(శ్రీకృష్ణనింద చేసిన సత్రాజిత్తు తరువాత సత్యం తెలిసి ప్రశంసించాడు) "పొందగు నా సహోదరుడు ముద్దుప్రసేనుని సంహరింతువా? కుందనమిచ్చు నా మణిని కుత్సితబుద్దిన దస్కరింతువా? చందములింక జెల్ల"వని చక్రిని బల్కిన సత్యతండ్రియే నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2609 సమస్య :: *నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.* మొదట నిందలు మోపి ఆ తరువాత (ప్రేమతో మేలుకోరుతూ) మెచ్చుకొనడం జరిగింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: అందరి ఇళ్లల్లో పాలు పెరుగు వెన్న మొదలైనవాటిని దొంగిలించి తింటూ ఉన్నాడని వినిన యశోదమ్మ చిన్ని కృష్ణుని నిందించి , వెంటనే బిడ్డ మేలు కోరి ప్రేమతో కన్నయ్యా ముందు మన ఇంటిలో తినవయ్యా ! ఇదంతా నీ లీల. నీ ప్రసాదము. నైవేద్యము స్వీకరించి ఇలా నీవు అందరినీ అనుగ్రహిస్తున్నావు అని మెచ్చుకొనే సందర్భం.
అందఱు నిన్ను దొంగ యని యందురు , సత్యమె ? వెన్నదొంగ ! నీ వందఱి యిండ్లలో పెరుగు పాలు భుజింప భవత్ప్రసాదమౌ, ముందు భుజింపు మింట , యని ముద్దుగ బల్కె యశోద , కృష్ణుపై *నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-2-2018)
ఉమాదేవి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో రెండవ పాదం చివర 'కన్నడనాట'? మూడవ పాదంలో యతి తప్పింది. రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
డా.పిట్టా "ఎందు గానము దైవాన్ని"దేమిటన్న God is nowhere" "నిందు నిప్పుడె గలడన్న" నీతి వెలయ "God is now here" విరిచి చదువ నరేంద్రుని విశ్వ సభయె నిందెలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె!
సందర్భము... బాల కృష్ణుడు మన్ను తిన్నాడు చూడమ్మా! అని యశోదమ్మకు ఫిర్యాదు చేశాడు అన్న యైన బలరాముడు. ఆమె కన్నయ్య నోరు తెరిపించి చూచింది. భువన భాండా లన్నీ నోటిలో దర్శన మిచ్చా యట! బలరాముడు నింద వేసినాడు గాని కన్నయ్య నోటిలో బ్రహ్మాండం చిందులు వేసింది. అదొక లీల. బలరాముడు నింద వేయడంలోనే లోకానికి మేలు కోరడం వుంది. కృష్ణ లీలను మెచ్చుకోవడమూ వుండనే వుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "మన్నుఁ దిన్నాడు చూడమ్మ వెన్న దొంగ నే!" డటంచు కన్నయ్యపై నింద వేసె నన్న... తెరిపించె నా యశోదమ్మ; చూచె చిన్ని నోట బ్రహ్మాండంబు చిందు వేసె!! నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
2 వ పూరణము:-
సందర్భము... బాల కృష్ణుడు మన్ను తిన్నా డన్నాడు అన్న బలరాముడు. యశోదమ్మ "మన్నో మిన్నో చూపించరా!" అన్నది. కన్నయ్య నోరు విప్పగా మన్ను మిన్ను లెన్నో కనిపించినవి. అదొక లీల. బలరాముడు నిందించడంలోనే లోకానికి మేలు కోరడం వుంది. కృష్ణ లీలను మెచ్చుకోవడమూ వుండనే వుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అన్న నిందించె కృష్ణుని... యమ్మ పిలిచి "తిన్న దేదొ చూపింపరా మన్నొ మిన్నొ!" యన్న బాలుండు నో ర్విప్పె; మన్ను మిన్ను లెన్నొ కనిపించె; జగతి మే లన్న కోరె; నిందలన్ మోపి మే ల్గోరి నెమ్మి మెచ్చె
3 వ పూరణము:-
సందర్భము... ఒకానొక ధూర్తురాలు తన కూతురు అత్తగారిమీద రకరకాల నిందలు వేస్తూ సాధించడం కొనసాగించి దైవబలం చాలక కాళ్ళ బేరానికి వచ్చి తన వియ్యపురాలితో అన్న మాటలు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ధూర్తురాలు... వియ్యపురాలితోడఁ బలికె..
రిప్లయితొలగించండిఇచ్చెదమనిన పాకేజి నివ్వ కున్న
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
చంద్రుడయ్య రాష్ట్రమునట చక్క దనము
వెలయ నాయకుడతడేను వేల్పు గాను !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వందల తప్పులన్ మరచి సంధి జేయ
రిప్లయితొలగించండిభాయి భాయియని చేయి చేయి గలిపి
విందు వినోదము లనుచు మందు గొట్టి
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పై మూడు పాదాలలోను గణదోషం. "వంద తప్పులన్ మరచియు సంధి... భాయి యనుచు...విందులు వినోదము లనుచు..." అనండి.
వంద తప్పులన్ మరచియు సంధి జేయ
తొలగించండిభాయి భాయియ నుచుచేయి చేయి గలిపి
విందులు వినోదము లనుచు మందు గొట్టి
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
అన్న బలరాముడాడుచు కన్ననిగని
రిప్లయితొలగించండివెన్న దొంగడీరోజున మన్ను తినెను
నిక్కమిది నోరు తెరిపించు నీవటంచు
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
వెలుదండ వారి సవరణ:
తొలగించండి"వెన్న దొంగ యీ రోజున మన్ను తినెను"
🙏
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికుందకమెల్ల గాంచెనట కోరెను రాష్ట్రపు పెంపు నాతడే
చందురుడాతడౌ జనుల చక్కదనమ్మును కోరెనాతడే
దందడి జేయుచున్ గునిసి దాంతము లెల్లను జూపెనాతడే
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్!
జిలేబి
సాధనొక్కటె లక్ష్యమై సభలు పెట్టి
తొలగించండిదొంగలు వలస వచ్చిన ధూర్తులంచు
నాంధ్రులఁ దరుమ వలెనంచు నరచి నాడు
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక భక్తుని వ్యాజనింద....
రిప్లయితొలగించండి"స్త్రీ యనక తాటకం జంపె, మాయలేడి
గురు తెఱుంగక వెంటాడె, తరువు వెనుక
దాగి వాలినిఁ బరిమార్చె, ధర్మమె?" యని
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
👏👏👏🙏🙏🙏
తొలగించండిఔచిత్యవంతమైన అలంకారమండీ!
తొలగించండిప్రభాకర శాస్త్రి గారికి, బాపూజీ గారికి ధన్యవాదాలు!
తొలగించండి
రిప్లయితొలగించండితే.గీ.
రజకుడు నుడువ సీతను రాముడడవి
పంప ,కష్టాల కన్నీళ్ళ పయనమదియె!
సీత లేని శ్రీరాముడు చింత జేసె
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మన్ను తిన్నా వని యశోద మంద లించి
రిప్లయితొలగించండియతని య వ తార ములు గాంచి యాస్య మందు
నింద లను మోపి మేల్గో రి నె మ్మిమెచ్చే
భక్తి భావము పెంపొంద పరవశించె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(శ్రీకృష్ణనింద చేసిన సత్రాజిత్తు తరువాత సత్యం తెలిసి ప్రశంసించాడు)
రిప్లయితొలగించండి"పొందగు నా సహోదరుడు ముద్దుప్రసేనుని సంహరింతువా?
కుందనమిచ్చు నా మణిని కుత్సితబుద్దిన దస్కరింతువా?
చందములింక జెల్ల"వని చక్రిని బల్కిన సత్యతండ్రియే
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.
బాపూజీ గారూ,
తొలగించండిపూరణకు చక్కని ఐతిహ్యాన్ని ఎన్నుకున్నారు. బాగుంది. అభినందనలు.
'బుద్ధిని' అనండి.
"అందఱు గేలిసేయ వెలయాండ్ర గృహంబుల కేగు టేలొకో?
రిప్లయితొలగించండిసుందరి యైన నీ సతినిఁ జూడవు, జూదము లాడఁ బోదువే,
విందు వినోదముల్ గృహము వీడక యిచ్చటె పొందవచ్చులే
సందియ మేలరా నిగమశర్మ!" యటంచును వాని యక్క తా
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.
తేటగీతి(పంచపాది)
రిప్లయితొలగించండిగుడిని గట్టుచున్ నగలను గూడ బెట్ట
దశరధ జనకులదె సొమ్ము? తాత సొమ్మె?
కులుకు చున్నావు శ్రీరామ గుఱుతు రాదె?
యనుచు రామదాసు చెరలోఁ బ్రణుతి జేసి
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె!
సహదేవుడు గారూ,
తొలగించండి'ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు' అని నిలదీసిన రామదాసు ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిశ్రీనాథాయనమః:
రిప్లయితొలగించండికొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణజన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱంచునో
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
😊😊😊
మా సుపుత్రుని పేరు:
తొలగించండిశ్రీనివాస్ శ్రీనాథ్
😊😊😊
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశ్రీనాథుని చాటువును చక్కగా వినియోగించుకొన్నారు. అభినందనలు.
మీ అభినవ 'శ్రీశ్రీ'కి శుభాశీస్సులు!
ఒక మొద్దబ్బాయి పలవరింత
రిప్లయితొలగించండిదారుణంబుగ హింసించె తండ్రి నన్ను చదువలేదంచు పలుమార్లు వదలకుండ--
కాని నా భవితను తాను కాంచెనేమొ?
నిందలన్ మోపి మేల్కొని నెమ్మి మెచ్చె
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిమైలవరపు వారి విజృంభణ
రిప్లయితొలగించండిద్రౌపది...
ఇందరు భర్తలుండిరి సురేంద్రసుతాదులు నిష్ఫలమ్ము ! మీ
యందరి శక్తి శూన్యము ! సభాంతరమందున వల్వలూడ్వ నా
డెందము మండుచుండె గనుడీ! యని పౌరుషవహ్ని రేగగా
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి*అందమటన్న నీవె*! యని యందువు ! తెచ్చిన పారిజాతమున్
తొలగించండిముందుగ రుక్మిణీ సతికి ముద్దుగ నిచ్చిన వంచకుండ ! ఏ..
మందును నిన్నటంచభినయమ్మున కోపన యౌచు సత్యయున్
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
*ఇంటింటి రామాయణం*
తొలగించండిపొందిక నిద్రఁబోవు ! నను ముద్దుల దేల్చవు ! తెల్లవారు జా...
మందున శంకరాభరణమందు సమస్యను జూచి, పూరణన్
ముందుగ పంపనెంచి తలపోయుచునుందువు ! మన్మథాగ్నిచే
కందెను దేహమే ! యడవి గాచిన వెన్నెలవంటి యౌవనం..
బెందుకు ? పెండ్లి యెందులకు ? నేకముగా యతివై చరింపుమా...
నందము నీకు పద్యములె ! నా వ్యథ యెందులకిల్లు పీకియున్
పందిరి వేయుపిల్లలకు మాటికి మాటికి చెప్పలేక నే
నందెడి దుఃఖమున్ గనవటంచును గోముగ జేరి, తీర్చ ని...
బ్బందిని చేతినున్న చరవాణిని ప్రక్కకు ద్రోసి , దుప్పటిన్
ముందుకు లాగియున్ సరసమున్ గొను సత్కవి భార్య జూడగా
నిందలమోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలుగోరుచున్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
*విజృంభణము
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2609
సమస్య :: *నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.*
మొదట నిందలు మోపి ఆ తరువాత (ప్రేమతో మేలుకోరుతూ) మెచ్చుకొనడం జరిగింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అందరి ఇళ్లల్లో పాలు పెరుగు వెన్న మొదలైనవాటిని దొంగిలించి తింటూ ఉన్నాడని వినిన యశోదమ్మ చిన్ని కృష్ణుని నిందించి , వెంటనే బిడ్డ మేలు కోరి ప్రేమతో కన్నయ్యా ముందు మన ఇంటిలో తినవయ్యా ! ఇదంతా నీ లీల. నీ ప్రసాదము. నైవేద్యము స్వీకరించి ఇలా నీవు అందరినీ అనుగ్రహిస్తున్నావు అని మెచ్చుకొనే సందర్భం.
అందఱు నిన్ను దొంగ యని యందురు , సత్యమె ? వెన్నదొంగ ! నీ
వందఱి యిండ్లలో పెరుగు పాలు భుజింప భవత్ప్రసాదమౌ,
ముందు భుజింపు మింట , యని ముద్దుగ బల్కె యశోద , కృష్ణుపై
*నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (26-2-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఎవ్విధి ఖలుడు సుజనుల నేవగించు?;
రిప్లయితొలగించండినెందుకు గురువు శిష్యుల మందలించు?
యంబ దీక్షను గనినంత సాంబశివుడు;
నిందలన్ మోపి ; మేల్గోరి ; నెమ్మి మెచ్చె"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రద్ధ లేదింత క్రమశిక్షణాసక్తి లేదు
రిప్లయితొలగించండిగరువులకు సేవ యొనరించు సరణి లేదు
భడవ! నీకంచు జనకుండు పట్టియందు
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
గ్రంథపఠనాన సమయంబు గడుపుచుండు
వాని నాతని మిత్రుండు మానితముగ
నాడగా రావు నీవెట్టి వాడవనుచు
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "శ్రద్ధయును క్రమశిక్షణాసక్తి లేదు" అందామా?
నిందలు మోపి వ్యాజమున నేర్పు వహించగ వర్ణితమ్ములౌ
రిప్లయితొలగించండిసుందరమైన బ్రక్రియలు, జూరగొనున్ హృదయమ్ము, లట్లు చె
న్నొందగ గీర్తి, కాసుపురుశోత్తమసత్కవి, విష్ణుమూర్తిపై
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్.
రామాచార్య గారూ,
తొలగించండివ్యాజస్తుతి శతక కర్తను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నెపము మణిగాగ తమ్ముని నిధనమునకు
రిప్లయితొలగించండికృష్ణు నిందించె మిక్కిలి కినుకబూని
నిజము దెలిసినంతను సత్యనివ్వగాను
నిందలన్ మోపి మేల్కొని నెమ్మిమెచ్చె!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండిఏందిర పోరగా పెనిమిటిట్లనె చేస్తడ చెప్పవేందిరా
అందరి ముంగలేందిరిది వంకర బుద్ధులు మానవేందిరా
సందుల పందివైతివిర సంపకు మంచును తల్లి పల్కె నా
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలుగోరుచున్
చారి గారూ,
తొలగించండిపాత్రోచితమైన మాండలిక భాషతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఇల్లు వాకిలి లేకుండ వల్లకాడు
తన సదనమని దిరిగెడు త్రినయనుండు
పతియె నీకని సోముండు పాత్రి పైని
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాత్రి పైన' అనండి.
గాంధారి (గోగ్రహణము పిమ్మట):
రిప్లయితొలగించండిఇందరు వీరులుండగను నేమిది చిత్రము హానమాయెనే!
వందలు కౌరవుల్ మరియు వందలు వందలు శత్రుభీకరుల్
విందులు జేయుచుండిరిట భీష్ముడు ద్రోణుడు కర్ణుడంచునో
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంజము సురలు గొని మీకు గరళము నిడె.
రిప్లయితొలగించండిభరణములు హరికిని,మీకు భస్మమిడెను,
న్యాయ మేనా యిది యనుచు నగజ పతిని
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణం...26/02/18..సోమవారం
రిప్లయితొలగించండిసమస్య: నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
**** **** *** *** **
తే.గీ.
రుద్ర!నీవు భోళాశంకరుడవు కావ?
పిలిచినను పలుకుననెడి పేరు లేద?
కనికరము జూపవెందుకు గావు మనిన
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
తనను బ్రోవ తరలి వచ్చు దైవ మనుచు
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఇల్లు వాకిలి లేకుండ వల్లకాడు
తన సదనమని దిరిగెడు త్రినయనుండు
పతియె నీకని సోముడే పాత్రి పైని
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
ప్రతిదినమ్మును బూజింతుభక్తితోడ
రిప్లయితొలగించండినరటి పండ్లును బత్తాయి యన్నితెచ్చి
యార గింపును జేతును నయిన నన్ను
దయను జూడవు కారణ మయ్య! యేమి?
యాది పురుషుడ వైనట్టి యాదిదేవ!
యందుకొనుమయ్య నాయొక్క వందనములు
నింద లన్మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మెచ్చిన దెవరో చెప్పలేదు.
ఆరవ పాదాన్ని "వందనము లివె యని యొక భక్తవరుడు" అంటే అన్వయం కుదురుతుంది కదా!
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,
" అందరి కాశ్రయం బిడెడు నా ధరణీజము c గ్రోధివై పెక
ల్చం దగ | దాగు మయ్య వలలా ! | నిజమౌ బలశాలి వీవె యై
నం దునుమం బ్రయత్నము నొనర్చుము దుష్టుల " నంచు మందలిం
చెం దన సోదరున్ , విరటు చెంగట నుండిన కంకుభట్టు | తా
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్ |
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిసమర్థమైన పూరణ. అభినందనలు.
*మరక మంచిదే సర్ఫ్ఎక్సెల్ ఉందిగా*
రిప్లయితొలగించండిచిందులు వేసి చిల్పిగను చింపిరి జుట్టున మాపుబట్టలన్
చిందర వందరన్ గొడుకు చేరగ నింటికి తల్లిజూచి తా
ముందర మందలించి తన ముద్దుల పట్టని బిల్చి యిట్లనెన్
మందిమ! మంచిదే *మరక మంచిది సర్ఫను యెక్సెలుండగా!*
*నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్*
2. కుందన హారముల్ మరియు కోకలు రైకలు నివ్వలేద
నం
చందరి ముందరన్ బతిని యారడి బెట్టుచు దూరె నిట్లురా
పందివి కుక్కనక్కవని పైత్యము నీకొక చుట్టమంచు తా
చిందులు నోర్వలేక పతి, చీరల సారెల నివ్వ! రాత్రికిన్
పందిరి మంచమెక్కి సతి పాలను పూలను పంచె వేడుకన్
*నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
రాముఁ డన్న భృశము భక్తి రామ కీర్త
రిప్లయితొలగించండినలను దనరు నిరంతర మిల నతండు
కష్టములు ముప్పిరిగొనఁగఁ గరము వ్యాజ
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
సుందర తన్వి పార్వతి విశుద్ధ తపమ్ము మహేశ్వరేచ్ఛతోఁ
గందర శోభి తాగమునఁ గందుచు మేఁ గృశియించఁ జేయఁగన్
డెందము నందుఁ బ్రేమ పురడించఁగ ధూర్జటి శంభు నందు ము
న్నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండివందితుడౌ గురుండు దన వారసు జూచుచు బల్కెనివ్విధిన్
రిప్లయితొలగించండికందము వ్రాయుటన్నను సుకావ్యము
గూర్చుటయన్న తేలికే
మందమతీ! నిరంతర ప్రమత్తత నభ్యసనమ్ము లేనిచో
నందరి మొప్పుబొందునటు నాణ్యపు బద్యము వ్రాయుటెట్టులో
పందెపు గుఱ్ఱమున్ బగిది పారుట
కన్నను నిమ్మళించునన్
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చు మేలుగోరుచున్!
నాల్గవ పాదమునందు
తొలగించండినందరి కి నాణ్యపు కు యతి కుదరనిచో
నందరి ........ నందపు బద్యము గ
స్వీకరించ ప్రార్ధన!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో మీరు ప్రయోగించినది అఖండయతి. దోషం లేదు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండి1. బాల్య క్రీడల నాడెడి పసితనాన
అన్న రామన్న తమ్ముడౌ కన్నడనాట
మన్ను దిన్నాడటన్న చూపమని తల్లి
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
2. గోపకాంతలెల్ల రచట కూర్చి తోడ
కొండెములను చెప్పుచుండ కుట్ర యనుచు
గేలి చేయ మురి సి గోప గృహిణి నవ్వ
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
ఉ.మా
3.అందరి వాడు గోపసుతుడంచట నెల్లరు కృష్ణుపై త్వరన్
నిందలు మోపిచూడనట నెమ్మిని చేయుచు నుండగా నటన్
మందియు చూచు చుండగ ముదమారగ యోరగ జూడతల్లి యున్
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో రెండవ పాదం చివర 'కన్నడనాట'? మూడవ పాదంలో యతి తప్పింది.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం.
మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం.
సవరించండి.
బందిగ దాను జైలువడ బాధను నొందుట కారణంబున
రిప్లయితొలగించండిన్గొందల మందిడెందమున గోపన రాముడు మౌనముంటకు
న్నిందల మోపి పిమ్మటనునెమ్మిని మెచ్చెను మేలుగోరుచు
న్నందరి వోలెకాక రఘురాముడు దైవపుటంశమౌటయే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు అన్నయ్యగారూ
రిప్లయితొలగించండిసవరణలతో
1. బాల్య క్రీడల నాడెడి పసితనాన
అన్న రామన్న తమ్ముడౌ కన్న డచట
మన్ను దిన్నాడనగచూపమనియె తల్లి
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
2. గోపకాంతలెల్ల రచట కూర్మి తోడ
కొండెములను చెప్పుచునుండ కుట్ర యనుచు
గేలి చేయగ నందుని గృహిణి నవ్వ
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె.
ఉ.మా
3.అందరి వాడు గోపసుతుడంచట నెల్లరు కృష్ణుపై త్వరన్
నిందలు మోపిచూడనట నెమ్మిని చేయుచు నుండగా నటన్
మందియు చూచు చుండ ముదమారగ యోరగ జూడతల్లి యున్
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
ఉమాదేవి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిముందరి సత్యభామఁగని మోహన కృష్ణుడు పారిజాతము
న్నందఁగ జేసె రుక్మిణికి నంచును జెప్పుచు నీర్ష్య రేపి గో
విందుని నంది నారదుడు వేడుక జేసెను తూచ మాధవున్
నిందల మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండి"ఎందు గానము దైవాన్ని"దేమిటన్న
God is nowhere"
"నిందు నిప్పుడె గలడన్న" నీతి వెలయ
"God is now here"
విరిచి చదువ నరేంద్రుని విశ్వ సభయె
నిందెలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె!
డా.పిట్టా
రిప్లయితొలగించండి"అందరు వెళ్ళుడీ యవను!" లార్యుల భూమి యిద"న్న నెహ్రు నే (Quit India!)
చందము జైలు శిక్షలను చాలగ దోషిగ నిల్ప నోపియున్
పొందుగ"పంచశీల"గను పోడిమి నెంచెను విశ్వ దేశముల్
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిబహుకాల దర్శనం. సంతోషం!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అందరు కష్టపడ్డ పరిహారము జిక్కక యింట పిల్లలన్
రిప్లయితొలగించండికుందగ జేయుమార్గమును గూర్చక?విద్యలు నేర్చియున్నచో
సందిగసంతసంబు నిడుసర్వులు మెచ్చెడి సద్గుణాలతో
నిందలు మోపిపిమ్మటనునెమ్మినిమెచ్చునుమేలుగోరుచున్|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేర్పు చేతను నిష్టూర నియమ మందు
తొలగించండివిద్య నేర్వగ బ్రతుకంత విజ్ఞతొసగి
సర్వ సౌఖ్యలు సాకును యుర్వి నందు
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నిష్ఠుర...విజ్ఞత నిడి... యుర్వియందు..." అనండి.
పాపముల బాపుకో జూచి ఱేపు మాపు
రిప్లయితొలగించండికోట్ల కొలది ప్రజ లిచట కోరి మునుగ,
"గంగ! యేల పునీతులుగ మలచెదవు?
అంత యవివేకి వైతివా"యనె నొకండు!
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.......సమస్య
రిప్లయితొలగించండినిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
సందర్భము... బాల కృష్ణుడు మన్ను తిన్నాడు చూడమ్మా! అని యశోదమ్మకు ఫిర్యాదు చేశాడు అన్న యైన బలరాముడు. ఆమె కన్నయ్య నోరు తెరిపించి చూచింది. భువన భాండా లన్నీ నోటిలో దర్శన మిచ్చా యట!
బలరాముడు నింద వేసినాడు గాని కన్నయ్య నోటిలో బ్రహ్మాండం చిందులు వేసింది. అదొక లీల. బలరాముడు నింద వేయడంలోనే లోకానికి మేలు కోరడం వుంది. కృష్ణ లీలను మెచ్చుకోవడమూ వుండనే వుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"మన్నుఁ దిన్నాడు చూడమ్మ వెన్న దొంగ
నే!" డటంచు కన్నయ్యపై నింద వేసె
నన్న... తెరిపించె నా యశోదమ్మ; చూచె
చిన్ని నోట బ్రహ్మాండంబు చిందు వేసె!!
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె
2 వ పూరణము:-
సందర్భము... బాల కృష్ణుడు మన్ను తిన్నా డన్నాడు అన్న బలరాముడు. యశోదమ్మ "మన్నో మిన్నో చూపించరా!" అన్నది.
కన్నయ్య నోరు విప్పగా మన్ను మిన్ను లెన్నో కనిపించినవి. అదొక లీల. బలరాముడు నిందించడంలోనే లోకానికి మేలు కోరడం వుంది. కృష్ణ లీలను మెచ్చుకోవడమూ వుండనే వుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అన్న నిందించె కృష్ణుని... యమ్మ పిలిచి
"తిన్న దేదొ చూపింపరా మన్నొ మిన్నొ!"
యన్న బాలుండు నో ర్విప్పె; మన్ను మిన్ను
లెన్నొ కనిపించె; జగతి మే లన్న కోరె;
నిందలన్ మోపి మే ల్గోరి నెమ్మి మెచ్చె
3 వ పూరణము:-
సందర్భము... ఒకానొక ధూర్తురాలు తన కూతురు అత్తగారిమీద రకరకాల నిందలు వేస్తూ సాధించడం కొనసాగించి దైవబలం చాలక కాళ్ళ బేరానికి వచ్చి తన వియ్యపురాలితో అన్న మాటలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధూర్తురాలు... వియ్యపురాలితోడఁ బలికె..
"తప్పుఁ బట్టను, నేను మీ దరికి రాను
నిందలన్ మోపి; మే ల్గోరి నెమ్మి మెచ్చె
గాన నాదు కుమార్తె, మీ వాని వలచె..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
26 .2.18
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ మూడు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
అందిన శిస్తు లన్నియును హర్షముతో నుపయోగపెట్టి యో
రిప్లయితొలగించండిమందిరమున్ సృజించుటకు మాన్యుడు భక్తుడు రామదాసు తా
కొందలమొంది రాజిడిన ఘోరపు శిక్షకు, రామచంద్రుపై
నిందల మోపి, పిమ్మటను నెమ్మిని మెచ్చెను, మేలుకోరుచున్
"కోలొ కోలో యన్న..."
రిప్లయితొలగించండిసందులు గొందులన్ తిరిగి సంధ్యను నేనట వెంబడించగా...
పందివి దున్నపోతువని పండుగ పూటను నన్ను తిట్టగా...
తొందర జేయుచున్ తనది దోసెల పిండిని నేనె రుబ్బగా...
నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్!