4, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2588 (తద్దినమే శుభము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్"
(లేదా...)
"తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్"

145 కామెంట్‌లు:



  1. సుద్దులు చెప్పెడు వారల్
    బుద్ధిగ నడచుకొను నాడు పుంఖితమగుచు
    న్నొద్దిక గా వెలుగున్నే
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎద్దినమున పనివారలు
      సుద్దుగ గిన్నెలు కడుగుచు చుప్పుగ నోరుల్
      ముద్దుగ మూయన్ గలరో
      తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. 🙏

      అయ్యా! సారూ! ఇంకొన్ని రోజులు కన్నులకు సెలవీయ ప్రార్ధన!

      తొలగించండి
  2. ఎద్దినమున ధరణీశులు
    కొద్దిగ యవినీతి వీడి కోరక ధనముల్
    ముద్దుగ పాలించెదరో
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి


  3. సుద్దులు చెప్పు వారలట శోభిల జేయగ సత్యమార్గమున్
    బుద్ధిగ మేలు కైపులట పుంఖిత మై వెలుగొందగన్ భళా
    కద్దమి చందమామ వలె గాన్పడ గా నిలలోజిలేబి‌ , యే
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. కంది వారికి

      నెనరుల్

      కంటాప్రేషను తరువాయి యింత త్వరగా మానిటర్లు చూడడం మంచిది కాదు.

      దయచేసి కళ్ళకు వ్యవధి యివ్వండి

      లేదంటే విన్నకోట వారు రాజన్న వారికి చేసిన బెదిరింపులు లాంటివి మొదలెట్టాల్సి వస్తుంది జాగ్రత్త :)

      జెకె :)

      ఆల్ ది బెస్ట్


      జిలేబి

      తొలగించండి
    3. "విన్నకోట వారు రాజన్న వారికి చేసిన బెదిరింపులు "

      ???

      అవేవిటో నాపరంగా సెలవియ్యండి ప్లీజ్!!!
      పద్య రూపంలో... మీకు నచ్చిన ఛందస్సులో..

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      ధన్యవాదాలు.
      మానీటర్ కాదు... సెల్‌ఫోన్ చూసి వ్యాఖ్యానిస్తున్నారు.

      తొలగించండి
    5. గురువుగారికి నమస్సులు! ఏదైనా రేడియేషన్ ప్రభావముంటుంది! దయచేసి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోండి!🙏🙏🙏

      తొలగించండి

    6. రాజన్న వారికి విన్న కోట వారి ఫర్మానా :)


      మాట వినని విద్యార్ధులుంటారని తెలుసు, మాట వినని టీచర్లు కూడా ఉంటారన్నమాట.
      కాబట్టి, ఆపరేషన్ నుండి కోలుకుంటున్న ఈ సమయంలో మీ దగ్గర్నుంచి కంప్యూటర్ / లేప్టాప్ / ఐపాడ్ / స్మార్ట్ ఫోన్ తీసేసుకుని ఓ వారం పదిరోజుల పాటు దాచి పెట్టెయ్యమని చెబుదామనుకుంటున్నాను మీ సన్నిహితులతో.

      :)

      తొలగించండి
    7. లేదంటే బ్లాగు మిత్రులంతా పూరణలను కొన్నిరోజుల బందుచేస్తామని బెదిరిస్తేసరి!
      సమ్మె ప్రకటన!👍👍👍

      తొలగించండి


    8. జీపీయెస్ వారికి సీతాదేవి గారికి వత్తాసుగా శార్దూల జిలేబి ధర్నా యిదే యిదే యిదే !



      ఫర్మానా వినుడోయి ! కంది వర! సౌభాగ్యంబు గాదక్కిరే
      నిర్మాణాత్మక పద్యపాటవములన్ నేర్పింప బ్లాగ్లోకమున్
      జుర్మానానిక వేతు పూరణల నన్జూడంగ! విశ్రామమున్
      ధర్మాధ్యక్షుడ కంటికిన్నిడదగున్ ధర్నా యిదే‌ మాదయా !

      జిలేబి

      తొలగించండి
    9. జిలేబి గారికి ధన్యవాదాలు.
      అది రాజారావు మాస్టారు త్వరగా కోలుకోవాలని నేను చేసిన మనవి, ఆత్మీయసూచన. వారితో బ్లాగుపరిచయం ద్వారా ఏర్పడిన చనువు పురస్కరించుకుని ఇచ్చిన సలహాని మీరు "ఫర్మానా", "బెదిరింపు" అన్నా ఫరవాలేదు. మీరూ మంచి ఉద్దేశ్యంతోనే అంటున్నారని నాకు తెలుసు లెండి 🙏(మాట విననప్పుడు కాస్త గదమాయించాలండీ, తప్పు లేదు 😀😀😀).

      నా సూచన శంకరయ్య మాస్టారుకీ వర్తిస్తుంది (అసలు ఈయన హాస్పటల్లో పడుకునే సమీక్ష చేసేస్తున్నారా అని నాకు కించిత్ అనుమానం ☺). పైన మీరూ, సీతాదేవి గారు, GPS గారు లాంటి శ్రేయోభిలాషులు కూడా అదే సలహా ఇచ్చారు కదా, సంతోషం. శంకరయ్య గారు త్వరగా కోలుకోవాలని నేనూ కోరుకుంటున్నాను 🌷🌹🌷.

      తొలగించండి
    10. దుర్మార్గంబును గాదుదిట్టి క్రియ విద్యుక్తమ్ము విద్యార్ధికిన్ ! 🙏🙏🙏🙏

      తొలగించండి
    11. ...జిలేబీ గారూ; దయజేసి స్పందించండి సవరణలతో:

      🙏🙏🙏

      ఆకాశవాణి సమస్య:

      "చేదు తెలుగు గొప్ప చెప్ప గలమె"

      నా పూరణ:


      వేయి రుచుల సుమతి వేమన రసములున్
      ప్రాస యతుల తోడ పాయసాలు
      పోతనయ్య తీపి వ్రాతల తేనియల్
      చేదు తెలుగు గొప్ప చెప్ప గలమె?

      చేదు = (నీరు) తోడు


      గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి

      తొలగించండి


    12. బాగుందండీ మేథమేటికల్లీ వందకు వంద మార్కులు

      జిలేబి

      తొలగించండి
    13. శాస్త్రి గారూ,
      "పోతనార్యు కావ్య వాపిలో తేనియల్
      చేదు తెలుగు గొప్ప చెప్ప తరమె" (వాపి = బావి)
      ....అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    14. నా శ్రేయోభిలాషుల సూచనలు శిరోధార్యాలే! కాని అలవాటైన ప్రాణం. బ్లాగును చూడక, మిత్రుల పద్యాలు చదవక, వ్యాఖ్యానించక ఖాళీగా ఉండడం ఏదో అపరాధభావాన్ని కలిగిస్తున్నది. నిష్క్రియాపరత్వం బాధిస్తున్నది.

      తొలగించండి
    15. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం!
      శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం!
      మీకు తెలియనివి కావు! 🙏🙏🙏

      తొలగించండి
    16. సారూ:

      ఇన్నాళ్ళూ మీ వలలో మేము పడితిమి అనుకొంటిని. ఇప్పుడు తెలిసినది మీరు కూడా మా వలలో చిక్కుకున్నారని.

      భక్తునికి భగవంతుడు దాసుడట...

      కానివ్వండి మీ మద్యపానం

      👏👏👏

      తొలగించండి
    17. శాస్త్రి గారూ,
      "పోతనార్యు కావ్య వాపిలో తేనియల్
      చేదు తెలుగు గొప్ప చెప్ప తరమె" (వాపి = బావి)
      ....అంటే ఎలా ఉంటుంది?

      🙏🙏🙏👏👏👏

      తొలగించండి
    18. "పోతనార్యు కావ్య వాపిలో తేనియల్"

      సార్! ఈ పాదములో యతి?

      తొలగించండి
    19. శాస్త్రి గారూ,
      దృష్టిదోషం కదా! మన్నించాలి.
      "వర కవీంద్ర కావ్య వాపిలో తేనియల్..." అంటే?

      తొలగించండి
    20. సీతాదేవి గారూ,
      మీ 'దుర్మార్గంబును గాదు...' పాదంలో సమస్య సిద్ధమయింది.
      "దుర్మార్గము గాదు గురుల దూషించినచో"
      (లేదా...)
      "దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే"
      రేపటి సమస్య ఇదే....

      తొలగించండి
    21. లేని పోని సమస్యలు సృష్టించడంలో మీకు మీరే సాటి...

      తొలగించండి
    22. గురువుగారికి నమస్కారం🙏🙏🙏
      అన్నయ్యకు 😄😄😄😄

      తొలగించండి



    23. వర్మంబై వెలిగారు శిష్యులకు సావాసమ్ము లన్జేర్చుచున్ !
      శర్మా !శాస్త్రి ! జిలేబి! యేమనిరి ! కాస్తాతెల్పుడీ! యేలనో
      దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా? శిష్యులే
      మర్మంబై నను గాంచిరే గురువులన్ మన్నింపకన్ చెప్పుడీ !


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  4. శుద్ధిని చేయుచు మనమును
    పద్ధతిగా కొలిచి నంత పరవశ మందున్
    వృద్ధగు సంపద నింటను
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వృద్ధి + అగు' అన్నప్పుడు యడాగమం వస్తుంది. "వృద్ధి యగును సిరు లింటను" అనండి.

      తొలగించండి
    2. శుద్ధిని చేయుచు మనమును
      పద్ధతిగా కొలిచి నంత పరవశ మందున్
      వృద్ధి యగును సిరు లింటను
      తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ


    కంకుభట్టు... వలలునితో..

    హద్దులు లేని కోపమది హానికరమ్మిటు వంటపాత్రలన్
    గ్రుద్దుట , భూరుహమ్ములను గూల్చుట యుక్తమె ? యెద్దినమ్మెవం
    డొద్దిక సంప్రదించి , సమయోచిత నిర్ణయమున్ గ్రహించునో
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉంది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. దశరథుడు... విశ్వామిత్రునితో...

      ముద్దులు గారు పాల పసి బుగ్గల బాలుడు రాముడయ్య ! మా..
      యిద్దరి నోముపంట , చరియింపగ కన్నులముందు పండువౌ !
      నెద్దినమందు దండ్రులకు నింపుగ బిడ్డల ముద్దు దక్కునో
      తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. ప్రహ్లాదుడు... హిరణ్యకశిపునితో...

      విద్దెలలోని మర్మములు విష్ణుని దెల్పు , జగమ్ము వానిదౌ
      సద్దయ వెల్గుచుండెననిశమ్ము , ఘనుండతడొక్కడే ! మనం..
      బిద్ది గ్రహించి భక్తిఁ గొని, యెద్దినమందున వాని దల్చునో
      తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. మైలవరపు వారి తాజా రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ఎద్దిన మందునన్ బ్రజల నేవిధి రుగ్మత క్రుంగదీయదో
    ఎద్దిన మందునన్ మతుల నింతయు స్వార్థము స్వారిచేయదో
    ఎద్దిన మందునన్ మదుల నేహ్యపుటూహలు సందడింపవో
    తద్దినమే శుభంబులిడు ధారుణిలోని జనాళికెప్పుడున్


    రిప్లయితొలగించండి
  7. (శ్రీ భూదేవీ సమేత వరాహమూర్తయే నమః)

    అద్దానవుడిలఁదాచఁగ
    మద్దించెను,ఘుర్ఘువరవమండిత వరాహుఁ
    నద్దించరొశ్రియంబున్
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      రెండవ పాదంలో గణ యతి దోషాలు. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. సార్ ... నా paper ను revalue చేయప్రార్ధన

      UU. IIU. IIII. UII. IUI.
      'మ'ద్దిం చెనుఘు ర్ఘువరవ 'మం'డిత వరాహుఁ

      UU. IUI UU
      నద్దిం చరొశ్రి యంబున్


      తొలగించండి
    3. అయ్యా! ప్రసాద్ గారూ:

      నేను విద్యార్థినే.

      సార్ కి కొంచెం విశ్రాంతి ఇద్దామని ఈ వ్యాఖ్య చేయుచుంటిని. మన్నించ గలరు.

      రెండవ పాదం లఘువుతో అంతము కాకూడదు గదా!

      "చరొశ్రి" లో "రొ" లఘువైనది. "చరొశ్రి" సంస్కృత సమాసం కాదు గదా!



      తొలగించండి
    4. Sorry sir, you remembered me. Thanks again.
      Sankaraiah sir, please take some rest. Don't let your eyes strain.

      I am thinking of taking a short leave from Sankarabharanam temporarily so that our sir gets time for convalescence. I may shortly join after .. err.. 10 days.

      Spl Message to GPS sir :-. Sir, I've gone through your blog and it is very interesting. Hope you resume your blogging. All the best...

      తొలగించండి
    5. 🙏🙏🙏

      కాలు జారి కంది వారి వలలో చిక్కుకున్న తరువాత బ్లాగుకు రెస్టు... వాగుటకు రెస్టు లేదు...:)

      తొలగించండి
    6. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      మన్నించండి. రెండవ పాదంలో కేవలం గణదోషమే. యతి సరిగానే ఉంది.

      తొలగించండి
    7. “ఘుర్ఘువ రవ”? “ఘుర్ఘుర రవ” యనియా మీ ఉద్దేశ్యము?
      అద్దించరొ శ్రియంబున్ లో రి శ్రి వలన గురువు కాదు. లఘువే యవుతుంది.
      “ఘుర్ఘుర రవ మండిత కిటియే / యద్దించరో శ్రియంబున్” అనవచ్చును. అప్పుడు రెండవ పాదాంతము గురువే యవుతుంది, మూడవ పాదమున గణములు సరిపోవును.

      తొలగించండి
  8. పెద్దలు "గుడి కట్టుటకై
    ఎద్దియొ సుముహూర్త ?"మనగ నీ పున్నమియే
    యిద్దరకు నచ్చ నిట్లని "రే
    తద్దినమే శుభము లొసగు ధరణి జనులకున్".

    రిప్లయితొలగించండి
  9. నిద్దుర మానిమీ రినసు నీతము నందున కల్లలాడ కన్
    బుద్ధిగ పూజలన్ కొలిచి భూరిగ తన్మయ మొందుచున్ మదిన్
    వద్దన కుండగన్ పరమ భక్తిని వేడుచు ప్రీతిగొల్పి నన్
    తద్దినమే శుభంబు లిడు ధారుణి లోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. హద్దులు మీక పౌరులు
    పద్దతిగా మసలుచుండి పంచగ కూర్మి
    న్నొద్దిక పెరుగును శాంతియె
    తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
  11. హద్దుల గీతలన్ చెరిపి హాయిని బంచెడు కూర్మి జూపుచున్
    ముద్దుగ సామరస్యమును మోదము నివ్వగ వృద్దిచేయుచున్
    పద్దతి దప్పకుండనిల పాడగ నైక్యసుగీతికానళిన్
    తద్దినమే శుభంబులిడు ధారుణిలోని జనాళికెప్పుడున్

    రిప్లయితొలగించండి
  12. నిద్దుర మత్తును వీడుచు
    హద్దులు లేకుండజేసి యందర మొకటై
    బుద్ధిగ మసలిన చాలును
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్.

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2588
    సమస్య :: *తద్దినమే శుభమ్ములిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్.*
    మనం అశుభకర్మ అని అనుకొనే తద్దినమే మనకు శుభములను ఇస్తుంది అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అందరికీ మొదటి గురువు తల్లి. ఆ తరువాత గురువు తండ్రి. తల్లిదండ్రులు తమ బిడ్డకు హితమును ఉపదేశిస్తూ నాయనా ! ప్రతిరోజూ వేకువఝామున నిద్ర లేవాలి. మనసులో దైవాన్ని తలచుకోవాలి. అందరితో ఒద్దికగా మెలగాలి. గురువు యొక్క బోధను మననం చేసికొంటూ ధర్మబద్ధంగా జీవించాలి. పెద్ద లందరూ సంతోషపడే విధంగా వారికి సేవ చేయాలి. ఎవరైనా సరే ఈ హితోపదేశాన్ని ఏ దినం పాటిస్తారో ఆ దినమే సుదిన మౌతుంది. ఆ దినమే ఎల్లప్పుడూ శుభములను ఇస్తుంది. అని మానవుడు ఆచరించవలసిన దినచర్యను గుఱించి తెలియజెప్పే సందర్భం.

    నిద్దుర లెమ్ము వేకువన , నిల్పుము నీ మది దైవ భక్తి , నీ
    వొద్దికతో మెలంగు మిల , నుత్తమమౌ గురు బోధ నెంచుమా ,
    పెద్దలు పొంగిపోవ కడు బ్రీతిగ వారికి సేవజేయుమా ,
    ఇద్ది హితోపదేశ మగు , నే దిన మిట్టుల జేయుచుందురో
    *తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. * (4-2-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యా! మీ కంటికి విశ్రాంతి నివ్వండి. శ్రీ గురుభ్యో నమః

      తొలగించండి
  14. ముద్దుమురిపెముల వీడని,
    నిద్దుర మాని సిరియంచు నీల్గని, యాశన్
    హద్దునుమీరగ నీయని
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
  15. ముద్దుగ దేశమాత పదముల్ భజియించుచు దీక్షఁబూని యే
    హద్దులు లేని ధీరత మహాద్భుత వీర పరాక్రమోద్ధతి
    న్నద్దిర!మా జవానులట హాయిగ నుండెడు దివ్య మైనదౌ
    తద్దినమే శుభంబులిడు ధారుణిలోవి జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. వద్దని సంకుచిత కృత్రిమ
    హద్దుల నన్నిటిని చెరుప హాయి గొల్పుగా
    యెద్దిన మాస్థితి కల్గునొ
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి రెండవ పాదాలలో గణదోషం. "...సంకుచిత కృతక... హాయి గొలుపగా। నెద్దిన..." అనండి.

      తొలగించండి
    2. కృతక అనే పదమే నాకు స్ఫురించలేదు సుమా!చక్కని సూచన.ధన్యవాదాలు!

      తొలగించండి
  17. ఎద్దిన మీలోక మందునను నీశునసూయలె యంతరించునో
    ఒద్దికగా జనాళి కదనోత్సహ మొప్పగ ముందుకేగునో
    వద్దని త్రోసి పుచ్చకయె వాసిగ సుద్దుల నాలకింతురో
    "తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. "ఎద్దిన మీజగంబునను నీసు..." అనండి.

      తొలగించండి
  18. ఒద్దిక నొకరికినొకరై
    ముద్దుగ కాపురముసేయ మోదముమీరన్
    వృద్ధగు సత్సంతానము
    తద్దినమే శుభములొసగు ధరణిజనులకున్

    ఒద్దికతో జనంబుమన పోరునసూయలు లేకనెమ్మదిన్
    వృద్ధినిజేయగా ధనము పృధ్విని నేతలు లక్ష్యశుద్ధితో
    హద్దులు లేని ప్రేమజగ మంతయునిండగ కేవలంబుగా
    తద్దినమే శుభంబులిడు ధారుణిలోని జనాళికెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణ బాగున్నవి. అభినందనలు.
      'విద్ధి+అగు = వృద్ధి యగు' అవుతుంది. సంధి లేదు. "వృద్ధియగును సదపత్యము" అనండి.
      రెండవ పూరణ మొదటిపాదంలో యతి తప్పింది. సవరించండి

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! తప్పక సవరిస్తాను!

      తొలగించండి
    3. ఒద్దిక నొకరికినొకరై
      ముద్దుగ కాపురముసేయ మోదముమీరన్
      వృద్ధియగును సదపత్యము
      తద్దినమే శుభములొసగు ధరణిజనులకున్


      ఒద్దికతో జనంబుమన నోర్పున నీసును లేకనెమ్మదిన్
      వృద్ధినిజేయగా ధనము పృధ్విని నేతలు లక్ష్యశుద్ధితో
      హద్దులు లేని ప్రేమజగ మంతయునిండగ కేవలంబుగా
      తద్దినమే శుభంబులిడు ధారుణిలోని జనాళికెప్పుడున్

      తొలగించండి
  19. సిద్ధిదునకున్జతుర్దశి,
    పొద్దునకున్సప్తమితిధియు, బొజ్జ ఋభువుకున్
    యుద్దవము జవితి తిధిగద,
    "తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిథియు' అంటే గణదోషం. "సప్తమితిథి" అంటే చాలు.

      తొలగించండి
  20. కం:-
    బద్దకమెల్ల మదమడచి
    బుద్దిని పరిశుద్ధిఁజేయు బుద్ధులబలుకుల్
    పద్ధతిగ యనుకరించిన
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్!!!

    @ మీ పాండురంగడు.
    ౦౪/౦౨/౨౦౧౮

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాండురంగారెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పద్ధతిగ ననుకరించిన" అనండి.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురూజీ ధన్యోస్మి 🙏🙏🙏

      కం:-
      బద్దకమెల్లమదమడచి
      బుద్దిని పరిశుద్ధిఁజేయు బుద్ధులబలుకుల్
      పద్ధతిగ ననుకరించిన
      తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్!!!

      @ మీ పాండురంగడు.
      ౦౪/౦౨/౨౦౧౮

      తొలగించండి
  21. పూర్తిగా 'తద్దినానికే' కట్టుబడాలని రాశా! :-))

    తద్ధినమే మేలెట్లన
    తద్దినమే పెట్టగానె తరముల గృపయే
    తద్దినమే దక్కు దమకు
    "తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్"

    రిప్లయితొలగించండి
  22. హద్దులు మీరి ప్రజలపై
    రుద్దుచు తప్పులు సతతము త్రుళ్ళుచు మను నా
    గద్దరి రాజు గతించగ
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి

  23. కం.
    బద్ద శతృవు నోడించిన
    నద్దినమే విజయ దశమి, యంబిక పూజన్
    శ్రద్ధగ భక్తిగ జేయన్
    తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్ .

    తత్ +దినము = తద్దినము , ఆదినము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శతృవు' కాదు. 'శత్రువు' అనాలి. అందువల్ల అక్కడ గణదోషం. "బద్ధ విమతు నోడించిన" ఆనండి.

      తొలగించండి
  24. ఎద్దినముసూర్యుడగుపడు
    దద్దినమేశుభములొసగుధరణిజనులకు
    న్నిద్దిరసత్యమునమ్ముము
    మద్దులగోపాలకృష్ణ!మహనీయుండా!

    రిప్లయితొలగించండి
  25. మొద్దౌ పెను నిద్దుర విడి
    పెద్దలు సుద్దులు నుడువగ విని, శుద్ధుండై
    యద్దిన మందొద్దికఁగను
    తద్దినమే శుభము లొసగు ధరణిజనులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    2. రామాచార్యులవారి పూరణ భళా రాజిల్లె శోభాకృతిన్

      జిలేబి

      తొలగించండి
  26. విద్దెల నలరి శుభకరపు
    సుద్దులఁ బ్రొద్దును గడపుచు సుఖముగ నుండన్
    ముద్దుగ నిల సమవృష్టి ప
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్


    అద్దము వోలె శుద్ధి యయి యాత్మ విరాజిలఁ బౌరు లెల్లరున్
    వద్దని రాగ మత్సర వివాదము లించుక యంచుఁ బ్రేమతో
    నెద్దిన ముండు దేశ మిఁక నింపుగఁ గయ్యము వీడి శాంతితోఁ
    దద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ అద్భుతంగా ఉంది. 'సమవృష్టి పతద్దినమే..' చక్కని ప్రయోగం.
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. వద్దిక మాయమాటలవి వంచనఁ జేయుట పొట్టకూటికై,
    హద్దులు మీరి కీర్తికి ధనార్జనకై చెడుదారిఁ ద్రొక్కుటల్,
    యద్దినమందుఁ బొంద(అ) పునరావృతమోక్షవివక్ష, దీక్షుడై.
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్రొక్కుటల్+అద్దినము = త్రొక్కుట లద్దినము' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "దారిఁ ద్రొక్కగా। నద్దినమందు..." అందామా?

      తొలగించండి
    2. మీరు సూచించినపదం త్రొక్కుటల్+అద్దినము కాదండి
      త్రొక్కుటల్, యత్+దినము=యద్దినము,ఏ దినమందు మోక్షవివక్షను దీక్షుడై పొందునో
      తద్దినమే శుభములిడు అని భావన.

      తొలగించండి
  28. మిద్దెలలోవసించుచును మెండు ప్రజాధనమారగించుచున్
    గ్రద్దల పోల్కి మానవుల రాక్షస పాలన గాసిబెట్ట నా
    గద్దరి నేతలన్ ప్రజలు కాతరు చేయక నోడ గొట్టినన్
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  29. ఒద్దిక సంపద యొక్కరి
    వద్దనె సమకూడ పేదవారటు పెరిగెన్,
    ముద్దియ సిరి సరిజూచెడు
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
  30. నిద్దురలేచి వెండియును నిద్దురవోయెడు మధ్యమందు తా
    మెద్దులవోలె గీచకులు మించుచు క్రూరతజూపుచుండగన్
    ముద్దియలెట్లుజీవనము మ్రోతురొ,యామృగవాంఛలాగినన్
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పేదవారు' బహువచనం, 'పెరుగెన్' ఏకవచనం. అక్కడ "పేరుగన్" ఆనండి.

      తొలగించండి
  31. ఎద్దిన మందునన్ పతుల నింతులు దూషణ జేయకుందురో...
    ఎద్దిన మందునన్ సతుల నీశులు దాసుల జేయకుందురో...
    ఎద్దిన మందునన్ సఖుల నింటను పేకకు సమ్మతింతురో...
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  32. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    వద్దు+ఇక అనే అర్థంలో 'ఒద్దిక'ను వాడితే దోషమే. అలాకాక 'ఒద్దికతో' చాలు అనే అర్థంలో అయితే దోషం కాదు.

    రిప్లయితొలగించండి
  33. బద్దక మన్నది లేకను
    నిద్దుర నియమాల యందు నిష్టగ జరుగన్ ?
    శ్రద్దా బద్దత నిండిన
    తద్దినమే శుభము లొసగు ధరణీ జనులకున్

    రిప్లయితొలగించండి
  34. పెద్దలు నుడివిన కమ్మని
    చద్దన్నపు ముద్దలె యగు చక్కని సుద్దుల్
    యొద్దికగా బాటింతురొ
    తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్.
    ****లేదా****
    మొదటి పాదం :
    "ఎద్దినమా పెద్దలవగు "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుద్దుల్+ఒద్దిక = సుద్దు లొద్దిక' అవుతుంది. యడాగమం రాదు. "చక్కని నుడుల। న్నొద్దికగా..." ఆనండి.

      తొలగించండి
  35. గు రు మూ ర్తి ఆ చా రి


    ఎద్దిన మందు స్వార్థము - సహించని పాలకు లేలు చుందురో ,

    ఎద్దిన మందునన్ విధి వహింతురొ మంచి ప్రభుత్వ కార్మికుల్ ,

    ఎద్దిన మందునన్ హలికు లెల్ల ఫలోన్నతి చే తరింతరో ,

    ఎద్దిన మందునన్ మతము లెల్లను సైరణ గల్గియుండునో ,

    ఎద్దిన మందున న్ననుభవింతురొ శిక్షల దుష్టవర్గముల్ ,

    ఎద్దిన మందు శాంతియు నహింసయు సీమను విస్తరించునో ,

    తద్దిన మే శుభమ్ము లిడు ధారుణి లోని జనాళి కెప్పుడున్

    { హలికుడు = హాలికుడు ; ఫలోన్నతి = ఉన్నతమైన పంట ; }

    రిప్లయితొలగించండి
  36. ఇప్పుడే అన్నపరెడ్డి వారు ఫోన్ చేసి చీవాట్లు పెట్టారు. ఇందరు చెప్తున్నా నేను మూర్ఖంగా బ్లాగును, వాట్సప్ చూడటం తగని పని. అందువల్ల రెండు మూడు రోజులు దూరంగా ఉంటానని మాట ఇస్తున్నాను.
    నా పరోక్షంలో మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ:

      "దుర్మార్గము గాదు గురుల దూషించినచో"

      👏👏👏🙏🙏🙏👌👌👌

      తొలగించండి
    2. చాల సంతోషము గురువుగారూ!ధన్యవాదములు!
      వాట్సప్ మిత్రులు కావాలంటే వాయిస్ మెయిల్ ద్వారా పూరణలను వినిపించవచ్చు ననుకుంటాను! గురువుగారు మరీ బెంగ పడకుండా!😊😊😊

      తొలగించండి
  37. గురువు గారికి నమస్సులు.శస్త్ర చికిత్సా నంతరము జాగ్రత్తగా వుండాలి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం.

    రిప్లయితొలగించండి
  38. ।పెద్దల మాటల గొప్పగ
    మద్దతు ప లు కు చును మంచి మానిత మొ ప్ప
    న్నోద్ది క నొ న రించం గా
    తద్దినమే శుభ ము లొ సగు ధరణి జనుల కు న్

    రిప్లయితొలగించండి
  39. కందం
    ఎద్దినమున నీ భువిలో
    వృద్ధాశ్రమముల మరచుచు పెద్దల నింటన్
    ముద్దుగ సేవించదరో
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
  40. గురువు గారికి నమస్సులు.
    హద్దులు తెలిసిన మనసుకు
    బుద్ధియు విరిసిన పరిమళ పూబంతులగున్
    శుద్ధికి నిరతము బుద్ధుని
    తద్దినమే శుభము లోసగు ధరణి జనులకున్.

    రిప్లయితొలగించండి
  41. సవరణతో:
    ఎద్దిన మీజగంబునను నీశునసూయలె యంతరించునో
    ఒద్దికగా జనాళి కదనోత్సహ మొప్పగ ముందుకేగునో
    వద్దని త్రోసి పుచ్చకయె వాసిగ సుద్దుల నాలకింతురో
    "తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్"

    రిప్లయితొలగించండి
  42. మీరు రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుని తీరాలి.అది ముఖ్యం!

    రిప్లయితొలగించండి
  43. సవరణతో:
    పెద్దలు నుడివిన కమ్మని
    చద్దన్నపు ముద్దలె యగు చక్కని నుడుల
    న్నొద్దికగా బాటింతురొ
    తద్దినమే శుభములొసగు ధరణి జనులకున్.

    రిప్లయితొలగించండి
  44. ఎద్దినమందుసూర్యుడిలనింపుగగానబడంచునుందునో
    తద్దినమేశుభంబులిడుధారుణిలోనిజనాళికెప్పుడు
    న్నిద్దియసత్యమే సరళ! యీశునినాఙ్ఞనుదాల్చియేసుమా
    యద్దిననాయకుండిలకునారనిగాంతినినిచ్చుచుండెగా

    రిప్లయితొలగించండి
  45. శ్రద్ధా సక్తుల తోడుగ
    బెద్దల బూజించినపుడు బెన్నిధి యగుచున్
    సిద్ధిని యశమును బెంచెడి
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  46. బుద్ధిగ చెప్పిన మాటను
    పద్ధతి గావిని గురువులు పాటించినచో
    వృద్ధి యగునంట మనబ్లాగు
    తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్
    [ మన బ్లాగు జనులకున్ ]

    రిప్లయితొలగించండి
  47. ఉత్పలమాల

    విద్దెల నేర్చి భారతము వేడుకఁ జేయఁగ వ్రాసినంత మీ
    కద్దియు శాంతి గూర్చక నిరంతర బాధ మిగిల్చె నంటిరే! 
    యెద్దిన మందు విష్ణు కథలింపొన గూర్తురొ శాంతినందుచున్
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  48. ఈమారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమస్యా పూరణలో నాలుగు(నలుగురు) గుర్రాల పేర్లు వినబడినవి.గుర్రం సీతాదేవి గారు,గుర్రం ప్రభాకరశాస్త్రి గారు,గుర్రం జనార్దన రావు, డా.గుర్రం హేమంత్

    రిప్లయితొలగించండి
  49. ...........సమస్య
    త ద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    సందర్భము: ఔను కాదు అని రెండుగా స్పందించేది మనస్సే. అలా సుఖ దుఃఖాలకు కారణ మయేది మనస్సే!
    ఇవే ద్వంద్వాలు. అలా స్పందించకుండా వుంటే సుఖదుఃఖాలు రెండూ లేవు.
    పరతత్వంలో రమించేందుకు మనసుకు ఆ దినాన అర్హత కలుగుతుంది. జనాలకు శుభాలు కలుగుతాయి.

    ముద్దుగ భావము లన్నియు
    సద్దుమణిగి రెండు లేని
    సమతా స్థితిలో
    నొద్దికగ నిశ్చలము లగు
    తద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    2 వ పూరణము:

    సందర్భము: ఇష్ట దైవానికి మొక్కి ఆ రోజు పనులు మొదలుపెట్టడం మనకు అనాదిగా వస్తున్న మంచి అలవాటు. దీనిని మరచిపోకుండా వుంటే జనాలకు శుభాలు కలుగుతాయి.

    ఎద్దినము నిష్ట దైవము
    నొద్దికగా మొక్కి పనుల
    నోపిక మీరన్
    ముద్దుగ మొద లిడుచుందురొ
    తద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  50. 3 వ పూరణము:

    సందర్భము: దేవుని యొక్క దయవల్లనే మన కన్ని సుఖాలూ కలుగుతున్నాయి. ఈ విషయం ముందుగా అర్థం కావాలి.
    ప్రభువు కరుణను ముందు గుర్తించాలి. అంతేకాదు. దైవాన్ని కీర్తించగలుగాలి. కీర్తించడంలో తప్పొప్పుల ప్రసక్తి లేదు. సంకీర్తనం నవ విధ భక్తులలో ఒకటి. విశేషమైనది. త్యాగరాజు రామదాసు అన్నమయ్య లాంటి వా రెందరినో తరింపజేసినది.
    అలా సంకీర్తన జరిగిన దినాన జనాలకు శుభాలు కలుగుతాయి.

    ఎద్దినమున నా దేవుని
    సద్దయ గుర్తించి, వాని
    సంకీర్తనమున్
    ముద్దుగఁ జేయంగలమో..
    తద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    రిప్లయితొలగించండి
  51. 4 వ పూరణము:

    సందర్భము: మానవు డెన్నో కర్మలు చేస్తూ వుంటాడు. అవి తనను తీర్చి దిద్దుతా యనుకుంటాడు.
    కాని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అది అగ్నిలాంటిది. హృదయంలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినట్లైతే కర్మ లన్నీ భస్మీ పటలమై పోతాయి.(అంటే అతనికి చేయవలసిన పను లిక వుండవు.)
    జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం..
    త మాహుః పండితం బుధాః
    అని గీత.. జ్ఞానయోగం-19 వ శ్లో.
    అతనినే పండితు డంటారు. ఇంకా..
    సర్వ క ర్మాఖిలం పార్థ!
    జ్ఞానే పరిసమాప్యతే
    అని కూడ. జ్ఞా.యో.33 వ శ్లో.
    అన్ని కర్మలూ జ్ఞానంతో పరిసమాప్త మౌతున్నవి అని భావం. అలా ఐనప్పుడే
    జనాలకు అసలైన శుభాలు కలుగుతాయి.
    ~~
    దిద్దవు కర్మ లి వన్నియు,
    పెద్దది జ్జానాగ్ని, హృదిని
    పెంపొందినచో
    ముద్దుగ దహించుఁ గర్మల..
    త ద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    5 వ పూరణము:

    సందర్భము: గద్ద నెక్కే వా డంటే విష్ణువు. ఎద్దు నెక్కే వా డంటే శివుడు.
    వారిలో ఎవరినైనా సరే భక్తితో కొలిస్తే చాలు.. కోరిక లన్నీ తీరి ఆ దినమే జనాలకు శుభాలు కలుగుతాయి.
    ~~~~~
    గ ద్దెక్కి యెగురు వానినొ..
    యె ద్దెక్కి నడచు నతనినొ..
    యింపుగ గొలువన్
    ముద్దుగఁ గోర్కెలు దీరిన
    త ద్దినమే శుభము లొసగు
    ధరణి జనులకున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  52. ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి

    03-02-2018 నాటి సమస్య కు పూరణ::
    చేదు కొనగ నౌను చెప్ప లేనంతగా
    తెలుగు బావి నుండి తేనియలను
    తిరుగు లేని భాష తెనుగౌను,నీవును
    చేదు ! తెలుగు గొప్ప చెప్ప గలమె?
    ****)()(****

    రిప్లయితొలగించండి

  53. కం:వద్దన్నపనులు చేయక

             హద్దులలో తిరుగ యువత యానందముతో

              నిద్ధరలోమేలగునౌ

               దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    .కం:బద్దకమునువిడి పిల్లలు

           ముద్దుగ తమపనులుతామె మురిపెము తోడన్

           నొద్దికగా చేసుకొనెడి

             దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.



    .కం:విద్దెలు నేర్వక భువిలో

            మొద్దుల వలెతిరుగుచుండ మరిపెము తోడన్

             ముద్దుగ తల్లియు నేర్పన్

             దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    కం:ఎద్దిన మదిమంచి దనుచు

             నొద్దిక గానడుగ పంతులొప్పగ ననె దా

             నిద్ధరలో  ముదమొసగెడు

             దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    కం:నిద్దుర తిండియు మానుచు

           నిధ్ధరలో సతము శ్రీశు ని కొలుచు ప్రజకు

            న్నద్దినమేతిథియైనను

             దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.


    .కం:తద్దినముననే సుతునకు

          నొద్దిక యౌకొలువు దొరక నుత్సాహముతో

         ముద్దుగ పలికెను సతితో

        దద్దినమే శుభమిడునట తథ్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  54. యద్దినమందు చంద్రులిట హాయిగ తీపిగ కౌగలింతురో...
    యద్దినమందు మోడినిట హాయిగ రాహులు కౌగలించడో...
    యద్దినమందు కాంగ్రెసిట హాయిగ తీపిగ మాయమౌనొహో...
    తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్

    రిప్లయితొలగించండి