21, ఫిబ్రవరి 2018, బుధవారం

సమస్య - 2604 (పుత్రోత్సాహమ్ము పొంగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"
(లేదా...)
"పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

96 కామెంట్‌లు:

  1. పుత్రుడు చెంతగ నుండగ
    పుత్రుని విలువది తెలియదు మూర్ఖుల కెపుడున్
    పుత్రుడు జనగ విదేశము
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    రిప్లయితొలగించండి



  2. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ :)


    అత్రత్యపు భువి మాయగ
    చిత్రంబగు జీవితమిది! చింతయు గూడన్
    విత్రస్తుని మది లో భళి
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పుత్రుడు ప్రేమించెడు సతి
    చిత్రాంగిగ మారి యింట చిచ్చును బెట్టన్
    పుత్రుడు కనుగొని దిద్దిన
    పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్

    రిప్లయితొలగించండి
  4. (ఘటోత్కచుని యుద్ధనైపుణ్యం దర్శించిన భీమసేనుడు)
    పిత్రానుక్రమశౌర్యము
    చిత్రము ఘటోత్కచునందు జిందన్ భీము
    న్నేత్రముల మోదఝరులవె
    పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో రెండవ గణం (ఘటోత్క) జగణం అయింది. సవరించండి.

      తొలగించండి
  5. పుత్రా!రమ్మని పల్కుచు
    చిత్రంబుగ పెద్ద జబ్బు చేసిన పితరుం
    డాత్రంబుగ తా పిల్చెను.
    పుత్రోత్సాహంబు పొంగు పోఁగాలమునన్

    రిప్లయితొలగించండి
  6. శత్రువులను దునుమాడుచు
    మిత్రుల మైత్రిని బెంచిన మేలిమికైనన్
    పుత్రులు దరి యుండని తరి
    పుత్రోత్సాహమ్ము గల్గు పోగాలమునన్.

    రిప్లయితొలగించండి
  7. శత్రువు నైనను గాంచిన
    మిత్రత్వము నొంద గోరు మేలగు నంచున్
    పుత్రుడు ప్రేమగ బిలిచిన
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సార్! మొన్న మీరు తీర్థయాత్రలలో నుండినపుడు ఈ క్రింది చిన్న పద్యము వ్రాసితిని. మీరు చదవాలని మరల ఇచ్చట ప్రచురిస్తున్నాను:


      రోజులు మారగ నేండ్లుగ
      నాజూకగు పద్యములను నందము తోడన్
      జాజుల మాలగనల్లిన
      రాజేశ్వరి గారికిడుదు ప్రాంజలి శతముల్

      తొలగించండి
  8. పుత్రుడు గుణ వంతు డ గుచు
    రాత్రింబవలు ను శ్రమించి రాణించి న చో
    పాత్ర త నె రి గి న తండ్రి కి
    పుత్రో త్సా హ మ్ముపొంగు పో ;గా ల ము న న్

    రిప్లయితొలగించండి


  9. విత్రాసమ్మది మానసమ్ము కుదుపన్ వేసారి బోవన్ మది
    న్నాత్రించున్ కలతల్ వెతల్! కుదురదే నాధ్యానముద్రల్ ! భువిన్
    చిత్రంబైనది జీవితమ్ము ! మదిలో చింతల్ సమాళింపగన్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. మిత్రులు మిత్రుండ్రనుచును
    పిత్రార్జిత సంపదలను విచ్చలవిడిగా
    పుత్రుడు మ్రింగిన నెక్కడి
    పుత్రోత్సాహమ్ము పొంగు, బోగాలమునన్

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    ధాత్రిన్ పంక్తిరథుండు బిడ్డలను పొందన్ పుత్రకామేష్టి స...
    త్పాత్రుండై యొనరింప , నాశఫలియింపన్ నల్వురిన్ బొందగా ,
    రాత్రించారుల గూల్చ మౌని యడుగన్ రామాఖ్యునిన్ కుందడే !
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు. శాస్త్రి గారికి ధన్యవాదాలు!

      తొలగించండి
  12. *శత్రుత్వముగని చిన్నక*
    *ళత్రముమాటలువినిసుతు*
    *లక్ష్యముగనకన్*
    *పాత్రతనెరుగుసమయమున*
    *పుత్రోత్సాహమ్ముబొంగు,పోగాలమునన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువులు శంకరయ్యగారికి, మార్చబోవగా తప్పుదొర్లినది. తెలియజేసి, సవరించినందులకు ధన్యవాదములు.
      పూ. వామన్ గారికి ధన్యవాదమలు.🙏🙏🙏🙏🙏🙏🙏

      మార్చిన సవరణ :-


      కం. సత్రము జేసి దశరథుడు
      పుత్రచతుష్టయము మురియఽ బొందెన్ జూడన్
      మిత్రమ! గనుమా యాతని
      "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

      తొలగించండి
  13. కం. సత్రము జేసి దశరథుడు
    పుత్రత్రయమునుఁ మురియగఁ బొందెన్ జూడన్
    మిత్రమ! గనుమా నాతని
    "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గనుమా యాతని" అనండి.

      తొలగించండి
    2. గురువులు శంకరయ్యగారికి, మార్చబోవగా తప్పుదొర్లినది. తెలియజేసి, సవరించినందులకు ధన్యవాదములు.
      పూ. వామన్ గారికి ధన్యవాదమలు.🙏🙏🙏🙏🙏🙏🙏

      మార్చిన సవరణ :-


      కం. సత్రము జేసి దశరథుడు
      పుత్రచతుష్టయము మురియఁ బొందెన్ జూడన్
      మిత్రమ! గనుమా యాతని
      "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

      తొలగించండి
    3. గురువులు శంకరయ్యగారికి, మార్చబోవగా తప్పుదొర్లినది. తెలియజేసి, సవరించినందులకు ధన్యవాదములు.
      పూ. వామన్ గారికి ధన్యవాదమలు.🙏🙏🙏🙏🙏🙏🙏

      మార్చిన సవరణ :-


      కం. సత్రము జేసి దశరథుడు
      పుత్రచతుష్టయము మురియఁ బొందెన్ జూడన్
      మిత్రమ! గనుమా యాతని
      "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

      తొలగించండి
  14. తండ్రికి అనారోగ్యమని తెలిసి విదేశంలో ఉద్యోగాన్ని సైతం వదిలేసి నిరంతరం తండ్రికి చేదోడుగా ఉంటూ క్షణకాలం కూడా విసుగు లేకుండా మరణ సమయం వరకు పితృసేవ చేసిన గుండు హనుమంతరావు పుత్రుడు ధన్యుడు ఆదర్శప్రాయుడు.

    పాత్ర న్నెరిగిన యాసుతు
    డాత్రముగా చేసె గుండు హనుమంతునికిన్
    పుత్రునిగా సేవ గనుడు
    "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యా సుతుడు అనాలా...నా సుతుడు అనాలా... సంశయం!!

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అక్కడ యడాగమమే సాధువు.

      తొలగించండి
  15. చిత్ర సమస్యలకెన్నొ వి
    చిత్ర జవాబులు చిటికెన చెప్పిన నాకే
    చిత్రపు సమస్య గద యీ
    "పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

    రిప్లయితొలగించండి
  16. మిత్రోత్సాహము పొంగిపొర్లు ధర సుమ్మీ!కష్ట కాలమ్మునన్
    చిత్రంబిద్ది కళత్ర తోచు మదికిన్ శ్రీలక్ష్మిగా నంత్యమున్
    ధాత్రిన్ జూడగ నంత్యకాలమున చింతాక్రాంతులై సిద్దికై
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కళత్ర' అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "చిత్రం బిద్దియె భార్య తోచు..." అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువర్యా..సవరణతో
      మిత్రోత్సాహము పొంగిపొర్లు ధర సుమ్మీ!కష్ట కాలమ్మునన్
      చిత్రంబిద్దియె భార్య తోచు మదికిన్ శ్రీలక్ష్మిగా నంత్యమున్
      ధాత్రిన్ జూడగ నంత్యకాలమున చింతాక్రాంతులై సిద్దికై
      పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

      తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

      తొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2604
    సమస్య :: *పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్.*
    పొయ్యే కాలం వస్తే పుత్రోత్సాహం పొంగి పొర్లుతుంది గదా అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శబ్దభేది విద్యలో గొప్ప కీర్తి గడించిన దశరథుడు సరయూనదీ తీరంలో వేటాడే సమయంలో , ఒక ముని కుమారుడు నీటిలో కడవను ముంచుతుండగా బుడబుడ అనే శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని ఏనుగు తొండంతో నీరు త్రాగుతున్నప్పుడు వచ్చిన శబ్దం అని భ్రమ పడిన దశరథుడు , బాణం ప్రయోగించగా ఆ బాణం తగిలి ఆ మునికుమారుడు {శ్రవణ కుమారుడు/యజ్ఞదత్తుడు} మరణించాడు. అప్పుడు అతని తండ్రి పుత్రశోకంతో ప్రాణాలు విడుస్తూ దశరథునికి శాపం ఇచ్చే సందర్భం.

    పుత్రోత్సాహము పొంగ , మా యసువులే పోవంగ నీ వేళ మా
    పుత్రున్ జంపితి వీవు , హే దశరథా ! పుణ్యాత్ము డైనట్టి నీ
    పుత్రుండే నిను వీడి పోవ , నిటులే పోవున్ భవత్ ప్రాణముల్,
    *పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (21-2-2018)

    రిప్లయితొలగించండి
  18. ధాత్రీపతి దృతరాష్ట్రుని
    పుత్రవ్యామోహముననె పోరందు కురు
    క్షేత్రమున మడసిరి సుతులు
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోరునందు' అనడం సాధువు. అక్కడ "పోరునను కురు..." ఆనండి.

      తొలగించండి
  19. చిత్రమ్మే సుతులన్ గనంగ సుఖమే జేగంట మ్రోగించినన్
    శత్రుత్వ మ్మనగన్ దలంచ వలదే చాలంగ డాలర్లకై
    మిత్రత్వమ్ముగపో వనెంచి మురిపెం బేపెద్ద లేమెచ్చగన్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    రిప్లయితొలగించండి
  20. జీవన చరమాంకంలో సగటు మనిషి దినచర్య :-

    పత్రాలలొ సంతకములు
    పిత్రార్జితపంపకములు, వేంకటనాధా!
    మిత్రులతో హాస్యంబులు
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      పద్యం బాగుంది. కాని పూరణ అర్థం కాలేదు. సమస్య పరిష్కరించినట్లు లేదు. 'పత్రాలలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
    2. అలాగే 'పిత్రార్జిత పంపకములు' అన్నది దుష్ట సమాసం.

      తొలగించండి
    3. పోగాలములో ( జీవన చరమ దశలో) మనిషి చేసే పనులు :-
      1) ఆస్తి పత్రాలు వగైరా వ్యవహారాలు
      2) శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపటం ( మిత్రులతో ముచ్చటిస్తూ)
      3) జీవితం కొడిగట్టే సమయంలో మనవారు విపరీతంగా జ్ఞప్తికి వస్తారు. పుత్రోత్సాహం పెల్లుబుకుతుంది.



      తొలగించండి


  21. మైత్రిగ ముదిమిని జేరెన్
    పత్రికలున్ పొగిడె నైదవత్రాడుకు! తా
    క్షేత్రిన్కవ్వింప ముదిత
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!


    ఆపై కథ కాశికి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఐదవత్రాడు' అన్నచోట 'వ' లఘువే. గణదోషం. సవరించండి.

      తొలగించండి
  22. పుత్రుని వినయము నడవడి
    మిత్రులతో మెలగువిధము మైమరపించన్
    బుత్రుని పధ్ధతి దెలియుత
    పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్

    రిప్లయితొలగించండి
  23. రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. చిత్రంబీ కలికాల రీతి గతులౌ చింతల్లు వింతల్గనన్
      పుత్రుండుండగ హైద్రబాదు నగరిన్ పుత్రుండు గోత్రుండెలే!
      సత్రంబందున గూలబెట్టి చనగా శాంఫ్రాన్సిసిస్కోకహా!
      పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్!


      గోత్రుడు = గోవులఁ గాచువాడు

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చింతల్లు' అనడం వ్యావహారికం. "చింతల్ గనన్ వింతలున్" అందామా?

      తొలగించండి
  25. క్షేత్రములను పనిఁ జేయక
    మైత్రినొనర్చుచును దుష్ట మనుజులతోడన్
    రాత్రిచరుడౌసుతుని గని
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    రిప్లయితొలగించండి


  26. మైత్రిగ ముదిమిని జేరగ
    పత్రిక లకునెక్క కథయు పఠితయె సతియై
    క్షేత్రిన్కవ్వింప భళిర
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్!


    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సవరించిన పూరణ :

      కందం

      ధాత్రిని మోసపు స్వాములు
      పుత్రుల నొసఁగెడు ప్రసాదమునిడుదురన్నన్
      చిత్రముగా సతి నంపెడు
      పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

      తొలగించండి


  28. క్షేత్రంబవ్వగ భార్య భర్తకునటన్ క్షేమంబుగా నిమ్మదిన్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా,పోఁగాలమే వచ్చినన్
    తత్రత్యుండట పైన దీవెనలిడన్!తంకమ్ము వీడన్ దగున్
    యాత్రల్జేయగ తీరునయ్యనలతల్ యానమ్ము సాగింపుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. నేత్రము లందు మెఱయఁగఁ బ
    విత్రము కలధౌత మా చెవిని చిత్తమునం
    దాత్రము సెలంగఁ గైకొనఁ
    బుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    [పోఁగు+ఆలము = పోఁగాలము: కర్ణాభరణము కొఱకు పోరు ( చతుర్థీ తత్పురుష); పోఁగు = చెవి పోఁగు]


    చిత్రమ్మే సుమి యౌవనమ్మున నిజ స్తీర్వి ప్రభావమ్మునం
    బాత్రాపాత్రము చింత సేయక ధరన్ వర్తించి మోహమ్మునన్
    గాత్రం బెల్ల కృశించి చిత్తమున సంఘాతమ్ము కన్పించగం
    బుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    [సంఘాతము = నరకము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ధాత్రిన్ కంటకుడైచరించుచుసదాతప్పైన మార్గమ్ములో
    మైత్రిన్ జేయుచు దుష్టులౌజనులతోమాత్సర్య పూరమ్ముగా
    రాత్రిం చోర ప్రవృత్తి తో బ్రతుకు క్రూరాత్మున్ కనన్ తండ్రికిన్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    రిప్లయితొలగించండి


  31. నేటికాలపు "కాలమ్" కథలు !


    మిత్రుడ! ముది! చింతవలదు !
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁ, "గాలమునన్"
    పుత్రిక వయస్సు పడతిన్
    మైత్రి ని బడవేసి పెండ్లి మాట కలుపగన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. శార్దూలవిక్రీడితము
    పుత్రా! శ్రీహరి నామమేల సతమున్ మోదమ్ము నీకన్న? నీ
    ధాత్రిన్ సర్వమునందు నిండి శుభముల్ తానిచ్చు వాడన్న! నా
    చిత్రమ్మున్ గన గుంజఁ జూపుమనుచున్ ఛేదించి గూలెన్ గదా!
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    రిప్లయితొలగించండి
  33. కం:-
    సత్రమున జేర్చి పుత్రుడు
    చిత్రముగా సానికిచ్చి చీఁదరపడినన్
    పుత్రుని యెడల పితరునికి
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్ !!

    @ మీ పాండురంగడు*
    ౨౧/౦౨/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  34. పుత్రుండుద్భవమొంద సంతసములం బొందెన్ మహోత్సాహుడై
    పుత్రార్థమ్ము ధనమ్ముఁ గూర్చె నయయో పోరాటముల్ జేసి, స
    ద్వేత్రంబౌనని దల్చ, నంత్యమునఁ దా వృద్ధాశ్రమందుంచగా,
    పుత్రోత్సాహము పొంగిపొర్లెఁ గదరా పోగాలమే వచ్చినన్.

    రిప్లయితొలగించండి
  35. శత్రువులనెదురుకొనుచున్
    పుత్రుడు సరిహద్దులోన పోరుచు నున్నన్
    చిత్రముగ కన్నవారికి
    పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్!!!

    పుత్రుడు విజయము బొందిన
    పుత్రోత్సాహమ్ము పొంగు, బోగాలమునన్
    పుత్రోత్సవమును దలచుచు
    పుత్రా యని కన్నవారు పొగులుదురిలలో!!!

    రిప్లయితొలగించండి
  36. పుత్రుని గని బుద్ధిగరపి
    మిత్రుని వలె జూడగాను మెలకువ తోడన్
    పుత్రుడు తనబాగు నరయ
    పుత్రోత్సాహమ్ము పొంగు బోగాలమునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు నమస్సులు! మీ యాత్ర దిగ్విజయంగా అయినందుకు సంతోషం!
      నా యాత్ర ఇంకొక రెండు రోజులున్నది!
      యాత్రలో ఉండి కూడ సమయము సిగ్నలు దొరికి నప్పుడు పూరణలు చూస్తూ పూరిస్తూ ఉన్నాను!
      ధన్యవాదములు’

      తొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    పుత్రుం డొక్కడు బుట్టె ధర్మసతికిన్ - పూర్ణేందు బింబాస్యకున్ |

    చిత్రం బేమియొ , వారలన్‌ విడిచి వైచెన్ నిర్దయన్ | స్వైరిణీ

    సత్రం బందున బొర్లి , వాడు సుఖ యక్ష్మం బొందెగా ! ‌| తాళకన్

    ధాత్రిన్ గిర్రున దొర్లె | బొందె నపు డా దారా వియోగం | బికన్ ,

    పుత్రోత్సాహము పొంగి పొర్లె గదరా పోగాలమే వచ్చినన్ !


    { స్వైరిణీ సత్రము = వేశ్యల విడిది గృహము ; సుఖయక్ష్మము =

    సుఖ రోగము }

    రిప్లయితొలగించండి
  38. కం.
    పుత్రుడె తండ్రికి ప్రాణము
    పుత్రుడు వార్థక్యమునను పోషించంగా
    పుత్రుడు తన పేరు నిలుప
    పుత్రోత్సాహమ్ము పొంగు బో గాలమునన్ .

    రిప్లయితొలగించండి
  39. కం.
    పుత్రుడె తండ్రికి ప్రాణము
    పుత్రుడు వార్థక్యమునను పోషించంగా
    పుత్రుడు తన పేరు నిలుప
    పుత్రోత్సాహమ్ము పొంగు బో గాలమునన్ .

    రిప్లయితొలగించండి
  40. పుత్రుడు శత్రుడు తల్లికి
    పుత్రిక బంగారుబొమ్మ ముప్పౌ కోడల్
    యాత్రకు యముండు రమ్మన...
    పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్ 😄

    రిప్లయితొలగించండి


  41. కం:పుత్రులు కొరకై చేసెను

        సత్రము దశరథుడు నాడు సంతోషముతో

        పుత్రులు కలిగిరి నల్వురు

       పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్

    రిప్లయితొలగించండి
  42. ......సమస్య
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా
    పోగాలమే వచ్చినన్!

    సందర్భము... శ్రీ రాముడు అడవికి బయలుదేర నున్నాడు.పుత్రునియం దపరిమితమైన ప్రేమగల దశరథుడు కుప్పగూలినాడు. కర్కశయైన కైక వారించినా వినలేదు. తనలో తానే ఇలా మథనపడిపోతున్నాడు.
    "లోకంలో ఎవరూ పొందని పుత్రోత్సాహం నేను పొందగలిగినాను. (మిగతా వాళ్ళ సంగతి వేరు.) ఎలాగంటే నా పుత్రునికి లోకమంతా జేజేలు పలుకుతున్నది.
    ఇక ఇప్పుడేమో నా పుత్రుని యాత్రా (వన గమనం) ప్రయత్నం జరుగుతున్న దెందుకో అంతుపట్టడం లేదు. దీని కంతటికీ వెనుక ఆ దేవతల పరమోద్దేశ్య మేదో వున్న ట్టున్నది. అది లోక సంరక్షణయో యేదో ఐవుంటుంది.(నా రక్షణ కాదు సుమా!)
    ఓ పిచ్చి దశరథా! ఏదీ నీ పుత్రోత్సాహం! ఇప్పుడు చూపించురా! అది పొంగి.. పొర్లుతూ వుంది. భేష్! ఎందుకంటే పోగాలం వచ్చింది గదా!"
    అని కంటికీ మంటికీ ఏకధారగా పడి పడి యేడుస్తున్నాడు పాపం దశరథుడు.!!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పుత్రోత్సాహము లోకమందు నెవరున్
    బొందంగ లేనట్టిదై
    చిత్రంబై వరియించె నన్ను; జగముల్
    జేకొట్టె నా పుత్రు; నీ
    యాత్రా యత్న మి దేలొ పుత్రున! కయో!
    ఆ లోక సంరక్షయే
    సూత్రంబై మదిఁ దోచురా దశరథా!
    చూపింపురా! ఏది నీ
    పుత్రోత్సాహము?.. పొంగి, పొర్లు గదరా!..
    పోగాలమే వచ్చినన్..

    2 వ పూరణము:

    సందర్భము... శ్రీ రాముని వన గమన వేళ పుత్ర వియోగ దుఃఖాన్ని భరించలేక దశరథుడు తనలో తానే ఈ విధంగా మథన పడిపోతున్నాడు.
    "దేవదేవుడైన శ్రీ మహావిష్ణువే నా పుత్రు డైనాడు. అందువల్ల అందరికంటె నా పుత్రోత్సాహమే ఎంతో విశిష్టమైనది. కాని నే నిప్పుడు పూర్తిగా నిస్సహాయుణ్ణి గదా!
    (ఏమీ చేతగానివాణ్ణి.)
    పుత్రుణ్ణి జాగ్రత్తగా చూచుకోవలసిన బాధ్యత తండ్రిది కదా! ఆ బాధ్యత నిర్వర్తించ లేకపోగా తరిమిపార వేసినాను. అదీ..
    మామూలు చోటికి కాదు. క్రూరమృగాలతో కూడిన.. అడుగడుగున ప్రమాదాలు పొంచి వున్న అడవులు కొండలు వుండే ప్రాంతాలలోకి.
    అందువల్ల నేను క్రూరుణ్ణి. పాపుణ్ణి. పోయే కాలం వచ్చింది కాబట్టి నా పుత్రోత్సాహం పొంగి పొర్లుతూ వున్నది."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పుత్రుం డాయెను దేవదేవు డహహా!
    పొంగారె నుత్సాహ, మా
    పుత్రుం గాంచిన తండ్రినయ్యు ఫలమే
    మో! నిస్సహాయుండనై
    పుత్రుం దర్ముచుఁ బారద్రోలితి నయో..
    భూరిప్రమా దాటవీ
    గోత్ర ప్రాంతములన్ బడంగ నిదె!.. నే
    క్రూరుండ, పాపుండ; నా
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా
    పోగాలమే వచ్చినన్!

    3 వ పూరణము

    సందర్భము... అయోధ్యలో సంబరా లంబరా న్నంటుతున్నాయి. దశరథ మహా రాజుకు నలుగురు పుత్రులు కలిగారు. జ్యేష్ఠుడై శ్రీ రాము డవతరించాడు. దేవత లంతా ఎదురుతెన్నులు చూస్తున్నది అందుకోసమే మరి!
    అదృశ్య రూపులై ఆకాశంలో విహరిస్తూ ఆ సంబరాలను తిలకిస్తున్న ఇద్దరు దేవతలు ఇలా సంభాషించుకుంటున్నారు.
    "శ్రీ హరిని పుత్రునిగా పొందేందుకు అర్హత వుంది గాని దశరథునికి పుత్రోత్సాహం పొందేందు కర్హత యెక్క డుంది? ముని శాపంచేత పుత్ర ప్రేమయే మృత్యువై భవిష్యత్తులో యితణ్ణి కబళించక తప్పదు కదా! యితని పిచ్చి గాని..
    ఎట్లైనప్పటికీ రాము డవతరించిన ప్రధానమైన ఉద్దేశ్యం లోక కంటకులైన రావణ కుంభక ర్ణాదుల సంహరించడమే! ఇతడు సంబరపడిపోతున్నా డంటే అది ఆనుషంగికమే కదా! ( అంటే ప్రధాన ప్రయోజనంతోబాటు పెద్ద ప్రయత్నం లేకుండానే ప్రాప్తించే రెండవ ప్రయోజనం.)
    పోఁ గాలం ( దశరథునికే గాక రాక్షసులకూ పోయే కాల మని) సమీపించింది కదా!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పాత్రుం డీతడు శ్రీ ధరుండు సుతుడై
    ప్రాప్తింప ; నౌ గాక.. తా
    పు త్రోత్సాహము పొంద నర్హు డగునే
    ము న్యుగ్ర శా పాహతిన్
    పుత్ర ప్రేమయె మృత్యు వం చెఱుగ, డే
    మో! పిచ్చియే గాని, యీ
    పు త్రోత్సాహ మ దానుషంగిక మగున్
    ముఖ్యంబు రక్షో వధల్..
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా
    పోగాలమే వచ్చినన్!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  43. ......సమస్య
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా
    పోఁ గాలమే వచ్చినన్!

    సందర్భము... చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిన తన కొడుకును గురించి ఒకానొక తండ్రి తన మిత్రునితో చెప్పుకొని ఇలా ఆవేదన పడుతున్నాడు.
    "నా కొడుకే!" "నా కొడుకే!" అంటూ యిన్నాళ్ళూ నాకినాను. ( ఎంతో గారాబం చేసినాను).
    కాని వా డేమో "దొంగ నా కొడుకు.." దొంగ తనాలకు మరిగాడు. ఇంట్లో పత్రం (డాక్యుమెంట్) ఒక్కటీ దొరికి చావడం లేదు. (ఏం చేశాడో! ఎక్కడ అమ్ముకున్నాడో!)
    జైలు కూడు గుడువడానికే వీడు పాత్రుడు(తగిన వాడు). ఇక అంతే!
    నాది "చెడ్డ కొడుకు పుట్టిన ఉత్సాహం" అనాలి. అది పొంగి పొర్లుతున్నది. వాడి కేమో జైలుకు పోయే కాలం దగ్గర పడుతున్నది."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పత్రం బొక్కటి లేదు; "నా కొడుకె! నా
    బంగారు బొమ్మే! " మ రీ
    చిత్రంబున్ గనలేక "నా కొడుకె!
    నా చిన్నారి బాలుండె!" యం
    చాత్రం బొప్పగ "దొంగ నా కొడుకునే"
    యిన్నాళ్ళుగా నాకితిన్..
    పాత్రుం డీతడు జైలు కూడు గుడువన్..
    పాపుండ, నా కుండు దుష్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా
    పోఁ గాలమే వచ్చినన్!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  44. లోకం పోకడ:

    మిత్రంబౌ గద తల్లి కెప్డు సుతయే మిర్యమ్ము కోడల్ గదా
    శత్రుండౌ తనయుండు ప్రేమనిడగా సౌభాగ్య ప్రాణేశకున్
    చిత్రంబీ మతమున్ గనంగ చితులన్ చేకూర్చు సంవిత్తునన్
    పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

    రిప్లయితొలగించండి