5, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2589 (దుర్మార్గము గాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుర్మార్గము గాదు గురుల దూషించినచో"
(లేదా...)
"దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే"
(గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలతో...)

86 కామెంట్‌లు:

 1. ధర్మపు సూత్రములందున
  మర్మములన్నియు నెరుగుచు మార్దవ సరణిన్
  కూర్మియు నూర్మియు గూడగ
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో

  ఊర్మి = తహతహ

  ***

  ఈ సమస్య నిన్న బ్లాగులో లీక్ ఐనది

  😊

  రిప్లయితొలగించు


 2. మర్మంబెల్లను నేర్వగన్చదువులన్ మాన్యంబుగాచేరగన్
  శర్మా!బట్టలగుంజుజేయమనుచున్ సంసేవలన్ కోరగన్
  నిర్మాపౌడరుగుమ్మరించియుతుకన్నీ పాశ గూలాయనన్
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. "వాషింగ్ పౌడర్ నిర్మా! నిర్మా నిర్మా నీర్మా!"

   తొలగించు


  2. జీపీయెస్ వారికి
   చేపూరి వారికి
   విరించి గారికి
   విట్టుబాబు గారికి

   నెనరుల్ సహిత

   జిలేబి

   తొలగించు
  3. జిలేబిగారు అదుర్స్! 👏👏👏👏
   విట్టుబాబుగారు సూపర్!👌👌👌👌

   తొలగించు


 3. వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచున్ !
  శర్మా !శాస్త్రి ! జిలేబి! యేమనిరి ! కాస్తాతెల్పుడీ! యేలనో
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా? శిష్యులే
  మర్మంబై నను గాంచిరే గురువులన్ మన్నింపకన్ చెప్పుడీ !

  జిలేబి

  రిప్లయితొలగించు


 4. బర్మా బజారు షాంపూ
  ఖర్మయు కాలి కొనినాను కష్టంబాయెన్
  చర్మజము మొద్దు బారెన్
  దుర్మార్గము గాదు "గురుల" దూషించినచో ?

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మరులన్ గొల్పెడి పదములు
   విరియన్ మీ పద్యమందు విద్యల దేవీ!
   కురులన్ గురులన్ జేసిరి
   తరుణుల్ తమకెవరు సాటి తరుణి జిలేబీ!
   🙏🏻😀

   తొలగించు


  2. విట్టు బాబు గారు !


   నమో నమః ! మీరు మరో జిలేబీయమై పోయారు :)

   అదురహో కందాతి కందః


   చీర్స్
   జిలేబి

   తొలగించు
  3. మర్మంబెరుగని శిష్యుని
   కుర్మా సిగరెట్టు మందు కూరిమి తోడన్
   శర్మా! తెమ్మని చెప్పగ
   దుర్మార్గము గాదు గురుల దూషించినచో!

   తొలగించు
  4. అసలు లేకపోయినా కొసరుకే మెచ్చుకోళ్ళు!!
   ధన్యుడవయ్యా విఠలా!
   😆

   తొలగించు


  5. ధన్యుడవయ్యా విఠలా !
   మాన్యులు వేసిరి కొసరుకు మార్కుల సుమ్మీ !
   శూన్యము దక్కెను నసలుకు
   విన్యాసంబన్న నిదియె వినుమ కవివరా !

   చీర్స్
   జిలేబి

   తొలగించు
  6. జిలేబిగారూ! మీరు సున్నాయేమిటి? పూర్ణమదః పూర్ణమిదం ...... పూర్ణమేవావ శిష్యతి!👍👍👍

   తొలగించు
 5. ధర్మము నొకపా దమునను
  మర్మము తోనడచు చుండ మంచియె కరువై
  నోర్మిని లేనట్టి జనులకు
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 6. నిర్మల భావము వీడుచు
  ధర్మమునే విస్మరించి తరుణుల తోడన్
  మర్మానువర్తుడైనను
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 7. ధర్మం బెరిగిన ద్రోణు డ
  ధర్మంబుగ నడవిబిడ్డ తరుణాంగుటమున్
  మర్మపు దక్షిణ నడిగెను
  దుర్మార్గము గాదు గురువు దూషించినచో .

  రిప్లయితొలగించు
 8. మైలవరపు వారి పూరణ


  🙏తస్మై శ్రీ గురవేనమః 🙏

  ధర్మాధర్మవిచక్షణన్ దెలిపి సత్కార్యమ్ము సూచించుచున్ ,
  మర్మమ్ముల్ విశదీకరించి వర సన్మార్గమ్ము జూపించుచున్
  శర్మా ! కంటికి దృష్టి సద్గురువు ! విశ్వాసమ్ముతో గొల్చుచో
  దుర్మార్గం బిసుమంత లేదు , గురులన్ దూషింపగా శిష్యులే
  ధర్మమ్మైనను నేర్చినట్లగునె ? విద్యాలక్ష్మి హర్షించునే?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చిన్న సవరణ.. మన్నించండి..

   🙏తస్మై శ్రీ గురవేనమః 🙏

   ధర్మాధర్మవిచక్షణన్ దెలిపి సత్కార్యమ్ము సూచించుచున్ ,
   మర్మమ్ముల్ విశదీకరించు వర సన్మార్గమ్ము జూపించుచున్
   శర్మా ! కంటికి దృష్టి సద్గురువు ! విశ్వాసమ్ముతో గొల్చుచో
   దుర్మార్గం బిసుమంత లేదు , గురులన్ దూషింపగా శిష్యులే
   ధర్మమ్మైనను నేర్చినట్లగునె ? విద్యాలక్ష్మి హర్షించునే?!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. కర్మల జేయక యుండుట
   దుర్మార్గము గాదు , గురుల దూషించినచో
   శర్మా ! పాపము గల్గును !
   నిర్మాణాత్మకములౌత నీ చేష్టలిలన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 9. నిర్మల హృదయ ము లేక యు
  ధర్మము విడనాడి చెడు ను ధైర్య ము తోడ న్
  కర్మ ల నొ న రించు నపుడు
  దుర్మార్గము గాదు గురు ల దూషించి న చో

  రిప్లయితొలగించు
 10. ధర్మాధర్మ విచక్షణ
  మర్మములను మదిదలపక మహిలో భరదు
  ష్కర్మల నంతర్మదులౌ
  దుర్మార్గము గాదుగురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 11. ధర్మాధర్మవిచక్షణన్నొదిలి నిర్ధాక్షిణ్య వ్యాపారము
  న్నీర్మమ్ముల్ దలపెట్టి శిష్యవరులన్నేతీరు బాధించుచున్
  కర్మాయత్తదుఃఖమేనిదనుచున్ కష్టాలబాల్జేయగా
  దుర్మార్గంబిసుమంతలేదు గురులన్ దూషింపగా శిష్యలే

  రిప్లయితొలగించు
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 13. ధర్మాధర్మ విచక్షణ
  మర్మములను మదిదలపక మహిలో భరదు
  ష్కర్మల నంతర్మదులౌ
  దుర్మార్గము గాదుగురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 14. ధర్మము పేరిట మోసపు
  కర్మలు జేయుచు మతమును గప్పుకు బ్రతికే
  దుర్మత బాబా లెందరొ ?
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 15. కర్మానుష్టానమ్మును
  నిర్మాణాత్మక సమీక్ష నిలకడ బుద్ధిన్
  ధర్మపరత్వము గానమి
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో!


  కర్మానుష్టత జూపలేని ఖలులై కాఠిన్య
  మానస్కులై
  నిర్మాణాత్మక బుద్ధితోడ విలువల్ నేర్పింపగానేరకన్
  ధర్మాచారులుగాక మర్మమతులై దంభమ్ము పాటించుచో
  దుర్మార్గంబిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే!

  దుర్మార్గంబగు చేష్టలన్ వికృతమౌ దుర్నీతిమార్గంబునన్
  నిర్మూలించగ సాధుభావములనే నిర్భీతి నిర్లజ్జతో
  తీర్మానంబు కుతర్కధోరణులతో ద్వేషమ్ము రాజేయగా
  దుర్మార్గంబిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  నిర్మోహత్వము నిశ్చలంబగు మదిన్
  నిష్కల్మ బుద్ధిన్ సదా
  నిర్వ్యాపారము నాత్మశోధన విధిన్
  నెక్కొంచ వైరాగ్యమున్
  నిర్మూలించక సంశయమ్ముల తానీచత్వమున్ బొందగా
  దుర్మార్గం బిసుమంతలేదు గురులన్ దూషింపగా శిష్యుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. "నిర్వ్యాపారము నాత్మశోధన విధిన్
   నెక్కొంచ వైరాగ్యమున్"

   ...ప్రాస?

   తొలగించు
  2. ధన్యవాదాలు! సవరిస్తాను!🙏🙏🙏

   తొలగించు
  3. నిర్వ్యాపారము బదులు నైర్మల్యత్వము గా చదువ ప్రార్ధన!

   తొలగించు
  4. "నైర్మల్యత్వము" కూ "నెక్కొంచ" కూ యతి?

   తొలగించు
  5. సవరించిన పూరణ:
   నిర్మోహత్వము నిశ్చలంబగు మదిన్
   నిష్కల్మ బుద్ధిన్ సదా
   నైర్మల్యత్వము నాత్మశోధనవిధి
   న్నౌన్నత్య జ్ఞానంబునన్
   నిర్మూలించక సంశయమ్ముల తానీచత్వమున్ బొందగా
   దుర్మార్గం బిసుమంతలేదు గురులన్ దూషింపగా శిష్యుల్
   🙏🙏🙏🙏

   తొలగించు
  6. మూడవ పాదమున
   “నిర్మూలించక సంశయంబులను తా నీచత్వమున్ బొందగా” యని చదువ ప్రార్ధన!

   తొలగించు


 16. అర్మపు రోగ నివర్తికి
  దుర్మార్గము గాదు, గురుల దూషించినచో
  నర్మిలితో విశ్రాంతిని
  పర్మాయించుచు జిలేబి పట్టుగ సుమ్మీ :)

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. అర్మిలితో విశ్రాంతిని
   పర్మాయించుచు జిలేబి పట్టుగ సుమ్మీ,
   అర్మపు నివర్తి కొరకై
   దుర్మార్గము గాదు, గురుల దూషించినచో !

   జిలేబి

   తొలగించు
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2589
  సమస్య :: *దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే.*
  గురునింద మహాపాపం అని అంటారు. ఐతే గురువులను దూషిస్తే కొంచెం కూడా తప్పు లేదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ఏకలవ్యుడు అనే శిష్యుడు ద్రోణాచారి యొక్క బొమ్మను ఎదురుగా ఉంచుకొని స్వయంగా విలువిద్య నేర్చుకొన్నాడు. ద్రోణాచారి తనకు గురుదక్షిణగా కుడిచేతి బొటనవ్రేలును ఇమ్మని అడుగగా ఏకలవ్యుడు అలాగే గురుదక్షిణ చెల్లించి తన విలువిద్యా సామర్థ్యాన్ని కోల్పోయాడు. గురువు శిష్యుని అభివృద్ధినే కోరాలి. అంతేగాని శిష్యుని అభివృద్ధికి ద్రోణుడిలా ఎన్నడూ విఘాతం కలిగించకూడదు. ఒకవేళ అలా శిష్యుని వినాశనాన్ని గురువు కోరుకొన్నట్లయితే అటువంటి గురువును దూషిస్తే అది కొంచెంకూడా దుర్మార్గం అనిపించుకోదు అని విశదీకరించే సందర్భం.

  శర్మంబున్ గలిగింప శిష్యులకు దీక్షన్ విద్య నేర్పించు స
  త్కర్మంబే గురు లెల్ల చేయవలె ; వీకన్ ద్రోణు డంగుష్ఠమున్
  ధర్మంబే గురుదక్షిణార్థ మడుగన్ ; దా నేకలవ్యుండు నే
  మర్మం బెంచక నిచ్చె ; శిష్య గణ సామర్థ్యమ్ము ఖండించుచో
  *దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-2-2018)

  రిప్లయితొలగించు
 18. నర్మ కుయుక్తులు పల్కుచు
  నిర్మోహత్వంబు వీడి నిలకడ తొలగన్
  ధర్మ చ్త్యుతి గావింపగ
  దుర్మార్గముఁగాదు గురుల దూషించినచో.

  రిప్లయితొలగించు
 19. కర్మం జాలక కేటరేక్టు ముదరంగా తీసివేయంగ హా!
  శర్మల్ మాట ఖయాలు జేయుట వినా సారింత తాత్సారులై
  ధర్మంబున్ విడువంగ లేక వడిగా ధట్టించ లాప్టాపునిన్
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. మరీ ధట్టించేసారివ్వాళ జీపీయెస్ గారు :)


   జిలేబి

   తొలగించు


  2. శాస్త్రీయంబుగ కూసి పిల్లి ఘనమౌ శార్దూలమైపాయెగా!

   తొలగించు
 20. ధర్మాధర్మ విచక్షణ
  దుర్మతి తోడ విడనాడి త్రోవందప్పన్,
  ధర్మాచరణమె యగు
  దుర్మార్గము కాదు గురుల దూషించినచో.

  రిప్లయితొలగించు
 21. ధర్మాధర్మము జెప్పుచు
  మర్మముగా మోసములను మాటుగ సలిపే
  దుర్మతులే గురులయ్యిరి
  దుర్మార్గము కాదు "గురుల" దూషించినచో.

  రిప్లయితొలగించు
 22. ధర్మాధర్మ విచక్షణల్ భళిభళీ! తర్కింప చిత్రమ్మగున్ మర్మమ్మెంచియు జింతచేయ వలెగా!మర్యాద బాటించుచున్ ఘర్మమ్మున్ వెదజిమ్ముచుండు గురుడే కష్టింప; స్వాస్థ్యమ్ముకై ; దుర్మాగంబిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే! (గురువర్యులు శంకరయ్యగారు విశ్రాంతి తీసుకోక కళ్ళకు శ్రమ కల్గిస్తూ,చెప్పినా వినిపించు కోకుంటే, ప్రేమతో మందలించినా దోషంలేదుగా!)

  రిప్లయితొలగించు


 23. దుర్మార్గం బిసుమంత లేదు; గురులన్ దూషింపగా శిష్యు లే
  కర్మల్బట్టుదురో జిలేబి గనుమా!కాష్ఠంబులో గాల్చి నీ
  చర్మంబున్ పెకలించి కింకరులటన్ చాగొట్టి మాడింతురే
  ధర్మస్థానములోన ఖాయమిక నీ దాష్టీకమున్ద్రుంచగన్ !


  జిలేబి

  రిప్లయితొలగించు


 24. కూర్మంబయ్యె!వరాహమయ్యె! భువిలో గుర్తింప నాచార్యుడై
  మర్మంబెల్లనునేర్పె!ముక్తి పథమున్ మార్గంబుగా జేసె తా
  నైర్మల్యుండు జిలేబి! మాటపెళుసౌనైజంబులేలా! యెలా
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యు లే?

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఇలా:


   మర్మంబుల్ నరయంగ వ్యాకరణమున్ మన్నించు రీతిన్ సదా
   ధర్మాధర్మములైన ప్రాసలు యతుల్ ధాటీగ వల్లించగా
   కర్మల్ గాలగ నా పరీక్ష క్షవరం గానున్న పైత్యమ్ములో
   దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే :)

   తొలగించు
  2. ఉన్న మాట:

   నా ఏడేళ్ళ యూనివర్సిటీ జీవితంలో నా ఎవరో ఒక టీచర్ని తిట్టుకోని రోజు లేదు.

   నా నలభై ఏళ్ళ టీచర్ జీవితంలో నన్ను ఎవరో ఒక స్టూడెంట్ తిట్టుకోని రోజు లేదు:

   **************************

   "A fortnight later my friend Vinod visited my room and said, laughing aloud:


   "GP! I overheard one fair bespectacled lad on his pushbike talking about you to his friend in the most abusive terms"

   "How?"

   "He was saying to his friend: 'There is this new Research Scholar to whom I was allotted for my viva...I don't know...they call him GP or something...he is the greatest b*****d I have ever seen'..."

   I laughed and said: "No more silly talk of Peace in the Phy Lab...Good!"

   http://gpsastry.blogspot.in/2014/08/curtsy-repeat-telecast.html?m=0

   తొలగించు

  3. అదురహో


   కాలెన్ కర్మయు శంకరాభరణ పాకాగారమందున్ సుమీ :)


   జిలేబి   తొలగించు
  4. సార్ కళ్ళు మూసుకొని ఉన్నారుగా!

   😊😊😊

   తొలగించు
  5. శ్వేతకేతుకి అతని నాన్నగారైన ఉద్దాలకుడు వైవా తీసుకోగా ఫైలై "ఇదేమిటో మా గురువులు పన్నెండేళ్ళ శిష్యరికంలో మాకు చెప్పనే లేదు" అని కంప్లైన్ చేసెను :)

   తొలగించు
  6. "వారికీ తెలియదేమో! తెలిసి ఉంటే తప్పక చెప్పి ఉండేవారు" :(

   తొలగించు
  7. శ్వేతకేతు ఉద్దాలకునితో:


   కర్మంబుల్ తెలుపంగ నేర్చితినిగా కాండమ్ము భాండమ్ముతో
   ధర్మంబుల్ తెలుపంగ నేర్చితినిగా దాంతమ్ము శాంతమ్ముతో
   మర్మంబున్ తెలియంగ లేరు గురులా మంత్రాల తంత్రాలలో:
   "దుర్మార్గం బిసుమంత లేదు
   గురులన్ దూషింపగా శిష్యులే"

   తొలగించు
 25. కందం
  నిర్మాణాత్మక పక్షము
  ధర్మము విడి రాజకీయ దారుణమెంచన్
  కర్మల కారణమతడన
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో!

  రిప్లయితొలగించు
 26. ధర్మ సురక్షణమునకున్
  నిర్మల భక్తి నెదిరించ నీతి యయిన దు
  ష్కర్మ మవశ్య మిటు లనఁగ
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో


  మర్మంబెల్లయుఁ దేటతెల్లముగ సమ్మానమ్ముగం జెప్పి స
  ద్ధర్మం బింపుగ నిల్ప స్వర్గమున నుత్తారప్రదాతల్ గురుల్
  కర్మం బింక సుపక్వమౌను యమ లోకంబేఁగ, నన్యంపు టే
  దుర్మార్గం బిసుమంత లేదు, గురులన్ దూషింపగా శిష్యులే

  రిప్లయితొలగించు
 27. శార్దూలవిక్రీడితము

  శర్మంబుల్ మదిఁ గోరి స్వార్థమున దేశద్రోహ భావాన దు
  ష్కర్మాసక్తత పార్లమెంటు కడ నాశమ్మెంచ 'నఫ్జల్ గురుల్'
  మర్మంబెల్ల విదేశ బంధమని సంభావించి క్రోధాగ్నిలో
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్దూషింపగా శిష్యులే!

  రిప్లయితొలగించు
 28. మర్మంబౌవచనంబులన్ మహిళలౌ మాన్యంపు విద్యార్థులన్
  ధర్మాధర్మ విచక్షణన్ విడి సదా దండించు చున్ తుచ్చులై
  చర్మాసక్తిని పొంది దుండగములన్ సాగించుచున్ వర్తిలన్
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  రిప్లయితొలగించు
 29. ధర్మాధర్మ విచారణ
  దుర్మార్గముగాదు; గురుల దూషించినన్
  దుర్మత మగునే సరియగు
  కర్మల సూచింపగాను కఠినత్వమునన్!

  స్ట్రిక్ట్ మాస్టరునెప్పుడూ పిల్లలు తిట్టుకుంటారు!

  రిప్లయితొలగించు
 30. దుర్మతిని దూషణ జేసిన
  దుర్మార్గము గాదు, గురుల దూషించినచో
  ధర్మము నశించు, గావున
  మర్మమెరిగి మసల వలెను మహిలో మూర్తీ.

  రిప్లయితొలగించు


 31. నిర్మానుష్యపుదారులన్ తను ప్రయాణించెన్ సుబోధ్యమ్ముగా
  ధర్మాధర్మములెల్ల నేర్చి గురువై ధారుడ్యమున్గాంచి తా
  నోర్మిన్ గాంచుచు శిష్య కోటికిని మున్నున్నాఖరున్తెల్పెనే!
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే ?

  జిలేబి

  రిప్లయితొలగించు
 32. ధర్మము విడిచిన తాకుట
  దుర్మార్గము గాదు, గురుల దూషించినచో
  కర్మఫలము కట్టికుడుపు
  మర్మము నెఱిగి సతతమ్ము మహిలో మనుడీ

  రిప్లయితొలగించు
 33. మర్మంబౌవచనంబులన్ మహిళలౌ మాన్యంపు విద్యార్థులన్
  చర్మాసక్తిని పొంది దుండగములన్ సాగించ దండించుటన్
  దుర్మార్గం బిసుమంత లేదు, గురులన్ దూషింపగా శిష్యులే
  కర్మం బందగ జేయు యుక్త ఫలమున్ కాలాను గుణ్యంబుగా

  రిప్లయితొలగించు
 34. నర్మము లాడుచు నిత్యము
  ధర్మము విడి శిశువుల నిల దారుణరీతిన్
  దుర్మతులై బాధించిన
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో!!!


  దుర్మతులను నిందించుట
  దుర్మార్గము గాదు,గురుల దూషించినచో
  కర్మఫలము వెంటాడును
  నిర్మలముగ గొలువ వలెను నిల బోధకులన్!!!

  రిప్లయితొలగించు
 35. వర్మా!దుష్టులశిక్షణ
  దుర్మార్గముగాదుగురులదూషించినచో
  ధర్మముజతికిలబడుచు
  న్మర్మములేప్రబలమగును మర్త్యమునందున్

  రిప్లయితొలగించు
 36. ధర్మం బెంచక సుఖమని
  శర్మే వ్యసనముల చేత శాడిష్టుడిగా
  నిర్మల తత్వము వీడిన ?
  దుర్మార్గముగాదు గురుల దూషించినచో ,

  రిప్లయితొలగించు
 37. పేర్మిన్ కొప్పరపున్ కవీశ్వరులు సంప్రీతిన్ భళీ శిష్యులై
  మర్మంబెల్ల వధాన పాటవమునన్ మంత్రాక్షరీ రీతిగన్
  నిర్మాణంబుగ సంగ్రహించి సభలన్ నిర్జించిరాఖ్యాతలన్
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  ఆఖ్యాత = గురువు

  రిప్లయితొలగించు
 38. దుర్మేధపు మదిని గలిగి
  నర్మిలి గుప్పిoచుచూ నహర్నిశమున్ యం
  తర్మధనులుండు భువిలో

  దుర్మార్గము గాదు గురుల దూషించినచో

  రిప్లయితొలగించు
 39. నైర్మల్యముతో చదువుల
  మర్మము నేర్పెడి గురువులె మచ్చర మందన్
  ధర్మము వీడగ నిలలో
  దుర్మార్గము గాదు గురుల దూషించినచో!
  నిన్నటి సమస్యకు నా పద్యం:
  ఎద్దిన మందున బాలల
  విద్దెల పేరిట మఱి మఱి వేధించక నీ
  పెద్దలు శాంతి నిలిపెదరొ
  తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్!

  రిప్లయితొలగించు
 40. మర్మము దాచక విద్యలు
  నిర్మల హృదయ మును గల్గి నేర్పే వాని న్
  కర్మల ను చేయ నె ట్టు ల
  దుర్మార్గము గాదు గురుల దూషించి న చో ?

  రిప్లయితొలగించు
 41. శర్మము గలిగించుచునే
  వర్మము వలె నిలుచు విద్య వటులందరికిన్
  ధర్మము దప్పినచో మరి
  దుర్మార్గము కాదు గురుల దూషించినచో.

  రిప్లయితొలగించు
 42. .............సమస్య
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్
  దూషింపగా శిష్యులే

  సందర్భము: హత్యలు దోపిడీలు మానభంగాలు కూడ గురువులవద్ద నేర్చుకుంటారు. అవి అధర్మంతో కూడిన వని ఎన్నడో ఒకనాడు ఘోరమైన శిక్షలు అనుభవించవలసి వస్తుం దని భావించరు.
  పాపం బద్దలై ఫలం అనుభవానికి రాగా గురువులను తిట్టుకుంటారు.
  ~~~~
  దుర్మార్గుల్ ధరలోన హత్యలును ని
  త్యోత్సాహులై దోపిడీల్
  మర్మం బీయని మానభంగము లధ
  ర్మంబౌ పనుల్ సల్ప దు
  ష్కర్మల్ వీనిని నేర్పునట్టి గురువుల్
  కారే మహాపాపు లా
  కర్మల్ ఘోర ఫలంబు లిచ్చు తఱి శో
  కం బూని దూషింత్రుగా!..
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్
  దూషింపగా శిష్యులే

  2 వ పూరణము:

  సందర్భము: గురు శిష్యు లిద్దరూ దుర్మార్గులే ఐనప్పుడు ఎన్నడో ఒకసారి ఆధిపత్యంకోసమో మరి దేనికోసమో పరస్పరం పోట్లాడుకోక తప్పదు. పోట్లాడుకోవడమే కాదు చంపుకుంటారు కూడా.
  దానికంటే ఒకరినొకరు తిట్టుకోవడమే మంచిది కదా!
  ~~~~
  దుర్మార్గుల్ ధరలోన నిర్వురును ని
  త్యోత్సాహులై కూడినన్
  మర్మం బీక పరస్పరం బెపుడొ కం
  ఠాల్ గోసుకొం ద్రన్నచో..
  దుర్మార్గం బిసుమంత లేదు గురువుల్
  దూషింపగా శిష్యులన్,
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్
  దూషింపగా శిష్యులే

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 43. 3 వ పూరణము:

  సందర్భము: చెడు దారిలో పోయే వాళ్ళను ఎంతో ప్రేమతో చేరదీసి మంచి దారిలో నడిపించే గురువులూ వుంటారు. కాని వారిని కొందరు మూర్ఖు లర్థం చేసుకోలేక అనవసరంగా దూషిస్తూఉంటారు.
  ఆ దూషించడంలో దుర్మార్గం *ఇసుమంత లేదు..* అనగా *ఎంతో వున్నది* అని ధ్వని.
  అతనికి పొగరు *కొంచెం లేదు..* అనగా *చాలా వున్నది* అని ధ్వని.
  ( *కొంచెంకూడా లేదు..* అంటే *అసలే లేదు* అని అర్థం.)
  ~~~
  దుర్మార్గంబున బోవు వారలను నెం
  తో ప్రేమతో చూచి స

  త్కర్మల్ నేర్పగ తిట్టుచుంద్రు గద మూ
  ర్ఖత్వంబునన్ కొందరే!..

  దుర్మార్గం బది దూషణంబునను
  *నెంతో యున్న* ది ట్లన్నచో...

  "దుర్మార్గం *బిసుమంత లేదు* గురులన్
  దూషింపగా శిష్యులే"

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 44. ..............సమస్య
  దుర్మార్గము గాదు గురుల
  దూషించినచో

  4 వ పూరణము:

  సందర్భము: ధర్మం గురించి చెబుదామని పద్యాన్ని తీసుకున్నాను. కాని సాగదు.
  లఘువులో గురువులో అడ్డొస్తాయి. వాటిని దూషించడమే సరిపోతున్నది.
  ~~~

  ధర్మముఁ జెప్పగ పద్యము

  నర్మిలి గైకొంటి గాని యది సాగదు నా

  ఖర్మ! లఘువులను దిట్టిన

  దుర్మార్గము గాదు గురుల
  దూషించినచో...

  5 వ పూరణము:

  సందర్భము: ఎడతెగని కర్మలు నిండిపోయిన ఆధునిక జీవిత మర్మాన్ని విప్పి చెప్పడమే పద్యంయొక్క ధర్మము.. అని భావించి పద్యాన్ని తీసుకున్నాను. కాని సాగదు.
  *లఘువులో గురువులో* అడ్డొస్తాయి. వాటిని దూషించడమే సరిపోతున్నది.
  ~~~~

  కర్మలు నిండిన జీవిత

  మర్మము జెప్పుట యనునది మరి

  పద్యపు సత్

  ధర్మము... సాగదు... *లఘువుల...*

  దుర్మార్గము గాదు *గురుల...*

  దూషించినచో..

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఆర్యా! మీ నాలుగు, ఐదవ పూరణలు వాస్తవంగా ఉన్నాయి! నవ్వించాయి! అభినందనలు! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించు
 45. ఆశు కవిత్వము-పద్యాలు.
  భారత దేశంలోని అతి ఎత్తైన "జోగ్" జలపాతము నాలుగు ధారలుగా (Cascades) క్రిందకు దుముకుతుంది. వాటికి నాలుగు పేర్లు బెట్టారు. "రాజా" ; "రాణి" ; " జాకి" ; రాకెట్".పెద్దది రాజా, చిన్నది రాణి, యింకా చిన్నది జాకి.మరొకటి కొళాయి నుండి వేగంగా నీటిధార (Jet of water)దూకినట్లుగా దుమికే జలపాతపు ధార రాకెట్.
  ఆ రాకెట్ ధార లాగ పద్యాన్ని ఒక్క గుక్కలో దూకించ గలిగే ఆశుకవులు అరుదుగా ఉంటారు.ఒక భీమకవి, ఒక శ్రీనాథుడు, ఒక తెనాలి రామకృష్ణ, ఒక రుద్రకవి,ఒక అల్లసాని, ఒక అడిదము సూరకవి , మరి కొందరు. చాలామంది పద్యాన్ని ముక్కలు,ముక్కలు గా అల్లి అతికే వారే. కాబట్టి ఎక్కువగా పీసు కవులే కానీ, ఆశు కవులు కాదు.
  రెండు, మూడు దశాబ్దాలుగా పద్యాలు వ్రాసే అలవాటు నాకూ ఉన్నది. అత్యధికము పద్యాల కొరకు పదాలు ఏర్చి, కూర్చి, పేర్చి, మార్చి, తీర్చి దిద్దినవే.అంటే గింజుకుని,పుంజుకుని వ్రాసినవే. అయితే ఒకే ధారగా వచ్చిన పద్యాలు కొన్ని మాత్రమున్నాయి.వాటిలో రెండింటిని మిత్రులతో పంచుకోవాలని ఇది వ్రాస్తున్నాను.
  ఇరవై యేళ్ళ క్రితం ఒక కాలేజ్ లో ఒక ఫంక్షన్ సందర్భంగా డిన్నర్ ఏర్పాటు చేయాలను కున్నారు. అదెలా ఉండాలనేది స్టాఫ్ రూం లో చర్చ జరుగుతూంది.అంటే శాకాహారమా? లేక మేకాహారమా? అని ! ఒక్కొక్కరినీ అభిప్రాయం అడుగుతున్నారు. నా వంతు వచ్చే సరికి నాలో ఒక పద్యం రూపు దిద్దుకున్నది.నా అభిప్రాయాన్ని ఈవిధంగా పద్య రూపంలో చెప్పాను.
  ****}{}{****
  "మనసున లేని నవ్వు మొగమాటముకై వచియించు పల్కులున్
  కనులకు విందు లేమియును కానల కేగిన పూరుషోత్తముల్
  పనిగొని చేయు స్తోత్రములు పండిత వర్యుల సంకుచిత్వమున్
  తునుకలు లేని భోజనము తొల్చెడి ముళ్ళివి నామనంబునన్."
  *****
  దాదాపు అదే సమయంలో ఒక సహోద్యోగి (ఇప్పుడు దివంగత మిత్రుడు;Departed friend) అబ్దుల్ వాహిద్ అనే అతను బక్రీద్ సందర్భంగా స్టాఫునందరినీ పిలిచి మరపు రాని విందు ఇచ్చాడు. నేను భోంచేసి చేతులు కడుక్కునే సమమయంలో ' అతనికి పద్యరూపంలో ధన్యవాదాలు చెప్పాలనే' ఆలోచన వచ్చి ఈ విధంగా చెప్పాను.
  సారా స్టాఫును పిల్చియు
  వేరెవ్వరు చేయ లేని విధముగ దోఫన్
  నోరూరెడి దావతు నువు
  వారేవా ! యిస్తివయ్య ! వాహిద్ భయ్యా !
  ***)()(***

  రిప్లయితొలగించు
 46. ధర్మాధర్మవిచక్షణల్ మరచి దయాదాక్షిణ్యముల్ వీడు, దు
  ష్కర్మాసక్తులఁబెద్దవారియెడనిష్కారుణ్యదుర్భాషులన్,నిర్మూలించగ శిక్ష వేయదగు నే నేరమ్ము గాదెయ్యడన్
  దుర్మార్గంబిసుమంత లేదు, గురులన్ దూషింపగా శిష్యులే

  రిప్లయితొలగించు
 47. చర్మంబుల్ పలు తీయునట్లు నతిగా ఝాడించి బెత్తంబులన్
  ఫర్మాయించుచు ఛాత్రులన్ వడివడిన్ పర్వెట్టి కేంటీనులో
  గర్మాగర్ము పకోడి తెమ్మనుచు మా కర్మంబు కాల్చంగ నే
  దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే

  రిప్లయితొలగించు