19, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2602 (రాముని సుతుఁ డర్జునుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్"
(లేదా...)
"రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్" 
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

76 కామెంట్‌లు:

 1. మామా! లవుడెవ్వడురా?
  భీముని సోదరుడెవడుర? భీభత్సముగన్
  రాముండెవరిని గెల్చెను?
  రామునిసుతుఁ డ;ర్జునుండు;రావణు గెలిచెన్...

  ....నాకును, స్వర్గీయ పండిత నేమాని వారికినీ, నచ్చని క్రమాలంకార పూరణకు క్షంతవ్యుడను...తప్పలేదు :(

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Pandita Nemaniఫిబ్రవరి 06, 2014 5:56 PM

   శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
   మీ పూరణ బాగుగ నున్నది. సమస్యలను పూరించుటలో "క్రమాలంకారము"ను ఆశ్రయించుట చిట్ట చివరి ప్రయత్నముగ మాత్రమే చేయదగును - వేరొక మార్గము లేనప్పుడే కదా!

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ


  మా ముదునూరు నందునొక మాన్య కుటుంబము , నాటకమ్ములన్
  గ్రామములన్ ప్రదర్శనముగా నిడువారలు ., నామముల్ గనన్
  "రాముని పుత్రుఁ డర్జునుఁడు., రావణు గెల్చె రణాంగనమ్మునన్
  రాముని పాత్ర దాల్చి , జనరంజకమయ్యె , ప్రశంస జేయుడీ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రణాంగణమ్మునన్... అని ఉండాలి.. సమస్యను యథాతథంగా కాపీ చేసితిని.. మన్నింపుడు.. గమనింపుడు.. 🙏


   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి  2. ముదునూరి అర్జున రాముడు బాగు బాగు !


   జిలేబి

   తొలగించండి
  3. ఖాళీలను పూరింపుము... అనే ప్రశ్నకు.. జవాబులు ఇలా చదువుతున్నాడు...


   ప్రామాణిక విశ్లేషణ..
   మే మృగ్యంబయ్యె! *భట్టి* యే దిక్కయ్యెన్ !
   మా మనుమడిట్లు చదువును
   రాముని సుతుడర్జునుండు రావణు గెల్చెన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. ధన్యవాదాలండీ శ్రీ జిలేబీ గారికి 🙏🙏శాస్త్రి గారికి కూడా 🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 3. చామా! కుశుడెవడంటిని?
  భామ సుభద్రనెవరంట పరిణయ మాడెన్?
  రాముడని గెల్చె నెవరిని?
  రాముని సుతు, డర్జునుండు, రావణు గెలిచెన్.

  రిప్లయితొలగించండి


 4. కాముడు చదివెను విడువక
  రామాయణ భారతముల రాత్రింబవలున్!
  హా! మూర్చన చెప్పెను బో
  "రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్"

  జిలేబి

  రిప్లయితొలగించండి

 5. భామయు నేర్వ రామ కథ, భారతమున్, కథ గట్టె కొత్తగన్
  తామరకూనలన్ చొనిపి తా విలు నెక్కిడి "భారరామ"మై
  "రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్"
  కోమల మైన గాధ యన గొల్లున నవ్విరి మాన్యులున్ వినన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. నామము మార్చి దశరథుని
  రాముడనుచు నర్జునుడని రామునియనినన్
  స్వామీ! యనదగునిట్టుల
  రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్

  రిప్లయితొలగించండి
 7. ఏమని చెప్ప గ వచ్చును
  సోమరి మత్తు న ముని గి యు చోద్యము గాగ న్
  వేమ రు వ ద రు చు ని ట్ ల నె
  రాముని సు తు డ ర్జునుండు రావ ణు గెలిచె న్

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. (కృతవీర్యుని పుత్రుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుని జయించటం)
   సేమము చిందులాడ ఘనసీమను హైహయరాజ్యమున్ మహా
   ధీమతి; దోర్బలుండు; రణధీరుడు; నిర్మలు డేలుచుండగా
   వేమరు చెప్పనేల! కృతవీర్యుని నార్తజనైకరక్షణా
   రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్.

   తొలగించండి
 9. *ఓముదితామణీ,గనుముయోర్మినిజూపుచు కత్తిరిం పునన్*
  *నీమదిసక్రమంబుగపనిన్ దలపెట్టక పేస్టుజేయుటన్*
  *నేమిటొతప్పుదొర్లెసుమి!నీవిటజూడగల్యాపుటాపులో*
  *రామునిపుత్రుడర్జునుడురావణుగెల్చెరణాంగణమ్ము నన్*

  రిప్లయితొలగించండి
 10. డా ఎన్.వి.ఎన్.చారి
  శ్యామలవర్ణు నశ్వమును చక్కగ నడ్డిన వీరుడెవ్వడో ?
  శ్యామలవర్ణు మిత్రుడని వ్యాసుడు చెప్పిన వీరుడెవ్వడో ??
  శ్యామలవర్ణుడా మహిజన్ గొని వచ్చుట కేమి జేసెనో??
  రాముని పుత్రుడ; ర్జునుడు; రావణు గెల్చె రణాంగనమ్మునన్

  రిప్లయితొలగించండి


 11. కోమల వళ్ళి జూచెగద కొత్తగ వచ్చె సమస్య నేడిటన్
  "రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్"
  భామ శకారుడిన్ కొలిచె ! భారము తీరెను కైపదమ్ము‌ తా
  నై మరి మాయమయ్యెను సునామణి తా విని త్రోసి పుచ్చగన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2602
  సమస్య :: *రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్.*
  రాముని కుమారుడు అర్జునుడు అని, ఆ అర్జునుడు రావణుని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: హైహయ వంశ రాజు మునితుల్యుడు ఐన కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యుడు. ఇతడే కార్తవీర్యార్జునుడు. విష్ణువు యొక్క అవతారమైన దత్తాత్ర్రేయ స్వామిని నిశ్చల భక్తితో సేవించి వరంగా వేయి చేతులను విజయ సిద్ధిని పొందినాడు. అతనిని యుద్ధంలో గెలవాలని వెళ్లిన రావణుడు నర్మదా నదీ తీరములో స్త్రీలతో విహరిస్తున్న ఆ అర్జునుని చూచి *స్త్రీలోలుడైన ఇతడు నాతో యుద్ధము చేయగలడా?* అంటూ ఎగతాళిగా నవ్వినాడు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు రణాంగణంలో రావణుని గెలిచినాడు అని విశదీకరించే సందర్భం.

  భీముడు , మౌనియైన కృతవీర్యుని పుత్రుడు , దత్తభక్తుడౌ,
  నా మహితున్ , సహస్రకరు , హైహవ వంశజు , కార్తవీర్యుడన్
  నామము గన్న యర్జును , ననంగ క్రియాయుతు గాంచి నవ్వుచున్
  *కామవిలాసతత్పరుడు కయ్యములో గెలువం* డనంగ నౌ
  *రా ! ముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (19-2-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణ పద్యంలోని మొదటి పాదంలో
   భీముని , మౌనియైన కృతవీర్యుని పుత్రుని ,
   అని చదువ ప్రార్థన. కోట రాజశేఖర్.

   తొలగించండి
  2. (సవరణ) రావణుని చంపినాడు అని 6 వ వరుసలో ఉన్నది. దానిని రావణుని గెలిచినాడు అని చదువుకొవలసినదిగా విజ్ఞప్తి.

   తొలగించండి

 13. సోముకు పరీక్ష లడిగిరి

  రాముని సుతుడెవరు?నెవరు రవిజుని గెలిచె?

  న్నా మొద్దు వ్రాసె నిటులను

  రాముని సుతుఁ డర్జునుండు, రావణు గెలిచెన్

  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘వనపర్తి☘

  రిప్లయితొలగించండి
 14. ఏమని చెప్పను వీరులు.
  రాముని సుతు,డర్జునుండు,-- రావణు గెలిచెన్
  ప్రేమగ సురలిడ దీవెన.
  ధీమతి శ్రీరాముడమిత తేజోన్ముఖుడై.

  రిప్లయితొలగించండి
 15. వేమారులు బోధించిన
  చీమంతయు నేర్వని తన శిష్యుని కనెనా
  ధీమతి గురువే , "ఛీ!యే
  రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్?"

  రిప్లయితొలగించండి
 16. సోమూ!కుశుడెవ్వడురా?
  భీమునితమ్ముండెవడుర? భీమ రణంబున్
  రాముండెవరిని గెలిచెను?
  రాముని సుతుఁ- డర్జునుండు- రావణు గెలిచెన్.

  రిప్లయితొలగించండి
 17. ప్రేమను సుభద్రఁ గొనె సు
  త్రాముని సుతుఁ డర్జునుండు, రావణు గెలిచెన్
  రాముడు భీకర పోరున
  సోమము జూపి సురవరులు సొక్క చదలుపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! ఆనపరెడ్డి వారూ:

   మీ అద్భుతమైన వ్యాసం "నమస్తే తెలంగణా" లో శంకరయ్య గారి చిత్రరాజముతో చూచి చదివి హర్షించితిని. నమస్సులు!

   తొలగించండి
  2. వయసులో నాకన్నా చిన్నవారైనా, నిజానికి రాజేశ్వరి గారిదే అగ్రతాంబూలం. శంకరాభరణం ప్రారంభమైనప్పటినుంచీ నేటి వరకూ ఎనిమిదేళ్ళుగా ఎడతెరిపి లేకుండా వారు సమస్యాపూరణ, పద్యరచన చేసియున్నారు. ఆకాశవాణిలో సైతం ప్రతి శనివారం వారి పేరు వినిపించుచున్నది.

   🙏🙏🙏


   రోజులు మారగ నేండ్లగ
   నాజూకగు పద్యములను నందము తోడన్
   జాజుల మాలగ నల్లిన
   రాజేశ్వరి గారికివియె ప్రాంజలి శతముల్

   తొలగించండి


  3. ఎక్కడండి నమస్తే ఆర్టికల్ లింకు ?


   జిలేబి

   తొలగించండి


  4. రాజేశ్వరి గారి గురించి జీపీయెస్ వారి మాట అక్షర సత్యం

   Long standing consistent, considerate and unassuming refined and subtle poet


   జిలేబి

   తొలగించండి
  5. ఈరోజు పేపరులో: "తెలంగాణా ఆణిముత్యం" :

   లింకు అన్నపరెడ్డి వారివ్వగలరు.

   తొలగించండి
  6. * సవరణ: క్షమార్పణలతో:

   "అన్నపరెడ్డి" ఒప్పు ...

   "ఆనపరెడ్డి" తప్పు..

   తొలగించండి
  7. 🙏🙏🙏 'నమస్తే'లను కాపీ,పేస్ట్ చేయటమే.

   తొలగించండి
  8. Asn Reddy గారు! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మరోలా అనుకోకండి!చక్కని విరుపుతో కూడిన పూరణ!
   అభినందనలు, జేజేలు, జోహార్లు! 💐💐💐👍👌💐💐💐

   తొలగించండి
 18. హోమపు టశ్వము న్నెవరొ హోయన నిల్పిరి యద్భుతమ్ముగన్
  కోమలి కృష్ణనే గెలిచె కోరిక మీరగ లాఘవమ్మునన్
  ప్రేముడి సారసాక్షి విడి పించుటకై రఘురాముడే గదా
  రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్"

  రిప్లయితొలగించండి
 19. "కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న తిరువన్నామలై నుండి నేరుగా శ్రీకాళహస్తి చేరుకున్నాను. ఈరోజు శివయ్యను దర్శించుకొని సాయంత్రం రైలెక్కి రేపు నెలవు చేరుకుంటాను."


  "కుడికంటిలో డ్రాప్స్ వేసుకొని ఒంటికంటితో శుక్రాచార్యత్వాన్ని పొంది చేసిన సవరణ అది!"

  ...కంది శంకరయ్య గారు

  *******************************

  గోముగ శంకరుండు తన కోరిక తీరగ కాళహస్తిలో
  నీమము తప్పకుండ కనునిండుగ బిందులు వేసియుండగా
  థీమగు పాదమున్ వడిగ దిద్దుచు దిద్దుచు దిద్దగన్నిటుల్:
  "రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్"

  రిప్లయితొలగించండి
 20. ఈ మహి నొకఁడు సహస్ర భు
  జామిత బల దర్పితుండు యదు వంశ మహా
  సోమ కృతవీర్యుని రతా
  రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్

  [రత+ఆరాముని =రతారాముని: ఆరామముల నాసక్తి కలవాడు; అర్జునుడు = కార్తవీర్యార్జునుఁడు]


  రాముఁడు భీమ భార్గవ విరాముఁడు విశ్రుత ధన్వి భండనో
  ద్దాముఁడు లక్ష్మణాగ్రజుఁడు దైత్య మృగేంద్రుఁడు దేవ సంచయ
  స్తోముఁడు రామ చంద్రుఁ డఘ దూరుఁడు జానకి భర్త, కాదె యీ
  రాముని పుత్రుఁ డర్జునుఁడు, రావణు గెల్చె రణాంగణమ్మునన్

  [అర్జునుడు = ఏకైక కుమారుడు]

  రిప్లయితొలగించండి
 21. రామ సుభద్రఁ గన్గొని సరాగము లాడుచుఁ బెండ్లియాడె సు
  త్రాముని పుత్రుఁ డర్జునుఁడు, రావణు గెల్చె రణాంగణమ్మునన్
  రాముడు సేతువేర్చి జలరాశిని వానర మూక తోడ్పడన్
  క్షేమము గానయోధ్య చన కేళిక లాడిరి తృప్తితో జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నారిసారించి ఫల్గునుడు మీమూక చెండు చున్నప్పుడు - తిరుపతి వేకటకవులు

   తొలగించండి
  2. మూఁక లో తప్పులేదు. వానరమూక దుష్ట సమాసము. వానర సేన సాధు సమాసము.

   తొలగించండి
 22. భామా!లవుడెవరి సుతుడు?
  ప్రేముని యంశన వెలసిన వీరుండెవరో?
  రాముండెవరిని గెలిచెను?
  రాముని సుతుఁ, డర్జునుండు, రావణు గెలిచెన్ !!!

  రిప్లయితొలగించండి
 23. ఏమీ వింతగ బలికిరి?
  రామునిసుతుడర్జునుండురావణు గెలిచెన్
  రాముని సుతుడర్జునుడా?
  సామీ! లవకుశలుగాదె సలక్షణముగా

  రిప్లయితొలగించండి
 24. భూమియె ఘోరశాపమిడ పోరున గర్ణుని గూల్చి నెగ్గె సు
  త్రాముని పుత్రుఁ డర్జునుఁడు; రావణు గెల్చె రణాంగణమ్మునన్"
  భూమిజ బాధ దీర్చుటకు పూజ్యుడు రాముడు వింతయౌ గదా
  భూమియు, భూమిజాతయును పోరున ధర్మజయమ్ము జేయుటల్
  (కర్ణుని పతనానికి భూమి కారణం. రావణుని పతనానికి భూమిజ కారణం అని ఒక సంబంధం చూపటం)

  రిప్లయితొలగించండి


 25. ఏమి చదివి చెప్పితివే
  రాముని సుతుఁడర్జునుండు రావణుగెలిచెన్?
  రామాయణమా ? భారత
  మా? మాంగలికముగ బల్కు మహిని జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. రాముని పుత్రుడర్జునుడురావణుగెల్చె రణాంగణమ్మునన్
  రాముడు చంపగాననిని రావణు మీరలుపల్కుటిట్లుగా
  నేమని జెప్పనోపుదునునీతరుణిన్మరిపార్ధుడుండెనే
  నేమియు లేడుగానరయ యీయుగ మందున నెచ్చటన్ సుమా

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు


  1. ఫేసు బుక్కు అకౌంటు లేదండి

   జనరల్ లింకు ఏదన్నా వుంటే తెలియజేయగలరు


   జిలేబి

   తొలగించండి
  2. చిరు మార్పులతో వ్యాసం ఇచ్చట చదవండి... అన్నపరెడ్డి వారి కృపతో!:

   http://kandishankaraiah.blogspot.in/2018/02/2599.html?m=1

   తొలగించండి

  3. జీపీయెస్ వారు


   ఇమేజ్ అలుక్కుపోయిందండీ సరియైనది పెట్టండి

   జిలేబి

   తొలగించండి


  4. అన్నపరెడ్డి గారి సమీక్ష చాలా బాగుంది !

   దాదాపు‌ 2600 సమస్యా పూరణలు ఒక్కో పూరణలకు అధమ పక్షం 25 (50℅ of current trend in web only ) అనుకుంటే కూడా 2500*25 - 62500 ! A whopping number of solutions !


   Cheers to Kandi gaaru and entire team

   జిలేబి


   జిలేబి

   తొలగించండి


  5. చెన్నుగ శంకరాభరణ సేవగ కందివరుల్ సభాస్థలిన్
   మిన్నగ జేయ పూరణల మిక్కిలి సాయము బట్టి తీర్చగన్
   సన్నక సన్న పద్ధతిగ సాంకవ మెల్లెడ నద్దుచున్ భళా
   అన్నపరెడ్డి గారి అవగాహము అద్భుత మండి శాస్త్రి జీ!


   జిలేబి

   తొలగించండి
  6. జిలేబీ గారూ:

   రెడ్డిగారి వ్యాసాన్ని నా బ్లాగు: "Telangana Animutyam" లో జతపరచితిని.
   గత రెండు గంటలలో 30 కి పైగా హిట్లు :)

   తొలగించండి

  7. Online epaper edition link

   http://epaper.ntnews.com/m5/1549603/Warangal-rural/19-February-2018#page/8/1

   Cheers
   జిలేబి

   తొలగించండి
 28. ఏ మహనీయు డేర్పరచె నీ భువి నాడు కుశస్థలిన్? సుభ
  ద్రాముఖకంజసారఘము ద్రావిన దెవ్వరు? లంక కేగి శ్రీ
  రాముడు చేసె నేమిటి? మురారి వచించెను గీత నెచ్చటన్?
  రాముని పుత్రుఁ, డర్జునుఁడు, రావణు గెల్చె, రణాంగణమ్మునన్.

  రిప్లయితొలగించండి

 29. ధీమతి యసురుల శాత్రవ
  రాముని సుతుడర్జునుండు; రావణు గెలిచెన్
  రాముడు రఘువంశజుడే
  క్షేమము గూర్చగ జనులకు కేసరితోడన్

  రిప్లయితొలగించండి
 30. ఓముని రక్షగానిలువ?నోర్పున,మార్పునకూర్పులందునన్
  కోమలి ప్రేమకై తనదు కోర్కెలమార్కులప్రేరణార్థమై
  రాముని పుత్రుడర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్
  నామది మెచ్చగాకలకునవ్వులురువ్వ?లేచిరందరున్|

  రిప్లయితొలగించండి
 31. కందం
  రామాయణ భారతములు
  సామూహికమైన కృతిని చదువుచు నొకడున్
  శేముషి కొఱతన్నిట్లనె
  "రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్ "

  రిప్లయితొలగించండి
 32. నేమము తోడఁ జెప్పఁ గమనించితి మీదు పురాణగాధలన్
  కాముడుఁ గుంభకర్ణుడు వికర్ణుడుఁ గర్ణుడు న న్నదమ్ములౌ
  భీముడు సోముడున్
  పరశురాముడు నాబలరాముడట్లునౌ
  రాముని పుత్రు డర్జునుడు రావణుఁ గెల్చె రణాంగణమ్మునన్.

  రిప్లయితొలగించండి
 33. భీమపరాక్రముండు విలువిద్యల నేర్పరి కర్ణుఁ గూల్చె, సు
  త్రాముని పుత్రుడర్జునుండు; రావణుఁ గెల్చె రణాంగణమ్మునన్
  రాముడు, సీత జాడఁ గని లంకను సత్వర జేరి దైత్యసం
  గ్రామవినిర్జితారిభయకారకగర్జితసింహుడుగ్రుడై.

  రిప్లయితొలగించండి
 34. సీమను బుట్టుచున్ త్రిపుర సేవన జేయుచు మత్తునుంటివో?
  భామల పొందులో మునిగి భావము గీవము లేక జెప్పితో?
  తామస! కల్లు గ్రోలితివొ? తప్పుడు కైతల వాగ నెక్కడోయ్
  రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్?

  రిప్లయితొలగించండి
 35. సందర్భం:- గీతోపదేశ ఘట్టం
  అన్వయం:-
  రావణము :- ఏడుపు :- సీదన్తి మమ గాత్రాణి-- అను అర్జునుని రోదన...
  బలరాముని సుతుడు అర్జునుడు :- పత్నిమాత మాతృ సమానురాలు.అట్లైన పత్నీ జనకుడు పితృసముడగును...
  పైగా, మనకు అల్లుని కొడుకు వలె, కోడలిని కూతురు వలె చూడమనే సంప్రదాయము ఉంది
  ***********
  శ్యామాంగుడు బోధించెను
  ఈ మాయావిశ్వరచన ఈశ్వర కృతియని.,
  తామసము తొలంగన్, బల
  రామునిసుతుఁడర్జునుండు రావణు గెలిచెన్.

  రిప్లయితొలగించండి


 36. భూమిజ వరించె నెవరిని ?

  కోమలి యింద్రుని తలవగ కువలయమందున్

  గోముగా జనించె, రాముడు

  రాముని ;సుతుఁ డర్జునుండు ;రావణు గెలిచెన్

  రిప్లయితొలగించండి

 37. ...........సమస్య
  రాముని సుతు డర్జునుండు రావణు గెలిచెన్

  సందర్భము... నే నీ రోజు ఉదయాన్నే (7.21) బెంగుళూరులోని *మారికాంబ* ఆలయాన్ని సందర్శించాను. ప్రసిద్ధి వహించిన గుడి కాకపోయినా ప్రశాంతతకు వీలైనది. బయట పెద్దదైన ఆవరణ. ఆవరణలో ఇక పక్క సర్ప రూపుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ.
  ఆలయ దర్శనాలలో ఆశువుగా ఏదో కవితను నివేదించుకోవడం నా కిష్టమైనది కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తూ వుంటే ఈ సమస్య మదిలో మెదలింది.
  వెంటనే ఇలా పద్యంగా రూపొందింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  హే *మారికాంబ!* బ్రతుకున

  నేమి సమస్య యది వచ్చి యేచిన నిన్నే

  ప్రేమన్ దలచెద... నేటిది..

  "రాముని సుతు డర్జునుండు

  రావణు గెలిచెన్"

  🖋~డా.వెలుదండ
  -----------------------------------------------------------
  2 వ పూరణము:--

  సందర్భము... శ్రీ రాముని కుమారుడైన లవు డొకనాడు ఆంజనేయ స్వామిని ప్రశ్నించాడు "రామునికన్న ముందుగా ఎవరైనా రావణుని జయించినారా.." అని.
  అప్పుడు కార్తవీర్యార్జుని చరితము నీ తీరుగా రాముని సుతుడు వింటూ వుండగా ఆంజనేయుడు వివరించినాడు "అర్జునుడు అనగా కార్తవీర్యార్జునుడు రావణుని గెలిచినాడు.." అని.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "రామునికిని మును పెవ?" రన

  నా మారుతి కార్తవీర్యు నర్జును చరితం

  బీ మాదిరి చెప్పె వినగ

  రాముని సుతు, "డర్జునుండు

  రావణు గెలిచెన్"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  -------------
  ......మరొక పూరణము:--

  .............సమస్య
  రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె
  రణాంగణమ్మునన్

  సందర్భము... శ్రీ రాముడే పరబ్రహ్మ మని ప్రాజ్ఞు లందురు. రామునిలో ఒక భాగమే మహా మాయ. అది లోకా న్నాడించగలదు. కాని రాముని విశ్వసించి శరణాగతి చెందిన వారికి మాత్రం భయమేమీ లేదు.
  ఇది ప్రసిద్ధమై యుండగా మునిని పక్కకు తోసివేసి (స్ఫురింపకుండా చేసి) రాముడే మాయ జేసినాడు. కంచెయే చేను మేసినట్లున్నది.
  ఈయబడిన సమస్య చూడండి.
  (మాన్యశ్రీ కోట రాజశేఖర్ గారి పూరణ పద్యం చూడండి. మరింత స్పష్టంగా అర్థమౌతుంది.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  రామునిలోనె భాగమయి
  రాజిలుచున్నది మాయ కావునన్..
  రాముని నమ్ము వారలకు
  రాదు భయం బది మాయ నందు; రా
  రాముడె మాయ జేసె నవు
  రా! మునిఁ బ్రక్కకుఁ ద్రోసివేసె; నిం
  కేమిటి కంచె చేను నిటు
  లింపుగ మేసె.. సమస్యఁ గాంచుడీ!
  "రాముని పుత్రు డర్జునుడు
  రావణు గెల్చె రణాంగణమ్మునన్"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 38. ఆముని బాలకుండెవడు? ఆ కపికేతను డెవ్వడంటరా?
  రాముడు సేతువున్ నిలిపి లంకను నెవ్వరినెట్లు గెల్చెరా?
  రాముని పుత్రుఁడ;...ర్జునుఁడు;...రావణు గెల్చె రణాంగణమ్మునన్...
  ధీమతి! పారిపోవికను! తిన్నగ నింటికి వంటజేయుటన్!

  రిప్లయితొలగించండి