ప్రభాకర శాస్త్రి గారూ, అసలే నాలుగు నోళ్ళ వాగుడు. ఎవరు మాత్రం భరించగలరు? మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పడుచున్+అతి = పడుచు నతి..' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "పడుచు। న్నతి వాగుడుతో..." అనండి.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ భక్త జనుల కోర్కెలు తీర్చు వారే. అయితే, అమ్మవారి పద్ధతిలో అయ్యవారు సరసాలాడుతూ, కార్యాన్ని సానుకూలం చేస్తూ తద్వారా భక్తులకు జ్నానోదయం కలిగిస్తూ ఉంటారు కదా!
సతతము భక్తుల కోర్కెలు శతవిధముల తీర్చు దేవి శంకరి యనుచున్ వితమున బల్కుచు గౌరీ పతి సరసములాడగ సతి పరువులు వెట్టెన్.
వామన కుమార్ గారూ, మొన్న మొన్నటిదాకా మిత్రులను అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా చేయడమో, అర్థరాత్రి మేల్కొల్పడమో జరిగేది. ఈ మధ్యనే మిత్రుల కోరికపై ఉదయం ఐదింటికి షెడ్యూల్ చేస్తున్నాను. మీ పద్యం బాగుంది. 'సంధానం, ప్రధానం' అని వ్యావహారికాలను ప్రయోగించారు. మూడవ పాదం మూడవ గణం జగణ మయింది. అది నిషిద్ధం కదా! నాల్గవ పాదం ప్రారంభంలో గణదోషం.
చితికెను జీవితమ్ము సయి చెంగట గంపెడు బిడ్డ లాయెరా పతి సరసమ్ములాడ! సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో బతుకును సాగ దీయ! మన భారత దేశపు రూపు రేఖల య్య!తరుణు లెల్ల బంధితులు యాంత్రిక జీవన మందు నేడిటన్ !
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2603 సమస్య :: *పతి సరసమ్ము లాడ సతి పర్వులు వెట్టె న దేమి చిత్రమో ?* భర్త సరసాలాడుతుంటే భార్య పారిపోతూ ఉంది అనడం ఈ సమస్యలో ఉన్న విచిత్రమైన సన్నివేశం. సందర్భం :: తండ్రి యైన దక్షుడు చేసిన *శివనింద* ను భరించలేక యోగాగ్ని కల్పించుకొని శరీరమును దహింపజేసికొనిన సతీదేవి మరుజన్మలో పార్వతిగా జన్మించి ఆ పరమశివునే మరలా భర్తగా పొందగోరి తండ్రి యనుమతితో తపస్సు చేయడం ప్రారంభించింది. అప్పుడు జగత్పతి యైన శివుడు ఒక బ్రహ్మచారి వేషంలో ఆమెను సమీపించి కలువ వంటి కన్నులు గల ఓ సుందరీ ! గౌరీ ! ఆ శ్మశానవాసిని భర్తగా పొందగోరి తపస్సు చేస్తున్నావా ? ఐతే నీ గతి అధోగతే. అంటూ (తన భార్యతో) సరసాలాడుతుంటే తాను మరలా *శివనింద* వినవలసి వచ్చిందే అని పార్వతి అక్కడినుండి పారిపోయేందుకు సిద్ధమైన సందర్భం.
సతియె జనించి పార్వతిగ , శంకరు భర్తగ గోరి , తండ్రి స మ్మతి దప మాచరింప ; తన మానిని జేరుచు బ్రహ్మచారిగా ‘’ నతివ ! శ్మశాన వాసిని, మహా శివు గోరిన యుత్పలాక్షి ! సం స్తుతమతి ! గౌరి ! నీ గతి యధోగతి సుందరి ! ‘’ యంచు నా జగత్ *పతి సరసమ్ము లాడ సతి పర్వులు బెట్టె నదేమి చిత్రమో ?* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-2-2018)
చాలా రోజుల వియోగము తర్వాత భార్యను చూడడానికి అత్తారింటికి వచ్చి, అతురతతో పిలువంగ పతి, సరసము లాడగ సతి పరువులువెట్టెన్! అన్న అర్ధం వచ్చేట్లు వ్రాయవచ్చునా?
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొక్క మ్రానైనది. అంతేకాదు.... దానికి ఉత్పల చంపకాలు పూస్తున్నవి. శార్దూల మత్తేభాలు ఆ మ్రాను క్రింద స్వేచ్ఛావిహారం చేస్తున్నవి. సంతోషం!
కవిమిత్రులారా, నమస్కృతులు. ఆరు రోజులు నిరంతర ప్రయాణాలు చేసి ఈ ఉదయం నెలవు చేరాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసాను కదా.. నిద్ర లేమి.. అలసట... ఒంటి నొప్పులు... రేపటి నుండి చురుకుగా పాల్గొంటాను. ఈరోజు కూడా నన్ను మన్నించి సెలవివ్వండి.
ఉమాదేవి గారూ, మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం. మూడవ పూరణలో 'చక్కగా కోలన్'...? అక్కడ గణదోషం కూడా! ఐదవ పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
సందర్భము... శ్రీ కృష్ణునే ప్రాణపతిగా భావించి నిరంతరం కృష్ణ ధ్యానంలో మునిగిపోయి దివ్యానందా న్ననుభవించే భక్తురాలు *మీరాబాయి.* ఆమె భర్తమాత్రం అశాశ్వతమైన దేహంపట్ల మోహం వదలని సామాన్యుడు. అతడు సరసా లాడితే ఆమె పరుగులు పెట్ట కేం చేస్తుంది మరి! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సతతము మాధవ చింతన
సందర్భము... మహా భారతంలోని పాండురాజు కథ జగద్విదితం. కుంతి, మాద్రి అతని భార్యలు. భార్య వద్దకు వెళితే మరణిస్తా వన్న ఋషి శాపం అతని కున్నది. అత డొకనాడు నిగ్రహాన్ని కోల్పోయి మాద్రితో సంగమించి కన్ను మూస్తాడు. ఆ సందర్భ మిది. సరసాలాడుతుండగా డామె భయపడి పరుగులు తీసింది. భర్త ఆయుస్సు తన మాంగల్యం భౌతిక సుఖాలకన్న మిన్న కదా! ~~~~~~~~~~~~~ సతి గూడినంత తన పతి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతి సుందర శునకముతో
రిప్లయితొలగించండిపతి సరసము లాడఁగ ,సతి పరువులు వెట్టెన్
మతిపోయిన దాని వలెను
అతి భయమున శునకము గని యాందోళనతో
హమ్మయ్య!
తొలగించండిఈ సారి పరుగు పందెములో ఫస్టొచ్చాను..
ఆయసమొచ్చె ఉరికురికి..
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వలెను+అతి = వలె నతి' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "దానివలె। న్నతి భయమున..." అనండి.
అతిగా వేదములు పలికి
రిప్లయితొలగించండిచతురతతో సృష్టి జేసి చతికిల పడుచున్...
అతి వాగుడుతో విద్యా
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్ :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅసలే నాలుగు నోళ్ళ వాగుడు. ఎవరు మాత్రం భరించగలరు? మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పడుచున్+అతి = పడుచు నతి..' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "పడుచు। న్నతి వాగుడుతో..." అనండి.
🙏🙏🙏
తొలగించండిగతుకుచు వెల్లులిపాయలు
తొలగించండిపితుకుచు బర్రెల స్తనములు పీల్చుచు నికొటి
న్నతులిత మోహన రబిడీ
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
అతి సుందర శునకముతో
రిప్లయితొలగించండిపతి సరసము లాడఁగ ,సతి పరువులు వెట్టెన్
మతిపోయిన దాని వలెన
నతి భయమున శునకము గని యాందోళనతో
మొదటి పూరణమే బాగున్నది.
తొలగించండిమతిలేని మగడొకడపరి
రిప్లయితొలగించండిసతి తన పుట్టిల్లు వెడల,సంత పడతితో
సతతముగ లీలలు సలుపె.
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
"సలిపె" అని చదువ ప్రార్ధన
తొలగించండివెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మతిలేని మగం డొకపతి' అనండి.
అలాగే సార్, ధన్యవాదాలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచతురతఁ బంచ నెంచి కలశమ్మును జేకొని , మోహినీ శుభా
కృతిఁగొని విష్ణువున్ జన ., వరించి , రమింపగ , నెంచి వెంటరాన్
శితిగళుడున్, త్రినేత్రుడును , జిత్తజవైరియు , శూలి , శైలజా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మెతుకులకు దిక్కులేదిట !
తొలగించండిసుతులేడుగురైరి యింట ! చూడగ మోహం
బతియయ్యె ! నింక చాలని
పతి సరసము లాడగ సతి పరువులు వెట్టెన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినుతి జేయుచు తన సతితో
రిప్లయితొలగించండిపతి సరసము లాడఁగ ,సతి పరువులు వెట్టెన్
మతి లేదా మీకనుచును?
వ్రతము సమాప్తమగు వరకు వలదని నుడివెన్
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శతశృంగపు గిరి మీదను
రిప్లయితొలగించండిమతి దప్పిన పాండువిభుడు మదనుడు వేచన్
మృతి మరచుచు మాద్రి గనియె ;
పతి సరసములాడగ సతి పరువులు వెట్టెన్ !
బాపూజీ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిఅతుకుల బొంతగ జీవిత
ము తునియగన్నెల్లపుడు విముక్తియు లేకన్
సతతము వెనువెంబడి "ఆ
పతి" సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్!
*ఆపతి - ఆపద ఆపత్తు
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ భక్త జనుల కోర్కెలు తీర్చు వారే. అయితే, అమ్మవారి పద్ధతిలో అయ్యవారు సరసాలాడుతూ, కార్యాన్ని సానుకూలం చేస్తూ తద్వారా భక్తులకు జ్నానోదయం కలిగిస్తూ ఉంటారు కదా!
రిప్లయితొలగించండిసతతము భక్తుల కోర్కెలు
శతవిధముల తీర్చు దేవి శంకరి యనుచున్
వితమున బల్కుచు గౌరీ
పతి సరసములాడగ సతి పరువులు వెట్టెన్.
వితము=ఉపాయము
రిప్లయితొలగించండివామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొద్దున్నే లేచే పాడు అలవాటు నాతో పాటు చాలా మందికి ఉన్నదన్న మాట!
రిప్లయితొలగించండిపొద్దున మరి అయిదింటికి
సద్దులు సేయక పద్యపు శరసంధానం
బద్ధకముగ నిద్ర పోవు
బుద్ధిజీవి మితృలకిట బుద్ధి ప్రదానం.
👌👌
తొలగించండికందమునకు ఎన్నియే కన్నములు..
తొలగించండికాంచితివా..ఆచార్యా...
వామన కుమార్ గారూ,
తొలగించండిమొన్న మొన్నటిదాకా మిత్రులను అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా చేయడమో, అర్థరాత్రి మేల్కొల్పడమో జరిగేది. ఈ మధ్యనే మిత్రుల కోరికపై ఉదయం ఐదింటికి షెడ్యూల్ చేస్తున్నాను.
మీ పద్యం బాగుంది. 'సంధానం, ప్రధానం' అని వ్యావహారికాలను ప్రయోగించారు. మూడవ పాదం మూడవ గణం జగణ మయింది. అది నిషిద్ధం కదా! నాల్గవ పాదం ప్రారంభంలో గణదోషం.
ఎప్పుడు లేపిన నప్పుడు
తొలగించండిచప్పుడు జేయకెనె లేచి చకచక స్నాన
మ్మప్పుడె జేసి రెడీయై
కప్పుడు కాఫీని ద్రాగి కందలు వ్రాతున్
తొలగించండిఇప్పుడు నప్పుడనక నె
ల్లప్పుడు గప్పున జిలేబి లబ్జుగ కథలన్
చప్పున గట్టుచు నప్పటి
కప్పుడు కాఫీని ద్రాగి కందము జేర్చున్ :)
జిలేబి
యతి ఉరికెను పూరణ విని-
రిప్లయితొలగించండి"పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
క్షితిజముగమారుమనుచున్
బతముతొ శపియించె. శాపబాధతొలఁగునే?!
వెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని పూరణ సమర్థంగా లేనట్టుంది. పూరణ విని యతి ఎవరిని, ఎందుకు శపించాడు?
పండిత సభలో పృచ్చకుడు అడిగిన పూరణ విని అటుగా వచ్చిన ఒక యతి సభోచితం కాని ప్రశ్న అనుచూ శపించెను.
తొలగించండి
రిప్లయితొలగించండిచితికెను జీవితమ్ము సయి చెంగట గంపెడు బిడ్డ లాయెరా
పతి సరసమ్ములాడ! సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
బతుకును సాగ దీయ! మన భారత దేశపు రూపు రేఖల
య్య!తరుణు లెల్ల బంధితులు యాంత్రిక జీవన మందు నేడిటన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
మతిలేని మగువ కట్నము
రిప్లయితొలగించండిఅతియాశగ తీసికొనుచు నాలియు జేయన్
శ్రుతిలేని రాగమవ్వగ
పతిసరసము లాడగ ?సతి పరువులు వెట్టెన్ ,
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అతి+ఆశగ = అత్యాశగ' అని యణాదేశం వస్తుంది. యడాగమం రాదు. "అతికాంక్షను" అందామా?
పతిలేని సమయమున పర
రిప్లయితొలగించండిపతి సరసము లాడఁగ ,సతి పరువులు వెట్టె
న్నతి భయమున;పలికెనిటుల
"మతి పోయినదా పిశాచి?మనసే లేదా?
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
*వ్రతమునుజేయుచున్ సతి నివారణగోరుచునష్టమందునన్*
రిప్లయితొలగించండి*మతిగొనిదీక్ష,శ్రీమతిసమంచితపూజలనుండ,జూడకన్*
*వితతప్రలాపకాముకనివేదనజేయుచుబాధపెట్టుచున్*
*పతిసరసమ్ములాడ,సతిపర్వులుపెట్టెనదేమిచిత్రమో*
చేపూరి వారూ,
తొలగించండిచాలా బాగున్నది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిఏ పేపరు చూసినా నేడీ కథలే!
అతలాకుతలంబాయెన్
పతి ;సరసము లాడఁగ సతి, పరువులు వెట్టెన్
పతితుని కనుగొని వేసెన్
కుతకుత లాడుచు నిరువురి కుత్తిక లివిగో!!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో వైవిధ్యమైన పూరణ చెప్పారు. అభినందనలు.
నతజనసంగతార్తిచయనాశకృదుత్సహశూలపాణి,స న్నుతపరభక్తరక్షణచణుండు, విమోహకపారవశ్యసం
రిప్లయితొలగించండిధితసుమబాణహతిఁ దీవ్రత నోపగ లేక పార్వతీ
పతి, సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో?.
రామాచార్య గారూ,
తొలగించండిచక్కని పదశోభతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "సుమపంచబాణహతిఁ" అందామా?
కం
రిప్లయితొలగించండిఅతితెలివిపతి పరసతిని
పతి సరసములాడగ, సతి పరువులు వెట్టెన్
అతివేగము పుట్టింటికి
పతి పతనము నాటి నుంచి ప్రారంభమయెన్
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పతి' పునరుక్తమయింది. 'అతి తెలివి' దుష్టసమాసం. అక్కడ "అతిమోహమున బరసతిని। పతి..." అందామా?
అతి భీకరు నరసింహుని
రిప్లయితొలగించండినుతియించుచు భీతచిత్త నురుగులు గ్రక్కన్
గతి నీవే యని చెంచిత
పతి సరసములాడగ సతి పరువులు పెట్టెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిఆహా! చిన్నప్పటి చెంచులక్ష్మి సినిమాను గుర్తుకు తెచ్చారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతి లేని మగ డొకoడిల
రిప్లయితొలగించండిన తి గా పిచ్చి యు ముద ర గ నా లి ని చేరె న్
మితి మీరి న ప ల్కుల తో
పతి సరస ము లా డ గ సతి పరువు లు వె ట్ టే న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసతతము చెంగును వదలక
తొలగించండి"పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
మతి మాలిన మగడా యీ
కుతి యేలనె; బతుకనేర్చు గోపు గనమనెన్!
కోపు = విధము, దారి
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*******
విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపతి!పతి!పాతి! పాతి!పతి! పంచముఖుండు తథాస్తనంగ నా
యతివకు పంచపాండవులు యంత్రణమయ్యిరి మత్స్య ఛేదన
మ్ముతరముగాన! అక్షపతి ముంగిట వేదిజ నొడ్డగన్ సభా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాతి పాతి'...?
తొలగించండిపాతి - భర్త ఆంధ్రభారతి ఉవాచ
జిలేబి
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2603
సమస్య :: *పతి సరసమ్ము లాడ సతి పర్వులు వెట్టె న దేమి చిత్రమో ?*
భర్త సరసాలాడుతుంటే భార్య పారిపోతూ ఉంది అనడం ఈ సమస్యలో ఉన్న విచిత్రమైన సన్నివేశం.
సందర్భం :: తండ్రి యైన దక్షుడు చేసిన *శివనింద* ను భరించలేక యోగాగ్ని కల్పించుకొని శరీరమును దహింపజేసికొనిన సతీదేవి మరుజన్మలో పార్వతిగా జన్మించి ఆ పరమశివునే మరలా భర్తగా పొందగోరి తండ్రి యనుమతితో తపస్సు చేయడం ప్రారంభించింది. అప్పుడు జగత్పతి యైన శివుడు ఒక బ్రహ్మచారి వేషంలో ఆమెను సమీపించి కలువ వంటి కన్నులు గల ఓ సుందరీ ! గౌరీ ! ఆ శ్మశానవాసిని భర్తగా పొందగోరి తపస్సు చేస్తున్నావా ? ఐతే నీ గతి అధోగతే. అంటూ (తన భార్యతో) సరసాలాడుతుంటే తాను మరలా *శివనింద* వినవలసి వచ్చిందే అని పార్వతి అక్కడినుండి పారిపోయేందుకు సిద్ధమైన సందర్భం.
సతియె జనించి పార్వతిగ , శంకరు భర్తగ గోరి , తండ్రి స
మ్మతి దప మాచరింప ; తన మానిని జేరుచు బ్రహ్మచారిగా
‘’ నతివ ! శ్మశాన వాసిని, మహా శివు గోరిన యుత్పలాక్షి ! సం
స్తుతమతి ! గౌరి ! నీ గతి యధోగతి సుందరి ! ‘’ యంచు నా జగత్
*పతి సరసమ్ము లాడ సతి పర్వులు బెట్టె నదేమి చిత్రమో ?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (20-2-2018)
అవధాని రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పతియైన సిగ్గుచేతను
రిప్లయితొలగించండిపతిసరసము లాడగసతి పరువులువెట్టెన్
మితిమీరిన సరసములను
సతులెవ్వరు నొప్పుకొనరు సత్కవి వర్యా!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ్రతుకు తెరవు కొఱకై యొక
రిప్లయితొలగించండియతివ పొలము పనికి రాగ నంధుడయి వివా
హితయని తలపకనా భూ
"పతి సరసము లాడగ సతి పరువులు వెట్టెన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిభూస్వామిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపతి వర! వినుమయ! కాదిది
జతగని సయ్యాడగాను సమయము విడటం
చు తరుణియు తూగ, గాంచుచు
పతి సరసము లాడగ సతి పరువులువెట్టెన్ !
జిలేబి
చాలా రోజుల వియోగము తర్వాత భార్యను చూడడానికి అత్తారింటికి వచ్చి, అతురతతో పిలువంగ పతి, సరసము లాడగ సతి పరువులువెట్టెన్! అన్న అర్ధం వచ్చేట్లు వ్రాయవచ్చునా?
తొలగించండి
తొలగించండి"వు" అప్పుతచ్చాండి ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరుగు, పరువు రెండూ సరియైనవే.
*****
భవానీ ప్రసాద్ గారూ,
'నిరంకుశాః కవయః' అన్నారు కదా! వ్రాయవచ్చు.
రిప్లయితొలగించండిచంపకమాల
క్రతువును జేయనెంచి కబురైనను పంపడు మీదు తండ్రి నా
స్థితిగతు లెంచెనో? బిలువ చెల్లనొ? మీసరి తూగనంచు నా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
పిత కడకేగి నిందవిని వేదన జెందుచు దూకె నగ్నిలో !
కందం
రిప్లయితొలగించండిఅతి కామమ్మున విడ వి
జ్ఞత సేవకురాలితోడ సాగించంగన్
గత చిత్రీకరణమ్మున
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పతి, కాంచుచునుండ నిశా
రిప్లయితొలగించండిపతి, సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
మతిలో సిగ్గు కదురుకొన
జతగూడగ కావలయును సరియిక్కనుచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతి కుతుకం బలరారగ
రిప్లయితొలగించండిమతి దలపకయె తొలిరేయి మగువ మనమ్మున్
మితి మీరిన చేష్టలతో
"పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతి యిత డౌను నాకు మరి భార్యను నేనని చెప్పె నామె యీ
రిప్లయితొలగించండియతివయె నాకు పత్ని యగు నౌదును నేను సఖుండ నామె కం
చతడు వచించె జేరి రిట నద్దెకు రాతిరివేళ నర్చుచున్
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంకా బెంగుళూరులోనే ఉన్నారా? రాజమండ్రి చేరుకున్నారా?
వచ్చేశాం గురువుగారూ.
తొలగించండివ్రతగతదీక్షలందు ధృతపావనవస్త్రను పాఠ్యమానసం
రిప్లయితొలగించండిస్తుతిగతపారవశ్యపరిశుద్ధికృదంతరసక్తచిత్తసం
గతశమితేషణం గని బ్రకామవివర్ధితకామమోహియై
పతి సరసమ్ములాడ, సతి పర్వులుఁ వెట్టె నదేమి చత్రమో!.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
అతివలు పూరుషోత్తములు త్యాగులు యోగులు పాపులెల్లరిన్
రిప్లయితొలగించండిచతురత తోడ నేతలగు చంద్రుల జేయుచు డప్పిజెందుచున్
స్తుతమతి నాల్గు నాల్కలను సూక్తులు ఋక్కులవల్కు శారదా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
డప్పిజెందు = కృశించు
తొలగించండి"22. శారదాపతి శతకం రచించిందెవరు?
జ. జొన్నలగడ్డ శారదాంబ.
23. త్రిమూర్తులలో బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకం?
జ. శారదాపతి శతకం."
http://teluguforbes.com/telugu/grammar-vyakaranam-bits-sathakam/
సార్!
తొలగించండిగత మూడు వారాలుగా పాతవీ క్రొత్తవీ రోజుకు కనీసం మూడు వృత్త పూరణలు చేసి పోస్టు చేయుచున్నాను. మీరేమో
"మొక్క మ్రానైనది" అన్నారు...
"తిక్క తిరిగి ముల్లు మేకైనది" అనండి :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొక్క మ్రానైనది. అంతేకాదు.... దానికి ఉత్పల చంపకాలు పూస్తున్నవి. శార్దూల మత్తేభాలు ఆ మ్రాను క్రింద స్వేచ్ఛావిహారం చేస్తున్నవి. సంతోషం!
🙏🙏🙏
తొలగించండిసతతము నీరసం బనుచు సత్తువ లేకను తూలుచుండు నే
రిప్లయితొలగించండిగతి తగు మందు నిచ్చెదరొ కావు డటంచును భార్య పల్కగా
పతి కిడె వెజ్జు దివ్య మగు భౌషజ మయ్యది వంటబట్టి యా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
అతిలోక సుందరి గనిన
రిప్లయితొలగించండిజిత కాముడు సితగళుండు చిత్రము
నామెన్
జతగూడనెంచి గిరిజా
పతి సరసములాడగ సతి పరువులు పెట్టెన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుడు అసితగళుడు కదా! "జితకాము డసితగళుండు..." అనండి.
సతి నగుమోము నరసి మో
రిప్లయితొలగించండిహితుఁడయి పతి దేవుఁ డట నిజేప్సిత కాంతన్
సుతుఁ దాఁ జూడక మోటుగఁ
బతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
మతి చలియింప కుండునె యుమాపతి కైనను విష్ణుమూర్తి యే
యతివగ మారి దర్శనము నద్భుత సుందర రీతి నీయ నా
యతులిత మైన రూపవతి నచ్చట మోహినిఁ గాంచి యంబి కా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిసతియనునామె యెప్పుడును సాధ్వియ యైనను నేలకోమరిన్
రిప్లయితొలగించండిపతిసరసమ్ములాడ సతి పర్వులువెట్టె నదేమీ చిత్రమో
మితముగ గాక గట్టిగ మమేకముగాగను జేయనాపనిన్
సతులగు వారలెవ్వరునుసత్కవి వర్యుడ! యొప్పరెచ్చటన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మరిన్' అన్న ప్రయోగాన్ని మానండి. "...యైనను హేతు వేమియో" అనండి.
వ్రతమాచరించుచుండగ
రిప్లయితొలగించండినతి నిష్ఠగ ధర్మ పత్ని యద్దినమందున్
బ్రతిమాలుచు దరిచేరిన
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు.
ఆరు రోజులు నిరంతర ప్రయాణాలు చేసి ఈ ఉదయం నెలవు చేరాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసాను కదా.. నిద్ర లేమి.. అలసట... ఒంటి నొప్పులు...
రేపటి నుండి చురుకుగా పాల్గొంటాను.
ఈరోజు కూడా నన్ను మన్నించి సెలవివ్వండి.
తొలగించండిగ్రాంటడ్ :)
ಜಿಲೇಬಿ
లతకూన! ద్రోవదిని గని
రిప్లయితొలగించండిమతితప్పిన వానివోలె మచ్చిక తోడన్
మితిమీరుచు కీచక భూ
పతి సరసము లాడగ సతి పరువులు బెట్టెన్!!!
లతకూన= ఇంతి, మచ్చిక =మోహము
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతులితమౌ యుపాయముననాసురులన్నడగించి తోరమౌ
రిప్లయితొలగించండిచతురత తోడ మోహినిగ సాగుచు శంభుని కూడనెంచి శ్రీ
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో
సుతుడొకడుద్భవించు నను సూచన మానసమందు రేగెనా?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతులిత మగు ప్రేమ పొంగి నంత భరింప లేక , కడు
రిప్లయితొలగించండిచతురతన్ బంధించి మృదు నిషంగధి యందు , చుంబించి ,
పతి సరసము లాడగ >> సతి పరువులు వెట్టె సిగ్గున , త
న తనయ యా దృశ్య మరసిన దను విషయము నెరింగి !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ మధ్యాక్కరా పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికం:మితి వలయు దేని కైనను
నతి యెప్పుడు కూడదంచునవనీ స్థలిలో
హితులాడు పలుకులు వినక
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:పతి రూపముతో నట సుర
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
హితమిది కాబోదనుచును
నతివయహల్యయు పలికెను మదిలో.
కం:పతినిల దానమొసంగగ
సతి తా తలచుచు నను మతి చక్కగా కోలన్
హితముగ వారించుచు శ్రీ
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:పతితో పలికెను తానిటు
వ్రతమొనరించు తరుణమిది ప్రాణేశ్వరుడా
సతతము కూడదన వినక
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:ప్రతిపనికి సమయముండును
నతిచేయుట కూడదెపుడు ధ్వనిని వినుమా
హితమిది కాదని కసురుచు
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:అతిగా త్రాగుచు,తిరుగుచు
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
హితుడా సరిగాదనుచును
వెతనిండిన మనము తోడ బిరబిర సాగెన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం.
మూడవ పూరణలో 'చక్కగా కోలన్'...? అక్కడ గణదోషం కూడా!
ఐదవ పూరణ రెండవ పాదంలో గణదోషం.
సవరించండి.
కందం
రిప్లయితొలగించండిజతలేవని నిద్దుర నా
కతి దూరమ్మయ్యె! నీదు నక్కున జేరం
గ తపనలని చరవాణిన్
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
పతి కౌగిట బంధీ కావడానికి పరువులు వెట్టెన్
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుత పెరిగి పెద్దదయ్యెను,
రిప్లయితొలగించండిసుతయు,సుతుడు,మన లనిచట జూచుచు నుండెన్
మతిపో యెనుమీకుయనుచు
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జూచుచు నుండన్... మీ కనుచును" అనండి.
శ్రీ గురుభ్యోనమః.
రిప్లయితొలగించండిగురువు గారు బండి దిగగానే డ్యూటీ ఎక్కేశారట్లుంది.
నమోనమః.
రెండవ పద్యంలో తప్పు దిద్దుకున్నాను.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు అన్నయ్యగారూ
రిప్లయితొలగించండిసవరణలతో
కం:మితి వలయు దేని కైనను
నతి యెప్పుడు కూడదంచునవనీ స్థలిలో
హితులాడు పలుకులు వినక
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:పతి రూపముతో నట సుర
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్
హితమిది కాబోదనుచును
నతివయహల్యయు పలికెను నమరాధిపుతో.
కం:పతినిల దానమొసంగగ
సతి తా తలచుచు ననుమతి చక్కగ కోరన్
హితముగ వారించుచు శ్రీ
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:పతితో పలికెను తానిటు
వ్రతమొనరించు తరుణమిది ప్రాణేశ్వరుడా
సతతము కూడదన వినక
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:ప్రతిపనికి సమయముండును
నతిచేయుట కూడదెపుడు నవనిని వినుమా
హితమిది కాదని కసురుచు
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్.
కం:అతిగా త్రాగుచు,తిరుగుచు
పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
హితుడా సరిగాదనుచును
వెతనిండిన మనము తోడ బిరబిర సాగెన్.
.20-2-18
రిప్లయితొలగించండి.......సమస్య
పతి సరసము లాడగ సతి పరువులు వెట్టెన్
సందర్భము... శ్రీ కృష్ణునే ప్రాణపతిగా భావించి నిరంతరం కృష్ణ ధ్యానంలో మునిగిపోయి దివ్యానందా న్ననుభవించే భక్తురాలు *మీరాబాయి.* ఆమె భర్తమాత్రం అశాశ్వతమైన దేహంపట్ల మోహం వదలని సామాన్యుడు.
అతడు సరసా లాడితే ఆమె పరుగులు పెట్ట కేం చేస్తుంది మరి!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సతతము మాధవ చింతన
మితి మీరిన భక్తురాలు, *మీర* యనెడు నా
సతి; దేహ చింతనము గల
పతి సరసము లాడగ సతి పరువులు వెట్టెన్
...........సమస్య
పతి సరసము లాడగ సతి పరువులు వెట్టెన్
సందర్భము... మహా భారతంలోని పాండురాజు కథ జగద్విదితం. కుంతి, మాద్రి అతని భార్యలు. భార్య వద్దకు వెళితే మరణిస్తా వన్న ఋషి శాపం అతని కున్నది.
అత డొకనాడు నిగ్రహాన్ని కోల్పోయి మాద్రితో సంగమించి కన్ను మూస్తాడు. ఆ సందర్భ మిది.
సరసాలాడుతుండగా డామె భయపడి పరుగులు తీసింది. భర్త ఆయుస్సు తన మాంగల్యం భౌతిక సుఖాలకన్న మిన్న కదా!
~~~~~~~~~~~~~
సతి గూడినంత తన పతి
మృతి జెందునె.. యనుచు మాద్రి
మిడుకుచునుండన్
పతి యైన పాండు ధరణీ
పతి సరసము లాడగ సతి
పరువులు వెట్టెన్
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
------------------
కితకిత నవ్వులాడుచును గిన్నెలు తోముచు కండ్లు త్రిప్పుచున్
రిప్లయితొలగించండిజుతు విరబోసి చిమ్ముచును చూపులు కల్పుచు మాటలాడుచున్
చతికిలపడ్చు కూరలను చక్చక కోసెడి దాసికత్తెతో
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో