6, ఫిబ్రవరి 2018, మంగళవారం

సమస్య - 2590 (కాటుకగ ధరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్"
(లేదా...)
"కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్"

87 కామెంట్‌లు:

  1. సూటిగ పోటిగ మాటలు
    ఘాటైన విధముగ పల్కి ఘైఘై యనుచున్
    చీటికి మాటికి తిట్టుచు
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  2. నోటికి హద్దే లేకను
    ఘాటుగ దిట్టుచును యత్త గయ్యాళి వలెన్
    మోటగు పనులను జెప్పిన
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  3. రోటను జేసిన పచ్చడి
    ఘాటగు రుచులను పెంచు కౌతుక మందున్
    నోటను పెట్టిన చాలును
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి

  4. ఆటంకపరచ తా "వా
    కాటు" కగ ధరించె నింతి, కారము నెలమిన్
    మాటల రూపము గానన్,
    ఝాటించుచు జాణులనట జంకింపగనన్ :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. కాటును వేయు వారలట, కంటికి నింపుగ గాన లేమలన్
    ధాటిగ దీటు గా నడచ ధైర్యము మానసమందు చేదుచున్
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్
    మాటల రూప మందు తన మానము కాచుకొనన్ కవీశ్వరా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆ మధ్య చదివిన నేత్రి నేత్ర కామింటుల తరువాయి సందేహం :) కంజదళాయనేత్రి యా నేత్ర యా :)
      ఏది సరి ?

      జిలేబి

      తొలగించండి
    2. మీరేగదా "నేత్రి" అంటే "నది" అని సెలవిచ్చిరి...

      పోచిరాజు వారు తీర్చిదిద్దారుగా!

      అయినా సమస్యను మార్చరాదుగా!

      తొలగించండి
    3. ‘’*కంజదళాయతనేత్రి* అని వాడవచ్చును. పారిజాతాపహరణం లో ద్వితీయాశ్వాసంలో పద్యసంఖ్య 20 లో నేత్రి అని నంది తిమ్మన గారు ప్రయోగించి యున్నారు. దీనిని చిన్నయసూరి గారు ఆమోదించకపోయినప్పటికినీ చిన్నయసూరి అనుయాయి ప్రసిద్ధ వ్యాఖ్యానకారులు శ్రీ దూసి రామమూర్తి గారు సమర్థించినారు. కాబట్టి కంజదళాయతనేత్రి అనడం సరియైనదే ‘’అని అవధాన విద్యా గురువరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు తెలియజేసినారండీ. కోట రాజశేఖర్.

      తొలగించండి


    4. రాజశేఖర గారికి

      నెనరులు !

      కంది వారి నేత్రము ఇంత మంచి విషయాన్ని బయటకు లాగిందన్న మాట :)


      బాగుందండీ !

      ధన్యవాదాలు


      జిలేబి

      తొలగించండి
    5. కంది శంకరయ్య ఉవాచ @ 10.23 AM today:

      "చూడకుండలేను, చూచిన వ్యాఖ్యానములను పెట్టకుండ వలనుపడదు, పెట్టగానె మిత్రబృందమ్ము శస్త్రచికిత్స గుర్తు చేసి గీపెడుదురు."

      తొలగించండి


    6. చూడ "కుండ లేను", చూచిన కొలది శో
      భలలరు మజ మధుర భాండములుగ
      వాహిని వలె దుముకు పరవళ్ళు పద్యముల్
      వ్యాఖ్యల నిడ బిలిచె వార జూపు :)


      వచ్చేయండి " బిరాన ":)


      జిలేబి

      తొలగించండి
    7. తే. వామనేత్రీ కరాంచ లావర్జ్యమాన
      కనక భృంగారు కర్కరికా ముఖాగ్ర
      గళిత గంధోదకంబులఁ గంసవైరి
      చేతులను వార్చె బాంధవ శ్రేణితోడ. పారి. 2. 20

      నేత్రీ పదము కాలక్రమములో జరిగిన ముద్రణ దోషముగా భావించ వచ్చును గాని నంది తిమ్మన గారి ప్రయోగమన దగదని నా నమ్మకము.

      కువలయపత్రనేత్ర! ; ఏణీ శాబ విలోల నేత్ర! అని పారిజాతాపహరణము 2 ఆశ్వాసము లోనే 85, 91 పద్యములలో ప్రయోగములు దీనిని నిరూపించుచున్నవి. కవిత్రయ ప్రయోగములలో “నేత్ర” గానే కన్పించు చున్నవి.
      నేతృ: నేత, నేత్రీ, నేత:
      నేత్రీ: నాయకురాలు, నది, లక్ష్మి అన్న అర్థములలో ఈ కారాంత పదము.

      తొలగించండి
    8. అంతే గాక
      “మృగాయతనేత్రలు గొల్వ (పారి.1.43)”, “మరు దంభోరుహనేత్ర లంబర ధునీ మధ్యంబున న్నిల్వ” పారి.4.29. లలో నేత్రి సాధువనుకొనిన “నేత్రులు ” అని యుండ వలెను గదా బహు వచనములో.

      తొలగించండి
    9. లోచనము, నయనములు : అ కారాంత నపుంసక లింగములు.

      సమాసములలో తత్సమము లయి నీరజ లోచనుఁడు / నీరజ నయనుఁడు ( పుంలింగము), నీరజలోచన/ నీరజ నయన (స్త్రీలింగము) సాధువులు.
      అంతే గాని నీరజ లోచని, నీరజ నయని యన్న రూపములు లేవు.

      అట్లే నేత్రము అ కారాంత నపుంసక లింగము.
      సమాసములలో నీరజ నేత్రుడు, నీరజ నేత్ర పుంలింగ, స్త్రీలింగ తత్సమములే.
      కాన నీరజ నేత్రి సాధువు కానేరదు.

      తొలగించండి
    10. కామేశ్వరరావు గారికి నమస్సులు!ఈరెండు సందేహములను తీర్చ ప్రార్థన!
      1.చలనచిత్ర రంగంలో 'అభినేత్రి'అని వాడుతుంటారు.సరియైన దేనా?
      2.సోదరి కి బహువచనం ఏమిటి?
      భవదీయుడు,
      గుర్రం జనార్దన రావు.

      తొలగించండి
    11. కళ్ళతో అభినయాన్ని చేసింది కనుక సావిత్రిని "అభినేత్రి" అని పిలిచేవారు.
      సోదరి కి బహువచనం సోదరీమణులని వాడుక భాషలో ఉంది.

      తొలగించండి
    12. జనార్దన రావు గారు నమస్సులు. అభి పద ముపసర్గ. విశేషార్థము గాని, ప్రాధాన్యార్థమును గాని యిచ్చును. అభినేత్రి యన మంచి నాయకురాలని కాని నటి యని కాని స్ఫురించును. సాధువే.
      మీకు వచ్చిన సందేహము రాకూడదనే సోదర సోదరీ మణు లారా యని సంబోధించెదరు.
      ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వం బగు.
      హరులు, గిరులు, కవులు, కపులు, యామినులు, భామినులు.

      తొలగించండి

    13. కళ్ళను నేత్ర అంటారండి

      కాబట్టి అభినేత్ర అనాలి ఆ అర్థంలో తీసుకోవాలంటే.



      అభి- అధికమైన , ముఖ్యమైన + నేత్రి - నాయకురాలు అన్న అర్థంలో అభినేత్రి - ముఖ్యమైన నాయకురాలు అని అర్థంచేసుకోవచ్చనుకుంటా



      సోదరీలకు ఆ మణులెందుకో ?:) జెకె :)


      జిలేబి

      తొలగించండి

  6. మైలవరపు వారి పూరణ

    సత్యభామ... కన్నీరు, కోపము ప్రదర్శించుటకు...

    " చాటుగ జేరు , పల్కు సరసమ్ముగ కృష్ణుని జూడ శోకమే..
    పూటయు రాదు , నేడెటుల మూతి బిగించుట ? " యంచు సత్య దాఁ
    జేటుల మాటలన్ విని , రుచింపక , జూప నలీక కోపమున్
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. చేటుల చేతలన్ జగతి జీల్చెడి యమ్మహిషాసురాధమున్
    వేటును వేయగా నరుగు వెల్గుల యెర్రని కాళి కన్నులన్
    గాటపు ప్రేమతో గనిన కాంతుడు శంకరుడెంచె నిట్టులన్
    "కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్"

    రిప్లయితొలగించండి
  8. నాటకమందు ద్రౌపదిగ నల్వురు మెచ్చ నటించినట్టి యా
    పాటలగంధి నేత్రముల భగ్గను నెర్రని జీర జూడ నా
    బోటికి వర్ణనాంశమయి పొంగెడు నిట్లొక పద్యపాదమే
    కాటుకగా ధరించె గద కంజదళాయతనేత్రి కారమున్

    రిప్లయితొలగించండి
  9. గుండమ్మకు నివాళి:

    కాటుక కంటినీరెపుడు కానగనీయని వైభవమ్మునన్
    సూటిగ మాటతో చరచు సూర్యపుకాంతుల పోటులందునన్
    నోటికి తాళమున్ మరచు నోముల పంటగు నత్తగారు తా
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్ !!

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2590
    సమస్య :: *కాటుకగా ధరించె గద కంజదళాయతనేత్రి కారమున్.*
    పెద్ద కన్నులు ఉన్న ఒక సుందరి కారాన్ని కాటుకగా కళ్లకు పెట్టుకొన్నది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: {ప్రణయ} పారవశ్యంలో ఉన్నప్పుడు ఎంతటి ధీమంతులైనా సరే పొరపాట్లు చేస్తుంటారు. అందుకనే *ప్రమాదో ధీమతామపి* అనే సూక్తి ఏర్పడింది. రాధ సౌందర్యం పైన దృష్టి పెట్టి రాధాధ్యానంలో పరవశించియుండిన శ్రీ కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పిండేందుకు ఒక ఎద్దును సమీపించి దాని కాళ్లను తాడుతో కట్టినాడట. శ్రీ కృష్ణునిపై మనసును లగ్నం చేసి పరవశించియున్న రాధ పెరుగు చిలుక దలచి కడవలో పెరుగు పోయకుండానే ఖాళీగా ఉన్న కడవలో కవ్వం ఉంచి చిలకడం మొదలు పెట్టిందట. అటువంటి రాధాకృష్ణులు కృపతో లోకములను అనుగ్రహింతురుగాక అనే మధురమైన భావంతో శ్రీ లీలాశుకులవారు తన శ్రీ కృష్ణకర్ణామృతం అనే గ్రంథం లో ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించారు.
    *రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా*
    *మంథాన మాకలయతీ దధి రిక్త పాత్రే ।*
    *తస్యా స్తన స్తబక చంచల లోల దృష్టిః*
    *దేవోఽపి దోహన ధియా వృషభం నిరుంధన్.*
    అలా తన్మయత్వంలో ఉన్న రాధ కారాన్ని కాటుకగా కళ్లకు పెట్టుకొన్నది అని ఊహించి చెప్పే సందర్భం.
    దాటుదురే ప్రమాదమును తన్మయతన్ విలసిల్లు ధీమతుల్ ?
    పాటున రాధ నెంచి వృషభమ్మును కృష్ణుడు గట్టె పాలకై ,
    పాటలగంధి రాధ మది భావన జేయుచు కృష్ణతత్వమున్
    పాటలు బాడుచున్ వర ప్రభన్ చిలికెన్ దధి రిక్త పాత్రమున్ ,
    *కాటుకగా ధరించె గద కంజదళాయతనేత్రి కారమున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-2-2018)

    రిప్లయితొలగించండి
  11. సాటియె లేని సుమంబును
    తోటి సతికి నీయభర్త తోరపు బాళిన్
    ఘాటగు నసూయ నలకను
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోరపు బాళి సరియైన సమాసమేనా?
      తోరపు ప్రేమన్ అని వ్రాసి మరల మార్చితిని. యేది సరియైన సమాసము? ఈ సంస్కృత తెలుగు పదాలమధ్య తేడా యింకా తెలియడము లేదు! పెద్దలు సలహా యివ్వ ప్రార్ధన!

      తొలగించండి
    2. తోరపుబాళి సరియైన ప్రయోగము,తోరపుఁ బ్రేమన్ ఇదీ సరియైనదే రెండింటిలో సమాసగతదోషము లేదు.

      తొలగించండి
    3. ధన్యవాదములార్యా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    4. ఆంధ్ర భారతి ఉవాచ:

      "బాళి" : దే. వి.
      "ప్రేమ": సం. వి. న్‌. పుం,న.
      "తోరము": వై. వి.

      "తోరపు" అన్నారు కావున సమాసము లేదు.

      "తోరపు ప్రేమ", "తోరపు బాళి", రెండునూ సరియే.

      ...నిత్య విద్యార్థి

      తొలగించండి
    5. బొజ్జ: దే. వి

      "తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యల"

      తొలగించండి
    6. ఓహో! అసలు సమాసమే లేదా! హతోస్మి!🤭🤭🤭

      తొలగించండి
    7. తోరపుఁ బ్రేమ కర్మధారయ సమాసము.

      32.కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు.
      సరసము+మాట సరసపుమాట, సరసంపుమాట
      విరసము+ వచనము=విరసపువచనము, విరసంపువచనము
      తోరము+ప్రేమ = తోరపు ప్రేమ

      25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
      ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు.
      తోరపు ప్రేమ = తోరపుఁ బ్రేమ.
      ఇందు “పు” లఘువే.

      తొలగించండి
    8. పూజ్యులు కామేశ్వరరావు గారికి శతథా నమస్సులు! ధన్యవాదములు! కర్మధారయ సమాసాన్నే మరచిపోయినందుకు చింతిస్తున్నాను!🙏🙏🙏🙏

      తొలగించండి
  12. మాటికి మాటికి తిట్టు చు
    నోటిదురుసుతోడ నత్త నొప్పింపం గా
    ఘాటగు కోపము రాగా
    కాటుక గ ధరి యించె నిం తి కారము నెల మి న్

    రిప్లయితొలగించండి
  13. చీటికిమాటికిం గడిమి చిర్రులుబొర్రులు చిందులాడుచున్
    గాటపు మాటలన్ మదిని గాయమొనర్చుచు సూటిపోటుతో
    నాట నిరంతరాయము, క్షణమ్మొక యామ్యయుగమ్ముజేయగా
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్.

    రిప్లయితొలగించండి
  14. పాటుగ కోడలి నెపమును
    ఘాటుగ దూషించి యత్త కలతన్ఁజెందెన్
    ధాటిగ రుసరుస లాడెను
    కాటుక ధరియించె నింతి కారము నెలమిన్.

    రిప్లయితొలగించండి
  15. కాటుకగ ధరించె నింతి.......అని 4వ పాదం చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి


  16. హాటకగర్భుడటన్ తన
    పాటవ మున్జూపగాను పలుకుఁజెలియ వా
    కాటున్ ద్రుంచగ, నొసటన్
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్!


    जिलेबी

    రిప్లయితొలగించండి
  17. క్రమాలంకార పూరణ:
    ****)()(****
    మేటి యభిమాన నటియే
    దాటిగ సూచించు చుండు దానినె తానున్;
    చేటగు నతిగా వాడిన;
    "కాటుకగ ధరించె నింతి ; కారము నెలమిన్"
    ****)()(****

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ‌ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    నిన్నటి పూరణ ==

    " నిర్మూలించెద సర్వరోగముల నేనిన్ | నా దరిన్ జేరినన్

    గర్మంబు న్నెడలింతు గట్టుచు సురక్షాబంధ మే " నం చనన్

    మార్మాటాడక * మేషి వర్తనమునన్ * బాబాల సేవించు నా

    దుర్మోహమ్మును మానుటే హిత మగున్ | దుర్వృత్తి కన్పంచినన్

    దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే


    { ఎడలించు = తొలగించు , పారద్రోలు ; రక్షాబంధము = తాయెత్తు ;

    మేషి వర్తనము = గొర్రె నడక గొర్రె దాటు . మూర్ఖత్వముతో

    ఒకరినొకరు ననుసరించు ; దుర్మోహము = అఙ్ఞానము }

    రిప్లయితొలగించండి
  19. నాటకమున కన్నీటిని
    ధాటిగ కురిపించి గెలువ తను బహుమతులన్
    సాటెవ్వరు (సాటియెవరు) రారాదని
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  20. నీటుగ నాట్యమాడి కడు నేర్పున పాత్రయు రక్తికట్టగా
    బోటి చెలంగుటన్ కనుచు పొంగమనస్సులు సంతసమ్ముతో
    నాటక మందునన్ నటన నచ్చిన చూపఱు పల్కిరివ్విధిన్
    “కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్ “

    రిప్లయితొలగించండి
  21. కందం
    చాటుగ హరి సుమమిడ వ
    ధూటి విదర్భజకు సత్య త్రొక్కిన పామై
    ఘాటుగ నిరసన దెల్పఁగఁ
    గాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి

  22. ‘’*కంజదళాయతనేత్రి* అని వాడవచ్చును. పారిజాతాపహరణం లో ద్వితీయాశ్వాసంలో పద్యసంఖ్య 20 లో నేత్రి అని నంది తిమ్మన గారు ప్రయోగించి యున్నారు. దీనిని చిన్నయసూరి గారు ఆమోదించకపోయినప్పటికినీ చిన్నయసూరి అనుయాయి ప్రసిద్ధ వ్యాఖ్యానకారులు శ్రీ దూసి రామమూర్తి గారు సమర్థించినారు. కాబట్టి కంజదళాయతనేత్రి అనడం సరియైనదే ‘’అని అవధాన విద్యా గురువరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు తెలియజేసినారండీ. కోట రాజశేఖర్.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    (నరకునిఁ జంప నుకించిన సత్యభామ చేష్టితము)

    మేటి వరమ్ముచేఁ గుజుఁడు మెండగు గర్వము పెచ్చుమీఱఁగన్,
    బాటిని వీడి, దేవ మునివర్యులఁ, గాంతలఁ గాసిఁ బెట్టఁగాఁ;
    బోటునఁ జంప నా నరకుఁ, బూనియుఁ గ్రోధముఁ గొంటకై వెసన్

    గాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్!

    రిప్లయితొలగించండి
  24. మేటి యవరోధ గములను
    దాటి గడువు లోనఁ గట్టి, తాఁ గన్నుల నా
    పూఁట సుమహా ప్రశాంతతఁ
    గాటుకగ ధరించె నింతి, కారము నెలమిన్

    [కారము = పన్ను]


    మేటి గృహాధికారమును మీన సునేత్ర వహించు నింపుగన్
    బోటి మహోపకారము నపూర్వపు రీతినిఁ జేయు నిత్యమున్
    గాటును వీడి యుత్తమముగన్ మమకారము సూపుఁ గన్నులం
    గాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్

    [గాటు = కారము]

    బాల.వ్యాక. తత్సమ.85
    అంగాదులకుఁ దప్ప సంయోగోపధంబులకు ఙీప్ప్రత్యయంబు లేమింజేసి మీననేత్రి - పద్మనేత్రి ఇత్యాదు లసాధువులు.

    రిప్లయితొలగించండి
  25. వేటును వేయగా దనుజు వేల్పుల గూర్చను శ్రేయమెంతయో
    మేటగు నాయుధమ్ములను మేలగు రీతిని చేధరించుచున్
    గాటపు క్రోధమున్ననిని కాముని శత్రువు నర్ధదేహమే
    నాటగ నెర్రనైనపొడ నల్లని దేహము కాంతులీనగన్
    కాటుకగా ధరించెగద కంజదళాయత నేత్రి కారమున్

    రిప్లయితొలగించండి
  26. చీటికి మాటికి జనులన్
    నోటికి వచ్చిన విధముగ నుగ్గించెడు నో
    బోటిని గని జను లిటులనె
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్!!!

    రిప్లయితొలగించండి
  27. దూరదర్శిని లో సీరియలు జూచుచు ఓ నళినాక్షి నిర్వాకం...

    ఉత్పలమాల

    చేటెడు బియ్యమున్ జెరిగి చెక్కును దీయుచు దుంపకూరకున్
    నాటక వాహికన్ గనుచు నాయిక కష్టము కంట నీరిడన్
    వాటుగఁ జేతితో మిరప నొల్చుచు కారిన కంటి నొత్తుచున్
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్రి కారమున్! 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం సవరణతో:

      వాటుగ నొల్చుచున్ మిరపఁ బట్టిన జేతనె కంటి నొత్తుచున్

      తొలగించండి
  28. నీటుగ తా నైటెక్సును
    కాటుకగ ధరించె నింతి, కారము నెలమిన్
    వాటము కొలదిగ వేసెను
    ఘాటుగ శాకమ్ము వండ కమ్మని రుచికై.

    రిప్లయితొలగించండి
  29. సూటిగ లేపనమును లత
    కాటుకుగ ధరించె ,నింతి కారము నెలమి న్
    ఘాటుగ నుండుట కొరకై
    మేటిగనే వేసియుండె మీరా జాస్మిన్

    రిప్లయితొలగించండి
  30. చేటును మాన్పునని కనుల
    కాటుక ధరించె నింతి!కారము నెలమిన్
    ఘాటుగ దంచిన పొడి
    నోటికి రుచియైన విధమునన్ వంటలకై

    రిప్లయితొలగించండి
  31. పూటుగ తాగిన వాసన
    కోటున నధరంపు జాడ కూడినవిధమున్
    లేటుగ రాగమగండు నిశి
    కాటుకగ ధరించె నింతి కారమునెలమిన్!

    రిప్లయితొలగించండి
  32. ఘాట గు లేపనంబునుట కంజపు లోచన నేత్ర శుద్ది కై
    కాటుకగా ధరించె గద కంజ దళాయ నేత్ర ,కారమున్
    మేటిగ వాడుచో కనులు మీరని వేడికి నెఱ్ఱ బడ్డవై
    మాటికి మాటికి న్నవియ మైకము గల్గుచు మూయునో సుమా

    రిప్లయితొలగించండి
  33. ఇప్పుడే vj entertainments అనే ఛానెల్ వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో ఎడిటింగ్ పూర్తి చేసి యూట్యూబులో కూడా పెడతారట!

    రిప్లయితొలగించండి
  34. అభినందనలు గురుదేవా! సమయాన్ని యేదో ఒక విధంగా సద్వినియోగ పరుస్తున్నారన్నమాట! 💐💐💐💐💐

    రిప్లయితొలగించండి

  35. ..........సమస్య
    కాటుగగా ధరించె గద!
    కంజదళాయత నేత్రి కారమున్

    సందర్భము: రాధాకృష్ణుల ప్రణయం (మధుర భక్తి) జగద్విదితము. పరమ పవిత్రము.
    రాధ కృష్ణునిమీది ధ్యాసతో పెరుగు చిలుకుతూ వున్నది. కాని అది రిక్త (ఖాళీ) పాత్ర యన్నది మరచి పోయింది.
    కృష్ణుడేమో రాధమీది ప్రేమలో మైమరచి పోయి పాలు పితుకడానికి ఒక వృషభం వద్దకు చేరుకున్నా డట ! అది ఎద్దు అన్న సంగతి మరచిపోయాడట!
    ఊటగ.. ఎంతో ఎక్కువై పోయిన లేదా ఎప్పుడూ పొంగుతూ వున్న.. ప్రేమ.. ఊట.. అంటే కన్నడంలో భోజన మని యర్థం. (ఊట మాడు=భోజనం చెయ్యి) 'ఊటయు మర్వగ జేయు' నంటే భోజనాన్ని కూడా మరచేటట్టు చేస్తుంది.
    భక్తురాలైన మీరా దేవి కృష్ణుని చింతనలో మునిగిపోయి, రాధా భావనలో (రాధను ధ్యానిస్తూ అనియు తానే రాధ నని భావిస్తూ అనియు రెం డర్థాలు) మునిగిపోయి కారపు పొడి అన్న సంగతి మరచిపోయి కాటుకగా ధరించిన దట!
    ~~~~~
    ఊ..టగ నున్న ప్రేమ యట!
    'ఊట'యు మర్వగఁ జేయు నంట! యా
    రాటము మీరఁ జిల్కె నట!
    రాధిక తా దధి.. రిక్త పాత్రలో..,
    పాటున మాధవుండు వృష
    భంబునఁ బాల్ పితుకంగఁ జూచె.. నా
    పాటల గంధి *మీర* హరి
    భావన మీరగ రాధ భావనన్
    కాటుకగా ధరించెఁ గద
    కంజ ద ళాయత నేత్రి కారమున్

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అద్భుతమండీ వెలుదండ వారు !

      కనకధారాస్తవాన్ని తెలుగులో అందించిన వెలుదండ వారు మీరేనా ?

      మీ భావన + కోట రాజశేఖరుల వారి భావన సమాంతరంగా అద్భుతః!

      జిలేబి

      తొలగించండి
  36. పాటలగంధి సత్య తమి పట్టగ లేక నిరస్త భూషయై
    పాటిలు కోప భారమున పండె ధరాస్థలి మ్లాన వస్త్రయై
    చేటియ కన్ను లెర్రబడి చిమ్మగ బాష్పము లించుకంత తా
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్.

    ( అతిశయోక్తి శృతి మించిన్దంటారా? )

    రిప్లయితొలగించండి
  37. నీటుగనద్దముముందర
    పాటుగమేకప్పుజేసి నప్పాటలగంధే
    కాటుకమరచితినేనని
    కాటుకధరియించెనంత కారపుచేతన్..
    *******************************
    --రావెల పురుషోత్తమ రావు
    [అమెరికా]-- supani@gmail.com

    రిప్లయితొలగించండి
  38. మేటిభటాళి రక్షగల మిన్నపురంబును సొచ్చి సీతకై
    ధాటిగ తిర్గుచున్ తుదకు ధాత్రిజ సన్నిధి కేగగా నటన్
    బోటియె రాక్షసుండనుచు పొమ్మనె కన్నుల నిప్పురాల్చుచున్
    కాటుకగా ధరించె గద కంజదళాయత నేత్రి కారమున్

    రిప్లయితొలగించండి
  39. చీటికి మాటికి యలుగుచు
    కూటికి రానట్టి సుతుని కోపము తోడన్
    బోటియె చూడగ కన్నుల
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  40. కం:-
    నాటకమాడెను సోనియ
    వాటంబునెఱిగిన మోది వైమాలమ్మున్
    తూటాలుబేల్చియాంద్రుల
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్ !!!

    @ మీ పాండురంగడు*
    ౦౬/౦౨/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  41. పాటునె, నమ్మియు నిత్యము,
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్
    లోటనరించక జేయుచు
    దీటుగ జీవించుచుండె ధీరతతోడన్

    రిప్లయితొలగించండి
  42. మాటలు మాత్రమె జెప్పుచు
    పాటులు దెచ్చెడి మొగుడికి పైకము తేకన్
    తాటలు దీయగ జూచుచు
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  43. మూటగ నగలను దెచ్చెద¢
    మాటను యిచ్చెను ముదముగ మాపటి వేళన్
    చాటుగ నూరక వచ్చిన
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  44. పేటను గల్గునిర్వురికి పెద్దలు వేడుక బెండ్లి సేయగన్
    చీటికి మాటికిన్ బతిని చిక్కులబెట్టుచు తూలనాడుచున్
    బోటి చరింపుచుండనొక ప్రొద్దున టక్కరి దుఃఖమొల్కగన్
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్

    రిప్లయితొలగించండి
  45. తాటకిగ నత్త యిడుమల
    వాటిల్లజరించెననుచు వడి దొంగేడ్పుల్
    చాటుచు నశ్రువులొలుకగ
    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్

    రిప్లయితొలగించండి
  46. మాటకు, మాటకున్, కొసరు మాటలయందున నైన వీడడా
    పాటలగంధితో తనదు భాషల పట్టున, మెల్ల మెల్లగా
    చాటగు మాటలన్ తెరువు జాతరలందున పల్కుటల్; పరా
    కేటికి నెంచడో యనుచు హేల నసత్యపు కోపధారియై
    కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్ !!

    రిప్లయితొలగించండి

  47. ..........సమస్య
    కాటుకగా ధరించె గద!
    కంజదళాయత నేత్ర కారమున్

    సందర్భము: ఒక చిన్నపిల్లకు కాటు కంటే ఎంతో యిష్టం. వేలితో తీసి కండ్లకు ముద్దలు ముద్దలుగా రాచుకునేది. తల్లికి పెద్ద సమస్య వచ్చి పడింది.
    ఆ పాపకు కారపుపొడి చూస్తేనే భయం. తల్లి గమనించి ఒక ఖాళీ సీసా తీసుకొని పైన *కారపు పొడి* అని వ్రాసింది. అందులో జాగ్రత్తగా కాటుక డబ్బీ దాచుకున్నది. కూతురు చూడనప్పుడు తీసి రాచుకునేది.
    ~~~~~~~
    "తేటగ నున్న కన్నులకుఁ
    దెట్టెలు తెట్టెలు పూయు పిల్ల యీ
    కాటుక, కారపుం బొడినిఁ
    గాంచిన ముట్ట" దటంచుఁ దల్లి తా
    పాటుగ ఖాళి సీసపయి
    వ్రాసెను "కార" మటంచు, నందులో
    కాటుక డబ్బి చిన్న దిడి
    కన్నుల దిద్దును చాటుగా నహో..
    కాటుకగా ధరించెఁ గద
    కంజ ద ళాయత నేత్ర కారమున్!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    తెట్టె, తెట్ట=సమూహము, ముద్ద

    రిప్లయితొలగించండి



  48. నాటకములు యందు సైతము

    దీటుగ నటియించుచు నీతి దీనత్వముతో

    నీటుగ నటలీనంబై

    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్.


    చాటుగ పతిపై కోపము

    పూటుగ క్రోధంబు పూని భోరున నేడ్వన్

    చేటియు నొసంగి కైకలూరు

    కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్.

    రిప్లయితొలగించండి
  49. దీటుగ కన్నులందునను తియ్యని ప్రేమను భర్తకోసమై
    కాటుకగా ధరించెఁ గద;...కంజదళాయతనేత్ర కారమున్
    మాటల మాటలందునను మామకు నత్తకు నాడబిడ్డకున్
    చీటికి మాటికిన్ తొడిగె చీపురు కట్టను చేతికెత్తుచున్

    రిప్లయితొలగించండి