14, ఫిబ్రవరి 2018, బుధవారం

సమస్య - 2597 (దారముపై వ్రాలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్"
(లేదా...)
"దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

100 కామెంట్‌లు:

 1. వారము వర్జ్యము లేకయె
  గారము తోడను వెదకుచు కనిపించగనే
  కూరిమితో తోటన మం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
 2. దారులు వెదకుచు నెగిరెను
  నీరముపై నున్నకలువల నేత్రము లన్నీ
  కేదారము ముంగిట గలమం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'అన్నీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "నీరముపై గల కలువల నేత్రము లెల్లన్" అనండి.

   తొలగించండి
  2. శాస్త్రి చెప్పేవరకు నేను ప్రాసదోషాన్ని గమనించలేదు.

   తొలగించండి
 3. అవునుకదా మర్చిపోయాను . ధన్య వాదములు GPS . గారు
  ---------------------------
  దారులు వెదకుచు నెగిరెను
  నీరముపై నున్నకలువల నేత్రము లన్నీ
  ద్వారము ముంగిట గలమం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'అన్నీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "నీరముపై గల కలువల నేత్రము లెల్లన్" అనండి.

   తొలగించండి
  2. దారులు వెదకుచు నెగిరెను
   నీరముపై గల కలువల నేత్రము లెల్లన్
   ద్వారము ముంగిట గలమం
   దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

   తొలగించండి
 4. రారమ్మని చెలియ పిలువ
  నా రసికుడు వేగ వెడలె నతివను గూడన్
  కోరుచు వికసించిన మం
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్

  రిప్లయితొలగించండి
 5. పూరిత కోరిక లింపై
  తోరపు వనశోభ వెల్గ దోహద పడుచున్
  సారెకుఁజని మురిసియు మం
  దారముపై వ్రాలెఁదేటి త్రాగగ మధువున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పూరిత కోరికలు' దుష్టసమాసం. "కూరిమి కోరిక లింపై/ పూరిత వాంఛలె యింపై" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు
   సూచనననుసరించి సవరించిన పూరణ
   పూరిత వాంఛలె యింపై
   తోరపు వనశోభ వెల్గ దోహదపడుచున్
   సారెకుఁజని మురిసియు మం
   దారముపై వ్రాలెఁదేటి త్రాగగ మధువున్

   తొలగించండి


 6. వారిజ నేత్ర జిలేబియు
  కూరిచె మల్లియ లనంట కూర్మిగ తృటిలో
  నారాటపడుచు ఝుమ్మని
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్ !

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. దారిమరలెనింగితమిల
  నారీనరులు పరవశత నందుండినచో
  జారుడహల్యకథతఱిన్
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  ఔరా ! వలదని పోయెద..
  వేరా ! యిటు రమ్మటంచు హిజ్రాల్ పిల్వన్
  కోరి యొకడు జన., సఖుడనె
  "దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్"!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధీరుడు గెల్చె కాలుని మదిన్ హరుఁ గొల్చి మృకండుసూనుడున్!
   పారముఁ జేరినారు దితిపట్టి , ధ్రువుల్ హరిఁ గొల్చి , నిత్యమున్
   కోరికలన్ త్యజియించియు నకుంఠితదీక్షను భక్తితత్త్వమం....
   దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. చిరుసవరణలతో....

   (దితిపట్టి సుతుండు... ప్రహ్లాదుడు)

   ధీరుడు గెల్చె కాలుని మదిన్ హరుఁ గొల్చి మృకండుసూనుడున్!
   పారముఁ జేరినారు దితిపట్టి సుతుండు ధ్రువుండు విష్ణువున్
   కోరి భజించి , ముక్తికి నకుంఠితదీక్షను భక్తితత్త్వమం....
   దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. రాసలీల..

   సారసనాభునిన్ గన విచారము జేసియు జేసి చేసియున్
   కోరిక దీర జూచుటకు గోపికలైరట యోగిబృందముల్ !
   చేరిరి యాటలాడిరి భజించి రమించిరి , కృష్ణ చిత్తమం...
   దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 9. పేరుచు సేవలన్ మదిని పేర్మిగ చేర్చుచు భక్తి మార్గమున్
  వారిజ నేత్ర గూర్చె నట వాంఛిత పుష్పములన్ విరాట్టుకై
  నారవిడిన్నిదేశమున నాంత్రము జేయుచు మత్తు గానటన్
  దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం పూర్వార్ధం అర్థం కాలేదు.

   తొలగించండి

  2. కందివారు నమో నమః

   ఆరవిడి - అలవాటు
   నిదేశము సమీపము

   అలవాటుగా సమీపమున స్తోత్రము ఝుమ్మని చేయుచు మత్తుగా :)


   సరియేనంటారా ?


   జిలేబి
   అలవాటుగా సమీపమున

   తొలగించండి
 10. దారను వెంటబెట్టుకొని దర్పకుడంతట శైలజామనో
  హారుని భక్త హృ ద్వన విహారుని ధ్యానవనంబు జేరగా
  మీరిన నుత్సుకత్వమున మేలగుగీతుల నాలపించిమం
  దారముపైన వ్రాలెనుగదా మకరందముగ్రోలదుమ్మెదల్

  రిప్లయితొలగించండి
 11. పార గ జూచు చు వె దుకు చు
  కోరిన విరుల న్ గని యె ను గు దు రు గ నొక చో
  భోరున న య్యే డ నా మం
  దార ము పై వ్రాలె తేటి త్రాగగ మధువు న్

  రిప్లయితొలగించండి
 12. సారంబగు కుటపమ్మున
  గారవముగ విరియు పూల గమకము గని సిం
  ధూరపు వన్నియ గల మం
  దారము పై వ్రాలె దేటి త్రాగగ మధువున్..!!!

  రిప్లయితొలగించండి
 13. *ధారలు పారగా మధువు ధాటిగపూవులరేకులందు నన్*
  *తీరగ దాహకాంక్ష మది తేనెలవిందుకు సిద్దమైచనన్*
  *జోరుగ బృందగీతికల ఝుమ్మను నాదము పల్లవించ మం*
  *దారముపైన వ్రాలెనుగదా మకరందముగ్రోల దుమ్మెదల్*

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2597
  సమస్య :: *దారము పైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోల తుమ్మెదల్.*
  *తుమ్మెదలు తేనెను త్రాగేందుకోసం దారంపైన వ్రాలినాయి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: పోతన భాగవతంలో పరమ భాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు విష్ణువిరోధి యైన తండ్రి హిరణ్యకశ్యపుని సమక్షంలో గురువు నుద్దేశించి మాట్లాడుతూ విష్ణు భక్తి యొక్క ఆకర్షణను గుఱించి తెలియజేస్తూ ఓ గురుదేవా !
  రాజహంస వాగులను వంకలను వదలివేసి ఆకాశగంగలో మాత్రమే విహరిస్తుంది.
  కోయిల కొండమల్లెను వదలి తియ్య మామిడి చిగుళ్లనే తింటుంది. చకోరపక్షి మంచును వదలి పండు వెన్నెలలో విహరిస్తుంది. అలాగే నా మనస్సు అనే తుమ్మెద శ్రీ మన్నారాయణుని పాద పద్మముల యందున్న మకరందాన్నే గ్రోలుటకు సిద్ధమయ్యింది. * {మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు బోవునే మదనములకు } * తుమ్మెదలు ఉమ్మెత్త పుష్పాలను వదలివేసి మకరందం గ్రోలేందుకోసం మందార పుష్పాలపై వ్రాలుతాయి గదా అని విశదీకరించే సందర్భం.

  శ్రీరమ గొల్చు పాదముల చిత్తము నిల్పి, భవాబ్ధి దాటగన్
  సారము భక్తిమార్గ మని, సాధన జేసెడివాడు శీఘ్రమే
  పారము జేరు , విష్ణు పద పద్మ సుధన్ గొనగోరి భృంగమై
  చేరితి సొక్కి ; యీ మదన సేవలు వ్యర్థము లంచు నెంచి మం
  *దారము పైన వ్రాలెను గదా మకరందము గ్రోల తుమ్మెదల్.*
  * [మదన పుష్పము = ఉమ్మెత్త పూవు] * * కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. * (14-2-2018)

  రిప్లయితొలగించండి
 15. కోరిక తీరగా వధువు క్రొత్తగ చేరగ కాపురమ్ములో
  నీరజ పుష్పముల్ విరిసి నీటుగ దీటుగ ప్రింట్లవింట్లతో
  వారిజ నేత్రకై కొనిన వాయిలు చీరను నారవేసి నా
  దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమచ్ఛాస్త్రి గారూ,
   చక్కని భావన. మనోహరమైన పూరణ. అభినందనలు.
   "ఆయవేయ నా దారముపైన..." అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. నా పద్యమును శ్రీయుతులు కవిపుంగవులు హనుమచ్ఛాస్త్రి గారిదనుకొని నన్ను పరవశ పరిచారు సార్!

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మన్నించాలి. దృష్టిదోషం! కంటి ఆపరేషన్ అయింది కదా!
   చక్కని వైవిధ్యమైన భావంతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
   "ఆరవేయ నా దారముపైన" అని ఉండాలి కదా!

   తొలగించండి
 16. ధీరోదాత్తుడగు నతడె
  గారముతో దరిని జేర కలల కదియె సా
  కారమన సతి మురిసె! మం
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్!

  రిప్లయితొలగించండి
 17. కోరికమీర *శంకరుడు* కోట్ల తెలుంగు శిలీముఖమ్ములన్
  ప్రేరణ జేయబాడిదము పెంచెను పద్యసుమమ్ము పూయగన్
  చేరుచు *శంకరాభరణ* శృంగము వేడుకమీర పద్య మం
  దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీహర్ష గారూ,
   మీ పూరణా పద్యమందారం మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. తీరిక దొరికిన నామది
  గోరుచు ధ్యానామృతమునె గ్రోలగ నెంచన్
  జోరుగ నూహలలో కే
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్

  రిప్లయితొలగించండి
 19. దూరముభారమెంచకయదోవిధిపూర్వసుకార్యభావనన్
  భూరి జవమ్ముఁ జేరి, విరబూసిన పుష్పవనమ్ము నందు ని
  ర్వారపిపాస తీరఁ, దనివార్చు సుధారసధారఁ గల్గు, మం
  దారముపై వ్రాలెఁ గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్,

  రిప్లయితొలగించండి
 20. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,

  [ ఒక యువతి ఉద్యానవనమును సమీపించగనె వికసించిన ఆమె

  నేత్రపద్మములపై తుమ్మెదలు వ్రాలెను . అపు డామె ప్రేమికుడు

  " నా దరి చేరుము , నా కవుగిలి లో దాచి నిన్ను రక్షించెద " అని

  పలికెను ]


  తారగ నొక్క లేమ ప్రమదావని , నా పరిఫుల్ల నేత్రపుం

  దారము పైన వ్రాలెను గదా మకరందము గ్రోల దుమ్మెదల్ |

  " చేరగ రమ్ము నా దరికి ప్రేయసి ! మత్పరిరంభమందునం

  జేరిచి నిన్ను రక్షణము జేతు " నటంచును ప్రేమికుం డనెన్


  { తారు = సమీపించు ; తారము = పద్మము , తామర ;

  తామర చెలి = పద్మ మిత్రుడు ; తామర కంటి = పద్మాక్షి }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీది రసవత్పూరణ. మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   'తారము' అంటే తామర అనే అర్థం లేనట్టుంది.

   తొలగించండి
 21. హోరని యెగురుచు నుండగ
  దూరముగా నొక్క చోట దోపగ విరిగా
  జోరుగ మది పొరబడి వే
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్
  ***&***
  (వేదారము = ఊసరవెల్లి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   'వేదారము'తో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 22. కూరిమి చెలులం గూడుచు
  వారిజనేత్ర విరులూన వాటికయందున్
  సారెకు మదవతి ముఖమం
  దారముపై వాలె దేటి త్రాగగ మధువున్ !

  అభిజ్ఞాన శాకుంతలము!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   నేను రేపు బయలుదేరి ఎల్లుండి ఉదయానికి నెల్లూరు చేరుకుంటాను. 16న మైలవరపు, కోట వారలతో సాహిత్య సమావేశంలో పాల్గొని తిరుపతి వెళ్తాను. తిరుపతి నుండి 19న బయలుదేరి 20న హైదరాబాదు చేరుకుంటాను.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు, నమస్సులు! మీ నెల్లూరు రాక వార్త మహదానందంగా ఉన్నది! ఏ రైలులో వస్తున్నారు! మా యింటికి తప్పక విచ్చేయ ప్రార్ధన! మీ బస యెక్కడ?
   నేను మా మిత్రులతో 17 న సోమనాధ్, పంచ దారకలు ఇత్యాది పర్యటనకు వెళ్తున్నాను. అందువలన 16 న విడవలూరు రాలేను!

   తొలగించండి
 23. ఔరా చూడుమయటమం
  దారముపైవ్రాలెదేటిత్రాగగమధువు
  న్నారగ ద్రాగినమధువును
  భూరుహపున్శాఖపైనపుట్టగబెట్టున్

  రిప్లయితొలగించండి
 24. దూరము వడిఁ జని చని కే
  దారమ్మునకు సరసన లతభవమ్ములతో
  నారయ నింపుగఁ దన ముం
  దారము, పై వ్రాలెఁ దేఁటి త్రాగఁగ మధువున్

  [ముందు+ఆరము = ముందారము: ఆరము = ఉద్యాన వనము]


  వారిద దత్త నీరములు పాఱఁగ వెల్లువలై చెలంగు నీ
  ధారుణి యం దపారము నదమ్ములు ప్రాణి హితమ్ము లౌచుఁ గా
  సారము నందు తామరస షండము లల్లన దోఁచగన్ మహో
  దారము, పైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'లతాభవమ్ములు' అనడం సాధువు కదా!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   అవునండి అదే సాధువు. ధన్యవాదములు. ముందు “లతాంతము” నూహించి యఖండ యతి యని సవరించుటలో నీ దోషము దొర్లినది.

   తొలగించండి
 25. కందం
  సారంగుని స్మరణమ్మే
  కూరుచు నన ముక్తి మధువు కొలువై రమణుల్
  జీరఁగ, నరుణాచల కే
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
 26. మీరలురాగదేయిటకుమీరునుజూడగరామనాధ!మం
  దారముపైనవ్రాలెనుగదామకరందముగ్రోలదుమ్మెదల్
  దారవిజంటజంటగటతారసియుండుటజూడగాభళా
  మీరనిసంతసంబులనుమేమిపుడిచ్చటపొందుచుంటిమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పదాల మధ్య వ్యవధానం ఉంచండి.

   తొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చారిమమై నలువందెడి
  సారంగమ నందనమున చాయలదోడన్
  సౌరభమున పొదికొను మం
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్

  రిప్లయితొలగించండి
 28. ఆరమణీయపు వనమును
  జేరగ నానందమొంది చిందిలి దరికిన్ ,
  గోరుచు ఝుమ్మనుచునె , మం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
 29. కోరి మకరంద మాధురిఁ
  నారసి పూదోట నొకటిఁ నామని వేళన్
  మీరగ సంతోషము మం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగగ మధువున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవీందర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఒకటి తర్వాత అర్ధానుస్వారం ఎందుకు?

   తొలగించండి
 30. ఈరోజు చాలామట్టుకు తుమ్మెదలన్నీ మందారాలపైనే వాలాయి. బహుశా అవన్నీ వనాలలో తిరుగుచూ మందారవ్రతం ఆచరిస్తున్నాయనుకుంటా...😃

  కానీ పాపం యీ తుమ్మెద దారి తప్పి పట్నం చేరింది. పట్నవాసంలో 'నేచురాలిటీ'కి చోటేదీ!?

  తోరణమది యని గట్టగ
  బారెడు ప్లాస్టిక్కు దండ పట్టణ మందున్
  పూఁరేకులు యని తలచుచు
  "దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
   పూరేకులలో అర్ధానుస్వారం ఎందుకు? 'రేకులు+అని = రేకులని' అవుతుంది. యడాగమం రాదు. "పూరేకు లనుచు దలచుచు" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారూ
   🙏🏻

   తోరణమది యని గట్టగ
   బారెడు ప్లాస్టిక్కు దండ పట్టణ మందున్
   పూరేకు లనుచు దలచుచు
   "దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్"

   తొలగించండి
 31. ప్రేరణ బెంచగ పువ్వులు
  మారని మమకా రమందు మకరందముకై
  చేరిన గుంపున నొక మం
  దారము పై వ్రాలెదేటి త్రాగగ మధువున్,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మకరందమునకై' అనడం సాధువు. అక్కడ "మకరందమునే। గోరిన గుంపున..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 32. ఉత్పలమాల
  ఏరిచి యష్టదిగ్గజము లేర్పడ మేటి కవీశ్వరాళితో
  గూరిచి సాహితీ కొలువు గొప్పగఁ బంచుచుఁ గావ్యమాధురుల్
  ధారుణి కృష్ణరాయసభ దన్విని దీర్చ, పిపాసు లౌచు మం
  దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

  రిప్లయితొలగించండి
 33. దారమును మందారమో,పదారమో, కేదారమో,చేదారమో,వేదారమో చేయక నే, దారమును ఎవరు దారముగా ఉంచుతారోని ఎదురు చూస్తుండగా.శాస్త్రిగారు కృతకృత్యులయ్యారు.పుష్పాలను మరువలేదు.మంచి పూరణ జేశారు. పూరణభినందనీయము!🌹👍👏🌹

  రిప్లయితొలగించండి


 34. ప్రేమికుల దిన శుభాకాంక్షలతో


  స్వైరిత ణిసధాత్వర్థము
  లే రాజిల జేయగోర లేమయు వలయం
  బై, రయ్యనగ భళా మం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగగ మధువున్!


  సెయింట్ వాలైంటైన్ లాంగ్ లివ్ :)


  జిలేబి
  పరార్ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రేమిక దివసమున: పుణేలో:

   చేరము మల్లెపూవులను చేరము తామర నీరజమ్ములన్
   చేరము సన్నజాజులను చేరము చంపక మాలలన్నయా
   చేరము బంతిపూవులను...చేరితి రిచ్చట సేనలో యనిన్
   దారముపైన వ్రాలెను గదా! మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

   😢😢😢

   తొలగించండి
  2. "The Karnataka Rakshana Vedike organised the 'marriage' of two sheep..."

   ...Times of India online

   తొలగించండి


  3. గొర్రెలకట కళ్యాంబును
   వెర్రితలలు వేయ యువత వెజ్జరికముగన్
   చర్రను రీతుల జేసే
   రర్రా కర్నాటకమున రమ్యంబుగ బో :)

   జిలేబి

   తొలగించండి
 35. దూరపుదేశమునకు వ్యా
  పార నిమిత్తమున నేగి పతి కలగనియెన్
  మారుని చేఁతకు నిజ మం
  దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

  రిప్లయితొలగించండి
 36. పారులు బారులంట, *చరవాణి* న చర్చలు జోరుజోరటా
  గారము హెచ్చెనేడు నయగారములక్కట బూటకమ్ములే
  పేరులు మార్చిమార్చికట, *ఫేసుబు కందున* *చాటుచాటటా*
  మారరు ప్రేమికుల్ ధరన, మత్సర మక్కట వారిసొమ్మటా
  తీరును మార్చికోరుగద!తెంపరి వేశము మించిపోయి *కు*
  *ద్దారము*పైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి


 37. తీరని తమితోడను మం

  దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్

  కోరుచు రమణీమణి నట

  చేరెను ముదమున ప్రియుడును చెలి చెంతకు తాన్.

  రిప్లయితొలగించండి
 38. వేరుపడి వాడి పోగన్ దారము నుండియె విరులవి దాహము తోడన్
  పూరితి గంధము వీడని
  దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్!

  రిప్లయితొలగించండి
 39. కం:కూరిమి తో వీడని మమ
  కారముతో పుష్పములను గాఢపు తమితో
  కోరుచు తిరుగుచు నొకమం
  దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్.

  కం:భారంబగు హృదయముతో
  దారులు వెదుకుచు సతతము ధరలో తిరుగన్
  శ్రీరామనామ మనుమం
  దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్

  రిప్లయితొలగించండి
 40. చీరలు నారలున్ మణులు చెన్నుగ బంగరు వడ్డణమ్ములున్
  కోరుచు వజ్రహారములు కుణ్డల శ్రేణులు కంకణమ్ములన్
  చోరులు కూడిరే గుమిగ చొచ్చగ నింటిని మోడివర్యుదౌ:👇
  "దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్!"

  రిప్లయితొలగించండి