2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సమస్య - 2586 (లక్ష్మణుఁ బెండ్లియాడినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై"
(లేదా...)
"లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా"
ఈ సమస్యను పంపిన పులికొండ సుబ్బాచారి గారికి ధన్యవాదాలు.

86 కామెంట్‌లు:

 1. లక్ష్మీ! వినుమా! చెప్పెద!
  సూఖ్మమ్మగు కిటుకు నిచట సుందర వదనా!
  ఈ క్ష్మాజమ్మును "విరువుము"
  "లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై"

  రిప్లయితొలగించండి
 2. లక్ష్మియె సీతగ బుట్టగ
  లక్ష్మీపతి రాముడాయె,రాముని శౌరి
  న్నాక్ష్మసుత మరదిగ గొని
  "లక్ష్మణుఁ; బెండ్లాడె సీత రాగాన్వితయై

  రిప్లయితొలగించండి


 3. తా క్ష్మాను విడువ ఊర్మిళ
  లక్ష్మణుఁ బెండ్లాడె; సీత రాగాన్వితయై
  యా క్ష్మావరుడా రాముని
  తా క్ష్మా భారమును తీర్చ తరియించె గదా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. క్ష్మా - నిదుర
   క్ష్మావరుడు రాజు
   క్ష్మా - భూమి క్ష్మా భారము - భూభారము

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబి గారు క్ష్మా ను నేర్పుగా క్షమా సహితముగా రాక్షసార్థమునొక్క దానిని వీడి నిక్షేపముగా వాడినారు. చాలా బాగుంది.
   అవాల్మీకమైనను ప్రాశస్త్యమైన యూర్మిళా దేవి నిద్రను గుర్తు చేసారు. అయితే “క్ష్మాను విడువ” కు బదులు “క్ష్మాను బొంద నూర్మిళ” యనిన సమంజసముగా నుండును. ఏలన పెండ్లి తర్వాతనే చిరకాల నిద్ర యైనది.

   తొలగించండి


  3. విట్టుబాబు గారికి నెనరులు

   పోచిరాజు వారి సవరణలకు నెనరులు. మీరన్నదే సరి అయినది. నిదురను బొంద ఊర్మిళ.

   అవాల్మీకియమైనను తెలుగు జానపదుల నోళ్ళలో పాటగా సాగిపోయిన వ్యధ, కథ !

   నెనరులు

   జిలేబి

   తొలగించండి
 4. లక్ష్మీ చెప్పెద వినవే
  యా క్ష్మాపతి దశరథ సుతు డైన ఘనుండా
  లక్ష్మణు నగ్రజుఁ సద్గుణ
  లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై.

  రిప్లయితొలగించండి
 5. సాపేక్షంగా దుష్కర ప్రాసైనందున పద్యంలోని మూడు క్రియాపదాలకు సీతనే కర్తను జేయవలసి వచ్చింది. విజ్ఞులు పునరుక్తి దోషమనరుగా!

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  ఈరోజు కుడికంటి ఆపరేషన్ కోసం వెళ్తున్నాను. మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దిగ్విజయంగా వచ్చి మాసమస్యలను విశ్లేషించాలని దీవించి అక్క

   తొలగించండి


  2. కంది శంకరయ్య గారికి,

   ఆల్ ది బెస్ట్ !


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  3. ఆదిమూలమే మాకు అంగరక్ష - శ్రీదేవుడే మాకు జీవరక్ష
   పాదమాకసమునకు పారజాచే విష్ణువే - గాదిలియై మాకు నాకాశరక్ష
   సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు - సాదరము మీరినట్టి సర్వరక్ష

   తొలగించండి
  4. ఆపరేషను దిగ్విజయంగా పూర్తి చేసుకురండి గురువుగారూ.
   🙏🏻

   తొలగించండి
  5. మరి ఈరోజు పూరణల సమీక్షా బాధ్యతనెవరు తీసుకుంటారో!
   😁

   తొలగించండి
  6. 10 రోజులు కంటికి వత్తిడి తగలకుండా చూచు కోండి.all the best.

   తొలగించండి
  7. అవును గురువుగారూ! పది రేజులు పూర్తిగా కంటికి విశ్రాంతి నివ్వండి! తొందరపడి అంతర్జాలపనులు పెట్టుకోవద్దు! శస్త్రచికిత్సానంతర జాగ్రత్తలు చాల ముఖ్యము’
   త్వరలో కోలుకొని రెట్టించిన ఉత్సాహముతో సమీక్షలు చేయవలెనని ఆశిస్తున్నాము! 🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  8. గురువుగారికి నమస్సులు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలో కంటి ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో అందుకొని మళ్ళీ శంకరాభరణాన్ని సుసంపన్నంచేయాలని ఆశిస్తున్నాను 🙏

   తొలగించండి
  9. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. క్షేమకరముగా నయన శస్త్ర చికిత్స జరిగి మీకు సంపూర్ణారోగ్యము చేకూరాలని కోరుకుంటున్నాము.

   తొలగించండి
  10. కంటి శస్త్రచికిత్స విజయవంతమై సులోచనములతో బ్లాగుకు తిరిగి రావాలని ఆకాంక్ష.

   తొలగించండి
 7. సూక్ష్మము తెలియక పలికెను
  లక్ష్మియె పార్వతి కిజెప్పె రహస్య ముగ
  న్నీక్ష్మా జకుమతి లేదట
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మణు నూ ర్మిళ పెండ్లాడ
  లక్ష్మణ సోదరు ని రాము రమణీ మణి యౌ
  లక్ష్మీ యం శ గ నా శుభ
  లక్ష్మణు పెండ్లాం డె సీత రాగాన్వి త యై

  రిప్లయితొలగించండి
 9. పక్ష్మముల వాల్చి యూర్మిళ
  లక్ష్మణు బెండ్లాడె ;సీత రాగాన్వితయై
  సూక్ష్మమతి రాము ;మాండవి
  పక్ష్మలహృదు భరతుని ;శ్రుతభామ చతుర్ధున్.
  (పక్ష్మములు-రెప్పలు,పక్ష్మలహృదు-పక్షివలె ఎగిరే మనసు గల)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. బాపూజీ గారు,

   చాలా బాగుందండీ


   జిలేబి

   తొలగించండి
  2. నాలుగు జంటలనీ యిమిడ్చేశారు. బాగు బాగు.

   తొలగించండి
  3. శంకరార్యులకు నేత్రచికిత్స విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను .

   తొలగించండి
  4. చాలా బాగుంది. సోదరులందరి పెండ్లి చేసినారు.

   తొలగించండి
 10. మైలవరపు వారి పూరణ
  లక్ష్మీ స్వరూప జనకజ
  సూక్ష్మనిశితధీవిలసితు శుభగుణు రామున్
  బక్ష్మములనెత్తి గని శ్రీ..
  లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై !!

  పక్ష్మములు.... కనురెప్పలు

  శ్రీ లక్ష్మణుడు.... శ్రీ ( హలికులిశాంకుశధ్వజ... ఇత్యాది..) చిహ్నములు గలవాడు... శ్రీ రాముడు

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హల కులిశాంకుశ... అని ఉండాలి... టైపాటు కు మన్నించండి 🙏

   తొలగించండి
  2. లక్ష్మియె పుట్టె దున్నగఁ బొలాన హలాన విదేహరాడ్యశో
   లక్ష్మి యనంగ , సర్వ శుభ లక్షణ లక్షితయై చెలంగి , శ్రీ...
   లక్ష్మణు , దివ్య పాద యుగళాంచిత శంఖ రథాంగ చక్ర స...
   ల్లక్ష్మణు బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 11. లక్ష్మి! జిలేబి! చూడు కథలన్ పలు తీరుల జేయ పూరణల్,
  సూక్ష్మము చెప్పె దన్ విను సుశోభిత యూర్మిళ పెండ్లి యాడెనా
  లక్ష్మణుఁ; బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా
  సూక్ష్మత తో ధనుస్సు నట చూర్ణము సేసిన కౌసలేయుడిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరుచుట కలుపుట కొరకే
   కరచుట చరచుట జిలేబి! కష్టము కాదే!
   విరిచితి సమస్య లెన్నియొ
   విరిచెద వేరొక సమస్య విరువగ నేలా?

   తొలగించండి


  2. విరిచెద మరియొక సమస్య విరుగన్ మేలై :)

   ~ జిలేబి -

   తొలగించండి
 12. పద్య ప్రశ్న :-

  పక్ష్మంబిల ఛాయనిడునె ?
  లక్ష్మీరమణుండెచటమరచెభక్తాళిన్?
  సూక్ష్మముయోచించుమెచట
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై.

  జవాబు :- శంకరాభరణం సమస్యాపూరణం శీర్షికలో..

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2586
  సమస్య :: *లక్ష్మణుఁ బెండ్లి యాడినది రాజిత సీత సకామయై
  భళా.*
  లక్ష్మణుని సీత వివాహమాడినది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ చేసేందుకోసం విష్ణు భగవానుడు ఈ భూమిపై ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు. త్రేతాయుగంలో లక్ష్మీదేవియే సీతగా , విష్ణువు రఘురాముడుగా అవతరించారు. మిథిలా నగరంలో జరిగిన సీతా స్వయంవరంలో శ్రీయుతమూర్తి యైన శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టగా విజయలక్ష్మి వరించింది. లక్ష్మీ స్వరూప యైన సీత ఆ శ్రీ రాముని వరించింది.
  *లక్ష్మణుడు* అనే పదానికి లక్ష్మితో (శోభతో) కూడియున్నవాడు అని అమరకోశం అర్థం చెబుతుంది. అంతేకాకుండా
  *రాఘవత్వే భవేత్ సీతా , రుక్మిణీ కృష్ణజన్మని ।అన్యేషు చావతారేషు , విష్ణో రేషానపాయినీ ।।* అని కూడా అంటారు కాబట్టి , లక్ష్మి గలవాడైన లక్ష్మణుని అంటే శ్రీరాముని (ఏ అవతారంలోనూ వదలియుండని లక్ష్మి యైన) సీత ప్రీతితో పెండ్లియాడినది అని విశదీకరించి చెప్పే సందర్భం.

  లక్ష్మియె సీత గాగ , రఘురాముడుగా హరి యుద్భవించె , నా
  లక్ష్మి జనించినట్టి మిథిలా నగరాన స్వయంవరమ్ములో
  లక్ష్మిని జూచె , విల్విరిచె రాముడు శ్రీయుతమూర్తి , సర్వదా
  లక్ష్మణు డన్న యర్థమును లక్ష్మ్యనపాయుడుగా వచింతు , నా
  *లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా.*
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (02.02.2018)

  రిప్లయితొలగించండి
 14. పక్ష్మములే విప్పారగ
  లక్ష్మణ శబ్ధార్ధమఱయ లావణ్యముగా
  సూక్ష్మముగా చెప్పెద నా
  "లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై"

  రిప్లయితొలగించండి
 15. మాస్టారు లీవులో ఉన్నారుగా, క్లాస్ లీడర్ ఎవరు ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మాస్టారు లీవులో బో
   యే! స్టాక్టేకింగెవరకొ ? యెవరికి వారే
   రోస్టరు వేసుకొని తతి
   మ్మా స్టారుల పూరణల విమర్శల జేయన్ ! :)

   జిలేబి

   తొలగించండి
 16. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. సార్,
   భావన భలేగా కుదిరింది మీకు.
   ఆ ఊహే రాలేదు నాకు....
   ఆఖరి పాదం లో కొంత change..

   పు క్ష్మాపతి తొలి కొమరుడు ముదముతొ మురిసెన్..

   తొలగించండి
 17. సూక్ష్మంబిదియే ఘనమే
  రుక్ష్మాభృద్ధీరు రాము రుచిరాంగదు నా
  లక్ష్మీసమాన , భ్రాతగు
  లక్ష్మణు,బెండ్లాడె సీత రాగాన్వితయై !

  రిప్లయితొలగించండి

 18. సూక్ష్మముతోడరాముడట శూలిధ నుస్సునువిర్వగన్ అహా
  పక్ష్మము లెత్తియూర్మిళయు వాసిగ గాంచుచు తండ్రి యానతో
  "లక్ష్మణు పెండ్లియాడినది. రాజిత సీత సకామయై భళా"
  లక్ష్మణునన్నరాఘవుతొ లగ్నము నాడెను పెద్దలొప్పగన్.
  పక్ష్మము లెత్తక యూర్మిళ
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై"*
  తాక్ష్మాపతిపుత్రుండౌ
  లక్ష్మణు నన్నను ముదమున లలితో వలచెన్.

  రిప్లయితొలగించండి
 19. గురువు గారు మీ కంటి శస్త్ర చికిత్స దిగ్విజయం గా జరగాలని కోరుకొంటున్నాను.నిన్న సమస్యలో అబ్ది అని పొరబడ్డాను.అందుకు వనమలి వేసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 20. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  ఆ క్ష్మాకుమారి c గొనుటకు ,

  సూక్ష్మముగా విరిచివైచె శూలి ధనుస్సున్ >

  లక్ష్మణ సహజుడు | సద్గుణ

  లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై


  { సద్గుణ లక్ష్మణుడు = సద్గుణముల చేత శ్రీ మంతుడు }

  రిప్లయితొలగించండి
 21. ముసిరిన సిగ్గుల, రాముని
  లసిత,సుహాస సహిత,హిత లక్ష్మణు బెండ్లా
  డెసీత రాగాన్వితయై
  కుసుమసమతనువు వణకగ కోమలికపుడున్

  రిప్లయితొలగించండి
 22. ముసిరిన సిగ్గుల, రాముని
  లసిత,సుహాస సహిత,హిత లక్ష్మణు బెండ్లా
  డెసీత రాగాన్వితయై
  కుసుమసమతనువు వణకగ కోమలికపుడున్

  రిప్లయితొలగించండి
 23. గురువు గారి నేత్ర చికిత్స విజయవంతము కావాలని , ఆయన సంపూర్ణాయు రారోగ్యములతో

  శతవత్సరములు వర్ధల్ల వలెనని , నేను కోరుకొను చున్నాను .

  రిప్లయితొలగించండి
 24. గురుదేవులకు కంటి శస్త్ర చికిత్స సజావుగా సాగాలని భగవంతునికి ప్రార్థన

  కందం
  ఈ క్ష్మా దనుజులఁ గూల్చెడు
  లక్ష్మీనారాయణుండె రాముడు! ధనువున్
  సూక్ష్మమ్ముగ ద్రుంచ ప్రణత
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  రిప్లయితొలగించండి
 25. లక్ష్మణ్ తో శివరావనె
  "సూక్ష్మ మ్మెరుగవు, యినకుల సోముని సతియౌ
  నాక్ష్మాసుత ; యెప్పుడెటుల
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై?"

  రిప్లయితొలగించండి
 26. లక్ష్మీవర్ధనుఁడు ధను
  ర్లక్ష్మీ విభవుండు దాశరథి రాము లస
  త్పక్ష్ముని, నూర్మిళ సేకొన
  లక్ష్మణుఁ, బెండ్లాడె సీత రాగాన్వితయై


  లక్ష్మము లందు నిశ్చయము రాముఁడు సత్య పురంపు విష్ణువే
  లక్ష్మియ జన్మమెత్తె విపులాత్మజ యై వసుధా తలంబునన్
  సూక్ష్మము నెంచి చూడ నిల సుందరి సేయఁగ రామునిన్ మహా
  లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా

  [లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు; లక్ష్మి (సీత) కలవానిగా]

  రిప్లయితొలగించండి
 27. లక్ష్శీ! యూర్మిళ యేగద
  లక్ష్శణుబెండ్లాడె ,సీతరాగాన్వితయై
  లక్ష్శణు భ్రాతగు రాముని
  బక్ష్శల కాలంబులోనబరిణయ మాడెన్

  రిప్లయితొలగించండి
 28. సూక్ష్మగ్రాహక ఊర్మిల
  లక్ష్మణుఁ బెండ్లాడె, సీత రాగాన్వితయై
  లక్ష్మీవంతుడు రాముని
  యీ క్ష్మజ కద పెండ్లియాడె నిష్టముతోడన్.

  రిప్లయితొలగించండి
 29. లక్ష్మీప్రదముగ నూర్మిళ
  లక్ష్మణుఁ బెండ్లాడె, సీత రాగాన్వితయై
  ఆ క్ష్మాపతి సుతుడౌ శుభ
  లక్ష్మణములు గల జగదభి రాముని బొందెన్!!!

  రిప్లయితొలగించండి
 30. లక్ష్శణుబెండ్లియాడినదిరాజితసీతసకామయైభళా
  లక్ష్మణరావ!వింటెయిదిలక్ష్మణుతోడనబెండ్లియా?యయో
  లక్ష్శిసమానురాలయినరాజితసీతనునట్లుగానన న్
  బక్ష్మలులేకయుండగనుభస్మముగానగువారనేత్రముల్

  రిప్లయితొలగించండి
 31. 1.
  ఆక్ష్మాపతి రెండవ సుత
  లక్ష్మణుఁ బెండ్లాడె, సీత రాగాన్వితయై
  లక్ష్మీకళ కోసల సుమ
  హా క్ష్మాపతి మొదటి సుతుని హర్షమునఁ గొనెన్

  రిప్లయితొలగించండి
 32. ఈక్ష్మానొక మూర్ఖు డనియె
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై
  లక్ష్మీపతి రాముడతని
  సూక్ష్మమ్మగు బుద్ధి లేని శుంఠయనంగన్

  రిప్లయితొలగించండి
 33. బ్లాగు నిర్వాహకులు కవివతంసులు శ్రీకందిశంకరయ్య గారి కంటి చికిత్స ఫలవంతము కావాలని ఆకాంక్షిస్తూ౼౼

  "కంది శంకరకవి కన్నుకౌ చికిత్స
  విజయవంతముఁ జేయంచు విన్నవింతు
  జీవితాంతసుదృష్టులు సిద్ధపడగ
  పార్వతీప,రమేశ్వర పాదమంటి"

  నా సమస్యాపూరణ__
  "లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజితసీత సకామయై
  భళా"
  'లక్ష్మ' యిదేటి ప్రాస, కవిరాజులు "గోస"పడే ప్రయాస,యీ
  సూక్ష్మగతార్థలబ్ధపరిశోధనకల్పనకైన ధ్యాస, యే
  లక్ష్మణు? డెట్టిదీ వరుస? రామ!దయాళు! క్షమించు మమ్ములన్.
  మరో పూరణ______
  పక్ష్మయుగమ్ము లెట్లు కనుపాపలఁ గాచునొ! యట్లు నోమగన్
  లక్ష్మణుఁ, బెండ్లియాడినది రాజితసీత సకామయై భళా!
  సూక్ష్మమెఱింగి గాధిసుతసూచితుడై విలుఁ గూల్చ రామునిన్,
  లక్ష్మియొ! జానకీసతియొ! రాముడొ!శ్రీహరియో! యనన్ జనుల్.

  రిప్లయితొలగించండి
 34. సీత అనె అమ్మాయి లక్ష్మణుడు అనె అబ్బాయిని పెండ్లాడితె ఆ విషయము తెలియని కూతురికి తల్లి చెబుతున్న హితవు
  లక్ష్మి,వినంగరాదె కధలాయివి కావిటు జీవితమ్ములౌ
  లక్ష్మణరేఖలన్నునిచె లావుగ స్త్రీలకు పెద్దలవ్విధిన్
  లక్ష్మణుడన్న వానినటు లవ్వొనరించితివీవు గాని యా
  లక్ష్మణుఁ; బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా

  రిప్లయితొలగించండి
 35. సూక్ష్ముని చాపముం దునిమి శోభలు మీరిన రామచంద్రుని
  న్నీ క్ష్మసుపుత్రి మైథిలి వరేక్షణ యీ జనకేశు కూతు రీ
  లక్ష్మి మనోహరాంగి శుభలక్షణ కైకొనె తప్పు చాలు నే
  లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై? భళా!

  రిప్లయితొలగించండి
 36. లక్ష్మణుడు భువినివెలసిన
  లక్ష్మిగ తననెంచి బ్రవిమలమ్ముగ కొలువన్
  లక్ష్మియె సీతగ వెలసియు
  లక్ష్మణు బెండ్లాడె సీత రాగాన్వితయై?

  రిప్లయితొలగించండి
 37. శస్త్ర చికిత్స యయ్యది శంకరులకు
  చక్క నగుగాక!శంభుని సత్కరుణను
  నాయు రారోగ్య సంపద లధిక మగుచు
  జీవ నంబును సాగుత!తిరము గాను

  రిప్లయితొలగించండి
 38. .లక్ష్మీపుత్రిక “బావగు
  లక్ష్మణు బెండ్లాడె|సీతరాగాన్వితయై”
  లక్ష్మణ,రాముడు,మరివర
  లక్ష్మికితండ్రి నొకడె గన?లక్ష్మీపురమున్|

  రిప్లయితొలగించండి

 39. .......సమస్య
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  సందర్భం:
  శ్రీ లక్ష్మణు డనగా హల కులి శాంకుశ ధ్వజాది శుభ చిహ్నాలు కలిగిన వాడు.. రాముడు.
  అతడు వర బల యుత దోః.. లక్ష్మణుడు.. అంటే శ్రేష్ఠమైన బలంతో కూడిన భుజములయొక్క లక్షణం కలవాడు.. (గొప్ప భుజబలం కలవాడు) రాముడు.
  అటువంటి రాముని పెండ్లాడినది సీత.

  లక్ష్మియె జానకి, రాముడు
  లక్ష్మీ పతి యగును; రాము, లలిత గుణున్, శ్రీ
  లక్ష్మణు, వర బల యుత దో
  ర్లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 40. రిప్లయిలు
  1. లక్ష్మణుడాదిశేషుడిరు భ్రాతలుగా తన శంఖచక్రముల్
   లక్ష్మియె సీతగా ధరణి రామునిగా హరి సంభవించుచున్
   సూక్ష్మముగా విలున్ దునుమ , శూరుఁ బరాక్రమ సత్య ధర్మ స
   ల్లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా!

   తొలగించండి

 41. .......సమస్య
  లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  సందర్భం:
  వివాహ వేళ లక్ష్మణుడు రామునికి లక్ష్మణ ఫల మిచ్చినాడు. లక్ష్మణ ఫల మంటే పీచు పదార్థం ఎక్కువగా గలిగిన ఒక పండు. దీనిని హనుమంతుని ఫలం అని కూడా అంటారు.
  ఇంగ్లీషులో soursop లేదా graviola అంటారు.
  జిత.. స్వః.. లక్ష్మణుడు.. అంటే.. జయించిన స్వర్గం గలవాడు. స్వర్గమంటే న-అకము.. దుఃఖం లేనిది.. సంతోష మని అర్థం. ఎప్పటికీ సంతోషంగా వుండేవాడు.. రాముడు.. అని.
  అటువంటి రాముని పెండ్లాడినది సీత.
  (పద్యంలో రాము డనే మాట లేకపోవడం మరో విశేషం.)

  లక్ష్మి కళ లొలుకు నన్నకు
  లక్ష్మణ ఫల మిచ్చినాడు లక్ష్మణు, డపు డా
  లక్ష్మణు నగ్రజు, జిత స్వ
  ర్లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 42. భావన వినూత్నంగా ఉందండీ..
  3 వ పాదము లో 3వ గణంలో 1 మాత్రం తగ్గింది. "జితస్వ" కు బదులు "విజితస్వ" అంటే లేదా
  "నగ్రజు" బదులు "నగ్రజుడు" అంటే సరిపోతుంది..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాదు గారు,
   మాత్ర తగ్గలేదు. బహుశ పెరిగింది అనుకుంట, సమాసములోని సమ్యుక్తాక్షరాల వలన.
   UII UII IUU
   లక్ష్మణు నగ్రజు జిత స్వ

   నాల్గవ పాద మొదటి అక్షరము, సమ్యుక్తాక్షరముగా గమనించాలి.

   గురువుగారు ఇంతకు మునుపు చెప్పినట్లు క్రావడి ముందు అక్షరమును కావాలంటే గురువుగాను లేదా లఘవుగాను పాటించ వచ్చు అన్నదానిని బట్టి లఘువుగా భావించిన, ఇక్కడ గణ దోషము లేదు
   UII III IUU
   లక్ష్మణు నగ్రజు జిత స్వ

   తొలగించండి
 43. దుష్కర రాసకు దుర్భర భాష:👇

  లక్ష్మణు గాంచ యూర్మిళమ లగ్నము కాగయె మానసమ్ము నా
  లక్ష్మణుఁ బెండ్లియాడినది;...రాజిత సీత సకామయై భళా
  లక్ష్మణు భ్రాత వీరుడగు రాముని కూరిమి పెండ్లియాడుచున్...
  లక్ష్మణు తోడ రాముడును రమ్మన కుండను కానకేగుచున్
  లక్ష్మణు దిట్టి త్రోలగను, లంకను జేరగ రావణుండితో...
  లక్ష్మణు రాము హన్మనులు లంకను జేరగ సంతసించుచున్
  లక్ష్మణు కూల్చ నింద్రజితు రాముడు చంపగ రావణుండనున్
  లక్ష్మణు రాము చెంతనిక లంకను వీడెను నగ్నిసాక్షిగా...
  సూక్ష్మపు రామగాథ యిది చుప్పున నుండుర నోరుమూయుచున్!

  రిప్లయితొలగించండి