7, ఫిబ్రవరి 2018, బుధవారం

దత్తపది - 134 (ఏరు-పారు-ఊరు-మారు)

ఏరు - పారు - ఊరు - మారు
పై పదాలను ఉపయోగిస్తూ
పల్లీయ సౌందర్యాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఇందిరా శ్రీనివాస్ గారు ఇచ్చిన దత్తపది)

55 కామెంట్‌లు:

 1. ఏరులు నేరులై పడగలెత్తును చుట్టరికంపు పిల్పులున్;
  పారును పుష్కలంబుగను బర్వుల దీయుచు వాగువంకలున్;
  ఊరును నోటిలో జలము లూరిన పచ్చడు లెంఛిచూచినన్;
  మారును యంత్రజీవనము మంగళమూర్తి పల్లెగాంచినన్.

  రిప్లయితొలగించండి


 2. ఏరుపారుచు సుందరమ్ముగ నేతమెత్తెను పల్లెయు
  న్నూరుపైసల నాణ్యమైన వినూత్నపంటల రీతులన్
  మారుబల్కక దేవళమ్మున మద్దతిచ్చెడు సేవలన్
  సారగంధపు ఛాయలన్ మనసారబిల్చు సపర్యలన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మూడపపాదంలో-లెంచి అని, నాల్గవపాదంలో- మూర్తిని అని -చదువమనవి.

  రిప్లయితొలగించండి
 4. పల్లె పట్టు ల నేరులు పారు చుండ
  పచ్చ పొ ల ము లు గాలులు స్వచ్ఛ మగుచు
  అన్ని రంగాల వృద్ది యై య ల రు చుండ
  ఊరు మారు ను యువ కు లు నుత్స హింప

  రిప్లయితొలగించండి
 5. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశము :: దత్తపది { సంఖ్య-134 } ( ఇచ్చిన పదాలు :: *ఏరు* *పారు* *ఊరు* *మారు* )
  విషయము :: పల్లీయ సౌందర్య వర్ణన
  ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయవచ్చు.
  ఎంపిక చేసికొన్న ఛందస్సు :: *మత్తకోకిల*
  సందర్భం :: సుమతీ శతకాన్ని రచించిన బద్దెన *అప్పిచ్చువాడు, వైద్యుడు....* అనే పద్యంలో ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఉన్న ఊరిలో ఉండు అని హితవు పలికినారు. నీరే *ప్రాణాధారము* అని మరొక పద్యంలో అన్నారు. పల్లెటూర్లలో పంట కాలువలలో నీరు ఏరులలో వలె నిండుగా కన్నుల కింపు చేకూరుస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆదృశ్యాన్ని చూస్తుంటే రైతుల కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతుంటాయి. జలకళ కారణంగా పల్లెలు సస్యశ్యామలంగా విరాజిల్లుతుంటాయి. పాడి పంటలతో ఎల్లప్పుడూ విలసిల్లే *పల్లెలే మన భారత దేశానికి పట్టుగొమ్మలు* అని మన జాతిపిత గాంధీతాత తెలియజేశారు గదండీ. అందువలన పల్లెలను వదలివేసి పట్టణాలకు వెళ్లడం సరికాదు. రైతు పల్లెలను వదలిపెట్టకుండా అన్నదాతగా మెలగుతూ లోకకల్యాణ కారకుడుగా ధన్యజీవి కావాలని ఆకాంక్షించే సందర్భం.

  ఏరులో యన కాల్వ లన్నియు నింపుగా కనిపించుచున్
  పారు చుండగ , రాలు మోదపు బాష్ప వారియె , సర్వదా
  ఊరు పచ్చగ పాడిపంటల నుండు పల్లెల నుండుమా
  మారు పల్కక యన్నదాతగ , మారుమా ! హిత మెంచుమా!
  భారతాంబకు పట్టుగొమ్మలు పల్లెలే యనె గాంధియున్.
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (7-2-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఊరది రాజశేఖరుని యూరవధానిది! దానిప్రక్కనే
   పారును ఏరురా! పడుగుపాడను పేరుకు మారుపేరు కో
   వూరుర! పైరుపంటలకు పూలకు పండ్లకు పాలకున్ భళా
   కూరకు నారకున్ పడుచు కోమలి చెన్నుకు పేరుమ్రోగగా!

   🙏🙏🙏

   తొలగించండి
  2. మైలవరపు వారి సందేహం... నా సంతాపం..

   *****************************
   పద్యం చాలా బాగుందండీ.. *కోమలి*.... *యతి*... కొరకేనా?! 😊


   *************************

   🙏🙏🙏

   నా పదహారేళ్ళ వయసులో అడపా దడపా పడుగుపాడులో నాలుగేళ్ళు ఉన్నానులెండి...

   😊😊😊😊

   ***************************

   ఓ... అదా సంగతి! ఐతే ఓకే 🙏

   తొలగించండి


  3. కోవూరు కోమలులనట
   తా వలపు విరిసెడు కొమరుదనమున జూడన్
   తావుల నద్దుచు వృత్తము
   గా విరిసెనయ పలుకులనఘా ! సుకవివరా :)


   జిలేబి

   తొలగించండి
  4. వేచుచు యాభై ఏళ్ళుగ
   దాచుచు నాబోసి నోరు దంభము తోడన్
   చూచితి నా కోమలినహ!
   పీచది నించుకగ మార పిప్పళి బస్తా 😊

   తొలగించండి


  5. మారగ కాలము కోమలి
   మారెను గుండమ్మగా సుమా హహ్హహ్హా ! :)


   జిలేబి

   తొలగించండి
  6. శాస్త్రి గారు నమస్సులు. “వృత” శబ్ద ప్రయోగము గమనించండి.
   “వానరైర్బహుభిర్వృతః.” వాల్మీకి మహర్షి ప్రయోగము: వృతము

   తొలగించండి
  7. నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” సప్తపఞ్చాశ సర్గమున నేటి పద్యములలో నొకటి.


   విలసిల్లె నంగదుఁ డరయ
   లలితమ్ముగఁ గపి వరేణ్యుల పరివృతమునం
   గొలువున నమరులఁ గూడిన
   బలసూదనునిఁ దలపించి వాలి సుతుఁ డటన్

   మూలము:

   తస్థౌ తత్రాఙ్గదః శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః.
   ఉపాస్యమానో విబుధైర్దివి దేవపతిర్యథా৷৷5.57.50৷৷

   తొలగించండి
  8. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! నిన్నటి నేత్ర నేత్రి లకు కొనసాగింపుగా గాత్ర గాత్రి లను పుం, స్త్రీ లింగాలకు వాడ వచ్చునా అని సందేహము వచ్చినది! సుమగాత్రి, కోమల గాత్రి అనే ప్రయోగాలు సాధారణంగా వాడుతూ ఉంటారు! దయచేసి వివరించగలరు!

   తొలగించండి
  9. డా. సీతా దేవి గారు మంచి ప్రశ్న వేశారు.

   గాత్రము (అ కారాంత నపుంసక) శరీరము, అవయువమను నర్థమున. అయితే యిది అంగాదుల లోనికి వచ్చును. అందుచేత స్త్రీ లింగములో గాత్రా, గాత్రీ యని రెండు రూపములు సాధువులు.

   గాతృ (ఋ కారాంతము) గాయకుడను నర్థమున. గాతా (పుం) గాత్రీ (స్త్రీ). తత్సమములో గాత, గాత్రి.

   తొలగించండి
  10. ధన్యవాదములండీ! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి

 6. ఏరుల్ పారని యూరు మా రువణమున్ రేకంటు మాడ్చన్ సదా
  కోరన్పల్లెల వైభవమ్ము నకటా గూర్చన్నెటుల్పద్యమున్ ?
  చేరెన్రైతు పురమ్ము భాగ్యమను గోచీ గాంచ నీనాడు తా
  మారెన్గాదయ కూలినాలి బతుకున్ మాన్యంబు గా జూచుచున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ఏరులు మనుగడలకు నా
  ధారములై పారుచుండ ధాన్యము లొసగున్
  ఊరున కృషిజీవనములు
  మారును, ప్రజలందరు పరమానందులగున్

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  అప్పులిడువాడు , వైద్యుండు నమరియుండ ,
  నెడతెగక యేరు చల్లగా పారుచుండ ,
  హితముఁ జెప్పెడి వర పురోహితులునుండ
  నూరు గతి మారు !నివసింప యోగ్యమదియె!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరించితి... మన్నింపుడు..

   అప్పులిడువాడు , వైద్యుండు నమరియుండ ,
   యెడతెగక పారు చల్లని యేరునుండ ,
   హితముఁ జెప్పెడి వర పురోహితులునుండ
   నూరు గతి మారు ! నివసింప యోగ్యమదియె !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. ఏరును బారుచుండె , నిక నెత్తర నాగలి నీ భుజాన , రా..
   రా! రమణయ్య! యెద్దులను రాముని భీముని బూన్చి , దున్న , బం..
   గారము పండు , నేల యనగానిది జాతికి నన్నపూర్ణయౌ !
   నూరును కన్నతల్లియు నహో ! సురభూమికి మారుపేరులౌ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. నమోనమః జిలేబీ గారికి 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 9. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  రాత్రి మా హోంలో సత్తయ్య అనే ఆత్మీయ మిత్రుడు అకస్మాత్తుగా మరణించాడు. రాత్రి నిద్ర లేదు. మనస్సంతా వికలమయింది. వాళ్ళది కరీంనగర్. ఉదయం తీసుకువెళ్లారు. కంటి ఆపరేషన్ అయిన కారణంగా ప్రయాణం చేయకూడదని వెళ్ళలేదు.

  రిప్లయితొలగించండి
 10. *ఏరు*వాకల రైతన్న లెలమి చెలగ
  *పారు* నది సొంపు వంపులు పరిఢవిల్ల
  *ఊరు*వాడలు సంతోష మొనరి తనర
  *మారు*మూలల పల్లెలు సౌరులెసగె.

  రిప్లయితొలగించండి
 11. కం ఊరున నప్పిచ్చెడి వ్యా
  పారులు , వైద్యుండు నుండవలె జలభరమౌ
  నేరును ద్విజు డుండవలెను
  మారుము గ్రామమ్ము నివియె మసలక యున్నన్
  (అప్పిచ్చు వాడు, వైద్యుడు అనే పద్యభావాన్ని కాపీ కొట్టేశాను. అన్ని పాయింట్లూ వచ్చాయి కదా ! సంతోషం )

  రిప్లయితొలగించండి
 12. అందమైన యూరు, నలరింప ప్రక్కనే
  యేరు పారు చుండు మారు టేరు
  వృద్ధి యందు స్పర్ధ విలసిల్లు నిత్యము
  కలిమి మరియు గట్టి చెలిమి మధ్య.
  ****)()(****
  ఊరిపేరు :మారుటేరు ; మార్టేరు.

  రిప్లయితొలగించండి
 13. ఏరు పారువేళ నేకకాలమునందు
  నేరువాక సాగు నేక బిగిని
  మారు మూలనుండి మహిత సంపద లిచ్చు
  భరత భూమి సరము పల్లెటూరు

  రిప్లయితొలగించండి
 14. ఆటవెలది
  గంగ పాయ యనఁగ మంగళమ్ముగ నేరు
  నండ నుండు చెఱువు నిండ పారు
  పాడిపంట లొసఁగ భాసిల్లు మా యూరు
  ఔర! యేరుఁ బారు నూరు మారు!!

  రిప్లయితొలగించండి
 15. ఆ.వె.
  పాడి పంటలందు పైకపుటేరులై
  పారుచుండె నాడు పల్లెటూరు
  నదులువట్టిపోయి నకనకలాడుచు
  మారురూపుఁజెంది మసలెనేడు!!

  @ మీ పాండురంగడు*
  ౦౭/౦౨/౨౦౧౮

  రిప్లయితొలగించండి
 16. ఊ రుత సంగీతము లే
  పారును లేమా రుజలవి పాఱవు కాంచన్
  మారుతమున నెన్నండును
  బైరులకై యేరువాక పల్లెల సాగున్

  రిప్లయితొలగించండి
 17. ఏరు బట్టిన సేద్యకారులు నెడ్లబండుల సందడుల్
  పారు ఏరులు పైరుపాపలు పల్లవించు జనాంతమున్
  మారు పన్నది లేక పండెడు మట్టిలో నవధాన్యముల్
  ఊరు బంచెడి నాదరమ్ములు నుర్వి స్వర్గమె పల్లియన్!!!

  రిప్లయితొలగించండి
 18. కనుచూపు మేరను కనువిందు గొల్పుచు
  నేరు పారెడు మేటి సౌరులొకట
  పచ్చ పచ్చని పైరు పచ్చల హారాలు
  పుడమిపై నేపారు పొల్పులొకట
  నీలి మబ్బులపైన తేలు కొంగలబారు
  వేమారు మది దోచు వింతలొకట
  ప్రత్యూష కిరణాలు ప్రతి ఫలించెడు రీతి
  నూరున గుడుల సింగారమొకటి

  నరయ ప్రకృతి సొబగులనన్ని తనదు
  శిరము నందున ధరియించి సిరులనొల్కు
  పల్లె సౌందర్య గరిమను బ్రస్తుతింప
  దరమె యెవ్వరికైన నీ ధరణి యందు

  రిప్లయితొలగించండి
 19. ఏరులు పైరులు పసరాల్
  తేరులు పూజారులు తగు దేవేరులు నిం
  పారెడు మారుపుబేరాల్
  కూరిమి ఘనరోగహారి కూరిన యూరౌ!

  రిప్లయితొలగించండి
 20. ఊరు వెలుపలి సెలయేరు పారు హోరు
  పంట పొలములో పొలతుల పాట తీరు
  హాయి గొలిపెడి పల్లెల యందమంత
  మారు చుండె నిర్మానుష మాయె నేడు.

  రిప్లయితొలగించండి


 21. హోరన కరవాలముగా
  మారును గఱికయు వినదగు మామాటలనన్
  పారు నెడతెగక రక్తపు
  టేరులు మావూరిలోన టెంకణమిడుమా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. పారుచు హొయలొలికించెడి
  యేరును పచ్చనిపొలములునింపగు గిరులీ
  యూరుకు నలుదెసల మలయ
  మారుత వీచికలు దివియె మాయూరనినన్

  రిప్లయితొలగించండి
 23. వారకము సతము నిడెడివాడు నూరుజుండు,
  నశ్వినీ కుమారు సములు ననవరతము
  స్వస్త తనిడును, పారుడు సతతము చెడు
  మంఛి రోజులు దెల్పును,మంచి నీటి
  యేరు దాహము దీర్చును యేరువున వ
  సించు పౌరులె పుడు పల్లె సీమ లోన
  యుండ దలచిన పైవన్ని జూడ వలయు
  వారకము = అప్పు

  రిప్లయితొలగించండి
 24. అప్పిచ్చు వాడు వలె ఈ పద్యము వ్రాశాను

  రిప్లయితొలగించండి
 25. ఏరు - పారు - ఊరు - మారు అన్యార్ధములో నుపయోగిమ్చాను

  రిప్లయితొలగించండి


 26. బిరాన నేరు పారు చేర పిల్ల గాలి పైరులున్
  సరాబు లంగడిన్ బజారు సాగు చుండు నూరిలో
  విరాజితమ్ము దేవళమ్ము వింగడమ్ము గాను మా
  రు రాత్రి చుక్కలమ్మ లెల్ల రూఢి గాను గాన్పడన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. పల్లెటూరులయందునబారునదులు
  పచ్చపొలములకిరవయ్యిపసిడిపండి
  మార్చునూరును,శోభిల్లియేరుబ్రాల
  బసిడిరంగునుబోలుచుభాసిలుగద

  రిప్లయితొలగించండి

 28. ఘోరపు కరవులు పూడిన
  యేరులు తీరని బకాయి లెరువుల లేముల్
  పారెడు కన్నీళ్ళును హత
  మారెడు బ్రతుకులవి జూడ మారిన యూరుల్!

  రిప్లయితొలగించండి
 29. తే.గీ ఏరు సతతమ్ము పారెడు నిట్టి యూరు,
  నూరు బావుల గలిగిన యూరు మారు
  మారుతీ కార్ల సోకుతో మరచి నేల
  నేల నమ్ముట యని యీసడించు కొనుచు .
  (ముకతపదగ్రస్తాలంకారముతో)

  రిప్లయితొలగించండి
 30. పారు నీరమె పంట చేలకు బంధువై దరి చేరగా
  యూరి కోసమె యేరు యన్నటు లొప్పు చుండగ మెల్లనౌ
  మారుతమ్మిల సోకి నంతట మౌనమే విడి పోవఁగా
  కూరిమిన్ కొని యాడె నెమ్మియె కోకిలొక్కటి పాడగన్ !

  రిప్లయితొలగించండి
 31. ఊరు మమతలు హ్రుద యాల యూరు మాది
  పారు పత్యము లేని సొంపారు పురము
  మారు పద్దతు లనిన ముమ్మారు వీడు
  ఏ రుమాలను వీడుటే ఎరుగరెవరు !

  రిప్లయితొలగించండి
 32. జలజలమని పారు సెలయేరుల ఘురణము
  పసిడి పంటల పైనుండి పైర గాలి
  పొంగి పొరలు మైత్రి గలుగు పొరుగు వారు
  మంచితనముకు మావూరు మారు పేరు.

  రిప్లయితొలగించండి
 33. ..........దత్తపది
  *ఏరు - పారు - ఊరు - మారు*
  పై పదాలతో పల్లీయ సౌందర్య వర్ణన

  సందర్భము: మమతలు పంచే వారు, ఎప్పుడూ పారే ఏరు, పురోహితుడు, వైద్యుడు, అప్పిచ్చే వారు వుండే వూరు నివసించదగింది అని భావం. ఇందులో విశేష మేమి? "అప్పిచ్చువాడు వైద్యుడు" అనే సుమతి శతక పద్యం లోని భావమే కదా! అనవచ్చు.
  అందులో వున్న వన్నీ పేర్కొంటూనే అదనంగా మరికొన్ని అంశాలు చేర్చడం విశేషం. కందాన్ని మరో కందంలో చెప్పడం మరో విశేషం.
  అదనపు టంశా లేమంటే 'మార్పు చెందని మమతలు' మమతలు పంచే వా రుండాలి. లేకపోతే ఎన్ని సౌకర్యా లున్నా ఆ వూళ్ళో ఎక్కువ కాలం ఉండా లనుకోడు మనిషి. ఎక్కడ తన బంధు మిత్రు లుంటారో అక్కడికే వెళ్ళి పోతాడు.
  మూడవ పాదంలో మరో విశేషం కూడ వుంది. పరిశీలింతురు గాక!
  ~~~~
  మారుపు చెందని మమతలు,

  పారుచునే యుండు నేరు,
  పారుడు, వైద్యుం,

  డూరక తా మ ప్పిచ్చెడు

  వారును గల యూరె యూరు
  వసియించుటకై

  2 వ పూరణము:

  సందర్భము: కుటుంబాన్ని వేరే వూరికి మార్చవలసి వచ్చినప్పుడు దురాశా పరుడైన ఒక పెద్ద మనిషి తన కొడుకుతో అంటున్న మాటలు.
  ఆ పెద్ద మనిషి అప్పు తీసుకుంటాడు గాని తిరిగి యీయడం యిష్ట ముండదు. పూజలు చేయించుకుంటాడు గాని పురోహితునికి దక్షిణ యీయడం యిష్ట ముండదు.
  అటువంటి వూ రుంటే ఒక్కసారి చూచి ర మ్మంటున్నాడు మరి!
  ~~~~~

  అప్పు లిచ్చి మరల నడుగని వా రుండి,

  పైస లడుగనట్టి పారు డుండి,
  -------
  యేరు లేకపోని బోరులో నీ రున్న
  --------
  యూరు చూడు మొక్కమారు కొడుక!
  --------- --------

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 34. కందం
  అరయఁగ ఋణమిడు ఘనులున్
  నిరతము పారు సెలయేరు, నేపుడు ,విధియున్
  పరగెడు నూరు పదిల మవి
  మఱుగైన పురము వదలుచు మారుట మేలౌ.

  రిప్లయితొలగించండి
 35. ఊరుల తీరేమారెను
  మారుగ యేరులకు బదులు మందులబారుల్!
  పారుచునుండగ, ప్రభులే
  మారగ దృక్పధమ్ము మిగుల మాయల చిత్తుల్!!

  రిప్లయితొలగించండి


 36. పాడి పంట లున్న పచ్చని మావూరు

  చెంత నేేరు పారు చింత లేదు

  ఐకమత్యమూని యనురాగమును పెంచు

  నూరు మాది ఘనుడు మారబోదు.  పల్లెటూరుయన్న పచ్చని చేలుండు

  నీరు పారు నట్టి యేరు లుండు

  మారు పలుకు కుండా మమతను పంచెలు

  గొప్ప వూరు మాది కువలయాన.


  పల్లెటూరు మాది పట్టణమటులుండు

  పారుచుండు నేరు పల్లెలందు

  మారు మాట లాడి మదికి బాధలిడరు

  పంచు కొందు రెల్ల మంచి చెడులు.

  రిప్లయితొలగించండి