన్న పల్లెటూరు. ఒక రైతు కుటుంబం. వ్యవసాయం తప్ప మరేమీ తెలియని పెద్దగా చదువుని రైతు. అతడు, భార్య, ఇద్దరు కొడుకులు. చిన్న పిల్లలు.
2. వ్యవసాయంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక నష్టాలు ఎదుర్కొని, అప్పుల పాలౌతాడు.
3. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని భావిస్తున్న తరుణంలో అతడికి గల్ఫ్ దేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది.
4. అక్కడ చాలా కష్టపడి పనిచేసి సంపాదించినదల్లా ఇంటికి పంపుతాడు. భార్యకూడా జాగ్రత్తగా పిల్లలను
పెంచుతుంది. పిల్లలు బాగా చదువుకుంటారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు.
5. అప్పులన్నీ తీరిపోతాయి. భార్య వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వుంటుంది. పిల్లలు చదువులు పూర్తి చేసుకుని
ఉద్యోగాలు సంపాదించుకుంటారు.
6. ఇరవయ్యేళ్ళకు పైగా కుటుంబానికి, దూరంగా ఉండి ఒక డబ్బులు సంపాయించే యంత్రం లాగా శ్రమించిన
అతడు చివరికి ఉద్యోగాన్ని వదులుకుని తిరిగి వస్తాడు.
7. ఇద్దరు పిల్లలు వాళ్ళ సంస్థల తరఫున విదేశాలకు వెళ్లి భార్యా బిడ్డలతో అక్కడ స్థిరపడుతారు.
8. పాతికేళ్ళు ఎడారి దేశాలలో శ్రమించికోల్పోయిన కుటుంబ వాతావరణాన్ని ఆశించి పిల్లలతో, మనుమలతో కాలం
గడుపుదామని అతడు కన్న కలలన్నీ కల్లలౌతాయి.
9. ఫోన్లలో పిల్లల పలకరింపులు. ఇక్కడి గాలి, నీరు, మట్టి, వాతావరణాన్ని ఈసడించుకునే మనుమలు.
10. అతడు, అతడి భార్య... అదే ఏకాంతము... మళ్ళీ అదే వ్యవసాయం.
*ఇతివృత్తం మూడు*
1. విదేశంలో పెద్ద వుద్యోగి. భార్య, ఇద్దరమ్మాయిలు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాదు/విశాఖపట్నంలో. రెండేళ్ళ
కోసారి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. సంతృప్తికరమైన కుటుంబం.
2. భార్య మూడో కాన్పులో ఆడబిడ్డను కని మరణిస్తుంది.
3. కాన్పు కొచ్చిన అత్తగారు పాపను తీసుకుని ఇండియా వస్తుంది.
4. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు.
5. ఇక్కడ ఇంటిపెత్తనం మేనత్త, మేనమామలది. పాపకోసం తండ్రి పంపుతున్న డబ్బులన్నీ దిగమింగేసి, పాపను
పట్టించుకోరు. అమ్మమ్మ నిస్సహాయురాలు.
6. ఇంట్లో పెంపకం బాగాలేని కారణం చేత చెడు సాంగత్యం పడుతుంది పాప. ఎవడినో ప్రేమించి వాడితో
వెళతానంటుంది.
7. అప్పటికే ఇండియా వచ్చి స్థిరపడ్డ తండ్రి ఈ విషయం తెలిసి తీసుకెళతాడు.
8. అప్పటికే అక్కలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడు. పాపకు కూడా మంచి సంబంధం ఖాయం
చేస్తాడు.
9. కొన్ని కారణాల వలన తను ప్రేమించిన యువకుడి దగ్గరకు వెళ్ళిపోయి వాడిని పెళ్లిచేసుకుంటుంది.
10. వాడు చెడు అలవాట్లకు బానిస అని, వాడికి ఇంతకు ముందే పెళ్ళయిందన్న సంగతి తెలిసి కుమిలిపోతుంది.
వాడు కట్నం తెమ్మంటూ హింసిస్తాడు. ఇంట్లోంచి పారిపోతుంది.
11. అప్పటికే సవతి తల్లి అనారోగ్యంతో మంచం పడుతుంది. సవతి చెల్లెలు ఎవడితోనో లేచిపోతుంది. తండ్రి
పాపను వెతుక్కుంటూ వస్తాడు. తన యింటికి తీసుకెళతాడు. సవతి తమ్ముడు, అతడి భార్య ఈమెను ఆదరిస్తారు.
కుటుంబానికి అన్నీ తానే అవుతుంది.
క్రింది లింకుని తెరచి అక్కడి కామెంటు బాక్సులో మీ అంగీకారాన్ని తెలియజేయవచ్చు. వివరాలను తెలుసుకొనవచ్చు. సందేహాలు తీర్చుకొనవచ్చు.
https://www.facebook.com/groups/1033816143430286/?
multi_permalinks=1329754363836461&comment_id=1333113003500597¬if_id=
1519123933263996¬if_t=feedback_reaction_generic&ref=notif