5, ఫిబ్రవరి 2018, సోమవారం

మత్స్యావతార బంధ తేటగీతి లో శ్రీ హరి ప్రార్ధనమనువును, మునులను, మనుజుల ననువుగ, 
హనమున నయించి  ఘనముగ తనువును నిడు
దగ నడపి నిడుజడిన ముదముగ వనధి
న గమనమిడి నభవమున నరసిన  నమి
 నిలుపు గల హరి నమసము సతము నిడెద.
  
నడపు = చేయు; నిడుజడి = విడవని వాన; వహనము = ఓడ; నయించు = చేర్చు; నిడుద = దీర్గము; 
వనధి = సముద్రము; అభవము = ప్రళయము; అరయు = రక్షించు; నిలుపు = రూపము.
రచన -
పూసపాటి కృష్ణ సూర్యకుమార్

2 కామెంట్‌లు:

 1. సూర్య కుమార్ గారు మీ మత్స్యావతార బంధ తేటగీతిక సర్వలఘు విలసితమై యొప్పారు చున్నది.
  అయితే “అనిమిష నిలుపు” దుష్ట సమాసము. “అనిమిషపు నిలుపు” అంటే సాధువు.
  ఆఖరు పాదములో యతి గణములు సరిపోలేదు. అనిమిషపు గా మార్చిన యతి సరిపోతుంది. హరి యనిన హరికి అని అర్థము రాదు. హరిని అని వస్తుంది.
  వనధిని సాధువు. అప్పుడు యతి భంగము. నెరసిన (నరసిన కు బదులు ) యనిన యతి సరిపోవును.
  ...నమి
  షపు నిలుపు గల హరి నమసములు గొనుమ
  అనిన బంధములో నిముడునేమో చూడండి.

  రిప్లయితొలగించు
 2. కామేశ్వర రావు గారికి నమస్కారములు హృదయ పూరవక ధన్యవాదములు మీరు చెప్పిన విషయములు ఒక్కసారి చూచి చిత్రములో సరిదిద్దతాను సర్వకాలములలో ఇట్టి సూచనలు నాకు కావలయును నన్ను సరి ఐయిన పంధాలో నడిపిచగలరు . మరొక్క మారు ధన్యదములు

  రిప్లయితొలగించు