10, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2593 (తెలుఁగును నేర్చుకొమ్మనుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తెలుఁగు నేర్చు కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి?" (ఛందోగోపనం)
(లేదా...)
"తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే"
ఈ సమస్యను పంపిన మంద పీతాంబర్ గారికి ధన్యవాదాలు.

119 కామెంట్‌లు:

  1. "మాతృభాష విడిచెదవ? మంచిదౌనె?
    దేశభాషలందు నిజము తెలుగు లెస్స!";...
    తెలుపు మన్నలార; "విధిగ తెలుఁగు నేర్చు
    కొను"మనుచుఁ బల్కఁ దేలిక; ...కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    మనము పూజింపదగినదీ మాతృభాష !
    సహజ సుందరమైనదౌ సరళభాష !
    తీయనైనట్టి మాటలఁ తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి ?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. తెలుగన మాతృభాష యని , తీయనిదంచును , కృష్ణదేవ రా
      యలు కడుమెచ్చినట్టిదని , యాచరణాత్మక బుద్ధిహీనతన్
      పలికిన పల్కులే పలికి , పాలకులెల్లరు పాతపాటగా
      తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక ! నేర్చినఁ గొల్వు లిత్తురే" !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. వలదు తెలుగు బోధన నాకు, తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక, కొలువు లేవి?
    వెలుగు నిడని భాష మనము విడువ వలయు,
    సులువుగ బలుకులు పలుక వలదు సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వెలుగు నిడని భాష మనము విడువ వలయు, అనేసే బదులు పరిస్థితిని బట్టి ఆంగ్లప్రాథాన్యం తప్పదని వ్రాస్తే బాగుండేదేమో !

      తొలగించండి
    3. మిత్రమా నుచు చెప్పింది సబబు ఉదయము లేఛి జపాలకు వెళుతూ హడావిడి గ వ్రాశాను

      తొలగించండి
  4. అమ్మ పాలను ద్రాగిన రొమ్ము గుద్ది
    మాతృ భాషను మరచుట మంచి గాదె
    తేనె లొలికించి సుధలూరు తెలుగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరచుట మంచి దగునె' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. అమ్మ పాలను ద్రాగిన రొమ్ము గుద్ది
      మాతృ భాషను మరచుట మంచి దగునె ?
      తేనె లొలికించి సుధలూరు తెలుగు నేర్చు
      కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి ?

      తొలగించండి


  5. మెలకువ గానుమయ్య మనమేగతి బోవగనేమి వారికిన్?
    పలికిరి రాజకీయ పరిపాటిగ మంత్రులు వేదికన్ సదా
    విలువలు లేని బల్కుల కవీశ్వర! మాటల కేమి చెప్పగన్
    తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. తే.గీ: ఆంధ్రభాషామృతమ్ము రాయలుకు వలయు
    కాలగమనాన రెచ్చె నాంగ్లమ్ము నేడు
    తొలగ ద్రోసి యాంగ్లము నింక "తెలుఁగు నేర్చు
    కొను" మనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి?"

    రిప్లయితొలగించండి

  7. ఛందో గోపనం - వృషభగతి రగడ


    వలయు మనకు తెలివి వినుమయ్య వారధి యాంగ్ల మగును శంకర !
    మెలకువ గనుము యింజనీరుల మేధకు పట్టమయ్య శంకర !
    పలుకు లెల్లను తేటతెల్లకొ ? పాటిగ చెప్పుదు రయ శంకర !
    తెలుఁగు నేర్చు కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి శంకర !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌

      రగడ1 : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

      గ్రంథసంకేత వివరణ పట్టిక
      వి.

      2. వివాదము, గొడవ.
      3. రాపిడి.
      4. పచ్చి బఠానీలు మసాలావేసి ఉడుకఁబెట్టిన భక్ష్యవిశేషము.

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      కాని మీ వృషభగతి రగడ లక్షణ విరుద్ధంగా ఉన్నది. నాలుగు 7 మాత్రాగణాలు (3+4 లేదా 4+3) నాలుగుండాలి. నలము, జగణం వాడరాదు.

      తొలగించండి

    3. వృషభ గతి రగడ లక్షణములు అని ఇలా చూపిస్తోందండి ?


      వృషభగతి రగడ

      వృషభగతి రగడ పద్య లక్షణములు
      1.జాతి(రగడలు) రకానికి చెందినది
      2.16 నుండి 28 అక్షరములు ఉండును.
      3.4 పాదములు ఉండును.
      4.ప్రాస నియమం కలదు
      5.అంత్య ప్రాస నియమం కలదు
      6.ప్రాస యతి నియమం కలదు
      7.ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
      8.ప్రతి పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.


      జిలేబి

      తొలగించండి
    4. నేను చెప్పిన లక్షణంలో నలము నిషిద్ధ మన్నాను. పొరపాటు. అది నగము.
      మీరు చూపిన లక్షణంలో నగము, జగణం నిషిద్ధాలన్న ముఖ్యమైన విషయం లేదు.

      తొలగించండి
  8. ।తెలుగు భాష ను రక్షింప దీక్ష బూని
    తెలుగు బలవంత ముగ రుద్ద ఫలితమే మి ?
    తెలివి గల వార లె ల్లరు న్ దెలు గు నేర్చు
    కొను మనుచు బల్క తేలిక కొలువు లేవి ?

    రిప్లయితొలగించండి


  9. "తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే"
    పలుకనదేల పక్కి వలె ! పాలకు లన్ గను మయ్య నేర్చిరే
    తెలివిగ పట్టు తెల్గు పయి, ధీటుగ తియ్యగ మాట లాడుచున్
    వెలిగిరి వేల్పు గాను ! మరి వెల్గుము నీవును గొల్వు లేలకో ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2593
    సమస్య :: *తెలుగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే ?*
    సందర్భం :: మన మాతృభాష యైన తెలుగును (ఆంగ్లభాషపై మోజు కారణంగా) చులకన చేయవద్దు. మన తెలుగు భాష తీయనైన భాష. కమ్మనైన భాష. అంతటా వెలిగే భాష. వీనుల విందైన భాష. ఇది నిజము అని తెలియజేస్తూనే మన ప్రభుత్వంవారు (మంత్రివర్యులు) పూర్తిగా తెలుగునే నేర్పించేటటువంటి ఓరియంటల్ కళాశాలలో కొన్నింటిని తీసివేశారు. మూసివేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక తెలుగు పండితుని నియమించి ఉంటే ఇటువంటి దుస్థితి ఏర్పడియుండేది కాదు. తెలుగు పండితులు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. తెలుగు నేర్చుకోండి అని *మాటలు చెప్పడం తేలికే.* మీ మాటలు విని తెలుగు నేర్చుకొంటే బ్రతుకు తెరువు కోసం మాకు ఉద్యోగాలిస్తారా ? అని వాపోతున్న ఎంతోమంది తెలుగు పండితుల ఆవేదనను విన్నవించే సందర్భం.

    పలుచన చేయవద్దు పరభాషల మోజున మాతృభాష యౌ
    తెలుగును , తెల్గుభాష కడు తీయని కమ్మని భాష , యంతటన్
    వెలిగెడి భాష , సత్య మిది , వీనుల విందగు భాష యందు , రీ
    తెలుగునె నేర్పు నా బడుల దీసిరి మూసిరి మంత్రి వర్యు లీ
    తెలుగును నేర్వ జీవితపు తీరు వెలుంగగ కొల్వు దక్కునే ?
    *తెలుగును నేర్చుకొమ్మనుట తేలిక , నేర్చినఁ గొల్వు లిత్తురే ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-2-2018)

    రిప్లయితొలగించండి
  11. సభలు పెట్టుచు నచ్చోట జబ్బ చరిచి
    యమ్మ నేర్పిన భాషయే యమృత మంచు
    తేనె లొల్కెడు మధురమౌ తెలుగు నేర్చు
    కొనమనుచు బల్క దేలిక కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
  12. (మొదటిది ప్రశ్న - రెండవది సమాధానం)

    "తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక; నేర్చినఁ గొల్వు లిత్తురే ?"
    "కలవర మేలనయ్య కడు కమ్మని భాషను నేర్చు కొంటకున్;
    మెలకువ పెంచుకొంటకును; మేలగు జ్ఞానము నందు కొంటకున్;
    గొలువది యంత్రజీవనము; కూరిమి తెల్గది యార్ద్ర జీవమే."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    2. చాలా బాగుందండీ బాపూజీ గారు

      జిలేబి

      తొలగించండి
    3. బాపూజీ గారూ! మీ పూరణ అద్భుతంగా ఉంది! అభినందనలు! ఇంచుమించు ఇదే భావనతో నా తేటగీతిని కూర్చాను!

      తొలగించండి
    4. శంకరార్యులకు ,జిలేబీ గారికి ,సీతాదేవి గారికి ధన్యవాదాలు .

      తొలగించండి
  13. తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే?
    కొలువది లేకపోయినను కూడుకు గుడ్డకు గూడుకెట్టులో?
    కొలువది లేకపోయినను కూతురి నెవ్వరు నీయబోరుగా!
    పలుకుము చంద్రశేఖరుడ! పాపము నీకది వచ్చి చేరదే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్యా! నీ ప్రశ్నకు నా జవాబు క్రిందనున్నది చూడు!😊😊😊

      తొలగించండి


    2. జీపీయెస్ వారు


      ఆకాశవాణి విశేషములేమిటి ?


      జిలేబి

      తొలగించండి
    3. మీ పేరూ, నా పేరూ చదువబడ్డాయని నా భ్రాంతి. సీతా దేవి గారి పద్యం కూడా. మిగిలిన విశేషాలు సీతా దేవి గారు వెండి తెరపై చూపెడుదురు గాక!

      తొలగించండి
    4. జిలేబిగారూ ! యధాప్రకారంగా మన కవిమిత్రులలో కొందరి పద్యాలు చదివారు, కొందరి పేర్లు చదివారు!
      ఈ కొన్నివారాల ఆకాశవాణివారి కార్యక్రమాన్ని పరిశీలించగా నాకు తోచిన విషయమేమంటే
      లాటరీ ద్వారా పద్యాలను యెంపికచేసి చదువుతున్నారని! ఎందుకంటే మంచిపూరణలుగా మనం భావించి పంపినపుడు చదవడం లేదు! ఆషామాషీగా వ్రాసినప్పుడు చదువుతున్నారు! ఇది నా కనిపించినది!
      పూర్తి వివరాలు గురువుగారిస్తార నుకుంటాను

      తొలగించండి

    5. పై వారం సమస్య యేమి టండి ? ఆషామాషీ గా రాసి పంపిచేస్తా :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    6. "తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే?...
      *************************
      తెలుగును వీడి యాంగ్లమును తీపిగ తేటగ లెస్స నేర్చితిన్
      కొలువది నాకు చిక్కెనుగ కూటికి గుడ్డకు గూటికిన్ భళా!
      వెలుగును వెల్గి శ్రాంతునిగ వేడుక జేయగ నాకు చిక్కెరో!!
      కొలువది శంకరాభరణ కోటవిదూషక చక్రవర్తిగా!!!

      తొలగించండి


    7. వావ్ ! పై వారం ఆకాశ వాణి సమస్య ఇవ్వాళ ఇక్కడ ఇవ్వబడ్డ సమస్యా ?

      తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే?

      జిలేబి

      తొలగించండి
    8. సారూ:

      పై పూరణకు వ్హాట్సప్ లో ఆరు నిమిషాలలో అరడజనుకు పైగా స్పందనలు వచ్చినవి... అందరికీ నా "విదూషక చక్రవర్తి" పదవి కావాలట.. నేనివ్వ నేనివ్వ నేనివ్వలేనుగా!

      తొలగించండి
    9. జిలేబిగారూ! వచ్చేవారం సమస్య:

      “కాకులపాట కమ్మన పికమ్ములపాట కఠోరమయ్యెడిన్”

      తొలగించండి
    10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి


    11. వచ్చె వచ్చె ఆషామాషీ పూరణ :)



      షోకుల బోవు చిత్రముల సోయగముల్ సయి లేని వాద్యముల్
      బాకుల వంటి పల్కులను భాగ్యముగా మన లోన దూర్చుచున్
      మేకుల దించి గొట్టి మన మేనినటన్ పెకలించి వేయు, ఆ
      కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్!


      జిలేబి

      తొలగించండి
    12. వచ్చేవారం ఆకాశవాణి సమస్య:

      "కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోర మయ్యెడిన్"

      ***************************

      నా సరదా పూరణ:

      వేకువ జామునన్ తడిసి వెన్నుని నామము పాటపాడుచున్
      వాకబు జేయగా గునిసి బ్రాహ్మలు లేటుగ వత్తురోయనిన్
      పాకము లన్నియున్ కలిపి వాయస పిండపు దానమందునన్
      కాకుల పాట కమ్మన; పికమ్ముల పాట కఠోర మయ్యెడిన్!


      కాపీ రైటు:
      గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
    13. ప్రభాకర శాస్త్రి గారూ,
      పిండప్రదాన సమయంలో కాకుల పాటే కదా కోరదగినది. బాగుంది.
      'వత్తురోయనిన్'...? అయినా వారి లేటుతో అవసరమేమిటి? "బ్రహ్మలు మంత్రములన్ బఠింపగా" అనవచ్చు కదా!

      తొలగించండి


    14. కాపీరైటులు నావి కాకి యరుపుల్ కావ్ కావ్ లకున్ భాస్కరా :)

      జిలేబి

      తొలగించండి
    15. సార్! చాలా సంతోషం! మీ checkup బాగుగా ఐనట్లున్నది. నా తద్దిన పూరణ సవరించెదను. స్వానుభవం కదా!

      🙏🙏🙏

      తొలగించండి
  14. పలుకున పాయసాన్నమును బంచుచు చేతల లోనగాంచినన్
    ములుకుల తోడ గ్రుచ్చెదరు మూర్ఖపు నేతల తీరదే గదా
    తెలుగును త్రొక్కిపెట్టుచును ధీటుగ నాంగ్లపు పాఠశాలల
    న్నిల తెరి పించినట్టి గుణహీనులు గొప్పల కోసమై యటన్
    దెలుగును నేర్చుకొమ్మనుట తేలిక, నేర్చినఁ గొల్వులిత్తురే.

    రిప్లయితొలగించండి
  15. మాతృభాషను సంస్కృతి మనుచునుండు
    ముదము గూర్చెడి సాహిత్య ముల్లసిలగ
    పలుకదగునె నివ్విధి నార్య!”తెలుగునేర్చు
    కొనుమనుచు బల్క దేలిక కొలువులేవి?”
    ఆర్జితంబునకై నేర్వ నన్యభాష
    తప్పులేదుగ బ్రతుకంగ తప్పదెపుడు

    రిప్లయితొలగించండి
  16. భాష నిలుపుట మాకున్న బాధ్యతనుచు
    ప్రభుత చెప్పును మాటల, ప్రశ్న వేతు
    వెలుగ జేయగ యువతను తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక, కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బాధ్యత+అనుచు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "భాధ్యత యని" అనండి.

      తొలగించండి


  17. "హనుమ! సంస్కృతము వలదయా! వినుమయ!"

    "రాముడిటవచ్చు కిష్కింధ ! రాట్టు మనకు
    తీరుగనతడగునుగద! తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక, కొలువు లేవి?"


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      రామాయణంలో తెలుగు పిడకల వేట... బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

    గురువుగారు క్షమించాలి 7 వతేది దత్తపది పూరణ ఆలస్యంగ పంపిస్తున్నాను

    పారుచు నున్న యేరు మన పల్లె దరిన్ బ్రవహించు చుండగా

    నేరుపడున్ బురోగమన మెంతయు | చక్కగ దేశమందునన్

    బైరుల వృద్ధి యున్నపుడె పౌర జనాళి సుఖించు | గాన నూ

    రూరును దాకుచున్ నడచు చుండు విధంబున > బంటకాలువల్

    తీరిచి దిద్ది , నీటి వసతిన్ సమకూర్చుచు ,‌ దేశ దుస్థితిన్

    మారుచ ముఖ్యమౌను సుమ నాయకు లెల్లరు -- వీడి స్వార్థమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. తే.గీ.
    నేర్చు కొనువిద్యఁ సాధించు నిపుణ తదియె
    నీకు తిండిబెట్టు, కొలువు నీకు జూపు
    కొలువు కావలెనన్న నీ కోర్కె దీర
    మాతృ భాష యెటులమూల మగును జూడ

    భాష నేర్చుకొనుట నీదు బాధ్యతేగ
    బతుకు తెరువు కొఱకు కాదు భాషనేది
    తెలివి దప్పి పలుకనేల "తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నిపుణత యదె... బాధ్యత గద... భాష యనగ..." అనండి. వాటికి సంధి లేదు.

      తొలగించండి

  20. పలికితి నూరకన్నకొ సభాస్థలి నందున లేమ ? కష్టమే
    తెలుఁగును నేర్చుకొమ్మనుట? తేలిక! నేర్చినఁ గొల్వు లిత్తురే
    వెలుగుల చంద్ర శేఖరుడు వీధుల వీధుల పాఠశాలలన్
    జిలుగు వెలుంగు తెల్గుల భజిష్యము గాను జిలేబులూరగన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నూరకన్నకొ' టైపాటు ఉన్నట్టుంది.

      తొలగించండి
  21. దేవి!వినుమిది పరులకు తెలుగు నేర్చు
    కొనుమనుచుబల్కదేలిక కొలువులేవి?
    యాంగ్లభాషకుగలయట్టి యాదరణము
    తెలుగుభాషకులేదుగా దెలుగునేల

    రిప్లయితొలగించండి
  22. తే.గీ.
    ఆంగ్ల విద్యనార్జించియు నమెరికాకు
    పోయి సాఫ్టువేర్జాబునుప్పొంగు చుండ
    తెలుగు మాటేల? మిత్రమా! తెలుగు నేర్చు
    కొనుమనుచు బల్కదేలిక కొలువులేవి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      అన్యదేశ్యాలున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  23. దేశభాషలయందున తెలుగు లెస్స
    యభ్యసించుమటంచును నమ్మ కోర
    తెలివిగ నడిగె సుతుడిటు తెలుగు నేర్చు
    కొనమనుచు బల్క దేలిక కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
  24. తెలుగు నేర్చిన విద్యార్థి కొలువు నొంద
    లేద! సాహితీ వనమున్నిలిచి వెలిగెను
    తీర్పు సరికాదు నీమాట ..తెలుగు నేర్చు
    కొనుమనుచుబల్క దేలిక కొలువులేవి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో "వనిలో నిలిచి వెలిగెను.." అనండి.

      తొలగించండి
  25. ఆపరేషన్ అయిన కంటి చెకప్ కోసం హాస్పిటల్ వచ్చాను. సాయంత్రం వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు.

    రిప్లయితొలగించండి
  26. వారి పిల్లలకు పరాయి భాషనేర్పి
    యితర దేశములకు పంపి, యెక్కి వేది
    కలను నేతలు ప్రీతితో తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక, కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
  27. పలుకులలోనతేనియలుపాటలలోపలురాగమాలికల్
    విలువలుబెంచుసత్కృతులువిజ్ఞులుమెచ్చెడుపద్యకావ్యముల్
    కలువలరేడుచందురునికన్నులనిల్పెడువర్ణమాలయౌ
    తెలుగునునేర్చుకొమ్మనుటతేలిక నేర్చినకొల్వులిత్తురే?

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. కొలు వది కలవా రెల్లరు తెలుఁగు నేర్చి
      మాతృ భాష సేవకుఁ బూన మాన్యు లయ్య
      కలత యేలయ యిటులెంచి తెలుఁగు నేర్చు
      కొను మనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి?


      కలవర మంద కయ్య యిటఁ గమ్మగఁ బాడఁగ నేరి కైన పా
      టల నిలఁ గష్టమే కటకటంబడి కావలె సత్వరమ్ము నీ
      కలఘు తరస్వరంబు మఱి యందుకె,గానపయోధి చాల లో
      తెలుఁగును నేర్చుకొమ్మనుట, తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే

      [లోతు+ఎలుఁగు =లోతెలుఁగు; ఎలుఁగు = కంఠస్వరము; తేలిక(న్) =తేలికగా; ఇత్తురే = తప్పక యిచ్చెదరు]

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు’ మీ తేటగీతి ఉత్తమంగా ఉన్నది!
      కాని తెలుగు నేర్చిన వారికైనా కొలువులు దొరకుతున్నవి గాని సంగీతము నేర్చినవారికసలు
      కొలువులే లేవు! శాస్త్రీయ సంగీతమైతే యింకా కనాకష్టంగా ఉన్నది పరిస్థితి!

      తొలగించండి
    3. డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.
      ఇక్కడ తెలుగు పద సన్యాసమును “ఎలుఁగు” పద సంగ్రహమ్మును గ్రహించుట విశేషము.
      ఇందలి నిగూఢ నిందార్థమ్మును గైకొన ప్రార్థన. గాన మనిన ముఖస్తుతి గాన మనియు ( దీనినే ప్రాపంచిక భాషలో “కాకా” పట్టుట యందురు) కష్టమనిన నందఱికీ చేత కాదని (కమ్మగ పొగడడము) భావము.

      తొలగించండి
    4. ఓహో! అయిన అత్యుత్తమముగా నున్నది!
      మీరు వివరించినగాని మా బోంట్లకు సులభగ్రాహ్యముగ లేదు! ధన్యవాదములు! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  29. తీయనైనట్టి మన భాష తెలుగు నేర్చు
    కొనుమనుచు బల్క దేలిక కొలువు లేవి?
    కొలువు కోసమే కాదురో కొడుక! తెలుగు
    భావితరముకు తెలియంగ బ్రతుకవలదె
    *తండ్రీ కొడుకుల సంభాషణ*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భావితరమునకు దెలియ బ్రతుకవలదె" అనండి.

      తొలగించండి
  30. తెలుగునునేర్చుకొమ్మనుటతేలికనేర్చినగొల్వులుత్తురే
    కొలువులులేకపోయిననుగోరికదీరగనేర్చుకోదగున్
    గొలువులువచ్చుకొందరకుకోరినచోట్లకుగౌరవంబున్
    దెలియుముదీనిభావమునుదేతలికొండలరావ!యిత్తరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గౌరవంబునన్" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  31. తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక, నేర్చినఁ గొల్వు లిత్తురే
    నెలవున?యంచు బల్కకుము నిక్కపు కూరిమి మాతృభాషలో
    బలికిన చాలు వాచకము పట్టిన చాలును పల్కుతల్లినిన్
    గొలిచిన చాలు నయ్యదియె కోటి ధనమ్ముకు సాటియౌ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నెలవున నంచు" అనండి. అలాగే "కోటి ధనమ్మున కౌను సాటిగా" ఆనండి.

      తొలగించండి
  32. తెలుగును నేర్పుతల్లి,తనతేజమునింపునుతండ్రి,దీక్షసం
    కలనముబెంచు గుర్వు,మనకందిన మిత్రులు,సంఘ సభ్యులున్
    తెలుగును నేర్చుకొమ్మనుట తేలిక|నేర్చిన గొల్వులిత్తురే?
    “ఫలితముగాదు భాష మనవారల కీర్తికి భీజమద్దియే”|

    రిప్లయితొలగించండి
  33. ఈనాటి ఆకాశవాణి వారి సమస్యాపూరణం కార్యక్రమంలో మన బ్లాగు, వాట్సప్ సమూహం కవిమిత్రులలో క్రిందివారి పద్యాలను చదివారు. మొత్తం చదివిన పూరణలు 28.
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారు
    2. ఆకుండి శైలజ గారు
    3. ఆకుల శాంతిభూషణ్ గారు (రెండు పూరణలు)
    4. నేదునూరి రాజేశ్వరి గారు
    5. బండకాడి అంజయ్య గౌడ్ గారు
    6. VVVHB ప్రసాద రావు గారు
    7. మంద పీతాంబర్ గారు
    8. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు
    9. పోచిరాజు సుబ్బారావు గారు
    10. గుఱ్ఱం సీతాదేవి గారు
    11. కె. ఈశ్వరప్ప గారు
    12. గుఱ్ఱం జనార్దన రావు గారు
    13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు
    14. గండూరి లక్ష్మినారాయణ గారు
    ఈ క్రింది కవిమిత్రుల పేర్లు మాత్రం చదివారు....
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
    2. జంధ్యాల ఉమాదేవి గారు
    3. మాచవోలు శ్రీధర రావు గారు
    4. వీటూరి భాస్కరమ్మ గారు
    5. బల్లూరి ఉమాదేవి గారు
    6. చంద్రమౌళి రామారావు గారు
    7. జి. ప్రభాకర శాస్త్రి గారు
    8. చంద్రమౌళి సూర్యనారాయణ గారు
    9. జిలేబీ గారు
    కొన్ని పేర్లు స్పష్టంగా వినిపించలేదు.
    ******
    వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
    "కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్"
    మీ పూరణలను 15-2-2018 (గురువారం) లోగా padyamairhyd@gmail.com కు పంపండి.

    రిప్లయితొలగించండి
  34. గురువు గారికి నమస్సులు.
    తేట తెనుగున వ్రాసితి తేటగీతి,
    ఆట పాటల వీణయు, ఆట వెలది
    తెగువ గల పరిశోధకుల్ తెలుగు నేర్చు
    కొనుమనుచుబల్క తేలిక కొలువు లేవి?

    రిప్లయితొలగించండి
  35. తేనె లూరెడి తీయని తెలుగు నేర్చు
    కొను మనుచు బల్క దేలిక! కొలువు లేవి
    రావ టంచు బాధ పడక ప్రజలు భాష
    తోడ ప్రతిభ పెంచు కొనగ చూడ వలయు!

    గురువు గారికి నమస్సులు. నిన్నటి మొన్నటి నా పూరణలను కూడా పరిశీలించ ప్రార్థన. ధన్యవాదములు.
    వంకలు బెట్టుచు సతతము
    బొంకుచు లోకులను దోచు బుద్ధులు కూడన్
    పంకము విడని మనుజులకు
    సంకటముల గూర్చు వాడు సంకర్షణుడే!

    అక్కున చేర్చుకొనగ నట
    మక్కువతో నవ వధువున మాలిమి నింపన్
    "చక్కని చుక్కవె, మరదలి
    యక్కా యిటు రమ్మ" ని మగడాలిన్ బిలిచెన్!

    రిప్లయితొలగించండి
  36. ..............సమస్య
    తెలుగు నేర్చుకొను మనుచుఁ బల్కఁ
    దేలిక కొలువు లేవి? (ఛందో గోపనము)

    సందర్భము: సులభం
    ~~~~~~~
    . తెలుగు 'ముఖ్య విషయము'గాఁ
    దీసికొన్న...
    వసుధలోన 'కలెక్టరు'
    వంటి పెద్ద
    కొలువులే యుండు ; మంచిదే...
    "తెలుఁగు నేర్చు
    కొను" మనుచుఁ బల్కఁ...! దేలిక
    కొలువు లేవి?

    ...............సమస్య
    తెలుగును నేర్చుకొ మ్మనుట తేలిక
    నేర్చినఁ గొల్వు లిత్తురే!

    సందర్భము: నలభైయొక్క రోజులు దీక్షగా ప్రతి రోజూ (రెండు సమస్యలలో) ఒక్క సమస్యనైనా పూరిస్తే నెలకు లక్ష రూపాయల కొలువు ఇస్తా మని ప్రభుత్వం ప్రకటిస్తే ఒక్కొక్కడూ ఉరుకులు పరుగులమీద తెలుగు నేర్చుకో కేం జేస్తాడు?
    (ప్రభుత్వం ఇలా చేస్తే నిరుద్యోగికి తెలుగూ వస్తుంది. కొలువూ వస్తుంది.)
    అప్పు డీ మాట ఇలా అనే వా డొకడైనా వుంటాడా!
    ~~~~~~~~~~~~~~~~
    నలుబది యొక్క రోజులు ది
    నంబున కొక్క సమస్య నిట్లు తా
    మలతిగ పూరణన్ సలిపి
    నంతట మాసము లక్ష రూప్యముల్
    సులువుగ వచ్చు కొ ల్వొకటి
    చూపెద మన్నఁ దెలుంగు నేర్వరే!
    ఇలఁ గల రెండు రాష్ట్రముల
    ని ట్లను వా డొక డప్పు డుండునే!
    "తెలుగును నేర్చుకొ మ్మనుట
    తేలిక, నేర్చినఁ గొల్వు లిత్తురే!"

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      మరి ఎనిమిదేళ్ళుగా రోజుకొక సమస్య నిస్తూ, అప్పుడప్పుడు పూరిస్తూ, అందరి పూరణలను సమీక్షిస్తున్న నాకెంత ఇవ్వవచ్చునంటారు?

      తొలగించండి
    2. అక్షర లక్షలు గురువుగారూ! నమోనమః!!
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  37. తెలివిగ నాంగ్లమే తగిన దివ్య పధంబని దేశ నాయకుల్
    వెలుగును జీవితమ్ములని పిల్లలనంపుచు పశ్చిమంబుకున్ ,
    పలుకుదురెన్నొ నీతులను పంపుట మానిరె వారి సంతునున్ ?
    తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక, నేర్చినఁ గొల్వు లిత్తురే ?

    నిన్నటి సమస్యకు నా పూరణ

    శంకించ దగదు శనియే
    సంకటములఁ గూర్చువాఁడు; సంకర్షణుఁడే
    యంకిత భావమునగొలువ
    పంకజముఖి సహితుడగుచు వరములొసంగున్




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పశ్చిమంబునకున్' అనడం సాధువు. అక్కడ "పిల్లలఁ బశ్చిమదిక్కు కంపుచున్" అనండి.

      తొలగించండి

  38. వలువలు మార్చినంత సులభమ్ముగ
    ముద్దగు మాతృభాషనే
    మలినపు భావమున్ విడచి మక్కువ జూపగ నన్యభాషలన్
    తెలివగు కార్యమంచు బహు తేటగ
    ప్రల్లదనంబునన్ భళా!
    తెలుగును నేర్చుకొమ్మనుట దేలిక
    నేర్చిన కొల్వులిత్తురే?
    యలుకలు మాని వాస్తవము నౌదలదాల్చుట నెంతొ మేలనన్
    విలువలు మారగానిలను విద్యల రూపులు మారిపోయెగా!

    రిప్లయితొలగించండి
  39. తేటగీతి
    ఆ విదేశీ చదువుల నాధ్యాయు లౌచుఁ
    బ్రజల నేలెడు వారికిఁ బలుక రాక
    తీపి దనము నెఱుఁగకనే తెలుఁగు నేర్చు
    కొనుమనుచుఁ బల్కఁ దేలిక! కొలువు లేవి?
    ** ** **
    చంపకమాల
    తెలియఁగ నాంగ్ల మాధ్యమము దేశ విదేశపు విద్యలందునన్
    సులువని నమ్ము చుండి తమ సూనులఁ బంపుచు, మాతృభాషపై
    తొలగెను ప్రేమయందురని దొంగడిబెట్టఁగ బల్కు మాటగా
    తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక! నేర్చిన గొల్వు లిత్తురే?

    రిప్లయితొలగించండి
  40. ఆది కవుల నోటనలరు నమృత భాష
    శబ్దమధురిమ గలిగిన సరళభాష
    దేశభాషల లెస్సగు తెలుగు నేర్చు
    కొనుమనుచు బల్క దేలిక, కొలువులేవి?!!!

    రిప్లయితొలగించండి
  41. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'కాని+అది' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  42. ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి
    10-02-2018 నాటి సమస్య కు పూరణ:
    సమస్య :
    "కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్."
    ***)()(***
    లోకుల తీరు వింతగును లోతుగ జూచిన నొక్కొకప్పుడున్
    చౌకగు వాటినే వలచి చక్కని వన్నియు త్రోసి పుత్తురే !
    హా!కలికాల మందున నిది యచ్చెరువౌ గద యక్కటక్కటా !
    కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి

  43. కాకులె "కావు!కావు!" మని కమ్మగ దేవుని వేడుచుండుగా!
    కోకిల లూరకే యిలను "కూ"యని,"కూ"యని కూయుచుండుగా!
    కాకుల పారమార్థమును గానము చేయునె కోకిలెన్నడున్?
    కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్.

    ****)()(****

    రిప్లయితొలగించండి
  44. మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు!!

    రిప్లయితొలగించండి
  45. "తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే"

    తప్పు తప్పు !

    తెలుగును నేర్చుటెవ్విధిని తేలిక యౌనుర పండితోత్తమా?
    తెలుగును వ్రాయ గోరగను త్రిప్పగ చేతిని త్రిప్పటయ్యగా
    తెలుగును పల్క గోరగను త్రిప్పగ నాలుక రుబ్బుపొత్రమౌ
    తెలుగును నేర్ప బోవగను త్రేపులు వచ్చును వంగకన్నెకున్!

    రిప్లయితొలగించండి