25, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2608 (సంసారికి లేని చింత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంసారికి లేని చింత సన్యాసి కగున్"
(లేదా...)
"సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

98 కామెంట్‌లు:



  1. అంసము మీదన్ భారము
    కంసము లోననటకూడు గద మన బాధౌ!
    హంసోయా సోహంబా?
    సంసారికి లేని చింత, సన్యాసి కగున్!

    ಜಿಲೇಬಿ
    ಹೊಸೂರುನಲ್ಲಿಂದ

    రిప్లయితొలగించండి
  2. హింసను వర్జించక మీ
    మాంసను పఠియించబోక మనమందున నా
    కంసారాతిని మరచెడి
    సంసారికి లేని చింత సన్యాసి కగున్

    రిప్లయితొలగించండి
  3. వంసాం కురమని బ్రమియింప
    సంసా రికిలేని చింత , సన్యాసి కగున్
    కంసారిని ధ్యా నించుచు
    హింసా కాండను నడుపెడి హీనులు మెండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రాస కోసం వంశము.. వంసము అయింది.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    కంసారిన్ భజియింపనెంచ గృహసౌఖ్యంబడ్డుగా దోచెడిన్
    హంసన్ గూర్చి తపించనెంచగనదే యడ్డంబు , మోక్షార్థికిన్
    సంసారంబవరోధమౌను, గనగా సన్న్యాసికిన్ వీలగున్ !
    సంసారుల్ గనలేని *చింత* యెపుడున్ సన్యాసికే సొంతమౌ" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వచ్చె వచ్చె హోసూరు
      అప్రస్తుతము తో 'ని' వేదించెదము వేదిక పైనన్ మైలవరపు వారిన్ :)


      ఆల్ ది బెస్ట్ శర్మ గారికి :)


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. ఈ పాటికి మైలవరపు వారు హోసూరి పృచ్ఛకులను వాయకొడుతుంటారు 😊

      తొలగించండి

    4. జిలేబి వారి అప్రస్తుతంతో తికమకపడిపోయారని గ్రేప్వైన్ భోగట్టా :)


      జిలేబి

      తొలగించండి
    5. హోసూరు అవధానం ఫోటోలు ఇప్పుడే వచ్చాయి. వేదికపై మీరెక్కడా కనిపించలేదు ఎంత వెదకినా :(

      తొలగించండి

    6. హాలు మొత్తాన్ని మైలవరపు వారు జిలేబీ మయం చేసేరండి :) మీరు లేదంటే యెట్లా :)



      జిలేబి

      తొలగించండి
  5. సంశయమేటికి భువిలో
    కంసారిని మది దలచుచు ఘనముగ కొలువన్
    హంసా! సత్యమ్మిదిగన
    సంసారికి లేని చింత సన్యాసి కగున్

    రిప్లయితొలగించండి

  6. అంసమ్ముల్ పయి భారమౌను మన చింతల్ గాని, యేకాంగికిన్
    హంసోయా యను సందియమ్ము సయి సోహంబున్ గదా చూడగన్
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ!
    సాంసిద్ధమ్ము జిలేబి దైవ కృపగన్ సంద్రమ్ము దాటన్ సుమీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. *హంసగనిల్వగనీధర*
    *ధ్వంసముజేయుచుమలినపు తలపులనన్నిన్*
    *కంసారి కరుణ విఫలత*
    *సంసారికిలేనిచింత సన్యాసికగున్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తలపుల నెల్లన్" అనండి.

      తొలగించండి
  8. *హంసన్బోలువిధమ్ముగా విచక్షణాహ్లాదంబుపొందంగ రీ*
    *రింసాభావన తుచ్ఛకోరికల ప్రేరేపించ వర్జించుచున్*
    *కంసారీవిభవాద్యుతుల్ మదిని ప్రక్షాళంబు చేలేక నా*
    *సంసారుల్గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో 'విచక్ష' అన్నచోట గణదోషం. 'రిరింస' శబ్దం ఉన్నది కాని 'రీరింస' లేదు.

      తొలగించండి
  9. హింసాధూర్తుల దాడికి
    ధ్వంసంబై పోవుచున్న ధరణిన్ గావన్
    సంసిద్ధుందు నరేంద్రుడు ;
    సంసారికి లేని చింత సన్యాసికగున్ .
    (నరేంద్రుడు -వివేకానందుడు )

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంసిద్ధుండు'... టైపాటు.

      తొలగించండి
  11. సంసక్తిం గల క్రీడలందుఁ గొను శైశవ్యంబునం జింతలన్,
    హంసీయానల చింత యౌవనులలో నత్యంతమోహావృతిన్,
    కంసారిన్ మదిఁ దల్చుచున్ నిరతమోక్షాకాంక్షలం
    దొప్పగా
    సంసారుల్ గన లేని చింత, యెపుడున్ సంసారికే సొంతమౌ.

    రిప్లయితొలగించండి
  12. సంసార సాగ రం బు న
    సంసారి యె చిక్కు గాని సన్యాసి యె టు ల్
    హింస కు గురి యౌను ?గనుక
    సంసారి కి లేని చింత సన్యాసి క గు న్ ?

    రిప్లయితొలగించండి
  13. హింసా లోలత్వంబున
    ధ్వంసంబును చేసి లోక ధర్మంబులనే
    సంసద్ బహిష్కృతుండగు
    సంసారికి లేని చింత సన్యాసికగున్

    రిప్లయితొలగించండి
  14. హింసించుచు చంపుచు గో
    మాంసమ్మును తినుటనిలను మాన్పించిన వి
    ధ్వంసములాపగలమనుచు
    సంసారికి లేని చింత సన్యాసి కగున్

    రిప్లయితొలగించండి
  15. సంసారికొక్కటె తలపు
    సంసారము నడుపుటెట్లు సక్రమరీతిన్
    సంసారుల సంస్కరణను
    సంసారికి లేని చింత సన్యాసికగున్

    రిప్లయితొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2608
    సమస్య :: *సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ.*
    సంసారులకు కూడా లేనంత చింత సన్యాసికే ఉంది అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మమకారము మొదలైన వాటిని అన్నింటినీ వదలివేస్తేనే సన్యాసి అవడం జరుగుతుంది. ఐతే కణ్వమహర్షి అడవిలో దొరికిన శకుంతలను తన బిడ్డగా పెంచినాడు మమకారంతో. (జడ) భరతుడు జింకపిల్లను తెచ్చి మమకారంతో పెంచి మరణ సమయంలో కూడా దానినే తలచుకొంటూ మరుజన్మలో జింకగా జన్మించినాడు. వీరిని గమనిస్తే సంసారుల కంటే సన్యాసులకే ఎక్కువ (మమకారము) చింత ఉన్నట్లు అనిపిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    కంసారిన్ భగవంతు నెంచి , మమతన్ ఖండింప సన్యాసియౌ,
    శంసన్ బూని శకుంతలన్ బెనిచె దీక్షన్ కణ్వు , డేణమ్మునే
    హంసన్ బోలిన మౌనియౌ భరతుడున్ హర్షమ్ముతో బెంచె , నే
    *సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ.*
    {శంస=కోరిక, ఏణమ్ము=జింక, హంస= పరమ హంస}
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (25-2-2018)

    రిప్లయితొలగించండి
  17. హంసయె మితి యెరుగని మీ
    మాంసాతురుడై కనలుచు మండ్రాడునుగా!
    కంసారీ!యేమందును?
    "సంసారికి లేని చింత సన్యాసి కగున్"

    రిప్లయితొలగించండి
  18. హింసకు దూరులము పరమ
    హంసలమని చెప్పు కొంద రత్యాశలతో
    హింసింతురిలను స్వాములు
    సంసారికి లేని చింత సన్యాసి కగున్.

    రిప్లయితొలగించండి
  19. శంస లధికంబు గలుగగ
    హింసలు జేయుచు సతతము హేఠము తోడన్
    సంసారము జేయును యతి
    "సంసారికి లేని చింత సన్యాసి కగున్"

    డేరా బాబా లాంటి దొంగ బాబాలకు ఎప్పుడు సమస్యలే

    రిప్లయితొలగించండి

  20. మాంసము చాటున మ్రింగుచు,

    ధ్వంసపరుచుచు మహిళలను,పైకంబులకై

    హింసించిరి సన్యాసులు.

    సంసారికి లేని చింత సన్యాసి కగున్


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  21. కంసారిని మదిదలపక
    హింసలనేజేయుచుండి యిడుములు వెటుచున్
    సంసారులు సుఖముండగ
    సంసారికి లేనిచింత సన్యాసికగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యిడుముల నిడుచున్' అనండి.

      తొలగించండి
  22. సంసారంబున మున్గి తేలు మనుజుల్ సాధింప కైవల్యమున్
    కంసారిన్ భజియింతురే?యిహమునే కాంక్షించి! తద్భిన్నుడై
    సంసారమ్మును దాటగా సతతమున్ సన్యాసి ధ్యానించు తా
    *సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  23. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కందం
    సంసారమె జగమౌచున్
    హింసోన్మాదములఁ ద్రుంచు హితముల్ గూర్చన్
    సంశోధించఁగ నే చిరు
    సంసారికి లేని చింత సన్యాసి కగున్

    రిప్లయితొలగించండి


  25. కోన్యాకున్ గాన ముదము?
    అన్యాయమటంచునసుగు నాతడదేలన్?
    గణ్యమగు భంగు కోరిక?
    సన్యాసికి! లేని చింత ;సంసారికగున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      'కోన్యాకున్'... అర్థం కాలేదు.

      తొలగించండి

    2. కోన్యాకు :)


      జీపీయెస్ వారే చెప్పాలి :)

      జిలేబి

      తొలగించండి

    3. బై ది వే

      సమస్యా పాదమే ఉల్టాపుల్టా అయిపోయింది :) కోన్యాకు మహత్తు :)


      జిలేబి

      తొలగించండి
    4. co·gnac (kōn′yăk′, kŏn′-, kôn′-)
      n.
      A brandy distilled from white wine and produced in the vicinity of Cognac.


      https://en.m.wikipedia.org/wiki/Cognac

      తొలగించండి
    5. జిలేబీ గారూ:

      మీకు అనుభవంలేని వ్యసనాలను పూరణలలో జొప్పిస్తే ఇలాగే సమస్య పాదములు తారుమారవుతాయి..

      "సన్యాసి సుఖీ, సంసారి దుఖీ" అని ఏడు బిడ్డలను సాకిన మా నాన్నగారు వాపోయే వారు పాపం :)

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. గతకొన్ని రోజులుగా ఆరోగ్యము బాగులేక పూరణలు చేయలేదు. ఇప్పటికి ఆరోగ్యము చక్కబడినది. ఈరోజు నుండి తిరిగి పూరణలను మొదలెట్టినాను.

    హంసుని చింతయె జేయక
    సంసిధ్ధిని పొందుటందు చవి లేకుండన్
    సంసారము నందుకొనిన
    సంసారికి లేని చింత సన్యాసికగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు గారు,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ ఆరోగ్యం చక్కబడినందుకు సంతోషం. కాని నాకు మొన్నటినుండి జ్వరం, దగ్గు.... నీరసంగా ఉన్నది.

      తొలగించండి
  27. సంసార జనిత దుఃఖపుఁ
    బాంసువున మునుగుచు మోయ బాధ్యతలను దా
    నంసమునఁ చింత, ధనమున,
    సంసారికి, లేని చింత సన్యాసి కగున్

    [సంసారము = పుట్టుక); చింత (వగపు) సంసారికి, ధనమున లేని చింత (ఆలోచన) సన్యాసికి]


    సంసిద్ధిన్ మది సంతతమ్మరసి సంసారమ్ము నొల్లం డిఁకన్
    హంసోత్తంసుఁడు నిత్య యోగ రతుఁ డత్యారాతి షడ్వర్గ వి
    ధ్వంసానంద విలోల మానసుఁ డిలన్ భార్యా సుతార్తుల్ మహా
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ

    [చింత = ఆలోచన]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  28. హింసల్జేయుచు కోడిమాంస మెపుడున్ హృద్యంబహాయంచు మీ
    మాంసల్ ఛందసులన్ తృణంబులనుచున్ మామూళ్ళనాశించుచున్
    కంసారాతిని బొమ్మయంచు మదిలో కంగారె లేనట్టి యా
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ 😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఛందసులన్'...? అది "ఛందములన్ (లేదా) ఛాందసులన్" అయి ఉండాలి.

      తొలగించండి
  29. త్రింశత్‌-గుణముల యందున
    సంసారిలలో చరించు!సన్యాసెపుడున్
    హంసను ధ్యానించుగదా!
    *సంసారికి లేని చింత సన్యాసి కగున్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సంసారి + ఇల, సన్యాసి+ ఎపుడు.... అన్నచోట సంధి లేదు. యడాగమం వస్తుంది. "సంసారి యిలన్ జరించు సన్యాసి సదా" అందామా?

      తొలగించండి
    2. గురువర్యా ధన్యవాదాలు.. సవరణతో

      త్రింశత్‌-గుణముల యందున
      *సంసారి యిలన్* జరించు! *సన్యాసి సదా*
      హంసను ధ్యానించుగదా!
      *సంసారికి లేని చింత సన్యాసి కగున్*

      తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

      తొలగించండి
  30. కం
    హంసను పరికించు ఋషుల
    సంసర్గమది, పరమాత్మ సంస్మరణంబా
    సం'సార'తత్వ చింతన
    సంసారికి లేని చింత సన్యాసికగున్ .

    రిప్లయితొలగించండి
  31. హింసన్ వీడుచు సన్న్యసించి కడు ధర్మావాప్తి లక్షించి వి
    ద్వాంసాళిన్ గురుదేవులన్ మనమునన్ బ్రార్థించి సంసిద్ధికిన్
    కంసారాతి సుబోధనామృతము దిగ్వ్యాప్తంబు గావించిరే
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ

    రిప్లయితొలగించండి

  32. హింసావృత్తిని వీడకున్న మదిలో నింతేనియున్ చిత్త మా
    హంసుండౌ పరమాత్మతో సతము నెయ్యంబందు లేకుండినన్
    కంసారిన్ త్రిపురారి నొక్కనిగ గాకన్ భేదముం జూపినన్
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ.

    రిప్లయితొలగించండి
  33. మాంసపు ముద్దయె తనువన
    కంసారి పలుకుల నెఱుక గావింపంగా
    హింసా వాదము నాపగ
    సంసారికి లేని చింత సన్యాసి కగున్!

    రిప్లయితొలగించండి
  34. కంసారిని కీర్తించుచు
    సంసారము నెంచక తను సాగుచునుండున్
    సంసారములో మునిగిన
    "సంసారికి లేని చింత సన్యాసి కగున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను'ను 'తను' అనరాదు. "సంసారము నెంచకుండ సాగుచు..." అందామా?

      తొలగించండి
  35. శార్దూలవిక్రీడితము
    సంసేవించెడు శైలసూన శివుడున్ సంతాన మందించినన్
    హింసోన్మాదిని తారకాసురుని జల్లించంగ సాధ్యమ్మనన్
    హంసోపాసన భంగమౌచు మరు సంహారమ్మునన్ జిక్కుచున్
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ!

    రిప్లయితొలగించండి



  36. కంసారినిభజి యించక
    హిం‌సాప్రవృత్తిని విడక నిలలోనెపుడున్
    శంసలతోడను బ్రతికిన
    సంసారికి లేని చింత సన్యాసి కగున్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం రెండవ గణం జగణం అయింది. అది కందపద్య నియమం కాదు కదా!

      తొలగించండి
  37. ధింసా నృత్యమున బ్రతుకు
    సంసారికి లేని చింత సన్యాసికగున్
    మాంసాహారము దొరకదు
    కంసారియు నిడడు పొట్ట కాలుచు నున్నన్

    రిప్లయితొలగించండి
  38. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  40. సంసారమ్మొక పాపకూపమది సత్సాంగత్యమున్ గోరుచున్
    హంసోపాసన చేయదల్చిననదే యడ్డంకిగా మారునో
    హంసా! నీ కెరిగించెదన్ వినుమికన్నధ్యాత్మిక మ్మందునన్
    సంసారుల్గన లేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ.

    రిప్లయితొలగించండి
  41. సంసారంబున సారసంపదలవిశ్వాసంబుయెల్లప్పుడున్
    సంసారుల్ గన?లేనిచింతయెపుడున్ సన్యాసికే సొంతమౌ| {మొదలులేనిభావనలు}
    ద్వంసంబౌమొదలంటు మార్గముల సంధర్భాలు లోపించగా?
    హింసామార్గములేనిపంతమునుయూహించంగ సద్భక్తితో

    రిప్లయితొలగించండి
  42. కంసారిన్ భజియింప గోరిన మదిన్ కల్లోలమే నిండగా
    హింసావా దమునం దుఘోర కలియౌ హీనంబు గాభీతి లన్
    మాంసాహా రముకో సమంచు మనగో మాతన్ వధించంగ నే
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ

    రిప్లయితొలగించండి
  43. 25-2-18
    ...........సమస్య
    సంసారికి లేని చింత సన్యాసి కగున్

    సందర్భము... శ్రీ మంతుడైనవాడు నిజానికి సన్యాసియే! ప్రధానంగా కూడూ గూడూ గుడ్డా... వీని చింత సన్యాసికి లేదు. సంసారి కున్నది. ఏం తినాలి? ఎక్కడ పడుకోవాలి? ఏ గుడ్డలు వేసుకోవాలి? ఎప్పుడూ సంసారి కిదే చింత కదా!
    ఆ చింత లేని నాడు సంసారి సన్యాసి ఔతాడు. సన్యాసికి ఆ చింత యింకా వున్న దంటే సంసారి లక్షణా లున్నట్టే!
    ~~~~~~~~~~~
    హింసను, గూడును, గూడును,
    మాంసాహారంబునందు మరి గుడ్డలపై
    శంసన్ గల ఘన చింతయె
    సంసారికి; లేని చింత సన్యాసి కగున్
    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    ---------------------
    ..............సమస్య
    సంసారుల్ గనలేని చింత యెపుడున్
    సన్యాసికే సొంతమౌ

    సందర్భము
    మాంసాహారం పట్ల ప్రీతి పెంచుకోవడం మద్యపానానికి బానిస యైపోవడం తమో గుణ రజో గుణాల్లో కూరుకుపోవడం పిచ్చాపాటీ కబుర్లు విలాసాలు. ఇటువంటివే కనిపిస్తాయి ప్రతి సంసారిని పరిశీలిస్తే. భవ బంధాల్లో యిరికించేవి యివే!
    సరిగ్గా వీనికి వ్యతిరేకమైనవి అంటే సత్వ గుణానికి చెందిన కోరికలు కోరడం, మద్య మాంసాలకు దూరంగా వుండడం, మౌనంలో విహరించడం (మౌనంతోనే ముని ఔతాడు గదా!) మొదలైనవి సన్యాసిని పరిశీలిస్తే కనిపిస్తాయి. ఇలాంటివే ముక్తి హేతువు లౌతున్నాయి.
    వీటిని గమనిస్తే సంసారులు చేయని విచారం సన్యాసి చేయగలుగుతున్నాడు.
    ~~~~~
    మాంసాహారము మద్యపానము తమో
    మార్గంబునున్ రాజసా
    శంసల్ ముచ్చటలున్ విలాసము లయో!
    సంసారి కెల్లప్పుడున్ --
    మాంసం బొల్లక మద్యమున్ వదలి బ్ర
    హ్మానన్ సదా సాత్వి కా
    శంసల్ మౌనమునన్ విహారము లహో!
    సన్యాసి కెల్లప్పుడున్ --
    సంసారుల్ గనలేని చింత యెపుడున్
    సన్యాసికే సొంతమౌ..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    25 .2.18

    ఆశంస = కోరిక

    రిప్లయితొలగించండి
  44. సంసారుల్ గనలేరు చింత తమకున్ సాంబారు రాలేదనో...
    సంసారుల్ గనలేరు చింత తమకున్ శాకమ్ము రాలేదనో...
    సంసారుల్ గనలేరు చింత తమకున్ చారన్నమే లేదనో...
    సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ!

    రిప్లయితొలగించండి