18, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2601 (దుష్ట దుర్యోధనుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద"
(లేదా...)
"దుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

76 కామెంట్‌లు:

  1. భారతమునను చదివితి భాను మతియె
    దుష్ట దుర్యోధనుని భార్య; ద్రోవది గద
    పంచ పాండవులందరి భార్య; నాకు
    విరుపు తప్పలేదీ పూట విసుగు బుట్టి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపు మెరిసెనీ పూట యో మెరుపు బంట్టి

      తొలగించండి
    2. విరుపు ఫెళ్ళుమనియె విల్లు విరిచినట్టు

      తొలగించండి
    3. విరుపు విరవకున్నను నాకు విజయమమేది?

      తొలగించండి
    4. విరుపు లేకున్న పూరణ వెలుగు నెట్టు?

      తొలగించండి
    5. విరుపు గాచె గదర నన్ను పరువు నిలిపి

      తొలగించండి


    6. విరుపును గనన్ విరామము
      పరుగుల కిమ్మా విసుగు, కపణములు బోవన్
      సరసపు పలుకుల గమకము
      సరిసరి యనుచున్ గబగబ సరసకు వచ్చున్ :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి


  2. భానుమతి యెవరె జిలేబి ? పంచ పాండ
    వులకు భార్యగ వచ్చిన వువిద యెవరె?
    భీము నాయుధ మేది?; కవికుల విదుర!
    దుష్ట దుర్యోధనుని భార్య; ద్రోవది; గద!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వావ్!జిగేల్!గ్రేట్!జిలేబి జవాబులన్ని!

      తొలగించండి
    2. డాక్టర్ మునిగోటి సుందర రామ శర్మ ఉవాచ:


      "జిలేబీ తీయదనంతోపాటు, కవితాచమత్కార *గులాబీ* గుబాళింపు కూడ స రసంగా... సరసంగా వున్నాయి. సుందరాభినందనచందనాలు.👌"

      తొలగించండి
    3. అయ్యయ్యో!!
      అచ్చం నేనెలా రాయాలనుకున్నానో అలాగునే రాసేశారే!!
      😆

      తొలగించండి
    4. రామాయణంలో పిడకల వేట..
      రాసాను...రాశాను
      రాసేశా...రాశేసా
      ఇంతకీ ఎలా రాయాలి..
      మార్గదర్శకత్వం ప్లీజ్!!!
      🙏🏻

      తొలగించండి
    5. చతురతకై అతివాగుడు
      సహించి క్షమించప్రార్ధన
      🙏🏻

      తొలగించండి
    6. చతురతకై యతివాగుడు
      మితముగ నే చేసినాడ మీరెల్లరునూ
      యతిరధులౌ కవిశ్రేష్టులు
      మతిమాలిన వాదములను మన్నించుదురే!?
      🙏🏻

      తొలగించండి


    7. అచ్చెరువుగ నే నెట్లా
      గుచ్చా లనుకొంటినో జిగురుగడ తోడ
      న్నచ్చము నట్టే గుచ్చిరి
      టచ్చాణ్నాంగద గుణించుటనెటుల మేమౌ :)

      జిలేబి

      తొలగించండి


    8. మునిగోటి శర్మ గారికి

      ధన్యవాదములు !

      జీపీయెస్ గారు యే ప్లాటుఫారమ్ లో యిది ?
      వాత్సాపా ? ఫేసు బుక్కా ?


      జిలేబి

      తొలగించండి
    9. నా ముఖమున్ కు పుస్తుకము నప్పదు; ముచ్చటి వాట్సపౌ గతే!

      తొలగించండి
    10. అక్కటభారతీసతికిహాస్యసుదుష్పదహారమిష్టమే!!!

      తొలగించండి
    11. శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం
      సరసానందవాగ్విలాస చరణం శబ్దార్థసంపూరణమ్
      చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం శంకరాభరణం
      నిత్యమహం స్మరామి విలస ద్వాగ్దివ్య సింహాసనమ్

      తొలగించండి
  3. భద్ర శ్రీకృష్ణునిసతియే, భానుమతియె
    దుష్ట దుర్యోధనుని భార్య, ద్రోవది గద"
    పంచ పాండవుల కుసతి,యెంచి చూడ
    పార్వతి సహధర్మిణిగదా పసుపతికిని

    రిప్లయితొలగించండి
  4. ఫారసికపు సఖుడొకడపరి జయమును
    విశదపరుచమనెను మక్కువె మదినిండె.
    అంతయువినక,ఓహోహొ!అనుచునుడివె
    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద!!?

    రిప్లయితొలగించండి
  5. సమరమందు తొడల విర్చి చంపెదనని
    వాయుపుత్రుడు భీషణ ప్రతిన బూనె
    దుష్ట దుర్యోధనుని, భార్య ద్రోవది గద
    కురులు ముడువనంచు తెలుప క్రోధ మందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాయుపుత్రుడు భీషణ ప్రతిన బూనె
      సమరమందు తొడల విర్చి చంపెదనని
      దుష్ట దుర్యోధనుని, భార్య ద్రోవది గద
      కురులు ముడువనంచు తెలుప క్రోధ మందు.

      తొలగించండి
  6. నష్టమునెంతయో బడసె నర్మిలి భానుమతీలలామయే
    దుష్టసుయోధనున్ వలచి; ద్రోవది పెండిలియాడె వేడుకన్
    శిష్టపవిత్రవర్తనుల; జెల్వగు మూర్తుల; బాండు పుత్రులన్
    ధృష్టుడు సోదరుండు; కడు ధీరుడు; ద్రష్టగ వెంట నిల్వగా.

    రిప్లయితొలగించండి
  7. భర్త యొక్కరితో వేగె భానుమతియె
    దుష్ట దుర్యోధనుని భార్య--ద్రోవదిఁగద
    ఏవురనుఁగట్టుకొనె -నెట్టులేగెనొఁగద!
    చూడ చూడగ నియ్యది చోద్యమగును

    రిప్లయితొలగించండి


  8. నిష్టగ గొల్చె భానుమతి నీమము తప్పక భార్య గానయా
    దుష్ట సుయోధనున్ ; వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్
    నిష్టగ గొల్చి నాత్మ భవు నింటి మగండిని గోర పూర్వజ
    న్మేష్టము పంచ పాండవుల నిప్పుడు పొందుచు తన్వి భర్త్రికై !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. :)

      సారుయె శంకరాభరణ సారము దారము హారమున్ గదా!


      "మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ"

      తొలగించండి
  9. భాను మతి య య్యే నె వ రికి భార్య గాగ ?
    పంచ పాండవు ల కెవరు భార్య చెపుమ ?
    భీమ సేనుని యాయు ధ పేర డే మి ?
    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవ ది గద

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    కష్టము మత్స్యయంత్రమనగా , గగనమ్మున చేప గూల్చ సం...
    క్లిష్టత నీట నీడ గని ., లీలగ చేకొని విల్లు గూల్చ , సం...
    తుష్టమతిన్ మనోహరుని దోర్బలభాసితు , బార్థు , ధీరు , ని...
    ర్దుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్ !

    ( నిర్దుష్ట... దోషరహితమైన
    సుయోధనుడు... యుద్ధము జేయ గలవాడు....)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జతపరచుము... ప్రశ్నలో....

      *ఏ* కి *బీ* పెట్టితీవు ! నేనెట్లు నీకు
      గుణములిత్తును ? గందరగోళమయ్యె !
      జూడు రాజరాజెవడన క్రీడి యయ్యె !
      దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది కద !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    2. మురళీ కృష్ణుని ఉత్పలమ్ము మనసా ముద్దొచ్చె గా దే సఖీ :)

      అదురహో నిర్దుష్ట సుయోధనా అర్జునా !


      జిలేబి

      తొలగించండి
    3. కష్టము నిష్టమున్ కలుపు కాష్టము క్లిష్టము నష్టమున్ గదా
      ద్రష్టను తుష్టితో మురిసి దండుచు ముష్టిని శిష్టునిన్నహా
      దుష్టుని నేనిటన్ మురళి! దుష్కర ప్రాసల కూర్చలేనయో:
      "దుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్"


      ...కలుపు కాష్టము = weaver's shuttle

      తొలగించండి
    4. దాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారి స్పందన:

      "ష్టష్టష్టష్టలు తుష్టి నిష్టములుగా
      సాధింతురే పుష్టిగా!"

      ****************************

      మైలవరపు వారి ప్రతిస్పందన:

      "శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి అభినందనలు..🙏
      శ్రీ వెలుదండ వారికి వందనములు 🙏🙏

      చేష్టల్ హాస్యములట్లు దోచు , గనగా చిత్రంబు పద్యమ్ములన్
      పుష్టిన్ జూడగ పుష్కలమ్ము ! పదముల్ మున్ముందుకున్ వచ్చియున్
      సాష్టాంగంబను మీకు ! మీ ప్రతిభకున్ ! శాస్త్రీ ! ముదంబయ్యెడిన్ !
      ష్టష్టష్టష్టలు తుష్టి నిష్టములుగా
      సాధింతురే పుష్టిగా!!"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. ఆహాఁ! మీ మధ్యన పడటం నా సుకృతం.

      కురువృద్ధులు మీరెల్లరు
      మరిమరి మీ పద్యములను మార్గము జూపన్
      పరిపరి విధముల సాధన
      సరిగా నే జేతు మీదు సాంగత్యమునన్!

      తొలగించండి

    6. ఏమండోయ్ విట్టుబాబు గారు

      మోస్ట్ డైనమిక్ అవధానులు శ్రీ మైలవరపు వారిని కురువృద్ధుల జత గట్టే సారే ? ఆయ్ ? :)


      జిలేబి

      తొలగించండి


    7. అంచనా తప్పలేదుస్మీ :)


      జిలేబి

      తొలగించండి
    8. మైలవరపు వారు ఉవాచ:

      శ్రీ జిలేబి గారికి ధన్యవాదాలు.. నమోనమః 🙏🙏

      తొలగించండి
    9. జిలేబిగారూ..
      నా ఉద్దేశ్యం...కవిశ్రేష్ఠులు అనీ...:-))

      తొలగించండి
  11. దాష్టికమట్లుగా తన ప్రధానగుణమ్మనఁ కౌరవేంద్రుడై
    యిష్టముఁ దీర హస్తిపురి నేలచు నుండినఁ గాని రోసి తా
    దష్టసుయోధనున్; వలచి ద్రోవది పెండిలి యాడె వేడుకన్
    మష్టి వహించు వారలను మోహమనమ్మునఁ బాండవేయులన్

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2601
    సమస్య :: *దుష్టు సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్.*
    ద్రౌపది దుర్యోధనుని పెండ్లి జేసికొన్నది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శూద్రకుడు అనే మహాకవి సంస్కృతంలో రచించిన మృచ్ఛకటికము అనే గొప్ప నాటకంలో శకారుడు అనే పేరుతో ఒక పాత్ర ఉంది. రాజుగారికి బావమరిది యైన ఆ శకారుడు మద్యం త్రాగిన మత్తులో పురాణాలు తనకు మాత్రమే తెలుసునన్నట్లు అజ్ఞానంతో ఏదేదో వాగుతుంటాడు.
    శశిరేఖ అభిమన్యుని కాకుండా లక్ష్మణ కుమారుని పెండ్లియాడిందని , రుక్మిణి శ్రీకృష్ణుని కాకుండా శిశుపాలుని పెండ్లియాడిందని , అలాగే ద్రౌపది పాండవులను కాకుండా దుర్యోధనుని పెండ్లియాడిందని ఆ శకారుడు మద్యం త్రాగిన మత్తులో నోటికి వచ్చినట్లు వాగుతున్న సందర్భం.

    భ్రష్టుడు మత్తచిత్తు డిటు బల్కె శకారుడు నాడు వింతగా ,
    ‘’ నిష్టము తోడ లక్ష్మణు వరించిన దా శశిరేఖ చూడగా ,
    నిష్టముతోడ రుక్మిణి వరించెనుగా శిశుపాలు , నట్టులే
    *దుష్టు సుయోధనున్ వలచి ద్రోవది పెండిలి యాడె వేడుకన్. ‘’*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (18-2-18)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు





    1. క్లిష్ట సమస్యా పూరణాయాం దుష్ట శకారః శిష్ట సఖః :)

      జిలేబి

      జిలేబి

      తొలగించండి
    2. సమస్యా పూరణా తరంగిణీ తరణార్థం
      అద్య దుష్ట శకారః న కేవలం శిష్ట సఖః
      ఇష్ట సఖః అపి ఇతి మన్యే।

      తొలగించండి
  13. "దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద"🙄
    కష్ట మేసుమి వ్రాయుట కవియు నుక్తి 😯
    క్లిష్టమే గద విరువక లీల దెలుప😐
    తుష్టి కలుగగ పూరించు త్రోవ యేది🤔
    😇😇😇😇

    రిప్లయితొలగించండి
  14. స్పష్టమేగ భానుమతియె సార్వభౌము
    దుష్ట దుర్యోధనుని భార్య; ద్రోవది గద
    తుష్టమానసమున గొల్చె దోషరహితు,
    శిష్టమతియైన ధర్మజు శీలవతిగ

    రిప్లయితొలగించండి
  15. భానుమతియను సాధ్వియే వాసుదేవ!
    దుష్ట దుర్యోధనుని భార్య ,ద్రోవదిగదా
    మత్స్య యంత్రమ్ము గొట్టిన మనుజ విభుని
    భార్య యయ్యెను సభికులు ప్రమద మలర

    రిప్లయితొలగించండి
  16. దుష్టసుయోధనున్ వలచిద్రోవదిపెండిలి యాడె వేడుకన్
    దుష్టుని బెండ్లి యాడగను ద్రోవదివెర్రిదె? మీరెజెప్పుడీ
    యిష్టము తోడనే కరము నిచ్చెను పాండవు లైదుమందికిన్
    ద్రష్టలు సంతసంబలర రాణిగ నయ్యెను వారికిన్జుమీ

    రిప్లయితొలగించండి
  17. వింతఁ గొలుపు మయసభ నవ్వినది, గాంచి
    దుష్ట దుర్యోధనుని, భార్య ద్రోవది గద
    పాండు పుత్రులకును దానఁ బడసె నష్ట
    కష్టములు భార తాజికి కారణ మయి

    నష్ట ఝషంపు ఖ్యాతిని ఘనమ్ముగ వెల్గ సభాంతరమ్ము ని
    శ్చేష్టుని కర్ణ సంయుతము సేయఁగఁ బల్గుణుఁ డా నిరంత రా
    వేష్టుఁడు నిత్య మత్సరుఁడు భీకర పాండవ శాత్రవుండు నా
    దుష్ట సుయోధనున్, వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా!
      ఆహా!ఓహో!!
      అత్యుత్తమమా తేటగీతి. దాన్ని మించినదా ఉత్పలమాల. మీకు మీరే సాటి!
      శత సహస్ర కోటి నమస్సులు కవివరేణ్యా!!
      🙏🏻

      తొలగించండి
    2. రావు గారు నమస్సులు, కడుంగడు ధన్యవాదములు.

      తొలగించండి
  18. ముడిని వేయని కురుల మగడికిఁ జూపి,
    చేసిన ప్రతిజ్ఞ తా గుర్తుజేసి, చంప
    కారణమ్మయ్యె భీముండు కదనమందు
    దుష్ట దుర్యోధనుని, భార్య ద్రోవది గద
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  19. సూర్యజుని వరియించెను సుదతి రాధ,
    పరగ కాశీ నృపుని సుత బానుమతియె
    దుష్ట దుర్యోధనుని భార్య, ద్రోవదికద
    పరిణయంబాడె ధర పంచ పాండవులను..!!!

    రిప్లయితొలగించండి
  20. భానుమతి యనెడి పడతి భారతమున
    దుష్ట దుర్యోధనుని భార్య! ద్రోవది గద
    పంచ పాండవుల సతిగ బాధలంద
    కౌరవుల నంత మొనరింప ప్రేరణయ్యె!

    రిప్లయితొలగించండి
  21. డా.ఎన్.వి.ఎన్.చారి
    ముష్టిచణుండు భీముడతి యుద్ధతి మీర వధించె నుగ్రుడై
    దుష్ట సుయోధనున్; వలచి ద్రోవది పెండిలియాడె ,వేడుకన్
    దృష్టిని పెట్టి మీనమును ధాటిగ కొట్టిన పార్థునిన్ వరున్
    శిష్టుడు కృష్ణుడా విధిని చిత్రణ జేయన సాధ్య ముండునే

    రిప్లయితొలగించండి
  22. భ్రష్టుడొకండనెన్ వినగ భారతమంతయు శ్రద్ధమీరగన్
    స్పష్టము నింతియే వినుడు సందియ మెంతయు లేదు లేశమున్
    దుష్టు సుయోధనున్ వలచి ద్రోవది పెండిలి యాడె వేడుకన్
    తుష్టిగ రాజ్యపాలనముతో నిల సౌఖ్యములన్ని గూడగన్!

    రిప్లయితొలగించండి
  23. జ్యేష్టుడు నౌ జయంతునికి చెన్నగు రూపము సోయగమ్మునన్
    సౌష్టవ మద్దిచూచినను శాత్రవు లెల్ల వడంకు భీతి నం
    జిష్టుడు తేజమందుగన, చిత్తము నందున విష్ణురూపు ని
    ర్డుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  24. అగుదు నష్టావధాని నంచనెనొకండు
    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద !
    కష్ట మియ్యది సామాన్య కవులకిపుడు ;
    గండపెండేర మిడుడని కాలు సాచె

    రిప్లయితొలగించండి


  25. వలచి పరిణయమాడిన భానుమతి యె
    దుష్ట దుర్యోధనుని భార్య; ద్రోవది గద
    పంచ పాండవులకు ధర్మ పత్ని యగుచు
    కుంతి దేవికి గారాబు కోడలయ్యె.


    భానుమతి యను పేరున్న వారెవరిల
    సవ్యసాచికిసతియైన సాధ్వి యెవరు
    దుష్ట దుర్యోధనుని భార్య, ద్రోవది గద
    భారతము నందలి ప్రముఖ పాత్రలైరి.

    రిప్లయితొలగించండి
  26. తే.గీ.
    భారతమున సాధ్వీమణి భానుమతియె
    దుష్టదుర్యోధనుని భార్య ; ద్రోవదిగద
    పాండవులభార్య యిరువురు భామలటుల
    పాండు, కురు వంశ వృద్ధిలో భాగమైరి

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. తేటగీతి
      పృచ్ఛక మహాశయా! మీకు వినతి జేతు
      దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద
      యనుచు సంశయించిన మీకు నర్జునునకు
      భార్య భానుమతియని యే పాటి తెలుసు?

      తొలగించండి
  28. క్రమాలంకార పూరణ:
    *****
    భీముడు చంపెదనని బల్కె భీకరముగ ;
    భర్త కష్ట సుఖమ్ముల బంచు కొనును
    యేవురు పతులు గలిగిన దెవరు జూడ?
    "దుష్ట దుర్యోధనుని ; భార్య ; ద్రోవది గద"

    రిప్లయితొలగించండి
  29. ఉత్పలమాల

    శిష్ట జనాళిఁ గాచు హరి చేయఁగ మేలు స్వయంవరమ్మునన్
    దృష్టిని నిల్పి యర్జునుడు త్రెంచఁగ మేటిగ మత్స్యయంత్రమున్
    తుష్టిని బొందుచున్ మనసు దోచఁగ, దాటుచు మోము వాల్చెడున్
    దుష్ట సుయోధనున్, వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్

    రిప్లయితొలగించండి
  30. .........సమస్య
    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద

    సందర్భము...
    భీము డొకనా డంటున్నాడు ద్రౌపదితో..
    "దుర్యోధనుని తలచుకొన్నంతనే కోపం ముంచుకు వస్తున్నది. ఇక లాభం లేదు.. గద అందుకో! వాణ్ణి సంహరించడం అత్యవసరం"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    వాయు నందను డొకనాడు పలికె నిట్లు

    "దండి రౌద్రంబు రేగును తలచినంత

    దుష్ట దుర్యోధనుని; భార్య! ద్రోవది! గద

    నందుకొనుము వధించు ట త్యవసరంబు.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    18.2.18
    -------------------
    ...............సమస్య
    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద

    సందర్భము... ఒక శిష్యుడు గురువుతో అంటున్నాడు. "ఓ అమలాత్మా! నేను విన్నది ఇలా వున్నది కదా!" అని.
    ఛందస్సు........ ద్విపద
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ఆ భానుమతి గదా అమలాత్మ! దుష్ట

    దుర్యోధనుని భార్య; ద్రోవది గ దయ!

    పంచ పాండవ పత్ని పరికించి చూడ..

    నెంచ నా యమ జన్మయే ధన్యము గద!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    .............సమస్య

    దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద

    సందర్భము... సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    పాప కృత్యంబులకు పాలుపడెడు మగని

    ధర్మ మార్గంబునకు ద్రిప్ప దయ్యె గాన

    దుష్ట.. దుర్యోధనుని భార్య; ద్రోవది గద

    ధర్మమును తప్పనీయదు!.. దైవ మదియె!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  31. శిష్టుడు వాయుపుత్రుడుర చిత్తుగ దంచెను ముద్గరమ్ముతో
    దుష్ట సుయోధనున్;...వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్
    తుష్టిగ నైదువీరులను త్రుళ్ళుచు గంతుచు భారతమ్మునన్...
    వేష్టుర నీదు కైపదము వెక్కగ త్రాగుర వేడినీళ్ళనున్!

    రిప్లయితొలగించండి