గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2611 సమస్య :: *నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా !* సందర్భం :: సత్యం వద। ధర్మం చర। స్వాధ్యాయాత్ మా ప్రమదః। అని కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ ఉపనిషత్తులో శీక్షా వల్లి లో చెప్పబడి ఉంది. ఓ మిత్రమా ! సత్యమునే పలుకు. ధర్మాన్ని ఆచరించు. సరస్వతీ మాత యొక్క సేవకు (శంకరాభరణం సమస్యలకు) సంబంధించిన అభ్యాసం చేస్తూ ఉండు. సమస్యల పరిష్కారమే సంతోషాన్ని కలిగిస్తుంది. అని గురువర్యుల హితోపదేశం గుఱించి తెలిపే సందర్భం.
సత్య సుదూరమైన చెఱసాల సమంబగు జీవనంబునన్ భృత్యులె తోడు కాగ పరివృత్తిగ మారెగ రాగబంధముల్ జాత్యమదెంచి చూడగను సాహితి సంపద నందు మక్కువ న్నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
నిత్య సమస్యలే వరద! నీడగ నుంచెను నిన్ను మాకు నా సత్యము నేనెరుంగుదు యొసంగుము కష్టములన్న గుంతి యే భృత్యుల మార్గదర్శి! హరి వెంట వసించి శుభమ్ము లీయగన్ నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
నిత్య సమస్యలే వరద! నీడగ నుంచెను నిన్ను మాకు నా సత్యము నే నెరుంగుదు నొసంగుము కష్టములన్న గుంతి యే భృత్యుల మార్గదర్శి! హరి వెంట వసించి శుభమ్ము లీయగన్ నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
...........సమస్య నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
సందర్భము: సాహిత్యంలో విరుపులు మెరుపులు తెలుసుకోవాలంటే ప్రతిరోజూ ఒక *సమస్య* కావాలి. అట్లైతేనే నిత్య సాధన జరుగుతుంది. నెమ్మది కలుగుతుంది. శాబ్దికము= శబ్ద సంబంధము ~~~~~~~~~ "సత్యం బిది విరుపులు సా హిత్యంబున చక్కగాను నెఱుగవలె ననన్ స్తుత్యము శాబ్దిక మొక్కటి నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
---------------------------------------- ...............సమస్య నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
సందర్భము: మనిషికి ప్రతి నిత్యం భోజనం కావాలి కదా! అట్లే ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వుండాలి. దానికి పరిష్కారం వెదుకుతూ వుండాలి. అప్పుడే జీవితం ప్రమాణం ఆదర్శం ఔతుంది. ప్రతి నిత్యం సమస్య నెదుర్కుంటూ వుంటే మనిషి క్రమంగా బలపడుతాడు. సమస్యలు క్రమంగా బలహీనపడుతాయి. ఆ తర్వాత రావడం మానేస్తాయి. వచ్చినా వేధించడం మానేస్తాయి. బలవంతుని దగ్గరకు రావడానికి ఎవరైనా భయపడుతారు గదా! ~~~~~~~ నిత్యము గావలెన్ మనకు నిండగు భోజన మన్న యప్పుడే నిత్యము గావలెన్ మనకు నేదొ సమస్యయు నేదొ తీ ర్పటుల్ నిత్యము సాధనంబుననె నిం డగు స్థైర్య మదే వరించెడిన్.. నిత్యము కష్ట నష్టములు నిండిన జీవితమే ప్రమాణమౌ.. నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
కృత్యము కావలె చేతికి
రిప్లయితొలగించండిభత్యము కావలె కడుపుకు భక్షణ కొఱకున్
సత్యమ్మిది శంకర వర!
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపైత్యము బట్టును గానక
సత్యమ్మిది శంకరార్య! సందియమేలా
ముత్యాలకుచ్చు కై పున్
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యము పలికిరి మెండుగ
రిప్లయితొలగించండినిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
ప్రత్యయము గురువు గారికి
కృత్యము సలుపంగ కృతి కృతార్ధు డటన్
ప్రత్యయము = నమ్మకము, ఆచారము, విశ్వాసము ,శపధము .
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. సవరించండి.
సత్యము పలికిరి మెండుగ
తొలగించండినిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
ప్రత్యయము గురువు గారికి
కృత్యము సలుపంగ స్రష్ట కృతార్ధు డటన్
నృత్యము సేయుచు నుండు న
రిప్లయితొలగించండిసత్యపుటూహల మనమది సంరంభమునన్;
స్మృత్యములగుటకు చేష్టలు
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిత్యము పద్యాభ్యసనము
రిప్లయితొలగించండినిత్యము లేనిదె సమస్య నిదురే గానన్
పత్యమిది స్వస్థకవులకు
నిత్యము గావలె సమస్యనెమ్మది గలుగన్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పథ్యము'నకు వికృతి 'పత్యము' కాదు. అక్కడ "సత్యమిది" అనవచ్చు.
శైత్యము గొరకున్ మజ్జిగ,
రిప్లయితొలగించండిపైత్యము తగ్గెడు ఖలమును భరణము లోనన్
పత్యము వోలె భుజించన్
నిత్యముఁ గావలె, సమస్య నెమ్మది గలుగన్
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పత్యము'....?
jwaramu vacchunapudu tinu mita aharamunu patyamu anduru andte limted and restricted food
తొలగించండి
రిప్లయితొలగించండిపైత్యము బట్టు గాదయ సుపాణిని జేర్చెడు పద్యపాదముల్
స్తుత్యపు లాఘవమ్ము సయి సుందర పూరణలెల్ల గానకన్
సత్యమిదే కవీశ్వరుడ! సందియమేల ! సభాస్థలిన్ భళా
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
जिलेबी
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసత్యంబై వెలుగు విభుడు
నిత్యము గావలె ; సమస్య నెమ్మది గలుగ
న్నాత్యంతికమైనను విడు
దత్యుని వరమై జిలేబి దమ్ము విడువకోయ్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్యధికంబుగా నహమునావల జూపుచు నెగ్గుజేయుచున్
రిప్లయితొలగించండిపైత్యప్రకోపనంబనగ బల్కులు బెచ్చుగ బల్కుచున్నచో
సత్యము! నింబసేవనము చాలును పుష్పరసాహ్వయంబుతో
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిత్యము శంకరు లి చ్చే
రిప్లయితొలగించండికృత్యము కవి శక్తీ పెంచుకీలక మగుచు న్
సత్యము గా పని చేయగ
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"శంకరు లిచ్చెడి" అనండి.
రిప్లయితొలగించండినిత్యముఁ గావలెన్, మనకు నెమ్మది గల్గ సమస్య, మిత్రమా
స్తుత్యము జేయు బుద్ధి సయి శోభల జేర్చెడు మానసమ్ము తా
ముత్యపు కాంతి యై వెలుగ ముంగిట నిల్చిన వారు లన్నుగా
జాత్యపు అంబుజానన సజావు జిలేబి సెబాసనంగబో!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృత్యము నిత్యము నివ్వగ
రిప్లయితొలగించండినత్యంత చురుకయి మెదడు యబ్బుర పరచున్!
తథ్యమిది వినుము!మెదడుకు
నిత్యము గావలె సమస్యనెమ్మది గలుగన్!
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అత్యంత చురుకు' అన్నది దుష్టసమాసం. 'మెదడు + అబ్బుర' మన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
అత్యధికంబుగా నహమునావల జూపుచు నెగ్గుజేయుచున్
రిప్లయితొలగించండిపైత్యప్రకోపనంబనగ బల్కులు బెచ్చుగ బల్కుచున్నచో
సత్యము! జంభి సేవనము చాలును పుష్పరసాహ్వయంబుతో
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
జంభి= నిమ్మకాయ
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పైత్యపు బల్కులనెప్పుడు
రిప్లయితొలగించండినత్యధికముగాను బల్కు యవగుణ ధనికిన్
సత్యము- నిమ్మయు, తేనెయు,
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్.
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బల్కు నవగుణ...' అనండి.
సత్యం బిది సత్కవులయి
రిప్లయితొలగించండియత్యంతంబైన కీర్తి నందుట కొరకై
వ్యత్యయము లేనివారికి
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభత్యము లేని గొల్వు గద ! భాగ్యముగా తెలుగైన నేర్తునే !
జాత్యపు రీతి ప్రాంగ ణము ఛందపు కైపుల నేర్వ వచ్చునే !
సత్యము చెప్పి నావు గద ! శంకర వర్యుడ మేలు మేలుగన్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రత్యేకమ్ముగ స్వాస్థ్యత
రిప్లయితొలగించండికత్యవసరమగును శంకరాభరణమునన్
సత్యమ్ముగ కవివరులకు
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రత్యహము భావగత భా..
రత్యర్చన జేయ శంకరాభరణమునన్
భృత్యులకు కానుకల వలె
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
బహు చక్కని పూరణ! 👌👌👌
తొలగించండిసోదర సోదరీమణులకు వందనములు 🙏🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ
మైలవరపు వారి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యపథానువర్తనము , శాంతి వచోవిభవమ్ము , సాధు సాం....
తొలగించండిగత్యము , నైష్ఠికమ్ములగు కర్మలయందనుకూలభావమున్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ ., సమస్య మిత్రమా !
కృత్యము చేయనీయదు , రుచింపదు తిండి , సుఖంబు ద్రుంచెడిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శంకరాభరణం...28/02/18..సోమవారం
రిప్లయితొలగించండిసమస్య: నిత్యము గావలె సమస్యనెమ్మది గలుగన్
**** **** *** *** *
కం.
కృత్యము గావలె నరులకు
నిత్యము లేకున్న బ్రతుకు నిస్సారమగున్
సత్యమ్మిది!మానవులకు
నిత్యము గావలె సమస్యనెమ్మది గలుగన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భృత్యుల శిక్షించుటకై
రిప్లయితొలగించండియత్యవసరమైన చర్య లమరగ చేయన్
వ్యత్యస్తములును తొలగుట
నిత్యముఁగావలె సమస్య నెమ్మది గలుగన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిసత్యము సంతస మిడ నను
రిప్లయితొలగించండినిత్యము గావలె!సమస్యనెమ్మది గలుగన్
పత్యముగా భావించ?న
సత్యము దగ్గరకు రాదు !సద్గుణ మోసగన్!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్యంతా నంద మొసగు
రిప్లయితొలగించండికృత్యమ్మీ పూరణ!హరి!కృష్ణా!రామా!
సత్యమ్మౌ నిది జూడగ
"నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృత్యము గనయ్యె మాకను
రిప్లయితొలగించండినిత్యము నరయుట సమస్యనిందున మఱియున్
ప్రత్యుత్తర ముత్యాలను
“నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్"
నరసరాజు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2611
సమస్య :: *నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా !*
సందర్భం :: సత్యం వద। ధర్మం చర। స్వాధ్యాయాత్ మా ప్రమదః। అని కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ ఉపనిషత్తులో శీక్షా వల్లి లో చెప్పబడి ఉంది.
ఓ మిత్రమా ! సత్యమునే పలుకు. ధర్మాన్ని ఆచరించు. సరస్వతీ మాత యొక్క సేవకు (శంకరాభరణం సమస్యలకు) సంబంధించిన అభ్యాసం చేస్తూ ఉండు. సమస్యల పరిష్కారమే సంతోషాన్ని కలిగిస్తుంది. అని గురువర్యుల హితోపదేశం గుఱించి తెలిపే సందర్భం.
సత్యమె బల్కుమా! యెఱిగి చక్కగ ధర్మము నాచరింపుమా!
నిత్యము *శంకరాభరణ* నిష్ఠ సమస్యల నభ్యసింపుమా!
స్తుత్య మహోపదేశ మిది, తుష్టిని సద్గురు బోధ నందుమా!
*నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా !*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (28-2-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యము, ప్రజాప్రతినిధి క
రిప్లయితొలగించండిగత్యము ప్రజమన్ననగొన ఘనమగు రీతిన్
భృత్యుడ నంచునె దోచగ
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్!
మూడవ పాదమునకు పాఠాంతరము
తొలగించండిభృత్యుడ నంచును దీర్చగ
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్య సుదూరమైన చెఱసాల సమంబగు జీవనంబునన్
రిప్లయితొలగించండిభృత్యులె తోడు కాగ పరివృత్తిగ మారెగ రాగబంధముల్
జాత్యమదెంచి చూడగను సాహితి సంపద నందు మక్కువ
న్నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దైత్యులు చెలరేగి యఘా
రిప్లయితొలగించండియిత్యముల నొనర్చ దైవమిలలో వెలయున్
సత్యమ్మిది తాపసులకు
“నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్"
నరసరాజు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*సత్యము,జెప్పగా మనసు స్వస్థత నొందుచుపట్టు దప్పకన్*
రిప్లయితొలగించండి*ముత్యము తీరు,స్వచ్ఛత ను పూనుచు స్థాయిగనుం చు యత్నమున్*
*కృత్యములిచ్చుచున్ సతత కృత్యదవస్థను కూర్మికూర్చగా*
*నిత్యముగావలెన్ మనకు నెమ్మది సమస్యమిత్రమా*
చేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కృత్యాద్యవస్థ'ను 'కృత్యదవస్థ' అన్నారు.
ముత్యము లెంచగన్ మదికి మోదము గూర్చెడి పూరణల్గదా!
రిప్లయితొలగించండిభత్యమదేమి గోరకయె పండిత వర్యుడు శంకరార్యుడున్
ప్రత్యయ మగ్గలింపగను పన్నుగ బ్లాగును నిర్వహింపగన్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముత్యము కైనను రాపిడి
రిప్లయితొలగించండియత్యంతావశ్యకమగు నవనిని యటులే
సత్యమిది మాన వులకిల
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యము శంకరాభరణ సార సమస్యులు వీక్ష చేయ, సా
రిప్లయితొలగించండిహిత్య వినోద కేళుల రహంప మనంబుకు తుష్టి కల్గు, తత్
కృత్యమె చేతనాత్మకము - క్లిష్ట సమస్యలె శాంతినిచ్చుటన్
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
👏👏👏
తొలగించండివిజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకటి, రెండు టైపు దోషాలున్నవి.
ధన్యవాదాలు శంకరయ్య గారూ! రహింప అని ఉండాలి
తొలగించండిశ్రీ ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదములు.
తొలగించండిసత్యము బలికితి రార్యులు
రిప్లయితొలగించండినిత్యము గావలెసమస్య నెమ్మదిగలుగ
న్నిత్యము శంకర గురుసాం
గత్యముతోనుండుకతనకవిగానైతిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రత్యహమున్ ప్రభుత్వమట వారుణి వాహిని గొల్చుచుండెగా
నత్యధికమ్ము గా ములుగు నందు జిలేబుల నెల్ల జేర్చగన్
సత్యమిదేనయా వినుమ! చక్కగ మత్తును గొల్పు మాధ్వియే
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండిఅత్యంతావశ్యకమౌ
కృత్యమ్మది పూరణమ్ము క్రీడయె మాకున్
సత్యము తద్విజయమునకు
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు
తొలగించండినిత్యముగావలెన్ మనకు నెమ్మదిగల్గ సమస్య మిత్రమా!
రిప్లయితొలగించండిసత్య ము సామి!మీ పలుకు సైయని యందును నీదు మాటకు
న్భత్యము లేకపోయినను బాధను నొందను గాని శంకరా!
నిత్యము లేనిచో నదియ నెమ్మది యుండదు నాదుబుర్రయున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ రోజు గురువు గారు బిజీగా ఉన్నారట్లుంది.
రిప్లయితొలగించండిఇంకెవరన్నా పరిశీలన చేసి సలహాలివ్వగలరా
ఉదయంనుండి మధ్యాహ్నం వరకు జ్వరంతో పడుకున్నాను. ఇంతకుముందే లేచాను. అందుకే ఆలస్యం.
తొలగించండికృత్యము చేతికిన్ సొబగు నృత్యము మానస తోషమున్నిడున్
రిప్లయితొలగించండిసత్యము నోటికిన్ సొగసు సాధుల సంగతి చిత్తవృత్తికిన్
భృత్యుడు స్వామికిన్ ముదము భృంగము పూవుల కోటికిన్ సదా
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యమ్మేదను శంకను
రిప్లయితొలగించండినిత్యము శోధించుయతికి నియమము మేర
న్నత్యంత యోగసాధన
నిత్యము గావలె సమస్య నెమ్మదిగలుగన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! ఆరోగ్యము జాగ్రత్త! 🙏🙏🙏
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండినిత్య సమస్యలే వరద! నీడగ నుంచెను నిన్ను మాకు నా
సత్యము నేనెరుంగుదు యొసంగుము కష్టములన్న గుంతి యే
భృత్యుల మార్గదర్శి! హరి వెంట వసించి శుభమ్ము లీయగన్
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
'నే నెరుంగుదు నొసంగుము' అనండి.
గుగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండినిత్య సమస్యలే వరద! నీడగ నుంచెను నిన్ను మాకు నా
సత్యము నే నెరుంగుదు నొసంగుము కష్టములన్న గుంతి యే
భృత్యుల మార్గదర్శి! హరి వెంట వసించి శుభమ్ము లీయగన్
నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
సత్యము చెప్పెద, మానస
రిప్లయితొలగించండిమత్యంత తనివినిఁ బొందు ననుగు సఖుల సాం
గత్యముతో, పూరించగ
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అత్యంత తనివి' అన్నది దుష్టసమాసం. "..మత్యంతము తనివిఁ బొందు" అనండి.
సత్యంబిది యని నమ్మెద,
రిప్లయితొలగించండి"అత్యవసరమే యన కవులందఱకున్ స
త్కృత్యమను పూరణమ్మున
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్!"
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్యదికంపు స్నేహమున నందరు సాగుచు నుండ వారి సాం
రిప్లయితొలగించండిగత్యములో చలంగుచును కమ్మని యూహల వ్రాయు చుంటి మీ
కృత్యము మానసమ్మున స్వకీయపు శాంతినొసంగుఁ గావునన్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
అన్నపరెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెలంగుచును... అనండి.
సత్యము! శంకరాభరణ,ఛాత్రులు సంతస మొందలేరు సాం
రిప్లయితొలగించండిగత్యము చేయరేని సరసంబుగ *పాదము* తోడ నిత్యమున్
పైత్యము హెచ్చి పిచ్చిగను పాడుచు నృత్యము చేతురే, *కటా!*
*నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్యధికమైనను దలఁచ
రిప్లయితొలగించండిమృత్యు సమంబైన నేమి మీఱఁగ ధృతినిం,
బ్రత్యవమర్షము మన కను
నిత్యముఁ గావలె, సమస్య నెమ్మది గలుగన్
భృత్యుల వోలెఁ గాంచఁబడ వేసరి పోరఁగఁ గల్గె స్వేచ్ఛయే
యత్యణ కోష్ణ కల్పిత వరాట్ట సుచోదిత యంత్రరాజముల్
సత్యపు దీక్ష భారమున సాధిత మయ్యెను భారతమ్మునన్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
[అత్యణక+ఉష్ణ= అత్యణ కోష్ణ: అత్యల్పోష్ణోగ్రత; అట్టము = ఇంధనము;
రష్యా దేశము ఋణో ష్ణేంధన యంత్రముల (Cryogenic engines) నాపిన మన దేశము లోనే కనిపెట్టితిమి.]
తొలగించండిఅత్యణ కోష్ణ కల్పిత వరాట్ట సుచోదిత యంత్రరాజముల్ !
అద్భుతః !
జిలేబి
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిజిలేబి గారు ధన్యవాదములు.
డా.పిట్టా(సత్యనారాయణ)
రిప్లయితొలగించండి"నిత్యము గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా,
సత్యమ"టన్న,"నీ వెచట సాగితివో యవధాన విద్యలన్
పైత్యమెగాక నింకొకరి పట్టున జేసిన పూరణమ్ము లా
గత్యమె,పిచ్చివాడవ"నె గౌరవ సభ్యు డొకండు వేదికన్!
నా"సామాజికక సమస్యా తోరణం" ఆవిష్కరణ సభలో నొక యతిథి ఉవాచ.)
డా.పిట్టా
రిప్లయితొలగించండిసత్యమె పలికిన కావ్యమె?
ముత్యము వలె నున్నదనిన మోదము గలుగన్
స్తుత్యములౌ యూహలకై
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్!
డా.పిట్టా,
రిప్లయితొలగించండిఆర్యా, ( )ల లో "క"అదనంగా బడడం నా ఆవేదనను సూచిస్తున్నది.సరిజేసి గైకొనండి.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కంచి కామకోఠి పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేద్ర సరస్వతి స్వాములవారికి నమస్సుమాంజలి........
రిప్లయితొలగించండిశంకరు సత్ప్రబోధము ప్రశస్తముగా నిల సజ్జనాళికిన్
బొంకము మీఱ జెప్పి తలపున్ పరమార్థపు కాంక్ష బెంచి ని
శ్శంక గలుంగ జేసి సదసద్విషయంబులెఱుంగ జేసె నీ
వంక జయేంద్ర తీర్థులభివాదము జేతు వినమ్రచిత్తుడై.
సత్యము శంకరాభరణ సంగతి చూడ కవివ్రజంపు సాం
గత్యము నొంది సత్కవన కారణమై విలసిల్ల జేసె నీ
కృత్యము మీది కష్టముల కృంగగ జేయ గలింగె నెంచగా
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిజయేంద్ర సరస్వతి స్వాముల వారపై మీ పద్యం బాగున్నది. "వినమ్ర చిత్తతన్" అంటే బాగుంటుందేమో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సూచన సర్వదా ఆచరణీయమే గురువు గారూ.
తొలగించండిజయేంద్ర సరస్వతి స్వాముల మరణం హైదవ జాతికి ఒక లోటు.
ధన్యోస్మి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅత్యధికమ్మగు రుగ్మము
నత్యయమొనరించుటందు నగదము తోడన్
పత్యము చలుపుచు నుండుట
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్
(అత్యయము=నాశనము; అగదము=మందు/ఔషధము)
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యము చెప్పెద,వినుమది
రిప్లయితొలగించండికృత్యముగా నిలయవలయు, కృషియెట్లన్నన్!
ప్రత్యాశ్వాసముగలుగుట
నిత్యముగా మారవలయు, నెమ్మదిగలుగన్.
పురుషోత్తమ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కృత్యముగా నిలయవలయు...'?
సత్యమె కద ప్రజలకెపుడు
రిప్లయితొలగించండి"నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్"
పైత్యము పుట్టును నిజమే
పత్యపు భోజనము చేయ ప్రతిదినమందున్
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన పద్యమిది...
రిప్లయితొలగించండిపరిశీలించండి గురువు గారు...
కం.
కృత్యము నిత్యము నివ్వగ
నత్యంత శితముగ మెదడు నబ్బుర పరచున్!
తథ్యమిది వినుము!మెదడుకు
నిత్యము గావలె సమస్యనెమ్మది గలుగన్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
'శితముగ'...?
తొలగించండిశితము = నిశితము,వాడి,చుఱుకు..అనే అర్థాలు
తొలగించండిఆంధ్రభారతి నిఘంటువులో ఉన్నాయి గురువుగారు...
డా.పిట్టా
రిప్లయితొలగించండిసత్యమె పలికిన కావ్యమె?
ముత్యము వలె నున్నదనిన మోదము గలుగన్
స్తుత్యములౌ యూహలకై
నిత్యము గావలె సమస్య నెమ్మది గలుగన్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అత్యంత ముదము' దుష్టసమాసం. "అత్యంత మోద మొదవును" అనండి.
డా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండి28/2/18.
కం:సత్యము పలికెద నిపుడే
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
కృత్యములయ్యెనను దినము
నత్యధికులకిలనొసంగు నానందంబున్.
.
రిప్లయితొలగించండికం:నిత్యము మెదడుకు మేతను
నత్యధికముగా నొసగుచు నవనీ స్థలిలో
నత్యాదరమున విడువక
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసత్యవచోఽమృతానుగత శంకర ప్రేరిత లేఖనమ్ముకై
యత్యధికానుమోదకర హర్షిత శీర్ష ప్రకంపనమ్ముకై
ప్రత్యహ శంకరాభరణ పద్య విశిష్ట కవీశ శంసకై
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
మధుసూదన్ గారూ,
తొలగించండిఅత్యద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండి...........సమస్య
రిప్లయితొలగించండినిత్యముఁ గావలె సమస్య
నెమ్మది గలుగన్
సందర్భము: సాహిత్యంలో విరుపులు మెరుపులు తెలుసుకోవాలంటే ప్రతిరోజూ ఒక *సమస్య* కావాలి. అట్లైతేనే నిత్య సాధన జరుగుతుంది. నెమ్మది కలుగుతుంది.
శాబ్దికము= శబ్ద సంబంధము
~~~~~~~~~
"సత్యం బిది విరుపులు సా
హిత్యంబున చక్కగాను నెఱుగవలె ననన్
స్తుత్యము శాబ్దిక మొక్కటి
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్
----------------------------------------
...............సమస్య
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ
సమస్య మిత్రమా
సందర్భము: మనిషికి ప్రతి నిత్యం భోజనం కావాలి కదా! అట్లే ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వుండాలి. దానికి పరిష్కారం వెదుకుతూ వుండాలి. అప్పుడే జీవితం ప్రమాణం ఆదర్శం ఔతుంది.
ప్రతి నిత్యం సమస్య నెదుర్కుంటూ వుంటే మనిషి క్రమంగా బలపడుతాడు. సమస్యలు క్రమంగా బలహీనపడుతాయి. ఆ తర్వాత రావడం మానేస్తాయి. వచ్చినా వేధించడం మానేస్తాయి. బలవంతుని దగ్గరకు రావడానికి ఎవరైనా భయపడుతారు గదా!
~~~~~~~
నిత్యము గావలెన్ మనకు
నిండగు భోజన మన్న యప్పుడే
నిత్యము గావలెన్ మనకు
నేదొ సమస్యయు నేదొ తీ ర్పటుల్
నిత్యము సాధనంబుననె
నిం డగు స్థైర్య మదే వరించెడిన్..
నిత్యము కష్ట నష్టములు
నిండిన జీవితమే ప్రమాణమౌ..
నిత్యముఁ గావలెన్ మనకు
నెమ్మది గల్గ సమస్య మిత్రమా!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.