15, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2598 (అనలమ్మే సుమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో"
(లేదా...)
"అనలమె సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీభువిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు రామమోహన రావు గారికి ధన్యవాదాలు.

68 కామెంట్‌లు:

  1. కనివిని యెరుగని రీతుల
    తినుబండారమ్ములుండ తిరుమల చెంతన్
    వన భోజనమున మెండుగ
    ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!

    అనలము = జఠరాగ్ని

    రిప్లయితొలగించండి
  2. అనయమ్మాకలి పెనగొని
    మనిషిని దహియించు చుండు మహిలో, తరిలో
    కొను భోజనమ్ముతో జిత
    యనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    రిప్లయితొలగించండి
  3. కినుకవహించిన యాడది
    యనిలమ్మే సుమ్మి, చల్లనైనది యిలలో
    గన కన్నతల్లి మనసు
    ఘన మౌ శ్వేతాద్రికన్న కడుశీతలమౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారికి నమస్సులు:

      మీ పూరణలో సమస్యా పాదమున టైపాటు...

      తొలగించండి

  4. అనలాక్షి! చంచలాక్షీ !
    త్రినయన! లలితా !శకాక్షి ! త్రిగుణాత్మక క
    ల్పనయై వెలిగెడు జీవపు
    అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!

    జిలేబి వారి ట్యాగు లైన్ తెలుగులో కంద పాదమా ? :)
    Postings by Zilebi- When its Hot its Really Cool ™

    రిప్లయితొలగించండి
  5. వనమందు నతరుల ఛాయల
    మనమం దరుకల సిమెలసి మంగళ కరమౌ
    మనసున కోరిన వంటలు
    అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    రిప్లయితొలగించండి



  6. మనసున నమ్మితిన్ శివుని మాలతి యై మనువాడ భర్తగా
    త్రినయన చంచలాక్షి గను తీరుగ గాన్పడ నాది శక్తియై
    వినుమయ తండ్రి! వెండిమల ! వింగడ మై సయి యాదియోగి కై
    యనలమె సుమ్మి చల్లన, మహాహిమశైలము వేడి యీభువిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    🙏జై జవాన్ !..👏👏. జయహో సైనికా ! 🙏

    జనహితమెంచి , సైనికులచంచల దీక్షవహించి , దుష్టులన్
    దునుమగ పౌరుషమ్మచట దోచును ! బోల్చగ పౌరుషాగ్నితో
    ననలమె సుమ్మి చల్లన .,! మహాహిమశైలము వేడి యీ భువిన్
    గనుగొన వారి నిశ్శ్వసనగాఢతఁ,! జేతులనెత్తి మ్రొక్కుడీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భర్తృహరి...

      వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్క్షణాత్
      మేరుస్స్వల్పశిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే !
      వ్యాలో మాల్యగుణాయతే , విషరసః పీయూషవర్షాయతే
      యస్యాంగేఖిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి !!.....

      ఘన గుణ శీలవంతునకు గాలువయౌను మహాబ్ధి , మేరువున్
      గనుగొన చిన్న రాయి యగు , గన్పడు సింహము జింకపిల్లగా ,
      గన విసమౌ సుధారసముగా నగు ,
      పాములె పూలమాలలౌ
      ననలమె సుమ్మి చల్లన! మహా హిమశైలము వేడి ఈ భువిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  8. (రాణి పద్మావతి ఆత్మార్పణం)
    ఘనుడగు మేవాడ్ రతనుని
    మనసుమగువ పద్మకు ఖలమతి యల్లా యు
    ద్దినుఖిల్జి మదము నణప
    న్ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (అగ్ని ప్రవేశ సీత )
      వినయము నిండిన కన్నుల
      తన కరుణ కనపడనీని ధర్మున్ రామున్
      గనుగొని నిట్టూర్చు సీత
      కనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో .
      ధన్యవాదాలు ప్రసాద్ గారూ !

      తొలగించండి
  9. తన కంటి మంటశివునికి
    అనలమ్మేసుమ్మి !చల్లనైనదియిలలో
    మనసున భక్తిగ దలచగ ?
    కనులలొ కారుణ్యముంచు కరుణామయుడై!

    రిప్లయితొలగించండి
  10. మనసు తదేకదృష్టిఁ గొని మార్పు వహించని ధ్యాననిష్ఠతో
    "అనలము సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీ భువిన్
    గనుగొన వచ్తు" నంచనినఁ గాని శరీరము స్పర్ష నొంది స్పం
    దనపరిణామచిహ్నములఁ దాల్చదొ? యట్లు ద్వగింద్రియమ్మునన్.

    రిప్లయితొలగించండి
  11. వినుమిది!ప్రగతికి మూలము
    కనగ న్నినుడు వెదజల్లు కాంతియు మరియున్;
    మనమే కరుణను నిండగ;
    ననలమ్మే సుమ్మి!చల్ల నైనది యిలలో!
    ****)()(****
    (మనమే = మనసే )

    రిప్లయితొలగించండి

  12. మనమున శాంత తత్వమును,మర్మము లేని ఋజుప్రవర్తనం
    బును,కనకాదులందతడు పూనడు బంధ మధర్మ మార్గులన్
    చెనకగ రుద్రుడౌను,నిరసించు కుయుక్తుల-చెప్పనొప్పగున్
    అనలమె సుమ్మి చల్లన,మహా హిమశైలము వేడి యీభువిన్

    రిప్లయితొలగించండి
  13. మన్నున్ బోలిన నన్ను మిన్నదయ సమ్మానించి ప్రేమమ్ముతో
    చెన్నౌకైతల వ్రాయు నట్లు సతమున్ చెయ్యందచేయంగ నే
    నెన్నోపద్యములన్ లిఖించితిని మీనిర్దేశ మార్గమ్మునన్
    నన్నీసుస్థితికిన్ మరల్చితిరి మాన్యా వందనల్మీకివే

    రిప్లయితొలగించండి
  14. అనయ ము తన వేడి మి తో
    జనుల కు కడు సాయ పడుచు జగతి ని వెలు గు న్
    వినియోగించెడి రీతి
    న్న న ల మ్మేసు మ్మి చల్ల నైన ది యిలలో

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2598
    సమస్య :: *అనలమె సుమ్మి చల్లన, మహా హిమ శైలము వేడి యీ భువిన్.*
    అగ్ని చల్లగా ఉంటుంది, మంచుకొండ వేడిగా ఉంటుంది అని చెప్పడం ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సీతమ్మను అప్పజెప్పి శ్రీరాముని శరణు వేడు అని రావణునికి హితోపదేశం చేసిన ఓ హనుమంతుడా ! లంకలోని రాక్షసులు నీ తోకకు నిప్పు పెట్టినా ఆ అగ్ని అణుమాత్రమైనా నిన్ను కాల్చలేదు. నీవు నీ మనస్సులో అఖండంగా రామనామాన్ని జపిస్తూ ఉండటమే అందుకు కారణం. రామ నామ మహిమ అంటే ఇదే గదా. భక్తుల యోగక్షేమాల కోసం అగ్ని చల్లనైనదిగా మారుతుంది. మంచుకొండ వెచ్చదనాన్ని కలిగియుంటుంది అని రామనామమహిమను గుఱించి విశదీకరించే సందర్భం.

    వినక హితమ్ము రావణుడు వేగమె తోకకు నిప్పు బెట్టగా
    ననలము గాల్చదయ్యె నణు వంతయు ని న్నట నంజనాసుతా !
    ఘన తర రామ నామము నఖండముగా జపియించు చుండుటన్
    మనమున, రామ నామ మహిమ మ్మిది , భక్తుల కిట్లగున్ సదా
    *అనలమె సుమ్మి చల్లన, మహా హిమ శైలము వేడి యీ భువిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (15-2-2018)

    రిప్లయితొలగించండి
  16. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్.. శ్రియమిచ్ఛేత్ హుతాశస... అను ఆర్యోక్తి ప్రకారం,సంపద అగ్నిదత్తము.. అట్లాంటి అగ్ని, శివుని మూడవ నేత్రం. కాబట్టి,శివుని మూడవ కన్ను వల్ల సంపద కలుగుతుంది. భువిలో సంపద కామ్యమే కదా... ప్రపంచంలో మిగిలిన అగ్నులన్నీ తాపము కల్గిస్తాయి. కానీ, ఈ హరనేత్రాగ్ని మాత్రం సంపదలనే చల్లదనాన్ని ఇస్తుంది..

    అనఘుని ఘనతను భక్తితొ
    గనరండి, విడువక బేసికన్నులవాడిన్
    జనులుగనఁ శ్రియమమరుగా
    అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    (రోజూ పద్యం రాసి చేతులు దులిపేసుకునేవాణ్ణి. ఈరోజు ఇంత టైపుచేసేసరికి హరుడు కనిపించాడు. 7:20~7:45. ఒక్క రోజుకే నాకిలావుంటే, మరి కోటాశేఖరంవారు రోజూ పుంఖానుపుంఖాలు ఎలా టైపు చేస్తారో ??! 🙏🙏)

    రిప్లయితొలగించండి
  17. జనకుని యాగమునకు పిలు
    వనిపేరంటముగ బోయి పాటునుబడగా
    ఘన యవమానము దీర్చ
    న్ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనఘుని జీరకన్ జనకుడావహమున్
      దల పెట్ట నంబయే
      వినకనె నాథు వాక్కుల నభీష్టమనస్క
      త బోవనాతృతన్
      ఘన యవమానమున్నెదుర క్రన్నన వీడ దలంచ దేహము
      న్ననలమె సుమ్మి చల్లన మహా హిమ శైలము వేడి యీభువిన్

      తొలగించండి
    2. మనమున శాంతిని కోరెడు
      మునివరులకు ముక్తినీయ ముంగోపము కా
      ముని జంపిన శివనేత్రా
      ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!

      తొలగించండి
  18. మన ఆకలి తీర్చినవారిని చల్లనైన వారని అంటుంటాం కదా! అలాగే....

    ఘనమో భోజనముండిన
    మన యాకలి దీరునుకద మనసుకు తృప్తౌ
    అనరే ప్రొయ్యిన వెలిగెడి
    "అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో"

    రిప్లయితొలగించండి
  19. మననము జేయగన్ హితుడు మానవ కోటికి నప్పుడిప్పుడన్;
    మనసుకు హాయి గొల్పుచును మన్నన బొందెడు పండు వెన్నెలే;
    మనుగడ సాగ దీయుటకు మంచిగ తోడ్పడు మిత్రులన్బలెన్;
    "అనలమె సుమ్మి ; చల్లన ; మహాహిమశైలము,వేడి యీభువిన్"
    ****)()(****
    (మూడవ పాదానికి వివరణ:ప్రకృతిలో సమతౌల్యతకు,మానవ మనుగడకు అటు హిమశైలాలు,యిటు వేడి రెండూ తోడ్పడుతాయి.)

    రిప్లయితొలగించండి
  20. వనమున జేరగా జనులు పండుగ కార్తిక మాసమందునన్
    కనుగొని నేతిగారెలును కమ్మని దోసెలు జొన్నరొట్టెలున్
    తినుటకు మిర్చిబజ్జులును తియ్య జిలేబులు లడ్డులుండగా
    యనలమె సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీభువిన్

    అనలము = జఠరాగ్ని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అదురహో ఆహా వనాః భోజనమ్ము వింతైన వంటకమ్ము :)


      వయసు 'పాకాన ' పడుతోంది :)
      పాకం వయసును లాగేస్తోంది :)


      జిలేబి

      తొలగించండి
    2. "జిలేబులు" చేర్చడానికి కొంచెం కష్టపడ్డాను :)

      తొలగించండి
  21. తనయులు వర్ధిల్లుటకై
    యనయము దురితముల నడ్డి యాదుకొనెడి యా
    జనకునిదౌ కోపమనెడి
    "అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!"

    రిప్లయితొలగించండి
  22. *కనుగొనలేక సాధనను కంఠములోతుసమస్యలందునన్*
    *తనువలవాటుచెందిన విధానమునందున నోర్మి పెర్గుచున్*
    *మనముసుఖాలదుఃఖముల మాటున శీతనిదాఘ మెంచకన్*
    *అనలమెసుమ్మిచల్లన మహాహిమశైలము వేడిఈ భువిన్*

    రిప్లయితొలగించండి
  23. *కనుగొనలేక సాధనను కంఠములోతుసమస్యలందునన్*
    *తనువలవాటుచెందిన విధానమునందున నోర్మి పెర్గుచున్*
    *మనముసుఖాలదుఃఖముల మాటున శీతనిదాఘ మెంచకన్*
    *అనలమెసుమ్మిచల్లన మహాహిమశైలము వేడిఈ భువిన్*

    రిప్లయితొలగించండి
  24. అనుభవమున కవి నుడివెను
    ననయము సంగమము కన్న నప్పుడపుడునే
    గొనసాగెడు విరహ మనెడి
    యనలమ్మే సుమ్మి!చల్ల నైనది యిలలో.

    రిప్లయితొలగించండి
  25. ఆఁ నలంపుకన్ను దె ర చి యు
    మును కొ ని కడ తేర్చు ఖ లుని ముక్క oటివేసన్
    అనయ ము కొ లి చె డు వారికి
    య నలమ్మేసుమ్మిచల్ల నైన ది యి లలో

    రిప్లయితొలగించండి
  26. ప్రహ్లాదుని వర్ణించు పద్యము (హోళికా దహనం)
    "తన తండ్రి మాటలు వినక
    మనమున ధరేశు మననము మానని ,నారా
    యణుని, కమలాక్షు భక్తుల
    ననలమ్మే సుమ్మి చల్లనైనది ఇలలో"

    రిప్లయితొలగించండి
  27. దినమున రెండు పెట్టెలవి దీటుగ నీటుగ కాల్చు రోజులన్
    పనిబడి క్యాలిఫోర్నియకు పంపగ ఫ్లైట్న పదైదు గంటలున్
    మునిగి పొగాకు జ్వాలలన ముందుగ దూకుచు పెట్టె తీయగా
    యనలమె సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీభువిన్

    అనలము = అగ్గిపుల్ల

    రిప్లయితొలగించండి
  28. ననుఁ గాదని చెలి వెడలగ
    మనసును దహియించుచున్న మంటలకంటెన్
    తనువునుఁ జితిపై కాల్చెడి
    యనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    రిప్లయితొలగించండి


  29. వినదగని పల్కు లెల్లయు
    ననలమ్మే సుమ్మి! చల్లనైనది యిలలో
    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతన్వేగుపడక వివరము గానన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  30. అనురా గోద్యాన వనినిఁ
    జను ప్రియులకు శారదేందు చంద్రిక మదికిం,
    గనలెడు తరి విరహములో
    ననలమ్మే సుమ్మి, చల్ల నైనది యిలలో


    పని గొని ముక్క ముక్కలుగఁ బల్కుట మక్కువ యైన వానినిం
    గని యొక ప్రశ్న వేసె నొక గౌరవనీయుఁడు వేగఁ దెల్పుమా
    యనలము మంచు గుబ్బలికి నంతర మేమి యనంగఁ బల్కెఁ దా
    ననలమె సుమ్మి, చల్లన మహా హిమ శైలము, వేడి యీ భువిన్

    రిప్లయితొలగించండి
  31. వినుబడబాగ్నియునరయగ
    ననలమ్మేసుమ్మి,చల్లనైనదియిలలో
    ననురాగపుటమ్మమనసె
    యనయముశీతాద్రియటులెయద్రిజకంటెన్

    రిప్లయితొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దినకరుని కూడి యున్నది
    యనలమ్మే సుమ్మి!; చల్లనైనది యిలలో
    జనులకు నా భగవానుడు
    ననామయ మొనర్చుచు నిడు నాశాసనమున్

    రిప్లయితొలగించండి
  33. అనలమెసుమ్మిచల్లనమహాహిమశైలమువేడియీభువి
    న్ననలముదాకుచోదెలియునార్యుడ!చల్లనయౌనొనుష్ణమో
    వినుముహిమాద్రియెప్పుడునుభీకరశీతలవాయువేగదా
    యనయమునగ్నియెప్పుడునునాయతవేడినిగల్గియుండుగా

    రిప్లయితొలగించండి
  34. కనుగోనగ నత్తింటను
    వనితలు పలుబాధలొందు వారికి నెపుడున్
    మనసుకు సాంత్వన గూర్చగ
    ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!

    రిప్లయితొలగించండి
  35. కందం

    రణమెంచ విష్ణువర్ధను
    డనవసరపు రక్తపాతమని వాసవి తా
    ననుకృతిఁ జన' సతి' మార్గము
    ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో!
    ** ** **
    చంపకమాల

    తన సుత యాగమున్ గనఁగ దక్షుని ముంగిలి జేరినంతటన్
    పని గొని తండ్రియే శివుని పన్నగ భూషణు నిందలాడగన్
    వినగను జేతగాక సతి పేర్చిన నగ్నిని దూకె వేదనన్
    యనలమె సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీభువిన్! 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి

      దక్షయఙ్ఞ వృత్తాంతమును అన్వయించి చాలా చక్కని పూరణము చేశారు .

      నమస్తే సహదేవుడు గారూ !

      తొలగించండి
  36. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    [ " జీవుల ఉదరమున జఠరాగ్నిని నే నై అవి భుజించు‌ పదార్థముల

    జీర్ణింప జేసి , వాటిని శాంతింప జేసెద " అని శ్రీకృష్ణుడు గీతలో అన్నాడు .

    సమస్త ప్రాణులు శాంతించుటకు( చల్లబడుటకు ) జఠరాగ్ని యే

    కారణము . కావున జఠరాగ్ని చల్లనిది అనుట సమంజసమే కదా ! ]


    అనలము జీర్ణించుచు , చే

    తనుల యుదర మందు గల పదార్థమ్ముల నె

    ల్లను , జీవుల చల్లబరుచు |

    అనలమ్మే సుమ్మి చల్ల నైనది యిలలో ! !
    -------------- -------- ----- ---------- -----------


    జీర్ణించు = జీర్ణింపజేయు‌ ;

    రిప్లయితొలగించండి
  37. కనలిన సతి చూపు పతికి
    యనలమ్మే సుమ్మి; చల్లనైనది యిలలో
    తనయుని ముద్దిడు క్షణమది
    యనిలమె సంతునకు , తల్లి యమృత సమంబౌ

    రిప్లయితొలగించండి
  38. కవి మిత్రులకు నమస్కృతులు.
    నెల్లూరు ప్రయాణంలో ఉన్నాను. రేపు అక్కడ మైలవరపు మురళీకృష్ణ, కోట రాజశేఖర్ గారల అవధాన అవగాహనా సదస్సులో పాల్గొని తిరుపతి వెళ్తాను. తిరుపతి నుండి 19 న బయలుదేరి 20 న హైదరాబాద్ చేరుకుంటాను. అప్పటి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. గుణదోషముల పరస్పర
      మనుభవ పూర్వకముగా సమస్యల పూరిం
      చిన పద్యమ్ముల కొరకై
      వినియోగించుడు! విదుర కవీశ్వరులారా !


      తొలగించండి
  39. కనుమా దైవపు కృపలను
    వినయముగా మ్రొక్కినంత వేడుకదీర్చున్!
    గుణమునుదిద్దగ జూపే
    యనలమ్మే సుమ్మి చల్లనైనది ఇలలో
    --------------------------------

    రిప్లయితొలగించండి



  40. అనవరతమలిగెడిసతియు

    అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    మనలను కంటికి రెప్పలె

    గనుచున్న జనని ,గొలువుడు ఘనముగ నామెన్.


    2.కినుక యధికమైన నదియు


    ననలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో

    ననయము ప్రేమను పంచెడి

    జననియటంచెరుగుమయ్య జగతిని పుత్రా

    రిప్లయితొలగించండి
  41. గురువు గారికి, పండిత ప్రఖండులందరకూ నమస్సులు.
    నేను ఈ బ్లాగుకు పాత వాడినే. కొన్నాళ్లు నా పద్య రచనకు ఒక కామా పెడదామనుకుంటే, స్వల్ప విరామం కాస్తా అధిక విరామం అయింది. మరలా మొదలెత్తుకుంటున్నాను కనుక తప్పులు చెబితే దిద్దుకుంటూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
  42. తన పరివారులందరిని త్యాగము జేయుచు ఎల్లలందునన్
    జినుగుగ దేశ రక్షణము జేయుచు నిల్చిన సేనకంతకున్
    మన ఘన దేశ వాసులకు భద్రత గూర్చు సమష్టి కార్యమం
    దనలమె సుమ్మి చల్లన! మహా హిమశైలము వేడి ఈ భువిన్.

    రిప్లయితొలగించండి
  43. వినుమయ పృచ్ఛకాధముడ! వీనుల విందుగ నేను చెప్పెదన్:
    కనుమయ కొశ్నెనాన్సరులు కన్నుల విందుగ ప్రక్కప్రక్కనే👇
    కనుగొన నెద్ది వేడిరయ?, కాదది, యౌనెది?, కాదదెద్దిరా?;
    అనలమె సుమ్మి;.. చల్లన;..మహాహిమశైలము;..వేడి యీభువిన్ :)

    రిప్లయితొలగించండి