17, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2600 (ఎంతయో యనుకొంటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు"
(లేదా...)
"ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే"

50 కామెంట్‌లు:

  1. "అణోరణీయాన్ మహతో మహీయాన్
    ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం"

    వెదకి వెదకియు బ్రహ్మను వేయి మార్లు
    వెదకి వెదకియు వేసారి విశ్వమంత
    తుదకు కంటిని హృదిలోన నిదియె యనుచు:
    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు!

    రిప్లయితొలగించండి
  2. ఎంతయొ యిత్తురంచు మరి యొన్నియొ యూహల నూగుచుంటిమే!
    అంతయు సున్నచుట్టితిరి యాశలు శూన్యములయ్యె నయ్యయో!
    వింతగ నాటలాడితిరి విహ్వలురన్ మము మోడి!కావవే?
    ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే?

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ప్రవరుడు... వరూధినితో

    ఎంతొ శ్రమించి , భక్తి నొనరించియు హోమములెన్నొ , నేర్వ వే....
    దాంతము , శాశ్వతమ్మగు పథమ్మును జేరి సుఖమ్ముఁ బొందగా
    నెంతయొ యంచు నెంచితిని ! యింతియయే యని మీర లెంతురే !
    కాంతల కౌగిళుల్ ఘన సుఖంబను మీ పలుకుల్ మృషల్ జుమీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. తలను వంచితి నుద్యోగ ధర్మమెఱిగి
    సాగిపోయితి కర్తవ్య సాధనమున.
    అలసి సొలసితి నన్నెవరాదుకొనరు
    ఎంతయో యనుకొంటి మీరింతెయంద్రు

    రిప్లయితొలగించండి
  5. "నీవార శూక వత్తన్వీ పీతాభాస్వత్యణుపమా,
    తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత
    స బ్రహ్మ స శ్శివ స హరి స్సే న్ద్రస్సోక్షర పరమస్స్వరాట్‌!!!"


    వింతయు విశ్వమంతయును విన్నుయు తారలు చందమామయు
    న్నంతము లేనిదే నభము నాకస మెంతయు యాత్రజేసినన్
    చింతయు జేయబోవలదు
    చిన్నది మీహృది నుండితీరెగా
    నెంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే

    రిప్లయితొలగించండి
  6. ఎంతియొ యంచు నెంచితిని నింతియయే యని మీరలెంతురే?
    ఎంతగ నెంచ నంత నగుపించెద నివ్విధి నమ్ము వారికిం
    కొంతయె యంచుఁదల్చగను కొంచమె యన్నటుఁ దోచుచుందు, న
    న్నెంతటి యంచనం గనగ నేనటు వాస్తవమౌచు నొప్పెదన్.

    రిప్లయితొలగించండి
  7. మానవత్వము వికసించి మను జుల oదు
    మేటి యగు వారల ని యెంచి సాటి మీకు
    గన గ లేమoచునూ హించి ఘన ము గాన
    దె oతయో యను కొ oటిమీ రింతె యంద్రు

    రిప్లయితొలగించండి

  8. గణితమువలె లెక్కల గట్టి గడగడ యని
    పదముల నటునిటు పరచి పద్యములను
    చేర్చెడు జిలేబి రగడల చేవ గాన
    నెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. హిరణ్యకశిపుడు స్తంభోద్భవుడైన శ్రీహరిని చూచి...
    "వెదికితినిల,సురపురియు, వెదుకగఁన్ని
    దిశలను,నభోభువనములు విసుగుజెందె.
    నాదుసభఁకంబమునెదాగెనింతవరకు!
    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు!"

    రిప్లయితొలగించండి

  10. యయేవం వేద !

    కొంతయు నేర్వ లేదు సయి కోరిక మాత్రము గల్గె నీశుడిన్
    వింతల జూడ; మానసము వేచెను తోడుగ ధ్యాన మార్గమున్
    చెంతన జేర్చ సాధనగ చేరెను నమ్మిక సాధ్య మయ్యెగా
    నెంతయు యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. గొప్పగ నూహిం చితినిను కోరి వలచి
    మంచి తనమందు మనసిచ్చు మారుడ వని
    మోస మన్నది తెలియని భాస మనుచు
    ఎంతయో యనుకొంటి మీరింతె యంద్రు
    ---------------------------------
    గర్భ గుడిలోన కొలువైన కాళి యెవరు
    ప్రాణ మున్నది నీలోన త్రాణ గాదె
    వెదక బోవకు నీమది కదన మందు
    ఏంతయో యనుకొంటి మీరింతె యంద్రు

    రిప్లయితొలగించండి
  12. మంచి సినెమయనుచు సఖులందరి సహ
    "అ!" వెడల,అబోధమవ్వక,"అ!"దెలుపన్న
    హసితములతోడ ననుగని, "అ!" వివరణయ!!
    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు!

    రిప్లయితొలగించండి
  13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2600
    సమస్య :: *ఎంతయొ నంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే ?*
    ఎంతో అని నే ననుకొన్నాను , ఇంతే అని మీరనుకొంటున్నారా ? అని మాట్లాడటం ఈ సమస్య లోని విశేషం.
    సందర్భం ::పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లి అలసిపోయి , తాను పిలిస్తే పలకలేదని ధ్యానంలో ఉన్న శమీకమహర్షి మెడలో చచ్చిన పామును పడవేసి , ఆ ముని కుమారుడైన శృంగి యొక్క శాపమునకు గుఱియై , తన మరణానికి గడువుగా ఉన్న ఏడు రోజులలోపల , ఎంతటి కఠోర పరిశ్రమతోనైనా సరే మోక్షం పొందాలని అనుకొన్నాడు. భగవంతుడైన విష్ణువును గుఱించి చింతిస్తూ ఖట్వాంగుడనే రాజు ఒక ముహూర్త కాలంలోనే అంటే రెండు గడియల సమయంలోనే మోక్షాన్ని పొందినాడు అని తెలుపుతూ శుకయోగి భాగవతాన్ని చెప్పడం మొదలు పెట్టగా , వినడానికి సిద్ధమైన పరీక్షిత్తు ముందుగా తన సందేహాన్ని శుకయోగికి విన్నవించే సందర్భం.

    చింతన జేయుమా హరిని , శీఘ్రమె యొక్క ముహూర్తమందె ని
    శ్చింతగ మోక్షమున్ గనగ జెల్లు , నటంచును బల్కు చుంటి వా
    వంతయు సందియమ్ము వలదందువు , హే శుక యోగి వర్య ! నా
    కింతియె చాలు, కావలయు నెన్న కఠోరమునౌ పరిశ్రమం
    *బెంతయొ నంచు నెంచితిని , యింతియయే యని మీర లెంతురే ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (17-2-2018)

    రిప్లయితొలగించండి
  14. పద్యవిద్య నేర్వగ బహు పాటునిచ్చు
    ప్రతిభ వ్యుత్పత్తి యభ్యాస పాటవములు
    వ్యాకరణము ఛందస్సుల పాలనమ్ము
    పట్టుబడగాను వ్యవధి పట్టునేమొ
    యెంతయో యనుకొంటి మీరింతె యంద్రు
    చక్కని గురువు దొరకగ చాల సులువు
    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని గురువు,చక్కని సహపాఠీలు దొరకటం మన అదృష్టమండీ..

      తొలగించండి
    2. నాల్గవ పాదంలో
      పట్టుబడగాను వ్యవధియె పట్టునేమొ యని చదువ ప్రార్ధన!

      తొలగించండి
  15. *ఎంతయొ కష్టమై మదికినింపుగపూరణచేయజాలకన్*
    *వింతగదోచనెట్టులను వేదనబొందుచు,పెద్దవారుమీ*
    *సంతసమిచ్చుపూరణలుశ్రద్దగజూచిన దోచు నాకిటన్*
    *ఎంతయొ యంచునెంచి తిని యింతియయేయని మీరలెంతురే*

    రిప్లయితొలగించండి
  16. హే భగవన్!
    అంతరాళములెంతయో నధిగమించి
    సంతసించుచునంతయూ సౌఖ్యమనుచు
    వింతరీతుల జనులహో! విర్రవీగ
    ఎంతయో యనుకొంటి మీరింతెయంద్రు!

    రిప్లయితొలగించండి
  17. స్వాంతన పొందదీమనసు *శంకరుడిచ్చు సమస్య* వేగమే
    మంతన జేసి పాదముల మార్పులు చేర్పులు గూర్చినెన్నియో
    పంతము బట్టి పూరణను పంపక యున్నను బ్లాగునందునన్
    *యెంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే*

    సర్వ సుఖములు బొందగ శాంతి బొంద
    కన్య కరమును గైకొంటి గంతు లేసి
    *యెంతయో యనుకొంటి !మీ రింతె యంద్రు*
    "కొరివి తోడను తలగోకు కొంటి వోయి!"

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  18. దైవ మెక్కడనుచు గురుదేవు డడగ
    "సకల లోకాల నెక్కడో?"ఛాత్రు డనియె!
    కలడు నీ హృదిలో యని తెలిపె గురువు!
    శిష్యు డిట్లనె గురువుతో చిత్రమగుచు
    "ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు!"

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  19. గంతకుతగ్గ బొంతయని కట్టుము తాళి యనంగ న్యాయమే
    కాంతులుఁ జిమ్ము దేహమును కమ్మని నవ్వు ముఖమ్ముతోడ నా
    సాంతము దేవకన్యయగు చక్కనిదానినినెంచ తెల్సు మీ
    కెంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే

    రిప్లయితొలగించండి
  20. భవబంధనాలు లేని శాశ్వతానందసంధాయకమోక్షమును ఇచ్చి జీవులను తరింప చేయాలని భావించిన పరమాత్ముడు భౌతికానందానికి సంబంధించిన జీవుల కోర్కెలను కాంచి ఇలా అనుకుంటున్నాడట.

    అంతట నావరించు నను నర్చితవిగ్రహమందుఁ గాంచి, జ
    న్మాంతర మంటు లేని యపునావృతమోక్షము నీయ జాలు, న
    న్నెంతటి చిన్ని కోర్కెల నటు లిమ్మని కోరగ, నక్కటా
    యెంతియొ యంచు నెంచితిని నింతియయే యని మీర లెంతురే!.

    రిప్లయితొలగించండి
  21. ఆకాశవాణి సమస్య
    విషము సుధామయంబనుచు వేల్పురు తెల్పిరి మానవాళికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కషణము లేల పౌరులకు గట్టిగ జేయుడు బాస నేడిటన్
      ధిషణయు గల్గి తీరుగను ధీమతు లై జను లెల్ల దేశమున్
      శషభిష లెల్ల వీడి సయి శాంతికి తోడ్పడ మేలు గాను, ని
      ర్విషము సుధామయంబనుచు వేల్పులు దేల్పిరి మానవాళికిన్ !


      జిలేబి

      తొలగించండి

  22. రసము నెరుగని జనులున్న రంగమందు
    గొప్ప యవధాన మొనరింప నొప్పు కొనక
    పెదవి విరిచెడు శ్రోతల వదనములను
    గాంచి చింతించె మదిలోన గవియె యిటుల
    "ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు"

    రిప్లయితొలగించండి
  23. తీర్చ వలె నలుకల నెల్ల మూర్చ రాఁగ
    దించ వలె బడిఁ బిల్లల నంచితముగ
    సంతకుఁ జని కొనవలె వారాంత మందు
    నెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు

    [స్త్రీ పురుష భేదము లేక వర్తించు పూరణ]


    సంతత మింత ద్వేషమున సంతుల నింతుల బుద్ధిమంతులం
    బంతము వూని వింతగను వంత లనంతము జాలి లేక ర
    వ్వంతయు జేయ స్వంత మగు ప్రాంతము లందు నిశాచరుండు నే
    నెంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే

    రిప్లయితొలగించండి
  24. కుంతి తనూజులన్ గనుచు కృష్ణుడు బల్కెను యర్ధరాజ్యమున్
    వంతుగ రిత్తురన్గ తగవా పెదతండ్రికి నైదుయూళ్ళనిన్
    వింతగనిచ్చినాడు ప్రభవింపరొ మీరలు చంద్రవంశమున్
    యెంతయు యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే !

    రిప్లయితొలగించండి
  25. ఇంటి యవసరములకుగా నీయగోర
    వేయి మాత్రమే యిత్తునునిందువదన!
    ననుచు బలుకగ నోసామి! యట్లె యనుచు
    నెంతయో యనుకొంటి మీరింతెయంద్రు

    రిప్లయితొలగించండి
  26. అలిగిన భార్య భర్తతో
    యేను వడ్డాణమును గోర నించుకంత
    కరుణయన్నదె లేదు నెక్లస్సు కొనిరి
    నాధుడనినను నిటులుండునా జగాన
    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు!"

    రిప్లయితొలగించండి
  27. దేవుడెక్కడ యని నేను దేవులాడ
    జీవలందున నెమకుము నీవె ,విధిగ
    కాను పించును నీకట గనుము యనిరి
    యెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు !

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఊరుల నడవుల ముంచుచు
    ఘోరముగా వరద పొంగ కొండొక చోటన్
    వారధి గూలగ, నది
    శారదయే బలిగొనెఁ గద జను లెందరినో

    రిప్లయితొలగించండి
  28. ఇంత సుకోమలమ్ముగ, ప్రహేళిక రీతిని భావవల్లరుల్
    వింతగు కొత్త పోలికల వేడుక, వేదన యొప్పురీతిగా
    నింతిరొ! పల్కుచుండ గని, హృద్య విలాసము గల్గుదానవీ
    వెంతయొ యంచు నెంచితిని, యింతియయే యని మీర లెంతురే !

    రిప్లయితొలగించండి
  29. చింతన జేయుటెట్లొయనిజింతన జేయగనీదు మాటయు
    న్జింతలుబాపి నేనిపుడు శ్రీలను నిచ్చెడులక్ష్మినేభళా
    సంతసమొందుచున్నడుగ జాలని సంపద లీయనత్తరి
    న్నెంతయొనంచునెంచితినియింతియయే యని మీరలెంతురే

    రిప్లయితొలగించండి
  30. ఘన ప్రబంధమును లిఖింప గలరటంచు
    నెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు
    మీర లెరుగరు నిజమగు మీబలమ్ము
    యత్నమొనరించుడయ్య మీరర్థి తోడ

    రిప్లయితొలగించండి
  31. .కాంతలందరు ,కొంతగా భ్రాంతిజెంద!
    విపణివీధిన నుద్యోగ విభవమొచ్చె!!
    ఎంతజెప్పిన మగవారి వింత బుద్ధి
    ఎంతయోయనుకొంటి మీరింతెయంద్రు!!

    రావెల పురుషోత్తమరావు[అమెరికా సం.రా]


    [2] అంతయువింతయేగద సమంచిత దృష్టితొ, నాలకించగా!
    సుంతయుగానారానిదది!! శుభ్రతనేర్వని పల్లెటూళ్ళలో
    వింతయె. పట్టణాల గతి వీధుల, శుభ్రత వీక్షజేయగా!!
    ఎంతయొనంచునెంచితినె యింతియమీరలెంతురే!!!

    రిప్లయితొలగించండి
  32. గాంధి ,బుద్దుని బోధనల్ కథలు వినుచు
    వారి పేర్లతో మోసాలు పనిగజేయ ?
    భారతావని భావించె నౌర యనగ
    ఏంతయో యనుకౌంటి మీరింతె యంద్రు!

    రిప్లయితొలగించండి
  33. గురుదేవా!

    తేటగీతి
    కరము పూరణ మెచ్చ పొగడ్త లుండు
    నెంతయో యనుకొంటి! మీ రింతె యంద్రు 
    కనఁగ 'బాగున్నది యభినందనలు మీక' 
    నుచు నదియె పట్టుదలపెంచు నుతులఁ బడయ!!

    రిప్లయితొలగించండి
  34. ఉత్పలమాల

    కొంతయు పూర్తికాదె సమకూరిన మూడగు వందలేళ్లుగ
    న్నెంతయొ యంచు నెంచితిని?యింతియయే యని మీర లెంతురే 
    యంతటి సార 'మోం' యని! ప్రయత్నముగన్ శ్రుతులభ్యసించు నా
    పంతము నెగ్గుటెట్లనుచు ద్వాజుడనెన్ యమరేంద్రుఁజూచుచున్

    రిప్లయితొలగించండి



  35. దుష్టబుద్ధితో కొలువున దుస్స సేను

    డీడ్చు కొనివచ్చె ననునాడు నిపుడిటుల

    నైదు గ్రామములొసగిన నంతె చాల

    టండ్రు నాదుఃఖ మెటుదీరు నవనియందు

    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు.


    2.కాముకత్వము తోడను కరముపట్ట

     వారణమొనరించక  వాని వసుధ యందు

    చూచు చుంటిరి మీరలు చోద్యమట్లు

    వాని దునుమక నీరీతి పలుకులువిన

    నెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు.


    3.మఱ్ఱి చెట్టును గాంచుచు మనసునందు

      చేసితినియూహనీరీతి చెట్టు విత్త

      దెంత పెద్దదో  మన నాన్న  దేటపరచ

     ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు

     

    4.కోరినట్టికోకను దెచ్చి కువలయమున

    నాలి కొసగ మురిసి వెల యడుగ పతియు

    సంతసాన దెల్ప నలిగి సతియు పలికె

    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు.


    5.పతికి యిష్టమనుచు పిండి వంటలొండ

       మారు పల్కక తినియెడి మగని జూచి

       మురిపెమున వంటను గురించి ముచ్చటించ

       బాగుబాగనినవ్వగ పలికె నిటుల

       ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు.

    రిప్లయితొలగించండి
  36. 17-2-18
    .....సమస్య
    ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు..

    సందర్భము... మాన్యశ్రీ ప్రభాకర శాస్త్రి గారు తపస్సుకు పూనుకున్నారు. ఆకాశవాణి ఇలా వినిపించింది.
    "నేనే పరబ్రహ్మమును. మొట్టమొదట నెవరు సమస్యను పూరిస్తారో వారికే మోక్ష మిస్తాను."
    శాస్త్రి గా రెంతో సంతోషంతో గంతులు వేస్తూ ఇలా అన్నారు.
    "నే నెంతో అనుకున్నానే! ఇంతేనా! మీ రింతే అంటున్నారా!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పరగ మన శాస్త్రి గారు తపంబు పూనె;

    నింగి వినిపించె, "బ్రహ్మంబు నే సమస్య

    మొదట పూరించు వారికే మోక్ష మిత్తు"

    గంతు లిడుచు ననిరి శాస్త్రి గారు నిటుల...

    "ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    17.2.18
    ---------------------------------------
    2 వ పూరణము:--

    సందర్భము... మా గురువర్యులైన మాన్యశ్రీ మామిడన్న సత్యనారాయణ మూర్తి గారిని దేవీ సాయుజ్యం పొందే దెట్లా అని అడుగగా వారు శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరి నెంతో మథించడమే గాక ఆంధ్రీకరణం కూడా చేసిన పుణ్యాత్ములు కాబట్టి అందులోని కింది శ్లోకాన్ని పేర్కొన్నారు.

    జపో జల్ప శ్శిల్పం సకల మపి
    ముద్రా విరచనం
    గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనా
    ద్యాహుతి విధిః
    ప్రణామః సంవేశః సుఖ మఖిల
    మాత్మార్పణ దృశా
    సపర్యా పర్యాయ స్తవ భవతు
    య న్మే విలసితమ్

    అంటే మాటలే జపాలుగా మారుతాయి. చేతులు అటూ ఇటూ తిప్పడమే ముద్ర లౌతాయి.వీధుల్లో తిరుగడాలే ప్రదక్షిణలుగా మారిపోతాయి. తినే తిం డ్లన్నీ యజ్ఞంలో వేస్తున్న హవిస్సు లైపోతాయి. పడుకోవడాలే సాష్టాంగ ప్రణామాలుగా మారిపోతాయి.
    ఎప్పుడూ అర్చనలు చేయలేము. నిత్య కృత్యాలూ మానుకోలేము. కాని రోజు వారీ పనులనే దేవీ సేవలుగా భావించి చేస్తే అవన్నీ అలాగే పరిణమిస్తాయి. ముక్తి అన్నది చాలా సులభ మౌతుంది. అని వివరిస్తూ తన అనువాదాన్నీ ఇలా వినిపించారు.

    మాటల్ నీ జప, మంగ విన్యసన మమ్మా!
    ముద్ర, లా చోటు లీ
    చోటుల్ ద్రిమ్మరుటే ప్రదక్షిణ, హవిస్సుల్
    భోజ్యముల్, సెజ్జ పొ
    ర్లాటల్ నీకు ప్రణామముల్, సుఖము లి
    ట్లాత్మార్పణ న్జేయ నే
    చేటున్ గల్గక నీ సపర్య లవుగా!
    శ్రీ చక్ర సింహాసనా!

    అప్పుడు "నే నెంతో అనుకున్నానే! ఇంతే అంటారా!" అన్నాను.
    ~~~~~~~~~~
    "ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ..
    పొసగఁ జేతులుఁ ద్రిప్ప ముద్ర లగును..
    ఇటు నటు తిరుగుడులే ప్రదక్షిణ లగు..
    నశనముల్ లో నగ్ని కాహుతు లగు..
    పొసగ సెజ్జల మీది పొర్లాటలే సుమ్మి
    పొరలుడు దండాల పొలుపు మీరు..
    మన సుఖా లన్ని యాత్మ స్వరూపిణి, దేవి
    కర్పింప నిటు సపర్య లయి మించు..

    ముక్తి యెంతయో సులభమైపోవు శిష్య!"
    యనుచు *సౌందర్య లహరి* లో నాది శంక
    రులు వచించిన తీరు గురు వరులైన
    *మామిడన్న* చెప్పగ వింటి; మరల నంటి ---
    "యెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  37. వింతగ వింతగా దలచి విస్తును పోవుచు వేచియుంటినే...
    ఇంతుల నింతులన్ వలచి యెంతయు దూరము పారిపోతినే...
    చింతలు చింతలన్ గెలిచి చెంతను జేరగ నాదు ప్రేయసీ!
    ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే :)

    రిప్లయితొలగించండి