11, ఫిబ్రవరి 2018, ఆదివారం

గదాబంధ తేటగీతి

హనుమత్ ప్రార్థన 

రమ్ము, రమ్ము, మమ్ముల గాచ రమ్ము, రామ
భక్త! మిమ్ము నమ్ముట దప్పు, పవన జీవ
న! కనుమా, హనుమా! వినుమిక నుత, దయ
నిడి వడి వడిగా వేంచేసి తడవు మమ్ము 

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

2 కామెంట్‌లు:

  1. ప్రయత్నం బాగున్నది కానీ పదాలు అన్నీ ఇరికించినట్లు ఉన్నవి కానీ భావం ధారగా సాగుతున్నట్లు లేదు.. పలు చోట్ల అన్వయ భేదం ఔతోంది. నారద నుత అంటే అర్ధం ఉన్నది.. వినుమిక నుత కి అర్ధం లేదు, రెండూ రెండు పదాలు అందునా తెలుగు -సంస్కృతముల దుష్ట సమాసం.. దయ చేసి అన్యధా భావించ వద్దు.

    రిప్లయితొలగించండి