9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

గోబంధ తేటగీతిక - గోమాత విశిష్టత


తేటగీతిక
కొమ్ములందున కొలువాయె కుంద, శలులు
నొసలి చూపువేల్పుయు, సతి, నొసల వెలిగె,
చెవుల పై నశ్వని సుతులు చేరి యుండె,
కలువ రేడు. కలువ గొంగ. కనుల లోన
నిలచె, నభము పై కందుడు వెలసె శుభము
, పలువరుసన పవనుడు, కడలి రేడు
పన్నమున వెల్గె, బాహువు పైన బాణ 
కూర్చొనగ,గట్టుదాయయు కూరుచుండె 
గళము లో,సూర్యులుండెను కంజరంబు 
లోన పన్నిద్దరును,గుండె లోన సంధ్య 
మాత యుండె, సు డెక్క ల మధ్య నుండె
నాగ సురలు, గంధర్వులు, నప్సరసలు
తొడల పైనుండెను జముడు ,తోక లోన 
సోమ దేవుడు, ముక్కోటి రోమములన 
దాగె దేవతల్,మయమున తూగె లక్ష్మి ,
పొదుగులోన పయోనిధి నొదుగు చుండె
పాలలో సరస్వతి ,తనూపమున నగ్ని 
కాయ జలమందు గంగయు, గంగ డోలు 
నందు నసురులు నర్తించ, నమసములను 
యట్టి గోమాతకు నిపుడు బెట్టు చుంటి

కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

3 కామెంట్‌లు: