సోడాబుడ్డి కళ్ళద్దాలతో అంత్యాక్షరాలనుకుని కొంత ఓవర్ యాక్షన్ చేసి పాద ఆది అంత్యాక్షరాలతో మొదలెట్టి " రా" దగ్గర ఆగిపోయి దిక్కుతోచక మూడో పాదం లో రా ని విడిచి ఆపై కళ్ళు ఊనించి చూసి ఓహో యతి స్థానపు అక్షరాలా అడిగినది అనుకుని మళ్ఖీ మొదలెట్టా ఆది యతి స్థానాలలో :)
*రేపటి మహా శివరాత్రి సందర్భంగా విశ్వేశ్వరునికి (విష నైవేద్యం) విషమము*
*మణులన్ గూర్చుచు గట్టెదన్ మొలకు నే మత్తేభ వృత్తంబులన్* *ఫణులన్ నిల్పెద కంఠభాగమున సంప్రాప్తించ కైలాసమే* *సాంబావేతును పీఠమున్ తమకు నే శార్దూల వృత్తంబులన్* *యంబా! యందును కావుమయ్యనను మీ యర్ధాంగి తో వచ్చిటన్*
శ్రీహర్ష గారి విషమ వృత్తం బాగున్నది. అయితే నాకు తెలిసినంత వరకు విషమ వృత్తాలలో నాలుగు పాదాలకూ ప్రాసమైత్రి పాటించవలసి ఉంటుంది. పై పద్యంలో రెండు రెండు పాదాలకు ప్రాసమైత్రిని పాటించారు.
బాపూజీ గారూ, న్యస్తాక్షరాలను పాదాదిని ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 'యత్యక్షరం' అనికాక 'యతిస్థానం'లో ఉంటే సందిగ్ధతకు తావుండేది కాదు. అందువల్ల కవిమిత్రులు న్యస్తాక్షరాలను పాదాదిని కాని యతిస్థానంలో కాని ప్రయోగించినా అంగీకరిస్తాను. ధన్యవాదాలు!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: న్యస్తాక్షరి , *శి* *వ* *రా* *త్రి* అనే నాలుగు అక్షరాలను నాలుగు పాదాలలో యతిస్థానములలో నిలిపి పద్యం వ్రాయాలి. విషయం :: *శివ స్తుతి* ఛందస్సు :: తేటగీతి లేదా ఆటవెలది. సందర్భం :: మహాశివరాత్రి పర్వ దినాన మహాదేవుడైన పరమశివుని మనసారా భక్తి ప్రపత్తులతో పూజిస్తూ నల్లని కంఠంతో విరాజిల్లే ఓ శితిగళా ! నాకు శివము (మంగళము) కలిగేందుకోసం నిన్ను స్మరిస్తాను. సులభంగా వరములిచ్చే ఓ శివా ! భక్తితో నీ స్తుతి చేస్తాను. ఈ శివరాత్రి నాడు నీ నామ జపంతో జాగారం చేస్తాను. ఓ చంద్రమౌళీ ! ఓ ముక్కంటీ ! ఓ త్రిపురాంతకా ! నాకు నీవే దిక్కు అని నిన్నే కొలుస్తాను అని శివుని స్తుతించే సందర్భం. ఇచ్చిన అక్షరాలను యతిస్థానములందు మాత్రమే కాకుండా పాదముల మొదట కూడా ఉంచి పద్యపూరణ చేయడం జరిగింది.
ధన్యవాదములు గురువుగారూ! నేను కూడ ఆద్యక్షరాలు, యత్యక్షరాలు” శివరాత్రి “గా వ్రాశాను! మీరు అందరివీ గుర్తించారు! నన్ను గుర్తించలేదు! విద్యార్ధి మనస్తత్వము పోలేదు!😄😄😄🙏🙏🙏🙏🙏
కామేశ్వర రావు గారూ, మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది. దాని ననుసరించిన మీ శివస్తుతి మనోహరంగా ఉన్నది. అభినందనలు. యత్యక్షర విషయంలో మీ భావన యుక్తమే. నేను ఆ అభిప్రాయంతోనే ఇచ్చాను. బాపూజీ గారు 'ఆద్యో వళిః' సూత్రాన్ని గుర్తు చేశారు. అందువల్ల రెండు విధాలనూ ఆమోదిస్తున్నాను. కొందరైతే రెండు విధాలుగా ప్రయోగించారు.
తండ్రి పుత్రుని పొగిడిన ఆయుఃక్షీణము.. అదే పుత్రుడు తండ్రిని పొగిడితే ఆయుర్వృద్ధి. జగముకంతటికీ తల్లిదండ్రులు అయిన శివశక్తులను స్తుతించి మనమందరమూ ఆయురారోగ్యాలు పొందెదము గాక..
రిప్లయితొలగించండిఅందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షల తో
శివశివ యనుమమ్మ మనసా చిగిరిలగ శి
వకవి వలె! నాది యోగిగ వరము గా వ
రాకములను గాచునతడు ! రాధనమును
త్రికరణపు రీతి బడయ నింతి, సయి ధాత్రి !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆద్యౌ వళిః' అని బాపూజీ గారు గుర్తుచేసినట్లు మీరు న్యస్తాక్షరాలు పాదాది నుంచడం సరియైనదే.
రిప్లయితొలగించండిశివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !
జిలేబీ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను పాదాదిని, యతిస్థానంలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చేయ భక్తి శ్రద్ధల తోడ శివుని పూజ
రిప్లయితొలగించండివరద పారినట్లు మనకు వరము లిచ్చు
కాశి శతకోటి పుణ్యాల రాశి గాదె?
యజుని సమదైవ మేలేడు త్రిజగములను!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జిలేబి గారు! పాదాద్యక్షరాలా?యత్యక్షరాలా?రెండూ ఒకటేనా?రెండు విధములా పూరింప వచ్చా?
రిప్లయితొలగించండి
తొలగించండిజనార్ధనరావు గారికి
సోడాబుడ్డి కళ్ళద్దాలతో
అంత్యాక్షరాలనుకుని కొంత ఓవర్ యాక్షన్ చేసి పాద ఆది అంత్యాక్షరాలతో మొదలెట్టి " రా" దగ్గర ఆగిపోయి దిక్కుతోచక మూడో పాదం లో రా ని విడిచి ఆపై కళ్ళు ఊనించి చూసి ఓహో యతి స్థానపు అక్షరాలా అడిగినది అనుకుని మళ్ఖీ మొదలెట్టా ఆది యతి స్థానాలలో :)
అంతా శివరాత్రి మహిమ :)
యతి స్థానపు అక్షరాలతో చేస్తే చాలనుకుంటా
జిలేబి
పండగ అంటేనే భయం నాకు... న్యస్తాక్షరి రాబోతోందని...😢
తొలగించండిశ్రీహర్ష గారి విషమవృత్తము
తొలగించండి*రేపటి మహా శివరాత్రి సందర్భంగా విశ్వేశ్వరునికి (విష నైవేద్యం) విషమము*
*మణులన్ గూర్చుచు గట్టెదన్ మొలకు నే మత్తేభ వృత్తంబులన్*
*ఫణులన్ నిల్పెద కంఠభాగమున సంప్రాప్తించ కైలాసమే*
*సాంబావేతును పీఠమున్ తమకు నే శార్దూల వృత్తంబులన్*
*యంబా! యందును కావుమయ్యనను మీ యర్ధాంగి తో వచ్చిటన్*
*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*
తొలగించండిజీపీయెస్ వారు
దత్తపది ఐతే ఓకేయా ? !)
జిలేబి
శ్రీహర్ష గారి విషమ వృత్తం బాగున్నది. అయితే నాకు తెలిసినంత వరకు విషమ వృత్తాలలో నాలుగు పాదాలకూ ప్రాసమైత్రి పాటించవలసి ఉంటుంది. పై పద్యంలో రెండు రెండు పాదాలకు ప్రాసమైత్రిని పాటించారు.
తొలగించండిజిలేబీ గారూ:
తొలగించండిన్యస్తాక్షరి, దత్తపది, నిషిద్ధాక్షరి,...జీడి పప్పు, బాదం పప్పు, మామిడి టెంక లాటివి నాకు...పళ్ళూడిన వాడిని...
👇👇👇
తొలగించండిభలే మీరే పదాల నెన్నుకున్నారు
జీడి బాదాము మామిడి జిలేబి అందుకోండి దత్తపది :)
చీర్స్
జిలేబి
మామలు నత్తగారులను, మామిడి టెంకలు జీడిపప్పులన్,
తొలగించండిభామిని బంధులన్ , ముదురు బాదము పల్లులు వక్కలేలకుల్,
లేమలు శ్యాలులన్, భళి జిలేబులు లడ్డులు ఘట్టివౌవడల్...
మోమున దంతముల్ సడలి ముచ్చట తోడను వీడినానహా!
తొలగించండిభలే వారండి మీరు
శివస్తుతి కి దత్త పది నిస్తే యిట్లా పద్యం కడితే యెట్లాగు ?
జిలేబి
"చిదానంద రూపః శివోహం శివోహం"
తొలగించండి
తొలగించండిఓ బీలేజీ ! డిమ్భక!
జాబిల్లమ్మా మిడిగొను చండునికిన్ ! తా
బాబా దముకుకు, వేల్పు జి
లేబీ కి నమస్కృతి నిడు లెమ్మ! శివోహం !
జిలేబి
మాన్యశ్రీ శంకరయ్యగారు!
రిప్లయితొలగించండిశివరాత్రి పర్వ దినాన శివస్తుతి చేసే భాగ్యము,వందల మందితో పంచుకునే అవకాశం కల్పించి నందులకు శతకోటి ధన్యవాదాలు, వందనాలు!
శ్రీకరుండగు శంభు,వి*శి*ష్టుఁదలతు,
రిప్లయితొలగించండిపాప నాశంకరుని భక్త* వ*రదుఁగొల్తు,
రాజితంబుగ నే శివ*రా*త్రి వేళ
దేవదేవుడు శివుడు ధా*త్రి*ని రహింప!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిశిరము మీదను శశిరేఖ; చేతిలోన
రిప్లయితొలగించండివహ్ని; గళమందు వాసుకి; జహ్ను కన్య;
రాణి శివకామ సుందరి; రమ్య డమరు;
త్రిణయన! నటరాజ! యభవ! ప్రణతులివియె.
జనార్దన రావు గారూ! నన్నయ గారు ఆంధ్ర శబ్ద చింతామణి లో "ఆద్యోవళి:" అన్నారు. కనుక మొదటి అక్షరము యతి.
బాపూజీ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను పాదాదిని ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 'యత్యక్షరం' అనికాక 'యతిస్థానం'లో ఉంటే సందిగ్ధతకు తావుండేది కాదు. అందువల్ల కవిమిత్రులు న్యస్తాక్షరాలను పాదాదిని కాని యతిస్థానంలో కాని ప్రయోగించినా అంగీకరిస్తాను. ధన్యవాదాలు!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: న్యస్తాక్షరి , *శి* *వ* *రా* *త్రి* అనే నాలుగు అక్షరాలను నాలుగు పాదాలలో యతిస్థానములలో నిలిపి పద్యం వ్రాయాలి.
విషయం :: *శివ స్తుతి*
ఛందస్సు :: తేటగీతి లేదా ఆటవెలది.
సందర్భం :: మహాశివరాత్రి పర్వ దినాన మహాదేవుడైన పరమశివుని మనసారా భక్తి ప్రపత్తులతో పూజిస్తూ నల్లని కంఠంతో విరాజిల్లే ఓ శితిగళా ! నాకు శివము (మంగళము) కలిగేందుకోసం నిన్ను స్మరిస్తాను. సులభంగా వరములిచ్చే ఓ శివా ! భక్తితో నీ స్తుతి చేస్తాను. ఈ శివరాత్రి నాడు నీ నామ జపంతో జాగారం చేస్తాను. ఓ చంద్రమౌళీ ! ఓ ముక్కంటీ ! ఓ త్రిపురాంతకా ! నాకు నీవే దిక్కు అని నిన్నే కొలుస్తాను అని శివుని స్తుతించే సందర్భం.
ఇచ్చిన అక్షరాలను యతిస్థానములందు మాత్రమే కాకుండా పాదముల మొదట కూడా ఉంచి పద్యపూరణ చేయడం జరిగింది.
*శి* తిగళా ! నిను దలచెద *శి* వము గల్గ,
*వ* రద ! జేసెద భక్తి త *వ* స్తుతి , శివ
*రా* త్రి జాగర ముండెద, *రా* జమౌళి !
*త్రి* నయనా! నిన్నె గొలిచెద *త్రి* పురవైరి !
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు* (13-2-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
చిత్తశుధ్ధి తోడ సతము శివుని దలచి
రిప్లయితొలగించండిభక్తిమీరగ గొలువరె వసుధ జనులు
రహిత మొనరించు నట భవరాశి నంచు
సకల జనులు నమ్ముదురిల త్రికరణముగ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని దర్శించి భక్తితో శివుని గూర్చి
రిప్లయితొలగించండివల్లె వేయుచు శివ నుతు ల్ వరలు చుండి
రమ్య శివ కథ లాలించి రాత్రి యంత
త్రిపుర సుందరు స్మరణ ధాత్రి ధ్వని oచు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేయ పూజలు మనసార శివుని దలచి
రిప్లయితొలగించండిభక్త వత్సలుడ వనుచు వరము లిడగ
రాజ భోగము లొద్దని రాయి వైన
త్రిజగ ములపా లించెడి త్రిగుణ భవుడ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భోగముల్ వద్దని" ఆనండి. అలాగే "త్రిజగములను పాలించెడి" అనండి. లేకుంటే గణదోషం.
చేయ పూజలు మనసార శివుని దలచి
తొలగించండిభక్త వత్సలుడ వనుచు వరము లిడగ
రాజ భోగముల్ వద్దని రాయి వైన
త్రిజగ ములను పాలించెడి త్రిగుణ భవుడ
శివుడు సత్యము సర్వము; శివుడె మాయ;
రిప్లయితొలగించండివదలు బంధాలు జన్మలు వాని గొలువ;
రాయిలోనెగాదుచరాచ రమున గలడు;
త్రిణయనునిగొల్వ కష్టాలు తీరు నయ్య.
శ్రీనాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిచేతు లారంగ దళముతో శివుని పూజ
వరమగు, కడుపే కైలాస వక్కటగును.
రాజరాజ నరేంద్రుడు రాము కైన
త్రిగుణ సంధ్యాత్రి వేద బుత్రి సుతు కలుగు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కైలాస వక్కటగును'...? చివరిపాదం అర్థం కాలేదు.
శిరము శోభిలగ శశిసురగంగ నగము
రిప్లయితొలగించండివరల నిఖిల జనని వధువుగాను
రాజిత సితి కంఠు రాత్రిగొలువ దీర్చు
త్రిప్పటలను తిరము త్రిజగములకు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ! నేను కూడ ఆద్యక్షరాలు, యత్యక్షరాలు” శివరాత్రి “గా వ్రాశాను! మీరు అందరివీ గుర్తించారు! నన్ను గుర్తించలేదు!
తొలగించండివిద్యార్ధి మనస్తత్వము పోలేదు!😄😄😄🙏🙏🙏🙏🙏
నిజమే సుమా... గమనించలేదు. మన్నించండి.
తొలగించండిమీ పద్య రచనా ప్రావీణ్యం ప్రశంసనీయం.
అయ్యో! అంత లేదులెండి ! ఏదో చిన్నతనం పోక అడిగాను! నా సామర్ధ్యం నాకు తెలుసు! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🕉🌹నమశ్శివాయ🌺 🙏
శ్రితజనావన ! శంకరా ! శివ ! భవ ! హర !
భవహరా ! నీలకంథర ! వరశుభాంగ !
రమ్యతాండవలోల ! తారాధినాథ
దివ్య భూషణ ! మ్రొక్కెద ! త్రిభువనపతి !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పూర్తిగా శివ సంబోధనలతో మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశివము లొనగూర్చఁ కైలాసశిఖరి వీడి
రిప్లయితొలగించండివరము లొసగగ హిమశైలవసతిఁ గొనచు
రాజరాజేశుడై వెల్గి రాణ మీర
త్రినయనుండు గావుత మిము త్రిపురహరుడు
రామాచార్య గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వసతిఁ గొనుచు' టైపాటు.
అవునండి గమనించలేదు
తొలగించండిక్షంతవ్యుడను.
శి-వశివశివ యనుచు శి-తికంఠు దలచిన
రిప్లయితొలగించండివ-రములనిడు గాదె వ-ర్ధనుండు
రా-త్రి జాగరించి రా-జధరు గొలువ
త్రి-మ్మటలనెడపును త్రి-పురవైరి..!!!
శ్రీకరముగ శివుని శి-వరాత్రి దినమున
భక్తితోడ గొలువ వ-రము లిడును
రక్షనీవె యనుచు రా-త్రి జాగరమున్న
దెప్పరముల దీర్చు త్రి-నయనుండు..!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ముఖ్యంగా మొదటి పూరణలో న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించడం ప్రశంసనీయం.
ధన్యవాదములు గురువుగారు....
తొలగించండిమిత్రులందఱకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశితిగళా! పరమేశ్వరా! శివ! మహేశ!
వహ్నిలోచన! కరిచర్మవస్త్రధారి!
రాజశేఖర! రాజేశ్వరా! కపర్ది!
త్రిపురవైరి! ధూర్జటి! హరా! త్రిణయన నతి!
స్వస్తి
మధుసూదన్ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగిస్తూ సంబోధనాత్మకమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిచేసి నంత నౌర శివపూజ భక్తితో
రిప్లయితొలగించండివచ్చి గాతు వంట వరము లొసగి
నీవ కృపను జూప రావవే కష్టాలు
దీవెనలిడి కావు త్రినయన! హర!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఓం నమశ్శివాయ.
చిన్న మాట నరుడ శివరాత్రి నాడైన
ఫాలనేత్రు, శూలి వసన రహితు
చేరి దలచి గొలిచి రార హరాయన
ధరణి తాను బ్రోచు త్ర్యంబకుండు
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'త్ర్యంబకుండు' అంటే నియమోల్లంఘన అవుతుంది. అక్కడ 'జనులనెల్ల బ్రోచు త్రినయనుండు' అందామా?
మాస్టరుగారూ! ధన్యవాదములు.
తొలగించండిచిన్న మాట నరుడ శివరాత్రి నాడైన
ఫాలనేత్రు, శూలి వసన రహితు
చేరి దలచి గొలిచి రార హరాయన
ధరణి తాను బ్రోచు త్రినయనుండు.
మాస్టరుగారూ! మీకు మరియు ముఖాముఖిని ప్రసారము చేసిన వారికి అభినందనలు.
రిప్లయితొలగించండిhttps://www.youtube.com/watch?v=Vxnid3m-PDI&feature=share
పొత్తపుటాలోచనయే
చిత్తములో మెదలె మీకు శ్రీకరముగనే
విత్తము సమకూరునులే
మొత్తము కవి మిత్రులంత "మోదము" దెలుపన్.
ధన్యవాదాలు శాస్త్రి గారూ!
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
గు రు భ్యో న మః అందరికి శివరాత్రి శుభా కాంక్షలు నమస్తే
LINES లేని కారణంగా అదివరకు పూరణ పంపించుట ఆలస్యమైనది
" క్షమించాలి " అనృతమ్ముల్గడునేర్పునన్బలుకు వాడారాధ్యుడౌ సత్సభన్
-----------------------------------------------------------------------------
మును సాహాయ్య మొనర్చి నట్టి హితునిన్ మోసమ్ము గావించుచున్
వినతున్ జూచిన లెక్క సేయక గడున్ వేదించి దూషించుచున్
ధన మాశించుచు సాటి మానవుల హత్యన్ జేయ నూహించుచున్
తన ప్రేమన్ నిరసించు బాలికల నత్యాచార మొందించుచున్
తన స్వార్థంబున కెంత ఘాతుకము నైనన్ జేయ యత్నంచుచున్
అనయమ్ము న్ననయమ్ములే సలుపు - దౌష్ట్యాకారి యై , ధాత్రి పై ,
మను నీ మర్త్యు డసత్యవాక్యమును సంభాషింప మేలే కదా !
అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకు వా డారాధ్యు డౌ సత్సభన్ !
జనులన్ మూర్ఖుల జేసి " ఓట్లు " కొని , దేశం బందు దుర్నేత లే
మన సౌభాగ్యము దోచుచున్ సభలలో మాటాడరే బొంకులన్ ? ? ?
{ అనయము = నిత్యము , పాపము ; మనసౌభాగ్యము = మన దేశ
సౌభాగ్యము }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిఆలస్యమైనా అద్భుతమైన మత్తేభమాలికతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
శంకర స్తుతి
రిప్లయితొలగించండిచిత్తశుద్ధి లేక శివుని పూజలు మాని
వదలి వేసి వేల వందనములు
రాత్రి బవలు శంకరాభరణము నందు
తిరుగుచుందు నేను త్రిపుటి లోన
...త్రిపుటి = జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలు
శంకరయ్యగారి శిష్యులగుటమేలు
తొలగించండిపనికిరాని పనులు వదలివేసి
రమ్యమగు కవితలు రాత్రివేళలలోన
తీర్చగాను మెచ్చు త్రినయనుండు!
మొదటి పాదం యతి సవరించవలయును
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆత్మాశ్రయమైన పూరణ బాగున్నది. అభినందనలు.
******
సీతాదేవి గారూ,
'శిష్యులగుట'ను "ఛాత్రులగుట" అనండి. యతిదోషం తొలగిపోతుంది.
ధన్యవాదములు గురుదేవా!
తొలగించండిసవరించిన పూరణ:
శివనామ ధరుని శిష్యులగుల మేలు
పనికిరాని పనులు వదలివేసి
రమ్యమగు కవితలు రాత్రి వేళలలోన
దీర్చగాను మెచ్చు త్రినయనుండు!
🙏🙏🙏🙏
శివ శివాయనుచు వేడెద శివ యొసంగు
రిప్లయితొలగించండివరములను నీదు భక్తియె వర్ధిలంగ
రాజితమ్ముగ జ్ఞానవైరాగ్యములను
త్రికరణమ్ముగ నొసగుమా త్రిపురనాశ!
భాస్కరమ్మ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "శివా యని వేడెద" అనండి. "శివ మొసంగు" అని ఉండాలనుకుంటాను!
క్షేమములనీయనిరతముశివునిగురిచి
రిప్లయితొలగించండిభక్తిమీరగగొలిచెదవరదభవుని
రండిమీరలుశుచితోడరాత్రికిమరి
దీవనలలందుకొనగనుద్రిపురహరుని
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"దీవెనల నందుకొనగను త్రిపురహరుని" అనండి.
రిప్లయితొలగించండిఆ. వె. చిద్విలాసరూప! శిఖివిభూషలలాట!
వాగధీశప్రణుత! వజ్రివంద్య!
రాజరాజపూజ్య ! రామలింగేశ్వర !
త్రిపురనాశ ! పాహి త్రిదశనుత !
విశ్వనాథ శర్మ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది.
మొదటి పాదాన్ని "శివకరా! త్రినేత్ర! శిఖివిభూషలలాట!" అంటే బాగుంటుందేమో?
చివరి పాదంలో "త్రిదశ నుత"లో ఒక అక్షరం లోపించింది. "త్రిదశ వినుత" అంటే బాగుంటుందేమో...చూడండి.
తొలగించండిపూ.శంకరయ్యగారికి, మధుసూదన్ గారికి వందనములు . మీసూచనలు బాగున్నవీ.ధన్యవాదములు.
తొలగించండిశుభా కాంక్షలు
రిప్లయితొలగించండిశివరాత్రి పర్వ దినమున
సవినయముగ వేడు కొనుదు సహ చరు లగమిన్
శివ నామము జపియించుడు
భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్
__/\__
తొలగించండి"వేడుకొందు" ఆనండి.
సవరణలతో..
రిప్లయితొలగించండిచిలువ హారమకట *శి*రముపై గంగమ్మ
వనిత యర్థమందు *వ*రలు చుండు
రాగమంట నీకు *రా*మనామమనిన
దేవ! కావు మయ్య *త్రి*పుర వైరి
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివమును గొన నిను కొలుతు శిరసు వంచి
రిప్లయితొలగించండివరద! భక్త వత్సల! యీశ! వరములిమ్ము
రాతిరి భజియించితి నిన్ను రాణ తోడ
త్రినయన ! తెరువుఁ జూపు ధాత్రి విడనాడ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిత్తశుద్ధి గలిగి నేడు శివుని గొలువ
రిప్లయితొలగించండిభక్తి పూర్వకముగనె పవలును రాత్రి
ప్రార్థనలు జేయగా శంకరాయనుచునె
తీరు గోర్కెలు నిజము ధాత్రి జనులకట
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీద మాఘ కృష్ణ చతుర్ద(శి)దిన మా య
రిప్లయితొలగించండిమరవర యుత (శి)వానంద (వ)రద నిత్య
ధామవర (శివ) భవ్య వి(రా)మ సద్గ
తినిఁ బ్రసాదించెడు(శివరాత్రి) శుభకరము
శి
శివ
శివరా
శివరాత్రి
కైలాసాగమ నిత్య నర్తన లసత్కాత్యాయనీ కేళి లీ
లాలో లాది వినోద తోషిత మనోల్లాసప్రభా విగ్రహా!
కాలాలోకన దగ్ధ మన్మథ! పురాకారాసురఘ్నా! శివా!
ప్రాలేయాంశు విరాజమాన వర మూర్ధా! శంకరా! కావవే
యత్యక్షరమన యతికి మైత్రి కూర్చునక్షరముగా భావించి పూరించితిని. యుక్తాయుక్తములను తెలుప గోర్తాను.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది.
దాని ననుసరించిన మీ శివస్తుతి మనోహరంగా ఉన్నది.
అభినందనలు.
యత్యక్షర విషయంలో మీ భావన యుక్తమే. నేను ఆ అభిప్రాయంతోనే ఇచ్చాను. బాపూజీ గారు 'ఆద్యో వళిః' సూత్రాన్ని గుర్తు చేశారు. అందువల్ల రెండు విధాలనూ ఆమోదిస్తున్నాను. కొందరైతే రెండు విధాలుగా ప్రయోగించారు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిశిశిరకరుడు గంగ శిరమున శివమిడ
వలిమల సుత మేన వరము లిడగ
రాజిత పదయుగలి రాజిల్ల నటరాజ
త్రినయన మము గావు త్రిపురవైరి
గుగురుదేవుల కవిమిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాజిత... రాజిల్ల' అని పునరుక్తి. "రాజిత పదయుగళి రాణింప..." అందామా?
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిసవరించిన పూరణ :
శిశిరకరుడు గంగ శిరమున శివమిడ
వలిమల సుత మేన వరము లిడగ
రాజిత పదయుగలి రాణింప నటరాజ
త్రినయన! మము గావు త్రిపురవైరి!
గిరిజ వామమందు శిరమందున గంగ
రిప్లయితొలగించండినుదుట కన్ను శాంతి వదన మందు
నఱ్ఱున గరళము కరాబ్జమున డమరు
త్రిశిఖ ధారి గాచు త్రిభువనముల
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం చివర గణదోషం. "శిరమందు గంగమ్మ" అందామా?
శితివపుషుడనంగరిపుడు,శివకరుడు,భు
రిప్లయితొలగించండివనపతి,ఘనపింగళజటవలయధరుడు,
రామసంసేవ్యితుఁనిరతరామజపుడు,
త్రిపురదళణుడితడుభవుఁ,త్రినయనుడును...
తండ్రి పుత్రుని పొగిడిన ఆయుఃక్షీణము.. అదే పుత్రుడు తండ్రిని పొగిడితే ఆయుర్వృద్ధి. జగముకంతటికీ తల్లిదండ్రులు అయిన శివశక్తులను స్తుతించి మనమందరమూ ఆయురారోగ్యాలు పొందెదము గాక..
శంకరయ్య గారి శంకరాభరణం మరింత వినుతికెక్కుగాక.
తథాస్తు..
వెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జటవలయ' మనరాదు. అది "జటావలయధరుడు".
అలాగే సార్. ధన్యవాదాలు..
తొలగించండిమీ interview చూశాను. చాలా బాగుంది..
శివశివాయనంచు శివపూజ జేసిన
రిప్లయితొలగించండివరము లొసగు భక్తవరదుడతడు
రాగరహితుడతడు రాజీవనేత్రుడు
త్రిగుణ నిర్గుణుండు త్రినయనుండు
యస్వీయార్ గారూ,
తొలగించండిన్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవా!🙏🙏🙏
తొలగించండిధన్యోస్మి గురుదేవా!🙏🙏🙏
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
శివ ! మహేశ ! దయాంబురాశి ! శశిధర ! భ
వహర ! గంగాధరా ! త్రిదివనుత గుణ ! హ
రా ! వినీలకంఠా ! బ్రోవ రావ దేవ !
త్రిభువనపరిపాలక ! భవ ! త్రిపుర వైరి !
శిఖలయందు పట్టె శివమెత్తు గంగమ్మ
రిప్లయితొలగించండివలపురాయు జంపె వహ్నికన్ను
రాచవిషము మ్రింగె రాబట్ట క్షేమంబు
త్రిపురవైరి గొలుతు త్రిపుటి యందు!
త్రిపుటి చేత కూడ
తొలగించండిమనోవాక్కాయ కర్మల!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆ.వె.
చెదరని మదిదోడ శివరాత్రినందున
వదలక నిను గొల్చి వఱలు నాకు
రక్షి వగుము సతము రాజధరుడవైన
త్రినయనా! భగాలి! త్రిపురవైరి!
శవ !భవ హర !రుద్ర !శితి కంఠ !మల్లేశ !
రిప్లయితొలగించండివర గుణేశ ! చర్మ వ సనధారి !
రాజమౌళి !మహి త రాజ రాజేశ్వర !
త్రిగుణ శక్తీ దాయి ! త్రిపుర వైరి !
శివ తో ప్రారంభ మ్ అని సవరణ
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిత్తమందు సేవించుచు శివ శివ యన
రిప్లయితొలగించండిభక్త కోటిని కరుణించి వరము లొసగ,
రాజశేఖరుండా నీదె రాజ ముద్ర!
దీవన లిడ కొల్తు శివరాత్రి దినమందు!
పరమేశ్వర ప్రీత్యర్థం పంచచామరం సమర్పయామి..
రిప్లయితొలగించండివరించె తాను శాంభవీ,సభాస్థలిన్ నటింపగా
విరించి చేరె దాల్మితో,భవేశ నిన్ నుతింపగా
వెరించినాంధకున్ భళా!సువేశినిన్ హరింపగా
మురారికైనశక్యమే,అమూర్త!మిమ్ము నెంచగన్..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ.వె:శేఖరముగ సిగను శిశిరకరుని దాల్చు
రిప్లయితొలగించండిభక్తసులభుడితడు వరము లొసగు
రమణి తోడ తాను రాణించు పదముల
తిరముగ కొలువుండు త్రిపుర హరుడు.
ఆ.వె: చిత్త శుద్ధి తోడ శివ పూజను చేయ
వరము లొసుగు చుండు వసుధ యందు
రాత్రియుపవసించి రాగయుక్తముగను
త్రిపుర హరుని గొలువ త్రికరణముల.
ఆ.వె: శివుని కొలువ మనకు శివముకలుగు చుండు
భక్త వత్సలుండు వరప్రదాయి
రాముడితని కొలిచెరావణుండును కొల్చె
త్రినయనుండితండు త్రిపుర హరుడు.
ఆ.వె: సేమమొసగు నెపుడు శివుని నామ స్మరణ
వాసిగాను జనులు వసుధ యందు
రహిని కూర్చు చుండు రమ్యముగా నిల
త్రినయనుండు శూలి త్రిజట ధారి
ఆ.వె:శివ శివ యనుచుండ శీఘ్రమే కరుణను
వసుధలోన చూపు బంధ హరుడు
రార భక్త పోష రమణీయముగ నిట
త్రిపురహర యనంగ దీవనొసగు.
ఆ.వె :సేవలకును మెచ్చు శివశంకరుడితడు
బంధము లను బాపు వసుధ యందు
రజత గిరిని వెలసి రామ తో సతతమ్ము
తిరుగు చుండు తాను త్రిపుర హరుడు.