బమ్మెర పోతన పుట్టిన వరంగల్లు జిల్లాలో పుట్టిన ఆణిముత్యం – పూజ్యులు, పెద్దలు, నిగర్వి, శాంతమూర్తి, అజాత శత్రులు, కథా రచయిత, పద్యకవి, పండితులు, గేయ రచయిత, గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు విశ్రాంత తెలుగు పండితులు. వీరి సాయి భక్తి గీతాలకు స్వర్గీయ చక్రి గారు స్వరకల్పన చేశారు. తెలుగు భాషాసేవలో అంతర్జాతీయంగా పాటు పడుతున్న వీరు ఈమధ్య ముగిసిన అంతర్జాతీయ తెలుగు మహాసభలలో తగిన గుర్తింపు పొందక పోవటం శోచనీయం. వారు తమ కృషిని గురించి చెప్పటానికి కూడా మొగమాట పడతారు.
26, జులై 2008, శనివారం నాడు శంకరాభరణం వెబ్ సైటును మొదలు పెట్టారు. 9 సంవత్సరాల నుండి నిరాటంకంగా ఈ సైటు నిర్వహించ బడుతున్నది. వామనావతారంతో జనించిన ఈ వెబ్ సైటు నేడు విశ్వవ్యాప్తమై వందల మంది కవులను తాయారు జేసింది. ఇప్పటి వరకు ఈ సైటు వీక్షణల సంఖ్య 17 లక్షలు దాటింది. నూజువీడు నుండి న్యుజెర్సి వరకు ఈ వెబ్ సైటు లో పద్యాలూ వ్రాసే కవులున్నారు. వీరు వెబ్ సైటులో / వాట్సప్ గ్రూపులో సమస్యా పూరణలు, దత్తపదులు, న్యస్తాక్షరి నేర్పుతుంటారు. 'పద్యరచన' శీర్షికతో చిత్రాలకు, ఇచ్చిన అంశాలకు పద్యాలు వ్రాయటం వంటి ప్రక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బడిలో నవ యువకుల నుండి 75 సం.లు నిండిన వారుకుడా పద్యములను వ్రాస్తూంటారు. నేడు ఉభయ రాష్ట్రాలలో శంకరాభరణం కవి లేని పండిత సభ జరుగదంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రతి శనివారం ప్రసారమౌతున్న సమస్యా పూరణలలో 80% శంకరాభరణం కవులనుంచే వస్తున్నాయి. అంతర్జాలంలో ఉన్న ప్రతిసైటులో ఈ కవులే పద్యములను వ్రాస్తుంటారు. షష్టి పూర్తి తరువాత ఈ సైటు లో చేరి పద్యాలను నేర్చుకున్న వారు చాలామంది ఉన్నారు. యువకులు అష్టావధానులుగా తయారవ్వటానికి కూడా ఈ సైటు ఉపయోగపడుతుంది. మీ విలేఖరిని పంపితే నేను చెప్పింది చాల తక్కువ అని అర్థమౌతుంది.
ఇప్పటి వరకు ఈ సైటులో పూరించిన సమస్యలు: 2587, పద్యరచన : 1237, దత్తపదులు: 134, న్యస్తాక్షరి : 53. ఇది నిజంగా తెలుగు భాషకు, జాతికి శంకరాభరణమే.
రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, హైదరాబాదు, గద్వాల, మిర్యాలగూడ, సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాదు నగరాలలోని సాహితీ సంస్థలు వీరి కృషిని గుర్తించి సన్మానించాయి. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగు భాషాభివృద్ధికై సదా పాటు పడే తెలుగు వెలుగు ఈ రత్నాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఈ జాతి రత్నాన్ని భవిష్యత్తులో జరపబోయే తెలుగు సభలలో సత్కరిస్తే అ మహానుభావునికి తగిన గుర్తింపు కలుగుతుంది.
దారుణ మయ్యె నక్కట ప్రధాన పరిశ్రమ కారణమ్మునన్ భారత మందు నొక్క తరి భ్రాజిత సుందర పట్టణమ్మునన్ ఘోర మహా రసాయనము క్రూరముగం బ్రసరించ వేగ ని శ్శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై
16-2-18 ...........సమస్య శారదయే బలి గొనెఁ గద జను లెందరినో..
సందర్భము... *"శారద"* అంటే చదువుల తల్లి. నేటి చదువుల తల్లియేనా.. కాదు కాదు. అభం శుభం తెలియని విద్యార్థు లెందరో అనుదినం ఆత్మ హత్యలకు పాల్పడుతుంటే ఆమె పేరు మార్చుకున్నదేమో అని సందేహం. ఇప్పు డామెను *"భారత బలవ న్మరణ విశారద"* (భారత దేశంలో ఆత్మ హత్యలందు నేర్పరి) అనవచ్చు.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "శారద"కు పేరు మారెను..
ఘోరములగు చదువు లెల్ల కొంపలు ముంచెన్..
"భారత బలవ న్మరణ వి
శారద" యే బలిగొనె గద జను లెందరినో!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
...........సమస్య శారదయే బలిం గొనెను సర్వుల వీత ద యాంతరంగయై
సందర్భము..."శారద" అంటే చదువుల తల్లి. అభం శుభం తెలియని విద్యార్థు లెందరో అనుదినం ఆత్మ హత్యలకు పాల్పడుతుంటే ఇవి యెంత ఘోరమైన చదువులో అనిపిస్తాయి. కాని ఘోరత్వంగాని చెడ్డతనంగాని మన కోరికల్లోనే వుంది. మనం ఏ దడిగితే దైవం అదే ఇస్తుంది కదా! విలాస జీవితాల కలవాటుపడిన మన ఆశలలో సారం (శ్రేష్ఠత్వం) లేకపోవడమే ఇన్ని దురాగతాలకు హేతువు. కాని సరస్వతీ దేవి కాదే! కాబట్టి ఇలా అందురే! (అంటారా!) "శారదయే దయలేక బలి తీసుకుంటున్న" దని. అనరాదు సుమా! ~~~~~~~~~~~~~~~~ "శారద" యన్న "విద్యల వి శారద" యన్నది మేటి సత్య, మీ ఘోరపు విద్యలా యనుట కొంచెము చింతన చేయ నిక్క మీ తీరుగ నాత్మ హత్యలను తెచ్చున దీ మన కోరికల్ సుమా! కోరిక చెడ్డదైనపుడు కోవెల దైవము దానినే యిడున్..! శారద కాదె!.. యాశలు న సారము లౌటయె హేతు; వందురే! "శారదయే బలిం గొనెను సర్వుల వీత దయాంతరంగయై"
గురువర్యుల శ్రీ కంది శంకరయ్య గారి సమక్షంలో పూర్తిచేసిన దత్తపది ఇచ్చిన పదాలు :: వరంగల్లు, వెంకటగిరి, అల్లూరు, విడవలూరు. విషయం :: విడవలూరు డిగ్రీ కళాశాలలో అందరికీ ఆశీస్సులు
ఆ వరంగల్లు గిరి గార లాదరింప, అతిథి వెంకటగిరి కృష్ణు డలరుచుండె, ఘనత నల్లూరు రాజశేఖరుడు చేరె, గురువరేణ్యులు కంది శంకరులు నుండ, విడవలూరు సభాస్థలి వెలిగె నేడు. కోట రాజశేఖర్ నెల్లూరు. (16-2-2018)
రిప్లయితొలగించండివారిజ నేత్రా ! హేతువు
శారదయే !బలిగొనెఁ గద జను లెందరినో
తా రొద రొదపద్యములన్
మారామారీగ జేసి మహిని జిలేబీ !
జిలేబి
రిప్లయితొలగించండిపారవలెన్ సదా హృదిని భాగ్యము గా వెలుగై కళల్ యనన్
మారిన కాల మందు సయి మానస మున్ నులి వెట్టి ద్రోయుచున్,
శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై,
చేరుచు పద్య రూపముగ, చేర్చుచు నందరి నొక్క సీమనన్ !
జిలేబి
నేరుపుచు ప్రకృతి శక్తుల
రిప్లయితొలగించండిసారాంశము నంతయున్ను స్వార్థము కొఱకై
పోరులకు దోహదమ్మిడు
శారదయే బలిగొనెఁ గద జను లెందరినో!
జోరుగ బంటల నొసగుచు
రిప్లయితొలగించండిభారతిపేరున బరగెడి భవ్యపునదియే
వారధి ధ్వంసము కాగా
శారదయే బలిగొనెగద జనులెందరినో .
శ్రీరఘువీరుడు కృపతో
రిప్లయితొలగించండిమారీచు విడువగ ప్రాణమాత్రమె కనగన్
పోరున కోదండశర వి
శారదయే బలిగొనెఁ గద జనులెందరినో
రావణాదిరాక్షసులను చంపటానికై ముందుగా (యాగ రక్షణ సమయమందు) మారీచుని చంపకుండా ఒక ఎరగా వదిలివేశాడు రామచంద్రుడు. అనుకున్నట్లే ఆ దైత్యమత్తేభం మారీచుణ్ణి పంపి ఉచ్చులో చిక్కుకుంది. ఇకమిగిలిందంతా దానవదమనమే.. ఆలోచిస్తే ఇదంతా ఒక వ్యూహంలా అనిపిస్తుంది..
తొలగించండిఘోరాంగుడు కంబమునన్
తొలగించండివైరిశమనుడై వెడలెను ; పండితులుగాదె?
వీరేల విద్యనేర్చ? కు
శారదయే బలిగొనెఁ గద జనులెందరినో
ఈ రాక్షసులందరూ వరాలు కోరేటప్పుడు అవిద్యకు లోనై సరిగా వరాలు పొందని కారణంగానే శ్రీహరి చేతిలో మరణించారు..
తొలగించండి(సరదాగా సింహావలోకనం)
తొలగించండిదారమె మందారముగను
దారమె కేదారముగను,దారము తాఁ వే
దారమె! ప్రాసకు పాట్లివి
శారదయే బలిగొనెఁ గద జనులెందరినో!!
శారద జన హితురాలై
రిప్లయితొలగించండివారిజ నేత్ర గ నొసగదె వలసిన విద్య
ల్లా రయగా నే తెర గు న
శారద బలి గొనె గద జనులె oదరి నో ?
భీరువులగు విద్యార్ధులు
రిప్లయితొలగించండినీరస నైజమును నేర్చి నిష్క్రియులగుచున్
బీరములాడుచునందురు
"శారదయే బలిగొనె గద జనులెందరినో."
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినేరిచి చేసినట్టి హరినింద ఫలింపక యున్నె ! యద్దియే
కారణమయ్యెడిన్ కనకకశ్యపుడున్ శిశుపాలుడున్ మహా...
ఘోరముగా వధింపబడ., కోమలి కోపన యయ్యె ! దుష్టవా...
క్చారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
"కనకకశ్యపుడు"! అద్భుతమైన పదప్రయోగం సార్...
తొలగించండిత్యాగరాజస్వామి వారు యెందరో మహానుభావులు కీర్తనలో
తొలగించండి“ పరమ భాగవత మౌని “ అనే చరణంలో
“కనక కశిపుసుత నారద తుంబురు” అని పేర్కొన్నారు!🙏🙏🙏🙏
మురళీకృష్ణగారూ! మీ పూరణ అద్భుతంగా ఉంది! అభినందనలు!🙏🙏🙏🙏
తొలగించండిపద్యమునిచ్చిన వారి జ్ఞానానికీ.
తొలగించండిరిఫరెన్సు ఇచ్చిన మీ జ్ఞప్తికీ,
🙏🙏🙏
వెదికిన దొరికెను-మేలిమి సంగము
ఈ జన్మకు ఇది భళియన్నా---
భారము బాపన బ్రతుకులు;
రిప్లయితొలగించండినేరక వేదము చదివిరి; నేటి దినమునన్
వరునకు వధువది దొరకదు
శారదయే బలిగొనెఁ గద జను లెందరినో!
శ్రీనాథ్ గారు ! పూరణ చక్కగా నున్నది. అయితే. మూడవ పాదం 'లఘువు'తో మొదలయింది."వారికి వధువులు దొరుకరు" అనంటే యెలా ఉంటుందంటారు?
తొలగించండిపారా వారము లన్నియు
రిప్లయితొలగించండివారధి లేకుండ పొంగి భయ విహ్వలులౌ
సారము దెలియని జాలము
శారదయే బలిగొనెఁ గద జను లెందరినో
ఏరులు,వాగులు పొంగెను
రిప్లయితొలగించండిచేరగనే వరద నీరు శీఘ్రము తోడన్,
కౄరము! ఘోరమకట!నది
"శారదయే బలిగొనెఁ గద జను లెందరినో"
క్రూరమగు శిక్షణలతో
రిప్లయితొలగించండిగారాబు యువత మునుంగ గహనపు పోటీ
కోరగ యమసదనమ్మే
శారదయే బలిగొనెగద జనులెందరినో!
మునింగి గా చదువ ప్రార్ధన!
తొలగించండి
రిప్లయితొలగించండికందివరుల సెలవు దినము
మందకొడిగ నుండె గా సమస్యా సభయున్!
కొందరయిన పండితులిట
నందుకొనదగు పరిశీలన విదురులారా !
జిలేబి
జారులు చోరులన్ గలసి శారద చెంతను *వర్సిటీలలో*
రిప్లయితొలగించండివారిజ నేత్రులందు కడు పాశవికమ్ముగ చేయదాడులన్
ఘోరము జూడలేక వడి గొడ్డలి చేతను బట్టి *కాళియై*
శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
*తీరని వేదనలు మిగుల*
రిప్లయితొలగించండి*దారుణమగురీతిన రహదారులయందున్*
*వారుణి ధరనప్రమాదవి*
*శారదయేబలిగొనెగద జనులెందరినో*
*తీరని వేదనలు మిగుల*
రిప్లయితొలగించండి*దారుణమగురీతిన రహదారులయందున్*
*వారుణి ధరనప్రమాదవి*
*శారదయేబలిగొనెగద జనులెందరినో*
భూరిగ చదువుల నిచ్చును
రిప్లయితొలగించండిశారదయే,బలిఁగొనెఁగద జనులెందరినో
కూరుకపోయిన,మూఢుల
పారముగా నమ్ము మొండి పాపపు పనులున్
1.
రిప్లయితొలగించండినేరిపి డైనమైటులను నేరిపి రాకెటు శక్తియుక్తులన్
నేరిపి బాంబులన్నణువు నేరిపి జంగలు వారుఫేరులన్
నేరిపి యాకతాయతను నేర్పక దైవిక భక్తిశ్రద్ధలన్
"శారద"యేబలింగొనెను సర్వులవీత దయాంత రంగయై...
...ఇచ్చట శారద = భౌతిక రసాయనిక బయలాజిక "శాస్త్రులు"
******************************
2.
నేరిపి కందపద్యములు నేరిపి చంపక యుత్పలమ్ములన్
నేరిపి సీసపద్యములు నేరిపి శార్దుల మత్తెభమ్ములన్
నేరిపి తేటగీతులను నేర్పక సంధిసమాససూత్రముల్
"శారద"యే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై...
...(నాకు) ఇచ్చట శారద = శ్రీయుతులు కంది శంకరయ్య గారలు
ఆరయ చదువుల తల్లియ
రిప్లయితొలగించండిశారదయే,బలిగొనెగదజనులెందరినో
వరదల మూలంబునవిను
శారద యుప్పొంగి మిగుల సరగున ముంచిన్
శంకరాభరణం
రిప్లయితొలగించండిబమ్మెర పోతన పుట్టిన వరంగల్లు జిల్లాలో పుట్టిన ఆణిముత్యం – పూజ్యులు, పెద్దలు, నిగర్వి, శాంతమూర్తి, అజాత శత్రులు, కథా రచయిత, పద్యకవి, పండితులు, గేయ రచయిత, గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు విశ్రాంత తెలుగు పండితులు. వీరి సాయి భక్తి గీతాలకు స్వర్గీయ చక్రి గారు స్వరకల్పన చేశారు. తెలుగు భాషాసేవలో అంతర్జాతీయంగా పాటు పడుతున్న వీరు ఈమధ్య ముగిసిన అంతర్జాతీయ తెలుగు మహాసభలలో తగిన గుర్తింపు పొందక పోవటం శోచనీయం. వారు తమ కృషిని గురించి చెప్పటానికి కూడా మొగమాట పడతారు.
26, జులై 2008, శనివారం నాడు శంకరాభరణం వెబ్ సైటును మొదలు పెట్టారు. 9 సంవత్సరాల నుండి నిరాటంకంగా ఈ సైటు నిర్వహించ బడుతున్నది. వామనావతారంతో జనించిన ఈ వెబ్ సైటు నేడు విశ్వవ్యాప్తమై వందల మంది కవులను తాయారు జేసింది. ఇప్పటి వరకు ఈ సైటు వీక్షణల సంఖ్య 17 లక్షలు దాటింది. నూజువీడు నుండి న్యుజెర్సి వరకు ఈ వెబ్ సైటు లో పద్యాలూ వ్రాసే కవులున్నారు. వీరు వెబ్ సైటులో / వాట్సప్ గ్రూపులో సమస్యా పూరణలు, దత్తపదులు, న్యస్తాక్షరి నేర్పుతుంటారు. 'పద్యరచన' శీర్షికతో చిత్రాలకు, ఇచ్చిన అంశాలకు పద్యాలు వ్రాయటం వంటి ప్రక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బడిలో నవ యువకుల నుండి 75 సం.లు నిండిన వారుకుడా పద్యములను వ్రాస్తూంటారు. నేడు ఉభయ రాష్ట్రాలలో శంకరాభరణం కవి లేని పండిత సభ జరుగదంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రతి శనివారం ప్రసారమౌతున్న సమస్యా పూరణలలో 80% శంకరాభరణం కవులనుంచే వస్తున్నాయి. అంతర్జాలంలో ఉన్న ప్రతిసైటులో ఈ కవులే పద్యములను వ్రాస్తుంటారు. షష్టి పూర్తి తరువాత ఈ సైటు లో చేరి పద్యాలను నేర్చుకున్న వారు చాలామంది ఉన్నారు. యువకులు అష్టావధానులుగా తయారవ్వటానికి కూడా ఈ సైటు ఉపయోగపడుతుంది. మీ విలేఖరిని పంపితే నేను చెప్పింది చాల తక్కువ అని అర్థమౌతుంది.
ఇప్పటి వరకు ఈ సైటులో పూరించిన సమస్యలు: 2587, పద్యరచన : 1237, దత్తపదులు: 134, న్యస్తాక్షరి : 53. ఇది నిజంగా తెలుగు భాషకు, జాతికి శంకరాభరణమే.
రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, హైదరాబాదు, గద్వాల, మిర్యాలగూడ, సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాదు నగరాలలోని సాహితీ సంస్థలు వీరి కృషిని గుర్తించి సన్మానించాయి. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగు భాషాభివృద్ధికై సదా పాటు పడే తెలుగు వెలుగు ఈ రత్నాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఈ జాతి రత్నాన్ని భవిష్యత్తులో జరపబోయే తెలుగు సభలలో సత్కరిస్తే అ మహానుభావునికి తగిన గుర్తింపు కలుగుతుంది.
“శంకరాభరణం”
చక్కని వ్యాసమండీ! వాస్తవాలనెన్నింటినో ప్రజల ముందుంచారు! తెలుగువెలుగు వారు మీ వ్వాసాన్ని తప్పక ప్రచురిస్తారని భావిస్తున్నాను! 🙏🙏🙏🙏
తొలగించండిAsn reddy గారు! గౌ.శంకరార్యులను గురించి చాలా చాలా చక్కగా వివరించారు.అందుకొనండి అభినందనలు !🌹🙏👍🌹
తొలగించండిచాలా బాగా రాశారండీ.
తొలగించండి💐🙏🏻
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండికూరిచి సరహద్దులలో
ఘోరకలిని దా నశాంతి గుప్పిట నుంచన్
నేరుప నుగ్రశిబిర వా
క్చారదయే బలిగొనెఁ గద జను లెందరినో
సహదేవుఁడు గారు “వాక్ఛారద” ముద్రణ దోష మని తలఁచెదను.
తొలగించండిధనధన్యవాదము సర్. వాక్+శారద = వాక్చారద
తొలగించండితప్పంటారా? సముచితమేదో సూచించ ప్రార్థన
సహదేవుఁడు గారు వాక్ + శారద = వాక్ఛారద; (వత్తు ఛ) సాధువు.
తొలగించండిధధన్యవాదములు సర్ సవరించిన పూరణ:
తొలగించండికందం
కూరిచి సరహద్దులలో
ఘోరకలిని దా నశాంతి గుప్పిట నుంచన్
నేరుప నుగ్రశిబిర వా
క్ఛారదయే బలిగొనెఁ గద జను లెందరినో
వాక్శారదయేనా !
తొలగించండిజోరుగ వానలు గురియగ
రిప్లయితొలగించండితీరపు ప్రాంతాల వారి తిప్పలు గనరే
యేరులు పొంగగ నదమౌ
శారద యే బలిగొనెగద జనులెందరినో..!!!
శారదనామకంబిలనుసాగరమొక్కటియుండనత్తరిన్
రిప్లయితొలగించండిబారగవేగమైవరద పాకలుమొక్కలు చెట్లతోసహా
శారదయేబలింగొనెనుసర్వులవీతదయాంతరంగయై
యేరదియీయదయ్యదనుదేనినినైననుముంచునేగదా
ఘోర వికృతాస్య తాటక
రిప్లయితొలగించండిసారంగ సహస్ర సదృశ సత్త్వ వన జనా
పార పరితాప కపట వి
శారదయే బలిగొనెఁ గద జను లెందరినో
దారుణ మయ్యె నక్కట ప్రధాన పరిశ్రమ కారణమ్మునన్
భారత మందు నొక్క తరి భ్రాజిత సుందర పట్టణమ్మునన్
ఘోర మహా రసాయనము క్రూరముగం బ్రసరించ వేగ ని
శ్శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై
[నిః+శార+ద= నిశ్శారద =గాలినివ్వనిది; శారము =వాయువు (ప్రాణ వాయువు)]
సార్, మీరు ప్రస్తావించింది భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించా??
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండిమహత్తర మైన సాహిత్య శక్తి ! నమో నమః = పోచిరాజ .గురువర్యా !
గురు మూర్తి ఆచారి గారు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఅవునండి ప్రసాద్ గారు.
అద్భుతమైన వృత్తపూరణార్యా! నమస్సులు!🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిడా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు. మీరు మెచ్చుకున్నది నా వృత్త రచన గుఱించి యనియే తలఁచెదను.
తొలగించండిఆర్యా!
తొలగించండిమీ ఉత్పలమాల అద్భుతంగా ఉందండీ. నిశ్శారద ప్రయోగం చాలా బావుంది.
🙏🏻🙏🏻
ధన్యవాదములండి రావు గారు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
" భారతి కొల్వు దీరినది బాసర సీమ " నటంచు భక్తి (న్) వి
ద్యారతు లెల్ల రా జనని దర్శన - భాగ్యము బొంద నెంచుచున్ ,
వారొక వాహనాన బయనం బగు చేగ , ఘటిల్లె నింతలో
దారణ మైన దుర్ఘటన | తల్లడిలెన్ జన మప్పు డీ గతిన్ ,
* " శారద యే బలిం గొనెను సర్వుల వీత దయాంతరంగయై " *
దూరి ప్రయోగశాల నొక దుష్టుల బృందము శాస్త్రవేత్తలై
రిప్లయితొలగించండిమారణ హోమమున్ సలుపు మార్మిక యాయుధ మేర్చి కూర్చగన్
దారుణ మాపనెంచి యట తప్పులు దొర్లగ జేసి ప్రేల్చుచున్
శారదయే బలింగొనెను సర్వుల వీత దయాంతరంగయై
భారములాయెను జదువులు
రిప్లయితొలగించండినేరములే పెరుగసాగె నెమ్మదిలేకన్
దారుణ మేగద బోధల
శారదయే బలి గొనె గదజనులెందరినో!
పురుషోత్తమరావు,రావెల.
------------------------------
నేరిచిన విద్య తోడ,త
రిప్లయితొలగించండియారొన రించుచు మార ణాయుధములనే
దారుణ రీతిని వాడి,వి
"శారదయే బలిగొనెఁ గద జను లెందరినో"
(విశారద = పండితుడు ; శాస్త్రజ్ఞుడు)
శారద విప్పెను మెలికను
రిప్లయితొలగించండిసారములేలేని జదువు సంధ్యలదేలా?
మీరిన హద్దులు మ్రింగు నా
శారదయే బలిగొనెగద జనులందరినిన్..
----------------------
కౄరముగాదె పాఠ్యములకుంఠిత దీక్షతొ నేర్వబంప, నా
రిప్లయితొలగించండిశారదయే బలింగొనెను సర్వులవీత దయాంతరంగయై
నేరములెట్లు జేసెదరొ,, నేర్పుగకాల్చుటదేమి, ఖర్మమో!
భారముగాదె!! తండ్రులకు, బాధలకోర్చుట మాతృమూర్తికిన్!!
---------------------------------------------
ఏరీతిన చెప్పదగును
రిప్లయితొలగించండి"శారదయే బలిగొనెఁ గద జను లెందరినో"
నారద నీరదు లాదిగ
సారస్వత జ్ఞానదీప్తి ఛాయనె మెరిసెన్!
రిప్లయితొలగించండిసారమును దెలుపును చదువుల
శారదయే, బలిగొనెగద జనులెందరినో
సారము విడి దుర్బుద్ధిన
ధారుణి యందు వికటించ తరుణుల నెల్లన్.
క్రూ not as stated!
రిప్లయితొలగించండి=================
శారదనుడివెను మెలకువ
సారములేలేని విద్య చవటల కొరకే!
మీరిన హద్దుల దెలుప, నా
శారదయే బలిగొనె గద, జనులందరినిన్!
------
కాంతలందరు ,కొంతగా భ్రాంతిజెంద!
రిప్లయితొలగించండివిపణివీధిన నుద్యోగ విభవమొచ్చె!!
ఎంతజెప్పిన మగవారి వింత బుద్ధి
ఎంతయోయనుకొంటి మీరింతెయంద్రు!!
------------------------------------------
రావెల పురుషోత్తమరావు[అమెరికా సం.రా]
16-2-18
రిప్లయితొలగించండి...........సమస్య
శారదయే బలి గొనెఁ గద జను లెందరినో..
సందర్భము... *"శారద"* అంటే చదువుల తల్లి. నేటి చదువుల తల్లియేనా.. కాదు కాదు. అభం శుభం తెలియని విద్యార్థు లెందరో అనుదినం ఆత్మ హత్యలకు పాల్పడుతుంటే ఆమె పేరు మార్చుకున్నదేమో అని సందేహం.
ఇప్పు డామెను
*"భారత బలవ న్మరణ విశారద"*
(భారత దేశంలో ఆత్మ హత్యలందు నేర్పరి) అనవచ్చు..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"శారద"కు పేరు మారెను..
ఘోరములగు చదువు లెల్ల
కొంపలు ముంచెన్..
"భారత బలవ న్మరణ వి
శారద" యే బలిగొనె గద
జను లెందరినో!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
...........సమస్య
శారదయే బలిం గొనెను సర్వుల
వీత ద యాంతరంగయై
సందర్భము..."శారద" అంటే చదువుల తల్లి. అభం శుభం తెలియని విద్యార్థు లెందరో అనుదినం ఆత్మ హత్యలకు పాల్పడుతుంటే ఇవి యెంత ఘోరమైన చదువులో అనిపిస్తాయి. కాని ఘోరత్వంగాని చెడ్డతనంగాని మన కోరికల్లోనే వుంది. మనం ఏ దడిగితే దైవం అదే ఇస్తుంది కదా!
విలాస జీవితాల కలవాటుపడిన మన ఆశలలో సారం (శ్రేష్ఠత్వం) లేకపోవడమే ఇన్ని దురాగతాలకు హేతువు. కాని సరస్వతీ దేవి కాదే!
కాబట్టి ఇలా అందురే! (అంటారా!) "శారదయే దయలేక బలి తీసుకుంటున్న" దని. అనరాదు సుమా!
~~~~~~~~~~~~~~~~
"శారద" యన్న "విద్యల వి
శారద" యన్నది మేటి సత్య, మీ
ఘోరపు విద్యలా యనుట
కొంచెము చింతన చేయ నిక్క మీ
తీరుగ నాత్మ హత్యలను
తెచ్చున దీ మన కోరికల్ సుమా!
కోరిక చెడ్డదైనపుడు
కోవెల దైవము దానినే యిడున్..!
శారద కాదె!.. యాశలు న
సారము లౌటయె హేతు; వందురే!
"శారదయే బలిం గొనెను
సర్వుల వీత దయాంతరంగయై"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
గురువర్యుల శ్రీ కంది శంకరయ్య గారి సమక్షంలో పూర్తిచేసిన దత్తపది
రిప్లయితొలగించండిఇచ్చిన పదాలు :: వరంగల్లు, వెంకటగిరి, అల్లూరు, విడవలూరు.
విషయం :: విడవలూరు డిగ్రీ కళాశాలలో అందరికీ ఆశీస్సులు
ఆ వరంగల్లు గిరి గార లాదరింప,
అతిథి వెంకటగిరి కృష్ణు డలరుచుండె,
ఘనత నల్లూరు రాజశేఖరుడు చేరె,
గురువరేణ్యులు కంది శంకరులు నుండ,
విడవలూరు సభాస్థలి వెలిగె నేడు.
కోట రాజశేఖర్ నెల్లూరు. (16-2-2018)
కోరిన విద్యలన్నిటిని కోరిక తీరగ నేర్పుచుండు మా
రిప్లయితొలగించండిశారదయే;...బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై
వీరుల మంచు త్రుళ్ళిపడు భీరులు వంగల కమ్యునిష్టులన్
చీరలు దాల్చి సింపులువి చిన్గిన చెప్పుల తోడ మమ్తయే!