13, ఫిబ్రవరి 2018, మంగళవారం

ఏకాదశ రుద్ర మండల బంధ సీసముపద్యము చదువు విధానము :  
బాణము  గురుతు పెట్టిన (జ) దగ్గిర నుంచి మొదలు పెట్టాలి (  డు)తో ఆపి  తిరిగి (ని)తో మొదలు పెట్టాలి  చిత్రములో (పంచ...... భైరవుండు) తో ఆపి  అంతర వృత్తములో ఉన్న (సాం)తో  మొదలు పెట్టి  సుబలుడు తో  ఆపి  పైన తిరిగి బాణము గుర్తు  దగ్గిర గల జ తో మొదలు బెట్టి  (జనని శాంభవి యనగగ  కలకాలము  దయను పంచు) తో ముగించాలి .  దీనిలో విశేషము (డు) అన్న పదము మధ్య శివ లింగములో బందిమ్చబడినది               
సీ:
జడముడి జంగము, శాంభరీ  భిల్లుడు,
నిటలాక్షుడు, నియంత, నీలగళుడు,
భద్రేశుడు, ఉదర్చి, భవానీపతి, భవుడు,
యజ్ఞము, ధూర్జటి, అఖిల గురుడు,
గట్టురా జల్లుడు,  ఖట్వాంగి,  ఉగ్రుడు,
కల్మషకంఠుడు,  ఖరువు,  హరుడు,
కాలాంతకుడు, కాల కాలుడు, చండుడు,
ముక్కంటి, స్వంజుడు, మృడుడు, ధృవుడు,
తే:
యమున రత గురువు, భగాలి, అజుడు, శివుడు,
పంచ వక్త్రుడు, ఫాలుడు, భైరవుండు,
సాంబుడు, విధుడు, సుబలుడు, జనని శాంభ
వి యనగను  కలకాలము  దయను పంచు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

2 కామెంట్‌లు:

 1. సూర్య కుమార్ గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏకాదశ రుద్ర మండల బంధములో మహారుద్రుని భక్తి పాశములతో బంధించి చేసిన పూజ సందర్భోచితముగా చాలా బాగుంది. అభినందనలు.
  భద్రేశుడు, ఉదర్చి విసంధి దోషము, గణ భంగము కూడా.
  జనని శాంభ/ వి యనగను లో నన్వయము బోధ పడలేదు. శాంభ/వియు నలర అనవచ్చునేమో చూడండి.
  ముక్కంటి, స్వంజుడు, మృడుడు, ధృవుడు: ము –మృ ల యతి చెల్లదు.
  తదనుగుణముగా బంధబద్ధముగా సవరణ చేయ గలరు.

  రిప్లయితొలగించండి
 2. Kameswars RAO gariki namaskaram meru cheppina suchana chusi tappaka patistsnu. Danyavadamulato

  రిప్లయితొలగించండి