ఓ శంక. ఈ ఆశ్చర్యార్థకాలూ, ప్రశ్నార్థకాలూ, విరామ చిహ్నాలూ, చుక్కలూ ఇవన్నీ ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్నవేనా.. అలా అయితే తెలుగులో ఇంతకుముందు ఎలాంటి చిహ్నాలుండేవి ☺️
గొలుసుగట్టుగా జిలేబులై వెలుగు చుండేవి ఒక్క ముక్కా అర్థం గాక :) 1870s ప్రాంతములలో పబ్లిష్ చేయబడిన పుస్తకాలను చూస్తే ఒక్క చుక్క కామా తప్పించి ఒక్క ముక్కా అర్థం కాలే :)
విట్టుబాబు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఇక విరామ చిహ్నాల గురించి.... ఇప్పుడు మనం వాడుతున్న రకరకాల విరామ చిహ్నాలు ఇంగ్లీషునుండి స్వీకరించినవే. పూర్వం తెలుగులో(నే కాక భారతీయ భాషలన్నింటిలో) విరామ చిహ్నాలు లేవు. వాక్యాంతంలో ఒక నిలువు గీతను (|) వ్రాసేవారు. అంతే!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2594 సమస్య :: *మీసములన్ గనంగ గలమే యిక మేదిని నెందు గాంచినన్.* మీసములను ఈ భూమియందు ఎక్కడైనా చూడగలమా? అనేది ఈ సమస్య లోని విరుద్ధమైన అర్ధం. సందర్భం :: అవధాన ప్రపంచంలో జంటకవులుగా విరాజిల్లిన తిరుపతి వేంకట కవులను ప్రశంసిస్తూ సంబోధిస్తూ మీ సములను అంటే మీతో సమానమైనవారిని చూడగలమా అని పలికే సందర్భం.
ధీసముపేత! రాజనుత! తిర్పతి శాస్త్రి వరేణ్య! బ్రోవు మీ వే, సురరూప! చెళ్లపిళ వేంకటశాస్త్రి వరేణ్య! కావుమా! భాసుర చర్ల బ్రహ్మయకు భక్తి ప్రపత్తుల శిష్యు లౌచు , వా ణీ సము లౌచు , పద్యముల నిత్యము జెప్పుచు నాశు ధారలన్, మీసము సంస్కృతాంధ్రముల మేమె కవీంద్రుల మంచు బెంచుచున్, మీ సుకవిత్వ ధారలను మించ వధాన విధాన వైఖరిన్ , వాసి నిరక్షరాస్యు లిల వర్ధిలుచుండిరి యక్షరాస్యులై , భాసితు లక్షరాస్యు లిక భవ్య కవీశ్వరు లైరిగా , కవుల్ చేసిరిగా వధానముల , శ్రీయుతు లెందరొ శిష్యు లైరిగా , వ్రాసిరి మిమ్ము గూర్చి మది రంజిల నాంధ్రులు,వెల్గినారుగా శ్రీ సతి జేర , రాజ గణ సేవల నేనుగు నెక్కినార , లే దోసము లేనివారలయి , తుష్టి సదా బహుమాన కీర్తులన్ రాసులుగాగ గొన్న కవిరాజులు మీరలు, మీకు మ్రొక్కెదన్ *మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందు గాంచినన్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-2-2018)
మిత్రులు సత్యనారాయణరెడ్డి గారి సూచనతో శంకరాభరణము గురించిన నా అనుభవాలను తెలుగువెలుగు సంపాదకులకు వ్రాసితిని. కాని దురదృష్టవశాత్తూ అది పంపుటకు వీలు కాలేదు! గురువుగారు అనుమతిస్తే యిక్కడ ప్రచురిస్తాను!
ఆర్యా! నమస్కారము! నేను తెలుగు అభమానిని, తెలుగువెలుగు పాఠకురాలిని. మీరు శంకరాభరణము బ్లాగుపైఒక సమీక్ష నిర్వహిస్తున్నట్లు మిత్రుల ద్వారా తెలిసినది! బహు సంతోషమైనది! దానిని గురించిన నా అనుభవాలను మీతో పంచుకో దలచి ఈ క్రింది లేఖ వ్రాయుచున్నాను. దయతో పరిశీలించగలరు.
శ్రీమాన్ కందిశంకరయ్యగారు గత పది సంవత్సరముల నుండి నిర్వహిస్తున్న” శంకరాభరణం - సమస్యాపూరణం” అనే బ్లాగు అద్భుతమైనది. దీనిలో నేను 2017 జనవరినుండి పద్యములు వ్రాయడము మొదలు పెట్టితిని. నేను,అర్ధశాస్త్రములో డాక్టరేటు చేసి, నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకురాలిగా 35 సంవత్సరములు పనిచేసి విశ్రాంత జీవితము గడుపుచున్నాను. తెలుగు భాష, సాహిత్యమనిన మిక్కిలి మక్కువ. ఇది వరలో కొంత ఛందోబద్ధము కాని కవిత్వము వ్రాసిన అనుభవమున్నది కాని ఛందోబద్ధమైన పద్యరచన శంకరాభరణములో చేరిన పిదపే అలవాటయినది. మా అన్నయ్య డా। ప్రభాకరశాస్త్రిగారి ద్వారా బ్లాగు పరిచయమైనది. ఈ బ్లాగులో మా గురువుగారు శ్రీ శంకరయ్యగారు ప్రతిరోజూ ఒక సమస్యను యిస్తారు. కొన్నిసార్లు దత్తపదులూ, వ్యస్తాక్షరి, వర్ణనలూ కూడ యిస్తారు. సభ్యులంతా యెంతో ఉత్సాహంగా పోటాపోటీగా, వైవిధ్యమైన పూరణలు చేస్తారు. గురువుగారు ప్రతిపూరణనూ క్షుణ్ణంగా , గణాలు, ప్రాస, యతి, వ్యాకరణాంశాలను పరిశీలించి, దోషాలను గుర్తించడమేగాక సరియైన పూరణనుకూడ సూచిస్తారు. పూరణలో విషయము, పదలాలిత్యము, వర్ణన, పదగుంభన, విరుపులు, నానార్ధాలు యిత్యాదులన్నింటినీ గుర్తిస్తూ ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తారు!
ఈ విషయంలో వారు చాల సరళత్వాన్ని చూపుతారు! లోపాలను చూపే విధానము కూడ అద్భుతంగా ఉంటుంది! పూరణ బాగున్నది, అభినందనలు అంటూనే, ఫలానచోట తప్పున్నది సవరించమని సున్నితంగా చెప్తారు. ప్రతిరోజూ యెంతో ఓపికగా రాత్రి పొద్దుబోయేనరకూ పూరణలను సమీక్షిస్తారు! ఈ బ్లాగులో లబ్ధప్రతిష్ఠులైన కవులతో పాటు ప్రతిభాపాటవాలున్న అనేకమంది కవులూ, ఔత్సాహిక కవులూ అందరూ పాల్గొంటారు! అందరూ యెంతో స్నేహపూర్వకంగా, ఒకరినొకరు అభినందిస్తూ, సవరిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారు! మాకు ప్రతిరోజూ ఒక కవిసమ్మేళనమే! వ్యాకరణము, ఛందస్సు, పురాణ, కావ్యాలకు సంబంధించిన అనేక విషయాలపై ఉపయుక్తమైన చర్చలు జరుగుతూ ఉంటాయి. అంతరించిపోతున్న తెలుగు పద్యాన్ని, అవధాన ప్రక్రియలను పునరుద్ధరించడంలో ఈ బ్లాగు నిర్వాహకులు” శ్రీమాన్ కందిశంకరయ్య “గారి కృషి బహుధా శ్లాఘనీయము! “నభూతో నభవిష్యతి”! ఈ బ్లాగులో పద్యరచనలో ప్రాధమిక దశలో చేరిన అనేకమంది కవుల పద్యాలు నేడు ఆకాశవాణి హైదరాబాదు వారి సమస్యాపూరణ కార్యక్రమంలో చదవబడుతున్నవనిన ఆ ఘనత యంతయు మా గురువుగారికే దక్కుతుంది! ఇప్పటికి 2593 సంఖ్యలో ఈ బ్లాగులో సమస్యలివ్వ బడినవి! ఇది గిన్నిస్ బుక్ లోనికెక్కదగినది! ఇన్ని సంవత్సరముల నుండి ఒక్కరోజు కూడ క్రమం తప్పకుండా, అత్యవసర పనులున్నా, అనారోగ్యంగా ఉన్నా, ప్రయాణాలలో ఉన్నా సమస్యలివ్వడము మానరు! ఒకరోజు పద్యాలను సమీక్షించకున్నా వారికి తోచదు! సభ్యులకూ తోచదు! ఇదొక పుష్పక విమానము వంటిది! కొత్త సభ్యులకు శంకరాభరణం యెప్పుడూ స్వాగతము పలుకుతూనే ఉంటుంది. సభ్యులసంఖ్య పెరగడమే గాని తరగడం ఉండదు! సంవత్సరాల తరబడి యిందులో పూరణలు చేసే కవులున్నారు! మిక్కిలి స్నేహభావముతో నడిచే అద్భుమైనదీ బ్లాగు! ఇందులో భాగస్వామినైనందుకు యెంతో సంతోషిస్తున్నాను!
సీతాదేవి గారూ, మీరు మెయిల్ అడ్రస్ తప్పుగా టైప్ చేశారు. అందుకే వెళ్ళలేదు. teluguvelugu@ramojifoundation.org ఇందులో . తర్వాత org ముందు స్పేస్ ఇచ్చారు. స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయాలి.
అవునండీ! కాని @ దగ్గరకూడ చిన్న జాగా వచ్చింది! ఇప్పుడు వెంటనే పంపాను! వెళ్ళింది! సమయము మించినదేమో! అయినా పంపగల్గినందుకు చాల సంతోషముగ నున్నది! ధన్యవాదములు! 🙏🙏🙏🙏🙏
తెలుగువెలుగు అనగా ఈనాడు ఫౌండేషన్ రామోజీరావుగారు నడిపే మాసపత్రిక! తెలుగును ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి మంచి శీర్షికలతో వ్యాసాలు, కధలు, కవితలు, సమీక్షలతో మంచి విలువలున్న పత్రిక! తప్పక చదువదగినది! అంతర్జాలంలో కూడ మీకు దొరకవచ్చును!
చేరి కొద్ది రోజులే అయినా శంకరాభరణం గురించి, శంకరయ్య గారి గురించి సమగ్రమైన సమీక్ష చేసి సీతాదేవి గారు తేనెతెలుగుమీద, పద్యసాహిత్యం మీద తమకు గల మక్కువను చక్కగా చాటుకున్నారు. అభినందనలు.
శాస్త్రి గారూ క్షమించాలి. తొందర పడి నోరు జారాను మీ సాధికారత తెలియక. మీ వంటి గురువుకు శిష్యులైన వారు ధన్యులు. అట్టి శిష్యుని గురువులైన మీరు మరింత పూజనీయులు. నమస్సులు.
మిస్సన్న గారూ నేనే క్షంతవ్యుడను. నేనే ముందుగా చెప్పియుండినచో బాగుండేది.
ఆ రోజులలో ఖరగ్పూరుకి చాలా కొద్దిమంది తెలుగు విద్యార్థులు వచ్చేవారు. నా పదిమంది క్లాసులో తనొక్కడే. అందుచేత కొద్దిగా అభిమానం. అన్ని ప్రైజులూ మెడల్సూ తనవే. IAS పరీక్షలో మొదటి స్థానం తెచ్చుకున్న వెంటనే అది పనిగా ఖరగ్పూరుకు వచ్చి మా అందరినీ కలిసి సంతోషపరచిరి.
ఆ తరువాత వారి ఉన్నత స్థాయిల గురించీ వార్తా పత్రికలో చదువుట మాత్రమే.
మా బోటి ఉపాధ్యాయులు నిచ్చెనల లాటి వారు. ఎక్కడ వేస్తే అక్కడే! కానీ వందల వేల విద్యార్థులూ (విద్యార్థినులూ) మమ్మలను ఎక్కుచూ స్వర్గము చేరెదరు. కొద్ది మంది వారి వారి పాత నిచ్చెనలను గుర్తు తెచ్చుకుంటారు అప్పుడప్పుడూ. చాలా మంది పై అంతస్థు చేరాక క్రింది నిచ్చెనలను మరచెదరు. వారి దృష్టి ఎల్లప్పుడూ పైనే ఉంటుంది... 😊😊😊
సీతా దేవిగారూ...చక్కగా విశ్లేషించారు...నేనుకూడా గతంలో తెలుగు వెలుగు వారికి శంకరాభరణం గురించి వివరిస్తూ భ్లాగుగురించి పత్రికలో వ్రాయమని కోరాను.వారు పూర్తి డృష్టి పెట్టినట్లు లేదు ఇప్పుడైనా స్పందించి ప్రత్రికలో ప్రచురిస్తారని బావిస్తున్నాను.
భాసిత ధైర్య ము న్ గలిగి వైరుల పీచమ డం చి రాణి గా వాసిగ కాకతీయ రమ వైభవము న్ గడు విస్తరించ గా చేసి తి వమ్మరుద్ర మ విశిష్ట ము గా పరి పాలనoబున న్ మీ సము ల న్ గన oగగలమే యిక మేదిని నెం దు గాంచిన న్
మీ అమూల్యమైన సూచనకు ధన్యవాదములు మీ రన్నట్లు రోషమే సరి యైనది. అంతే కాకుండ ఇంకో మార్పు గమనించ మనవి. మూడవపాదంలో "జంటకవిపాటవరోషముకున్" బదులు"యుగ్మకవిపాటవరోషముకున్"గా గమనించ ప్రార్థన.
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ధన్యవాదములు. గురుసమానులు శ్రీ పోచిరాజు వారికి నమస్సులు. త్రిమూర్తులలో గల మీకు మిగతా వారు సమానము కాదు అని నా భావన. అన్వయం కుదరక పోతే సవరణను సూచించిన వినయంగా దిద్దుకొందునని మనవి.
సందర్భానుసారంగా 14/8/2014 న నేను తెలుగు వెలుగు వారికి పంపిన "ఈ మెయిల్ పోస్టు" ఇక్కడ ఉంచుతున్నాను.
ఆర్యా ! నమస్కారములు.మీరు ' తెలుగు ' వెలిగించుటకు చేయు ప్రయత్నము ఎంతో ప్రశంసనీయం.తెలుగు పద్యము అంతరించకుండా శ్రీ కందిశంకరయ్య గారు తన ' శంకరాభరణం ' బ్లాగు ద్వారా గత ఐదు సంవత్సరములుగా రొజుకొక్క సమస్యను ఇచ్చి ఎందరో కవులుగా మారి పద్యరచన చేయుటలో విజయంసాధించారు.ఇప్పటికే బ్లాగు వీక్షకులు ఏడు లక్షల పైచిలుకుగా అయినారు.ప్రతిరోజూ ఒక సమస్య చొప్పున ఇప్పటికి 1500 పైగా సమస్యలను ఇచ్చినారు..ఎందరో కవులు ప్రతిరోజూ అదిఒక వ్యాపకముగా తమపూరణలు చేస్తునారు. ప్రతి దినమూ కొన్ని వందలమంది దేశవిదేశాల్లొ ఉన్న సాహిత్యాభిమానులు దీనిని వీక్షిస్తూ ఉంటారు.నాకు తెలిసి కనీసం తెలుగు బ్లాగులోకంలో ఇది ఒక ' రికార్డే '. తెలుగు అభివృద్ధి కొరకు పాటు పడిన ఎందరిగురించో మీపత్రికలో పరిచయంచేస్తూ ఉంటారు.ఫలాపేక్ష లేకుండా తెలుగు పద్య రచనా యజ్ఞాన్ని కొనసాగిస్తున్న వారి ఆశయానికి మరింత ప్రాచుర్యము కలిగించి తెలుపద్యాన్ని నిలబెట్టడంలో మీరు చేసే ప్రయత్నము మరింత వెన్నుదన్నుగా ఉంటుందని నా అభిప్రాయము. కనుక kandishankaraiah.blogspot.com బ్లాగును ఒకపరి పరిశీలించి తగినంత ప్రోత్సాహమును మీ తెలుగు వెలుగు పత్రిక ద్వారా కల్పించ వలెనని కోరుకొను చున్నాను.
రోసమునకు చిహ్నములై
రిప్లయితొలగించండిమీసములే సొబగుఁ గూర్చు మేటి మగలకున్
బోసినవుల పసివానికి
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.
రిప్లయితొలగించండిమా అయ్యరు గారి సమానులు గలరే భువిలో :)
ఓ సామీ ! అయ్యరు గా
రూ ! సత్యము! మా జిలేబి రూఢిగ మీరే !
వీసము కూడా చేయము,
మీ, సములన్ గనఁగఁ గలమె మేదినియందున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోసము మాయంబయ్యెను;
రిప్లయితొలగించండికాసులు లెక్కించి బ్రతుకు కాలము నందున్
తోసము తోడన్ బారెడు
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్?
తోసము = సంతోసము
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోసము నకుప్రతీక యనుచు
రిప్లయితొలగించండివాసిగ పెంచెద రుతొల్లి వాల్ల భ్యమునన్
వేసము నకుసొగ సైనవి
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "రోసమునకు చిహ్న మనుచు" అందామా?
రోసము నకుచిహ్నమనుచు
తొలగించండివాసిగ పెంచెద రుతొల్లి వాల్ల భ్యమునన్
వేసము నకుసొగ సైనవి
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభక్త పోతన మహాకవీ ! !! 🙏
బాసకు వన్నెయై , సహజపాండితికిన్ నిలువెత్తు రూపమై,
చేసియు సేద్యమున్ కవికృషీవల యంచు ప్రశస్తిఁబొంది శ్రీ..
హాసుని చిన్నికృష్ణుని కథామృతమున్ వెలయింప తెల్గులో
మీ *సములన్* గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
భక్తకవి పోతనకు సాటి లేరన్న మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆస పడు నెండుటెముకకు
తొలగించండిగ్రాసమనుచు , కూడుఁ బెట్ట కాళుల కడ వి
శ్వాసము జూపెడి కుక్కకు
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అహో! విశ్వాసపు శునకమునకు పట్టము! 👌👌👌👌👌
తొలగించండి
రిప్లయితొలగించండిజై బోలో గురు మహారాజ్ కీ
చేసిరి శంకరాభ రణ సేవను మీదగు రీతి లోనయా
వాసము జేరి సత్కవులు వాసిని రాసిని పెంచి రయ్య! సా
వాసము పేర్మి గా బడసి వాహిని యై వెలసెన్ బిరాదరీ !
మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!
చీర్స్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిశత సహస్ర వందనాలు!
రిప్లయితొలగించండిరోసము తోడ బల్కితివి రో! తెలగాణను తెచ్చినావయా !
మా సము లెవ్వ రో యనుచు మాటలు తేనియ లూరగానయా
చేసిరి భాష పెంపు నకు చేవను గూర్చు మహాసభాస్థలిన్ !
మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!
చీర్స్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోసము లంతరిం చినవి రూఢిగ రూకల కోసమై భువిన్
రిప్లయితొలగించండిమోసము నందు దేలుచును మోక్షము గోరుచు స్వప్న లోకమున్
వేసము మార్చినన్ మరల వేడుక మీరగ నీచబుద్ధి తో
మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(సహస్రావధాన సార్వభౌములు మేడసాని,మాడుగుల,గరికిపాటుల గురించి)
రిప్లయితొలగించండిసేసలు జల్లగన్ సభల జిత్రపు కైతల మోహనార్యుడా!
మోసులువారు భావముల ముద్దగు నాగఫణీంద్రశర్ముడా!
బాసలు వానలై కురియు బంగరుపల్కుల నారసింహుడా!
మీ సములన్ గనంగగలమే యిక మేదిని నెందుగాంచినన్.
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండిరోసము గాను గొట్టె తొడ రొమ్ముల చీల్చుచు శాత కర్ణియై !
వేసెను చెంప పెట్టు నటవే యభిమానిని గాంచి ద్రిప్పుచున్
మీసములన్, గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
రాసులు పోసి నట్టి మన రాష్ట్రపు నేతల తీరు తెన్నులన్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండినటుడు, శాసనసభ్యుడు అయిన బాలకృష్ణను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికం.
మీసము భారతమందే!
యాసియ,పాశ్చాత్య పురుషులాననమందే
మీసము గలదాచోటన్
మీసములన్ గనగ గలమె మేదినియందున్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయ దోషం ఉన్నట్టుంది.
బాసకు సేవఁ జేయుటను బాధ్యతగా తలపోసి మీరలీ
రిప్లయితొలగించండిభాసుర శంకరాభరణ బ్లాగును స్థాపనఁ జేసి దానినే
శ్వాసగ మార్చుకొంటిరిగ శంకరు మాష్టరు గారు మీకు స్వా
మీ! సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్(చంద్రునికో నూలుపోగు ..తప్పులుంటే క్షమించండి మాష్టారూ)
సూర్యనారాయణ గారూ,
తొలగించండివైవిధ్యమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు!
మీసములే చిహ్నమనిరి
రిప్లయితొలగించండిరోసమున కదేమి హవ్వ! రూఢిగ నిలలో?
వాసిగ నే స్త్రీ కైనను
"మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్"
ఓ శంక.
తొలగించండిఈ ఆశ్చర్యార్థకాలూ, ప్రశ్నార్థకాలూ, విరామ చిహ్నాలూ, చుక్కలూ ఇవన్నీ ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్నవేనా.. అలా అయితే తెలుగులో ఇంతకుముందు ఎలాంటి చిహ్నాలుండేవి
☺️
తొలగించండిగొలుసుగట్టుగా జిలేబులై వెలుగు చుండేవి ఒక్క ముక్కా అర్థం గాక :) 1870s ప్రాంతములలో పబ్లిష్ చేయబడిన పుస్తకాలను చూస్తే ఒక్క చుక్క కామా తప్పించి ఒక్క ముక్కా అర్థం కాలే :)
జిలేబి
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇక విరామ చిహ్నాల గురించి.... ఇప్పుడు మనం వాడుతున్న రకరకాల విరామ చిహ్నాలు ఇంగ్లీషునుండి స్వీకరించినవే.
పూర్వం తెలుగులో(నే కాక భారతీయ భాషలన్నింటిలో) విరామ చిహ్నాలు లేవు. వాక్యాంతంలో ఒక నిలువు గీతను (|) వ్రాసేవారు. అంతే!
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏🏻
@Zilebi గారూ
తొలగించండి😁
గ్రాసము లేక స్రుక్కియు , జరాకృశమయ్యు, విశీర్ణమయ్యు, సా
రిప్లయితొలగించండియాసమునయ్యు, నష్టరుచి యయ్యను, బ్రాణభయార్తమైన , ని
స్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయగా
మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!
...నేటి రాజరాజసింహములు 👆
అయ్యబాబోయ్! కలువల కాసారంలో సింహ గర్జనలు!! 👌👌👌👌
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
(గురువును మించిన శిష్యులంటే మీరే!)
🙏🙏🙏👏👏👏🌹🌹🌹😂😂😂
తొలగించండి
తొలగించండిఅయ్యా !
దీని భావమేమి ¡!!!!!
నిస్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు !
జిలేబి
నాకేం తెలుసు!... భర్తృహరిని కానీ ఏనుగు వారిని కానీ అడగండి... మా పని (విద్యార్థి దశలో) రుబ్బి రుబ్బి పరీక్షలో కక్కడమే...:)
తొలగించండినిస్త్రాస = నిర్భయంగా ఉన్న; మద+ఇభ = మదించిన ఏనుగుయొక్క; కుంభ పిశిత = కుంభస్థలంలోని మాంసాన్ని; గ్రహ = పొందాలనే; లాలస = మిక్కిలి కోరిక గల; శీల = గుణం కలిగి; స + ఆగ్రహ + అగ్రేసర = కోపంతో కూడి ముందుకు సాగడంలో; భాసమానమగు = ప్రకాశించే; కేసరి = సింహం; జీర్ణతృణంబు = ఎండుగడ్డిని; మేయగా....
తొలగించండిజీపీయస్ వారికి పద్మార్బుత ప్రణామాలు.
తొలగించండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.........
😊
తొలగించండిదోసము గాదది తీసిన
రిప్లయితొలగించండిమీసములన్; గనగలమె మేదినియందున్
రోసము గూర్చెడి బారెడు
మీసము లేనట్టి రొయ్య మీనపుజాతిన్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2594
సమస్య :: *మీసములన్ గనంగ గలమే యిక మేదిని నెందు గాంచినన్.*
మీసములను ఈ భూమియందు ఎక్కడైనా చూడగలమా? అనేది ఈ సమస్య లోని విరుద్ధమైన అర్ధం.
సందర్భం :: అవధాన ప్రపంచంలో జంటకవులుగా విరాజిల్లిన తిరుపతి వేంకట కవులను ప్రశంసిస్తూ సంబోధిస్తూ మీ సములను అంటే మీతో సమానమైనవారిని చూడగలమా అని పలికే సందర్భం.
ధీసముపేత! రాజనుత! తిర్పతి శాస్త్రి వరేణ్య! బ్రోవు మీ
వే, సురరూప! చెళ్లపిళ వేంకటశాస్త్రి వరేణ్య! కావుమా!
భాసుర చర్ల బ్రహ్మయకు భక్తి ప్రపత్తుల శిష్యు లౌచు , వా
ణీ సము లౌచు , పద్యముల నిత్యము జెప్పుచు నాశు ధారలన్,
మీసము సంస్కృతాంధ్రముల మేమె కవీంద్రుల మంచు బెంచుచున్,
మీ సుకవిత్వ ధారలను మించ వధాన విధాన వైఖరిన్ ,
వాసి నిరక్షరాస్యు లిల వర్ధిలుచుండిరి యక్షరాస్యులై ,
భాసితు లక్షరాస్యు లిక భవ్య కవీశ్వరు లైరిగా , కవుల్
చేసిరిగా వధానముల , శ్రీయుతు లెందరొ శిష్యు లైరిగా ,
వ్రాసిరి మిమ్ము గూర్చి మది రంజిల నాంధ్రులు,వెల్గినారుగా
శ్రీ సతి జేర , రాజ గణ సేవల నేనుగు నెక్కినార , లే
దోసము లేనివారలయి , తుష్టి సదా బహుమాన కీర్తులన్
రాసులుగాగ గొన్న కవిరాజులు మీరలు, మీకు మ్రొక్కెదన్
*మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందు గాంచినన్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-2-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమనోజ్ఞమైన పూరణ మీది. అభినందనలు.
ధ్యాస మరల్పక కనులను
రిప్లయితొలగించండిమూసి పరాత్పరునిఁగొల్చి మురిపెము మీరన్
భాసిలు గురువర!పూజ్యులు!
మీ సములన్ గనగ గలమె మేదినియందున్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండికోసల దేశపు రాజు గ
రిప్లయితొలగించండివాసిగ పాలించి మీరు వర్ధిల్లoగా
భా సి తు లై తి రి రామా !
మీసము ల న్ గన గ గల మె మే ది ని యందు న్ ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాసిగ తమ కవనముతో
రిప్లయితొలగించండిమీసము మెలివేసి జేయు మీదగు పద వి
న్యాసముతో నలరించెడి
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులకు సభక్తితో అంకితం!
రిప్లయితొలగించండిహాసము మోమునందమర హాయిగ మ్రింగుచు కష్టనష్టముల్
దోసము లెంచకన్నొరుల దోస్తుల బెంచుచు నెల్లకాలమున్
వాసము సాహితీవనము వాసిగ బెంచగ పద్యసూనముల్
దేశము కాలముల్ దొలగ దీక్షను బూనిన శంకరాఖ్యులౌ
మీ సములన్ కనంగ గలమే నిక
మేదిని నెందుగాంచినన్!
పద్యము మీరు పెట్టిన భిక్షయే!🙏🙏🙏🙏🙏🙏🙏
ఇచ్చట మీరు "తెలుగు వెలుగు"కు వ్రాసిన వ్యాసము జోడించండి...
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిస్తుతిరూపమై, అతిశయోక్తులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు!
ధన్యవాదములు గురుదేవా! అతిశయోక్తి యెంతమాత్రము లేదు! 🙏🙏🙏
తొలగించండిమిత్రులు సత్యనారాయణరెడ్డి గారి సూచనతో శంకరాభరణము గురించిన నా అనుభవాలను తెలుగువెలుగు సంపాదకులకు వ్రాసితిని. కాని దురదృష్టవశాత్తూ అది పంపుటకు వీలు కాలేదు! గురువుగారు అనుమతిస్తే యిక్కడ ప్రచురిస్తాను!
తొలగించండిగురువు గారి అనుమతి అవసరం లేదు... వారికి నచ్చని వ్యాఖ్యలను తొలిగించే వసతి వారికి ఉన్నది కదా! ప్రచురించండి...తప్పు లేదు...ఇదే తరుణం...
తొలగించండిteluguvelugu@ramojifoundation. org
తొలగించండిఆర్యా! నమస్కారము!
నేను తెలుగు అభమానిని, తెలుగువెలుగు పాఠకురాలిని. మీరు
శంకరాభరణము బ్లాగుపైఒక సమీక్ష నిర్వహిస్తున్నట్లు మిత్రుల ద్వారా తెలిసినది! బహు సంతోషమైనది! దానిని గురించిన నా అనుభవాలను మీతో పంచుకో దలచి ఈ క్రింది లేఖ వ్రాయుచున్నాను. దయతో పరిశీలించగలరు.
శ్రీమాన్ కందిశంకరయ్యగారు గత పది సంవత్సరముల నుండి నిర్వహిస్తున్న” శంకరాభరణం - సమస్యాపూరణం” అనే బ్లాగు
అద్భుతమైనది.
దీనిలో నేను 2017 జనవరినుండి పద్యములు వ్రాయడము మొదలు పెట్టితిని. నేను,అర్ధశాస్త్రములో డాక్టరేటు చేసి, నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకురాలిగా 35 సంవత్సరములు పనిచేసి విశ్రాంత జీవితము గడుపుచున్నాను. తెలుగు భాష, సాహిత్యమనిన మిక్కిలి మక్కువ. ఇది వరలో కొంత ఛందోబద్ధము కాని కవిత్వము వ్రాసిన అనుభవమున్నది కాని ఛందోబద్ధమైన పద్యరచన శంకరాభరణములో చేరిన పిదపే అలవాటయినది.
మా అన్నయ్య డా। ప్రభాకరశాస్త్రిగారి ద్వారా బ్లాగు పరిచయమైనది. ఈ బ్లాగులో మా గురువుగారు శ్రీ శంకరయ్యగారు ప్రతిరోజూ ఒక సమస్యను యిస్తారు. కొన్నిసార్లు దత్తపదులూ, వ్యస్తాక్షరి, వర్ణనలూ కూడ యిస్తారు. సభ్యులంతా యెంతో ఉత్సాహంగా పోటాపోటీగా, వైవిధ్యమైన పూరణలు చేస్తారు. గురువుగారు ప్రతిపూరణనూ క్షుణ్ణంగా , గణాలు, ప్రాస, యతి, వ్యాకరణాంశాలను పరిశీలించి, దోషాలను గుర్తించడమేగాక
సరియైన పూరణనుకూడ సూచిస్తారు. పూరణలో విషయము, పదలాలిత్యము, వర్ణన, పదగుంభన, విరుపులు, నానార్ధాలు యిత్యాదులన్నింటినీ గుర్తిస్తూ ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తారు!
ఈ విషయంలో వారు చాల సరళత్వాన్ని చూపుతారు! లోపాలను చూపే విధానము కూడ అద్భుతంగా ఉంటుంది! పూరణ బాగున్నది, అభినందనలు అంటూనే, ఫలానచోట
తప్పున్నది సవరించమని సున్నితంగా చెప్తారు. ప్రతిరోజూ యెంతో ఓపికగా రాత్రి పొద్దుబోయేనరకూ పూరణలను సమీక్షిస్తారు!
ఈ బ్లాగులో లబ్ధప్రతిష్ఠులైన కవులతో పాటు ప్రతిభాపాటవాలున్న అనేకమంది కవులూ, ఔత్సాహిక కవులూ అందరూ పాల్గొంటారు! అందరూ యెంతో స్నేహపూర్వకంగా, ఒకరినొకరు అభినందిస్తూ, సవరిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారు! మాకు ప్రతిరోజూ ఒక కవిసమ్మేళనమే! వ్యాకరణము, ఛందస్సు, పురాణ, కావ్యాలకు సంబంధించిన అనేక విషయాలపై ఉపయుక్తమైన చర్చలు జరుగుతూ ఉంటాయి.
అంతరించిపోతున్న తెలుగు పద్యాన్ని, అవధాన ప్రక్రియలను పునరుద్ధరించడంలో ఈ బ్లాగు నిర్వాహకులు” శ్రీమాన్ కందిశంకరయ్య “గారి కృషి బహుధా శ్లాఘనీయము! “నభూతో నభవిష్యతి”!
ఈ బ్లాగులో పద్యరచనలో ప్రాధమిక దశలో చేరిన అనేకమంది కవుల పద్యాలు నేడు ఆకాశవాణి హైదరాబాదు వారి సమస్యాపూరణ కార్యక్రమంలో చదవబడుతున్నవనిన
ఆ ఘనత యంతయు మా గురువుగారికే దక్కుతుంది!
ఇప్పటికి 2593 సంఖ్యలో ఈ బ్లాగులో సమస్యలివ్వ బడినవి! ఇది గిన్నిస్ బుక్ లోనికెక్కదగినది! ఇన్ని సంవత్సరముల నుండి ఒక్కరోజు కూడ క్రమం తప్పకుండా, అత్యవసర పనులున్నా, అనారోగ్యంగా ఉన్నా, ప్రయాణాలలో ఉన్నా సమస్యలివ్వడము మానరు! ఒకరోజు పద్యాలను సమీక్షించకున్నా వారికి తోచదు! సభ్యులకూ తోచదు!
ఇదొక పుష్పక విమానము వంటిది! కొత్త సభ్యులకు శంకరాభరణం యెప్పుడూ స్వాగతము పలుకుతూనే ఉంటుంది. సభ్యులసంఖ్య పెరగడమే గాని తరగడం ఉండదు! సంవత్సరాల తరబడి యిందులో పూరణలు చేసే కవులున్నారు!
మిక్కిలి స్నేహభావముతో నడిచే అద్భుమైనదీ బ్లాగు! ఇందులో భాగస్వామినైనందుకు యెంతో సంతోషిస్తున్నాను!
ధన్యవాదములతో
డా। జి. సీతాదేవి
నెల్లూరు
సీతాదేవి గారూ,
తొలగించండిమీరు మెయిల్ అడ్రస్ తప్పుగా టైప్ చేశారు. అందుకే వెళ్ళలేదు. teluguvelugu@ramojifoundation.org ఇందులో . తర్వాత org ముందు స్పేస్ ఇచ్చారు. స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయాలి.
అవునండీ! కాని @ దగ్గరకూడ చిన్న జాగా వచ్చింది! ఇప్పుడు వెంటనే పంపాను! వెళ్ళింది! సమయము మించినదేమో! అయినా పంపగల్గినందుకు చాల సంతోషముగ నున్నది!
తొలగించండిధన్యవాదములు! 🙏🙏🙏🙏🙏
నాకే తెలుగు వచ్చియుంటే నేనొక ఖండకావ్యం వ్రాసేవాడిని...
తొలగించండిసీతాదేవిగారూ!
తొలగించండిమీ లేఖ అత్యుత్తమంగా ఉన్నది.
🙏🏻
ధన్యవాదములు విట్టుబాబుగారూ! తప్పులేమీ వ్రాయలేదనుకుంటున్నాను!
తొలగించండి😊😊😊
అన్నయ్యా! ఇప్పటికి సమయమేమీ మించలేదు! త్వరలోనే వ్రాయగలవు!
తొలగించండిపై శార్ధూల గర్జన తరువాత నీకు తెలుగు రాదంటే ఒప్పుతుందా? 🙏🙏🙏🙏
సీతాదేవి గారూ మీ లేఖలో శంకరాభరణాన్ని గురించి కళ్ళకు కట్టినట్లు వివరించారు.ధన్యవాదములు.
తొలగించండి
తొలగించండిజీపీయెస్ వారికి
జిలేబి వారి వడియాల ' కండ ' కావ్యము మీకు యాహూ అంటో స్ఫూర్తి నిస్తోందని ఆశిస్తో :)
లింకు
http://varudhini.blogspot.com/2016/05/blog-post_25.html
చీర్స్
జిలేబి
తొలగించండిసీతా దేవి గారికి
మీ తెలుగువెలుగు లేఖ చాలా బాగుంది !
ఎప్పుడు వస్తుంది ? లింకు నివ్వగలరు
జిలేబి
సత్యనారాయణ రెడ్డిగారూ! మీరు చెప్పబట్టే లేఖ వ్రాయడం జరిగింది! మీకు ముందుగా ధన్యవాదములు!🙏🙏🙏
తొలగించండిజిలేబిగారూ! ధన్యవాదాలు! గడువు 10 వ తారీఖని రెడ్డిగారు చెప్పారు. మరి ఆలస్యం అయిందంటారో యేమో! అంగీకరిస్తే
తొలగించండివచ్చేవారం తెలుగువెలుగులో వస్తుందని చెప్పారు!
తొలగించండితెలుగు వెలుగు అనగా నేమి ?
జిలేబి
తెలుగువెలుగు అనగా ఈనాడు ఫౌండేషన్ రామోజీరావుగారు నడిపే మాసపత్రిక! తెలుగును ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి మంచి శీర్షికలతో వ్యాసాలు, కధలు, కవితలు, సమీక్షలతో మంచి విలువలున్న పత్రిక! తప్పక చదువదగినది! అంతర్జాలంలో కూడ మీకు దొరకవచ్చును!
తొలగించండిచేరి కొద్ది రోజులే అయినా శంకరాభరణం గురించి, శంకరయ్య గారి గురించి సమగ్రమైన సమీక్ష చేసి సీతాదేవి గారు తేనెతెలుగుమీద, పద్యసాహిత్యం మీద తమకు గల మక్కువను చక్కగా చాటుకున్నారు. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిశ్రీ మిస్సన్న గారికి నమస్సులు. చాలా రోజులనుంచీ అడుగుదామని తటపటాయిస్తున్నాను...మీకు మన మాజీ రిసర్వు బ్యాంకు గవర్నరు గారు తెలుసా?
తొలగించండి
తొలగించండిమిస్సన్న గారు పదవీ విరమణకు మునుపు రోజూ కరెన్సీ చెస్టు కి డబ్బుల లెక్క తేల్చనిదే ఆ గవర్నరు గారికి నౌకరీ లేదంటే అతిశయోక్తి కాదు :)
జిలేబి
శాస్త్రిగారికి నమస్సులు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గారు మీకెలా తెలుసో నాకూ అలాగే తెలుసును. ఎటొచ్చీ వారిని ఒకసారి కలవడం మాట్లాడడం మాత్రం జరిగింది.
తొలగించండిసత్యము సుమతి జిలేబీ.
తొలగించండిశ్రీ మిస్సన్న గారూ:
తొలగించండివారు 1967 - 70 లో I I T Kharagpur లో మా విద్యార్థి... ఆ గౌరవం మాది...
సీతా దేవి గారూ అద్భుతంగావ్రాశారు.అభినందనలు 👌🙏🙏🙏
తొలగించండిశాస్త్రి గారూ క్షమించాలి. తొందర పడి నోరు జారాను మీ సాధికారత తెలియక. మీ వంటి గురువుకు శిష్యులైన వారు ధన్యులు. అట్టి శిష్యుని గురువులైన మీరు మరింత పూజనీయులు. నమస్సులు.
తొలగించండిమిస్సన్న గారూ నేనే క్షంతవ్యుడను. నేనే ముందుగా చెప్పియుండినచో బాగుండేది.
తొలగించండిఆ రోజులలో ఖరగ్పూరుకి చాలా కొద్దిమంది తెలుగు విద్యార్థులు వచ్చేవారు. నా పదిమంది క్లాసులో తనొక్కడే. అందుచేత కొద్దిగా అభిమానం. అన్ని ప్రైజులూ మెడల్సూ తనవే. IAS పరీక్షలో మొదటి స్థానం తెచ్చుకున్న వెంటనే అది పనిగా ఖరగ్పూరుకు వచ్చి మా అందరినీ కలిసి సంతోషపరచిరి.
ఆ తరువాత వారి ఉన్నత స్థాయిల గురించీ వార్తా పత్రికలో చదువుట మాత్రమే.
"విద్యా వినయేన శోభతే"
శ్రీధరరావు గారికి ధన్యవాదములు! నమస్సులు!🙏🙏🙏
తొలగించండి
తొలగించండిఈ జీపీయెస్ గారు మిస్సన్న గారు ఇరువురు " వారు వారు" అంటూ ఎవరి గురించి మాట్లాడు కుంటున్నారండి ? ఆ " వారి " పేరేమి ?
జిలేబి
మారుతి కా ప్రభాకరుడు మాలిమితో దయ సేసినట్లు దు
తొలగించండివ్వూరికి మీర లొజ్జ లయి మోదముతో దగ విద్య నేర్పగన్
భూరి యశస్కరుం డగుచు బొందిక ధీనిధియై మహా ధనా
గారపు నేత యౌటలు ప్రకర్షము కాదు ప్రభాకరా! వరా!.
🙏🙏🙏👏👏👏👌👌👌🌹🌹🌹
తొలగించండిజిలేబీ గారూ:
మేకు తెలియనిదేమున్నది ఈ విశాల విశ్వములో?
శ్రీ మిస్సన్న గారి పేరూ "వారి" పేరూ ఒకటే!!!
తొలగించండిఅదురహో! వారే వీరా !
మహాధనాగారపు నేత ! - బాగుందండీ ఈ పదం మిస్సన్న వారు !
చీర్స్
జిలేబి
తొలగించండిఇది జీపీయెస్ వారికి :)
వారే వీరూ! వీరే
వారూ ! వారే యిచట సవాలే లేదోయ్
వేరే యాడా లేరోయ్
సారూ యీడే గలరు మిసైలు జిలేబీ :)
జిలేబి
జిలేబి గారూ పేర్లు మాత్రమే ఒకటి. దువ్వూరి సుబ్బారావు గారు హస్తి అయితే నేను మశకం.
తొలగించండిమా బోటి ఉపాధ్యాయులు నిచ్చెనల లాటి వారు. ఎక్కడ వేస్తే అక్కడే! కానీ వందల వేల విద్యార్థులూ (విద్యార్థినులూ) మమ్మలను ఎక్కుచూ స్వర్గము చేరెదరు. కొద్ది మంది వారి వారి పాత నిచ్చెనలను గుర్తు తెచ్చుకుంటారు అప్పుడప్పుడూ. చాలా మంది పై అంతస్థు చేరాక క్రింది నిచ్చెనలను మరచెదరు. వారి దృష్టి ఎల్లప్పుడూ పైనే ఉంటుంది... 😊😊😊
తొలగించండిఅక్కయ్యగారూ!తెలుగు వెలుగుకు మీరు వ్రాసన లేఖ ప్రశంసనీయముగా నున్నయది. 🙏🙏🙏
తొలగించండిధన్యవాదములు సహదేవుడుగారూ! 🙏🙏🙏🙏🙏
తొలగించండి
తొలగించండిఅచ్చెరు వయ్య మేమిచట బాగడమై నిలిచాము వారికి
న్నిచ్చెన లాంటి వారమయ ! నేతలు నాయకు లయ్యిరయ్య మా
స్వచ్చపు విద్యలన్ బడసి; సన్నిధి పెన్నిధి గాను గాంచగ
న్నిచ్చిరి కొంద రైనను దనివ్వుగ గౌరవమున్ జిలేబులై!
జీపీయెస్ వారికి
జిలేబి
కందం వస్తుందనుకున్నాను... కానీ "ఉత్పలమాల" వేయించారు. నమస్సులు!
తొలగించండి
తొలగించండినిచ్చెనగా నిలిచామట!
మెచ్చుచు నెక్కిరి పయిపయి మెరవణి తారీ
ఫిచ్చుచు హైహై నాయక !
సచ్చితిమి నిలబడుచు మనసార జిలేబీ !
జిలేబి
తొలగించండివచ్చిరి కొందరు గురువుల
కిచ్చుచు మర్యాదలెల్ల కీర్తిని బడయన్
నచ్చగ సౌశీల్యతయు
న్నిచ్చితిమిగ దీవెనలను నిండుగ సుమ్మీ !
జిలేబి
సీతా దేవిగారూ...చక్కగా విశ్లేషించారు...నేనుకూడా గతంలో తెలుగు వెలుగు వారికి శంకరాభరణం గురించి వివరిస్తూ భ్లాగుగురించి పత్రికలో వ్రాయమని కోరాను.వారు పూర్తి డృష్టి పెట్టినట్లు లేదు ఇప్పుడైనా స్పందించి ప్రత్రికలో ప్రచురిస్తారని బావిస్తున్నాను.
తొలగించండిభాసుర కవనము నందున
రిప్లయితొలగించండిమీసరి యో విశ్వనాథ! మీరే గాదే?
యేసుకవి మిము బొగడ దగు?
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(జన్యులోపం వల్ల మీసాలున్న ఆడవాళ్ళు కొందరున్నారు!)
రోసముతోనే బెంచిరి
రిప్లయితొలగించండిమీసములను జంట కవులు మేలుగ జూడ
న్నా సుకవన గురుతులనా
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
కొద్ది తేడాతో :
రిప్లయితొలగించండిరోసముతోనే బెంచిరి
మీసములను జంట కవులు మేలుగ జూడ
న్నా సుకవనమ్ము నిపుడా
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలార్యా!💐
రిప్లయితొలగించండిఏ సినిమా లోనైను
రిప్లయితొలగించండినాసురులకు లేవు జూడ నటులే యువకుల్
వేసము మార్చిరి ;జానెడు
మీసములన్ గనఁగఁ గలమె మేదిని యందున్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లోనైనను" టైపాటు... 'సురలకు' అనాలి.
కాసులు కూడబెట్టినవి క్షౌరము గాగనె, నింటిలోనిదౌ
రిప్లయితొలగించండిగ్రాసము నిండుకొన్నగనె, గ్రక్కున జాబులు కోలుపోవగా,
వీసలు ట్రంపుగారచట పీకుకు పోవగ, సాఫ్టువేరు వౌ
మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
వీస = visa
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సాఫ్ట్ వేర్ మీసాల పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ సరిహద్దులందు హిమమందున వేడిమి వర్ష వేళలన్
రిప్లయితొలగించండిగాసట చెందబోక రిపుకంఠములన్ తెగటార్చి ప్రాణముల్
బాసెడిమీకు వందనము భారతమాతకు ముద్దు బిడ్డలౌ
*మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందు గాంచినన్.*
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమన వీర జవానులను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అద్భుతమైన పూరణ. అభినందనలమ్మా.
తొలగించండిభాసిత ధైర్య ము న్ గలిగి వైరుల పీచమ డం చి రాణి గా
రిప్లయితొలగించండివాసిగ కాకతీయ రమ వైభవము న్ గడు విస్తరించ గా
చేసి తి వమ్మరుద్ర మ విశిష్ట ము గా పరి పాలనoబున న్
మీ సము ల న్ గన oగగలమే యిక మేదిని నెం దు గాంచిన న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేసట చెందెడు రోగుల
రిప్లయితొలగించండిజూసి చికిత్సలను చేసి స్థుతి పాత్రముగన్
పోసెదరు ప్రాణములనటు
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్
భాస్కరమ్మ గారూ,
తొలగించండివైద్యులను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మా" సము లిట్లు లేరనగ మానసమానవిభాసమానమౌ
రిప్లయితొలగించండిమీసముఁ బెంచినార మిక మీరలు రోసముఁ జూపి గెల్చినన్
దీసెద మంచుఁ బల్కు కవితిర్పతివేంకటు లందు నొప్పు నా
మీసములం గనంగఁ గలమే యిక మేదిని యందుఁ గాంచినన్.
రామాచార్య గారూ,
తొలగించండితిరుపతి వేంకట కవులను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ మధ్య సరదాగా రాశా! తప్పొప్పులు చెప్పండి!
రిప్లయితొలగించండి🙏🏻
పాకోపాఖ్యానం
వంటేగా తంటా ప్రతి
యింటా యిది యున్నదేగ యింతులకంతా!
మంటేగా ప్రతి సతికును
యింటాయన సాయమేమి యింతయు లేకన్!!
ఆకూరలు యీకూరలు
చీకూ చింతేమి లేక చేయగమనుచున్
శాకాహారపు కూరల
పాకాలే వండమనుచు పరిమితులిడగా
వంటింట్లో చెమటోడ్చుచు
తంటాలే పడుచునింక తానుండగనే
తుంటరి ముగుడిది గానక
వంటలలో రుచుల గూర్చి వాదము జేయన్
ఝుంకా సొగసున నూగగ
పంకాతో సేదతీరు పతిదేవునితో
వంకాయలు టెంకాయలు
యింకా తేయంది తరుణి యింపుగ తానే
ఉస్సూరని యా మగడే
విస్సున నా విసుగు తోడ వీధిన పడెనే
కస్సూ బుస్సుల తోడనె
లెస్సగ నాకూర దెచ్చి లీలలు జూపెన్
అంతట నాయతివే యిక
పంతమ్ముగ వంటజేసి పతిదేవునికిన్
వంతులుగా వడ్డించగ
శాంతమ్ముగ పొట్టనింప సాంతము దినెనే!
సరసములూ విరసములూ
చిరుబుర్రులు సహజమింక చెలువములవియే
యిరువురికీ యింపేగా
తరించెనుగ జీవితమ్ము తళుకుల తోడన్!
తప్పొప్పుల సంగతి చెప్పలేనుగాని పద్యాలు బాగున్నాయండి
తొలగించండిపద్యాలు బాగున్నవి. కాకుంటే వ్యావహారిక పదాలు చాలా ఉన్నవి.
తొలగించండిధన్యవాదాలు శర్మగారూ
తొలగించండి🙏🏻
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏🏻
మా సము లెవ్వరీ భువిని మానసమానము నెంచి పెంచి రా
రిప్లయితొలగించండిమీసము నంచుఁ బల్కిన నమేయులుఁ దిర్పతివేంకటాఖ్యులై
భాసిలి, రట్లు జంటకవిపాటవరోశముకుం బ్రతీకలౌ
మీసములం గనంగఁ గలమే మేదిని నెందుఁ గాంచగన్.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రోశముకున్'...? "రోషమునకు" అనడం సాధువు. "పాటవ రోషమునం బ్రతీకలౌ" అందామా?
మీ అమూల్యమైన సూచనకు ధన్యవాదములు
తొలగించండిమీ రన్నట్లు రోషమే సరి యైనది.
అంతే కాకుండ ఇంకో మార్పు గమనించ మనవి.
మూడవపాదంలో "జంటకవిపాటవరోషముకున్" బదులు"యుగ్మకవిపాటవరోషముకున్"గా గమనించ ప్రార్థన.
వేసరకు చూచి వీటిని
రిప్లయితొలగించండినీసను జెందకు మదృష్ట హీన యయినచో
నే సతికిని మోచేతిని
మీసములం గనఁగఁ గలమె మేదినియందున్
ఆసను రాఁ జతుర్దశ సహస్ర వరాసురులన్ వధించి వే
ద్రోసితి వీవు ఘోర ఖర దూషణ దైత్యుల నంత కావికిన్
భాసిత భాస్కరాన్వయ నభస్తిలకా రఘువంశ వర్ధనా
మీ సములం గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "...నీసును జెందకు" అని ఉండాలనుకుంటాను.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈసు (ఈర్ష్య) కాదండి. ఈస (అసహ్యము) నే వాడితిని.
నిజమే... తొందరపడ్డాను. మన్నించండి.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమస్సులు. అంత మాట ననకండి.
తొలగించండిమీసములను తీసెద మిక
రిప్లయితొలగించండిమా సము లెవరున్న కవన మందున ననుచున్
వాసిగ జంట కవులనిరి ;
మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్ ?
వాసిగ బెంచి మీసముల , భాషలు సంస్కృత మాంధ్ర మందునన్
మా సములున్న చో కవన మందున రండిక పోరు సల్పగా
తీసెద మాదు మీసములు , తేలగ నోటమి నంచు బల్కిరే !
మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచాలా బాగుందండీ
జిలేబి
వేషము సాటిలేనిది, ప్రవేశము గొంటివి రెండు భాషలన్,
రిప్లయితొలగించండిభీషణ మైన ధారణము, వెల్గెద వీవవ ధానవిద్యలో,
దోసములన్ సహించవిల, దోయిలి నే ఘటియించి చెప్పెదన్
“మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్”
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమైనంత వరకు విశేష ప్రాసల ప్రయోగం చేయకండి.
వాసము పరాయి దేశము
రిప్లయితొలగించండివేషమ్మును మారిపోయె ప్రేమ నశించెన్
రోషమ్ముడిగెను, పూర్వపు
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్ ?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేసమ్మును... రోసమ్ముడిగెను..." అనవచ్చు కదా!
ఆసలమయమీలోకమె
రిప్లయితొలగించండియాసలులేనట్టినరుడెయగుపడడెచట
న్నాసలపల్లకివీడిన
మీసములన్ గనగలమెమేదినియందున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చరవాణి నిటుల్" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిసవరించిన పూరణ :
బాసల బేధము లేకను
శాసించఁగ జనులనెల్ల చరవాణి నిటుల్
జేసిన మార్టిన్ కూప!
మీమీ సములను గనఁగఁ గలమెమేదినియందున్
మీసము గడ్డము ముఖని
రిప్లయితొలగించండివాసము మగవాడి యందు పౌరుష చిహ్నం
కోసమె!యవి విడ నాడిన ?
మీసములన్ గనగ గలమె?మేదిని యందున్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'చిహ్నం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. సవరించండి.
కం.
రిప్లయితొలగించండిఆ సాహిత్య వనములో
పూసిన విరులను సమస్య పూరణ పద్యా
లాసాంతము గమనించుట
మీ "సములన్ గనగ గలమె? మేదినియందున్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
రోసపు గుర్తుగా మొలచు!రోదనబెంచుచు నాలిజాలితో
రిప్లయితొలగించండివాసము జేయ మోసమున?వాడి కివేలముఖానముఖ్యమా
దోసిలి సాచికట్నమును దోరగగైకొను వారి కేల నన్
మీసములన్ గనంగగలమే? యిక మేదిని నెందు గాంచినన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభాసురమగు పద్యములను
వాసిగ వ్రాయుచు సతతము వసుధా స్థలిలో
దాసుండను భారతి కను
మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్"
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకర గురువర్యులకు ప్రణామ శతములతో..............
రిప్లయితొలగించండిప్రాస యతుల్ గణంబులు స్థిరంబుగ దెల్పి తదేక దీక్షతన్
ధ్యాస దొలంగనీక ననయంబు సమస్యలఁ గూర్చి కావ్య వి
ద్యా సముపార్జనల్ గలుఁగఁ బ్రేరణ నిచ్చిన సద్గురూత్తమా!
మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
శ్రీ శంకర భగవత్పాదులకు నమస్సులతో........
ఈసువిశాల భారత మహీతలమందున నెంచి చూడ సం
త్రాస దురాగతంబగు మతంబులు పెచ్చరిలన్ వరిష్ట స
న్న్యాసివి గాగ వచ్చి ఘన హైందవ రక్షణ జేసి కాచితే
మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
తొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారు
అద్భుతమండీ రెండు వాటికవియే సాటి !
జిలేబి
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా శంకర భగవత్పాదులను ప్రస్తావించిన రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జిలేబి గారికి ధన్యవాదములు.
తొలగించండిధన్యోస్మి గురువర్యా.
త్రాసపడరె కత్తి, గుబురు
రిప్లయితొలగించండిమీసములన్ గనఁగఁ! గలమె మేదినియందున్
ఆసన పదవీచ్యుతియూ
వాసికి నెక్కించుటయును వాడిగ జేయున్ ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మేదినిలో నా। యాసన పదవీచ్యుతియున్" అనండి.
మీ సములెవ్వరు ప్రతిభన?
రిప్లయితొలగించండిమీసము దిప్పే మగాడు మీకెదురగునా?
మీసము దిప్పుము గురువా
మీ సములన్ గనగ గలమె మేదినియందున్
యస్వీయార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ప్రతిభను... ద్రిప్పు మగవాడు..." అనండి.
రిప్లయితొలగించండిఆసకురాల! కోమలియ నాధుని గట్టిగ జుట్టి ద్రిప్పుచున్
మీసములన్ గనంగగలమే, యిక మేదిని నెందు గాంచినన్
హాసము లొల్కు పద్యముల హావణి! జేజి జిలేబి ! మాలినీ
లాసము లేల నమ్మ! విను లాగరి యొగ్గి సుమా నిజమ్మకో :)
ஜிலேபி
జిలేబీ గారూ,
తొలగించండిநல்ல பூரணம். அபிநந்தநகளு.
সুন্দর
తొలగించండి
తొలగించండిगम्डुगोल् हुवा नाय् :)
ज़िलेबी
ఉత్పలమాల మాలిక
రిప్లయితొలగించండిమోసితె వేద సంపదల మోదమునన్ బ్రళయాన మత్స్యమై
యా సుధ నంద మందరను నాపితె సాగరమందుఁ గూర్మమై
వాసురముద్ధరించితివె బంగరుకంటిని గూల్చి దంష్ట్రివై
భాసుర నారసింహునిగ బాలుని బ్రోవఁగ దైత్యుఁ గూల్చితే
ఆసగ నేల మూడడుగు లందితె నా బలిఁ ద్రొక్కి పొట్టివై
రాసము లాడితే పరశురాముగ క్షత్రియ గర్వ నాశివై
కోసల రాముడై ధరణిఁ గొట్టితె రావణు ధర్మమూర్తివై
తోసమునంద గీతనిడి దుష్టులఁ ద్రుంచితె కృష్ణమూర్తివై
ఆసలె దుఃఖ కారణమటంచును బుద్ధిని పెంచితే భువిన్
భాసిల జేయ సత్యయుగ పాలన కల్కిగ ఖడ్గమెత్తితే
దాసుల బ్రోవనెంచి యవతారము లెత్త త్రిమూర్తులందునన్
మీ సములన్ గనంగ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
అద్భుతమైన పూరణ! ఆ నీలోత్పల దేహునికి చక్కని ఉత్పలమాలికను సమర్పించారు! అభినందనలు!🙏🙏🙏🙏🙏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణను ప్రశంసించుటకు మాటలు దొరకడం లేదు. ఎంత మనోహరంగా, ఉత్తమంగా చెప్పారు! అభినందనలు. వందనశతం!
సహదేవుఁడు గారు మహాద్భుతమైన పద్యమును ప్రసాదించినారు. అభినందనలు.
తొలగించండిచిన్న సవరణ మవసర మనిపించుచున్నది. త్రిమూర్తులలో సముఁ డన నేమి సాక్షాత్తు విష్ణు మూర్తియే కలడు కదా.
సహదేవుడు గారూ....అద్భుతంగా ఉన్నది అందుకోడి మా అభినందనోత్పల మాలిక.
తొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ధన్యవాదములు.
తొలగించండిగురుసమానులు శ్రీ పోచిరాజు వారికి నమస్సులు.
త్రిమూర్తులలో గల మీకు మిగతా వారు సమానము కాదు అని నా భావన. అన్వయం కుదరక పోతే సవరణను సూచించిన వినయంగా దిద్దుకొందునని మనవి.
అప్పుడు “ద్విమూర్తులందునన్” అన్న సరిపోవును. లేదా “మహాద్భుతమ్ముగన్” ను కూడా పరిశీలించండి.
తొలగించండిధన్యవాదములు సర్ 🙏🙏🙏
తొలగించండిసవరిసవ పూరణ
తొలగించండిఉత్పలమాల మాలిక
మోసితె వేద సంపదల మోదమునన్ బ్రళయాన మత్స్యమై
యా సుధ నంద మందరను నాపితె సాగరమందుఁ గూర్మమై
వాసురముద్ధరించితివె బంగరుకంటిని గూల్చి దంష్ట్రివై
భాసుర నారసింహునిగ బాలుని బ్రోవఁగ దైత్యుఁ గూల్చితే
ఆసగ నేల మూడడుగు లందితె నా బలిఁ ద్రొక్కి పొట్టివై
రాసము లాడితే పరశురాముగ క్షత్రియ గర్వ నాశివై
కోసల రాముడై ధరణిఁ గొట్టితె రావణు ధర్మమూర్తివై
తోసమునంద గీతనిడి దుష్టులఁ ద్రుంచితె కృష్ణమూర్తివై
ఆసలె దుఃఖ కారణమటంచును బుద్ధిని పెంచితే భువిన్
భాసిల జేయ సత్యయుగ పాలన కల్కిగ ఖడ్గమెత్తితే
దాసుల బ్రోవనెంచి యవతారము లెత్త మహాద్భుతమ్ముగన్
మీ సములన్ గనంగ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్
రిప్లయితొలగించండిభాసురమగు పద్యములను
వాసిగ వ్రాయుచు సతతము వసుధా స్థలిలో
దాసుండను భారతి కను
మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్"
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదోసములేని విధంబున
వాసిగ పద్యసమస్యలు పాటించుటలో
మాసటివౌ కంది గురూ!
మీ సములన్ గనగ గలమె మేదిని యందున్?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
భాసురమగునటు పద్యపు
రిప్లయితొలగించండివాసిని బెంచుచు కవులకు వన్నెలు దిద్దన్
దోసిలిదె శంకరార్యుడ!
మీ సములన్ గనగ గలమె మేదిని యందున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
వేసము భారతీయ యతి, పెద్దలు కంచి పురాన దివ్యమౌ
రిప్లయితొలగించండియీసు మఠమ్మునన్, పరమమే తమ ధర్మపు బోధ, వీడి కై
లాసము నేలపై దిగిన రాజధరా! దయలోన మీకు స్వా
మీ! సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్.
(కంచి పరమాచార్యులపై )
పరమాచార్యులవారికీ మిస్సన్నగారికీ 🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిఅమ్మా మీ సహృదయతకు జోతలు.
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఈశు మఠము'ను 'ఈసు మఠము' అన్నారు. ఈశునకు వికృతి ఈసుడు కాదు.
మంచి మఠం అనే అర్థంలో "ఈ + సుమఠంబు" అనవచ్చు.
తొలగించండిభాసురమైనభామలునుబావనమూర్తులునైననున్భళా
రిప్లయితొలగించండిమీసములన్గనంగగలమేయికమేదినినెందుగాంచినన్
మీ,సములన్గనన్వశమెమేదురమందునశంకరార్యుడా
యీసహపాటికిన్గరుణనీయగవేడుమ శంకరున్దగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఓసారెంటీయారూ
రిప్లయితొలగించండిమీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్
వేసము కృష్ణుని రూపున
మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిసమస్య పాదాన్ని రెండు విధాలుగా ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వేసము కృష్ణుని రూపున
రిప్లయితొలగించండిమీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.
ఓసారెంటీయారూ
మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్
బాసయె మెచ్చెడు రీతిన్
రిప్లయితొలగించండిప్రాసలతో మధురమైన భావమ్ములతో
వాసిగ పద్యము లల్లెడు
మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికాసులు ఖర్చగు ననియెడు
క్లేశ ము నొందక జగతిన కించిత్తైనన్
మోసము చేయకనొసగెడి
మీ సములన్ గనగ గలమె మేదిని యందున్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమైనంతవరకు విశేష ప్రాసలను ప్రయోగించకండి.
రిప్లయితొలగించండిజీపీయెస్ వారి శిష్యుల ప్రతిభ !
మీసము లేకన్ "దువ్విరి"
కోశా గారపు నిధులకు కొండగ నండై !
వాసిగ నిల్చిరి రావుల్
మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!
జిలేబి
రిప్లయితొలగించండిమీసములన్ద్రువ్వుమయా
వాసిగ సంపెంగినూనె పద్మముఖి జిలే
బీ సరసముగా రాయన
మీ సములన్ గనఁగఁ గలమె మేదిని యందున్!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములతో సవరించిన పూరణ:
రిప్లయితొలగించండివేసము భారతీయ యతి, పెద్దలు కంచి పురాన శైలసం
వాసు మఠమ్మునన్, పరమభావము నిత్యము బోధ, వీడి కై
లాసము నేలపై దిగిన రాజధరా! దయలోన మీకు స్వా
మీ! సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్.
మిస్సన్న గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సందర్భానుసారంగా 14/8/2014 న నేను తెలుగు వెలుగు వారికి పంపిన "ఈ మెయిల్ పోస్టు" ఇక్కడ ఉంచుతున్నాను.
రిప్లయితొలగించండిఆర్యా ! నమస్కారములు.మీరు ' తెలుగు ' వెలిగించుటకు చేయు ప్రయత్నము ఎంతో ప్రశంసనీయం.తెలుగు పద్యము అంతరించకుండా శ్రీ కందిశంకరయ్య గారు తన ' శంకరాభరణం ' బ్లాగు ద్వారా గత ఐదు సంవత్సరములుగా రొజుకొక్క సమస్యను ఇచ్చి ఎందరో కవులుగా మారి పద్యరచన చేయుటలో విజయంసాధించారు.ఇప్పటికే బ్లాగు వీక్షకులు ఏడు లక్షల పైచిలుకుగా అయినారు.ప్రతిరోజూ ఒక సమస్య చొప్పున ఇప్పటికి 1500 పైగా సమస్యలను ఇచ్చినారు..ఎందరో కవులు ప్రతిరోజూ అదిఒక వ్యాపకముగా తమపూరణలు చేస్తునారు. ప్రతి దినమూ కొన్ని వందలమంది దేశవిదేశాల్లొ ఉన్న సాహిత్యాభిమానులు దీనిని వీక్షిస్తూ ఉంటారు.నాకు తెలిసి కనీసం తెలుగు బ్లాగులోకంలో ఇది ఒక ' రికార్డే '. తెలుగు అభివృద్ధి కొరకు పాటు పడిన ఎందరిగురించో మీపత్రికలో పరిచయంచేస్తూ ఉంటారు.ఫలాపేక్ష లేకుండా తెలుగు పద్య రచనా యజ్ఞాన్ని కొనసాగిస్తున్న వారి ఆశయానికి మరింత ప్రాచుర్యము కలిగించి తెలుపద్యాన్ని నిలబెట్టడంలో మీరు చేసే ప్రయత్నము మరింత వెన్నుదన్నుగా ఉంటుందని నా అభిప్రాయము. కనుక kandishankaraiah.blogspot.com బ్లాగును ఒకపరి పరిశీలించి తగినంత ప్రోత్సాహమును మీ తెలుగు వెలుగు పత్రిక ద్వారా కల్పించ వలెనని కోరుకొను చున్నాను.
(ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెసు బీజెపి చేసిన అన్యాయం చెబుతూ)
రిప్లయితొలగించండిచేసిరి తప్పిదమ్మొకటి చీకటి మాటున జీల్చి రాష్ట్రమున్;
మోసము జేసిరిర్వురును ముచ్చట గొల్పెడి ఆంధ్రజాతికిన్;
వేసము నందునన్ కపట వియ్యము నందున
ఆరితేరుచున్;
మీ సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!