24, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2607 (జీతము లేనట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"
(లేదా...)
"జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే"
(డా. వెలుదండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

125 కామెంట్‌లు:

  1. నీతులు జెప్పుచు మెండుగ
    గోతులు త్రవ్వుచు గడించి కోరిక మీరన్
    నేతల వీపులు గోకెడి
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే

    రిప్లయితొలగించండి
  2. తాతలు నేతులు త్రాగిన
    మూతులు మిగలనె లేవు ముచ్చట కైనన్
    కోతలు కోయుచు జేసెడి
    జీతము లేనట్టి కొలు విసీ యనఁదగునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అబినందనలు.
      రెండవ పాదంలో గణదోషం."మూతులు మిగులంగ లేవు" అందామా?

      తొలగించండి
    2. తాతలు నేతులు త్రాగిన
      మూతులు మిగులంగ లేవు ముచ్చట కైనన్
      కోతలు కోయుచు జేసెడి
      జీతము లేనట్టి కొలు విసీ యనఁదగునే

      తొలగించండి


  3. ప్రాతఃకాలంబందున
    చైతన్యమును కలిగించు సేవల నిడిరే!
    జోతలు ! కైపద తారణి
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే ?

    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. గోతుల తవ్వ గాను సయి కొట్నము జేరెద రయ్య, మిమ్ము మీ
    రీతుల నీసడింతురయ రీఢము గాంచుచు వీపువెన్కనన్
    జీతము లేని కొల్వులని సీ యనువారలు గూడ నుందురే,
    ఖాతరు జేయ రాదు కవి కందివరా!నటు వంటి వారినిన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వీపు వెన్కనే... కందివరా యటువంటి..." అనండి.

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    🙏ఓం నమో వేంకటేశాయ 🙏

    ఆతత భక్తి పూత హృదయమ్ములతో విధి సేవనమ్ముగా
    బ్రీతిగనెంచు వారికి , విరించికృతోత్సవవేళ కొండపై
    ఖ్యాతిగ జిక్క నొక్క దినమైనను భాగ్యము గాదె! యిట్టివౌ
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఖ్యాతిగ విరాటపతిఁ న...
      జ్ఞాతమునన్ బాండుసుతులు సాయము గోరన్
      ప్రీతిగ నాశ్రయమునిడగ
      జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. హోసూరులో అష్టావధానము చేయుటకు వెడుచున్న మైలవరపు వారు:

      కవితావేశము పొంగి పొర్లగ లసత్కమ్రార్థసంపత్తి నా..
      కు వశమ్మై , రమణీయమైనవగు వాక్కుల్ కుందసూనమ్ములై
      నవగంధమ్ములనీన , భారతి మెడన్ దాల్పంగ బూమాల నే...
      నవధానమ్మునకేగుచుంటి ! కవులారా ! నన్ను దీవింపుడీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    5. హొసూరు లో వేదొక యెక్కడండి అవధాని గారు ?


      జిలేబి

      తొలగించండి
    6. ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనము

      కామరాజ్ కాలని, హోసూరు

      తొలగించండి
    7. ఈరోజూ రేపూ 11.30 కి అనుకుంటా...

      మీ కుతూహలం అభినందనీయం. మరి మాదో???

      తొలగించండి

    8. కుతూహలానికి ఆహ్వానపత్రిక :)


      http://varudhini.blogspot.com/2018/02/blog-post_24.html


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    9. మురళీకృష్ణ గారికి అభినందనపూర్వక నమస్సుమాంజలులు. అవధాన సాహితీ ప్రాంగణమున నవిరళ విజయ మాలాలంకృతులై భాసిల్ల వలెనని నా యాకాంక్ష మరియు శుభాశీస్సులు!!!

      తొలగించండి
    10. చిటితోటి విజయకుమార్:

      వ్యవధానంబొకయింత లేక రుచిర వ్యాఖ్యా సమున్మేషివై
      స్తవనీయ ప్రథితాశుపద్య లహరీ సందోహముప్పొంగగా
      కవిసూరుల్ జయహో యనంగ జయ లక్ష్యంబొంద హోసూరులో
      నవధానంబొనరింపుమా! మురళి! కృష్ణా! హే!వధానాగ్రణీ!

      తొలగించండి
    11. మైలవరపు మురళీకృష్ణ

      సాహితీమిత్రులు.. విశిష్ట పద్యకవితా ధురంధరులు.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి సవినయ నమస్సులు

      🙏🙏🙏

      తొలగించండి
    12. సార్!

      నాది శంకరాభరణం బ్లాగుకీ వ్హాట్సప్ కీ మధ్య Dispatch Clerk కొలువు:

      రాతిరి ప్రొద్దుయున్ భళిగ రంజిలు హార్దిక హ్లాదనమ్ముతో
      ప్రీతిగ శంకరాభరణ రీతుల రేఖల గారవించుచున్
      వ్రాతల వేదికల్ నరసి వారివి వీరికి యందజేసెడిన్
      జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే?

      తొలగించండి

    13. అదిరెన్ గాద బట్వాడాకొలువు :)


      జిలేబి

      తొలగించండి
    14. జిలేబీ గారూ:

      ఇప్పుడే ఆకశవాణి ఆడియో విన్నాను. చాలా పద్యాలూ పేర్లూ శంకరాభరణం వారివి విన్నాను. న్యూ జెర్సీ నుండి రాజేశ్వరి నేదునూరి గారిదీ, హైదరాబాదు నుండీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారిదీ, (ఎక్కడినుండియో) జిలేబీ గారిదీ ఇంకా ఇంకా ఎన్నెన్నో పేర్లు విన్నాను :)

      తొలగించండి


    15. బట్వాడా కొలువయ్య!వాత్సపును మేల్బ్లాగున్ గుభాళింతునే :)


      జిలేబి

      తొలగించండి

    16. జిలేబి పేరు మాత్రమేనా పద్యం కూడా చదివారాండి ?

      ఈ ఆడియో క్లిప్పులు యూట్యూబు లో పెట్టండి లంకె గా :)


      జిలేబి

      తొలగించండి
    17. వెలుదండ వారు:

      భావనా గమ్య యైనట్టి వాణి దివ్య
      కరుణ శ్రీ మురళీకృష్ణ గారి కెపుడు
      సరస సాహితీ సరసిలో సత్పదముల
      పూల పడవ విహారమైపోవుగాక!

      🌻🌸🌻🙏🏼🌻🌸🌻

      ~డా.వెలుదండ సత్యనారాయణ
      24-2-18

      తొలగించండి
    18. జిలేబీ గారూ:

      ఆకాశవాణి మనకిచ్చినవి కన్సొలేషన్ ప్రైజులు :)

      తొలగించండి
  6. కోతలు కోయుచున్ దిరుగు కోతల రాయుడు లెందరో భువిన్
    నేతల వెంబడించి కడునీతి యటంచు వినోదమున్ గనన్
    ఖాతరు జేయకుండ నిక గాలము వేయుచు భక్తి జూపుచున్
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే ?

    రిప్లయితొలగించండి
  7. కోతలు కోయుచు నేతల
    దూతల మంచును తెలుపుచు దుడ్డుల బొందన్
    నీతిని వదలు దళారుల
    జీతము లేనట్టి కొలు విసీ యనదగునే.

    రిప్లయితొలగించండి
  8. నేతల కిష్టమైన నికనిండుగ వాసముగ్రాసమేర్పడున్
    మోతలు మోగునట్లు తనముద్దగు నాయకుమోయవచ్చులే
    శ్రోతలకర్ణముల్ పగుల స్తోత్రపు కేకలు వేయవచ్చులే
    జీతములేనికొల్వుల నిసీ యను వారలుగూడ నుందురే !

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బోధించే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "బోధింపన్" అందామా?

      తొలగించండి
  10. నీతులు దెల్పెడి గురువుల
    ఖ్యాతులు వర్ధిల్లజేయు కార్యమునందున్
    ప్రీతి గలిగి శ్రమియించెడి
    జీతము లేనట్టి కొలువిసీయనదగునే?
    (నింద చేయరాదని భావము)

    రిప్లయితొలగించండి


  11. కనకధారాస్తవాన్ని తెలుగులో అందించిన వెలుదండ వారు వీ రే నా?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంబటి భాను ప్రకాష్ గారు ఉవాచ:

      "అవును.వారు వీరే...🙏🙏🙏🙏"

      తొలగించండి
    2. మైలవరపు వారి స్పందన


      శ్రీ వెలుదండ వారికి వందనములు..

      ఆ వెలుదండ ఈతడె మహాకవి ! తెల్గువెలుంగు దండ , పుం..
      భావ మనోజ్ఞ భారతి ! విభాసితపద్యకవిత్వ మూర్తి ! సం...
      భావిత శాంకరీయ పదబంధుర కాంచనధార ! సాహితీ
      సేవకు శంకరాభరణసీమను జేరెను ! వాని మ్రొక్కెదన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  12. యాతన కడు కల్గించును
    జీతము లేనట్టి కొలు ,విసీ యనఁ దగునే
    నాతిని ,సంతును? తప్పక
    ఖ్యాతి కలుగు వారిని కడు గారము జేయన్

    రిప్లయితొలగించండి
  13. రోత సుమీ భూతలమున
    జీతము లేనట్టి కొలు, విసీ యనఁ దగునే
    పాతకములు చేయు జనుల
    నేతీరుగ దండనమల నిడి శిక్షించన్

    రిప్లయితొలగించండి
  14. .
    ఆ తరువు క్రింద గురువు పు
    రాతన కాలమున చదువులను బోధించే
    జీతము వచ్చె నెలకపుడు?
    జీతము లేనట్టి కొలు విసీ యసదగునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బోధించే' అని వ్యావహారికం ప్రయోగించారు.

      తొలగించండి
  15. నాతిగ జన్మ నెత్తి జననమ్ము నొసంగిన వారి వీడుచుం
    బ్రాతిగఁ బెండ్లి యాడి తన స్వార్థము వీడుచు భర్తకోసమై,
    నాతతసేవలందుఁ దనివారుచుఁ బిల్లలఁ గంచుఁ బెంచు స్త్రీ
    జీతము లేని గొల్వుల నిసీయను వారలు గూడ నుందురే!

    రిప్లయితొలగించండి
  16. మాతా పి త రు ల సేవలు
    ప్రీతి గ నొ న రింప బూను ప్రియ తమ సు తుడు
    న్నేత రు ణ ము న న్ మదిలో
    జీత ము లేనట్టి కొలువి సీ యన దగు నే ?

    రిప్లయితొలగించండి
  17. ప్రాత: కాలము నుండియె
    పాతివ్రత్యమ్ము తోడ పతి సుతులకుఁ దా
    ప్రీతిగ ననురాగ మొసఁగు
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే?

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థ‌



    * సీత యను పేరు గల గోపస్త్రీ గోపాలుని రమ్మని పిలిచెను ‌‌ *
    -------------------------------------------------------------------------------------------


    " ఆరాధించెద కృష్ణ ! నిత్యమును ప్రేమావాస మందున్ నినున్ |

    నీ రాసక్రియ దేల్చు మోయి | మురళీ నిస్వాన మాలింప , నే

    నారాటించెద " నంచు సీత యను గోపాబ్జాక్షి‌ ప్రార్థించె || వే

    రా రా రమ్మని పిల్చె సీత యెలమిన్ రాధాప్రియున్ జెచ్చెరన్


    { ప్రేమావాసము = ప్రేమాలయము ; అరాటించు = పరితపించు ;

    గోపాబ్జాక్షి = గోపాంగన }

    రిప్లయితొలగించండి
  19. _మాతకు ప్రేమయె తెలుసును_
    _పోతనకుతెలియు పద్యపూరణజేయన్_
    _పూతకుపుష్పించదెలుసు_
    _జీతములేనట్టికొలువిసీయనదగునే_

    రిప్లయితొలగించండి
  20. *ప్రీతినిజూపుచున్ మిగుల ప్రేమనుపంచెడితీరునందునన్*
    *హేతువుజూడనెంచకసహిష్ణుతబూనుచు సంఘ శ్రేయమున్*
    *చేతలచేయువారునిల సేవలజేయుదురేదికోరకన్*జీతము*లేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే*

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2607
    సమస్య :: *జీతము లేని కొల్వుల నిసీ యను వారలు గూడ నుందురే ?*
    జీతం లేని కొలువులను చులకన చేసే వాళ్లు కూడా ఉంటారా అని అనడం ఈ సమస్యలో ఉన్న చిత్రమైన అంశం.
    సందర్భం :: సమతీ శతకంలో బద్దెన కవిగారు *అడిగిన జీతం బియ్యని దొరను కొలవడం మానేసి చక్కగా వ్యవసాయం చేసికొనడం మేలు* అని అన్నాడు. జీతము లేని కొలువులను ఎవరైనా సరే వదలివేయవలసిందే. ఐతే మనలను కని పెంచే తల్లి, కనిపించే దైవం ఐన మన మాతృదేవత మాత్రం తాను ప్రాణాలతో బ్రతికి యున్నంత వరకూ తన కన్నబిడ్డలకోసం జీతం లేని కొలువు చేస్తూనే ఉంటుంది. బిడ్డ పుట్టిన క్షణం నుండీ ఆ బిడ్డను చూచుకొంటూ మురిసిపోతూ తన పాలు పడుతుంది. తాను అన్నం తినే సమయంలో ఒకవేళ బిడ్డ మల మూత్ర విసర్జన చేస్తే ఏమాత్రం అసహ్యించుకొనకుండా చిరునవ్వుతో తక్షణమే బిడ్డ కవసరమైన సేవలను అందజేస్తూ ఉంటుంది. తన బిడ్డనుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఏనాడూ ఆశించకుండా వెట్టి చాకిరీ చేస్తూనే ఉంటుంది. అలాంటి మాతృదేవతను కంటికి రెప్పలాగా చూచుకోవాలి , ఆమెకు ప్రతియొక్కరూ చేతు లెత్తి నమస్కరించాలి అని అమ్మ గొప్పతనాన్ని విశదీకరించే సందర్భం.
    *మాతృదేవో భవ*
    ప్రీతిని మ్రొక్క , నీకు కనిపించెడి దైవమె కన్నతల్లి యౌ ,
    వా తెఱవంగ పట్టు తన పాలనె , నీ మల మూత్ర సీమలన్
    చేతులతోడ శుభ్రముగ జేయును భోజన మాపుకొన్నదై ,
    చేతము పొంగ సర్వ విధ సేవల జేయును బిడ్డకోస , మీ
    *జీతము లేని కొల్వుల నిసీ యను వారలు గూడ నుందురే ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-2-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధానిగారూ! అందుకోండి మాతృదేవతల వందనములు! 🙏🙏🙏🙏

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మాతృదేవత యొక్క ఔన్నత్యాన్ని ఆవిష్కరించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  22. గోతములనిండ ధాన్యము
    చేతము లలరించు నగలు చీనాంబరముల్
    ప్రీతిగ నొసగుట లన్నను
    జీతములే నట్టి కొలు విసీ యనఁ దగునే?

    రిప్లయితొలగించండి
  23. మాతాపితలను, గురువుల
    ప్రీతిగ దేవతల పుణ్య రీతిని గొల్వన్
    నాతిని సంతును మోసెడి
    జీతము లేనట్టి కొలువిసీ యనదగునే?!

    రిప్లయితొలగించండి
  24. ఏ తరమున నైనను మఱి
    మాతల బాధ్యత పవిత్ర మైయొప్పునుగా!
    యే తరుణి కాదన దగదు !
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊతము నిచ్చుచు దీనుల
      కే తరుణము నందునైన నింపుగ సేవల్
      చేతన మొప్పగ జేయగ
      జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. నీతులు జెప్పువారలట నీచపు బుద్ధులు వారి సొమ్మటా
    గోతులు ప్రక్క నక్కలట కోయిల గొంతున కూసిరిట్లురా
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే
    వేతన మెందుకోయి మరి వేడుక మీరెడి లంచముండగన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  26. వేతన శర్మలై గునిసి వీడుచు బానిస చాకరుల్ ఛిఛీ!
    తాతలు కాగనే శిశుల దాగుడు మూతల జేరుచున్నహా
    ప్రీతిగ ముద్దుముచ్చటలు రీతిగ తీపిగ తీర్చునట్టివౌ
    జీతము లేని కొల్వుల నిసీ యను వారలు గూడ నుందురే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బానిస చాకిరీ' దుష్ట సమాసం. "బానిస సేవలున్" అనండి.

      తొలగించండి

  27. ఏమండోయ్ జీపీయెస్ గారు

    ఆకాశవాణి విశేషములేమిటి వచ్చేవారపు సమస్య ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆడియో ఇల్ల...

      "రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్!"

      తొలగించండి
  28. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో శనివారము 24.02.2018, నా పూరణ...ప్రసారమైనది...

    సమస్య:: విషము సుధామయంబనుచు వేల్పులు పల్కిరి మానవాళికిన్!

    **** **** **** **

    నా పూరణ:

    విషధి మధించు కాలమున విశ్వమె విస్మయమొందు రీతిగన్

    విషము జనించినంతటను వేడిరి వేల్పులు విశ్వనాథునిన్ !

    విషము గ్రహించి దేవతల వేదన బాపిన శూలపాణికిన్

    విషము సుధామయంబనుచు వేల్పులు బల్కిరి మానవాళికిన్!

    🌿🌿🌿ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  29. నేటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రము వారి సమస్య


    "రాలను పూలుబూసినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. బాలకుమారికిన్ వయసు!పాంగెపు రీతిగ అల్లుడిన్గనన్
      కాలము శోభలన్ గొలుప, కష్టపడంగ, రవంత తండ్రియే
      మాలినికైవరున్వెదుక, మంచిగుణమ్ముల నార్యుచే తలం
      బ్రాలను పూలుబూసినవి రమ్య సుగంధములన్ వెలార్చుచున్!

      జిలేబి

      తొలగించండి
    2. నాకు తెలిసినంతవరకు జిలేబీ గారు 1వ తరగతి నుండి ఈ స్కూల్ స్టూడెంటు. నేను వారికంటే కొన్ని నెలల ముందు స్కూలులో చేరాను. అయితే ఆబ్సెంటులు ఎక్కువ పెట్టం వల్ల నేను ఒక క్లాసు తప్పి వెనక ఉండిపోయాను. జిలేబి గారు డబుల్ ప్రమోషన్ కొట్టేశారు.
      జయహో!

      తొలగించండి
  30. రాతురులందున పనియు,న
    చేతనుడైన యధికారి, చేసెడి పనిలో
    యాతన, నిత్యము కోతల
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే

    రిప్లయితొలగించండి
  31. చేతములో శివుని నిలిపి
    యాతనికే సేవజేయ నార్ద్రత తోడన్
    వేతన మెందుకు చెపుమా
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"

    రిప్లయితొలగించండి
  32. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      (త్రాగుఁబోతులైన యిద్దఱు పనిపాటులు లేనివారలు మాటలాడుకొనుౘున్న సందర్భము)

      "మేఁతకుఁ బోఁతకున్ వలచి, మిక్కిలిగా శ్రమియింౘు కార్యముల్
      జీతము లేకయే ౘలిపి, చెంతకుఁ జేరిన భర్తఁ ౙూచి త
      న్నాతియె ఛీత్కరించెనయ! నవ్యయుగమ్మున భార్యలందునన్
      జీతము లేని కొల్వుల 'నిసీ' యనువారలుఁ గూడ నుందురే?"

      తొలగించండి
  33. రాతిరి వరకు కరణము, ప్ర
    భాతమ్మున మేలుకొలుపు పలుకుల తోడన్
    గోతికి తీరిక పొసగక
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే

    రిప్లయితొలగించండి
  34. 🛐అతిథి దేవోభవ🛐
    కందం
    యాతన బడి యటుకులతో
    ప్రీతిగ వచ్చిన గుచేలుఁ గృష్ణుఁడతిథిగన్
    రీతిగ జూచుచు బ్రోచెడు
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే?

    రిప్లయితొలగించండి
  35. జీతము వారము వారము
    నే తరి విడువని విధముగ నీయగ నిఁక సం
    ప్రీతిగ ననునిత్యము నెల
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే


    వేతన మిత్తు రెల్లరును విత్తము మాసపు టంత మందునన్
    భాతిగఁ జేయువాఁడ నిఁకఁ బన్నుగ నిమ్మన రొక్క మంతయున్
    నీతి యనంగ వచ్చునె కనీసము ముట్టక యాయుధమ్ము ముం
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే

    రిప్లయితొలగించండి
  36. ఈ తీరుగ నీవయసున
    యాతన యేలనుచు నడుగ నాశంకరునే
    యాతండే పలుకు నిటుల
    "జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"

    రిప్లయితొలగించండి
  37. ఆకాశవాణి హైదరాబాదు వారి
    సమస్య :

    *విషము సుధామయంబనుచు వేల్పులు తెల్పిరి మానవాళికిన్*

    నా పూరణము :
    (నేడు ప్రసారమైనది)

    చంపకమాల

    బుసబుస పాల సంద్రమునఁ  బొంగఁగ క్ష్వేళము భగ్గు భగ్గున
    న్దిసమొలవేల్పు గ్రోలనట నేర్పున బార్వతి మేలు మేలనన్
    వసుధకు నాది దంపతులు పాటిగ సేమము నెంచ వారికిన్
    విషము సుధామయంబనుచు వేల్పులు తెల్పిరి మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  38. రిప్లయిలు
    1. కొన్ని సవరణలతో

      🛐మాతృదేవో భవ ☸️ పితృదేవో భవ 🛐
      కందం
      ప్రీతిగ భుజముల కావడి
      రీతిగ గ్రుడ్డి తలిదండ్రిఁ బ్రేమగ నిడుచున్
      ఖ్యాతిగన మ్రోయు సేవల
      జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే?

      🛐ఆచార్య దోవోభవ🛐
      కందం
      చేతలు తనవే యైనను
      నాతడు గురువునని వేలు నడఁగగ నీయన్
      బ్రీతిగ గైకొను ద్రోణుని
      జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే?

      తొలగించండి
  39. .ఈతరమందు కట్నములనెంచ?వరాలనియూహలందునే
    జాతక చక్రమున్ దుడుపు జాగృతులందునభార్య లోలురై
    నీతియుమాన్పు నిష్ట యవినీతినినమ్మిన?దానవత్వమే
    జీతము లేని కొల్వుల నిసీయనువారలు గూడనుందురే? {కొందరైన}

    రిప్లయితొలగించండి
  40. జీతము లేకనె తల్లులు
    బ్రీతిగనేసా కుదురుగ బిల్లలనెపుడున్
    మాతల వేతన లేమికి
    జీతము లేనట్టి కొలువిసీయన దగునే

    రిప్లయితొలగించండి
  41. జీత మదేల నేలికల శ్రీకర ప్రాపక మున్న జాలదే
    వేతన మేల నేతలకు వెన్నుకు దన్నుగ నున్న లోటొకో
    యాతన లేకనే సిరు లెకాయెకి ముంగిట వ్రాలవే భళా
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే.

    రిప్లయితొలగించండి
  42. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    నాతి యొనర్చు సేవలను నాథునికిన్ దన జీవితాంతమున్ |

    జీత మొకింత నాశపడి చేయునె ? తండ్రియు జీవితాంతము ( న్ )

    న్నాతత మైన ప్రేమ c దనివారగ బోషణ ‌‌ జేయ సంతతిన్ ,

    జీతము పొందునే ? అరయ సృష్టి - గమంబున‌ విశ్వ ధర్మముల్

    వేతనమున్ గ్రహించి నెరవేర్తురె మర్త్యులు ? కాన ‌ ‌ సత్కవీ !

    జీతము లేని కొల్వుల నిసీ యను వారలు గూడ ‌ నుందురే ?

    మాతను మించు దేవతయు , మాన్యపితన్ సరిబోలు ‌ దైవమున్ ‌,

    భూతల మందు లేరనెడు పుణ్యవచస్సు మదిం దలంచుమా !

    రిప్లయితొలగించండి
  43. మాతా పితరులు మహిలో
    ప్రీతిని సంతానపు నభివృద్ధిని గన చే
    యూత నొసంగుచు చేసెడి
    జీతము లేనట్టి కొలు విసీ యన దగునే!

    రిప్లయితొలగించండి
  44. జీతము లేకయే సతులు జీవిత మంతయు సంతు గూర్చియే
    ప్రీతిని ధారవోయుదురు
    ప్రేమకు సాటిది లేదుగా భువిన్
    జింతనుజేయగామదికి చెందునుసంతస మట్టి వారికిన్
    జీతములేనికొల్వులనిసీయనువారలుగూడనుందురే

    రిప్లయితొలగించండి

  45. యాతన పొందుచు భువిలో
    చేతము నందున సతతము సంతోషముతో
    మాతయు సేవలు చేయగ
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే.

    రిప్లయితొలగించండి
  46. సంతత మాహరిన్ మిగుల సంతస మందుచు శయ్యగన్దగ
    న్నాతత పర్ణయుగ్మముల నాత్రుత వాకిట వాహనమ్ముగన్
    బ్రీతిగ పాదముల్గొనుచు వేడుక మీరగ
    సేవజేసెడిన్
    జీతములేని కొల్వుల నిసీయను వారలు గూడనుందురే?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదమున సవరణ:

      చేతనుడా హరిన్ మిగుల చేవను మోయగ శయ్యగన్దగ
      గా స్వీకరింప ప్రార్ధన!

      తొలగించండి
  47. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారిని తలచుకొంటూ

    🛐గురుదేవో భవ🛐

    ఉత్పలమాల

    సూతుని బోలి చెప్పుచును శోధన జేసి పురాణ సారమున్
    నైతిక బోధనల్ ప్రవచనమ్ముల గూర్చుచు 'కోటి' పేరునన్
    జాతి హితంబుకై యుచిత సాయము నంకితమౌచుఁ జేసెడున్
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే?

    రిప్లయితొలగించండి
  48. సీతాపతి దేవళమున
    చేతో మోదంబలరగ సేవలు జేయన్
    యాతనలన్నియు మరచెడు
    జీతము లేనట్టి కొలు విసీ యనదగునే!!!


    ప్రీతిగ గృహమును దిద్దుచు
    యాతనబడుచున్న గాని యనురాగముతో
    మాతయెజేసెడు సేవల
    జీతము లేనట్టి కొలువిసీయనదగునే!!!

    రిప్లయితొలగించండి
  49. ప్రీతిని వాణిని గొలుచుచు
    పోతన కావ్యంబు వ్రాసె బొగడగ జను లా
    భాతిని కవితల సలుపగ
    జీతము లేనట్టి కొలువిసీ యనఁ దగునే

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కోరుచు గావగ రాముని
    రా ! రమ్మని పిలిచె సీత రాధాలోలున్
    తీరమ్మున యమున నదిని
    నీ రాధను వేచియుంటి నికరమ్మనియెన్

    రిప్లయితొలగించండి
  50. జాతికి మేలు గూర్చగను జాగృతి పెంచ జనాళి కంతకున్
    నైతిక వర్తనమ్ము నిల నాటగ బెంచగ వృద్ధి జేయగన్ బ్రీతిగ నెప్పుడుం బ్రజకు బ్రేమను పంచగ చేయుసేవలన్
    "జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే"

    రిప్లయితొలగించండి


  51. కేతనమున కపియుండగ

    సూతుండైరథము నడుప జోరుగ హరియు

    న్నీ తీరుగ హేళనగా

    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే.

    ఉత్పలమాల
    వాతుని పుత్రుడావిరటు పట్టణ మందున వంటవాడిగన్

    యాతరణీసుతుండుకొలువందున పాచిక లాడుకంకుడై

    నైతికబోధనల్ విడక నాపృథివీపతికిన్ చేయుచుండగా

    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తరణి సుతుండు కర్ణుడు కదా!
      బహుశ ధర్మరాజును తరణి పౌత్రుండు అనవచ్చునేమో!!

      మరియు తరణి >> ఇకారాంతమా? ఈకారాంతమా? అని సందేహము నాకు కలదు
      ఆంధ్రభారతి - శబ్దరత్నాకరము >. పుం లింగానికి ఎమి చెప్ప లేదు.

      తొలగించండి
  52. ఎవరూ కూడా ఒక్ఖ పద్యమే రాసి వదలటం లేదల్లే ఉన్నది.

    భ్రాతలు, బ్లాగున కవితా
    మ్రోతలు మ్రోగింప, జూడ, ముచ్చట గొలిపెన్,
    జాతికి ప్రేరణనిచ్చెడి
    జీతము లేనట్టి కొలువిసీయన దగునే!

    మాతలి వలె సారథ్యము
    ఆతతముగ జేయు శంకరాఖ్య! పవిత్రా!
    జోతలిడెద మీదు కృషికి!
    జీతము లేనట్టి కొలువిసీయన దగునే!

    రిప్లయితొలగించండి
  53. ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి,

                     24-02-2018 నాటి సమస్య కు పూరణ :

    మేలుగ జేసిరా సభను మేదిని తెల్గుకు కీర్తి గూర్చగన్

    వేలుగ కార్య కర్తలును ప్రేక్షకు లెందరొ వచ్చి చేరగన్

    తూలిరి తన్మయత్నమున దోషమొకింత లేక నాడు;గా

    రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చచున్.

    రిప్లయితొలగించండి
  54. 24-2-18
    ........సమస్య...

    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే!

    సందర్భము... శ్రీ కృష్ణుడు "యుద్ధం చేస్తా" ననలేదు. అలా గని "మూతి బిగించుకొని మాట్లాడకుండా వుంటా" ననీ యనలేదు. అంటే అందులో ఆంతర్యం యేమిటి? నీవు యుద్ధం చేస్తుంటే నేను సలహా లిస్తా నని అన్నట్టే అయింది కదా! చెప్పకనే చెప్పడం కృష్ణుని పద్ధతి.
    తాను చేయడు గాని చేయిస్తాడు. అదే అతని రాజనీతి. పార్థ సారథి చాకచక్యం. అతనికి యే వేతనమూ అర్జునుడు యిస్తా ననలేదు.. కృష్ణుడు అడుగనూ లేదు.. పైగా "నీవు నా రథంమీద వుంటే చాలు" అని యన్నాడు అర్జునుడు. "వుంటా" నన్నాడు కృష్ణుడు. అంతే!
    అటువంటి జీతంలేని కొలువు చేసినా కృష్ణునిగురించి "యిస్సీ" అనలే దొక్కరూ. పైగా లోకోత్తరమైన పని చేసినా డన్నారు. ఎంత విచిత్రం!!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ప్రీతిగ సమరము సలుపడు..
    "మూతి బిగించుకొని యుందు
    పొ" మ్మన డౌరా!
    నీతి గల పార్థ సారథి
    జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే!

    ---2 వ పూరణము----

    సందర్భము... శ్రీ నివాసుడు అలా నిలబడే... వుంటాడు రా త్రనకా పగ లనకా.. మనమేమో కాంప్లెక్సులలో హాయిగా కూర్చుంటాం. కునుకులు తీస్తాం. కేవలం నిలుచొని వుండడమే కాదు. అందరి కోరికలూ తీరుస్తాడు పాపం. అది మరో పని.
    ఈ *"నిలువుజీతం"* ఆయన కెవ రిచ్చారో! నిలువు జీతం అనరాదేమో! జీతం లేదు కదా! *నిలువు కొలువు* అనా లనుకుంటాను. విజ్ఞులే తేల్చాలి.
    ఇంతగా జీతంలేని కొలువు ఆ ఏడు కొండల వాడు చేస్తున్నా ఎవరూ "యిసీ" అనడంలేదు. పోనీ కాస్త జాలికూడ చూపడం లేదు.
    " నా తండ్రీ! బాలా త్రిపుర సుందరీ స్వరూపుడవైన ఓ బాలాజీ! నీ కి దేమి పరిస్థితి" అంటూ ఒక భక్తుడు తన ఆవేదనను వ్యక్త పరుస్తున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నీతిగఁ గోర్కెలఁ దీర్తువు,
    ప్రీతిగ నిలబడియె యుందు రేయిం బవళుల్,
    నా తండ్రీ! బాలాజీ!
    జీతము లేనట్టి కొలు 'విసీ!' యనఁ దగునే!

    3 వ పూరణము:--

    సందర్భము... జీతం తీసుకునే వాడు జీతగాడే ఔతాడు. కాని యజమాని కాలేడు. యజమాని యైనవానికి జీతం తీసుకునే అవసరమే లేదు. ఆంగ్లేయులు మనలను సేవకులుగా భావించేవారు గనుకనే *గవర్నమెంట్ సర్వెంట్స్* అన్నారు. సర్వెంట్స్ అంటే సేవకులు లేదా జీతగాండ్లు అని.
    ~~~~~~
    ఆతడు యజమాని, యతని
    జీతము లేనట్టి కొలు 'విసీ!' యన దగునే!
    జీతమును జీతగాడే
    ప్రీతిగఁ దీసికొను, నిదియు పెద్ద విషయమే!
    --------------------------------
    ..............సమస్య
    జీతము లేని కొల్వుల ని
    సీ! యనువారలు గూడ నుందురే!

    సందర్భము... శ్రీ రామ దూతయైన ఆంజనేయుడు పరమాత్ముని సేవయే జీవిత పరమార్థ మని తెలియ జేయడానికే అవతరించిన మహానుభావుడు. రుద్రాంశ సంభూతుడు. ఆతడు శ్రీ రామునికి చేసిన సేవలో నే భేషజాలూ లేవు. అంటే చేసినా నని చాటుకోవడాలు నేటివారివలె గొప్పలు చెప్పుకోవడాలు కనిపించవు.
    సీతాన్వేషణం, లంకా దహనం, లక్ష్మణ మూర్ఛ మొదలైన సందర్భాలలో ఆయన చేసిన సేవ లోకోత్తరం. నిరుపమానం.
    "లక్ష్మణ ప్రాణ దాతా చ దశ గ్రీవస్య దర్పహా" అని కీర్తింపబడినాడు.
    ఐనా ఆయనకు ఏ జీతమూ లేదు. కలిగిన లోటూ లేదు. రాముడు కౌగిలించుకొని "నీ ఋణం తీర్చుకోలేను. నీవు నాకు భరతునితో సమానుడవు" అన్నాడు. "నవమ బ్రహ్మ వౌతా" వని యనుగ్రహించినాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ప్రీతిఁ దలిర్ప నే యితర
    భేషజముల్ పొడసూపకుండగా
    నాతత సేవ జేయ పర
    మార్థ మదే!.. యని చాటి చెప్పె నా
    వాత సుతుండు; జీత మెది?
    వానికి గల్గిన లో ట దేది? స్వ
    భ్రాతగ నెంచడే! నవమ
    బ్రహ్మ నొనర్పడె వాని రాముడున్!
    జీతము లేని కొల్వుల ని
    సీ! యనువారలు గూడ నుందురే!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  55. ఖ్యాతిని మానమున్ గనక కైతను నేర్పగ మాతృభాషనున్
    రాతిరి ప్రొద్దునున్ గనక రైతును వోలుచు సేద్యమోర్చుచున్
    ప్రీతిని శంకరాభరణ వేదికనున్ గని వృద్ధిజేయుటౌ
    జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే!

    రిప్లయితొలగించండి