9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సమస్య - 2592 (సంకటములఁ గూర్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే"
(లేదా...)
"సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

95 కామెంట్‌లు: 1. పెండ్లికి అడ్డుపడే బలరాముడు :)


  బింకము విడువడు మదిలో
  జంకును లేదతనికయ! భుజభలము నందు
  న్నింకెవరుసాటి ? అయినా
  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే !

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "భుజబలము.... సాటి? యయినను..." అనండి.

   తొలగించు
  2. వేంకట నాయకుడీకలి
   సంకటములుదీర్ప నవతరించెన్ కలిలో
   సంకట హరుడౌ హరియే
   సంకటములు గూర్చు వాడు సంకర్షణుడే

   తొలగించు
  3. స్వయంవరపు అప్పారావు
   విశాఖపట్నం

   తొలగించు
  4. అప్పారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. "సంకటముల దీర్చ తాను సంభవమందెన్" అందామా?

   తొలగించు
 2. వేంకట పతియే భక్తుల
  సంకటములఁ గూర్చువాఁడు; సంకర్షణుఁడే
  సంకటములు దీర్చు హరికి
  పొంకమ్మౌ సోదరుండు పూజ్యుండిలలో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   కూర్చు శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 3. జంకక దుష్టుల డీకొన ,
  శంకల స్వాంతన మెపుడును సాంత్వన జెంద
  న్వంకలు లేని విధంబున
  సంకటముల గూర్చువాడు సంకర్షణుడే .

  రిప్లయితొలగించు


 4. శకుని దుర్యోధనునితో మాయాబజార్ :)


  కమలాక్షుండు,మురద్విషుండు మురభిత్కంసారి, దుర్యోధనా,
  సమకూర్చుం గద సర్వ సంకటములన్; సంకర్షణుం డెప్పుడున్
  తమపైనన్ పిరియమ్ము గాంచి గురువై ధర్మంబు గా జూచె! గా
  నమనమ్మాతని మామగా ద్రుహునికై నాంత్రమ్ము జేయన్దగున్ !


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   శశిరేఖా పరిణయ నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మురద్విషుండు, మురభిత్తు.... రెండూ సమానార్థకాలే. పునరుక్తి కదా! "సుచక్రపాణి మురభిత్కంసారి..." అందామా?

   తొలగించు
 5. కం: సంకటకరదైత్యాళికి
  సంకటముల గూర్చు వాడు సంకర్షణుడే
  సంకటమున గల భక్తుల
  సంకటములుల దీర్చు వాడు సంకర్షణుడే .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   నాలుగు పాదాల్లోను 'సంకటము'ను నిలిపి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించు
  2. చక్కటి పూరణ ధనికొండవారూ! అభినందనలు!

   తొలగించు
 6. క: శంకించి నాశనము నిరు
  వంకల స్వజనులను విడిచి, పయనమ్మయ్యెన్
  సంకేతస్థలమున కే
  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. అంకిలిఁగూర్చె సుభద్రకు
  పొంకముగా పార్థు ప్రీతి పొందెడు వేళన్
  బింకపు వెన్నుని కాదని.
  సంకటములు కూర్చువాడు సంకర్షణుడే

  రిప్లయితొలగించు
 8. మంకు తనము హెచ్చైనను
  సంకటముల గూర్చు; వాడు సంర్షణుడే
  పంకజనాభుని పానుపు
  సంకల్పము తోడవచ్చె ఛాయగ కృష్ణున్ !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!

   తొలగించు
  3. కోట రాజశేఖర్ గారి సూచనతో చిరుసవరణ:
   చివరిపాదములో
   సంకల్పముతోడ గృష్ణు ఛాయగవచ్చెన్
   వారికి ధన్యవాదములు!🙏🙏🙏

   తొలగించు
 9. సంకుచితమతులకును , దుర....
  హంకారులకును కుటిల మదాంధులకిల ని...
  శ్శంకితమతియై దుర్భర...
  సంకటములు గూర్చువాడు సంకర్షణుడే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

   తొలగించు
  2. శ్రీకృష్ణుడు... సుభద్రతో....

   మమతాబంధము నేను మెచ్చెదను , సన్మానమ్ముఁ దా మెచ్చు , ధీ ...
   ర మతిన్ బార్థుని నీవు గోరితి సుభద్రా ! యెంచె దుర్యోధనున్
   కుమతిన్ భ్రాత ! , త్వరన్ గొనంగ నిక మీకున్ మేలు ! లేకున్నచో
   సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
 10. సంకర్షణుడన విష్ణువు
  యింకా బలరాముడు గద నీ యిరువురిలో
  వంకెవరికి బెట్టిరిటుల
  "సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.
   'ఇంకా' అనడం వ్యావహారికం. 'విష్ణువు+ఇంక' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "విష్ణువె। యింకను..." ఆనండి.

   తొలగించు
 11. కొంకక తా భక్తా ళి కి
  సంకట ము లు గూర్చు వాడు సంకర్షణుడే
  అంకిత మై వేడుకొన గ
  సంకట ము లు దీర్చు వాడు సంకర్షణుడే

  రిప్లయితొలగించు
 12. శంకయె లేదు శనైశ్చరు
  సంకటముల గూర్చువాడు; సంకర్షణుడే
  యంకిలిని దీర్చు దేముడు;
  వేంకటపతి నే గొలిచెద వీడగ నిడుముల్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రవీందర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శనైశ్చరు' అని డు ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "శంకేల శనైశ్చరుడే" ఆనండి. 'దేముడు' అనడం గ్రామ్యం. "దేవుడు" అనండి.

   తొలగించు
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2592
  సమస్య :: *సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్.*
  పది అవతారములో ఒక అవతారంగా వెలసిన బలరాముడు ఎల్లప్పుడూ కష్టాలను కలిగిస్తూ ఉంటాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అవతారపురుషుడైన శ్రీకృష్ణునికి దుష్టశిక్షణలో సహకరించేందుకోసం ఆదిశేషుడు బలరాముడు (సంకర్షణుడు) గా అవతరించాడు. ప్రలంబుడు ముష్టికుడు ధేనుకుడు ద్వివిదుడు పల్వలుడు మొదలైనవారిని సంహరించి దుష్టశిక్షణను శిష్టరక్షణను గావించాడు. ఐతే కోపశీలియై తన నాగలితో హస్తినాపురాన్ని గంగలో కలపాలని ప్రయత్నం చేశాడు. యమునా నదిని చీల్చి తెల్లబోయేటట్లు చేశాడు. తనను గౌరవింపలేదని సూతమునిని దర్భతో కొట్టినాడు. సుభద్ర అర్జునుల వివాహంవిషయంలో శశిరేఖ అభిమన్యుల వివాహ విషయంలో తమ్ముడైన శ్రీకృష్ణునితో మొదట విభేదించాడు. భీముడు తన ప్రతిజ్ఞను తీర్చుకొనేందుకు దుర్యోధనుని తొడలను విఱుగగొట్టగా రారాజు పక్షాన మాట్లాడి భీముని తప్పు పట్టినాడు. బలదేవుడు రజో గుణవంతు డవడంతో ఇలా కష్టాలను కలిగిస్తూ ఉంటాడు అని హస్తినకు చెందిన ఒక పౌరుడు మాట్లాడే సందర్భం.

  శ్రమ గల్పించెను గర్భవాసి యగుచున్ సంకర్షణుం డౌచు వి
  భ్రమలన్ దేవకి , కంత రోహిణికి తా రాముండుగా బుట్టె , భీ
  ము మదిన్ మెచ్చడు , కోపశీలి , బలరాముం డెప్డు దుర్యోధనున్
  కుమతిన్ మెచ్చును , గంగలో గలుపగా గ్రుచ్చెన్ గదా హస్తినన్ ,
  యమునన్ జీల్చెను , సూతు గొట్టె , సరిగా నాలోచనన్ జేయగా
  *సమకూర్చున్ గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. * (9-2-2018)

  రిప్లయితొలగించు
 14. _విమలంబైన మనంబునన్ సతత సంవేద్యంబుగా శ్రీహరిన్_
  _కమనీయంబుగ భక్తితో కొలిచెడిన్ కైవల్యదాహార్తు లన్_
  _సమకూర్చుంగద సర్వసం కటములన్సంకర్షణుండెప్పుడున్_
  _క్షమితాశక్తి పరీక్షనన్ గెలువ ప్రక్షాళించ తప్పొప్పులన్_

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చేపూరి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పరీక్షలో' అనండి.

   తొలగించు
 15. మంకుతనమ్మున మరిమరి
  యంకిలి సెప్పుచు బ్రగతిని నడ్డునెవండో?;
  యింకెవరు ? హరికినన్నగు
  "సంకటములఁ గూర్చువాఁడు ; సంకర్షణుఁడే"

  రిప్లయితొలగించు
 16. కమనీయంబగు భక్తభవ్యకథలే కావ్యంబు వర్ణించినన్
  రమణీయోక్తుల విష్ణు గాధఁ జదువన్ రాముండు మోక్షమ్ములన్
  సమకూర్చుంగద; సర్వసంకటములన్ సంకర్షణుం డెప్పుడున్
  ద్రుమవిచ్ఛేద మొనర్చు నట్లుగను దాఁ ద్రుంచున్ సమూలంబుగన్.

  రిప్లయితొలగించు
 17. teluguvelugu@ramojifoundation.org
  శంకరాభరణం - కవిమిత్రులకు విన్నపము. శంకరాభరణం వెబ్ సైటు వాట్స్ అప్ గ్రూపు గురించి పద్య రచనలో దిని పాత్రగురించి తెలియజేస్తూ మిఫోటో తో సహా తెలుగు వెలుగుకు పై ఈమెయిలు కు రేపటిలోగా(10.02.2018) పంపండి. వారు వచ్చే సంచిక లో ప్రకటిస్తారు.

  రిప్లయితొలగించు
 18. సంకర్షణుడేజనులకు
  సంకటములగూర్చువాడు.సంకర్షణుడే
  సంకటములబాపునతడు
  శంకరుడేదేనికైనజాలునుసుమ్మీ

  రిప్లయితొలగించు
 19. ప్రమదమ్మొప్పగ మాయమౌనిగని సంభాషించె గృష్ణుండు యీ
  సమయమ్మందున కౌరవాధిపునితో సాగించు వియ్యమ్ము కూ
  రిమితోనన్న,ధనుంజయా వినుము వారింపంగ లే మాతనిన్
  సమకూర్చుం గద సర్వ సంకటములన్; సంకర్షణుం డెప్పుడున్

  రిప్లయితొలగించు
 20. గురువు గారికి ధన్యవాదములు.

  శంకేల శనైశ్చరుడే
  సంకటముల గూర్చువాడు; సంకర్షణుడే
  యంకిలిని దీర్చు దేవుడు;
  వేంకటపతిఁ నేఁ గొలిచెద వీడగ నిడుముల్.

  రిప్లయితొలగించు
 21. దేవతలతో బ్రహ్మ పలికిన పలుకులు
  వేంకటరమణుని బెండ్లికి
  సంకోచము వీడి సాహసములను జేయన్
  వంకలను జూపవలదిక
  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే

  రిప్లయితొలగించు
 22. సంకటముల గూర్చును మరి
  సంకటముల దీర్చు చుండు చక్రికి నతడే
  యింకను జెప్ప వలయునా ?
  "సంకటములఁ గూర్చువాఁడు ; సంకర్షణుఁడే"

  రిప్లయితొలగించు
 23. అంకిలు లీయ సుజనులకు
  మంకుతనమ్మున దివిజ సమాన బలుఁడు ని
  శ్శంకం గల్మాషులకున్
  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే


  విమలద్యోత మహావతారమె గదా, విష్ణుండు సాక్షాత్తిలం
  గమనీయమ్ముగఁ గృష్ణుఁడై కడుకొనంగన్, రౌహిణేయుం డటన్
  స్తిమితం బిచ్చి మహార్త చిత్తమునకున్ శ్రేయమ్ములం బ్రేమతో
  సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్

  [సంకటములన్ = సంకటములందు]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 24. మంకుతనము గల మిత్రుడు
  సంకటములు గూర్చు వాడు - సంకర్షణుడే
  సంకోచించక హలమున
  హూంకృతితో పెళ్ళగించె నుర్వీతలమున్

  రిప్లయితొలగించు
 25. కందం
  సంకుచితులౌ దురాత్ములు
  బింకముతో సాధు జనుల పీడించంగన్
  శంకవలదు యుగయుగముల
  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే

  రిప్లయితొలగించు
 26. తమితో ప్రార్థన జేయు చు న్ సతత ము న్ ధర్మా ను వర్తుoడునై
  అమల oబౌ మది గల్గి మానవు ల కు న్ ఆదర్శ పాత్రు oడునై
  కమలాక్షున్ కొలువoగ దీర్చు కాంక్షించు శ్రేయoబుల n
  సమకూర్చు న్ గద సర్వ సంకట ము ల న్ సంకర్షణుoడె ప్పుడు న్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నాలుగో పాదం చివర ల న్ అని చదవాలి

   తొలగించు
  2. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మానవులకున్ + ఆదర్శ = మానవుల కాదర్శ...' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా! "మానవులకే యాదర్శ..." అనండి.
   మూడవ పాదంలో గణదోషం. ""దీర్చును కదా కాంక్షించు..." ఆనండి.

   తొలగించు
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అంకించగ నాహరియే
  సంకటములు గూర్చు వాడు; సంకర్షుణుడే
  సంకటముల నణచుటలో
  పంకజనాభు నలరించి బాసట యయ్యెన్

  రిప్లయితొలగించు
 28. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  { ఒక హాలికుడు బలరాముని సేవించు భక్తుడు . వరుసగా ఐదేండ్లు

  క్షామ మేర్పడగా , " నా నేర మేమో బలరాముడు యిలా

  ఎప్పుడు బాధలు కలిగించు చున్నాడు గదా యని దుఃఖించెను " }
  క్షమనే నమ్మిన హాలికుండనయి , సంసారంబు సాగించు స

  త్ప్రమనుండన్ | గడు భక్తి మీరగ బ్రలంబఘ్నున్ మది గొల్తు | నై

  న , మహాక్షామము సంభవించి వరుసన్ నాల్గైదు సంవత్సరా

  లు మమున్ దుఃఖపయోధి ముంచె నయొ ! నాలో నేరమేమో ! యిటుల్

  సమకూర్చుంగద సర్వసంకటములన్ సంకర్షణుం డెప్పుడున్


  { క్షమ = భూమి ; ప్రమనుండు = సంతోషమొందిన మనసు గలవాడు ;

  ప్రలంబఘ్నుడు = బలరాముడు }

  రిప్లయితొలగించు
 29. సమదోద్వేగదురంతపాపముల నుత్సాహంబుతోఁ జేయగన్
  సమకూర్చుం గద సర్వసంకటములన్ సంకర్షణుం డెప్పుడున్
  విమలంబౌ నెదఁ బుణ్యకార్యములటుల్ వేగార్భటిం జేయగన్
  సమకూర్చుం గద సర్వసౌఖ్యఘటనల్ సంకర్షణుం డెప్పడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. ధన్యోస్మి.
   కంటి చికిత్స విజయవంతమైనందులకు శుభాభినందనలు.

   తొలగించు
 30. మిత్రులందఱకు నమస్సులు!

  సంకుం, ౙుట్టుంగైదువుఁ,
  బొంకపుఁ గటి చేలమందు మురళిం గొనియుం
  దుంకు హరితో, దనుజులకు

  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే!

  రిప్లయితొలగించు
 31. రుక్మిణీమాత శ్రీకృష్ణునితో........

  విమలంబైన మనస్కుడౌట గని తాఁ విద్వేషమాత్సర్యుఁడై
  కమలాక్షిన్ నవయౌవనాఢ్య శశిరేఖన్ పుత్రుకున్ గోరి యు
  ద్ధమునన్ మీదు సహాయమున్ జెరప గాంధారేయుడున్ దల్చెనే
  సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్

  రిప్లయితొలగించు
 32. పుత్రునకున్ అనేది సాధువనుకుంటాను కదా గురువుగారూ........

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నిజమే 'పుత్రునకున్' అన్నది సాధువు.

   తొలగించు
 33. (2)
  సుముఖాయోముఖి సీర యుక్త కరుఁడై శోభిల్లుచున్, వీరమే
  తమకింపన్, బసిగాపులుం గనఁగఁ, గాంతారంపు వాహ్యాళియై,
  మమకారమ్మునఁ దమ్ముఁ దోడఁ గొని, దమ్మాఱంగ దైత్యాళికిన్

  సమకూర్చుం గద సర్వసంకటములన్ సంకర్షణుం డెప్పుడున్!

  రిప్లయితొలగించు
 34. మత్తేభవిక్రీడితము
  కొమరుల్ లేరని పుట్టు వాని వలనన్ గొడ్రాలిఁ గాకుందునన్
  భ్రమలో నుండ నయోగ్యురాలినని గర్భమ్మందు ముద్దన్ మరో
  సుమతీ గర్భముఁ జేర్చినన్ సబబనన్ శోధించి సాధించగన్
  సమకూర్చుం గద సర్వ సంకటములన్ 'సంకర్షణుం' డెప్పుడున్!

  (సర్ర్రోగేట్ మదర్ కై శోధించటానికి సంకటములను కూర్చు వాడు వేరు గర్భమును గోరు `సంకర్షణుఁడను భావము)

  రిప్లయితొలగించు
 35. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో

  సుమతీ ! త్రేతయుగంబునన్ గినుక పూజ్యుండైన సౌమిత్రి దా
  వమునన్ నాసిక ద్రుంచెనే వనిత లావణ్యంబు గోల్పోవగన్
  తమితో ద్వాపరమందునన్ బలదు
  డత్యంతాంతరమ్మౌ తరిన్
  సమరంబున్ వలదంచుతా విడచె నస్త్రంబుల్ కురుక్షేత్త్రమున్
  గమనింపంగను దోచునే యిటుల
  నేకాలంబు నైనన్దగన్
  సమకూర్చుంగద సర్వసంకటములన్ సంకర్షుణుం డెప్పుడున్!

  గురుదేవులకు నమస్సులు! ఆర్యా! కందపద్య పాదము నేనిచ్చినది. సులువుగా వ్రాయగలిగితిని.
  మత్తేభమును మచ్చిక జేయుట కింత సమయము పట్టినది! తప్పులు మీరే దిద్దవలె! నమస్సులు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సవరణ:
   రెండవ పాదములో
   దావమునన్ నాసిక ద్రుంచెనే తగవు దేవంగాను లంకేశుతో
   గా చదువ ప్రార్ధన

   తొలగించు
  2. నేనీరోజు మత్తేభానికి భయపడలేదు కానీ బలరామునికి భయపడ్డాను. సరే! పనిలో పనియని గురువుగారిని ప్రస్తుతిస్తూ ఒక ఉత్పలమాల (ఈజీ) వ్రాశా:

   *******************************


   శంకరాభరణం సమస్య - 2530

   "శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్"

   G P Sastry (gps1943@yahoo.com)ఫిబ్రవరి 09, 2018 7:01 PM

   చంకన శంకరాభరణ శంకరి నూనుచు సంతసమ్ముతో
   వంకలు వాగులన్నుఱికి పంకజనాభుని గారవమ్ముతో
   సుంకము మాపుచున్ సులభ సుందర ప్రాభవ లాఘవమ్ముతో
   శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్

   తొలగించు
  3. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   నమస్సులు!

   తొలగించు
  4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!

   తొలగించు 36. సంకటహరణుండెవరన

  వెంకటరమణు,డెపరిపరి విధముల ప్రజకున్

  నంకము చేర్చగ దలచుచు

  సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే.

  2జంకకదైత్యుండిలలో

  సంకటములగూర్చువాడు, సంకర్షణుడే

  శంకలు తొలగించుచు మన

  సంకటములుబాపి సైతము సంతసమొసగున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో "ప్రజకు। న్నంకము..." అనండి.
   రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించు
 37. సుంకము లేకను ప్రజలను
  పంకము నందుం దుండి లాగి పరము నొసంగన్
  శంకించక పూజించిన
  సంకటముల గూర్చు వాడు సంకర్షణుడే

  రిప్లయితొలగించు
 38. బొంకుట ధర్మమ నునతడు
  సంకటములు కూర్చువాడు,సంకర్షణుడే
  శంకరుడు,శుభకరుడు ,యమ
  కింకరడగు నీచులకును ,కిటుకుల వియునే.

  రిప్లయితొలగించు
 39. ఇవి కృష్ణుడు రుక్మిణి తో తన బాల్య క్రీడల గురించి చెప్పు సంధర్భం లోనిది

  "పాకము వలెనున్న మన్ను
  నే కడుపార తినుచుండ,నేరమని యుండ
  లేక జననికితెలిపె నాకు
  సంకటముల గూర్చువాడు సంకర్షణుడే!"

  రిప్లయితొలగించు
 40. లాహిరి లాహిరి లాహిరిలో..

  తమవారెవ్వరొ కానివారెవరొ తా దండింప లాలింపగన్
  తమినిన్ దెల్పుచు నౌక యానముననున్ తార్మారు గావించుచున్
  కమలాక్షుండిడ సమ్మతిన్ తనివిగా, కారాలు మిర్యాలతో
  సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్

  రిప్లయితొలగించు